టాటా న్యూ-సఫారి

` 9.6 - 10.8 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టాటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టాటా న్యూ-సఫారి వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ఈ తయరీసంస్థ ఆటోమొబైల్ రంగంలో పోటీ పడుతున్న సంస్థల్లో ఒకటి. అనేక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ , ఈ కొత్త టాటా సఫారి ఈ విభాగంలో మహీంద్రా స్కార్పియో, చేవ్రొలెట్ టవేరా, ఫోర్స్ వన్ మరియు ఇతర వాటితో పోటీ పడుతున్నది. సంస్థ ఈ మోడల్ సిరీస్ ని వినియోగదారులు ఎంచుకునేందుకు నాలుగు వేరియంట్లలో అమ్మకాలు చేస్తుంది. అవేమిటంటే ఎల్ ఎక్స్ 4ఎక్స్2 మరియు ఇ ఎక్స్ 4ఎక్స్2. ఈ రెండు వేరియంట్లు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ , 2179సిసి యొక్క స్థానభ్రంశంతో అందుబాటులో ఉంది. ఈ మోటార్ నాలుగు సిలిండర్లు మరియు పదహారు కవాటాలతో జతచేయబడిన (డబుల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్) ఆధారిత వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేయడం ద్వారా దాని పనితీరుని మరింత పెంచుతుంది. ఈ వాహనం డిసి ఓ ఆర్ డీజిల్ మోటార్ తో అమర్చబడి కామన్ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. దీని వలన ఇంధన సామర్ధ్యం పెరుగుతుంది. ఇది ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి 138.1బి హెచ్ పి శక్తి ని మరియు 320ఎన్ ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం యొక్క బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం అన్ని సమయాలలో సంతుల్యంగా మరియు స్థిరంగా ఉంచుతుంది. సంస్థ దీనికి పెద్ద వీల్బేస్ ని మరియు మంచి గ్రౌండ్ క్లెయరెన్స్ ని అందించింది. అలానే సంస్థ ఈ వాహనానికి కఠినమైన బాహ్య రూపాన్ని అసంఖ్యాక విశిష్టతలతో అందించింది. సంస్థ దీని ముందర బాగానికి భారీ రేడియేటర్ గ్రిల్ అందించింది. దాని మధ్యలో ఒక ప్రముఖ కంపెనీ లోగో చిత్రించబడి ఉంటుంది. ఈ గ్రిల్ కి రెండు వైపులా హెడ్లైట్ క్లస్టర్ ఉంటుంది. ఈ హెడ్లైట్ క్లస్టర్ లో హాలోజన్ ల్యాంప్స్ పొందుపరచబడి ఉంటాయి. దాని శరీరం రంగు బంపర్ ఇంజిన్ కూలింగ్ కోసం పెద్ద ఎయిర్ ఇంటేక్ సెక్షన్ ని కలిగి ఉంటుంది. అలానే దీనిలో ఒక జత ఫాగ్ ల్యాంప్స్ అమర్చబడి పొగ మంచు పరిస్థితులప్పుడు ప్రయాణం సులభ సాధ్యం చేస్తుంది. దీనిలో హెడ్లైట్ క్లస్టర్, సొగసైన బోనెట్, అల్లాయి వీల్స్ మరియు స్పోర్టీ పైకప్పు రెయిల్స్ ఇవన్నీ కూడా వాహనాన్ని అద్భుతంగా చేస్తాయి. మరోవైపు, కారు తయారీదారుడు దీనిలో విశాలమైన అంతర్గత కాబిన్ ని అందించారు. ఇది డ్యుయల్ టోన్ కలర్ స్కీమ్ తో, అనేక సౌకర్య లక్షణాలతో అందించబడుతున్నది. ఇది మంచి కుషన్ సీట్లు ఫాబ్రిక్ లెథర్ తో కప్పబడి ఉంటాయి. దాని డాష్బోర్డ్ చాలా మృదువైన మరియు ఒక పెద్ద గ్లోవ్ బాక్స్, ఏ.