టాటా గ్జినాన్-ఎక్స్ టి

` 10.2 - 11.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టాటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టాటా గ్జినాన్-ఎక్స్ టి వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


టాటా జెనాన్ ఎక్స్ టి ఈ విభాగంలో తయారీదారుడు అందించిన ఆఫ్-రోడింగ్ వాహనాలలో ఒకటి. ఇది చూడడానికి చాలా కఠినంగా కనిపిస్తూ అదే సమయంలో లోపల చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడి ఉంది. ఈ ఇంజిన్ 13.08bhp శక్తిని మరియు 320Nmటార్క్ ని అందిస్తూ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. ఇది 15 నుండి 17 సెకెన్లలో 100 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు. అంతేకాకుండా గరిష్టంగా 160 నుండి 165kmph గరిష్ట వేగం వరకూ చేరుకోగలదు. వాహనం యొక్క పనితీరుని పెంచేందుకుగానూ దీనిలో ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఒక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చబడి ఉంటుంది. ఈ వ్యవస్థ వలన అన్ని రోడ్లపై ధృడమైన పట్టును అందిస్తుంది. దీనిలో మైలేజ్ సామర్ధ్యం చాలా బాగుంటుంది. దీనిలో బాహ్య భాగాలు శరీరం రంగు బంపర్స్, క్రోమ్ రేడియేటర్ గ్రిల్ మరియు టర్న్ ఇండికేటర్స్ తో బాహ్య అద్దాలతో అలంకరించబడి ఉంటాయి. అంతేకాక దీనిలో రూఫ్ రెయిల్స్ మరియు బూట్ లిడ్ చాలా ఆకర్షణీయంగా కారు యొక్క మొత్తం రూపాన్ని మెరుగుపరిచేలా చేస్తాయి. ఈ సీరీస్ మొత్తం నాలుగు రంగులలో లణిస్తుంది. అందులో రెండు లేత షేడ్స్ మరియు మిగిలిన రెండు ముదురు షేడ్స్. దీని పొడవు 5125mm, వెడల్పు 1880mm మరియు 1833mm. దీనిలో అంతర్భాగాలు డ్యుయల్ టోన్ థీం తో ఒక అధునాతన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అందమైన సీట్లు మరియు స్వయంచాలక విధులను కలిగి ఉంటాయి. అలానే దీనిలో బాహ్య అద్దాలు, ఫ్యుయల్ లిడ్ తో విద్యుత్ తో ఆపరేట్ చేసే విధంగా ఉంటాయి. అలానే దీనిలో సీట్లు లంబర్ సపోర్ట్ ని మరియు ఎత్తు సర్ద్దుబాటు సీట్ బెల్టులని కలిగి ఉంటాయి. ఇంకా దీనిలో భారీ బూట్ సామర్ధ్యం అందుబాటులో ఉంటుంది. దీని వెనుక సీట్లు మడవడం ద్వారా దీని బూట్ సామర్ధ్యాన్ని మరింతగా పెంచవచ్చు. దీని భారీ బూట్ సామర్ధ్యం వలన దూరపు ప్రయాణాలకు ఈ వాహనం చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిలో వినోదం కొరకు, రేడియో ట్యూనర్, మ్యూజిక్ ప్లేయర్ మరియు యుఎస్ బి పోర్ట్ లను కలిగియున్న సంగీత వ్యవస్థ అందుబాటులో ఉంది. అలానే, దీనిలో క్యాబిన్ యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు హీటర్ సదుపాయం కలిగిన ఎయిర్ కండిషనింగ్ యూనిట్ అమర్చబడి ఉంటుంది. ఇంకా, దీనిలో పోలెన్ ఫిల్టర్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిలో పవర్ స్టీరింగ్ కూడా అందుబాటులో ఉండడం వలన డ్రైవర్ యొక్క శ్రమ ను తగ్గిస్తుంది. ఇంకా,సౌలభ్యం కోసం టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉంది. ఇంకా దీనిలో ముందర మరియు వెనుక డోర్లు పవర్ విండోస్ తో అందుబాటులో ఉంది. దీనిలో నైపుణ్యమైన మ్యూజిక్ వ్యవస్థ క్యాబిన్ లో అమర్చబడి ఉంది. ఈ ఆడియో యూనిట్, సిడి ప్లేయర్ మరియు యుఎస్ బి పోర్ట్ తో పాటూ రేడియో ట్యూనర్ కి మద్దతు ఇస్తుంది. అయితే, వినియోగదారులు ఈ వాహనాన్ని అనేక లక్షణాలతో పొందవచ్చు.దీనిలో ఓపెన్ డెక్ మీద ఒక బాడీ లైనర్ ఉండి ఫ్లోర్ మీద మరియు సీటింగ్ కి నష్టం జరగకుండా కాపాడుతుంది. ఈ ప్రాంతం తదుపరి బూట్ లిడ్ కవర్ తో కప్పబడి వేడి, దుమ్ము మరియు వర్షం నుంచి కాపాడుతుంది. ఈ వాహనం వాక్యూమ్ సహాయక ఇండిపెండెంట్ హైడ్రాలిక్ బ్రేకుల సమితితో అమర్చబడి ఉంటుంది. దీని ముందరి వీల్స్ ట్విన్ పాట్ కాలిపర్ తో వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లు సమితితో అమర్చబడి ఉన్నాయి. దీని వెనుక బ్రేక్లు ఆటో అడ్జస్టబుల్ టైప్ డ్రమ్ బ్రేక్స్ తో అమర్చబడి ఉంటాయి. సస్పెన్షన్ వ్యవస్థ కి వస్తే, దీని ముందరి ఆక్సిల్ కి ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ మరియు వెనుక ఆక్సిల్ పరాబొలిక్ లీఫ్ స్ప్రింగ్స్ తో అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం అనేక భద్రతా లక్షణాలతో అందించబడినది. సంస్థ ఈ వాహనాన్ని రెండు సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో అందిస్తుంది. అంతేకాక, అదనపు ఖర్చు వద్ద వారంటీ కాలాన్ని ఒకటి లేదా రెండు సంవత్సరాలు వ్యవధి విస్తరణకు పెంచవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ మోడల్ సిరీస్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థతో అనుసంధానం చేయబడియున్న ఒక డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి ఉంటుంది. ఇది నగరాలలో 10.24kmplమైలేజ్ ని మరియు హైవేస్ లో 13.49 kmpl మైలేజ్ ని అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహనం అత్యుత్తమమైన శక్తిని అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉండి ఆఫ్ రోడింగ్ కి అనుగుణంగా ఉంటుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వులను కలిగియుండి డ్యుయల్ ఓవర్ హెడ్ షాఫ్ట్ వాల్వ్ ట్రైను వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 138.08bhp శక్తిని మరియు 1750 నుండి 2700rpm పరిధిలో 320Nm టార్క్ ని అందిస్తుంది.

