టయోటా లాండ్-క్రూజర్-ప్రాడో

` 88.8 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టయోటా లాండ్-క్రూజర్-ప్రాడో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


కారు మార్కెట్ లో ఈ సంస్థ విస్మయ-స్పూర్తినిస్తూ ఉన్న వాహనాలు చాలా ఉన్నాయి. వాటిలో టయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో మోడల్ సిరీస్ ప్రస్ఫుటమైన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంగా చెప్పవచ్చు. ఇది సంస్థ కోసం చాలా బాగా చేయడం మాత్రమే కాకుండామరియు వైవిధ్యభరితంగా సౌకర్యవంతమైన మరియు భద్రత అంశాలతో లభిస్తుంది. ప్రస్తుతం కంపెనీ ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంను ఒక వేరియంట్ లో మాత్రమే అందిస్తోంది. ఇది ఒక కమాండింగ్ 3.0 లీటర్ డి-4డి డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది 2982cc స్థానభ్రంశ సామర్థ్యంతో టర్బోచార్జర్ ఇంటర్ కూలర్ తో వస్తుంది. ఈ పవర్ ప్లాంట్ నైపుణ్యంగా ఒక సమర్థవంతమైన 5- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది టార్క్ అవుట్ పుట్ ను దాని 4 వీల్స్ కి సరఫరా చేస్తుంది.ఈ మిల్లు 3400rpm వద్ద గరిష్టంగా 170.6bhpశక్తిని మరియు 1600-2800rpm వద్ద 410Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చాలా యుక్తకరంగా ఉంటుంది. ఇది ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ ఆధారిత ఇంధన సరఫరా విధానంతో అనుసంధానం చేయబడి ఉంది. రోడ్ పై మరింత పటుత్వాన్ని ఇవ్వడం కోసం యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు అత్యవసర బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ లతో ఈ వాహనాలు జత చేయబడి ఉంటాయి. వీటిని కలిగి ఉండటం వలన బ్రేకింగ్ సామర్ధ్యాలు మెరుగుపడతాయి. మరోవైపు, ఈ వాహనం అత్యంత అద్భుతమైన సస్పెన్షన్ వ్యవస్థ ను కూడా కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన ఇంజిన్ మరియు మంచి ప్రదర్శన మాత్రమే కాకుండా, దీని లోపల విలాసవంతమైన ఫీచర్లను మరియు ఆకర్షణీయమైన బాహ్య రూపాన్ని కలిగి ఉంది. దీని ముందు భాగం ఒక ఆకర్షణీయమైన రేడియేటర్ గ్రిల్ తో, బాడీ కలర్ బంపర్ తో, ఫాగ్ ల్యాంప్స్ మరియు ప్రత్యేకంగా రూపొందించిన హెడ్ లైట్లతో మరియు ఆటోమేటిక్ లైట్ కంట్రోల్ సెన్సార్లతో రూపొందించబడింది. ఇది కూడా ఒక మంచి లుక్ ను అందిచే ఎల్ ఈ డి డే లైట్ రన్నింగ్ హెడ్ లైట్లను కలిగి ఉంది. ఇంజిన్ ను చల్లబరచడానికి మరియు శక్తివంతం చేయడానికి దీనిలో విస్తృతమైన ఎయిర్ ఇంటేక్ విభాగం ఉంది. ఇది విద్యుత్ తో సర్దుబాటు చేసుకోగల అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, ఆకర్షణీయమైన రూఫ్ రెయిల్స్, ఒక జత అల్లాయ్ వీల్స్, సైడ్ స్టెప్స్ మరియు అనేక ఇతర అంశాల సమూహాన్ని కలిగి ఉంది. మరోవైపు, సంస్థ దీనిలో ఒక విశాలమైన అంతర్గత క్యాబిన్ ను అందించింది. ఇది అనేక అధునాతన లక్షణాలతో అందించబడుతుంది. ఇది నాలుగు సరౌండ్ కెమెరాలతో ఒక బహుళ టెరైన్ మానిటర్ తో అందజేయబడి ఉంది. ఈ వాహనం నాలుగు సరౌండ్ కెమెరా తో ఉన్న మల్టీ టెరైన్ మానిటర్ తో అందించబడుతుంది. ఈ మానిటర్ సైడ్ మిర్రర్స్ కి టైర్ల చుట్టూ ప్రాంతాన్ని చూసేందుకు అమర్చబడి ఉంటుంది. ఇది బహుళ టెరైన్ సెలెక్ట్ వ్యవస్థను కలిగి ఉంది. క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, సమర్థవంతమైన ఎయిర్ కండీషనింగ్ యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక ఏ.సి వెంట్స్ మరియు ఒక ప్రతిస్పందించే పవర్ స్టీరింగ్ వ్యవస్థ వంటి ఇతర అంశాలను కూడా కలిగి ఉంది. ఈ యుటిలిటీ వాహనం దాని విభాగంలో ఆడి క్యూ7, పోర్స్చే కయేన్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ క్లాస్ లతో పోటీ పడనుంది. సంస్థ దీనిని మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ( ఏది ముందు వస్తే అది) వారంటీతో అందిస్తుంది. వినియోగదారులు ఈ వారంటీ కాలాన్ని అధికార డీలర్ల వద్ద అదనపు ధరతో పొడిగించుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఇది ఒక టర్బోచార్జెడ్ డీజిల్ పవర్ ప్లాంట్ తో అందించబడుతుంది. ఇది ఒక కామన్ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థతో జతచేయబడి ఉంది. ఇది ఒక ఆరోగ్యకరమైన ఇంధన వ్యవస్థను అందించటానికి అనుమతిస్తుంది . ఇది రహదారులపై 11 kmpl మైలేజ్ ని అందించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అయితే, నగర రోడ్లపై భారీ ట్రాఫిక్ పరిస్థితుల కారణంగా 7 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ శక్తివంతమైన 3.0 లీటర్ డీజిల్ మోటార్ భారత రోడ్ల పరిస్థితుల కోసం 3400rpm వద్ద 170.3bhp గరిష్ట శక్తిని మరియు 1600-2800rpm మధ్య 410Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఒక 5- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సహాయంతో, ఇది 150 నుండి 155 కిలోమీటర్ల పరిధిలో ఒక గరిష్ట వేగంని చేరుకోగలుగుతుంది. అదే సమయంలో, ఇది 0 నుండి 100 kmph వేగాన్ని అవరోధించడానికి దాదాపు 13 సెకన్ల సమయం పడుతుంది.