సి వెంట్లు, ఒక ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ మరియు 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలను కలిగి ఉంది. వీటితో పాటు, కంపెనీ క్యాబిన్ కి ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం ఇవ్వడం కోసం విశేషమైన సౌలభ్యం లక్షణాలు అందించింది. ఈ జాబితా తక్కువ ఇంధన హెచ్చరిక కాంతి, డిజిటల్ ట్రిప్ మీటర్, బయట ఉష్ణోగ్రత డిస్ప్లే, డోర్ అజార్ వార్నింగ్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ మరియు అనేక లక్షణాలను కలిగి ఉంది. కార్ల తయారీదారుడు ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనానికి అనేక సౌకర్యవంతమైన అంశాలను జోడించి ప్రయాణాన్ని సుఖప్రదం చేశారు. ఇంకా వీటిలో ముందు కన్సోల్ కి కప్ మరియు బాటిల్ హోల్డర్, ఫ్రంట్ సీటు బాక్ పాకెట్, సన్ గ్లాస్ హోల్డర్, సెంటర్ కన్సోల్ లో అనలాగ్ క్లాక్, లంబర్ స్పోర్ట్ తో ముందరి సీట్లు, ముందు కన్సోల్ లో సిగరెట్ లైటర్ మరియు యాష్ ట్రే అందించడం జరుగుతుంది. దీనిలో మాన్యువల్ హెచ్ విఎ సి (తాపన, ప్రసరణ మరియు ఎయిర్ కండిషనింగ్) యూనిట్ వెనుక ఏసీ వెంట్లతో కాబిన్ ఎయిర్ ని నియంత్రిస్తుంది. దీని దృఢమైనశరీర నిర్మాణం సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ మరియు క్రుంపుల్ జోన్స్ కారణంగా తాకిడి సమయంలో కాబిన్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. వీటితో పాటు, ఇది కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్, సీటు బెల్టులు, డ్రైవర్ సీటు బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ తో ప్రయాణికులందరికీ సీటు బెల్ట్లు మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. ఈ లక్షణాలు అన్నీ కలిసి దాని విభాగంలో ఈ వాహనాన్ని సౌకర్యవంతమైన మరియు సురక్షితమైనదిగా చేస్తుంది. మరోవైపు, ఇది రెండు సంవత్సరాలు లేదా 75000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ తో అనుబాటులో ఉంది. ఈ రెండిటిలో ఏది ముందు పూర్తి అయినా మొత్తం వారంటీ ముగిసినట్లే.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం డిసి ఓ ఆర్ డీజిల్ మోటార్ తో అమర్చబడి కామన్ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. దీని వలన ఇంధన సామర్ధ్యం పెరుగుతుంది. ఇది నగర పరిధిలో 8.32kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఇది హైవేస్ పైన 11.57kmpl మైలేజ్ ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది భారతదేశం యొక్క ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ ద్వారా సర్టిఫికేట్ చేయబడింది.

