టాటా ఎరియా

` 11.2 - 16.8 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టాటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టాటా ఎరియా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతదేశంలో ప్రధాన ఆటో మొబైల్ సంస్థ టాటా, తమ అద్భుతమైన వాహనాలను ఇండియన్ కారు మార్కెట్ లో ఎప్పటికప్పుడు ప్రవేశ పెడుతుంది. దానిలో ఒకటయిన బహుళ ప్రయోజనకర వాహనమయిన టాటా ఆరియా ఇప్పుడు విశాలమైన అంతర్గత క్యాబిన్ తో పాటుగా ఆకర్షణీయమైన బాహ్య స్వరూపాలతో అందుబాటులో ఉంది. కంపెనీ వీటిని 3 వేరియంట్లలో కొనుగోలుదారులు ఎంచుకోవడానికి వీలుగా తీసుకు వస్తుంది అవి ప్యూర్ ఎల్ ఎక్స్, ప్లెజర్ మరియు ప్రైడ్. ఈ ట్రిమ్స్ అన్ని ఒక 2.2-లీటర్ వ్యారికోర్ డీజిల్ ఇంజన్ తో అమర్చబడి ఉంటాయి. ఇది శక్తివంతమైన మరియు ఒక ఆరోగ్యకరమైన ఇంధన కూడా ఫలితాలను అందిస్తుంది. ఈ మోటార్, 147.94 bhp శక్తిని సృష్టించగలదు. అయితే, గరిష్ట టార్క్ అవుట్పుట్ మాత్రం 320 Nm ఉంటుంది. ఇది భారతీయ రోడ్ మార్గాలకు మరియు ట్రాఫిక్ పరిస్థితులకు తగినంత మంచిదిగా ఉంటుంది. ఈ కమాండింగ్ మోటార్ చాలా నైపుణ్యంతో కూడిన 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది దాని ఫ్రంట్ వీల్స్ కి లేదా 4 వీల్స్ కి టార్క్ ను అందించడంలో తోడ్పడుతుంది. ఇది వేరియంట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం చాలా నైపుణ్యంగా చాలా నైపుణ్యంగా ఉండి అసమాన రోడ్డు పరిస్థితులలో కూడా వాహనాన్ని బాగా సమతుల్యంగా ఉంచుతుంది. ప్యూర్ ఎల్ ఎక్స్ వేరియంట్ కాకుండా, మిగతా వేరియంట్లు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉన్నాయి. ఇవి స్టీరింగ్ లాక్ అయినపుడు గానీ , అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు గానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మనల్ని రక్షిస్తాయి. సంస్థ ఈ వాహానానికి ఒక అధునాతన అంతర్గత క్యాబిన్ ను అందించింది. ఇది రెండు రంగుల స్కీంతో బ్రష్డ్ మెటాలిక్ ఇన్సర్ట్స్ ను కలిగి ఉంటుంది. ఇది సులభంగా ఏడుగురు ప్రయాణికులకు వసతిని కల్పిస్తుంది మరియు తగినంత లెగ్ రూమ్ మరియు షోల్డర్ స్పేస్ అందిస్తుంది. దీని క్యాబిన్లో క్యుషన్ సీట్లతో ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. డాష్బోర్డ్ ను విలక్షణముగా రూపకల్పన చేసారు మరియు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ కన్సోల్, మరియు ఒక త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, వివిధ నియంత్రణ బటన్లతో అందించబడుతుంది. అగ్ర శ్రేణి వేరియంట్ లో హర్మాన్ ద్వారా రూపొందించబడిన 360 వాట్ జెబిఎల్ సంగీత వ్యవస్థ తో అమర్చబడి ఉంది మరియు నావ్ టెక్ సాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ దీనికి సౌలభ్యాన్ని జతచేస్తుంది.ఈ మోడల్ సిరీస్ 2- డిన్ స్టీరియో ఆడియో సిస్టమ్ వంటి అనేక ఆధునిక లక్షణాలను తో అందించబడుతుంది. ఇది ఒక సిడి/ ఎంపి3 ప్లేయర్ తో వస్తుంది మరియు అలాగే 6స్పీకర్లను కూడా కలిగి ఉంది. దీని వీల్ ఆర్చులకి 17 అంగుళాల అలాయ్ వీల్స్ ను జత చేయడం వలన సైడ్ ప్రొఫైల్ ఇంకా ఆకర్షణీయంగా కనబడుతుంది. అయితే, బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లలో 16 అంగుళాల స్టీల్ చక్రాల సమితి పూర్తి వీల్ కవర్లను కలిగి ఉంటుంది. ఈ వాహనం టయోటా ఇన్నోవా, హోండా మొబిలియో, మహీంద్రా గ్సైలో, నిస్సాన్ ఇవాలియా, చేవ్రొలెట్ టవేరా, మరియు ఈ విభాగంలో ఇతర సెగ్మెంట్లతో ఇది పోటీ పడనుంది. ప్రస్తుతం ఇది మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ తో అందించబడుతుంది( ఏది ముందు వస్తే అది). అదే సమయంలో, కొనుగోలుదారులు అధికార డీలర్ల వద్ద అదనపు ఖర్చుతో ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు ఈ వారంటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ బహుళ ప్రయోజనకర వాహనం ఒక శక్తివంతమైన 2.2 లీటర్ వ్యారీకోర్ డీజిల్ మోటార్ ఇంజిన్ తో అందించబడుతుంది మరియు ఇది ఒక సాధారణ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ద్వారా సంఘటితం చేయబడింది. ఇది ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. తయారీదారుడు ఇది పెద్ద రహదారులపైన 15.05 kmpl మైలేజ్ ని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అయితే, ఇది నగరాలలో 12.8 kmpl మైలేజ్ ని ఉత్పత్తి చేస్తుందని, ఇది ఈ విభాగంలో చాలా యోగ్యకరమైనదని అన్నారు.

