టాటా బోల్ట్

` 4.7 - 7.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టాటా ఇతర కారు మోడల్‌లు

 
*Rs

టాటా బోల్ట్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


అక్టోబర్ 12, 2015: టాటా మోటార్స్ సంస్థ, అద్భుత ఎడిషన్స్ అయిన జెనెక్స్ నానో, బోల్ట్ మరియు జెస్ట్ కార్ లను విడుదల చేయనుంది. పండుగ సీజన్ లో శీఘ్రంగా చేరుకుంటోంది అలాగే వాహనతయారీదారుడు, వినియోగదారులను ఆకర్షించడం కోసం నవీకరణలతో కూడిన ఈ ఎడిషన్ లను విడుదల చేయనున్నాడు. టాటా సంస్థ, వారి లైనప్ లో ఐదు మోడళ్ళను కలిగి ఉంది. అవి వరుసగా, బోల్ట్, జెనెక్స్ నానో, సఫారీ స్ట్రోం, జెస్ట్ మరియు ఇండిగో వంటి మోడళ్ళను పరిచయం చేయనుంది.

అవలోకనం


పరిచయం


టాటా మోటార్స్ సంస్థ, ప్రపంచానికి చెప్పడం కోసం ఈ కొత్త స్థాయి వాహనానికి పాత డిజైన్ ను అందిస్తున్నాము. సంస్థ ఈ వాహనానికి, పురోగామి అంశాల మిశ్రమాన్ని ఇటీవల విడుదల చేసిన హాచ్బాక్ మోడల్ అయినటువంటి బోల్ట్ వాహనానికి, ఆధునిక డిలైట్ లను అందించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ అంశాలను కలిగిన ఉత్పత్తులను మార్కెట్ లోనికి తీసుకురావడమే మరియు ఇదే కోవకు చెందినవి జెస్ట్ మరియు ఇండికా వాహనాలు. ఈ వాహనాలు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లక్షణాలను కలిగినవి అని చెప్పవచ్చు.

అనుకూలాలు1. ఈ విభాగంలో, వెనుక బెంచ్ లెగ్ రూం ఉత్తమ మైనది అని చెప్పవచ్చు.
2. ఈ మోడల్ సిరీస్ కలిగి ఉన్న భద్రతా అంశాలు: ఎయిర్బాగ్లు, యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
3. ఈ మోడల్ సిరీస్ కలిగి ఉన్న లక్షణాలు: ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్‌లు, టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలగు అంశాలు.

ప్రతికూలాలు1. ఈ మోడల్ సిరీస్ లో ఆటోమేటిక్ వేరియంట్ లు లేవు. కానీ, ఫిగో మరియు గ్రాండ్ ఐ 10 వంటి మోడళ్ళలో వాటి లైనప్ లో ఆటోమేటిక్ వెర్షన్ లు అందించబడ్డాయి.
2. క్యాబిన్ లోపల నిల్వ స్థలాన్ని తీవ్రంగా పరిమితం చేయబడింది. ఈ వాహనానికి కేవలం, ఒక కప్ హోల్డర్ మరియు సీటు క్రింద ట్రే వంటివి మాత్రమే అందించబడ్డాయి.

అత్యద్భుతమైన లక్షణాలు1. ఈ వాహనం యొక్క లోపలి భాగంలో, కనెక్ట్ నెక్స్ట్ టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, వాయిస్ కమాండ్ మరియు ఇతర అధునాతన అంశాలు అందించబడ్డాయి..
2. ఈ విభాగంలో ముఖ్యంగా ఈ మోడల్, 1.2 లీటర్ రెవట్రాన్ టర్బో ఇంజన్ విపరీతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