శక్తి సామర్థ్యం:


ఈ డబుల్ ఓవర్ హెడ్ కామ్ ఆధారిత డీజిల్ పవర్ ప్లాంట్, ఒక వేరియబుల్ టర్బైన్ టెక్నాలజీ (వి టిటి) తో వస్తూ గరిష్టంగా 4000rpm వద్ద 138.1bhp గరిష్ట శక్తి ని ఉత్పత్తి చేస్తుంది. అలానే 1700 నుండి 2700rpm వద్ద 320Nm టార్క్ ని అందిస్తుంది. ఇది భారతీయ రహదారి మరియు ట్రాఫిక్ పరిస్థితులకు చాలా అనుగుణంగా ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ 2179సిసి డీజిల్ ఇంజిన్ సింక్రోమెష్ ఓవర్డ్రైవ్ ఆధారిత 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉత్తమమైన త్వరణం మరియు పికప్ ని అందిస్తుంది. ఇది గరిష్టంగా 150 నుండి 160 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు. అదే సమయంలో, అది 16 సెకన్లులో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


దీని డిజైనర్లు చాలా నైపుణ్యంతో దీని బాహ్య భాగాలను తీర్చిదిద్దారు. దీని వలన కారు రోడ్ పైన చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఎంచుకునేందుకు చాలా బాహ్య పెయింట్ ఎంపికల్లో అందుబాటులో ఉంది. మొత్తం శరీర నిర్మాణం కఠినమైనది మరియు దాని ఫ్రంటేజ్ బోల్డ్ మరియు దూకుడుగా కనిపిస్తుంది. పక్క ప్రొఫైల్ తో ప్రారంభిస్తే, ఈ ఎస్ యు వి బాడీ రంగు డోర్ హ్యాండిల్స్ మరియు బాహ్య వెనుక వీక్షణ అద్దాలతో ఉంది. దీని ఎగువ శ్రేణి వేరియంట్లో మిర్రర్స్ యాంత్రికంగా సర్దుబాటు చేసే విధంగా ఉండి సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో పొందుపరచబడి ఉన్నాయి. ఇది చిన్న నష్టాల నుండి పక్కభాగాన్ని రక్షించేందుకు సైడ్ క్లాడింగ్స్ ని కలిగి ఉంటాయి. దీనిలో ఎ మరియు బి స్తంభాలు విండో సిల్ తో పాటూ నలుపు రంగుతో ఫినిషింగ్ చేయబడి ఉంటాయి. దీని వీల్ ఆర్చులు అల్లయి వీల్స్ తో అమర్చబడి సైడ్ ప్రొఫైల్ ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఈ రిమ్స్ ఎటువంటి రహదారి పరిస్థితులలోనైనా ఉన్నతమైన పట్టును అందించేందుకు అధిక పనితీరు గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లు తో కప్పబడి ఉంటాయి. దీని ముందరి భాగానికి వస్తే, విలక్షణముగా రూపకల్పన రేడియేటర్ గ్రిల్ ని క్రోమ్ స్లాట్స్ తో కలిగి ఉంది. ఇది మధ్యలో ఒక ప్రముఖ కంపెనీ లోగో తో పొందుపరచబడింది. దీనిలో గ్రిల్, హెడ్లైట్ క్లస్టర్ తో ఉంటుంది. ఈ హెడ్లైట్ క్లస్టర్ లో అధిక తీవ్రత హాలోజన్ ల్యాంప్స్ మరియు సైడ్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. కొంచెం కిందకి వెళితే, దీని బంపర్స్ శరీర రంగులో ఉండి సిల్వర్ క్లాడింగ్ తో కలిసి చిన్న నష్టాల భారి నుండి వాహనాన్ని రక్షిస్తాయి. ఈ బంపర్ త్వరగా ఇంజిన్ కూలింగ్ కోసం విస్తృత గాలి ఆనకట్ట కలిగి ఉంటుంది. దీని ఎగువ శ్రేణి వేరియంట్లలో ఒక జత రేడియంట్ ఫాగ్ ల్యాంప్స్ ఉండి పొగ మంచు పరిస్థితులలో డ్రైవర్ కి అనుకులంగా ఉంటుంది. దీని ముందరి విండ్స్క్రీన్ దళసరి లామినేటెడ్ గ్లాస్ మరియు రెండు అడపాదడపా వైపర్స్ తో అమర్చబడి ఉంటుంది. అదే సమయంలో దాని రేర్ ఎండ్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది. ఈ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ హాలోజెన్ ఆధారిత రివర్స్ మరియు బ్రేక్ లైట్లు సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అందుబాటులో ఉన్నాయి. దీనిలో పెద్ద టెయిల్ గేట్ క్రోమ్ తో కూర్చబడిన బాడ్జింగ్ మరియు ఒక మందపాటి క్రోమ్ స్ట్రిప్ తో చిత్రించబడి ఉంటుంది. ఇంకా దీనిలో బాడీ రంగు బంపర్ ఒక జత రిఫ్లెక్టర్లను కలిగి ఉన్నాయి. దీనిలో పెద్ద విండ్స్క్రీన్ డీఫాగర్ మరియు వైపర్ తో పొందుపరచబడి ఉంటుంది. వీటి అధిక శ్రేణి వేరియంట్లలో స్పోర్టి రేర్ స్పాయిలర్ అధిక మౌంట్ బ్రేక్ ల్యాంప్ తో పాటు భద్రత కొరకు అందుబాటులో ఉంది. ఇది శైలీకృత రూఫ్ రెయిల్స్ తో జతచేయబడి చాలా స్పోర్టీ లుక్ ఇస్తుంది.