వెలుపలి డిజైన్:


కంపెనీ ఈ దృఢమైన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనానికి అత్యంత ఆకర్షణీయమైన లుక్ ను మరియు అసంఖ్యాక స్టైలింగ్ అంశాలను అందించింది. మొట్ట మొదట దీని యొక్క ముందు భాగం విషయానికొస్తే, దీనిని నిటారుగా ఉండే క్రోమ్ పూతతో ఉన్న స్లేట్స్ తో ఒక పెద్ద రంధ్రము గల రేడియేటర్ గ్రిల్ తో బిగించి రూపొందించారు. దీనికి మధ్య భాగంలో కంపెనీ యొక్క చిహ్నం చిత్రించబడి ఉంటుంది. ఇది ఒక మంచి లుక్ ను ఇస్తుంది. ఈ గ్రిల్ చుట్టూ ఒక పెద్ద హెడ్ లైట్ క్లస్టర్ ఉంటుంది. ఇది స్వెప్ట్ గ్రిల్ బ్యాక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది అధిక తీవ్రత ఉత్సర్గం (హై ఇంటెన్సిటీ డిస్చార్జ్) ఆధారిత ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ను మరియు సైడ్ టర్న్ ఇండికేటర్లతో విలీనం చేయబడి ఉంటుంది. ఇది కూడా ఒక మంచి లుక్ ను అందిచే ఎల్ ఈ డి డే లైట్ రన్నింగ్ హెడ్ లైట్లను కలిగి ఉంది. దీనిలో బాడీ కలర్ బంపర్ క్లాడింగ్ తో జత చేయబడి ఉంటుంది. ఇది చిన్న చిన్న ప్రమాదాల నుండి రక్షిస్తుంది. ఇంజిన్ ను చల్లబరచడానికి మరియు శక్తివంతం చేయడానికి దీనిలో విస్తృతమైన ఎయిర్ ఇంటేక్ విభాగం ఉంది. దీనిలో విండ్ స్క్రీన్ చాలా పెద్దదిగా మరియు ముందు ఒక మంచి ప్రత్యక్షతను అందిస్తుంది. దీనిని ఒక కఠినమైన ల్యామినేటెడ్ గ్లాస్ తో తయారు చేశారు మరియు లాగే దీనిని ఒక జత అంతరాయక వైపర్స్ తో అమర్చారు. దీని సైడ్ ప్రొఫైల్ విషయానికొచ్చినట్లయితే, ప్రయాణికులు సులభంగా ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి దీనిలో అల్యూమినియం ఫినిష్డ్ సైడ్ స్టెప్స్ ను అమర్చారు. ఇది బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ తో సైడ్ ప్రొఫైల్ ఒక సొగసైన ప్రదర్శనను ఇస్తుంది. దీని యొక్క అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ ఎలక్ట్రికల్లి ఫోల్డబిల్ మరియు భద్రత సూచీని చేకూర్చే విధంగా ఎల్ ఈ డిసైడ్ టర్న్ ఇండికేటర్లతో బిగించబడి ఉంటాయి. ఇది బాగా రూపకల్పన చేసిన వీల్ అర్చులను కలిగి ఉంది. ఇవి ఒక సొగసైన అల్లాయ్ వీల్స్ సెట్ తో బిగించబడి ఉంటాయి. వీటి వలన వాహనం ఒక స్పోర్టీ లుక్ తో కనిపిస్తుంది. ఇవి అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఇవి రోడ్ల పై మంచి పట్టును కలిగి ఉంటాయి. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికొచ్చినట్లయితే, ఇది వైప్ మరియు వాషర్ ఫంక్షన్ తో పాటుగా డీఫాగర్ ను కలిగి ఉన్న ఒక పెద్ద వెనుక విండ్ స్క్రీన్ ను కలిగి ఉంది. ఇది ఒక స్పోర్టి రేర్ స్పాయిలర్ తో కలిసి ఉంటుంది. ఇది ఒక ఎల్ఈడి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ తో బిగించబడి ఉంటుంది. దీని బాడీ కలర్ బంపర్, ప్రొటెక్టివ్ క్లాడింగ్ మరియు ఒక జత ప్రకాశవంతమైన రిఫ్లెక్టర్లతో కలిసి ఉంటుంది. విలక్షణముగా ఏర్పరిచిన టెయిల్ లైట్ క్లస్టర్ రివర్స్ లైట్లతో మరియు టర్న్ ఇండికేటర్లతో అనుసంధానించబడి ఉంది. ఇది ఒక పెద్ద బూట్ లిడ్ తో ఉంది. ఇది ఒక మందపాటి క్రోమ్ స్ట్రిప్ తో మరియు వేరియంట్ బ్యాడ్జింగ్ తో బిగించబడి ఉంటుంది. వీటితో పాటుగా, చక్కదనం జోడించే విధంగా ఒక జత రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.

వెలుపలి కొలతలు:


ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం సులభంగా ఏడుగురు ప్రయాణికులు సర్దుకుపోయే విధంగా చాలా విశాలమైన ప్రామాణిక కొలతలతో రూపొందించబడింది. దీని మొత్తం పొడవు 4760mm మరియు బాహ్య వెనుక వీక్షణ అద్దాలతో కలిపి యొక్క మొత్తం వెడల్పు 1885mm ఉంటుంది. ఇది 1880mm మొత్తం ఎత్తుతో ప్రయాణికులందరికి మంచి హెడ్ స్పేస్ ను అందిస్తుంది. ఇంకా ఇది ఒక పెద్ద వీల్ బేస్ 2790mm ను కలిగి ఉండి. ఇది ఆఫ్-రోడింగ్ సామర్థ్యంను కలిగి 220mm కనీస గ్రౌండ్ క్లియరెన్స్ తో అందించబడుతుంది. దీని స్టీరింగ్ వీల్ 5.8 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్దతునిస్తుంది. ఈ క్లాస్ వాహనానికి ఇది చాలా యోగ్యకరంగా ఉంటుంది.