శక్తి సామర్థ్యం:


ఈ మూడు వేరియంట్స్ కూడా ఒక ఆధునిక 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటాయి. ఇది ఇప్పుడు మరింత శక్తిని అభివృద్ధి చేయడంతో పాటుగా ఒక మంచి ఇంధన వ్యవస్థను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ ప్లాంట్ 4000rpm వద్ద 147.94 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. అదే సమయంలో, ఇది 1500 నుండి 3000 rpm పరిధిలో 320Nm అత్యధిక టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ మోడల్ సిరీస్ వ్యారీకోర్ డీజిల్ ఇంజన్, నైపుణ్యమైన ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో అనుసంధానించబడి ఉంది. ఇది 13 నుండీ 14 సెకన్ల మధ్యలో 100kmphగుర్తును దాటుకుని వెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో, అది లోపల కూర్చొని ఉన్న ప్రయాణీకులకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించేలా 180 నుండి 185 kmph అత్యధిక వేగాన్ని ఇది చేరుకోగలుగుతుంది.

వెలుపలి డిజైన్:


ఈ మోడల్ సిరీస్ యొక్క తాజా వెర్షన్ ఒక అందమైన బాహ్య రూపంతో వస్తుంది మరియు ఇది విశేషమైన చాలా అంశాలను కలిగి రోడ్లపై ఒక ఆకర్షించే లుక్ ను ఇస్తుంది. దీని ముందు ముఖద్వారం విషయానికొస్తే, రేడియేటర్ గ్రిల్ చాలా పెద్దదిగా మరియు మూడు క్రోమ్ ట్రీటెడ్ స్లాట్స్ తో బిగించబడి ఉంటుంది. ఈ గ్రిల్ మధ్యలో చెక్కబడిన ఒక చిహ్నం అమర్చబడి ఉంటుంది. దీని పక్కవైపు ఒక స్టైలిష్ హెడ్ లైట్ క్లస్టర్ ఉంటుంది. ప్యూర్ ఎల్ ఎక్స్ మరియు ప్లెజర్ వేరియంట్స్, ప్రొజెక్టర్ బీమ్ తో కూడిన డ్యూయల్ బ్యారెల్ హెడ్ల్యాంప్స్ తో కలిసి ఉంటాయి. అయితే, దీని ప్రైడ్ ట్రిమ్ ఒక బ్లాక్ బెజెల్ హెడ్ లైట్ క్లస్టర్ ను కలిగి ఉంది. ఇది దాని మొత్తం రూపానికి జత చేస్తుంది. బంపర్ కారు బాడీ రంగు లో పెయింట్ చేయబడి ఉంది. దీనిలో విస్తృతమైన ఎయిర్ ఇంటేక్ విభాగం ఉండి ఎలాంటి సమయంలో అయినా సరే ఇంజను ను చల్లబరుస్తుంది. అదేవిధంగా బేస్ స్థాయి ట్రిమ్ లో ఎక్కువగా ఫాగ్ ల్యాంప్స్ అందుబాటులో లేవు. బంపర్ తో ఉన్న బ్లాక్ క్లాడింగ్ చిన్న చిన్న నష్టాలను నియంత్రిస్తుంది. విండ్స్క్రీన్ చాలా పెద్దగా మరియు గ్లాస్ తో ల్యామినేట్ చేయబడి ఉంటుంది. దీనిలో ఒక జత రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ను