వెలుపలి కొలతలు:


ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం యొక్క మొత్తం కొలతలు చాలా ఆధునికమైనవి మరియు సులభంగా ఏడుగురు ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 4650mm , వెడల్పు 1918mm మరియు ఎత్తు 1925mm. దీనిలో హెడ్ రూమ్ పుష్కలంగా అందించబడుతుంది. దీని గ్రౌండ్ క్లెయరెన్స్ 205mm కలిగియుండి మైధాన ప్రాంతాలలో కూడా సులభంగా ప్రయాణించగలదు. దీని వీల్ బేస్ 2650mm కలిగి ఉండి విశాలమైన క్యాబిన్ ను అందిస్తుంది. దీని స్టీరింగ్ వీల్ టర్నింగ్ వ్యాసార్ధం 6 మీటర్లు.

లోపలి డిజైన్:


సంస్థ ఈ ఎస్ యు వి సిరీస్ కి డ్యుయల్ టోన్ అంతర్గత క్యాబిన్ ని అందించింది. ఇది చాలా విశాలంగా అనేక అంశాలను కలిగి ఉంది. ఇది ఒక మృదువైన డాష్బోర్డ్ ని కలిగి వాటిపై అనేక అంశాలను చేర్చబడింది. అవేమిటంటే, గ్లోవ్ బాక్స్, ఏ.సి వెంట్లు, ఒక ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ మరియు సెంటర్ లో కంపెనీ చిహ్నంతో 3 స్పోక్ స్టీరింగ్ వీల్ దీనిలో ఉన్నాయి. సీటింగ్ పరంగా, ఇవి ధృడంగా రూపొందించబడిన విశాలమైన కుషన్ సీట్లను అందిస్తుంది. అంతేకాకుండా తగినంత లెగ్ స్పేస్ మరియు హెడ్రూం ని అందిస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతం చేస్తుంది. ఈ సీట్లు ప్రవేశ స్థాయిలో ప్రీమియం ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. అదే ఇ ఎక్స్ వేరియంట్లో డ్యుయల్ టోన్ (లేత గోధుమరంగు మరియు డార్క్ గ్రాఫైట్) రంగు స్కీమ్ లో అందుబాటులో ఉంది. మధ్య వరుసలో సీట్లు మడత వేయగల ఫంక్షన్ తో వస్తాయి. దీని వలన బూట్ స్పేస్ ని మరింతగా పెంచవచ్చు. అంతేకాకుండా డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు చేసుకునే ఫంక్షన్ దీనిలో అందుబాటులో ఉండడం వలన డ్రైవర్ కు చాలా సదుపాయంగా ఉంటుంది. ఇది గేర్ షిఫ్ట్ నాబ్ మరియు పార్కింగ్ లివర్ తో పాటు లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ప్రకశించే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కాంతి సర్దుబాటు చేసుకొనే ఫంక్షన్ తో వస్తుంది. అంతేకాకుండా ఇది అనేక నోటిఫికేషన్లు మరియు హెచ్చరికలు డ్రైవర్ ని అప్డేట్ చేయడం కోసం అందించబడినవి. ఈ జాబితా తక్కువ ఇంధన హెచ్చరిక కాంతి, డిజిటల్ ట్రిప్ మీటర్, బయట ఉష్ణోగ్రత డిస్ప్లే, డోర్ అజార్ వార్నింగ్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ మరియు అనేక లక్షణాలను కలిగి ఉంది. కార్ల తయారీదారుడు ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనానికి అనేక సౌకర్యవంతమైన అంశాలను జోడించి ప్రయాణాన్ని సుఖప్రదం చేశారు. ఇంకా వీటిలో ముందు కన్సోల్ కి కప్ మరియు బాటిల్ హోల్డర్, ఫ్రంట్ సీటు బాక్ పాకెట్, సన్ గ్లాస్ హోల్డర్, సెంటర్ కన్సోల్ లో అనలాగ్ క్లాక్, లంబర్ స్పోర్ట్ తో ముందరి సీట్లు, ముందు కన్సోల్ లో సిగరెట్ లైటర్ మరియు యాష్ ట్రే అందించడం జరుగుతుంది. వీటితో పాటూ 12వి పవర్ సాకెట్ ముందు మరియు మధ్య వరుసలో ఎలక్ట్రానిక్ పరికరాల చార్గింగ్ కొరకు అందించబడుతుంది. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఉండడం వలన భారీ ట్రాఫిక్ పరిస్థితులలో ప్రయాణం సజావుగా నడుస్తుంది. అంతేకాకుండా అగ్ర శ్రేణి వేరియంట్లో పైకప్పు పైన ల్యాంప్ వుండడం వలన వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