అవలోకనం


టాటా, భారత ప్యాసింజర్ కార్ల విభాగంలో పేరున్న బ్రాండ్ గా పిలవబడుతుంది. కానీ ఈ బ్రాండ్ వాహనాల యొక్క లోపలి భాగంలో సౌలభ్యకరమైన అంశాలు అందించబడటం లేదు. అయితే, ఇప్పుడు బోల్ట్ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, లోపలి వాతావరణాన్ని మరింత పెంచడం కోసం విస్తృతంగా సౌకర్యకరమైన అంశాలను అలాగే వినోద లక్షణాలను అందించడం జరిగింది. భారతదేశంలో ఉండే మధ్య తరగతి కుటుంబ సభ్యులకు ఈ వాహనం ఉత్తమం అని చెప్పవచ్చు. అది ఏ విధంగా అంటే, స్టైల్ పరంగా, ఉత్సాహాన్ని అందించడంలో, ఫంక్షన్లు పరంగా ఈ వాహనం ఉత్తమం అని చెప్పవచ్చు. అయితే, అదే సమయంలో ధర పరంగా కొనుగోలుదారు లను నిరుత్సాహపరచే విధంగా ఉండదు. అంటే, ధర ట్యాగ్ వినియోగదారుల బ్యాంకు ఖాతా ను ఉల్లంఘించడం లేదని పూర్తి భరోసా ను ఈ వాహనం ఇస్తుంది.

Background and Evolution:


ఈ బోల్ట్ వాహనం, మొదటి తరానికి చెందినది మరియు ఇది, సాధారణంగా చాలా గుర్తించదగ్గ నమూనా లలో ఇమిడి ఉన్న విస్టా వాహనాన్ని భర్తీ చేయనుంది అని పరిగణించబడుతుంది.

బాహ్య భాగం


మొదటి చూపులో ఈ వాహనాన్ని చూడగానే, లోపల ప్రయాణించే ప్రయాణికులు వాహనం పట్ల మరింత ఎక్కువ ఉత్సాహాన్ని ఊహించుకుంటారు కానీ, ఈ వాహనానికి కొన్ని సం యుక్త పరీక్షలు చేసి వాహనం యొక్క రూపకల్పనను సంగ్రహించింది. ఈ వాహనం యొక్క బాహ్య భాగం చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ముందుగా ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, అద్భుతమైన అలాగే విస్తారంగా ఉండే వక్రతలు ముందు భాగానికి మరింత అందాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ముందు భాగానికి, ఆకర్షణీయమైన బోనెట్ మరియు బారీ వెనుక భాగం అలాగే మస్కులైన్ ఫార్మేట్ వంటివి అందించబడతాయి. వీటన్నింటితో ఈ వాహనం మరింత అందంగా కనిపిస్తుంది.

Image 1

ఈ వాహనం యొక్క ముందు భాగానికి, సన్నని స్వభావం కలిగిన గ్రిల్ అందించబడుతుంది. ఇది మరింత అందంగా కనబడటం కోసం ఈ గ్రిల్ మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది. దీని వలన ఈ వాహనానికి విలక్షణమైన లుక్ అందించబడుతుంది. ఈ గ్రిల్ కు ఇరువైపులా, స్మోక్డ్ మల్టీ రిఫ్లెక్టార్ హెడ్ ల్యాంప్‌లు బిగించబడి ఉంటాయి మరియు ఈ పొదునైన ఆకారం కలిగిన ల్యాంప్‌లు, ఈ వాహనానికి మరింత అందమైన లుక్ ను ఇస్తాయి.

Image 2

ఒకవేళ మీరు గనుక ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ను ఎంపిక చేసుకోదలచుకుంటే, ఈ వేరియంట్ కు కొన్ని అదనపు అంశాలు అందించబడతాయి. అవి ఏమిటంటే, ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఒక అద్భుతమైన క్రోం ప్రభావం కలిగిన గ్రిల్ వంటివి అందించబడతాయి. ఈ రెండు అంశాల వలన వాహనం మరింత అందంగా కనబడుతుంది. ఒకవేళ వినియోగదారులు గనుక క్రోం ను ఇష్టపడుతున్నట్లైతే ఈ అగ్ర శ్రేణి వేరియంట్ సరైన వాహనం అని చెప్పవచ్చు.