యాక్సలరేషన్ మరియు పికప్:


ఈ మోడల్ సిరీస్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ వ్యవస్థ తో అమర్చబడి గొప్ప ప్రదర్శనను అందిస్తుంది. ఇది 15 నుండి 17 సెకెన్లలో 100 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు. అంతేకాకుండా గరిష్టంగా 160 నుండి 165kmph గరిష్ట వేగం వరకూ చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


ఈ వాహనం ఆఫ్రోడింగ్ సామర్ధ్యానికి తగ్గట్టుగా రూపకల్పన చేయబడింది. దీని ముందర భాగం వైపు చూస్తే, విస్త్రుతమైన గ్రిల్ ని కలిగియుండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ గ్రిల్ మూడు స్ట్రిప్ లతో సమాంతరంగా ఉండి క్రోమ్ పూతతో అలంకరించబడి ఉంటాయి. ఇది తదుపరి సంస్థ యొక్క బ్యాడ్జ్ తో పొందుపరచబడినది. ఈ గ్రిల్ కి ఇరువైపులా ఒక జత హెడ్లైట్ క్లస్టర్లు అమర్చబడి ఉన్నాయి . దానితో పాటూ ప్రకాశవంతమైన హెడ్ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లను కూడా కలిగి ఉంది. ఇంకా దీనిలో శరీర రంగు బంపర్ అందుబాటులో ఉండి చాలా స్టయిలిష్ గా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో విస్తృత ఎయిర్ డ్యాం అందుబాటులో ఉండి ఇంజిన్ ని చల్లబరుస్తుంది. దీనితో పాటుగా ఇది ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ని కలిగియుండి సరైన దృష్టి గోచరతను అందించడంలో సహాయపడుతుంది. దీని బోనెట్ ఏటవాలుగా ఉండి కొన్ని లైన్స్ తో డిజైన్ చేయబడి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని విండ్స్క్రీన్ చాలా పెద్దదిగా ఒక జత వైపర్స్ తో అమర్చబడి అన్ని వేళలా దుమ్ము, పొగ లేదా వర్షం నుంచి గ్లాస్ ని శుభ్రంగా ఉంచుతుంది. పైకప్పు భాగానికి వస్తే ఒక జత రెయిల్స్ అమర్చబడి సామానులు పెట్టుకొనేందుకు వీలుగా ఉంటుంది. రూఫ్ పైన ఏంటీనా అమర్చబడి ఉండి రేడియో ట్యూనర్ కి సిగ్నల్స్ అందించడంలో సహాయపడుతుంది. దీని పక్క ప్రొఫైల్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని బయట డోర్ వైపు హ్యాండిల్స్ మరియు వెలుపల వెనుక వీక్షణ అద్దాలు రెండూ కూడా శరీర రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి. దీని బాహ్య మిర్రర్స్ కూడా టర్న్ ఇండికేటర్స్ తో అమర్చబడి ఉంటాయి. అలానే దీనిలో బి-పిల్లర్స్ నలుపు రంగులో పెయింట్ చేయబడి విభిన్న అప్పీల్ అందిస్తుంది. అంతేకాకుండా వాహనం అల్లాయ్ వీల్స్ సమితితో అమర్చడం ద్వారా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అలానే దీని వెనుక విండ్స్క్రీన్ చాలా విస్త్రుతంగా ఒక డెమిస్టర్ తో అమర్చబడి ఉంటుంది. దీని వెనుక భాగంలో బంపర్ కూడా శరీర రంగులో అందించబడుతుంది. దీని బూట్ లిడ్ రిఫ్లెక్టర్ మరియు హ్యాండిల్ శరీర రంగులో అందించబడతాయి. అలానే క్రింద గార్డ్ సిల్వర్ రంగులో పెయింట్ చేయబడి మంచి లుక్ ని అందిస్తుంది.

వెలుపలి కొలతలు:


ఈ ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం గల వాహనం వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా పరిపూర్ణ పరిమాణాలతో రూపొందించబడింది. ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 5125mm మరియు వెడల్పు 1880mm. ఇది 1833mm మంచి ఎత్తుని కలిగి ఉంది. కార్గో ప్రాంతం అధిక మొత్తంలో లోడ్ తీసుకొనే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇంకా ఇది 3150mm వీల్బేస్ ని కలిగియుండి క్యాబిన్ లోపల విస్తీర్ణం మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఇంకా ఇది 6 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధాన్ని కలిగియుండి డ్రైవర్ కి మంచి సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ వాహనం 2500 కిలోలు స్థూల బరువును కలిగి ఉంది.

