టయోటా కేమ్రీ

` 29.7 - 37.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టయోటా కేమ్రీ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ప్రపంచవ్యాప్తంగా వాహనాలను తయారు చేసే అనేకమైన ప్రసిద్ధి చెందిన సంస్థలలో టయోటా ను కూడా ఒక నిష్కళంకమైన ఆటోమొబైల్ సంస్థగా చెప్పవచ్చు. దీని విలాసవంతమైన సిరీస్, సెడాన్ యొక్క సంపన్నమైన కార్లలో టయోటా క్యామ్రీ కూడా ఒకటి. దీనిని మొదట 2002 లో భారతదేశంలో ప్రవేశ పెట్టారు అప్పటి నుండి ఇది అద్భుతమైన వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో దాని యొక్క 2015 వెర్షన్ కారును, లోపల మరియు బయట భాగాలలో నవీకరణలు చేసి మార్కెట్లోకి విడుదల చేసారు. ఈ నవీకరణల వలన ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సంస్థ దాని బాహ్య రూపంలో ప్రధాన మార్పులను క్రోమ్ టచ్ తో అందించింది. అదే సమయంలో, దీనికి అందించిన కొత్త అల్లాయ్ వీల్స్ సెట్ వలన దీని సైడ్ ప్రొఫైల్ అందంగా కనబడుతుంది. ఇవి మాత్రమే కాకుండా సంస్థ దీని యొక్క క్యాబిన్లో కూడా ముఖ్యమైన మార్పులను చేసింది. వీటి వలన కారు నాగరీకంగా కనబడుతుంది. అలాగే, క్యాబిన్ ను లెదర్ తోలుతో మరియు లేత గోధుమ రంగు స్కీంతో రూపొందించారు. దీని 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 2494cc స్థానభ్రంశం సామర్థ్యంతో వస్తుంది. ఇది కేవలం 6000 rpm వద్ద 178.5 bhp గరిష్ట శక్తి ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటుగా 4100 rpm వద్ద 233 Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఇంజిన్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దాని హైబ్రిడ్ వేరియంట్ రెండు విధాల పవర్ సోర్స్ తో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజను మరియు ఒక విద్యుత్ మోటార్ తో వస్తుంది. ఇది వరుసగా 202.1 bhp శక్తిని మరియు 270 Nm పీక్ టార్క్ అవుట్ పుట్ ను అందిస్తుంది. అదే సమయంలో ఈ హైబ్రిడ్ మోటార్ ఒక ఎలక్ట్రానిక్ నియంత్రిత నిరంతర వేరియేబుల్ ప్రసార గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది భారతదేశ రోడ్లపైన మంచి పట్టును అందిస్తుంది. దీనిలోని బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం చాలా నైపుణ్యంతో ఉండి అన్ని సమయాల్లో వాహనాన్ని సమతుల్యంగా ఉంచుటలో సహయపడతాయి. ఈ వాహనానికి బ్రేకింగ్ వ్యవస్థ తో పాటు మరింత పటుత్వాన్ని ఇవ్వడానికి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లు సహాయపడతాయి.