Image 3

కొనుగోలుదారుల అభిప్రాయంతో, తయారీదారుడు ఒక బలమైన ప్రకటన ను ఫ్రంట్ బంపర్ కు ద్వంద్వ టోన్ స్వభావం ఉపయోగించటం ద్వారా అందించాడు అంతేకాకుండా బోనెట్ క్రింది భాగంలో కూడా, మరింత శక్తివంతమైన ఇంజన్ లను అందించాడు. ముందు భాగంలో ఉండే విస్తృత బోనెట్ కు, మెరుస్తున్న నిర్మలమైన లైన్లను అందించడం వలన, వినియోగదారుల అందరి దృష్టి ఈ వాహనం పైనే ఉంటుంది. అంతేకాకుండా దీనికి ఒక శక్తివంతమైన డిజైన్ పాత్ర జోడించబడుతుంది. అంతేకాకుండా, బోనెట్ క్రింది భాగంలో ఉండే ద్వంద్వ టోన్ కలిగిన బంపర్ కు, బారీ ఎయిర్ ఇన్ టేక్ విభాగాలను విలీనం చేయడం జరిగింది.

Image 4

బోనెట్ యొక్క మెటాల్, బలమైన వీల్ ఆర్చులు గూండా వాహనం సైడ్ ప్రొఫైల్ మొదటి భాగం నుండి వెనుక భాగం వరకు విస్తరించి ఉంటుంది. ఈ వాహనం యొక్క బలమైన వీల్ ఆర్చులకు, అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. గొప్ప అంశం ఏమిటంటే, ఈ వీల్స్ వాహనానికి స్పోర్టీ లుక్ ను ఇస్తాయని చెప్పడంలో నిస్సందేహం లేదు. ఇవి, కారుకు ఒక గొప్ప రూపాన్ని అందిస్తాయి. వీటి యొక్క రింలు, రోడ్లపై అధిక పటుత్వాన్ని ఇవ్వడానికి ట్యూబ్ లేని రేడియల్ టైర్ లతో కప్పబడి ఉంటాయి.

Image 5

కారు శరీర రంగులో ఉండే డోర్ హ్యాండిళ్ళు మరియు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు మరింత అనుకూలమైన లుక్ ను అందిస్తాయి. మరోవైపు ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, స్వీపింగ్ లైన్లు, కారు యొక్క డోర్ ల గూండా ముందు భాగం నుండి వెనుక భాగం వరకు ప్రవహించి ఉంటాయి. వీటి వలన వాహనానికి, మరింత ప్రభావంతమైన లుక్ అందించబడుతుంది. అత్యంత శక్తివంతమైన అంశం ఏమిటంటే, కొనుగోలుదారుల అభిప్రాయంతో స్వెప్ట్ బేక్ ఆకృతిని కలిగిన ముందు విండో అందించబడుతుంది. దీని వలన కారు యొక్క సైడ్ ప్రొఫైల్ కు మర్యాద పూర్వక స్థానం అందించబడుతుంది. ఈ సాధారణ కారకం, కారు యొక్క దృశ్యాల అధునాతన చిత్రానికి జతచేస్తుంది మరియు ఇది బ్రాండ్ లక్ష్యంగా యువ ప్రేక్షకులను ఆకర్షితులను చేస్తుంది. ఇక్క హైలెట్ అయిన మరొక అంశం ఏమిటంటే, నలుపు కండీషనింగ్ కలిగిన డోర్ ఫ్రేం లకు వివిధ రంగు ఎంపిక లను ఎంపిక చేసుకోవచ్చు.

Image 6

ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, వెనుక నిష్పత్తి విస్తారంగా ఉంటుంది మరియు ఈ కారు సమతుల్య అందాన్ని ఇస్తుంది. వెనుక భాగంలో ఉండే స్కిడ్ ప్లేట్ పై ఎల్ ఈ డి ప్రకాశవంతం అందించబడుతుంది ఇది ఆనందాన్ని అందిస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు మరియు ఈ బోల్ట్ వాహనం యొక్క పోటీ వాహనం అయిన జాజ్ వాహనం లో కూడా ఇటువంటి లక్షణం అందించబడలేదు. జ్వాల ఆకారంలో ఉండే టైల్ ల్యాంప్‌లు, కారు యొక్క సాధారణ రూపకల్పన తేజము ను జోడించడానికి సహాయపడతాయి మరియు ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్, ఈ కారుకు ఆవేశపూరితమైన దృశ్య కారకాన్ని అందిస్తుంది.