జత చేశారు. దీని సైడ్ ప్రొఫై లో బాడీ గ్రాఫిక్స్ తప్ప మిగతా ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది చాలా ఆసక్తికరమైన లక్షణాలతో రాబోతోంది. దీనిలో వెనుకవైపు రేర్ వ్యూ మిర్రర్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, విండో సిల్ మరియు సైడ్ మౌల్డింగ్ క్రోమ్ తో డిజైన్ చేయబడీ ఉంటాయి. దీని వీల్ ఆర్చెస్, దీనికి 17 అంగుళాల అలాయ్ వీల్స్ ను జత చేయడం వలన సైడ్ ప్రొఫైల్ ఇంకా ఆకర్షణీయంగా కనబడుతుంది. అయితే, బేస్ మరియు మధ్య శ్రేణి ట్రిమ్స్ లో 16 అంగుళాల స్టీల్ చక్రాల సమితి పూర్తి వీల్ కవర్లను కలిగి ఉంటుంది. ఇక రేర్ ఎండ్ విషయానికొస్తే, దీని కొత్త వెర్షన్లో కొంతమేరకు కాస్మెటిక్ మార్పులు చేయడం వలన చాలా అద్భుతమైనదిగా కనబడుతుంది. ఇది పునఃరూపకల్పన చేసిన ఒక స్పష్టమైన లెన్స్ టెయిల్ లైట్ క్లస్టర్ ను కలిగి ఉంది ఇది హాలోజెన్ ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్ల ఆధారంగా శక్తివంతమవుతుంది. ఇది విస్తృతమైన విండ్షీల్డ్ ను కలిగి ఉంది. అది హై మౌంట్ థర్డ్ బ్రేక్ లైట్ తో కలిసి ఉంటుంది. ఇది ఒక వైపర్ మరియు ఒక డీఫాగర్ ను టైమర్ తో సహా కలిగి ఉంది. ఇది ఒక పెద్ద బూట్ లిడ్ క్రోమ్ స్ట్రిప్ తో వస్తుంది మరియు ఇది సంస్థ యొక్క చిహ్నంను కలిగి ఉంటుంది. బంపర్ బాడీ రంగు లో ఉంటుంది మరియు ఇది ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ను కలిగి ప్రత్యక్షతను పెంచుతుంది. దీని రేర్ ప్రొఫైల్ కూడా క్రోమ్ తో అలంకరించిన ఒక జత ఎగ్జాస్ట్ పైపులను కలిగి ఉంది.

వెలుపలి కొలతలు:


ఈ దృఢమైన వాహనం 4780 mm పొడవు తో రూపొందించబడింది మరియు రెండు బాహ్య వెనుక వీక్షణ అద్దాలతో సహా 1895 mm తగు వెడల్పును కలిగి ఉంది. ఇది మొత్తం 1780 mm ఎత్తును కలిగి ఉండగా, కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm ఉంది. ఇది ఎలాంటి రోడ్డు పరిస్థితులనైనా ఎదురుకోగలుగుతుంది. దీనిలో చాలా పెద్ద వీల్ బేస్ 2850 mm కలిగి, విస్తారమైన లెగ్ రూమ్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది సుమారు ఒక పెద్ద 60 లీటర్ల డీజిల్ ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది మరియు ఇది దూర ప్రయాణాలు చేసే వారికి చాలా మంచిదిగా ఉంటుంది.