దీని బహుళ స్టీరింగ్ వీల్ ఆడియో మరియు కాల్ నియంత్రణ బటన్లతో అమర్చబడి ఉంటుంది. ఇది రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ మరియు రేర్ కర్టసీ ల్యాంప్స్, రిమోట్ బూట్ రిలీజ్, లగేజ్ కంపార్ట్మెంట్ ల్యాంప్, టైమర్ తో రేర్ విండ్ స్క్రీన్ డీఫాగర్, షిఫ్ట్ పొజీషన్ ఇండికేటర్, వెనుక వైపు పార్కింగ్ అసిస్ట్, అన్ని నాలుగు పవర్ విండోస్ తో డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, స్మార్ట్ యాక్సెస్ కార్డు ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్ వంటి లక్షణాలను కలిగి ఉంది. కంపెనీ కూడా ఈ మోడల్ సిరీస్ ను ఒక టచ్ స్క్రీన్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఆధునిక 2-దిన్ ఆడియో సిస్టమ్ తో అనుసంధానం చేసింది. దీనిలోని శక్తివంతమైన మరియు సమర్థవంతమైన ఎయిర్ కండీషనర్ యూనిట్, ఒక డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక ఏసి వెంట్స్ తో వస్తుంది. ఇది వెనుక వైపు ఉన్న ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని జతచేస్తుంది. వీటితో పాటుగా, కంపెనీ ప్రయాణికులకు ఒక ఒత్తిడిలేని ఉచిత డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికీనేక రక్షిత అంశాలను అందించారు . ఈ జాబితాలో ఆరు ఎయిర్బ్యాగ్స్ , బ్యాక్ మానిటర్ మరియు కార్నర్ సెన్సార్లతో కూడిన ఇల్లిస్ట్రేషన్ డిస్ప్లే, ఇంపాక్ట్ సెన్సింగ్ ఫ్యూయల్ కట్ ఆఫ్ స్మార్ట్ కీ రెమైండ్ వార్నింగ్ అంశాలు ఉన్నాయి. ఇది ఒక ఆధునిక ఇంజిన్ ఇమ్మొబిలైజర్ భద్రతా అలారం వ్యవస్థతో వస్తుంది. ఇది ఏదైనా అనధికార ఎంట్రీ నుండి వాహనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.ఇది క్రోమ్ పూత కలిగిన బోల్డ్ రేడియేటర్ గ్రిల్, విలక్షణముగా రూపొందించిన వైపు క్లస్టర్ , బాడీ రంగు బంపర్, ఒక నాగరికమైన అల్లాయ్ వీల్స్ సెట్ మరియు ఇంకా ఎన్నో అంశాలను కలిగి ఉంది. సంస్థ దీనిని మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ( ఏది ముందు వస్తే అది) వారంటీతో అందిస్తుంది. వినియోగదారులు ఈ వారంటీ కాలాన్ని అధికార డీలర్ల వద్ద అదనపు ధరతో పొడిగించుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని పెట్రోల్ వేరియంట్ యొక్క ఇంజన్ ఒక బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ సెడాన్ రహదారుల పైన 13 kmpl మైలేజ్ ను మరియు నగరాలలో 9.5 kmpl మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, దాని హైబ్రిడ్ వెర్షన్ ఒక ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థతో జత చేయబడి ఉంటుంది. ఇది పెద్ద రోడ్లపై 19.1 kmpl మైలేజ్ ను మరియు ప్రామాణిక డ్రైవింగ్ పరిస్థితులతో నగరం లోపల 16.3 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


2.5 లీటర్, 2ఏఆర్-ఎఫ్ ఇ సాంకేతిక పరమైన పెట్రోల్ ఇంజన్ 6000 rpm వద్ద 178.5 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అలాగే 4100 rpm వద్ద 233 Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను అందించగల సామర్థ్యం తో ఉంది. అదే సమయంలో, దాని హైబ్రిడ్ వేరియంట్ 5700 rpm వద్ద 157.8bhp, 141 bhpమరియు 202.1 bhp వంటి మూడు రీతుల ఉత్పత్తులతో వస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఒక సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సహాయంతో, అది లోపల కూర్చొని ఉన్న ప్రయాణీకులకు చాలా ఉత్తేజకరమైన అనుభూతిని కలిగించేలా ఇది 180 -185 kmph పరిధిలో గరిష్ట వేగాన్ని అందించగలుగుతుంది. అదే సమయంలో, దాని స్థిర ప్రదేశం నుండి కేవలం 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో దాని అవరోధాన్ని క్రాస్ చేయగలుగుతుంది. మరోవైపు, దాని హైబ్రిడ్ వేరియంట్ ఒక ఎలక్ట్రానిక్ నియంత్రిత నిరంతర వేరియేబుల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ మోటారు 190 -195 kmph పరిధిలో టాప్ స్పీడ్ ను చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు ఇది దగ్గరగా 9.3 సెకన్ల సమయంలో 0 నుండి 100 kmph వరకు వేగవంతం చేసుకోగలుగుతుంది.

వెలుపలి డిజైన్:


ఈ అద్భుతమైన లగ్జరీ సెడాన్ లో అనేక స్టైలింగ్ అంశాలను పొందుపర్చారు. ఈ వాహనం యొక్క బాహ్య భాగాలను చూసినట్లైతే, అనేక క్రోమ్ చేరికలతో చాలా అకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ వాహనం ఏరోడైనమిక్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీనితో పాటుగా సొగసైన మరియు నునుపుగా బాడీలైన్ తో రూపొందించబడింది. ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, చాలా ఎక్కువ మొత్తంలో క్రోమ్ చేరికలతో పాటు పునఃరూపకల్పన చేయబడిన రేడియేటర్ గ్రిల్ ను మనం చూడవచ్చు. గ్రిల్ మధ్య భాగంలో ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకోవడానికి సంస్థ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. దీని చుట్టూ పునరుద్దరించబడిన హెడ్లైట్ క్లస్టర్ అమర్చబడి ఉంటుంది. దీనిలో అధిక తీవ్రత కలిగిన ఎల్ ఈ డి ల్యాంప్స్, డైనమిక్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ దీని యొక్క ముందు భాగానికి ఒక డైనమిక్ లుక్ ని అందిస్తున్నాయి. దీని క్రింద ఒక దృఢమైన బంపర్ ను కలిగి ఉంది. దీనిలో గాలిని లోపలికి తీసుకోవడానికి ఒక పెద్ద ఎయిర్ డ్యామ్ తో పాటుగా అందిచబడుతుంది మరియు ఇది చాలా రకాల క్రోమ్ ఇన్సర్ట్స్ తో వస్తుంది. దీనిలోని ఒక పెద్ద విండ్స్క్రీన్ గ్రీన్ టింటెడ్ గ్లాస్ తో తయారు చేయబడి ఉంటుంది. ఇది ఇంటర్మిటెంట్ వైపర్స్ సెట్ తో బిగించబడి ఉంటుంది. దీని హైబ్రిడ్ వెర్షన్ ప్రత్యేకమైన క్రోమ్ రేడియేటర్ గ్రిల్ తో చిహ్నాలు, బంపర్స్ మరియు ఇంకా కొన్ని అదనపు లక్షణాలతో వస్తుంది. దాని సైడ్ ప్రొఫైల్ ను చూసినట్లయితే, అది చాలా చక్కగా బాడీ కలర్ నమూనాలతో రూపకల్పన చేయబడి మరియు క్రోం ఫినిష్డ్ విండో సిల్ ను కలిగి ఉంది. ఇంకా దీని డోర్ హ్యాండిల్స్ మరియు బయటి వైపు వింగ్ మిర్రర్స్ బాడీ కలర్లో ఉండి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సదుపాయంతో అందుబాటులో ఉన్నాయి. ఈ మిర్రర్స్ కూడా రివర్స్ లింక్, మెమోరీ, ఆటో రీట్రాక్టబుల్, హైడ్రో కొల్లాయిడ్ మరియు ఎల్ ఈ డి సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో వస్తాయి. దీనికి ఉన్నటువంటి వీల్ ఆర్చులు అల్లాయ్ వీల్స్ బ్రాండ్ కొత్త సెట్ తో బిగించబడి ఉంటాయి. వీటి వలన సైడ్ ప్రొఫైల్ కి ఒక సొగసైన రూపం చేకూరుతుంది. ఈ రిమ్స్ మరింతగా అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో అనుసంధానించబడి, ఎలాంటి రోడ్ల పైన అయినా సరే ఒక ఉన్నతమైన పట్టును అందించడంలో సహయపడతాయి. దీనిలోని బాడీ రంగు బంపర్ చిన్న చిన్న నష్టాలను అడ్డుకోవడం కోసం ఒక ఎగ్జాస్ట్ పైప్ మరియు క్లాడింగ్ తో కలిసి ఉంటుంది. ఇది ఒక ఎల్ఈడి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ మరియు ఒక ప్రకాశవంతమైన టెయిల్ లైట్ క్లస్టర్ ను కలిగి ఉంది. ఇవి ఎల్ ఈ డి ఆధారిత రివర్సింగ్ ల్యాంప్స్ తో బిగించబడి ఉంటాయి. వీటితో పాటుగా ఒక జత ఫాగ్ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్ లు కూడా ఉంటాయి. దీనిలోని ఒక పెద్ద విండ్స్క్రీన్, డీఫాగర్ తో పాటు వాష్ మరియు వైపర్ ఫంకషన్ ను కలిగి ఉంది .