లోపలి డిజైన్:


ఇది విలక్షణముగా రూపకల్పన చేసిన అంతర్గత విభాగంను కలిగి ఉంది. ఇది నిస్సందేహంగా బలమైన స్పోర్ట్స్ యుటిలిటీ ముఖ్య వాహనాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది భారీ క్యాబిన్ స్పేస్ ను కలిగి ఉంది. ఇది కారు ఔత్సాహికులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇది ఒక డ్యుయల్ టోన్ కలర్ స్కీమ్ తో రూపొందించబడింది. ఇది దాని ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. ఇది ఏడుగురు ప్రయాణికులకు సులభంగా వసతిని అందించగలుగుతుంది. వీటితో పాటుగా తగినంత హెడ్ స్పేస్ మరియు షోల్డర్ స్పేస్ ను అందిస్తుంది. సీటింగ్ పరంగా చూస్తే, ఇవి విస్తృతంగా మరియు సాంకేతిక విఙ్ఞానంతో తయారు చేసినటువంటి సీట్లు కావడంతో ఇవి ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందించే విధంగా ఉంటాయి. ఈ విశ్రాంతమైన సీట్లు మంచి నాణ్యత నిజమైన లెదర్ అపాలస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. ఇవి వినియోగదారుల ఎంపిక మేరకు నలుపు మరియు ఫ్లాక్సెన్ రంగు లో అందించబడుతున్నాయి. డ్రైవర్ సీటు ఎనిమిది రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు మరియు ఇది మెమరీ ఫంక్షన్ ను కూడా కలిగి ఉంది. అయితే, సహ-ప్రయాణీకుల సీట్ కూడా అవసరాన్ని బట్టి నాలుగు విధాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు. రెండో వరుసలో ముందు మరియు వెనక సీట్లలో హీటర్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇది మరింత సౌలభ్య స్థాయిని విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, దీని మూడవ వరుస సీట్లు 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్ల సౌకర్యంతో రానుంది. ఇది ఫోల్డ్ చేయడం వలన ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. సంస్థ, దీని యొక్క గేర్ షిఫ్ట్ నాబ్ చుట్టూ ప్రీమియం లెదర్ తో కప్పివేసింది. తద్వారా, క్యాబిన్ కి ఒక ఖరీదైన అప్పీల్ అందించబడింది. తయారీదారుడు దీని అంతర్గత క్యాబిన్ ను వివిధ వినియోగ ఆధారిత మరియు ఆధునిక ఫీచర్లతో విలీనం చేశాడు. ఇవి ఈ వాహనాన్ని దాని క్లాస్ లో లేని విధంగా లగ్జరీ లుక్ ను అందిస్తుంది. దీనిలో చల్లదనాన్ని ఇచ్చే ఒక పెద్ద గ్లవ్ బాక్స్ కంపార్ట్మెంట్ ఉంది. దీనిలో చిన్న చిన్న వస్తువులను పెట్టుకోవచ్చు. రెండవ వరుస సీట్లలో కప్ హోల్డర్లతో పాటు సెంటర్ ఆర్మెస్ట్ కూడా ఉన్నాయి. రెండవ మరియు మూడవ వరుస సీట్లలో 12వోల్ట్స్ పవర్ అవుట్లెట్లు ఉన్నాయి. ఇవి ప్రయాణ సమయాలలో మొబైల్ ఫోన్లను మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకోవడంలో సహాయపడతాయి.దీనిలో ఫ్రంట్ ఎక్స్టెండర్ సన్ విజర్స్ తో పాటుగా ఇల్యూమినేటెడ్ వానిటీ మిర్రర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు, ఇందులో ఒక సిగరెట్ లైటర్, పోర్టబుల్ యాష్ట్రే, ఓవర్ హెడ్ స్టోరేజ్ కన్సోల్, అసిస్ట్ గ్రిప్స్, ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ను మరియు ఇంకా కొన్ని ఇతర అంశాలను జత చేశారు. ఇది ఒక స్టైలిష్ ఆప్టిట్రాన్ కోంబి మీటర్ ను కలిగి ఉంది. ఇది ప్రకాశాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. దీని