లోపలి సౌకర్యలు:


ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకుగానూ తయరీదారుడు రెండు వేరియంట్లలో అనేక సౌకర్యవంతమైన లక్షణాలను అందించారు. దీనిలో మాన్యువల్ హెచ్ విఎ సి (తాపన, ప్రసరణ మరియు ఎయిర్ కండిషనింగ్) యూనిట్ వెనుక ఏసీ వెంట్లతో కాబిన్ ఎయిర్ ని నియంత్రిస్తుంది. ఇది డస్ట్ మరియు పోలెన్ ఫిల్టర్ ని కాబిన్ ఎయిర్ శుద్ధి చేసేందుకు కలిగి ఉంటుంది. దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్ ఒక ఆధునిక సంగీతం వ్యవస్థ తో అందజేయబడి ఉంది. ఈ వ్యవస్థ సిడి / ఎం పి3 ప్లేయర్, యు ఎస్ బి ఇంటర్ఫేస్, పోర్ట్ ఆక్స్-ఇన్ పోర్ట్ కి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది నాలుగు స్పీకర్లను ధ్వని పంపిణీ కొరకు అందిస్తుంది. ఇది మరింత సామాను పెట్టుకునేందుకు 60:40 స్ప్లిట్ మరియు పూర్తిగా ను మడత వేయగల సీట్లను మధ్య వరుసలో కలిగి ఉంది. వీటితో పాటు, అది ఒక వెనుక వాష్ మరియు వైప్ ఫంక్షన్ ( ఇఎక్స్ వేరియంట్ కొరకు మాత్రమే) అందుబాటులో ఉంది. అంతేకాకుండా అన్ని నాలుగు పవర్ విండోస్, డ్రైవర్ వైపు ఆటో డౌన్ ఫంక్షన్, విద్యుత్తో సర్దుబాటు బాహ్య వెనుక వీక్షణ అద్దాలు, ముందు సీట్లు కోసం మూడు స్థానం లంబర్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇంకా దీనిలో టిల్ట్ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ వ్యవస్థ ఉండడం వలన ట్రాఫిక్ పరిస్థితుల సమయంలో చాలా సదుపాయంగా ఉంటుంది. దీనిలో ప్రయాణికులు కూర్చునే అన్ని సీట్లకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఆర్మ్రెస్ట్ మరియు సీట్ బెల్ట్లు అందించబడుతున్నది. వీటితోపాటు, అధనంగా టిల్ట్ అడ్జస్టబుల్ ఫంక్షన్ తో పవర్ స్టీరింగ్, ఫాలోమీ హెడ్ల్యాంప్స్, ముందరి తలుపులపై పడుల్ ల్యాంప్స్, కార్గో ఏరియా లైట్, ప్రకాశవంతమైన జ్వలన కీ స్లాట్ మరియు విండో వైండింగ్ స్విచ్లులను అందిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ కలిసీ ఈ ఎస్ యు వి లో ప్రయాణాన్ని చిరస్మరణీయ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. క్యాబిన్ కూడా డ్రైవర్ సౌలభ్యం స్థాయి పెంచేందుకు యాంటీ గ్లారే అంతర్గత రేర్ వ్యూ అద్దం తో కలిసి ఉంటుంది. ముందు విండ్స్క్రీన్ వైపర్స్ టూ స్పీడ్ సెట్టింగ్లను కలిగి ఉంటుంది. రిమోట్ ఆపరేటెడ్ ఇంధన ట్యాంక్ లిడ్ ఓపెనర్, ముందు మరియు రేర్ క్యాబిన్ ల్యాంప్స్ , ఫ్రంట్ సన్ విజర్స్ మరియు ఒక పవర్ స్టీరింగ్ వీల్ వంటి ఇతర అంశాలను కలిగి ఉంది. దీని ఖరీదైన అంతర్గత భాగాలు విలాసవంతమైన స్థలం అందించడంలో సహాయపడతాయి.