వెలుపలి కొలతలు:


ఈ సొగసైన సెడాన్ యొక్క బాహ్య కొలతలలో ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచారు. ఇది చాలా పెద్దదిగా మరియు లోపల చాలా స్పేస్ కలిగి ప్రయాణికులకు అత్యుత్తమమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4825mm ఉంటుంది అలాగే మొత్తం వెడల్పు 1825mm కలిగి ఉంటుంది. అలాగే, ఇది ఫోల్దబిల్ బయట వెనుక వీక్షణ అద్దాలను కూడా కలిగి ఉంది. దీని యొక్క మంచి ఎత్తు 1480mm ఉండి ప్రయాణికులకు తగినంత హెడ్ స్పేస్ ను అందిస్తుంది. ఇది 2775mm రూమి వీల్బేస్ ను కలిగి మంచి లెగ్ రూమ్ ను అందించడంతో పాటుగా 160mm తగు గ్రౌండ్ క్లియరెన్స్ ను కూడా కలిగి ఉంది. దాని స్టీరింగ్ వీల్ 5.7 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్దతునిస్తుంది. ఈ వాహనం యొక్క గరిష్ట కెర్బ్ వెయిట్ 1475 కిలోలు మరియు గ్రాస్ వెయిట్ సుమారు 2000 కిలోలు ఉంటుంది.

లోపలి డిజైన్:


కంపెనీ ఈ సెడాన్ సిరీస్ యొక్క అంతర్గత విభాగాన్ని నవీకరించడం వలన ఇది మరింత క్లాసీ లుక్ తో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది లేత గోధుమ రంగు కలర్లో, డాష్బోర్డ్, స్టీరింగ్ వీల్ మరియు సెంటర్ కన్సోల్ మీద వుడ్ ఇన్సర్ట్స్ తో వస్తుంది. ఇది తన క్యాబిన్ లుక్ ను మెరుగుపరుస్తూ మరియు అలాగే వివిధ అధునాతన లక్షణాలతో చేర్చబడి ఉంది. సీటింగ్ పరంగా, అది మంచి క్యుషన్ సీట్ల అమరికతో దాని యజమానులను పుష్కల లెగ్ స్పేస్ ను అందిస్తుంది. ఈ సీట్లు హెడ్ రెస్ట్ రీస్ట్రెయిన్లను మరియు సెంటర్ ఆర్మ్ రెస్ట్ లను కలిగి ఉన్నాయి. దీనిలోని అడ్జస్టబుల్, ఫోల్డబుల్ రేర్ సీట్ల ద్వార వేంక సీట్లను మడిచి దీనియొక్క బూట్ కంపార్ట్మెంట్ ను పెంచవచ్చు. డ్రైవర్ సీట్ సరైన లుంబర్ మద్దతుతో అందుబాటులో ఉంది మరియు ఇది 8-విధాలుగా ఎలక్ట్రికల్ సర్దుబాటు ఫంక్షన్ తో అందించబడుతుంది. అదే సమయంలో, ముందు భాగం ప్రయాణికుడి సీటు కూడా పవర్ అడ్జస్టబుల్ ఫంక్షంతో వస్తుంది మరియు దీనిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. క్యాబిన్ చాలా విశాలంగా మరియు దాని ప్రయాణికులకు తగినంత లెగ్ అలాగే షోల్డర్ స్పేస్ ను అందిస్తుంది. మృదువైన డాష్బోర్డ్ వుడ్ ఇన్సర్ట్స్ తో పాటుగా అనేక లక్షణాలను కలిగి ఉంది. అవి క్రోమ్ తో కూర్చబడిన ఏసి వెంట్లు, ఒక పెద్ద గ్లవ్ బాక్స్, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ పునఃరూపకల్పన చేయబడిన సిల్వర్ తో పూత పూయబడిన ఇన్స్ట్రుమెంట్ పానెల్, ఇంకా ఇది డిజిటల్ టాకొమీటర్, ఎలక్ట్రానిక్ ట్రిప్ మీటర్, డోర్ అజార్ హెచ్చరిక, సీటు బెల్ట్ హెచ్చరిక నోటిఫికేషన్ మరియు స్పీడోమీటర్ వంటి అంశాలను కూడా కలిగి ఉంది. సంస్థ ఈ సెడాన్ లో చాలా వినియోగ ఆధారిత కోణాలను అందించింది. అవి కప్ మరియు బాటిల్ హోల్డర్స్, ముందు సీటు బ్యాక్ పాకెట్స్, ఒక పెద్ద బూట్ కంపార్ట్మెంట్, కూలింగ్ ఎఫెక్ట్ గ్లవ్ బాక్స్, రియర్ పార్సెల్ షెల్ఫ్, వానిటీ మిర్రర్ పైన టికెట్ హోల్దర్స్ మరియు ఇటువంటి ఇతర అనేక లక్షణాలను కలిగి ఉంది. ఇది ఒక డిజిటల్ క్లాక్ తో అలాగే ఒక 12 వోల్ట్స్ డిసి విద్యుత్ అవుట్ లెట్ తో విలీనం చేయబడి ఉంది. ఇది ఎలక్ట్రిక్ గాడ్జెట్లకు చార్జింగ్ ను అందించడంలో సహయపడతాయి. వీటితో పాటు, అది ఒక ఆధునిక బహుళ సమాచార డిస్ప్లే, ఫ్రంట్ ఓవర్ హెడ్ స్టోరేజ్ కన్సోల్, డే/నైట్ రేర్ వ్యూ మిర్రర్, షిఫ్ట్ లాక్ సిస్టమ్, ఇల్లుమినేటెడ్ మరియు లాకబుల్ గ్లవ్ బాక్స్, పర్సనల్ ల్యాంప్స్, వుడ్ ఫినిష్డ్ డోర్ ట్రిమ్స్, లగేజ్ రూమ్ ల్యాంప్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం ఇవ్వడం కోసం కంపెనీ ఈ సెడాన్ కు ఒక మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందించింది . అంతేకాకుండా, అనేక లక్షణాలను పొడవైన జాబితాను ఈ సెడాన్ సిరీస్ లో పొందుపరిచారు. దీనిలో ఒక డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్ తో పాటు సమర్థవంతమైన ఎయిర్ కండీషనర్ యూనిట్ ను కూడా అమర్చారు. అంతేకాకుండా, ఇదే సమయంలో మొత్తం క్యాబిన్ శీతలీకరణ ఉండేందుకు రేర్ ఏసి వెంట్స్ ను కూడా అమర్చారు. ఈ సెడాన్, ఒక అంతర్గత ఇల్ల్యుమినేషన్ ప్యాకేజీ ను కలిగి ఉండటమే కాకుండా, ఫేడ్ అవుట్ రూమ్ ల్యాంప్, లోపల డోర్ హ్యాండిల్స్ మరియు ఫుట్ వెల్ ల్యాంప్స్ వంటి సౌకర్యాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ సెడాన్ బహుళ ఫంక్షనల్ పవర్ స్టీరింగ్ వీల్ తో పాటు ఈ వీల్ పై ఆడియో, క్రూయిజ్ నియంత్రణ మరియు కాల్ బటన్లతో అమర్చబడి ఉంటుంది. మరింత సౌకర్యం కోసం ఒక ఎకో మీటర్ తో పాటు ఒక సూచికను కూడా పొందుపరిచారు. ఈ నవీకరించిన వెర్షన్ లో టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ కోసం హై రెస్ స్క్రీన్ ను అమర్చారు. అలాగే, మీటర్ల మధ్య డిజిటల్ డిస్ప్లే తో అందజేసారు. అంతేకాకుండా, మల్టీ మీడియా ప్లేయర్ సౌలభ్యం స్థాయిని మరింత పెంచడానికి అనేక నియంత్రణలను కలిగి ఉంది. ఇది సహజమైన వాయిస్ కమాండ్ టెక్నాలజీ తో పాటు ఆడియో స్ట్రీమింగ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ లను కలిగి ఉంది. ఇది, ఏ ఎం / ఎఫ్ ఎం ట్యూనర్, యూఎస్బి ఇంటర్ఫేస్, పోర్ట్ మరియు ఆరు స్పీకర్లను, ఆక్స్-ఇన్, సిడి / ఎం పి3 ప్లేయర్, రేడియో వంటి వాటికి మద్దతిస్తుంది. వీటిని మద్దతివ్వడం వలన క్యాబిన్ వాతావరణం మరింత పెరుగుతుంది. ఇది మైక్ మరియు యాంప్లిఫైయర్ లను కూడా కలిగి ఉంది. మరొక విషయం ఏమిటంటే, డ్రైవర్ రహదారులపై స్థిరమైన వేగంతో వాహనాన్ని నడిపేందుకు గాను ఒక క్రూయిస్ కంట్రోల్ ఫంక్షన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క క్యాబిన్, అనేక వస్తువులు నిల్వ చేసుకునేందుకు గాను ఇల్యుమినేటేడ్ గ్లోవ్ బాక్స్ ను కలిగి ఉంది. ఇది చదవడానికి సులభంగా ఉండేలా స్మార్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను మరియు వివిధ ప్రకటనలను డ్రైవర్ కు హెచ్చరిస్తుంది. . అంతేకాకుండా ఈ వాహనం, ఒక డిజిటల్ టాకొమీటర్, ఒక ఎలక్ట్రానిక్ ట్రిప్మీటర్, డోర్ అజార్ హెచ్చరిక, బయట ఉష్ణోగ్రత డిస్ప్లే, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ మరియు అనేక ఇతర ఫంక్షన్లను కలిగి ఉంది. వీటితోపాటు, ఇది ఫ్రంట్ ఓవర్ హెడ్ స్టోరేజ్ కన్సోల్ , రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ మరియు రేర్ కర్టసీ ల్యాంప్స్, రిమోట్ బూట్ రిలీజ్, లగేజ్ కంపార్ట్మెంట్ ల్యాంప్, టైమర్ తో రేర్ విండ్ స్క్రీన్ డీఫాగర్, షిఫ్ట్ పొజీషన్ ఇండికేటర్, వెనుక వైపు పార్కింగ్ అసిస్ట్, అన్ని నాలుగు పవర్ విండోస్ తో డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, స్మార్ట్ యాక్సెస్ కార్డు ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్, డస్క్ సెన్సింగ్ హెడ్ల్యాంప్స్, డస్ట్ మరియు పొలెన్ ఫిల్టర్, రిమోట్ లైటింగ్ మరియు దాని ఎలక్ట్రోక్రోమిక్ రేర్ వ్యూ మిర్రర్ డిస్ప్లే కి రేర్ వ్యూ మిర్రర్ కెమెరా వంటి ఆధునిక అంశాలను దీనిలో పొందుపరిచారు.