Image 7

ఈ వాహనం యొక్క బాహ్య భాగం కొలతల విషయానికి వస్తే, ఈ వాహనానికి 3850 మిల్లీ మీటర్ల పొడవును, 1695 మిల్లీ మీటర్ల వెడల్పును మరియు 1530 మిల్లీ మీటర్ల ఎత్తును అందించడం జరిగింది.

Table 1

తయారీదారుడు ఈ వాహనానికి, 210 లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ ను అందించాడు. ఈ వాహనాన్ని, ఇతర పోటీ వాహనాలతో పోలిస్తే, వెనుకబడినప్పటికీ సాధారణ ప్రయాణాలకు సరిపోతుంది. విస్తృతమైన ప్రయాణాలకు ఈ వాహనం సరైనది కారు అని చెప్పవచ్చు మరియు ఇదే విభాగానికి చెందిన మరొక వాహనం గురించి చూస్తున్నట్లైతే, బూట్ సామర్ధ్యాన్ని గమనించడం ముఖ్యం. అదే ఫోర్డ్ ఫిగో విషయానికి వస్తే, 257 లీటర్లు మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 వాహనం విషయానికి వస్తే 256 లీటర్ల బూట్ సామర్ధ్యం అందించబడుతుంది.

Table 2

అంతర్గత భాగం


ఈ వాహనం యొక్క అంతర్గత నమూనాను చూస్తున్నట్లైతే, మరింత అంత గొప్పగా లేదు అలా అని గొప్ప బ్రాండ్ లుక్ ను కలిగి లేదు. ఈ వాహనం యొక్క ధర పరంగా సరైన సంతులనం దొరికింది మరియు లోపలి భాగంలో ఖచ్చితమైన అనుభవాన్ని పెంచడం కోసం అనేక సౌకర్య అంశాలను అందించడం జరిగింది.

Image 8

ఉన్నత స్థాయి సౌకర్యాన్ని అందించడం కోసం, సౌలభ్యకరమైన సీట్లు అందించబడ్డాయి మరియు ఒక రైడ్ సమయంలో సౌకర్యాన్ని ఆశించే ఎవరికైనా సరే గరిష్ట స్థాయి సౌకర్యం అందించబడుతుంది. క్యాబిన్ లో ఉండే ముందు అలాగే వెనుక సీట్లకు, ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ లను అందించడం జరిగింది మరియు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఇవి, సౌలభ్యాన్ని అలాగే భద్రతను మెరుగుపరుస్తాయి.

Image 9

ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమిటంటే, ఈ వాహనం యొక్క లోపలి భాగానికి స్పోర్ట్స్ కారు లో ఉండే థీం ఈ వాహనం లో అందించబడుతుంది. ఈ వాహనం యొక్క లోపలి భాగానికి, జావా బ్లాక్ అంతర్గత లే అవుట్ అందించబడింది. మరింత ఆనందాన్ని అందించడానికి, పూర్తిగా ఫ్యాబ్రిక్ తో కప్పబడిన సీట్లు అందించబడతాయి మరియు ఇది అంతగా ఖరీదైన లుక్ ను ఇవ్వలేదు. అయితే, బీజ్ మరియు ఇతర ఖరీదైన లెధర్ ను నిర్వహించడాని కంటే ఖచ్చితంగా సులభం అని చెప్పవచ్చు.

Image 10

లోపల ఉండే ప్రయాణికులకు సౌలభ్యాన్ని అందించడం కోసం సెంట్రల్ కన్సోల్ అందించబడింది. లోపలి భాగంలో సరైన వాతావరణాన్ని అందించడం కోసం, ఒక కప్ హోల్డర్ మరియు పవర్ అవుట్లెట్ వంటివి సరైన స్థానంలో అమర్చబడి ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ పై ఉండే నియంత్రణా స్విచ్చులు, ఎర్గనామికల్ గా అమర్చబడి ఉన్నాయి మరియు ఏసి కోసం, బారీ నాబ్‌లు అందించబడ్డాయి.

