టాటా నానో

` 2.2 - 3.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టాటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టాటా నానో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
టాటా మోటార్ గ్రూప్ ఆటోమొబైల్ మార్కెట్లో దాని అత్యంత సరసమైన కారు మోడల్ నానో ఫేస్లిఫ్ట్ వెర్షన్ ని ప్రారంభించింది. ఈ నానో కొత్త తరం నానో జెనెక్స్ ఆధునిక లక్షణాలతో, ఆకర్షణీయమైన లుక్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సంస్థ ఈ హాచ్బాక్ ని మూడు సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అభివృద్ధి చేస్తుంది. అవేమిటంటే, డిజైన్ నెక్స్ట్, డ్రైవ్ నెక్స్ట్ మరియు కనెక్ట్ నెక్స్ట్. తయారీదారుడు ఇప్పటికే ట్విస్ట్ పరిధిని నిలిపి వేశారు. అయినప్పటికీ మిగిలి పోయిన కొన్ని మోడళ్ళు రాయితీ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, దాని సి ఎన్ జి ట్రిమ్ నిరంతరం అందుబాటులో ఉంటుంది. కానీ ఎటువంటి నవీకరణను పొందలేదు. కొత్తగా ప్రారంభించబడినటువంటి ఈ మోడల్ కొత్త ఇన్ఫినిటీ డిజైన్ థీమ్ తో చాలా నూతనంగా కనిపిస్తుంది. దీని ముందరి బంపర్ కి ఒక స్మైలీ ముఖం పోలినటువంటి ఫెర్ఫోరేటెడ్ రేడియేటర్ గ్రిల్ ఉంది. ఇంకా దీనిలో ఒక జత ఫాగ్ ల్యాంప్స్ వృత్తాకార ఆకారంలో కలవు. అలానే దీని హెడ్లైట్ క్లస్టర్ బ్లాక్ బెజిల్ లైట్స్ కలిగియున్న స్మోక్డ్ హెడ్ల్యాంప్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఇది రెండు వైపులా బయట వెనుక వీక్షణ మిర్రర్స్ తో అమర్చబడి ఉంది. అదే సమయంలో, ఒక క్రోమ్ స్ట్రిప్ తో కలిసియున్న బూట్ లిడ్ ఒక స్పోర్టీ లుక్ ఇస్తుంది. ఈ కారు వినియోగదారులకు రెండు బాడీ పెయింట్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఒకటి పెర్షియన్ రోజ్ మరియు సంగీరియా ఎరుపు రంగులో అందుబాటులో ఉన్నాయి. దీని అంతర్భాగానికి వస్తే ఈ హాచ్బాక్ చాలా ఆకర్షణీయంగా మరియు అత్యుత్తమ లక్షణాలతో అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు తగినంత లెగ్ మరియు షోల్డర్ స్పేస్ కలిగినటువంటి ఉత్తమమైన క్యాబిన్ స్పేస్ అందుబాటులో ఉంది. కాక్పిట్ కొత్త తరం టాటా స్టీరింగ్ వీల్ తో అందుబాటులో ఉంది. దీని డాష్బోర్డ్ పైన స్టైలిష్ సెంటర్ కన్సోల్ మరియు రౌండ్ ఆకారంలో ఎయిర్ కండిషనింగ్ వెంట్లు అమర్చబడి ఉన్నాయి. దీనిలో ఇన్స్ట్రుమెంట్ పానెల్, డిజిటల్ ఇంధన గేజ్, గడియారం అలాగే ఇంధన వినియోగం ప్రదర్శనతో అమర్చబడి ఉంటుంది. దీనిలో సీటింగ్ అమరిక చాలా అద్భుతంగా అధిక స్థాయి సౌకర్యాన్ని అందిస్తాయి. అవుట్గోయింగ్ మోడళ్ళను పోలిస్తే ఈ కొత్తగా ప్రారంభించిన ట్రిమ్ ఇప్పుడు, 110 లీటర్ల పెరిగిన బూట్ వాల్యూమ్ ని కలిగి ఉంది. అదే సమయంలో, ఈ బూట్ వాల్యూమ్ ని 24 లీటర్ల వరకూ పెంచవచ్చు. ఈ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ని సపోర్ట్ చేసే ఆధునిక వెర్షన్ ఆడియో యూనిట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది ఉత్తమమైన డిజిటల్ సమాచార ప్రదర్శనను కూడా కలిగి ఉంది. వీటితో పాటు, వాతావరణ నియంత్రణతో పాటూ గాలి కండిషనింగ్ యూనిట్ , శక్తి అవుట్లెట్, ఫ్రంట్ పవర్ ఆపరేటెడ్ విండోస్ మరియు కొన్ని ఇతర అంశాలు సౌలభ్యం కోసం చేర్చబడ్డాయి. అలానే దీనిలో అత్యంత భద్రతా అంశాలు కూడా ప్రయాణికుల భద్రత కొరకు చేర్చబడినవి. దీని ముందర మరియు వెనుక కూర్చునే ప్రయాణికుల రక్షణ కొరకు భద్రతా బెల్ట్లు అందించడం జరిగింది. ఇది 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మూడు 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో అమర్చబడి ఉంటాయి మరియు ఒకటి 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతున్నది. దీని పెట్రోల్ ఇంజిన్ 624సిసి స్థానభ్రంశం మరియు 51Nm టార్క్ ని అందిస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ చిన్న కారు యొక్క ఇంజన్, ఒక బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థ తో జత చెయబడి ఉంటుంది. ఈ వాహనాలు మాన్యువల్ వెర్షన్ లో గరిష్ట్టంగా 23.9 kmpl మైలేజ్ ను అందిస్తాయి. మరోవైపు, ఈ వాహనాలు ఇండియా యొక్క ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ఏఆర్ఏఐ) ప్రకారం, ఆటోమేటిక్ వెర్షన్ అత్యధికంగా 21.9 kmpl మైలేజ్ ను అందిస్తాయి. మరోవైపు, ఈ వాహనాల యొక్క సిఎంజి వేరియంట్, సుమారు 36 కి.మీ / కేజి మైలేజ్ ను ఇవ్వగలుగుతుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహనాల యొక్క 0.6 లీటర్ పెట్రోల్ ఇంజన్, అత్యధికంగా 5500 rpm (+/- 250) వద్ద 37.66 bhp పవర్ ను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో, ఈ ఇంజన్ 4000 rpm (+/- 500) వద్ద 51 Nm గల శిఖర టార్క్ అవుట్పుట్ ఇస్తుంది. మరోవైపు, దీని సిఎంజి వెర్షన్ అత్యధికంగా, 32.5 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 45 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనాల ఇంజన్, 4- స్పీడ్ మాన్యువల్ మరియు 5- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనాలు 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 29.7 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనాలు అత్యధికంగా 105 kmph వేగాన్ని చేరుకోగలవు.