సెంట్రల్ కన్సోల్ చాలా చక్కగా సిల్వర్ తో అలంకరించబడి ఉంటుంది. ఇది ఒక అంతర్గత భాగాలతో సరిపోలడం మాత్రమే కాకుండా మంచి ఆకర్షణీయమైన లుక్ ని అందిస్తుంది. ఇంకా ఇతర అంశాలయినటువంటి ఇగ్నీషన్ కోసం ఒక ప్రకాశవంతమైన కీ హోల్, ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ మరియు స్టెయిన్ లెస్ స్టీల్ డోర్ సిల్ ప్లేట్ల వంటి అంశాలతో ఈ ఎస్యూవి పొందుపరచబడి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం కోసం, తయారీదారుడు ఈ యుటిలిటీ వాహనంలో అనేక అధునాతన లక్షణాలను అందించాడు. ఇది ఒక ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటుగా లోపల ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి ఒక త్రీ జోన్ స్వతంత్ర నియంత్రణ ఫంక్షన్లను కలిగి ఉంది. ఇది రెండవ మరియు మూడవ వరుసలలో ఉష్ణోగ్రత నియంత్రణ మరియు ఎయిర్ వెంట్స్ ను కలిగి ఉంది. ఇది ఒక 7-అంగుళాల టచ్ స్క్రీన్ తో ఒక ఆధునిక ఆడియో యూనిట్ ను కలిగి ఉంది. ఇది దాని ప్రయాణికులకు ప్రయాణం లో మార్గ మధ్యలో చాలా వినోదాన్ని అందిస్తుంది. అలాగే ఇది బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఇతర ఇన్పుట్ ఎంపికలకు మద్దతునిస్తుంది. క్రూజ్ నియంత్రణ, కాల్ అలాగే ఆడియో కంట్రోల్స్ దాని బహుళ స్టీరింగ్ వీల్ కి అమర్చబడి ఉంటాయి. ఇది డ్రైవర్ కి చాలా సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. డ్రైవర్ సీట్ సర్దుబాటు సౌకర్యం ఒక ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు మరియు అది డ్రైవర్ కి ఒక సౌకర్యవంతమైన సీటింగ్ స్థానంను ఎంచుకోవడంలో సహయపడుతుంది. దీని యొక్క మూడవ వరుసలో పవర్ ఫోల్దబిల్ఎంపిక ఉంది. ఇది ఒక బటన్ ను ప్రెస్ చేయగానే స్వయంచాలకంగా ఫోల్డ్ అవుతుంది. రిమోట్ కీలెస్ ఎంట్రీ సహాయంతో, ప్రయాణీకులు లాకింగ్ లేకుండా లేదా మ్యానువల్ అన్ లాకింగ్ తో ఎంటర్ అవచ్చు లేదా నిష్క్రమించవచ్చు. ఇది నాలుగు పవర్ విండోస్ ను కలిగి ఉంది. ఇవి ఆటోమేటిక్ గా పైకి క్రిందకి జరుగుతాయి. ఈ సౌకర్యం డ్రైవర్ సైడ్ సీట్లో కూడా అందుబాటులో ఉంది. దీనిలో వాషర్స్ తో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు స్వయంచాలక హెడ్ ల్యాంప్స్ దీనికి మరింత సౌలభ్యాన్ని జతచేస్తున్నాయి. దీని యొక్క స్పోర్టి స్టీరింగ్ వీల్, వేరియేబుల్ స్పీడ్ అసిస్ట్ తో పాటుగా టిల్ట్ మరియు టేలీస్కోపిక్ సర్దుబాటు ఫంక్షన్ ను కలిగి ఉంది. దీని అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ ఎలక్ట్రికల్లీ ఫోల్దబిల్ అలాగే సర్దుబాటు ఫంక్షన్ ను కలిగి ఉన్నాయి. ఇది ఒక అందమైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంది. ఇది ఇంధన వినియోగ ప్రదర్శన, స్పీడోమీటర్ మరియు కొన్ని ఇతర నోటిఫికేషన్లను ప్రదర్శిస్తుంది. ఈ అధ్యయనాలే కాక, అది ఒక బహుళ సమాచార ప్రదర్శన, రిమోట్ టెయిల్ గేట్ ఓపెనర్, ఇల్ల్యుమినేటెడ్ ఎంట్రీ సిస్టం, స్టార్ట్ / స్టాప్ బటన్ మరియు సౌలభ్య స్థాయిలను పెంచడానికి ఇంకా కొన్ని ఇతర అంశాలను దీనిలో జత చేశారు. ఈ లక్షణాలు అన్నీ కలిసి అది ఒక సౌకర్యవంతమైన మరియు ఆనందించే డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

