టయోటా ఇతియోస్-క్రాస్

` 6.3 - 8.5 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టయోటా ఇతియోస్-క్రాస్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
టయోటా ఎతియోస్ క్రాస్ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం వారిచే అభివృద్ధి చేయబడిన ఒక కాంపాక్ట్ క్రాస్ఓవర్ మోడల్ . ఈ వాహనం చూడడానికి లివా వలె ఉన్నా కూడా ఇది కొంచెం స్పోర్టీ లుక్ ను కలిగి ఉంది. అలానే, ఇది దృఢమైన బాడీ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది నడ్జ్ గార్డు, సైడ్ స్కర్ట్స్, ఫెండర్లు, రూఫ్ రెయిల్స్, బంపర్ క్లాడింగ్స్, మరియు మోడల్ పేరు చిహ్నం వంటి అంశాలతో దీని బాహ్య సౌందర్యం రూపొందించబడింది. ఇంతేకాకుండా, హెడ్ లైట్ క్లస్టర్, రేడియేటర్ గ్రిల్ మరియు టెయిల్ ల్యాంప్స్ వంటి ఇతర సౌందర్యకరమైన అంశాలను కూడా దాని అనుబంధ హాచ్బాక్ నుండి తీసుకుని అమర్చారు. వాహన తయారీదారుడు ప్రస్తుతం ఈ మోడల్ సిరీస్ ను వినియోగదారులకు అనుకూలంగా ఎంపిక చేసుకునేలా రెండు పెట్రోల్ ఇంజను మరియు ఒక డీజిల్ ఇంజను ఎంపికలతో అందిస్తున్నాడు. ఈ సిరీస్ లో రెండు పెట్రోల్ ఇంజన్లు 1.2 లీటర్ మిల్లు మరియు 1.5 లీటర్ మిల్లు ఒక డిఓహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణపై ఆధారపడి 4-సిలిండర్లు మరియు 16-వాల్వ్స్ ను కలిగి ఉన్నాయి. మరోవైపు, దీని యొక్క డి-4డి డీజిల్ ఇంజన్ ఒక ఆధునిక కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ తో అనుసంధానించబడి ఉంటుంది. దీనిని ఒక 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ సిస్టమ్ తో అనుసంధానం చేశారు. ఇది టార్క్ అవుట్పుట్ ను ముందు వీల్స్ కి పంపుతుంది. మొత్తం క్యాబిన్ ఆకర్షణీయమైన పియానో నలుపు రంగు స్కీమ్ తో అలంకరించబడి ఉంటుంది. ఇది దాని ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. వాహన తయారీదారుడు సీట్లను మంచి నాణ్యత గల స్పోర్టి ఫాబ్రిక్ తో కప్పివేశారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది. ఈ రెండు వేరియంట్ల సిరీస్ లలో ఒక ప్రావీణ్యమైన 2-డిన్ సంగీత వ్యవస్థ తో రూపొందించారు. దీనిని రిమోట్ కంట్రోల్ ను ఉపయోగించి నిర్వహించవచ్చు. ఇవే కాకుండా ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్, యాక్సెసరీ పవర్ సాకెట్స్, రేర్ డీఫాగర్ మరియు పవర్ విండోస్ వంటి అధునాతన లక్షణాలతో అందించాడు. దీని అగ్రశ్రేణి వెర్షన్ ఆడియో మరియు ఫోన్ కంట్రోల్ స్విచ్లను కలిగి లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో అందజేయబడింది. అయితే,ఈ వాహనం యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటనగా దీని బాడీ యొక్క కఠినమైన బాహ్య రూపం, దీనిని ఈ విధంగా తయారు చేసిన తయారీ సంస్థ చాలా గొప్పదిగా చెప్పవచ్చు. ఆశ్చర్యకరంగా, ఈ వేరియంట్లోని అన్ని సిరీసులు ప్రామాణికత కలిగిన డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో జతచేయబడి ఉన్నాయి. మరోవైపు, వాహన తయారిదారుడు కూడా రక్షణా అంశాలకు ప్రాముఖ్యతనిచ్చి దీని అన్ని వేరియంట్లలో డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ను అందించాడు. ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను అందించారు. ఇంకా, ఇది కీలెస్ ఎంట్రీ మరియు ఒక ఇంజిన్ ఇమ్మొబిలైజర్ లను కలిగి ఉంది. ఈ వ్యవస్థ ఎలాంటి అనధికార ఎంట్రీ నుండి అయినా మరియు దొంగతనం నుండి అయినా కాపాడటంలో సహయపడుతుంది. వాహన తయారీదారుడు దీనిని కాంపాక్ట్ క్రాస్ఓవర్ విభాగంలో ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఇది ఫియాట్ అవెంచురా మరియు వోక్స్వ్యాగన్ క్రాస్ పోలో తో పొటీ పడనుంది. మరోవైపు, ఇది ) మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ( ఏది ముందు వస్తే అది) వారంటీతో వస్తుంది. వినియోగదారులు ఈ వారంటీ కాలాన్ని అదనపు ధరతో పెంచుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని యొక్క డి-4డి డీజిల్ ఇంజన్ ఒక ఆధునిక కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్ నగరంలోని రోడ్లపై గరిష్టంగా 23.59 kmpl మైలేజ్ ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది మరియు రహదారులపైన దాదాపుగా 18.04 kmpl మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, పెట్రోల్ ఇంజన్లు రెండు కూడా ఒక ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో కలిసి ఉంటాయి. దీని 1.2 లీటర్ పెట్రోల్ మిల్లు రహదారులపై గరిష్టంగా 17.71kmpl మైలేజ్ ను, మరియు నగర రోడ్లపై 13.29 kmpl మైలేజ్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, దీని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ట్రాఫిక్ అధికంగా ఉన్న పరిస్థితుల్లో సుమారుగా 12.04 kmpl కనీస మైలేజ్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యంను కలిగి ఉంది, కానీ ఇది ఎక్స్ ప్రెస్ వే లలో గరిష్టంగా 16.78 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ సిరీస్ లో రెండు పెట్రోల్ ఇంజన్లు ఒక డిఓహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారపడి 4-సిలిండర్లు మరియు 16-వాల్వ్స్ ను కలిగి ఉన్నాయి. దీని 1.2 లీటర్ మిల్లుతో గరిష్టంగా 78.9 bhp శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అలాగే దీనితో పాటుగా 104Nm పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. దీని యొక్క 1.5 లీటర్ ఇంజిన్ గరిష్టంగా 88.76 bhp శక్తిని, 132Nm టార్క్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు, దాని డీజిల్ ఇంజన్ సింగిల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లు మరియు 8 వాల్వ్స్ ను కలిగి ఉంది. ఈ మిల్లు 67.06 bhp శక్తిని మరియు 170Nm టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది, ఇది చాలా యోగ్యకరంగా ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