లోపలి కొలతలు:


ఈ ప్రీమియం సెడాన్ సిరీస్ యొక్క లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది మరియు ఇది అయిదుగురు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా చేస్తుంది. సీటింగ్ అమరిక చాలా సౌకర్యంగా ఉంటుంది మరియు తొడ కి అలాగే మోకాళుకి తగినంత స్థలంతో అందించబడుతుంది. ఇది ఒక విశాలమైన బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది. దాని వెనుక సీట్ మడవటం ద్వారా దీనిని మరింత పెంచవచ్చు. దాని 2.5 లీటర్ జి వేరియంట్ 70 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంను కలిగి ఉంది. అయితే, దాని ఇతర వేరియంట్లు యొక్క ఇంధన సామర్థ్యం 60 లీటర్లు ఉంటుంది. ఇది దూర ప్రయాణాలు చేయడంలో చాలా యోగ్యకరంగా ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


కంపెనీ ఈ కొత్తగా ఆరంభమైన సెడాన్ సిరీస్ లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు. దీని ఇంజను ను అదే విధంగా శుద్ధి చేసిన మరియు అత్యంత ఆధునికత కలిగిన 2.5 లీటర్, 2 ఏ ఆర్ ఎఫ్ ఇ పెట్రోల్ ఇంజన్ తో అనుసంధానం చేశారు. ఇది 2494cc స్థానభ్రంశం సామర్థ్యంతో వస్తుంది. ఈ డ్యూయల్ వేరియబుల్ వాల్వ్ టైమింగ్ ( వివిటి-ఐ) ఆధారిత మోటారు డబుల్ ఓవర్హెడ్ కామ్షాఫ్ట్ వాల్వ్ ఆధారంగా 4 సిలిండర్లను మరియు 16 వాల్వ్స్ ను కలిగి ఉంది. ఇది కేవలం 6000 rpm వద్ద 178.5 bhp గరిష్ట శక్తి ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటుగా 4100 rpm వద్ద 233 Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది.దీనిలోని చురుకైన 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఇంజిన్ శక్తిని దాని ముందు వీల్స్ కి పంపుతుంది. అదే సమయంలో దాని హైబ్రిడ్ వేరియంట్ అదే ఇంజను ను కలిగి దానితో పాటుగా శాశ్వత అయస్కాంతం సమస్థితి మోటార్ తో అందించబడుతుంది. ఇది దాని పనితీరును పెంచుతుంది. దీని శక్తి ఉత్పత్తి మూడు రీతులతో వస్తుంది . అవి 5700 rpm వద్ద 157.8 bhp, 141 bhp మరియు 202.1 bhp శక్తిని విడుదల చేస్తాయి. అయితే, దీని రెండు మండలాలలో 4500 rpm వద్ద 213 Nm మరియు 270Nm టార్క్ అవుట్పుట్లను విడుదల చేస్తుంది. ఈ పవర్ ప్లాంట్ ఒక ఎలక్ట్రానిక్ నియంత్రిత నిరంతర వేరియేబుల్ ప్రసార గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది శ్వాస తీసుకునేంత టాప్ స్పీడ్ తో వెళ్లగలుగుతుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. ఇది ప్రామాణిక డ్రైవింగ్ పరిస్థితులలో మెరుగైన మైలేజ్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