లోపలి డిజైన్:


వాహనతయారీ దారుడు దాని లోపలి విభాగంను అందంగా ప్రీమియం నాణ్యత మెటీరియల్స్ ను ఉపయోగించి రూపకల్పన చేశారు. దీని హై ఎండ్అగ్ర శ్రేణి వేరియంట్ నలుపు మరియు ప్లమ్ రంగు స్కీమ్ తో దాని ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. క్యాబిన్ చాలా విశాలంగా కనీసం ఏడుగురు వ్యక్తులు కూర్చోవడానికి సరిపోయేలా స్థలాన్ని కలిగి ఉంది. డాష్బోర్డ్ విలక్షణముగా రూపొందించబడి, ఒక కేంద్ర కన్సోల్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఇది బ్రష్డ్ మెటాలిక్ ఇన్సర్ట్స్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, వివిధ ఫంక్షన్లతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఒక పెద్ద గ్లోవ్ బాక్స్ మరియు ఏసి వెంట్స్ వంటి కొన్ని లక్షణాలను దీనిలో అమర్చారు. ఇన్స్ట్రుమెంట్ పానెల్ ఒక డిజిటల్ టాకొమీటర్, స్పీడోమీటర్, ఇంధన గేజ్, బయటి టెంపరేచర్ డిస్ప్లే, డోర్ అజార్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ నోటిఫికేషన్ మరియు ఇంకా కొన్ని నవీకరించబడిన ఇతర అంశాలను దీనిలో అనుసంధానం చేసారు. దీని క్యాబిన్లో క్యుషన్ సీట్లతో హెడ్ రీస్ట్రెయిన్స్ అడ్జస్టబుల్ ఫంక్షనుతో వస్తుంది. ఈ ప్రైడ్ వేరియంట్ లోని సీట్లు నలుపు మరియు ప్లం రంగు లెదర్ తోలుతో తయారు చేయబడి ఉన్నాయి. అయితే, ఇతర ట్రిమ్స్ లో మాత్రం లేత గోధుమరంగు ఫాబ్రిక్ సీటు కవర్లు ఉన్నాయి. రెండవ వరుసలో సీటు మడుచుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇది కారు యొక్క బూట్ వాల్యూమ్ పెంచడంలో సహాయపడుతుంది. దీని యొక్క లోపలి వైపు డోర్ హ్యాండిల్స్ క్రోమ్ తో పూత పూయబడి ఉంటాయి. ఇవి లోపలి భాగానికి ఒక క్లాసీ లుక్ ను అందిస్తాయి. దీనిలో డ్రైవర్ యొక్క సీటు ఎత్తును పెంచేందుకు లంబర్ సపోర్ట్ తో కూడిన వ్యవస్థ ఉంది. ఇది సౌలభ్య స్థాయిని పెంచుతుంది. ఈ అధ్యయనాలే కాక అనేక వినియోగ ఆధారిత కోణాలను దీనిలో అమర్చారు. అవి ఒక ఆధునిక డ్రైవర్ సమాచార వ్యవస్థ, రూఫ్ స్టోరేజ్ బిన్స్, గాగుల్ కేసెస్, కప్ హోల్డర్లు, ఎఫెక్ట్ కూలింగ్ గ్లోవ్ బాక్స్, ముందు సీటు బ్యాక్ పాకెట్స్, మరియు అనేక ఇతర అంశాలను దీనిలో పొందుపరిచారు. టాప్ ఎండ్ ట్రిమ్ లో సాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ తో అనుసంధానం చేసారు మరియు అలాగే దాని స్టీరింగ్ వీల్, ఆడియో , ఫోన్ నియంత్రణలను కూడా కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ విలాసవంతమైన బహుళ ప్రయోజనకర వాహనం ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తూ అనేక రకాల సౌకర్యాలతో కూడి ఉంది. యజమానులకు తగినంతగా లెగ్ రూమ్ మరియు షోల్డర్ స్పేస్ ఉంది. దీనిలో రెండవ మరియు మూడవ వరుసలలో సీట్లు