వాహన తయారీదారుడు దీనిలో ఒక అధునాతన ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో డీజిల్, పెట్రోల్ మోటార్లను జత చేసాడు. దీని 1.5 లీటర్ పెట్రోల్ మోటార్ వాహనం సుమారు 11 నుండి 12 సెకన్లలో 100 kmph వేగంతో దాని అవరోధంను చేరుకోగలుగుతుంది. అదే సమయంలో, ఈ వాహనం యొక్క గరిష్ట వేగం 150 kmph నుండి 160 kmph వరకు ఉంటుంది. 1.2 లీటర్ ఇంజిన్ కూడా చాలా ఉల్లాసంగా 100kmph గుర్తును 14సెకన్లలో చీల్చుకుని వెళ్లగలుగుతుంది. ఈ ఇంజన్ వాహనాన్ని దాదాపు 145 kmph నుండి 150 kmph వరకు అధిక వేగంతో తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మరోవైపు, దీని వేరియంట్ 1.4 లీటర్ ఇంజిన్ తో అనుసంధానం చేయబడి, వాహనాన్ని దాదాపు 160 -165 కిలోమీటర్ల అధిక వేగంను అధిగమించడంలో సహాయపడుతుంది.మరోవైపు, ఇది దగ్గరగా 0 -100 kmph మార్క్ ను 18 సెకన్లలో వేగవంతం చేసుకోగలుగుతుంది. ఇది చాలా యోగ్యకరంగా ఉంటుంది.

