టాటా సుమో

` 6.4 - 8.5 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టాటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టాటా సుమో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతదేశ ఆటోమేటివ్ పరిశ్రమ వారి నైపుణ్యంతో కూడిన ఇంజినీరింగ్ డిజైన్ తో అనేక వాహనాలను తయారు చేసింది. భారత నేలపై కార్ల తయారీ సంస్థ చరిత్రలోనే ఒక హోదాను సంపాదించుకుంది మరియు అనేక బ్రాండ్ల కంటే కూడా టాటా ఒక గొప్ప ఆటోమొబైల్ సంస్థగా పేరు పొందింది. ఈ కంపెనీ భారతదేశంలోనే కార్ల తయారీలో ఒక ఎత్తుకు ఎదిగి తనకంటూ ఒక గుర్తింపును పొందింది. ఇది మొదట 1945 లో స్థాపించబడింది, ఇది ఈ అర్ధ శతాబ్ద కాలంలోనే తన సంస్థ పేరు మారుమ్రోగేలా గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తులతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే ధరతో మనకి అందించబడుతుంది. ఈ బ్రాండ్ విడుదలయి సుమారు 2 దశాబ్దాలు కావోస్తుంది. ఇది మొదట 1994వ సంవత్సరంలో విడుదలయి దాని స్థిరత్వంతో మార్కెట్ లోకి దూసుకెళ్లింది. భారతదేశంలో సుమో విడుదల అయ్యాక ఆ సమయంలో కంపెనీ కి ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. కొన్నేళ్లుగా ఇది అనేక రంగాలలో స్థిరత్వాన్ని సంపాదించుకుంది. టాక్సీల నుండి ప్రభుత్వ వాహనాలయిన పోలీసు బండ్ల వరకు దీనినే వాడుతున్నారు. ఈ వాహనం ఎత్తుగా మరియు దృఢమైనదిగా నిర్మించారు ఇది ఎస్యూవి బ్రాండ్ అయినటువంటి హమ్మర్ ను పోలి ఉంటుంది. ఈ వాహనం ఒక శక్తివంతమైనటువంటి 3 లీటర్ సి ఆర్4 ఇంజనుతో జతచేయబడి ఉంటుంది. ఇది 2965 cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క శక్తివంతమైన ఇంజను 83 hp పీక్ పవర్ తో పాటుగా,గరిష్టంగా 250Nm టార్కును విడుదల చేస్తుంది. ఇది 146 kmph టాప్ స్పీడ్ ను చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఎలాంటి భారీ లోడ్ ని అయినా సరే హోల్డ్ చేసుకునే సామర్థ్యం కలిగి రోడ్లపైన ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి పనితీరు కలిగిన ఈ వాహనం అన్ని గణాంకాలతో కూడిన ఒక నిజమైన వాహనంగా పరిగణించవచ్చు.

దీని క్యాబిన్ లోపల బ్లాక్ లినెన్ తో అలంకరించడం వలన ఇది నాగరీకంగా ఒక మంచి అప్పీల్ తో కనబడుతుంది. దీని సీట్లు విస్తృతంగా, సౌకర్యవంతంగా, మరియు సర్దుబాటు చేయగలిగిన విధంగా ఉత్తమ వసతిని కల్పిస్తున్నాయి. ఒక క్రోమ్ రింగ్ తో కూడిన ఆధునీకరణ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రయాణీకులకు ఒక గొప్ప అలంకరణను అందిస్తుంది. మెషిన్ లోపల సాంకేతికతతో కూడిన అన్ని అంశాలను జతచేశారు. మరింత సౌలభ్య కారకంగా ఒక లో ఫ్యుయెల్ ఇండికేటర్ ఉంది మరియు ప్రయాణికులకు అవసరమైన రక్షక అంశాలు కూడా దీనిలో ఉన్నాయి. స్టీరింగ్ విధానం ఒక ఉత్తమ రైడ్ సౌకర్యం మరియు భద్రత అందించే విధంగా స్టీరింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించారు. పవర్ విండోస్ క్యాబిన్ లోపల ఉన్న ప్రయాణికులకు స్థిరత్వాన్ని అందిస్తాయి మరియు టింటెడ్ విండోస్ క్యాబిన్ ను చల్లగా ఉంచడంలో తోడ్పడతాయి. ఇది అన్ని ప్రాథమిక అవసరాలయిన విండ్షీల్డ్ వైపర్ తో పాటుగా వెనుక విండ్షీల్డ్ వైపర్ ను కూడా కలిగి ఉంది. వెనక వైపు డీఫాగర్ కూడా అన్ని రకాలయిన సదుపాయలతో అప్ గ్రేడ్ చేయబడి ఉంది. ఒక 12 వోల్ట్స్ అవుట్లెట్ సెంటర్ కన్సోల్ లో కీలక అవసరాలను తీర్చడానికి అమర్చారు. అలాగే యాంటీ గ్లేర్ రేర్ వ్యూ మిర్రర్ కూడా భద్రతను అందిస్తుంది. కప్ హోల్డర్స్, గ్లవ్ బాక్స్ లిడ్ పైనా చేర్చబడి ఉన్నాయి మరియు ఒక మొబైల్ హోల్డర్ ఫంక్షన్ ను కూడా దీనికి జోడించారు. దీనిలో ఫ్లోర్ కన్సోల్ ను పూర్తిగా హ్యాండ్ బ్రేక్ తో అనుసంధానం చేశారు.