వెలుపలి డిజైన్:


ఈ టాటా నానో, ఒక కొత్త సెట్ ఆఫ్ కాస్మటిక్ మార్పులతో అందమైన రూపాన్ని సొంతం చేసుకుంది. ఈ కొత్త నానో యొక్క బాహ్య ఆకృతి మరియు చాసిస్ అవుట్గోయింగ్ మోడల్ వలే కనిపిస్తాయి. కానీ, ఈ కొత్త వాహనానికి కొన్ని లక్షణాలు చేర్చడం వలన ఈ వాహనం ఒక కొత్త లుక్ ను సొంతం చేసుకోగలిగింది. నవీకరించబడిన ముందు రెండు బంపర్లు దీనిలో అమర్చారు. అంతేకాకుండా, ఇప్పుడు స్మైలీ ఆకారంలో ఉండే ఫెర్ఫోరేటెడ్ మెష్ తో రూపొందించారు. అదే సమయంలో, దాని ఫెండర్లు ఒక చిన్న సర్దుబాటు ను కలిగి ఉంటాయి. దీని వలన ఒక కర్వ్ ఆకృతి ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ కొత్త వాహనం దాని మునుపటి మోడల్ వలె ఒకే విధంగా ఉంది. ఈ సరికొత్త మోడల్ లో మోనట్ పై నిగనిగలాడే నలుపు స్ట్రిప్స్ అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా, వెనుక టైల్ గేట్ పై కూడా మంచి లుక్ ను ఇవ్వడానికి వీటిని జోడించారు. అంతేకాకుండా క్రోం ప్లేట్ తో కూడిన కంపెనీ స్ట్రిప్ బోనెట్ పై అమర్చారు. దాని పూర్వ భాగం వలెనే, ఈ తాజా వెర్షన్ లో ప్రామాణికంగా 12-అంగుళాల స్టీల్ రిమ్స్ అందించబడ్డాయి. మరియు ఈ రింలు ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లు తో కప్పబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ మరియు డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ లో ఉంటాయి. అయితే, ఈ వాహనం యొక్క విండో ఫ్రేమ్లను మరియు బి స్తంభాలు బ్లాక్ కలర్ తో అలంకరించి ఉంటాయి. అయితే, ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ లలో మాత్రమే కాస్మటిక్ ఫీచర్లు అందించబడ్డాయి. వీటితో పాటు, అన్ని ఇతర బాహ్య అంశాలు కూడా దాని అవుట్గోయింగ్ మోడల్ నుండి తీసుకోబడ్డాయి.