Image 11

ఈ సెంట్రల్ కసోల్ కుడి వైపు పై భాగంలో డ్రైవర్ కు సౌకర్యాన్ని అందించడం కోసం సమాచార వ్యవస్థ విలీనం చేయబడి ఉంది. ఈ వాహన సంస్థ క్యాబిన్ లో ప్రయాణించే ప్రయాణికులకు, సౌలభ్యాన్ని జోడించడం కోసం స్మార్ట్‌ఫోన్ ఎనేబుల్ నావిగేషన్ సిస్టమ్, ఒక వీడియో ప్లేబ్యాక్ సౌకర్యం అలాగే ఒక చిత్రం చూడటానికి అవసరమైన ఎంపికలను అందించింది. మరో విషయం చెప్పవలసిన అవసరం లేదు అది ఏమిటంటే, సంగీతం యూఎస్బి, ఆక్స్, బ్లూటూత్ మరియు రేడియో ద్వారా ప్రసారం అవుతుంది.

Image 12

లోపలి భాగానికి మరింత ఖరీదైన లుక్ ను ఇవ్వడం కోసం క్యాబిన్ లో ఉండే కొన్ని అంశాలపై ఎక్కువ మొత్తం క్రోం ను అందించడం జరిగింది. అవి ఎక్కడెక్కడ అంటే, ఎయిర్ వెంట్ లపై, పార్కింగ్ బ్రేక్ లెవర్ మోన పై, లోపలి వాతావరణం మరింత అందంగా కనిపించడం కోసం అక్కడక్కడ అందించడం జరిగింది. మరోవైపు డోర్ సైడ్ లకు, ఫ్యాబ్రిక్ చేరికలను అందించడం జరిగింది మరియు వినియోగదారుల అభిప్రాయం కోసం మరొక స్థానం లో కూడా అమర్చుకోవచ్చు.

Image 13

క్యాబిన్ లో అందించబడిన ఇన్స్త్రుమెంట్ క్లస్టర్, రెండు డైల్స్ ను కలిగి ఉంది అవి ఒకటి, టాకోమీటర్ మరియు రెండవది, స్పీడోమీటర్. అంతేకాకుండా, ఇది అనేక హెచ్చరిక లను అందజేస్తుంది. అవి వరుసగా, ఇంజన్ యొక్క ఉష్ణోగ్రత గురించి మరియు ఇంధన గేజ్ వంటి వాటి గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. సులభంగా చదవటానికి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైట్ బేక్ లైట్ తో వస్తుంది. ఈ ఎం ఐ డి అనేక సమాచారాన్ని తెలియజేస్తుంది అవి, ప్రస్తుత గేర్, ట్రిప్ ఏ / బి, ఓడోమీటర్ మరియు ఎకానమీ వంటి వాటి ప్రాధమిక సమాచారాన్ని తెలియజేస్తుంది. తక్షణ ఎకానమీ, ఎం ఐ డి దిగువన ఉన్న సమాంతర బార్ ద్వారా ప్రదర్శించబడుతుంది.

Image 14

ఈ వాహనం యొక్క లోపలి భాగం కాక్‌పిట్ విభాగంలో కుడి భాగంలో ఒక స్టీరింగ్ వీల్ విలీనం చేయబడి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ యొక్క చిత్రాన్ని గనుక చూసినట్లైతే, స్పోర్టీ లుక్ ను కలిగి ఉండటమే కాకుండా, వైబ్రెంట్ మెటాలిక్ చేరికలు మరియు కుడి వైపు భాగంలో ఉండే స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ సరైన పరిమాణాన్ని కలిగి ఉండటమే కాకుండా, పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవర్ కు సౌకయాన్ని అందించడం కోసం, కాల్ మరియు ఆడియో నియంత్రణా స్విచ్చులు, స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడి ఉంటాయి మరియు దీని ఫలితంగా, ఆపరేట్ చేయడం మరింత ఉపశమన అనుభూతిని ఖచ్చితంగా కలిగి ఉంటారు.