కంపెనీ కూడా ఈ మోడల్ సిరీస్ ను ఒక టచ్ స్క్రీన్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఆధునిక 2-దిన్ ఆడియో సిస్టమ్ తో అనుసంధానం చేసింది. ఈ ఆడియో యూనిట్ ఎంపి3 / సిడి ప్లేయర్, రేడియో తో ఎఫ్ ఎం ట్యూనర్, దీనితో పాటుగా ఆరు స్పీకర్లను కలిగి ఉంది. ఇది క్యాబిన్ లోపల కళాత్మకతను పెంచుతుంది. ఇది రిమోట్ కంట్రోలర్ తో పాటుగా ఉన్న ఇన్ పుట్ ఎంపికలైన ఒక యుఎస్బి ఇంటర్ఫేస్, ఐపాడ్ కనెక్టివిటీ మరియు ఆక్స్-ఇన్ పోర్ట్ ఎంపికలను కలిగి ఉంది. డ్రైవర్ యొక్క సౌలభ్య స్థాయిలను విస్తరించేందుకు దాని బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ను ఆడియో మరియు ఫోన్ బటన్లతో పొందుపరిచారు. మరోవైపు, రేర్ సీట్ ఎంటర్టెయిన్మెంట్, నావిగేషన్ సిస్టమ్, లెదర్ సీట్లు, ఫ్లోర్ మాట్స్, స్టైలిష్ బాడీ డెకల్స్, ఒక సెట్ అల్లాయ్ వీల్స్, ఇల్యుమినేటేడ్ స్కఫ్ ప్లేట్లు, ఎల్ ఈ డి తో కూడిన డే మరియు నైట్ లైట్లు మరియు ఇంకా అనేక ఇతర లక్షణాలను యజమానులు వారికి కావలసిన విధంగా అనుకూలీకరించుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ మోడల్ సిరీస్ యొక్క వీల్ ఆర్చ్ లు ఒక కొత్త బ్రాండ్ 16 అంగుళాల అలాయ్ వీల్స్ సమితితో బిగించబడి ఉంటాయి. వీటిని అధిక పనితీరు కలిగిన 215/60R16 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పుతారు. కంపెనీ కూడా ఒక పూర్తి పరిమాణపు అదనపు వీల్ ను మరియు టైరును మార్చడానికి కావలసిన టూల్స్ ను దీనిలో అమర్చింది. ఇది రెండు వేరియంట్లలో ఒక ప్రామాణిక లక్షణంగా వస్తుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