లోపలి కొలతలు:


ఇది ఏడుగురు ప్రయాణికులు సులభంగా కూర్చునేలా ఒక ఉపశమనాన్ని కలిగించే డ్రైవింగ్ అనుభవాన్ని అందించే ఒక భారీ క్యాబిన్ ఉంది. దీనిలో పుష్కలమైన లెగ్ స్పేస్ తో పాటుగా హెడ్ స్పేస్ మరియు షోల్డర్ స్పేస్ అందించబడ్డాయి. దాని ప్రయాణీకులకు మరింత సుఖమైన ప్రయాణాన్ని అందించే విధంగా తగినంత ఎల్బో రూమ్ మరియు ముందు మరియు వెనుక మోకాలి రూమ్ లను కూడా అందించారు. ఈ వాహనం ఒక పెద్ద ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది. ఇది 87 లీటర్ల ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది దూర ప్రయాణాలు చేయడంలో సహాయపడుతుంది. ఇందులో 621 లీటర్ల లగేజ్ కంపార్ట్మెంట్ ఉంది. దీనిలో చాలా ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


బోనెట్ కింద, ఈ దృఢమైన వాహనం యూరో -4 ఉద్గార నిబంధనలను అనుకూలిస్తూ ఒక కమాండింగ్ 3.0 లీటర్ డి-4డి డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది 2982cc స్థానభ్రంశ సామర్థ్యంతో టర్బోచార్జర్ ఇంటర్ కూలర్ తో వస్తుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వులతో మరియు ఒక డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పని చేస్తుంది. ఈ పవర్ ప్లాంట్ నైపుణ్యంగా ఒక సమర్థవంతమైన 5- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది టార్క్ అవుట్ పుట్ ను దాని 4 వీల్స్ కి సరఫరా చేస్తుంది.ఈ మిల్లు 3400rpm వద్ద గరిష్టంగా 170.6bhpశక్తిని మరియు 1600-2800rpm వద్ద 410Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చాలా యుక్తకరంగా ఉంటుంది. ఇది ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ ఆధారిత ఇంధన సరఫరా విధానంతో అనుసంధానం చేయబడి ఉంది. ఇది చాలా మేలైన ఇంధన వ్యవస్థను అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


వాహనతయారీ దారుడు ఈ సిరీస్ ని కారు లోపల ఉన్న ప్రయాణికుల కోసం ఒక అధునాతన ఆడియో వ్యవస్థతో అందించాడు. ఇది ఒక సిక్స్ సిడి చేంజర్ తో ఎంపి3 ప్లేయర్ తో అమర్చబడి ఉంటుంది. అలాగే, ఎఫ్ ఎమ్ రేడియో ట్యూనర్ మరియు తొమ్మిది స్పీకర్లను కలిగి ఉంటుంది. వీటిని మంచి ధ్వని అనుభవం కోసం ముందు మరియు వెనుక భాగాలలో ఉంచుతారు. అలాగే ఇది, యుఎస్బి పోర్ట్, ఆక్స్-ఇన్, మొబైల్ ఫోన్ల ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ యునిట్ తో జత చేయడం వంటి ఇన్పుట్ ఎంపికలతో అందించబడుతుంది. ఆడియో, ఫోన్ మరియు క్రూజ్ నియంత్రణ బటన్లను, దాని యొక్క బహుళ పవర్ స్టీరింగ్ కి అమర్చబడి ఉంటాయి. వీటివలన వాహనం ను నడుపుతున్న సమయంలో డ్రైవర్ కి నిర్వహణ సులభతరం అవుతుంది. ఇంకా, కొనుగోలుదారులు దాని యొక్క రూపాన్ని అలాగే సౌకర్యం స్థాయిలను పెంచుకోవడానికి కొన్ని ఉపకరణాలను అనుకూలీకరించుకోవచ్చు. ఈ జాబితాలో స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు, ఫ్లోర్ మ్యాట్స్, లెదర్ సీట్లు, నావిగేషన్ సిస్టమ్ మరియు అనేక ఇతర అంశాలు ఉన్నాయి.