వెలుపలి డిజైన్:


ఇది ఆకర్షణీయమైన సౌందర్య సాధనాలతో ఒక దృఢమైన బాహ్య రూపాన్ని కలిగి ఉంది. అది ఒక బోల్డ్ గ్రిల్ కలిగి స్పోర్టి సైడ్ స్కర్ట్స్ మరియు ఇతర సొగసైన లక్షణాలతో ఉంది. దాని ముందు ముఖభాగం ఒక అందమైన రేడియేటర్ గ్రిల్ బిగించి ఉంటుంది. దీని నడ్జ్ గార్డు సిల్వర్ తో అలంకరించబడి ఉంటుంది. ఇంకా చూసినట్లయితే, ఇది హెడ్ లైట్ క్లస్టర్ ను కలిగి హాలోజన్ హెడ్ల్యాంప్స్ తో ఉన్నాయి. అయితే, ఫాగ్ ల్యాంప్ కన్సోల్ లో టర్న్ ఇండికేటర్లను ఉంచారు. ఇది ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. దీని నలుపు రంగులో ఉన్న ఫ్రంట్ బంపర్ ఒక జత ఫాగ్ ల్యాంప్స్ తో పాటుగా విస్తృతమైన ఎయిర్ ఇంటేక్ విభాగంను కలిగి ఉంది. ఇది ముందు భాగానికి మిక్కిలి ప్రకాశాన్ని అందజేస్తుంది. ఈ క్రాస్ఓవర్ యొక్క మొత్తం లుక్ రేడియేటర్ గ్రిల్ మీద పొందుపరిచిన కంపెనీ చిహ్నం ద్వారా వచ్చింది. దీని సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఒక స్పోర్టీ అప్పీల్ తో అద్భుతమైన బాడీ నిర్మాణంతో ఉంది. దీనిలో ఆసక్తికరం అంశం ఏమిటనగా, ఈ సిరీస్ లోని అన్ని వేరియంట్స్ ని స్టైలిష్ గా ఉండే 15 అంగుళాల డైమండ్ కట్ అల్లయ్ వీల్స్ సమితితో అమర్చారు. ఇది మరింతగా అద్భుతమైన వైఖరిని కనబరుస్తుంది. ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ లో బాడీ కలర్ ఓ ఆర్ వి ఎంస్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి మరియు డోర్ హ్యాండిల్స్ కూడా నలుపు రంగుతో అలంకరించి ఉన్నాయి. దీనికి అదనంగా, దాని సైడ్ స్కర్ట్స్ మరింతగా అల్యూమినియం స్ట్రిప్స్ తో బిగించబడి ఉంటాయి. ఇది దాని స్పోర్టి అప్పీల్ ను పెంచుతుంది. దీని వెలుపలి అద్దం క్యాప్స్ అదనపు భద్రతను అందించే టర్న్ ఇండికేటర్లతో సంఘటితం చేయబడి ఉంటాయి. రేర్ ప్రొఫైల్ చూసినట్లయితే, ఇది చాలా సొగసుగా ఉంది, దీని రెర్ స్పాయిలర్ డ్యుయల్ టోన్ కలర్ స్కీం తో రూపొందించబడి ఉంది. ఫ్రంట్ బంపర్ లాగే రేర్ బంపర్ కూడా బ్లాక్ కలర్ తో అలంకరించబడి ఉంది కానీ , ఇది అల్యూమినియం ప్రొటెక్టివ్ క్లాడింగ్ తో బిగించబడి ఉంటుంది. ఇంకా, దీని రేడియంట్ టెయిల్ లైట్ క్లస్టర్ , శక్తివంతమైన బ్రేక్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లతో ఆధారితమయి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ యొక్క మొత్తం పొడవు 3895mm ఉంది మరియు 1735mm తగు వెడల్పుతో దీనిని రూపొందించారు. దీని ఎత్తు 1555mm, అయితే దీని గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 170mm ఉంటుంది. మరోవైపు, ఈ వాహనం 2460mm వీల్ బేస్ తో చాలా పొడవుగా ఉంది.