వాహన తయారీదారుడు, ఈ వాహనానికి సమర్థవంతమైన బ్రేకింగ్ వ్యవస్థ అలాగే ఒక విశ్వసనీయమైన సస్పెన్షన్ మెకానిజం ను అందించాడు. ఈ వాహనం యొక్క ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో జత చేయబడి ఉంటుంది. వెనుక భాగంలో అయితే, డ్యూయల్ లింక్ టైప్ ఆఫ్ మెకానిజం తో అమర్చారు. అంతేకాకుండా, ఈ రెండు ఆక్సిల్ లు స్టెబిలైజర్ బార్ తో అనుసంధానం చేశారు. దీనితో పాటుగా, కాయిల్ స్ప్రింగ్స్ తో జత చేయడం జరిగింది. ఈ వాహనం, వెహికల్ స్టెబిలిటీ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లను కలిగి ఉంది. మరోవైపు, ఈ వాహనానికి బ్రేకింగ్ వ్యవస్థ తో పాటు మరింత పటుత్వాన్ని ఇవ్వడానికి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లు సహాయపడతాయి. అంతేకాకుండా, డ్రైవింగ్ సమయంలో ట్రాక్షన్ ను నిరోధించడానికి యాంటీ స్లిప్ నియంత్రణ ఫంక్షన్ ను కూడా కలిగి ఉంది. ఈ వాహనం యొక్క ముందు చక్రాలు, వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లు సమితి తో బిగించి ఉంటాయి. వెనుక చక్రాల విషయానికి వస్తే, కన్వెన్షనల్ సెట్ ఆఫ్ డిస్క్ బ్రేక్లతో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ వాహనం, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వాహనం అత్యంత బాధ్యతాయుతంగా ఉండటం కోసం స్టీరింగ్ వీల్ టిల్ట్ అలాగే టెలీస్కోపిక్ సర్దుబాటు ఫంక్షన్ తో అందుబాటులో ఉంది. ఈ స్టీరింగ్ వీల్, దాదాపు 5.3 మీటర్ల టర్నింగ్ వ్యాసార్ధానికి మద్దతిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ సంస్థ వాహనం యొక్క భద్రత సూచీని పెంచడానికి ఈ అద్భుతమైన సెడాన్ 2015 వెర్షన్ ను కొన్ని అత్యుత్తమ నాణ్యత కలిగిన రక్షణా అంశాలతో పొందుపరిచారు. ఇది ఒక అత్యంత అభివృద్ధి క్లియరెన్స్ కలిగిన మరియు బ్యాక్ సోనార్ తో కూడిన ఇలస్ట్రేషన్ డిస్ప్లే తో పార్కింగ్ ను సులభతరం చేస్తుంది. ఇది ఒక ఆధునిక ఇంజిన్ ఇమ్మొబిలైజర్ భద్రతా అలారం వ్యవస్థతో వస్తుంది. ఇది ఏదైనా అనధికార ఎంట్రీ నుండి వాహనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో వీల్ స్లిప్ ను నిరోధించే ఒక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ను అమర్చారు మరియు ట్రాక్షన్ యొక్క లాస్ కూడా ఇంజను శక్తిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే, వీల్స్ కి బ్రేక్ ఫోర్స్ అందించడంలో కూడా సహాయపడుతుంది. దీనిలోని ఎలక్ట్రానిక్ రేర్ వ్యూ మిర్రర్ రాబోయే ట్రాఫిక్ పరిస్థితులకు అనుకూలంగా హెడ్లైట్ నుండి వచ్చే ప్రకాశవంతమైన కాంతిని నిరోధించి. దీనివలన డ్రైవ్ సురక్షితం అవుతుంది. దీని ముందు భాగంలో యాంటీ విప్లాష్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ లు ఉన్నాయి. ఇవి ఏదైనా ఢీ కొన్న సమయంలో మెడకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడతాయి. దీనిలో డ్రైవర్ కి మరియు సహ ప్రయణికుడికి ఎస్ ఆర్ ఎస్ ఎయిర్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి వీటితోపాటుగా సైడ్ కి కర్టెయిన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా, వీటితోపాటుగా ఐసో ఫిక్స్ పిల్లల సీట్ల మౌంటు పాయింట్లు, సీడ్ లిమిటర్, యాంటి పించ్ విండోస్, ప్రిటెన్షనర్ తో కూడిన సేఫ్టీ బెల్ట్స్, ఫోర్స్ లిమిటర్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ ఫ్యూయల్ కట్ ఆఫ్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ లాక్ వంటి అంశాలు ఉన్నాయి.

అనుకూలాలు:


1. ఇంజిన్ పర్ఫార్మెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంది.
2. నవీకరించబడిన బాహ్య భాగాలతో వాహనం ఒక ఆకట్టుకునే రూపాన్ని ఇస్తుంది.
3. హైబ్రిడ్ వెర్షన్ యొక్క భద్రతా కోణాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
4. ఇన్నోవేటివ్ సౌకర్య లక్షణాలు ప్రయోజనాన్ని జతచేస్తున్నాయి.
5. వాహనం అధిక వేగ స్థాయిలలో కూడా స్థిరంగా ఉంటుంది.

ప్రతికూలాలు:


1. నిర్వహణ మరియు విడి భాగాల ఖర్చు ఖరీదైనదిగా ఉంది.
2. పెట్రోల్ వేరియంట్ యొక్క ఇంధన వ్యవస్థ సంతృప్తికరంగా లేదు.
3. లోయర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒక పెద్ద మైనస్ పాయింట్.
4. సస్పెన్షన్ సిస్టమ్ ఇంకా కొద్దిగా బాగా మెరుగు పరచవలసిన అవసరం ఉంది.
5. పరిమిత ఎక్స్టీరియర్ పెయింట్ ఎంపికలు ఉండడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్.