లోపలి కొలతలు:


సీటింగ్ అమరిక చాలా సౌకర్యంగా హెడ్, షోల్డర్ తో పాటుగా పుష్కలమైన లెగ్ స్పేస్ అందిస్తుంది. ఇది ముందరి ప్రయాణికుల కొరకు 1000mm హెడ్ స్పేస్, వెనుక కూర్చునే ప్రయాణికుల కొరకు 970mm హెడ్ స్పేస్ అందుబాటులో ఉంది. లెగ్రూం గరిష్టంగా 2020mm మరియు తక్కువగా 1030mm లెగ్రూం ఉండడం గొప్ప విశేషం. ఈ యుటిలిటీ వాహనాలు గరిష్టంగా 880mm మరియు కనిష్ఠంగా 680mm మోకాళ్ళ రూం అందుబాటులో ఉంది. లగేజ్ కంపార్ట్మెంట్ సామర్థ్యం 981 లీటర్లు. దీని వెనుక సీట్లు మడవడం ద్వారా దీని సామర్ధ్యాన్ని మరింత పెంచవచ్చు. ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకుగానూ సంస్థ దీనికి 65 లీటర్ల ఇంధన సామర్ధ్యాన్ని అందించింది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


పైన చెప్పిన విధంగా, ఈ స్టైలిష్ మోడల్ సిరీస్ 2.2-లీటర్, డిసిఓ ఆర్ డీజిల్ ఇంజన్ తో అమర్చబడి 2179సిసి స్థానభ్రంశాన్ని అందిస్తుంది. ఈ మోటార్ నాలుగు సిలిండర్లు మరియు పదహారు కవాటాలతో జతచేయబడిన (డబుల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్) ఆధారిత వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేయడం ద్వారా దాని పనితీరుని మరింత పెంచుతుంది. వేరియబుల్ టర్బైన్ టెక్నాలజీ సహాయంతో ఈ డీజిల్ ఇంజిన్ 4000rpm వద్ద గరిష్టంగా 138.1bhp శక్తిని ఉత్పాత్తి చేస్తుంది మరియు 1700 నుండి 2000rpm వద్ద 320Nm టార్క్ ని అందిస్తుంది. దీని వలన ఎటువంటి రహదారులలోనైనా పనితీరు సమర్ధవంతంగా ఉంటుంది. ఈ ఇంజిన్ ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి దాని ముందు చక్రాలకు శక్తిని పంపిణీ చేస్తుంది. ఇది ఒక సాధారణ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ చేర్చబడి సమర్ధవంతమైన ఇంధన సరఫరా అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