లోపలి డిజైన్:


వాహన తయారీదారుడు ఐదుగురు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సీటింగ్ అందించేలా ఒక భారీ క్యాబిన్ స్పేస్ తో రూపకల్పన చేసాడు. వారికి పుష్కలమైన లెగ్ రూం మరియు తగినంత హెడ్ స్పేస్ ను కూడా అందించారు. దీనిలో విశాలమైన మరియు బాగా మంచివయినటువంటి క్యుషన్ సీట్లను అమర్చారు. ఇవి స్పోర్టీ ఫ్యాబ్రిక్ లెదర్ తోలుతో కప్పబడి ఉంటాయి. మరోవైపు, మొత్తం క్యాబిన్ ఆకర్షణీయమైన పియానో నలుపు రంగు స్కీమ్ తో అలంకరించబడి ఉంటుంది. ఇది దాని ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. ఇది మరింతగా, దీని యొక్క స్టీరింగ్ వీల్ ను సిల్వర్ కలర్ తో పూత పూసి ఉంచారు అలాగే క్రోమ్ తో అలంకరించిన ఎయిర్ వెంట్స్ గేర్ షిఫ్ట్ నాబ్ లను కలిగి ఉంది. దీనిలో కాక్పిట్ వివిధ పరికరాలతో కలిసి డ్యాష్బోర్డ్ పైన చాలా బాగా అమర్చబడి ఉంది. ఇందులో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, గ్లవ్ బాక్స్, ఏసి వెంట్స్ మరియు సంగీతం వ్యవస్థతో సంఘటితం చేయబడ్డ ఒక సెంటర్ కన్సోల్ ఉన్నాయి. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక డిజిటల్ ట్రిప్ మీటర్ , డోర్ అజార్ ఇండికేటర్ తోపాటు ఉన్న టాకొమీటర్ , హెడ్ల్యాంప్ ఆన్, లో ఫ్యూయెల్ కన్సంప్షన్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక ల్యాంప్ నోటిఫికేషన్ల వంటి లక్షణాలతో వస్తుంది. ప్రయాణికుల వైపు వానిటీ మిర్రర్ తో కూడిన ఫ్రంట్ సన్ విజర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు, అది ఒక డిజిటల్ క్లాక్ , డే మరియు నైట్ లోపలి రేర్ వ్యూ మిర్రర్ , కోటు హూక్స్ తో కూడిన మూడు సహాయక పట్టులు, ఫ్రంట్ క్యాబిన్ లైట్లు, యాక్సెసరీ సాకెట్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్, అలాగే సౌలభ్యం కోసం టెయిల్ గేట్ ఓపెనర్ వంటి ఆధునిక అంశాలను కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ సిరీస్ లో వినూత్నమైన కొన్ని అంశాలు అందుబాటులోఉన్నాయి. ఇది దాని ప్రయాణికులకు సౌలభ్యాన్ని జతచేస్తుంది. ఇది ఒక ఆధునిక ఎయిర్ కండీషనింగ్ యూనిట్ తో అందజేయబడుతుంది. ఇది లోపలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది హీటర్ మరియు క్లీన్ ఎయిర్ ఫిల్టర్ తో వస్తుంది. దీనిలో డ్రైవర్ వైపు ఆటో డౌన్ ఫంక్షన్ తో నాలుగు పవర్ విండోస్ అందుబాటులో ఉన్నాయి. దీనిని టిల్ట్ సర్దుబాటు ఫంక్షన్ తో కూడిన ఒక ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్ తో అమర్చారు. దీని వి మరియు విడి ట్రిమ్స్ లో ఆడియో నియంత్రణలతో అమర్చబడి ఉంటుంది. దీనిలో మరొక కోణం ఏమిటనగా 12వోల్ట్స్ ఫ్రంట్ పవర్ అవుట్లెట్ ను ఎలక్ట్రానిక్ పరికరాల మరియు మొబైల్ ఫోన్ల చార్జింగ్ కోసం అనుసంధానం చేశారు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సర్దుబాటు హెడ్రెస్ట్స్ తో పాటు వచ్చిన విశాలమైన మరియు బాగా మంచిగా ఉన్న క్యుషన్ సీట్లు దీనిలో ఉన్నాయి. అయితే డ్రైవర్ సీట్, ఎత్తు సర్దుబాటు సౌకర్యంతో అందించబడుతుంది. అయితే వెనక సీటు 60:40 స్ప్లిట్ తో ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ గా సర్దుబాటు చేసుకోగల బయట వెనుక వీక్షణ అద్దాలు మరింత సౌలభ్యాన్ని జోడిస్తాయి. దీనిలో ఒక విశాలమైన గ్లవ్ బాక్స్ కంపార్ట్మెంట్ ఉంది. ఇది చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానిక్ అనుకూలంగా ఉంటుంది. కారులో వినోదం కోసం , ఒక ఆధునిక 2-దిన్ సంగీత వ్యవస్థ రూపొందించబడి ఉంది. దీనిని రిమోట్ కంట్రోల్ ను ఉపయోగించి నిర్వహించవచ్చు. ఇది ఒక సిడి, ఎంపి3 ప్లేయర్, ఏఎం / ఎఫ్ ఎం రేడియో ట్యూనర్, యుఎస్బి పోర్ట్ తో వస్తుంది. అగ్రశ్రేణి వేరియంట్లలో ఇది ఆడియో యూనిట్ ఆక్స్-ఇన్ ఎంపికతో అందించబడింది మరియు బ్లూటూత్ కనెక్టివిటీ మద్దతు కూడా ఉంది. రేర్ పార్కింగ్ సెన్సార్లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవి డ్రైవర్ కి సులభంగా పార్కింగ్ చేయడానికి సహాయపడతాయి. వీటితోపాటుగా, అది వాషర్ మరియు వైపర్ తో కూడిన రేర్ డీఫాగర్, టాకొమీటర్, ఫ్రంట్ క్యాబిన్ లైట్లు, నాలుగు స్పీకర్లు మరియు కొన్ని ఇతర లక్షణాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