మడుచుకోవచ్చు. ఇవి పిల్లర్ మౌంటెడ్ ఎయిర్ వెంట్లతో కలిసి ఉంటాయి. డ్రైవర్ సీట్ ఆరు విధాలుగా సర్దుబాటు చేసుకునే ఫంక్షన్ తో వస్తుంది మరియు అలాగే ఇది లుంబర్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంది. వీటితోపాటుగా భద్రతా ప్రమాణాలను జోడించే ఎత్తు సర్దుబాటు చేసుకోగల సీటు బెల్ట్ లను కలిగి ఉంది. దాని మధ్య శ్రేణి ట్రిమ్ లోని అల్ట్రాసోనిక్ రివర్స్ గైడ్ వ్యవస్థ వాహనం పార్కింగ్ విషయంలో డ్రైవర్ కి మంచి సహాయాన్ని అందిస్తుంది. ప్రైడ్ వేరియంట్ ఇన్ బిల్ట్ రివర్స్ గైడ్ కెమెరా తో అనుసంధానం చేయబడిఉండి మరింతగా సౌలభ్యాన్ని అందిస్తుంది. దీనిలోని జిపిఎస్ నావిగేషన్ వ్యవస్థ ముందే లోడ్ చేసుకున్న మ్యాప్స్ యొక్క డైరెక్షన్ ను గుర్తించడంలో సహయం చేస్తుంది. ఇది ఒక ఆధునిక 2-డిన్ ఇంటిగ్రేటెడ్ ఆడియో యూనిట్ తో అందజేయబడుతుంది దీని వలన దాని ప్రయాణీకులకు వారి ప్రయాణం సాగే వరకు వినోదాన్ని అందిస్తుంది. ఇది ఒక సిడి, యుఎస్బీ సపోర్ట్ తో ఎంపి3 ప్లేయర్, ఆక్స్-ఇన్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటి వంటి లక్షణాలను కలిగి ఉంది. టాప్ ఎండ్ ట్రిమ్ లో హర్మాన్ ద్వారా రూపొందించబడిన 360 వాట్ జెబిఎల్ సంగీత వ్యవస్థ తో అమర్చబడి ఉంది, ఇది 8 ఛానల్ యాంప్లిఫైయర్ మరియు పది స్పీకర్లను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కోసం సెంటర్ కన్సోల్ లో ఒక 12 వోల్ట్స్ శక్తి అవుట్లెట్ ను కలిగి ఉంది. వీటితోపాటుగా ఇది డోర్ మౌంటెడ్ మ్యాగజైన్ హోల్డర్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ మరియు ఫోల్దబిల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, లగేజ్ లైటింగ్, సన్ విజర్, మరియు కొన్ని ఇతర అంశాలను కలిగి ఉంది. వీటితోపాటు, ఈ బహుళ ప్రయోజనం వాహనం, రిమోట్ కీ యాక్సెస్, ఎంబెడెడ్ రేడియో యాంటెన్నా, కాంబో -స్విచ్లు, హెడ్ల్యాంప్ అడ్జస్టబుల్ ఆన్ రిమైండర్ , శీతలకరణి స్థాయి సూచిక, డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్ తో కూడిన నాలుగు పవర్ విండోస్ మరియు ఒక బహుళ సమాచార డిస్ప్లే వంటి కీలక అంశాలను దీనిలో పొందుపరిచారు. ఇది కూడా డ్రైవర్ ద్వారా సెట్ చేసుకుని రహదారులపై స్థిరమైన వేగాన్ని కొనసాగించడానికి ఒక ప్రగతిశీల క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది అన్ని సీట్ల వరుసలలో స్వతంత్రంగా నియంత్రించుకోవడానికి వీలుగా ఒక మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ఉంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ లో ఆడియో మరియు కాల్ నియంత్రణ బటన్లను ఉపయోగించేందుకు ఒక బహుళ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ తో దీనిని అనుసంధానం చేశారు.