వెలుపలి కొలతలు:


ఈ వాహనాల వెలుపలి కొలతలు గురించి మాట్లాడటానికి వస్తే, దీని యొక్క పొడవు ఇప్పుడు 3164 మిల్లీ మీటర్లు, వెడల్పు 1750 మిల్లీ మీటర్లు (వెలుపలి మిర్రర్స్ తో కలిపి), దీని యొక్క ఎత్తు 1652 మిల్లీ మీటర్లు, అంటే ఆకర్షణీయమైన ఎత్తు ను కలిగి ఉంటుంది. ఈ వాహనాల యొక్క వీల్బేస్ 2230 మిల్లీ మీటర్లు మరియు కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీ మీటర్లు ఇది మంచి గణనీయంగా ఉంది. మరోవైపు, ఈ వాహనాల యొక్క సిఎంజి వేరియంట్ యొక్క కొలతలు నానో వలే ఉంటాయి, ఇప్పటికి ఏ నవీకరణలను కలిగి లేదు.

లోపలి డిజైన్:


దీని అంతర్భాగాలు బాగా అవసరమైన అన్ని సౌకర్యాలతో అమర్చబడి ఉంది. సౌకర్యాలే కాకుండా డిజైనర్లు క్యాబిన్ ని ఆకర్షణీయంగా ఉంచేందుకు గొప్ప శ్రద్ధ వహిస్తున్నారు. సీట్లు అన్నీ కుషన్ తో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ కవరింగ్ రెండు ఎంపికలలో అందుబాటులో ఉంది. దీనిలో బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు ఎబానీ నలుపు రంగు స్కీమ్ లో అలానే ఉన్నత శ్రేణి వేరియంట్లలో కలర్ ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో అందుబాటులో ఉంది. డోర్ వేరియంట్లో కూడా అదే ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. డాష్బోర్డ్ విషయానికి వస్తే, దీని ముందు దాని లానే ఉంటుంది కానీ మెటాలిక్ చేరికలతో అలంకరించబడి ఉంది. దీని సెంటర్ ఫేసియా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కారు లోపల ఇరువైపులా గ్లోవ్ బాక్స్ ఉండడం వలన మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ గ్లోవ్ బాక్స్ లు స్పీకర్లతో అమర్చబడి ఉంటాయి. మిగతా రెండు స్పీకర్లు రియర్ పార్సిల్ షెల్ఫ్ లోకి బిగించి ఉంటాయి. ఈ అధునాతన ఫేస్లిఫ్ట్ వెర్షన్లో స్టీరింగ్ వీల్ పరిమాణం పెద్దదిగా 3 స్పోకులను కలిగిఉంటుంది. అంతేకాక, ఈ చిన్న కారు లో ఒక ప్రామాణిక లక్షణం ఏమిటంటే ఏంపిస్టీం సంగీత వ్యవస్థ నాలుగు స్పీకర్లతో అందుబాటులో ఉంది. ఇవి సమన్వయ బెజెల్ తో అలంకరించబడి ఉంది. దీని ముందరి దానిలో కూడా ఈ లక్షణం ఉంది.