వాహన తయారీదారుడు దీని ఇఎక్స్ వేరియంట్ కి ఒక ఆధునిక సంగీతం వ్యవస్థను అమర్చారు. ప్రయాణికుల ప్రయాణం అంతటా ప్రీమియం ధ్వని అనుభవం ఇవ్వడం కోసం నాలుగు స్పీకర్లను అందిస్తున్నారు. ఈ ఆడియో యూనిట్ సిడి / ఎం పి3 ప్లేయర్, ఎ ఎం / ఎఫ్ ఎం ట్యూనర్, యు ఎస్ బి ఇంటర్ఫేస్ మరియు పోర్ట్ ఆక్స్ ని కూడా అందిస్తుంది. బేస్ వేరియంట్లో అనేక లక్షణాలు లేకపోవచ్చు. కానీ కొనుగోలుదారులు శక్తివంతమైన సీటు కవర్లు, ప్రీమియం నాణ్యత గల అపోలిస్ట్రీ, ఒక అధునాతన మ్యూజిక్ సిస్టమ్, లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, ఫ్లోర్ మ్యాట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు అనేక ఇతర లక్షణాలతో అలంకరించవచ్చు. అదే సమయంలో, యజమానులు కూడా మడ్ గార్డ్, శరీరం గ్రాఫిక్స్, రేర్ స్పాయిలర్, ప్రొటెక్టివ్ క్లాడింగ్, ఓఆర్ విఎం ఎస్ పైన టర్న్ ఇండికేటర్ మరియు అనేక ఇతర అంశాలను ఎంచుకోవచ్చు. మరోవైపు, దాని వెలుపల కూడా అది పైకప్పు సామాను క్యారియర్, పైకప్పు స్పాయిలర్ మరియు మిశ్రమ లోహ చక్రాలు సమితి వంటి కొన్ని ఇతర అంశాలు అనుకూలీకరించవచ్చు.

వీల్స్ పరిమాణం:


వీటిలో వీల్ ఆర్చులు 16 అంగుళాల అలాయ్ వీల్స్ సమితితో బిగించబడి పక్క ప్రొఫైల్ లుక్ పెంచుతుంది. ఈ రిమ్స్ మరింత 235/70 R16, 105 Sపరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి దేశవ్యాప్తంగా ఎటువంటి రోడ్లపైన అయినా మంచి పట్టు ని అందిస్తుంది. వీటితో పాటు, ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం యొక్క అన్ని వేరియంట్లకి పూర్తి పరిమాణం గల విడి చక్రాన్ని ఒక ప్రామాణిక ఫీచర్ గా అందిస్తుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


సంస్థ ఈ వాహనానికి నమ్మకమైన సస్పెన్షన్ సిస్టమ్ తో పాటు సమర్ధవంతమైన బ్రేకింగ్ విధానాన్ని అమర్చింది. దీని ద్వారా వాహనం అన్ని వేళలా స్థిరంగా ఉంటుంది. దీని ముందు ఆక్సిల్ టార్షన్ బార్ ని కలిగినటువంటి ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ టైప్ మెకానిజంతో అమర్చబడి ఉంటుంది. దీని వెనుక ఆక్సిల్ ఫైవ్ లింక్ సస్పెన్షన్ తో సమావేశమై కాయిల్ స్ప్రింగ్స్ తో కలిసి సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. మరోవైపు, ఇది వాక్యుమ్ నియంత్రణ ఇండిపెండెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అమర్చబడి వాహనాన్ని ఎటువంటి పరిస్తితుల లోనైనా సులువుగా నియంత్రించగలదు. దీని ముందరి వీల్స్ వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లు సమితి తో జత చేయబడి ఉండగా, దీని వెనుక వీల్స్ ఆటో సర్దుబాటు రకం సంప్రదాయ డ్రమ్ బ్రేక్లు సమితితో పొందుపరచబడినవి. ఇది చాలా బాధ్యతాయుతంగా మరియు సులభంగా నిర్వహణ చేయగలిగే పవర్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ తో అందించబడుతున్నది. ఈ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఆరు మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధం కలిగి ఉంది.