దీనిలో ఒక గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈ వాహానం యొక్కవెలుపలి డిజైన్ వలన దీని అంచనాలకు మించి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది స్పోర్ట్స్ కార్ల వలె కాకుండా రిజిడ్ లైన్స్ తో ఒక మంచి రూపాన్ని సంతరించుకుంది. ఇది ఒక దృఢమైన వాహనం మరియు దీని పాత ఫ్యాషన్ లుక్స్ తో ప్రజలను ఆకట్టుకుంది. ఈ వాహనం తన అభిమానులకు ఒక మంచి అనుభూతిని కలిగించి వారి మన్ననలను పొందింది. దీని ఫ్రంట్ బంపర్ గ్రౌండ్ కి కిందవైపుగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీని ముందు భాగం మొత్తం గ్రిల్ తో కవర్ చేయబడి ప్రక్క వైపు పెద్దగా మరియు దీర్గ చతురస్రాకారపు హెడ్ ల్యాంప్స్ ను కలిగి ఉంది. ముందు భాగం సెంటర్లో కంపెనీ చిహ్నాన్ని జతచేసి ఉంచారు. ఎయిర్ వాహికలు గ్రిల్ క్రింద భాగంలో అనుసంధానించబడి ఉంటాయి ఇది ఇంధన సరఫరా అధికంగా అందించడంలో తోడ్పడుతుంది.

అన్ని వాహనాలకు ఉన్నట్లుగానే దీనిలో కూడా రూఫ్ లైన్ ఉంది. ఇది వెనక నుండి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది ఒక ఎస్యూవిలో ఉండే అన్ని విధాల ల్యాంప్స్ ను కలిగి ఉంది మరియు దీని వెనక ల్యాంప్స్ కూడా ముందు వాటి ఫార్మాట్ లోనే రూపొందించారు. దీనిలో ఒక అదనపు వీల్ ను వెనక వైపు సెంటర్ లో అమర్చడం వలన ఈ వాహనం ఒక గొప్ప రీతిలో మనకు కనిపిస్తుంది మరియు ఇది వెనుక వైపు ఉండడం వలన వాహన వెనకభాగం సీల్ చేసి ఉన్నట్లు కనబడుతోంది. అన్నింటిని కలిపి చూసినట్లయితే ఇది ఒక నిజమైన సాధనంగా మనం గుర్తించవచ్చు. మన కళలను ప్రభావితం చేసే ఒక గొప్ప అంశంగా మనం దీనిని గుర్తించవచ్చు. ఇటువంటి ఒక అద్భుతమైన వాహనం మన భారతదేశ మార్కెట్లో రెండు దశాబ్దాలుగా ఉండడం గర్వించ దగ్గ విషయంగా పరిగణించవచ్చు మరియు ఇది దీని కీర్తిని నిలబెట్టుకుంటూ ఇది ఇంకా కొంత కాలం ఖచ్చితంగా దీని ఉత్పత్తిని కొనసాగిస్తుందని చెప్పవచ్చు .