అంతర్గత భాగం విలాసవంతమైన ప్రకాశాన్ని కలిగి ఉన్నప్పటికీ, లోపలి భాగంలో కప్ హోల్డర్ మరియు సీటు క్రింది ట్రే వంటి కొద్ది నిల్వ స్థలం మాత్రమే ఈ వాహన లోపలి భాగం లో అందించబడింది. అంతేకాకుండా డోర్ లోపలి వైపునకు, అనేక వస్తువులను పెట్టుకునేందుకు పాకెట్లు అందించబడ్డాయి.

పనితీరు


డీజిల్


Table 3

క్వాడ్రాజట్ 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ ను, బిఎస్ IV ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చెయ్యబడింది మరియు దీని వలన యజమానులకు ఇంధన సామర్ధ్యం విషయంలో ఆందోళన తగ్గింది. ఈ 1.3 లీటర్ క్వాడ్రాజట్ డీజిల్ ఇంజన్, 1248 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్ లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 4000 ఆర్ పి ఎం వద్ద 74 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1750 నుండి 3000 ఆర్ పి ఎం వరకు 190 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోవైపు ఈ ఇంజన్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ టెక్నాలజీ తో జత చేయబడి నగరాలలో, 19.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 22.95 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15.2 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 150 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Image 15

ఇదే ఖచ్చితమైన 1.3 డీజిల్ ఇంజన్ ను, మారుతి స్విఫ్ట్ వాహనంలో కూడా చూడవచ్చు. అయితే మనకు మారుతి వాహనం గురించి తెలిసిన విషయమే కదా ఈ వాహనానికి ఎక్కువ గేర్ లు అందించబడతాయి. నిష్పత్తుల పరంగా చూసినట్లైతే టాటా తో పోలిస్తే మారుతి మెరుగైనది గా కనిపిస్తుంది. ఈ బోల్ట్ వాహనం, 1800 ఆర్ పి ఎం వరకు లాగ్ ను కలిగి ఉంది. అయితే ఈ టర్బో ను ఒకసారి మెరుగుపరిచినట్లైతే, ఆకట్టుకునే పవర్ టార్క్ లు విడుదల చేయబడతాయి.

పెట్రోల్


Table 4

పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, ఒక టర్బోచార్జర్ ను కలిగిన 1.2 లీటర్ పెట్రోల్ రెవట్రాన్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్, 1193 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఎస్ ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్ లను అలాగే ఎనిమిది వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, బిఎస్ IV ఉధ్గార ప్రమాణాలను కలిగి ఉంటుంది మరియు క్లీనర్ ఉద్గారాలు సంస్థ వినియోగదారుల కోసం ఇది ఒక అనుకూలత గా ఉంటుంది. ఈ వాహనం యొక్క పవర్ టార్క్ లను చూసినట్లైతే, ఈ ఇంజన్ అత్యధికంగా 5000 ఆర్ పి ఎం వద్ద 88.7 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1500 నుండి 4000 ఆర్ పి ఎం మధ్యలో 140 ఎన్ ఎం గల అధిక టార్క్ విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 17 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 154 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ ఇంజన్, ఎం పి ఎఫ్ ఐ ఇంధన ఇంజక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ తో జత చేయబడి నగరాలలో, 14.2 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 17.57 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ టర్బో- చర్జెడ్ 1.2 లీటర్ యూనిట్ కూడా మల్టీ డ్రైవ్ మోడ్ ను కలిగి ఉంది. వినియోగదారుడు, సిటీ, ఎకో మరియు స్పోర్ట్స్ మధ్య ఉండే మోడ్ ను ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా సిటీ మోడ్ అనేది డిఫాల్ట్ గా చూపిస్తుంది.

సహజంగా, థ్రొటిల్ స్పందన ఎకో మోడ్ లో అనేది నిరుత్సాహంగానూ మరియు నీరసమైనది గాను ఉంది అంతేకాకుండా దీనిని, ఉత్తమ సుదూర యానం కోసం ఉపయోగిస్తారు.