ఈ అద్భుతమైన వాహనం సులభంగా ఐదుగురు ప్రయాణికులకు వసతిని కల్పించేలా భారీ క్యాబిన్ తో రూపొందించబడింది. ఆకర్షణనీయమైన వీల్బేస్ ఉండటం మూలంగా క్యాబిన్లో తగినంత లెగ్ స్పేస్ ఉంది. ముందు మరియు వెనుక క్యాబిన్ లో కూడా తగినంతగా హెడ్ మరియు షోల్డర్ స్పేస్ ఉంది. మరోవైపు, ఇది 251 లీటర్ల ఒక మంచి నిల్వ సామర్ధ్యం గల బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది. ఇది ఎక్కువ సామాను భద్రపరచడం కోసం తగినంత మంచిదిగా ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


వాహన తయారీదారుడు ప్రస్తుతం ఈ మోడల్ సిరీస్ ను వినియోగదారులకు రెండు పెట్రోల్ ఇంజను మరియు ఒక డీజిల్ ఇంజను ఎంపికలతో అందిస్తున్నాడు. దీని 1.2-లీటర్ పెట్రోల్ మిల్లు ఇప్పుడు 1197cc స్థానభ్రంశ సామర్థ్యంతో వస్తుంది. దీనిని 4 సిలిండర్లు, 16 వాల్వ్స్ తో సంఘటితం చేసారు. ఇది 5600 rpm వద్ద 78.9 bhp పీక్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 3100rpm వద్ద గరిష్ట ంగా 104Nm టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది. కొన్ని ట్రిమ్స్ లో 1.5-లీటర్ పెట్రోలు పవర్ ప్లాంట్ ను అనుసంధానం చేశారు. ఇది 1496cc స్థానభ్రంశం సామర్ధ్యంను కలిగి ఉంటుంది.ఇది 5600rpm వద్ద 88.76bhp గరిష్ట శక్తి నిఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో, ఇది 3000rpm వద్ద 132Nm టార్క్ అవుట్పుట్ ని అందించల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది చాలా యుక్తకరంగా ఉంది. ఈ రెండు మోటార్లు ఒక డబుల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా రూపొందించబడ్డాయి మరియు ఇది ఒక ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో కలిసి ఉంటుంది. మరోవైపు, టొయోటా ఎతియోస్ క్రాస్ డీజిల్ వేరియంట్లలో ఒక 1.4-లీటర్ డి-4డి ఇంజన్ తో వస్తుంది మరియు ఇది 1364cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. డీజిల్ ఇంజన్ సింగిల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లు మరియు 8 వాల్వ్స్ ను కలిగి ఉంది. ఇది ఒక ఆధునిక కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ మిల్లు 67.06 bhp శక్తిని మరియు 170Nm టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది, ఇది చాలా యోగ్యకరంగా ఉంటుంది. ఇవే కాకుండా, ఈ 3 ఇంజన్లను ఒక 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ సిస్టమ్ తో అనుసంధానం చేశారు. ఇది టార్క్ అవుట్పుట్ ను ముందు వీల్స్ కి పంపుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ క్రాస్ఓవర్ ఒక ఆధునిక 2-డిన్ సంగీత వ్యవస్థ తో రూపొందించబడి ఉంది. దీనిని రిమోట్ కంట్రోల్ ను ఉపయోగించి నిర్వహించవచ్చు. ఇది ఒక సిడి, ఎంపి3 ప్లేయర్, ఏఎం / ఎఫ్ ఎం రేడియో ట్యూనర్, యుఎస్బి పోర్ట్ తో వస్తుంది. ఇది ముందు మరియు వెనుక నాలుగు స్పీకర్లను కలిగి, ఒక అత్యుత్తమమైన ధ్వని అనుభవాన్ని అందిస్తుంది. అగ్రశ్రేణి వేరియంట్లలో కూడా ఆడియో యూనిట్ ఆక్స్-ఇన్ ఎంపికతో అందించబడింది మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండడం దీనిలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇది టిల్ట్ స్టీరింగ్ వీల్ తో ఆడీయో కంట్రోల్స్ తో బిగించబడి ఉంటుంది. మరోవైపు, కొనుగోలుదారులకు కూడా వారి అవసరాలకు అనుగుణంగా వారికి నచ్చిన యాక్సెసరీస్ ని అనుసంధానించుకునేలా ఎంపికను ఇవ్వడం జరిగింది. డోర్ సైడ్ విజర్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్, రేర్ సెన్సార్ అలాగే డార్క్ బాడీ గ్రాఫిక్స్ మరియు లైట్ షేడ్ ఎంపికల వంటి కొన్ని అంశాలను దీని యొక్క బాహ్య భాగాలకు అమర్చారు. అంతర్గత విభాగంలో కూడా మరింతగా కొన్ని లక్షణాలను చేర్చారు. అవి లగేజ్ ట్రే, ఫ్లోర్ మాట్స్, సన్ విజర్ ఆర్గనైజర్ మరియు పర్ ఫ్యూమ్. వీటితోపాటుగా, వుడెన్ అర్మ్రెస్ట్ ప్యానెల్, మరియు గేర్ షిఫ్ట్ నాబ్, లెగ్ రూం ల్యాంప్, లెదర్ సీటు కవర్లు మరియు నలుపు స్టీరింగ్ వీల్ కవర్ మరియు ఆరెంజ్ షేడ్స్ కూడా ఈ వాహనం సౌకర్యవంతంగా మరియు ఆకర్షణీయంగా ఉండేందుకు జోడించారు.

వీల్స్ పరిమాణం:


ఈ టయోటా ఎతియోస్ క్రాస్ యొక్క అన్ని ట్రిమ్స్ లో స్టైలిష్ గా ఉండే 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ సమితిని అనుసంధానం చేశారు. ఈ రిమ్స్ ని అధిక పనితీరు కలిగిన, 185/60R16 పరిమాణం గల ట్యూబ్ లెస్ టైర్ల తో కవర్ చేసి ఉంచుతారు. ఇవి రోడ్లపై అద్భుతమైన పట్టును అందిస్తాయి. ఇంకా, ఇది పూర్తి పరిమాణం గల ఒక అదనపు వీల్ తో వస్తుంది. దీనిని బూట్ కంపార్ట్మెంట్లో ఇతర టూల్స్ తో కలిపి ఉంచుతారు. ఈ టూల్స్ టైర్ ను మార్చేటపుడు సుళువుగా, ఉపయోగకరంగా ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