లోపలి కొలతలు:


ఈ యుటిలిటీ వాహనం సులభంగా ఏడుగురు ప్రయాణికులకు వసతిని కల్పించే విధంగా ఒక భారీ అంతర్గత క్యాబిన్ ను కలిగి ఉంది. ఇది 970mm హెడ్ స్పేస్ ను, రెండవ వరుసలో 770 mm లెగ్ రూమ్ ను కలిగి ఉన్నాయి. ఇవి వాటి మిగతా క్లాస్లో వాటి కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. మరోవైపు, ఇది మూడవ వరుసలో 970mm హెడ్ స్పేస్ ను కలిగి ఒక భారీ క్యాబిన్ వలె చూపిస్తుంది. ఇది 60 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉండి, దూరపు ప్రయాణాలకు చాలా యోగ్యకరముగా ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


తయారీదారుడు ఈ అద్భుతమైన మోడల్ సిరీస్ ను ఒక శక్తివంతమైన 2.2 లీటర్ వ్యారీకోర్ డీజిల్ ఇంజన్ తో విలీనం చేసారు. ఇది 2179 cc స్థానభ్రంశం సామర్థ్యంను కలిగి ఉంది. ఈ తాజా వెర్షన్ దాని ఇంజన్ లో చేసిన కొన్ని మార్పులతో మార్కెట్ లో పరిచయం చేసాడు. ఇది ఎక్కువ శక్తివంతమైనదిగా మరియు ఎక్కువ ఇంధన సామర్ధ్యంను కలిగి ఉంటుంది. ఇది ఒక డబుల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4 సిలిండర్లు 16 వాల్వ్స్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ వ్యవస్థతో సంఘటితం చేయబడి ఉంటుంది. ఇది రహదారులపై గరిష్టంగా 15.05 kmpl మైలేజ్ అందించడంలో సహాయపడుతుంది. ఈ ఇంజన్ చాలా నైపుణ్యంతో కూడిన 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇది దాని ఫ్రంట్ వీల్స్ కి టార్క్ ను అందించడంలో తోడ్పడుతుంది. హై ఎండ్ వేరియంట్లో మాత్రం 4*4 వ్యవస్థతో టార్కును దాని 4 వీల్స్ కి పంపుతుంది. ఈ మిల్లు 4000 rpm వద్ద గరిష్టంగా147.94 bhp శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగిఉంది మరియు ఇది 1500 నుండి 3000 rpm పరిధిలో 320Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మోడల్ సిరీస్ 2- డిన్ స్టీరియో ఆడియో సిస్టమ్ వంటి అనేక ఆధునిక లక్షణాలను తో అందించబడుతుంది. ఇది ఒక సిడి/ ఎంపి3 ప్లేయర్ తో వస్తుంది మరియు అలాగే స్పీకర్లను కూడా కలిగి ఉంది. ఇది ఒక మంచి ధ్వని అనుభవంను ఇస్తుంది. అదనంగా, హై ఎండ్ ట్రిమ్ లో బ్లూ 5 కనెక్ట్ ఫంక్షన్ ను అందిస్తున్నారు. ఇది 5 ఫోన్లకు హ్యాండ్ ఫ్రీ పెయిరింగ్ ఆపరేషన్ ను అందించడంలో సహాయపడుతుంది. వీటితోపాటుగా, సెంట్రల్ కన్సోల్ లో యూఎస్బి మరియు ఆక్స్ ఇన్ పోర్ట్ కూడా ఉంది. అలాగే , ఇది పోర్టబుల్ ఆడియో పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. దాని ప్రైడ్ వేరియంట్లో ముఖ్యాంశం ఏమిటనగా, హర్మాన్ చే రూపొందించబడిన ఒక 360 వాట్ జెబిఎల్ ఆడియో వ్యవస్థ. ఇది పది స్పీకర్లతో వస్తుంది మరియు దాని స్టీరింగ్ వీల్ మౌంట్ ఆడియో నియంత్రణలను కలిగి ఉంది. ఈ వాహనం నావ్ టెక్ అనే ఒక సాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ తో అనుసంధానం చేయబడి ఉంది. ఇది సరైన దిశను ఎంచుకోవడంలో డ్రైవర్ కి సహాయం చేస్తుంది. వీటితో పాటు, వినియోగదారులు కూడా దీనిని బాహ్య మరియు అంతర్గత భాగాలలో వివిధ ఉపకరణాలతో అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. స్టైలిష్ బాడీ డెకల్స్ , రూఫ్ రెయిల్స్, స్పోర్టి రేర్ స్పాయిలర్, సైడ్ స్టెప్, టర్న్ ఇండికేటర్ తో కూడిన ఔట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, నడ్జ్ గార్డు , క్రోమ్ గ్రిల్ మరియు ఇంకా కొన్ని ఇతర లక్షణాలను దీనిలో జత చేశారు. అదే సమయంలో, ప్రవేశ స్థాయిలో వేరియంట్ యొక్క అంతర భాగాలు ఒక ఆధునిక సంగీతం వ్యవస్థ, నావిగేషన్ సిస్టమ్, ఇల్యూషన్ స్కఫ్ ప్లేట్స్, ఫ్లోర్ మ్యాట్స్, లెదర్ సీట్స్ వంటి అనేక ఇతర అంశాలతో అనుసంధానం చేశారు.