రైడ్ మరియు హ్యాండ్లింగ్


తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అన్నివేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటానికి నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించాడు. ముందు బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు చక్రాలు, డిస్క్ బ్రేక్ లతో అలాగే వెనుక చక్రాలు డ్రం బ్రేక్ లతో బిగించబడి ఉంటాయి మరియు మనం ఊహించినదానికంటే, ఎక్కువ ఆపే శక్తిని కలిగి ఉంటుంది. ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడానికి ఈ వాహనానికి యాంటీ లాక్ బ్రేకింగ్ మెకానిజాన్ని అందించడం జరిగింది. టాటా సంస్థ, చాలా కాలం నుండి భారతీయ రహదారుల కోసం వాహనాల ను తయారు చేస్తూ వచ్చింది. అంతేకాకుండా రైడ్ నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం ఈ రోడ్లకు అనుగుణంగా సస్పెన్షన్ మెకానిజాన్ని అందించడం జరిగింది. మరోఅవైపు ఈ వాహనం యొక్క సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్ డ్యూయక్ పాత్ మక్ఫొర్సన్ స్ట్రట్ తో విలీనం చేయబడి ఉంటుంది మరియు ఇది, పనితీరును మరింత పెంచడం కోసం కాయిల్ స్ప్రింగ్ మరియు ఒక వ్యతిరేక రోల్ బార్ తో లోడ్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, నియంత్రణను మరింత మెరుగుపరచడం కోసం కాయిల్ స్ప్రింగ్ మరియు షాక్ అబ్జార్బర్ లను కలిగిన ట్విస్ట్ బీం తో విలీనం చేయబడి ఉంటుంది. రోడ్ల పై ఉండే గుంతల ను మరియు రాళ్ళు ను సమర్థవంతంగా దాటుకొని మంచి రైడ్ ను అందించడానికి చాసిస్ లే అవుట్, అనేక డ్రైవ్ స్ట్రైన్ లను కలిగి ఉంది. మరోవైపు తయారీదారుడు ఈ వాహనానికి, ర్యాక్ అండ్ పినియన్ ఆధారిత పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది. ఈ స్టీరింగ్ వీల్, బారీ ట్రాఫిక్ సమయాలలో డ్రైవర్ యొక్క ఓత్తిడి ని తగ్గించి 5.1 మీటర్ల టర్నింగ్ వ్యాశార్ధానికి మద్దతిస్తుంది.

భద్రత


తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అలాగే లోపల ఉండే ప్రయాణికులకు అన్నివేళలా గరిష్ట స్థాయిలో భద్రత ను కల్పించడానికి అనేక భద్రతా అంశాలను అందించాడు. క్యాబిన్ లోపలి భాగానికి వస్తే, ఒక సగటు వ్యక్తికి సాధారణంగా అవసరమైన అన్ని అంశాలను అందించడం జరిగింది. ఈ సంస్థ భద్రత విషయంలో రాజీ పడలేదు. ఈ కారు గణనీయంగా భద్రత పరంగా బ్రాండ్ యొక్క దృష్టి సాధనలో పురోగతిని సాధించింది. అయితే, ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వెరియంట్ లో గరిష్ట స్థాయిలో భద్రతా అంశాలను అందించడం జరిగింది. ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, భద్రత పరంగా చాల్ బలహీనం గా ఉంది అని చెప్పవచ్చు. ఈ వేరియంట్ లో వెనుక సీటు చైల్డ్ లాక్ ను అందించడం జరిగింది. అంతేకాకుండా మరోవైపు ఈ వాహనానికి, వాహనం లో ఏ అనధికార ప్రవేశం జరగకుండా ఉండటానికి అలాగే వాహనం దొంగతనాల బారి పడకుండా ఉండటానికి ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఫంక్షన్ ను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, స్పీడ్ ఆధారిత ఆటో డోర్ లాక్స్, ప్రీ టెన్సినార్లను మరియు లోడ్ లిమిటార్ లను కలిగిన ముందు సీటు బెల్ట్ లను అలాగే డ్రైవర్ మరియు ముందు ప్రయాణికుడి ఎయిర్ బాగ్ వంటి అంశాలను అందించడం జరిగింది.