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనం రెండు ఇంజన్లతో వస్తుంది. వాటిలో ఒకటి 3.0-లీటర్ సిఆర్4 ఇంజన్ , ఈ సిఆర్4 మరింత సమర్థవంతమైన మరియు అధిక సామర్థ్యం గల ఇంజను మరియు ఇంకొకటి 4ఎస్పి టిసిఐసి ఇంజను. మొదటి ఇంజన్ సిఆర్4 ఒక అద్భుతమైన మైలేజ్ విలువను అందిస్తుంది ఒక లీటరు ఇంధనంతో దాదాపు 15.3 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది నిజంగా ఒక ప్రశంసనీయ గణాంకం, వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక భారీ నిర్మాణం గల ఎస్యూవి మరియు దీని పనితీరు విషయానికి వస్తే ఇది మైలేజ్ ఎక్కువగా అందిస్తుందని భావిస్తున్నారు. ఇతర ఇంజన్ ట్రిమ్ విషయంలో, మైలేజ్ ఆశ్చర్యకర రీతిలో చాలా ఎక్కువగా ఉంది. టిసిఐసి ట్రిమ్ 14.3 kmpl మైలేజ్ ని అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


దీనిలో పవర్ విషయానికొస్తే రెండు ట్రిమ్ లలో కూడా గొప్పగా పవర్ ను ఉత్పత్తి చేస్తాయి మరియు అధిక మైలేజ్ ని అందిస్తుంది. మొదటి 3.0-లీటర్ సి ఆర్4 ఇంజన్ 2956 cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఈ ఒక్క సెగ్మెంట్ కి మాత్రమే కాదు అన్ని రకాల మోటార్ వాహనాలలో మంచి పనితీరును కనబరుస్తుంది. ఇది 83hp శక్తిని మరియు గరిష్టంగా 250Nm పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. రెండవ ఇంజన్ అయిన 4 ఎస్పి టిసిఐసి ఇంజన్ కూడా ఒక అద్భుతమైన ప్రదర్శన సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది 2956 cc స్థానభ్రంశ సామర్థ్యం తో దృఢంగా ఉంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనం రెండు ఇంజన్లతో వివిధ వేరియంట్లలో వస్తుంది. దీనిలో ఒకటి 3.0-లీటర్ సిఆర్4 ఇంజన్ మరియు ఇంకొకటి 4ఎస్పి టిసిఐసి ఇంజను. ఈ రెండింటిలో సిఆర్4 మరింత సమర్థవంతమైన మరియు అధిక సామర్థ్యం గల ఇంజను. సిఆర్4 ఇంజను గొప్ప గణాంకాలతో 146 kmph ఒక టాప్ వేగంను కలిగి ఉంది, మరియు ఇది 27 సెకన్ల యాక్సలరేషన్ తో అందించబడుతుంది. మరో వైపు టిసిఐసి ఇంజను సిఆర్4 ఇచ్చినంత టాప్ స్పీడ్ ను ఇవ్వగలదు కానీ దీని యాక్సలరేషన్ మాత్రం 34.5 సెకన్ల వద్ద నిలుస్తుంది.

వెలుపలి డిజైన్:


ఇది బాహ్యపరంగా చూడడానికి ఇతర కంపెనీ మోడళ్ల ఆఫ్ రోడ్ వాహనాలను పోలి ఉన్నట్లు కనబడుతుంది. ఇది ఒక ఎస్యూవి కాబట్టి ఇది అధిక బరువును మరియు ఒక మరింత కఠినమైన పరుగులు తీసే సామర్థ్యం కోసం ఉద్దేశించి తయారు చేశారు. ఫలితంగా, ఇది ఒక విస్తృతంగా మరియు దృఢమైన నిర్మాణంతో కనబడుతుంది. ఈ వాహనం యొక్క పొడవు వలన రోడ్ పైన ఇతర వాహనాలు చిన్నవిగా కనబడతాయి. దీని ఎత్తు విషయం ప్రక్కన పెడితే, ఇది విస్తారంగా ఉండడం వలన ప్రయాణ సమయంలో రోడ్లపైన ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది మరియు దీని పార్కింగ్ కి కూడా అధికంగా స్థలం కావలసి ఉంటుంది. ఇది ఈ రోజుల్లో కనిపించే ఫాన్సీ కార్ల తరహాలో కాకుండా మరింత క్లీన్ కట్ తో, స్క్వేర్ రూపాన్ని కలిగి ఉంది. ఇది ఒక పాత మోడల్ వాహనం లాగా ముందు నుండి వెనక వరకు మనకి కనిపిస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్ పైన కంపెనీ చిహ్నం అమర్చబడి ఉంటుంది మరియు రెండు ప్రక్కల హెడ్ లైట్స్ ఉంటాయి. హెడ్ల్యాంప్స్ స్టైలిష్ స్పష్టమైన లెన్స్ ఫార్మాట్ తో ఒక మంచి దృష్టి గోచరతను సంతరించుకున్నాయి. గ్రిల్ క్రింద ఎయిర్ ఓపెనింగ్ ఉన్నాయి. ఇది ఇంజిన్ గరిష్ట శీతలీకరణ కోసం ఉద్దేశించబడి తయారు చేశారు. దీని అన్ని వేరియంట్లలో ఫాగ్ ల్యాంప్ మాత్రం సాధారణంగా ఉంది. దీనిలో ముందు మరియు వెనక వైపు బంపర్స్ కారు బాడీ రంగులో ఉంటాయి అలాగే బయట డోర్ హ్యాండిల్స్ కూడా అదే రంగులో ఉంటాయి. దీని వీల్ క్యాప్స్ స్టైలిష్ గా మరియు పెద్దగా ఉండడం వలన రేర్ ప్రొఫైల్ మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. టెయిల్ లైట్స్ కూడా ముందు భాగంలో లైట్స్ లాగే అదే రీతిలో ఉన్నాయి. ఒక స్పేర్ వీల్ దీనిలో వెనక భాగంలో అమర్చబడి ఉంటుంది దీనివలన కూడా కారుకి ఒక మంచి అప్పీల్ వస్తుంది.

వెలుపలి కొలతలు:


ఈ భారీ యంత్రం ఒక మంచి 4258 mm పొడవును, 1700 mm వెడల్పు ను కలిగి ఉంది. ఈ దృఢ నిర్మాణం కలిగిన వాహనం సన్నగా పొడవుగా 1925mm ఎత్తును కలిగి ఉంది. ఇది 2425mm వీల్ బేస్ ను కూడా కలిగి ఉంది. ఇది182 mm ఒక మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను మరియు ఇది 5 మీటర్ల టర్నింగ్ వ్యాసార్థ్యాన్ని కలిగి ఉంది. ఈ అన్ని కొలతలు కలిసి బాహ్యపరంగా వాహనం చూడడానికి ఒక మంచి అప్పీల్ తో కనబడుతుంది.

లోపలి డిజైన్:


క్యాబిన్ లోపల చక్కని నలుపు లినెన్ తో అలంకరించబడి ఉంది. దీని సీట్లు విస్తృతంగా, సౌకర్యవంతంగా, మరియు సర్దుబాటు చేయగలిన విధంగా ఆర్మెస్ట్ తో మరియు హెడ్ రెస్ట్ లతో సంక్లిష్టంగా ఉన్నాయి. క్యాబిన్ లోపల ఒక సెంటర్ కన్సోల్ ఉంది అది కప్పుల నిల్వ కోసం ప్రత్యేకంగా రూపొందించారు మరియు అదనంగా ఒక మొబైల్ హోల్డర్ కూడా ఉంది. మ్యాగజైన్స్ కోసం ఒక హోల్డింగ్ పాకెట్ డోర్ కి ఆనుకుని ఉంది. మొత్తంమీద, సెంటర్ కన్సోల్ ఒక వుడ్ ముగింపుతో మరియు గేర్ నాబ్స్ స్టైలిష్ గా రూపొందించబడ్డాయి. బాగా అలంకరించబడిన ఇన్స్ట్రుమెంట్ పానెల్ ముందు భాగంలో అమర్చబడి ఉంది. ఈ రోజుల్లో వాహనానికి కావలసిన అన్ని రకాల లక్షణాలను ఎప్పటికప్పుడు అప్ టూ డేట్ అందిస్తుంది. ఇది ఒక రేడియో ఫంక్షన్ ను కలిగి ఉండడంతో పాటుగా అనేక ఇతర సాధనాలను కూడా కలిగి రైడ్ కి ఒక మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క రూపకల్పనను క్రోమ్ తో టాప్ ఎండ్ లో జత చేశారు. అప్ టూ డేట్ సాంకేతిక లక్షణాలతో రైడ్ మరింతగా సులభతరం అయిందని చెప్పవచ్చు. టాకొమీటర్ ద్వారా డ్రైవర్ కి కావలసిన భద్రతా మరియు సౌకర్యానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని గ్రహించవచ్చు. ఈ వాహనానికి అమర్చిన టింటెడ్ పవర్ విండోస్ వలన వేడిగా ఉన్న సమయాల్లో మనకి చల్లదనాన్ని అందించి ఒక ఉత్తమ అనుభూతిని కలిగిస్తుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ యంత్రం యొక్క క్యాబిన్ లోపల మరియు వెలుపల సౌకర్యవంతమైన లక్షణాలతో ఆధునీకంగా రూపొందించబడింది. ఇది లోపల ఒక రిచ్ లుక్ ను కలిగి ఉంది. దీనిలో సీట్లు విస్తారంగా మరియు సౌకర్యవంతంగా ఉన్నాయి వీటిని గ్రేట్ ఎర్గోనామిక్ సూత్రం ఆధారంగా నిర్మించారు. ఇంకా, ప్రయాణికులకు అత్యుత్తమంగా సౌకర్యాలు అందించేందుకు అనేక లక్షణాలను దీనిలో పొందుపరిచారు. దీనిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బాగా రూపకల్పన చేయబడి మరియు వివిధ లక్షణాల పరిధిని కలిగి ఉంది. పక్కనే గేర్ నాబ్ ఒక శైలితో రూపకల్పన చేసినటువంటి ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు. స్టీరింగ్ వీల్ కి అదనపు పట్టు కోసం ఒక మృదువైన మెటీరియల్ తో తయారు చేశారు. సెంటర్ కన్సోల్ ఒక ఖరీదైన వుడ్ ఫినిషింగ్ తో ఉంది అది కప్పుల నిల్వ కోసం ప్రత్యేకంగా రూపొందించారు మరియు ఒక మొబైల్ హోల్డర్ కూడా దీనిలో ఉంది. మ్యాగజైన్స్ కోసం ఒక హోల్డింగ్ పాకెట్ కూడా ఉంది. అన్నింటికంటే ఎక్కువగా ఈ యంత్రం దాని ప్రయాణికులకు సౌకర్యవంతమైన రిఫైన్డ్ టచ్ ను ఇస్తుంది మరియు క్యాబిన్ లోపల ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది ఒక పవర్ స్టీరింగ్ ఫంక్షన్ తో ఒక స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంది టాకొమీటర్ మరియు లో ప్రెజర్ ఇండికేటర్ కూడా దీని పక్క పక్కనే జతచేయబడి ఉంటాయి. పవర్ విండోస్ ఉత్తమ సౌకర్యాన్ని అందిస్తాయి మరియు ప్రయాణికులకు సురక్షతను కల్పిస్తాయి.