వీల్స్ పరిమాణం:


ఇది ప్రవేశ మరియు మధ్య స్థాయి వేరియంట్ల యొక్క వీల్ ఆర్చ్లు పూర్తి వీల్ కవర్లను కలిగి 16 అంగుళాల స్టీల్ చక్రాల సమితితో బిగించబడి ఉంటాయి. ఈ రిమ్స్ మరింతగా 235/70R16 పరిమాణం గల అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటుంది. అయితే, దాని అగ్ర శ్రేణి వేరియంట్ మాత్రం 17 అంగుళాల అలాయ్ వీల్స్ తో అందమైన సెట్ తో దాని సైడ్ ప్రొఫైల్ లుక్ ను పెంచుతుంది. ఈ రిమ్స్ మరింతగా 235/70 R17 పరిమాణపు రేడియల్ టైర్లను కలిగి ఉంటాయి. కంపెనీ కూడా ఒక పూర్తి పరిమాణం గల అదనపు వీల్ ను అందించింది. ఈ వీల్ ను మరియు టైర్ ను మార్చుటకు కావలసిన ఇతర టూల్స్ ను కూడా బూట్ కంపార్ట్మెంట్లో భద్రపరుస్తారు. ఇది అన్ని వేరియంట్లలో లభ్యమవుతుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


తయారీదారుడు ఈ బహుళార్ధసాధక వాహనాన్ని సమర్థవంతమైన బ్రేకింగ్ అలాగే ఒక నమ్మకమైన సస్పెన్షన్ విధానంతో పొందుపరిచాడు. దీని యొక్క ఫ్రంట్ వీల్స్ ధృఢ నిర్మాణంగల వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లతో పాటుగా క్యాలిపర్స్ ను కలిగి ఉన్నాయి మరియు సాలిడ్ డిస్క్ బ్రేకులు వెనక వీల్స్ కి అమర్చారు. ఇది మరింతగా, ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఇది కార్యాచరణను మరియు సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఇంకా, ఇది ఒక ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ తో పాటుగా ట్రాక్షన్ నియంత్రణతో కూడి దాని స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇక సస్పెన్షన్ వ్యవస్థ విషయానికి వస్తే, తయారీదారుడు దాని ముందు యాక్సిల్ కు ఒక స్వతంత్ర్య డబుల్ విష్ బోన్ తో జోడించారు మరియు వెనుక ఒక 5 లింక్ సస్పెన్షన్ వ్యవస్థను అందించారు. ఈ యాక్సిల్స్ మరింతగా కాయిల్ స్ప్రింగ్స్ తో లోడ్ చేయబడి ఉండి, ఒక మెరుగుగైన విధానాన్ని అందించడంలో తోడ్పడతాయి. ఇది ఒక టిల్ట్ సర్దుబాటు ఫంక్షన్ తో కూడిన ఒక శక్తి సహాయక స్టీరింగ్ సిస్టమ్ తో అనుసంధానించారు. ఇది అత్యంత బాధ్యతాయుతంగా మరియు పీక్ ట్రాఫిక్ పరిస్థితులలో కూడా సులభంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ స్టీరింగ్ వీల్ 5.6 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్దతునిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