లోపలి సౌకర్యలు:


ప్రస్తుతం, ఈ మోడల్ వినియొపెగదారులు ఎంచుకునేందుకుగానూ 3 వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని అంశాలు పక్కన పెడితే చాలా వరకు వీటి లక్షణాలు ముందు వాటి వలే ఉన్నాయి. వీటిలో అధునాతన లక్షణాలు, అత్యుత్తమ సౌకర్యాలు కలవు. ఇది అయిదుగురు కూర్చునేందుకు వీలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవర్ ముఖ్యంగా ఈ సిరీస్ లో విద్యుత్ శక్తి సహాయక స్టీరింగ్ వ్యవస్థను అందించారు. ఈ లక్షణం ద్వారా డ్రైవర్ యొక్క శ్రమను తగ్గించవచ్చు. క్యాబిన్ ఉష్ణోగ్రతను నియంత్రించే కొరకు, ఒక గాలి కండిషనింగ్ యూనిట్ అలాగే ఒక హీటర్ ఫంక్షన్ అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాల బట్టి కావలసిన లక్షణాలను ఎంపిక చేసుకోవచ్చు. దీని ముందరి డోర్ కి పవర్ విండోస్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ముందర కూర్చునే ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుంది. అధనంగా ముందరి సీట్లు వారి కోసం హెడ్రెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా వెనుక కూర్చునేవారి కోసం కూడా హెడ్రెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. దీనిద్వారా ప్రయాణికులకి మంచి సౌకర్యం అలానే మంచి గ్రిప్ లభిస్తుంది. సహ డ్రైవర్ సీటు తో పాటు డ్రైవర్ సీటు వారికి ఒక స్లయిడింగ్ ఫంక్షన్ అందుబాటులో ఉంది. డ్రైవింగ్ సమయంలో సౌకర్యవంతంగా ఉండేందుకుగానూ ఇది సహాయపడుతుంది. డ్రైవర్ తరువాత మరింత డిస్టెన్స్ టు ఎంప్టీ నోటిఫికేషన్ మరియు ఫ్యుయల్ ఎకానమీ ప్రదర్శన వంటి సౌకర్యాలను కలిగి ఉంది. దీనిలో తక్కువ ఇంధన హెచ్చరిక ల్యాంప్ కూడా అందుబాటులో ఉంది. అలానే డిజిటల్ క్లాక్ ఎల్.ఇ.డి ప్రదర్శనతో అందుబాటులో ఉంది.

ఒక డిజిటల్ ఫ్యుయల్ గేజ్ కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త రకం ఫేస్ లిఫ్ట్ వెర్షన్ చాలా పెద్ద స్పీడోమీటర్ మరియు ట్రిప్ మీటర్ ను కలిగి ఉంది. దీని ముందరి కన్సోల్ లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అందుబాటులో ఉంది. ఒక రెమోట్ కీలెస్ ఎంట్రీ ఉండడం అనేది ఈ చిన్న కారు కి చాలా అద్భుతమైన విషయం. దీని లోపల భాగంలో ప్రామాణికమైన లక్షణంగా అమర్చబడి ఉండడం వలన సౌకర్యవంతంగా ఉంటుంది. అలానే క్యాబిన్ లో 12వి శక్తి సామర్ధ్యం గల ఒక పవర్ సాకెట్ అందుబాటులో ఉంది. దీని వలన మొబైల్ మరియు ఏ ఇతర చిన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అయినా చార్జ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ పక్కన పెడితే, క్యాబిన్ లోపల నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని డోర్లకి డోల్డర్స్ అందుబాటులో ఉంటాయి. దీని వలన ప్రయాణికులకి చాలా సౌకర్యవంతం గా ఉంటుంది. దీని ముందరి కన్సోల్ లో కప్ హోల్డర్స్ మరియు బాటిల్ హోల్డర్స్ అందుబాటులో ఉంది. అదనపు సౌకర్యం కోసం డ్రైవర్ కి మ్యాప్ పాకెట్ అందుబాటులో ఉంది. అలానే ఇంకా సన్ విజర్స్ డ్రైవర్ తో పాటుగా సహ డ్రైవర్ కి కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సహ డ్రైవర్ సన్ విజర్, వానిటీ మిర్రర్ తో పాటుగా అందుబాటులో ఉంది. ఒక అదనపు ప్రయోజనం ఏమిటంటే, వెనుక సీట్లు మడవగలిగే విధంగా ఉంటాయి. దీని వలన బూట్ స్పేస్ సామర్ధ్యం మరింత పెంచుకోవచ్చు.