లోపలి డిజైన్:


కంపార్ట్మెంట్ లోపలి భాగం చాలా సమర్థవంతంగా రూపొందించబడి గొప్ప సౌకర్యంతో అయిదుగురు కూర్చునే విధంగా ఉంటుంది. ఈ సీట్లు క్యాబిన్ లో అమర్చబడి చూడడానికి చాలా ట్రెండీ మరియు కుషనీ గా కనిపిస్తుంది. అలానే దీని స్టీరింగ్ వీల్ లెథర్ తో చుట్టబడి ఉంది. ఇంకా దీని సెంటర్ కన్సోల్ ఫాక్స్ వుడ్ మెటీరియల్ తో అమర్చబడి ఉంటుంది. ది క్యాబిన్ కి ఒక పురాతనత్వ టచ్ ఇస్తుంది. దీని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గ్రాఫిక్ ప్రదర్శనని కలిగి ఉంది. కంపార్ట్మెంట్ లో దీని ఫ్లోర్ కార్పెట్ నల్లని లేత గోధుమ రంగులో ఉండి అందమైన ప్రభావాన్ని అందిస్తుంది. ఇంకా దీని అంతర్భాగాలలో చాలా నిల్వా స్థలాలు అందించడం జరిగింది. వినియోగదారుల సౌకర్యం కోసం క్యాబిన్ లో సిగరెట్ లైటర్ మరియు యాష్ట్రే అందించడం జరిగింది. అలానే ఫ్లోర్ కన్సోల్ పైన 12వి శక్తి అవుట్లెట్లు అందుబాటులో ఉన్నాయి. దీనివలన ఏ చిన్న ఎలక్ట్రానిక్ పరికరం అయినా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో టాకోమీటర్ మరియు ట్రిప్ మీటర్ తో పాటూ ఇన్స్ట్రుమెంటల్ పానెల్ పైన ఒక అనలాగ్ గడియారం ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ పానెల్ కాంతి తీవ్రతను సర్దుబాటు చేసుకోగల సౌకర్యన్ని కలిగి ఉంది. అలానే దీనిలో రెండవ వరుస సీట్లు పూర్తిగా మడత వేయగలిగేలా ఉంటాయి. అలానే దీనిలో డ్రైవర్ సౌలభ్యం కోసం రూఫ్ ల్యాంప్ అలానే మ్యాప్ ల్యాంప్ అందుబాటులో ఉన్నాయి. దీని ముందరి విండ్స్క్రీన్ సన్ షేడ్ ని కలిగియుండి వేడి మరియు కాంతిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అలానే దీనిలో సీట్ బెల్ట్ అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటుగా ఫ్రంట్ బెల్ట్లు , ఎత్తుని సర్ద్దుబాటు చేసుకొనేందుకు ఉపయోగపడతాయి. అలానే దీని డ్రైవర్ వైపు స్క్రీన్ కి సన్ విజర్ అమర్చబడి ఉంటుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ క్యాబిన్ అనేక లక్షణాలతో అమర్చబడి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో వినోదం కొరకు, రేడియో ట్యూనర్, మ్యూజిక్ ప్లేయర్ మరియు యుఎస్ బి పోర్ట్ లను కలిగియున్న సంగీత వ్యవస్థ అందుబాటులో ఉంది. అలానే, దీనిలో క్యాబిన్ యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు హీటర్ సదుపాయం కలిగిన ఎయిర్ కండిషనింగ్ యూనిట్ అమర్చబడి ఉంటుంది. ఇంకా, దీనిలో పోలెన్ ఫిల్టర్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిలో పవర్ స్టీరింగ్ కూడా అందుబాటులో ఉండడం వలన డ్రైవర్ యొక్క శ్రమ ను తగ్గిస్తుంది. ఇంకా,సౌలభ్యం కోసం టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉంది. ఇంకా దీనిలో ముందర మరియు వెనుక డోర్లు పవర్ విండోస్ తో అందుబాటులో ఉంది. అలానే డ్రైవర్ మరియు సహ డ్రైవర్ వైపు స్విచ్లు వన్ టచ్ డౌన్ ఫంక్షన్ తో అందుబాటులో ఉంది. దీని వెనుక విండ్స్క్రీన్ పై డీఫాగర్ అనుసంధానం చేయబడి ఉంది. కన్వెన్షనల్ యాక్సెస్ కి బదులుగా వాహనం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో పాటూ కీలెస్ ఎంట్రీ ని అధనపు సౌకర్యం కొరకు కలిగి ఉంది. దీని సెంట్రల్ కన్సోల్ లో కప్ హోల్డర్స్ మరియు డోర్ ట్రింస్ పైన బాటిల్ హోల్డర్స్ మరియు పత్రిక పాకెట్లు అందుబాటులో ఉన్నాయి. దీని బయట వెనుక వీక్షణ అద్దాలు వేడి చేయబడి ఉదయం మరియు పొగమంచు వాతావరణంలో కూడా స్పష్టమైన దృష్టి ని అందిస్తుంది. ఈ అద్దాలు ఎలక్ట్రానిక్ సర్దుబాటును కలిగి ఉంది. ఫ్యూయెల్ లిడ్ కూడా రిమోట్ ద్వారా నియంత్రిత చేయవచ్చు.