వాహన తయారీదారుడు ప్రాయాణికుల రక్షణ కోసం అనేక కీలకమైన భద్రత కోణాలను దీనిలో అనుసంధానం చేశారు. ఇది ప్రాయాణికులకు ఎలాంటి ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది మొత్తం ఆరు ఎయిర్బ్యాగ్స్ (డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్, సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్బ్యాగ్స్) ఇవి ఏవైనా ప్రమాదాలు జరిగిన సమయంలో బాగా ఉపయోగపడతాయి. ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటుగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో అమర్చబడి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు ట్రాక్షన్ నియంత్రణ కార్యక్రమాలను కూడా కలిగి ఉంటుంది. దీని ఇంజిన్ ఇమ్మొబిలైజర్ పెరిమెట్రిక్ అలారం వ్యవస్థతో వస్తుంది మరియు ఇది ఎవరైనా దొంగతనానికి పాల్పడినపుడు లేదా అనధికార ఎంట్రీ నుండి వాహనాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది డ్రైవర్ కు మరియు యజమానులకు సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ ను జారీ చేస్తుంది. ఈ అధ్యయనాలే కాకుండా, రివర్స్ గైడ్ వ్యవస్థ, సెంట్రల్లీ హై మౌంట్ థర్డ్ బ్రేక్ లైట్, ఒక జత ముందువైపు ఫాగ్ ల్యాంప్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో పాటుగా పిల్లల భద్రతకు రేర్ డోర్స్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది. ఈ వాహనం హైడ్రోఫార్మ్ చాసిస్ ఫ్రేమ్ కలిగిన ఒక రీన్ఫోర్స్డ్ బాడీ నిర్మాణంతో వస్తుంది. ఇది క్యాబిన్లో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా రక్షణను ఇస్తుంది. ఈ భద్రతా లక్షణాలు అన్ని కలిసి ఈ వాహనాన్ని దీని సెగ్మెంట్లలో ఒక సురక్షితమైన వాహనంగా పరిగణలోకి తీసుకోవచ్చు.

అనుకూలాలు:


1. దీని వ్యారీకోర్ ఇంజిన్ మంచి యాక్సెలరేషన్ తో ఒక మంచి పనితీరును అందిస్తుంది.
2. ఆకర్షణీయమైన బాడీ రూపం దీని బాహ్య లుక్ ను పెంచుతుంది.
3. అంతర్గత క్యాబిన్ అనేక అధునాతన సౌకర్యంవంతమైన అంశాలతో కూడిఅమర్చబడి ఉంది.
4. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఆఫ్-రోడింగ్ మీద వెల్లగలిగే సామర్థ్యంను కలిగి ఉంది.
5. చాలా తక్కువ టర్నింగ్ వ్యాసార్థం ఉండడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.

ప్రతికూలాలు:


1. ఇప్పటికీ దాని అంతర్గత రూపకల్పనను అభివృద్ధి చేయవలసిన ఆస్కారం ఉంది.
2. ధర పరిధి ఎక్కువగా ఉంది.
3. బేస్ స్థాయి ట్రిమ్ లో సంగీతం వ్యవస్థ లేదు మరియు అనేక సౌకర్యవంతమైన లక్షణాలు కూడా లేవు.
4. ఇంజన్ శబ్దం మరియు హార్ష్ నెస్ ను మరింత తగ్గించవలసిన ఆస్కారం ఉంది.
5. ఇంధన సామర్ధ్యం కూడా ఇంకా కొంచెం మెరుగుపరచవలసిన అవసరం ఉంది.