లోపలి కొలతలు:


దీని లోపల భాగం చాలా విశాలంగా అయిదుగురు కూర్చునే విధంగా ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం దీని పెద్ద వీల్ బేస్ మరియు డిజైనర్ల నైపుణ్యత అని చెప్పవచ్చు. అవసరమైన దాని కంటే పెద్ద స్టీరింగ్ వీల్ ఉండడం వలన డ్రైవర్ కి కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది కానీ ప్రయాణికులకి మాత్రం ఇటువంటి అసౌకర్యాలు ఉండవు. ప్రయాణికులకి తగినంత లెగ్రూం మరియు షోల్డర్ స్పేస్ అందుబాటులో ఉన్నాయి. దీని హెడ్ స్పేస్ కూడా విశాలంగా ప్రయాణికులకి అనుకూలంగా ఉంటూంది. ఈ హాచ్బాక్ లో వెనుక సీట్లు మడవకుండానే 80 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది. కానీ కొత్త సిరీస్ 94 లీటర్ బూట్ నిల్వ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


పైన పేర్కొన్న వంటి, భారత ఆటో దిగ్గజం ఇంజిను ప్రత్యేకతలలో ఎటువంటి మార్పు చేయలేదు కానీ , ఇప్పుడు ఒక ఏ ఎంటి గేర్బాక్స్ అందుబాటులో ఉంది. అదే 624సిసి ఇంజన్ సింగిల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 2-సిలిండర్లు ఒక బహుళ స్థాన ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ ద్వారా ఇంధనం పొందుతుంది. ఈ 0.6 లీటర్ పెట్రోల్ 5200rpm నుండి 5500rpm వద్ద 37.5bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 3500rpm నుండి 4000rpm వద్ద 51Nm టార్క్ ని అందిస్తుంది. మరోవైపు, ఈ ఇంజిన్ సి ఎన్ జి ఇంధన కిట్ ఎంపికలో 32.5bhp గరిష్ట శక్తిని మరియు 45Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక పనితనం గల ఇంజిన్ ఫోర్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ సిస్టం తో అమర్చబడి ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో, ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఎంపికను కూడా మరింత నిర్వహణ కొరకు కలిగి ఉంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


తయారీదారుడు ఈ వాహనంలో అదే యాంఫీస్ట్రీం సంగీత వ్యవస్థ ను దీని డాష్బోర్డ్ లో అనుసంధానం చేశాడు. వీటిలో, సిడి ప్లేయర్, ఎంపి3 ప్లేయర్ తో పాటు బ్లూటూత్, యూఎస్బి మరియు ఆక్సలరీ-ఇన్ వంటి కనెక్టివిటీ అంశాలను దీనిలో పొందుపరిచాడు. అదే సమయంలో, అది కూడా ఒక స్టీరియో నాణ్యత సౌండ్ అవుట్పుట్ కొరకు ముందు మరియు వెనుక స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. అయితే, ఈ లక్షణాలు ఎక్స్ టి మరియు ఎక్స్ టిఏ వేరియంట్ లలో మాత్రమే ప్రామాణికంగా ఇవ్వబడ్డాయి.

వీల్స్ పరిమాణం:


పైన పేర్కొన్న విధంగా, ఈ వాహనాల అన్ని వేరియంట్ లు 12 అంగుళాల, ఒక జత స్టీల్ రిమ్స్ అందించబడతాయి. వీటిని ట్యూబ్ లెస్ రేడియల్ టైర్ల తో కప్పబడి ఉంటాయి. ఈ రిమ్స్ పరిమాణం 135/70 R12.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీని బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ లో ఎటువంటి మార్పు లేదు. దీని పాత దానిలో ఉన్నటువంటి బ్రేకింగ్ విధానమే దీనిలో కూడా ఉంది. ఈ వాహనం డ్యుయల్ సర్క్యూట్ వర్టికల్ స్పిల్ట్ బ్రేకింగ్ సిస్టమ్ ,ముందర మరియు వెనుక 180mm వ్యాసం గల డ్రమ్స్ తో అందుబాటులో ఉంది. సస్పెన్షన్ పరంగా, దాని ముందు ఆక్సిల్ తక్కువ విష్బోన్స్ మరియు వాయువుతో నింపబడిన డాంపర్లను కలిగియున్నటువంటి ఇండిపెండెంట్ మక్ఫెర్సొన్ స్ట్రట్ వ్యవస్థతో అమర్చబడింది. అదే సమయంలో వెనుక ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్ మరియు గ్యాస్ నిండియున్న షాక్అబ్జార్బర్స్ తో పాటుగా ఇండిపెండెంట్ సెమీ ట్రైలింగ్ ఆర్మ్ వ్యవస్థతో అమర్చబడి ఉంది. మరోవైపు, ఈ వాహనం ఆక్టివ్ రిటర్న్ ఫంక్షన్ తో కూడియున్న విద్యుత్ శక్తి సహాయక స్టీరింగ్ సిస్టమ్ తో అందుబాటులో ఉంది. ఆక్టివ్ రిటర్న్ ఫంక్షన్ వలన డ్రైవర్ కు చాలా సదుపాయంగా ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ చాలా ఆధునిక లక్షణాలు మరియు అధనపు ప్రయోజనాలను కలిగి ఉంది. కారు తయరీదారుడు దీనికి అనేక భద్రతా లక్షణాలను అందించారు. దీనిలో అన్ని తలుపులకి చెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అందించబడింది. దీని ద్వారా ప్రయాణికులకి భద్రత చేకూరడమే కాకుండా డ్రైవర్ కూడా చాలా సౌకర్యంగా ఉంటు ంది. దీనిలో వీల్స్ ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. దీని వలన టైర్లు వేగంగా పంచర్ అవ్వవు. ఇంకా, ఈ సిరీస్ మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకుగానూ అదనపు సహాయక బ్రేక్లు తో అందించబడుతుంది. దీని వలన వాహనాన్ని అదుపు చేయడం సులభమవుతుంది. దీని వెనుక భాగంలో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఒక సహాయకారిగా పనిచేస్తుంది. ఈ ల్యాంప్ నుండి వచ్చే కాంతి వలన వలన ఎంతో దూరం నుండి వస్తున్న కారుని కూడా గుర్తించగలం. దీని ద్వారా ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీని ముందర మరియు వెనుక కూర్చునే ప్రయాణికుల రక్షణ కొరకు భద్రతా బెల్ట్లు అందించడం జరిగింది. వాహనం చాలా ధృడంగా బలమైన స్టీల్ బీమ్స్ తో నిర్మించబడింది. దీని వలన ప్రయాణికులకి చాలా భద్రత కలుగుతుంది.

అనుకూలాలు:


1. ఆహ్లాదకరమైన అంతర్గత క్యాబిన్ ఉండడం అనుకూలత.
2. ఏ ఎం టి గేర్ బాక్స్ ఎంపిక ఉండడం అనేది ఒక అనుకూలత.
3. ధర పరిధి అనుకూలంగా ఉంటుంది.
4. బాహ్య సౌకర్యాలు మెరుగుగా ఉండడం ఒక అనుకూలత.
5. బూట్ సామర్ధ్యం ఎక్కువగా ఉండడం అనేది దీనికి అనుకూలత.

ప్రతికూలాలు:


1. ఏఎంటి వెర్షన్ ఇంధన సామర్ధ్యం అంత మంచిగా లేకపోవడం అనేది దీనికి ప్రతికూలత.
2. ఎయిర్బ్యాగ్స్ లేకపోవడం దీనికి ప్రతికూలత.
3. దీని బాహ్య భాగాలు మరింత మెరుగు పరచాల్సి ఉంది.
4. ఇంజిన్ శక్తి ఇంకా పెంచవచ్చు.
5.వెనుక క్యాబిన్ షోల్డర్ స్పేస్ రద్దీగా ఉంది.