వాహన తయారీదారుడు ఎటువంటి రహదారి పరిస్థితులలోనైనా సరే వాహనం స్థిరత్వంను కలిగే ఉండేలా ఒక నైపుణ్యం గల సస్పెన్షన్ వ్యవస్థను దీనిలో విలీనం చేశారు. దీని ఫ్రంట్ ఆక్సిల్ ఒక మక్ఫెర్సొన్ స్ట్రట్ తో జోడించారు. అయితే, రేర్ ఆక్సిల్ ఒక టోర్సన్ బీమ్ తో అమర్చారు. ఇది అసమానంగా ఉన్న రోడ్లలో కూడా వాహనాన్ని ముందుకి లాగడంలో సహాయపడి ఒక సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ క్రాస్ఓవర్ యొక్క ఫ్రంట్ వీల్స్ వెంటిలేషన్ డిస్క్ బ్రేక్ల సమితితో బిగించబడి ఉంటుంది. అయితే, దాని రేర్ వీల్స్ సాలిడ్ డ్రమ్ బ్రేక్లతో బిగించబడి ఉంటాయి. మరింతగా దీనిని ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అనుసంధానం చేశారు. ఇది జి ట్రిమ్ లో లేదు. మరోవైపు, ఇది ఒక ఎలక్ట్రానిక్ సహాయక స్టీరింగ్ సిస్టమ్ తో అనుసంధానం చేయబడి ఉంది. ఒక మంచి స్పందనను ఇస్తుంది. ఇది 4.8 మీటర్ల కనీస వ్యాసార్థానికి మద్ధతునిస్తుంది మరియు చాలా అనుకూలమైన నిర్వహణను అందజేస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ స్టైలిష్ క్రాస్ఓవర్ లో కొన్ని కీలకమైన రక్షణ అంశాలను పొందుపరిచారు. ఇవి ప్రయాణికులను మరియు వాహనంను పరిరక్షించడంలో సహయపడతాయి. దీనిలో అనుబంధ నిర్బంధ వ్యవస్థ (సప్లిమెంటల్ రీస్ట్రెయిన్ సిస్టమ్) ఉంది. ఏదైనా ఢీ కొన్న సమయంలో దీనిలోని ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ కి అలాగే సహ ప్రయాణికుడికి పైన ఎలాంటి ప్రభావం లేకుండా సహాయపడతాయి. జిడి ట్రిమ్ లో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను అందించారు. ఇంకా, ఇది కీలెస్ ఎంట్రీ మరియు ఒక ఇంజిన్ ఇమ్మొబిలైజర్ లను కలిగి ఉంది. ఈ వ్యవస్థ ఎలాంటి అనధికార ఎంట్రీ నుండి అయినా మరియు దొంగతనం నుండి అయినా కాపాడటంలో సహయపడుతుంది. ఇది లోపల ఉన్న ప్రయాణికులను పరిరక్షించడానికి బలమైన బాడీ నిర్మాణంతో నిర్మించబడింది. వెనుక ప్రొఫైల్ ను చూసినట్లయితే, దీనిలో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ మరియు వైపర్ తో డీఫాగర్ ఉన్నాయి. ఇవి వర్షాకాలాలలో కూడా ఒక స్పష్టమైన వీక్షణను అందించడంలో సహాయపడతాయి. అంతేకాక ఇది వివిధ రక్షణా హెచ్చరిక అంశాలైన డోర్ అజార్, డ్రైవర్ సీటు బెల్ట్ హెచ్చరిక, పార్కింగ్ బ్రేక్ మరియు హెడ్ల్యాంప్ నోటిఫికేషన్లను కలిగి ఉంది. ఇవన్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద ప్రదర్శించబడతాయి.

అనుకూలాలు:


1. లెగ్ మరియు హెడ్ స్పేస్ తగినంత ఉంది.
2. వినూత్నమైన సౌకర్య అంశాలు ప్రయోజనకరంగా ఉన్నాయి.
3. ఇంటీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది.
4. డీజిల్ ఇంజిన్ పనితీరు బాగుంది.
5. సమర్ధవంతమైన సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి.

ప్రతికూలాలు:


1. లగేజ్ కంపార్ట్మెంట్ ను మెరుగు పరచవలసిన అవసరం ఉంది.
2. పెట్రోల్ వెర్షన్ యొక్క ఇంధన వ్యవస్థ చాలా తక్కువగా ఉంది.
3. లెదర్ సీటు కవర్లు లేకపోవడం కూడా దీనిలో ఒక మైనస్ పాయింట్.
4. ప్రారంభ ధర చాలా ఎక్కువగా ఉంది.
5. భద్రతా ప్రమాణాలను ఇంకా కొంచెం మెరుగుపరచవలసిన అవసరం ఉంది.