వీల్స్ పరిమాణం:


ఈ భారీ ఎస్యూవి యొక్క విలక్షణమైన వీల్ ఆర్చులను 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ సొగసైన సెట్ తో బిగించబడి ఉన్నాయి. వీటి వలన ఈ వాహనం ఒక నాగరీకమైన లుక్ ను సంతరించుకుంది. ఈ రిమ్స్ 265/60R18 పరిమాణంతో అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఇవి రోడ్ల పై మంచి పట్టును కలిగి ఉంటాయి. అంతేకాకుండా, దీనిలో ముఖ్యమైన టూల్స్ తో పాటు బూట్ కంపార్ట్మెంట్ లోపల పూర్తి పరిమాణం గల ఒక అదనపు వీల్ ను ఉంచారు. ఈ టూల్స్ టైర్ ను మార్చడంలో ఉపయోగపడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ మోడల్ సిరీస్ యొక్క బ్రేకింగ్ వ్యవస్థ చాలా నమ్మదగినది. ఈ వాహనం యొక్క ముందరి మరియు వెనుక వీల్ ఆర్చులు రెండూ కూడా ఒక జత రోబస్ట్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ లతో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క ముందు అలాగే వెనుక చక్రాలు ప్రతి పరిస్థితుల్లో డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. రోడ్ పై మరింత పటుత్వాన్ని ఇవ్వడం కోసం యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు అత్యవసర బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ లతో ఈ వాహనాలు జత చేయబడి ఉంటాయి. వీటిని కలిగి ఉండటం వలన బ్రేకింగ్ సామర్ధ్యాలు మెరుగుపడతాయి. మరోవైపు, ఈ వాహనం అత్యంత అద్భుతమైన సస్పెన్షన్ వ్యవస్థ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, అది ఏ రహదారి పరిస్థితులలో నైనా సమతుల్యంగా మరియు స్థిరంగా ఉంచడానికి ఒక సమర్థవంతమైన సస్పెన్షన్ సిస్టమ్ ను కలిగి ఉంది. దీనిలో భాగంగా ఈ వాహనం యొక్క ఫ్రంట్ ఆక్సిల్ డబుల్ విష్బోన్ టైప్ ఆఫ్ మెకానిజం తో జత చేయబడి ఉంటుంది. అదే వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, ఇది 4 లింక్ మరియు ఎయిర్ స్ప్రింగ్ తో బిగించబడి ఉంటుంది. ఈ వాహనం అడాప్టివ్ సస్పెన్షన్స్ లో మూడు మోడ్ లను కలిగి ఉంటుంది. అవి వరుసగా, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్స్. అంతేకాకుండా, ఈ వాహనం ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంది. ఇది టిల్ట్ మరియు టెలిస్కోపిక్ సర్దుబాటు సౌకర్యాలను కలిగి ఉంది. దీని వలన డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ స్టీరింగ్ వీల్ 5.8 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధానికి మద్దతునిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