లోపలి కొలతలు:


సంస్థ అందించే ఉదార వీల్బేస్ కారణంగా ఈ మోడల్ సిరీస్ బాగా విశాలమైన సీటింగ్ తో రూపొందించబడి ఉంటుంది.ఇది ఐదుగురు వ్యక్తులు కూర్చునేందుకు సదుపాయంగా ఉంటుంది. దీని లెగ్రూం చాలా సౌకర్యవంతంగా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. క్యాబిన్ కూడా చాలా సౌకర్యవంతంగా పొడవైన వ్యక్తులు కూడా సులభంగా కూర్చునే విధంగా ఉంటుంది. దీని ఇంధన ట్యాంక్ 65 లీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉండి దూరపు ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఒక వాహనం యొక్క మొత్తం పనితీరు దీని ఇంజిన్ సామర్థ్యం యొక్క నైపుణ్యతపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం గల విషయంలో కొనుగోలుదారులు ఎన్నో కోరుకుంటారు. ఈ వాహనం 2.2లీటర్ డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి 2179cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు పదహారు కవటాలుతో చేర్చబడి డ్యుయల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది వేరియబుల్ టెక్నాలజీతో అనుసంధానం చేయబడి కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా విధానం ద్వారా నడుపబడుతుంది. ఇది హైవే మీద 13.49kmpl మైలేజ్ ని అలానే నగర పరిధిలలో 10.24 kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 138.08bhp గరిష్ట శక్తిని మరియు 1750 నుండి 2700rpm వద్ద 320Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఈ వాహనం ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ వ్యవస్థ తో జతచేయబడి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