భద్రత మరియు రక్షణ:


ఈ మోడల్ అనేక భద్రతా లక్షణాలతో చేర్చబడి ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతుంది. ఇది అందరి ప్రయాణికులకు సీట్ బెల్ట్ ని అందించి ప్రామాదం జరిగినపుడు ఏర్పడే అవరోధాలను తగ్గిస్తుంది. ఇది డ్రైవర్ ని హెచ్చరించేందుకు గానూ డ్రైవర్ సీట్ బెల్ట్ రెమైండర్ నోటిఫికేషన్ ని ఇన్స్ట్రుమెంటల్ పానెల్ పైన ఉంచుతుంది. దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్ ఒక ఆధునిక ఇంజిన్ ఇమ్మొబలైజర్ ని కలిగి ఉండి వాహనం నుండి అనధికార ఎంట్రీని తొలగిస్తుంది. దీని దృఢమైన శరీర నిర్మాణం క్రుంపుల్ జోన్ల తో పాటు సైడ్ ఇంపాక్ట్ బార్లు తాకిడి సమ్యంలో క్యాబిన్ లోపల ఉండే ప్రయాణికులను రక్షించేందుకు ఉపయోగపడతాయి. వీటితో పాటు, ఇది యాంటీ గ్లారే అంతర్గత రేర్ వ్యూ మిర్రర్, డోర్ ఓపెన్ వార్నింగ్ మరియు ఇన్స్ట్రుమెంటల్ పానెల్ పైన హెడ్ల్యాంప్ నోటిఫికేషన్, కొలాప్సబల్ స్టీరింగ్ కోలమ్, స్పష్టమైన లెన్స్ ఫాగ్ ల్యాంప్స్, ట్యూబ్ లేని రేడియల్ టైర్లు, మోటారు హెడ్ల్యాంప్ అడ్జస్టబుల్ ఫంక్షన్ మరియు కొన్ని ఇతర అంశాలను అందిస్తున్నది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లో ఇవి మాత్రమే కాకుండా రివర్స్ గైడ్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఈ అంశాలన్నీ కలిపి వాహనాన్ని సురక్షితంగా ఉంచుతున్నాయి.

అనుకూలాలు:


1.ఏ రహదారి పరిస్థితులలోనైనా చాలా స్థిరంగా మరియు చురుకైనదిగా ఉంటుంది.
2. సర్వీస్ నెట్వర్క్ చాలా సంతృప్తినిస్తుంది.
3. బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం చాలా విశ్వసనీయమైనది.
4. అన్ని వర్గాల వారికి అనుకూలమైన ధర ఉండడం ఒక ప్రతికూలత.
5. 205mm గల మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్-రోడింగ్ ని అది సామర్థ్యం చేస్తుంది.

ప్రతికూలాలు:


1. ఇంధన సామర్థ్యం అంత మెరుగుగా లేకపోవడం అనేది అసౌకర్యం.
2. అనేక ఇతర భద్రత మరియు సౌకర్యం అంశాలను జోడించవచ్చు.
3. బాహ్య రూపాన్ని మరియు అంతర్గత నమూనా ఇప్పటికీ అభివృద్ధి చేయవచ్చు.
4. ప్రవేశ స్థాయిలో వేరియంట్లో సంగీతం వ్యవస్థ లేకపోవటం ఒక పెద్ద మైనస్ పాయింట్.
5. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ జోడించి లేకపోవడం ఒక ప్రతికూలత.