లోపలి కొలతలు:
క్యాబిన్ లోపల భారీగా మరియు విశాలంగా దగ్గరగా ఏడుగురు ప్రయాణికులకు సరిపోయే స్థలాన్ని కలిగి ఉంది. దీని యొక్క లోపలి స్థలం ఎక్కువగా విస్తరించి ఉండడం వలన ఫ్యామిలీకి ఎల్లప్పుడూ లగ్జరీగా ఉంటుంది. పొడవుగా, లావుగా మరియు భారీగా ఉండే వ్యక్తులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది దీనిలో సరిపోయేంతగా లెగ్, నీ, షోల్డర్ రూమ్ ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ ఎస్యూవీ రెండు వేరియంట్లలో ఒక 3.0-లీటర్ సీఅర్4 ఇంజిన్ మరియు ఒక టిసిఐసి ఇంజిన్ లను కలిగి ఉంది. సిఆర్4 ఇంజిన్ 2956cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని మరియు దానితో పాటుగా 83hp ఒక పీక్ శక్తి ని, గరిష్టంగా 250Nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఇవన్ని కలిసి ఒక మహత్తరమైన పనితీరును కనబరుస్తుంది. ఇతర వేరియంట్ విషయానికొస్తే, టిసిఐసి మిల్లు అదే స్థానభ్రంశం 2956cc కలిగి ఉంది. ఇది 70hp ఒక గరిష్ట శక్తిని మరియు 223Nm ఒక పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్ లను ఒక 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో అనుసంధానం చేసారు.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహానం లోపలి భాగాలను చూసినట్లయితే, ఇది అనేక విధులు మరియు పరికరాలతో కూడి ఉంది. దీని ముందు భాగంలో విఙ్ఞానంతో రూపకల్పన చేసిన చాలా లక్షణాలు దీనిలో ఉన్నాయి అవి పూర్తి యూఎస్బి తో పాటుగా ఎంపి3 ఫంక్షన్ తో ఒక సిడి ప్లేయర్ మరియు బ్లూటూత్ యంత్రం మరియు స్టీరియో, ఒక మైక్ స్పీకర్ ఫోన్ క్యాబిన్ కి మరింత లగ్జరీని చేకూర్చుతుంది. ఒక సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మరియు ఒక కీలెస్ ఎంట్రీ మరియు అదనపు ఉపకరణాలు వంటి అత్యాధునిక లక్షణాలను కలిగి ఉంది. ఇంకా చూసినట్లయితే, ఇది ఇంకా కొన్ని సాధనాలను కలిగి ఉంది. ఒక టాకొమీటర్, లో ఫ్యుయెల్ ఇండికేటర్ మరియు ఒక వాయిస్ సందేశ వ్యవస్థ వంటి సాధనాలతో కూడి ఉంది.

వీల్స్ పరిమాణం:


ఈ వాహనం యొక్క చక్రాలు 15 అంగుళాల పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఇవి దృఢమైన పట్టును కలిగి మంచి పనితీరును మరియు వేగం సామర్థ్యంను కలిగి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం యొక్క బ్రేకింగ్ వ్యవస్థ అన్ని విధాలుగా సమర్థవంతంగా పని చేసేలా గొప్ప పనితీరు గల బ్రేకింగ్ విధానం దీనిలో పొందుపరిచారు. దీని ముందు బ్రేక్లు ఉత్తమ డిస్కులను కలిగి, బెస్ట్ బ్రేకింగ్ మరియు ఆపే సామర్థ్యంను కలిగి ఉంటాయి. అయితే, రేర్ బ్రేక్స్ కి డ్రమ్స్ ఉన్నాయి. ఇది ఒక మంచి నియంత్రణ సాధ్యం చేసే యంత్రంగా పనిచేస్తుంది. సస్పెన్షన్ సిస్టమ్ కొరకు, ఈ యంత్రాంగం దానికి కావలసిన అన్ని పరికరాలను సేకరించింది. దీని ఫ్రంట్ ఆక్సిల్ డబుల్ విష్బొన్స్ కాయిల్ స్ప్రింగ్స్ మరియు యాంటీ రోల్ బార్లను కలిగి ఉంది. అలాగే, రేర్ యాక్సిల్స్ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ మరియు యాంటీ బార్ తో పాటుగా సాలిస్బరీ టైప్ బీమ్ యాక్సిల్స్ తో ప్రతిభావంతమైన ఉంటాయి. ఇది అత్యుత్తమ నిర్వహణ మరియు స్థిరత్వం కలిగిన అధునాతన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ సిస్టమ్ తో పొందుపరచబడింది .