దీనిలో నైపుణ్యమైన మ్యూజిక్ వ్యవస్థ క్యాబిన్ లో అమర్చబడి ఉంది. ఈ ఆడియో యూనిట్, సిడి ప్లేయర్ మరియు యుఎస్ బి పోర్ట్ తో పాటూ రేడియో ట్యూనర్ కి మద్దతు ఇస్తుంది. అయితే, వినియోగదారులు ఈ వాహనాన్ని అనేక లక్షణాలతో పొందవచ్చు.దీనిలో ఓపెన్ డెక్ మీద ఒక బాడీ లైనర్ ఉండి ఫ్లోర్ మీద మరియు సీటింగ్ కి నష్టం జరగకుండా కాపాడుతుంది. ఈ ప్రాంతం తదుపరి బూట్ లిడ్ కవర్ తో కప్పబడి వేడి, దుమ్ము మరియు వర్షం నుంచి కాపాడుతుంది. వీటితో పాటూ అధనంగా రూఫ్ స్పాయిలర్,నడ్జ్ గార్డ్ మరియు సైడ్ స్టెప్స్ వంటి అధనపు సౌకర్య లక్షణాలు అందుబాటులో ఉన్నాయి.అది ఒక ఆఫ్-రోడింగ్ సామర్ధ్యం గల వాహనం కనుక, మడ్ ఫ్లాప్స్ వాహనం యొక్క బాహ్య భాగానికి ఎటువంటి నష్టం జరగకుండా కాపాడుతాయి. అంతేకాక, దీని బాహ్య రూపాన్ని మరింతగా మెరుగుపరచే క్రమంలో బాడీ గ్రాఫిక్స్ మరింతగా తోత్పడతాయి. ఈ సౌకర్యాలు అధికారిత డీలర్స్ నుండి అదనపు ఖర్చు వద్ద పొందవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఒక ఆఫ్ రోడింగ్ వాహనం యొక్క టైర్లు చాలా సామర్ధ్యం కలిగి ఉండాలి. ఈ వాహనం యొక్క టైర్లు ట్యూబ్ లేని టైర్లు, రోడ్ పైన పంచర్ అవ్వడాన్ని తగ్గించి భద్రతను కలిపిస్తాయి. ఈ టైర్లు 235/70 R16 పరిమాణం కలిగియుండి 16 అంగుళాల అందమైన అల్లాయ్ వీల్స్ తో అమర్చబడి ఉంటాయి. ఇది పూర్తి పరిమాణం గల స్పేర్ వీల్ ని కలిగి ఉండి ఫ్లాట్ టైర్ మార్చుకునేందుకు అధనంగా టూల్ కిట్ కూడా కలిగి ఉంటుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ కారు వాక్యూమ్ సహాయక ఇండిపెండెంట్ హైడ్రాలిక్ బ్రేకుల సమితితో అమర్చబడి ఉంటుంది. దీని ముందరి వీల్స్ ట్విన్ పాట్ కాలిపర్ వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లు సమితితో అమర్చబడి ఉన్నాయి. దీని వెనుక బ్రేక్లు ఆటో అడ్జస్టబుల్ టైప్ డ్రమ్ బ్రేక్స్ తో అమర్చబడి ఉంటాయి. సస్పెన్షన్ వ్యవస్థ కి వస్తే, దీని ముందరి ఆక్సిల్ కి ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ అమర్చబడి ఉంటుంది. దీని వెనుక ఆక్సిల్ కి వస్తే, పెరాబొలిక్ లీఫ్ స్ప్రింగ్స్ తో అమర్చబడి ఉంటుంది. దీని బ్రేకింగ్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో ఉన్న యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అమర్చబడి ఉంది. ఈ వ్యవస్థ వాహనాన్ని అన్ని రోడ్లపై మంచి పట్టుని అందించేందుకు సహాయపడుతుంది. అలానే డ్రైవర్ కి వాహనం పైన నియంత్రణను పెంచుతుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ మోడల్ సిరీస్ అనేక భద్రతా కారక అంశాలను కలిగి ఉంది. ఈ అంశాలన్నీ వాహనానికి భద్రత అందించడం మాత్రమే కాకుండా ప్రయాణికులకు కూడా భద్రత అందిస్తుంది. ఈ వాహనంలో డోర్లు ఇంట్రూషన్ బీమ్స్ తో అమర్చబడి తాకిడి ప్రభావాల నుండి వాహనాన్ని రక్షిస్తుంది. ఈ లక్షణం వాహన్ని మాత్రమే కాకుండా ప్రయాణికులను కూడా గాయాల నుండి కాపాడుతుంది. ఈ వాహనంలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ అనే లక్షణం అమర్చబడియుండి అనధికార ఎంట్రీ నుండి వాహనాన్ని కాపాడుతుంది. వాహనం ఏదైనా అక్రమాలను గుర్తించినపుడు ఇంజిన్ గడ్డకట్టి ఏ విధంగా సహాయపడకపోవడం వలన అనధికారపు ప్రవేశాన్ని తొలగించగలుగుతుంది. ఏ వాహనానికి అయినా బ్రేకింగ్ మెకానిజం చాలా కీలకమైన అంశం. ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ వాహనానికి ఇది మరీ ముఖ్యం. ఇది ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటూ యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థతో అమర్చబడి వాహనం యొక్క బ్రేకింగ్ సామర్ధ్యాన్ని మరింతగా పెంచుతుంది. ఈ మొత్తం మెకానిజం అంతా వాహనానికి ఎటువంటి రోడ్లపైన అయినా మంచి పట్టుని అందించడంలో సహాయపడుతుంది. రెండు వేరియంట్లలో కూడా డోర్ ఓపెన్ అలారం అందుబాటులో ఉండి ప్రయాణికులకు భద్రత కలిపిస్తుంది. అధనంగా దీనిలో డోర్ అజార్ వార్నింగ్ లైట్ భద్రత కోసం అందించబడుతుంది. వాహనంలో వెనుక డోర్లకి చైల్డ్ సేఫ్టీ లాక్ అందుబాటులో ఉండి చిన్న పిల్లలు డోర్ తీసి క్రింద పడిపోకుండా కాపాడుతుంది. ఇంకా,ఈ సిరీస్ లో లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ అనే లక్షణం అందుబాటులో ఉండి వాహనాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు వంపు ప్రాంతాలలో వాహనం జారడాన్ని నియంత్రిస్తుంది. ఈ బ్రేకింగ్ మెకానిజం ని మరింతగా పెంచేందుకు దీని ముందరి వీల్స్ డిస్క్ బ్రేకుల సమితితో అమర్చబడి ఉంటాయి. ఈ డిస్క్ బ్రేక్లు పెద్దవి మరియు ట్విన్ పాట్ కాలిపర్స్. ఈ వీల్స్ తదుపరి ట్యూబ్ లేని టైర్లతో కప్పబడి అధనపు భద్రతను చేకూరుస్తాయి. ఈ వాహనంలో ప్రయాణికుల యొక్క రక్షణ 3-పాయింట్ సీట్ బెల్ట్స్ తో అందించబడుతుంది. ఈ 3-పాయింట్ సీట్ బెల్ట్స్ చైల్డ్ బెల్ట్స్ తో కలిసి ఉంటాయి. ఈ సీట్బెల్ట్ కి అన్ ఫాస్టెండ్ వార్నింగ్ కూడా డ్రైవర్ ని అప్రమత్తం చేయడానికి అందించబడుతుంది. దీనిలో ఇంధన గేజ్ తక్కువ ఇంధన హెచ్చరిక సూచికతో కలిసి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలానే దీని లోపల రేర్ వ్యూ మిర్రర్ యాంటీ గ్లేర్ ప్రభావంతో అందించబడుతుంది. రెండు వేరియంట్లు కూడా ముందు భాగానికి మరియు వెనుక భాగానికి ఫాగ్ ల్యాంప్స్ అమర్చబడి ఉంటాయి. ఈ ల్యాంప్స్ డ్రైవింగ్ లో లోపాలు నివారించడానికి స్పష్టమైన దృష్టిని అందించడానికి డ్రైవర్ కోసం చాలా అవసరం. వెనుకభాగంలో విండ్స్క్రీన్ కి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అమర్చబడి దూరం నుండి వచ్చే ఇతర వాహనాలను గుర్తించడంలో సహాయపడతాయి. దీనిలో స్టీరింగ్ కాలం కొలాప్సబుల్ నేచర్ ని కలిగియుండి ప్రమాదాలు సంభవించినపుడు ప్రయాణికులను రక్షిస్తుంది. అంతేకాకుండా దీనిలో సబ్ మెరైన్ సీట్లు అందుబాటులో ఉండి ప్రయాణికులను జారిపోకుండా కాపాడతాయి.

అనుకూలాలు:


1. అనేక భద్రతా లక్షణాలు అందించడం జరిగింది.
2. సౌకర్యం కొరకు అనేక లక్షణాలను అందించడం జరిగింది.
3.బాహ్య రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
4. దీనిలో అంతర్భాగాలు చాలా అలంకరించబడ్డాయి.
5. కారు ప్రదర్శన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ప్రతికూలాలు:


1. లెథర్ అపోలిస్ట్రీ జోడించవలసిన ఆస్కారం ఉంది.
2. మరి కొన్ని షేడ్స్ లో అందించాల్సి ఉంది.
3. ధర పరిధి మరింత సమంజసమైనదిగా ఉండాల్సిన ఆస్కారం ఉంది.
4. ఇంజిన్ శబ్ధం చాలా ఇబ్బందికరంగా ఉండడం ఒక ప్రతికూలత.
5. ఇంధన సామర్ధ్యం మరింతగా మెరుగుపరచాల్సిన ఆస్కారం ఉంది.