Image 16

Table 5

వేరియంట్లు


ఈ బోల్ట్ హాచ్బాక్ వాహనం, నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉంది మరియు దీనిలో ఎక్స్ ఈ అనునది, ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అని చెప్పవచ్చు. ఎక్కువ గరిష్ట స్థాయి అంశాలు అక్కర్లేదు అనుకునే వారికి ఇది సరైనది అని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం లో అంశాలు ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో అందించబడతాయి.

ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎక్స్ టి వేరియంట్ విషయానికి వస్తే, సమాచార వ్యవస్థ, నావిగేషన్ వ్యవస్థ, వాయిస్ కమాండ్ వంటి అనేక అధునాతన అంశాలు అందించబడ్డాయి. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, ఎయిర్బాగ్లు, పెరిమీటర్ అలారం వ్యవస్థ, వెనుక డిఫోగ్గర్ మరియు ఫాగ్ ల్యాంప్‌లు వంటి అనేక భద్రతా అంసాలు కూడా అందించబడ్డాయి. వీటన్నింటితో పాటు, ఆటోమేటిక్ ఉష్ణోగ్రత ప్రదర్శన, డ్రైవర్ వైపు ఉండే విండో కు ఓన్ టచ్ పవర్ డౌన్ ఫంక్షన్, ఒక బూట్ ల్యాంప్ వంటి అనేక ప్రత్యేకమైన అంశాలు అందించబడ్డాయి. ఈ వేరియంట్ యొక్క ప్రతికూలత ఏమిటంటే, దీని ధర అని చెప్పవచ్చు.

మరోవైపు ఈ మోడల్ సిరీస్ యొక్క ఎక్స్ ఎం మరియు ఎక్స్ ఎం ఎస్ వేరియంట్ ల విషయానికి వస్తే, అనేక అంశాలు అందించబడ్డాయి. కొనుగోలుదారులు ఒక సరసమైన ధర కోసం ఎదురుచూస్తున్నట్లైతే, ఈ రెండు వేరియంట్ లలో ఒక వేరియంట్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వేరియంట్ లు కలిగి ఉన్న అంశాలు విషయానికి వస్తే, ఒక సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ, పవర్ విండోలు, బ్లూటూత్ సౌకర్యం, స్పీడ్ ఆధారిత ఆడియో కంట్రోల్, విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు వంటి అంశాలు అందించబడ్డాయి. మరోవైపు ఈ వాహనాలకు వీటన్నింటితో పాటు, ఏబిఎస్ తో ఈబిడి, సి ఎస్ సి వ్యవస్థలు ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ కు అందించబడలేదు. కానీ ఈ అన్ని అంశాలు ఈ వేరియంట్ లకు అందించబడ్డాయి.

  Table 6

తుది విశ్లేషణ


చివరికి, అనేక ఇతర కార్ల వలే ఈ వాహనం కూడా అనేక అనుకూలతలను మరియు ప్రతికూలతలను కలిగి ఉంది. ఈ వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి అంటే ఈ వాహనానికి అందించబడ్డ అంశాల గురించి తెలుసుకోవాలి. ఒకవేళ వినియోగదారులు, ఒక సాలిడ్ సమాచార వ్యవస్థ కోసం అలాగే తగిన అంతర్గత భాగాల గురించి మరియు ఆకర్షణీయమైన బాహ్య భాగాల గురించి చూస్తున్నట్లైతే, ఈ వాహనం ఖచ్చితంగా కొనుగోలుదారులను ఆహ్లాదకరింప చేస్తుంది. బోల్ట్ వాహనం, మధ్య తరగతి భారతీయ ప్రజలలో ఒక పొదుపు గల వాహనం గా ఉంది కానీ, మరింత సంపన్నమైన డ్రైవింగ్ అనుభవం కోసం ఎదురు చూస్తున్న వారిని ఆకట్టుకోవడం లో విఫలమయ్యింది.