భద్రత మరియు రక్షణ:


ఇది విస్తృతంగా నిర్మించిన యంత్రం మరియు భద్రత దాని ప్రయాణికుల యొక్క ప్రధాన అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ఉండవలసిన అన్ని మౌలిక సదుపాయాలను ఈ కారు కలిగి ఉంది. ఇది ముందు మరియు వెనుక ఫాగ్ ల్యాంప్స్ ను కొన్ని వేరియంట్స్లో కలిగి ఉంది ఇది డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఒక మెరుగైన ప్రత్యక్షతను కనబరుస్తుంది. దీనికి అదనంగా, ఒక అధునాతన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ సిస్టమ్ కలిసి రైడ్ యొక్క స్థిరత్వం మరియు నిర్వహణ ఎల్లప్పుడూ ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా చేసేందుకు తోడ్పడతాయి. ఇది ఏదైన ప్రమాదాలు జరిగే ముందు కూడా వాటి నుంచి ప్రయాణికులను రక్షిస్తుంది. దీనిలో టైట్ సీట్ బెల్టులు ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతాయి మరియు ఎయిర్బ్యాగ్స్ కూడా ఎప్పుడూ మెత్తగా సౌకర్యవంతంగా ఉంటాయి. దీని బాడీ నిర్మాణం కొంతమేరకు ప్రభావితంగా కొల్లిషన్ శోషణ టెక్నాలజీ తో రూపొందించారు. ఇంకా, డోర్ అజార్ హెచ్చరిక మరియు సీట్ బెల్ట్ రిమేండర్ దీని యొక్క ముఖ్య అంశాలు. అన్ని డోర్లు పక్క వైపు నుంచి ఎవరు ప్రవేశించకుండా సైడ్ ఇన్స్ట్రషన్ బీమ్స్ తో అమర్చారు మరియు అదనపు రక్ల్షణ కోసం సైడ్ కి రక్షణా కవచాలను అమర్చారు. ఒక హై మౌంట్ రేర్ స్టాప్ ల్యాంప్ యంత్రం వాహన వెనుక భాగంలో ఉంది అనగా ఇది రహదారులపైన అనూహ్యమైన పరపతిని అందిస్తుందని అర్థం మరియు ఇది వాహనం మొత్తానికి ఒక చక్కటి ప్రయాణాన్ని మరియు ప్రయాణికులకు ఉత్సాహాన్ని అందిస్తుంది. వీటి వలన ఈ వాహానం చాలా చురుకైనదిగా మరియు భద్రతా లక్షణాలతో కూడి యోగ్యకరమైనదిగా కనిపిస్తుంది.

అనుకూలాలు:


1. దీని వెలుపలి భాగం దృఢమైన నిర్మాణంతో గరుకు రోడ్లపైన కూడా చాలా బాగా నడుస్తుంది.
2. దాని విభాగంలో అద్భుతమైన పనితీరును కలిగి ఉంది.
3. దీనిలో మైలేజ్ మరియు ఇంధన సరఫరా వ్యవస్థ సమర్థవంతంగా ఉంది.
4. అంతర్గత డిజైన్ మరియు అంతర్గత ఉపకరణాలు స్వారీకి అనుకూలంగా ఉన్నాయి.
5. మునుపటి వెర్షన్ కంటే ఇప్పుడు ఉన్న వర్షన్ లో లక్షణాలు మెరుగుపరచబడి దాని మొత్తం నాణ్యతను పెంచాయి.

ప్రతికూలాలు:
1. ఇది దృఢమైన మరియు వెడల్పైన నిర్మాణం వలన భారతదేశ రోడ్లపై అవరోధాలను ఎదుర్కుంటుంది
2.ఈ ట్రిమ్ లో ఒక ఇంజిన్ పనితీరు తక్కువగా ఉండడం వలన యాక్సెలరేషన్ సామర్థ్యం మరియు మైలేజ్ తమ సామర్థ్యాన్ని తక్కువగా చూపిస్తున్నాయి.
3. ఇది చూడడానికి పెద్దదిగా మరియు భారీగా ఉండడం వలన ఆధునికంగా కాకుండా ప్రాచీన కాలం వాహనంలాగా కనబడుతుంది.
4. దీని లోపలి సౌకర్యాలను మెరుగుపరచవలసిన అవసరం ఉంది.
5. ఆకర్షణీయంగా లేదు మరియు ఈ రోజుల్లో తయారయ్యే వాహనాల మాదిరిగా విలాసవంతమైనదిగా లేదు.