తయారీదారుడు, దాని ప్రయాణికులకు మెరుగైన భద్రతను అందిచడం కోసం ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో అనేక భద్రతా అంశాలను విలీనం చేశాడు. ఈ వాహనం యొక్క దృఢమైన శరీర నిర్మాణం విషయానికి వస్తే, క్రంపుల్ జోన్స్ ను అలాగే సైడ్ ఇంపాక్ట్ రక్షణ బీమ్స్ ను కలిగి ఉంది. వీటిని కలిగి ఉండటం వలన, వాహనం దేనినైనా ఢీకొన్న సందర్భంలో ప్రభావాన్ని తగ్గించడం లో సహాయపడుతుంది. పిల్లల భద్రత ను మరింత పెంచడం కోసం ఈ వాహనం వెనుక డోర్లకు చైల్డ్ సేఫ్టీ లాక్స్ ను కలిగి ఉంది. ప్రమాద సందర్భంలో ప్రయాణికులను రక్షించుటకు మొత్తం ఏడు ఎయిర్బ్యాగ్స్ తో ఈ వాహనం అందుబాటులో ఉంది. ఈ ఏడు ఎయిర్ బాగ్స్ ఏమిటంటే, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ముందరి ప్రయాణికుల కోసం సైడ్ ఎయిర్ బాగ్స్, మూడు వరుసల కోసం కర్టైన్ ఎయిర్ బాగ్స్ మరియు వీటితో పాటు డ్రైవర్ నీ ఎయిర్బాగ్స్. అంతేకాకుండా, ఈ వాహనం లో అధునాతన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు బ్రేక్ అసిస్ట్ వంటి ఫంక్షన్ లు విలీనం చేయబడ్డాయి. అంతేకాకుండా, ఈ వాహనం విప్లాష్ ఇంజురీ లిసనింగ్ లక్షణాన్ని కూడా కలిగి ఉంది. ఈ ఫీచర్ ఉపయోగం ఏమిటంటే, వెనుక భాగంలో ప్రమాదం సంభవించినప్పుడు మెడకు అలాగే వెనుక భాగానికి ఎటువంటి గాయం తగలకుండా ఉండటం కోసం సహాయపడుతుంది. ఈ వాహనం లోనికి ఏదైనా అనధికార ప్రవేశం జరిగినప్పుడు ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఫంక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్స్ట్రుమెంట్ పానెల్ డ్రైవర్ కు డ్రైవర్ సీటు బెల్ట్ హెచ్చరిక, తక్కువ ఇంధన వినియోగం మరియు డోర్ అజార్ హెచ్చరిక మరియు అనేక ఇతర నోటిఫికేషన్ లను ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం లో ఉన్న అన్ని సీట్లకు సీట్ బెల్ట్ లను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం లోపలి భాగం లో డే అండ్ నైట్ రేర్ వ్యూ యాంటీ గ్లర్ మిర్రర్ పొందుపరచబడి ఉంటుంది. రేర్ కెమెరా అలాగే సెన్సార్లు తో కూడిన పార్కింగ్ సహాయ సిస్టమ్ డ్రైవర్ సురక్షితంగా కారు ను పార్క్ చేసేందుకు అనుమతిస్తుంది. మరో కీలక అంశం ఏమిటంటే, వాహనం మలుపు తిరుగుతున్నప్పుడు జారి పోకుండా నివారించడంలో సహాయపడుతుంది మరియు దాని స్థిరత్వాన్ని నిర్వహించడం లో వాహన స్థిరత్వ నియంత్రణ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఈ వాహనం టైర్ ప్రెస్సర్ మోనిటర్ ను కూడా కలిగి ఉంది. వీటన్నింటితో పాటు, ఈ వాహనం ఆటో స్పీడ్ లాక్, వెనుక డిఫాగర్, డౌన్ హిల్ అసిస్ట్, అన్ని పవర్ విండోస్ కు జామ్ ప్రొటక్షన్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మధ్య భాగంలో ఇమిడి ఉన్న ఇంధన ట్యాంక్ మరియు గరిష్ట రక్షణ ఇచ్చే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి ఫంక్షన్ లు ప్రయాణికులకు రక్షణ ను ఇవ్వడం లో సహాయపడతాయి.

అనుకూలాలు:


1. బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం చాలా సమర్థవంతమైనదిగా ఉన్నాయి.
2. అనేక భద్రతా లక్షణాలను వాహన ప్రయోజనం కోసం జతచేశారు.
3. అనేక అధికార సర్వీస్ స్టేషన్లు అందుబాటులో ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
4. ఆసక్తికరమైన బాహ్య అంశాలన్ని దాని మొత్తం లుక్ ను పెంచుతున్నాయి.
5. అనేక సౌకర్యవంతమైన లక్షణాలతో విశాలమైన అంతర్గత క్యాబిన్ అందించబడింది.

ప్రతికూలాలు:


1. ఇంధన సామర్ధ్యం అంత మెరుగుగా లేదు.
2. ఖరీదైన ధర ట్యాగ్ ఒక ప్రతికూలతగా చెప్పవచ్చు.
3. యాజమాన్య ప్రారంభ వ్యయం మరియు విడిభాగాల ఖర్చు చాలా ఎక్కువగా ఉంది.
4. జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ లేకపోవడం ఒక పెద్ద అసౌకర్యంగా ఉంది.
5. ఇప్పటికీ దాని అంతర్గత ఆకృతిని మెరుగుపరచవలసిన ఆస్కారం ఉంది.