రెనాల్ట్ లాడ్జీ

` 7.8 - 12.9 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

రెనాల్ట్ ఇతర కారు మోడల్లు

 
*Rs

రెనాల్ట్ లాడ్జీ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


రెనాల్ట్ ఇండియా, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ కి చెందిన ఈ యొక్క అనుబంధ కంపెనీ, దేశపు ఆటోమొబైల్ మర్కెట్ లో రేనాల్ట్ లాడ్జి అనె ఓ కొత్త ంఫ్వ్ ని ప్రవేశ పెట్టింది. ఇది ఇటీవల ముంబై మెట్రోపాలిటన్ నగరంలో జరిగిన ఒక మెగా ఈవెంట్ లో ఆవిష్కరించబడింది. దీనిని మొత్తం ఏడు వేరియంట్లలో కొనుగోలుదారులకు ఎంచుకోవడానికి అందించారు. ప్రస్తుతం, ఇది రెండు వేర్వేరు శక్తిని అందించే డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. ఇందులో అమర్చబడిన 1.5-లీటర్ డ్Cఇ మిల్లు, ఈ కంపెనీ యొక్క ఇతర మోడల్లో కూడా బిగించబడి ఉన్నది. ఇది 245ణ్మ్ టార్క్ తో పాటు 108.45భ్ప్ శక్తి ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడింది. అయితే ఇదే ఇంజన్ దిగువ శ్రేణి వేరియంట్లలో 83.8భ్ప్ గరిష్ట శక్తి మరియు, 200ణ్మ్ టార్క్ ను పంపిణీ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో వస్తుంది.

ఈ వాహనం యొక్క బేస్ వేరియంట్లు ఎన్నో ఆధునిక అంశాలు కలిగి ఉన్నాయి. అవి ఆభ్S, ఏభ్ఢ్, ఆC యూనిట్, శరీర రంగు గల బంపర్లు, పవర్ స్టీరింగ్ మరియు ఇంజిన్ ఇమ్మొబిలిజెర్ వంటివి ప్రామాణికంగా అందించారు. ఈ ంPV ఆధునిక సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టెంలు కలిగి ఉంటుంది. ఈ ప్రముఖ కంపెనీ దీనిని అత్యద్భుతంగా నిర్మించింది. ఇది అల్యూమినియం పూత ఉన్న మిశ్రమ లోహ చక్రాలు, క్రోమ్ రేడియేటర్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్ వంటి అంశాలతో వస్తుంది. అయితే, దీని అంతర్గత క్యాబిన్ ను కూడా చాలా ఆకర్శణీయంగా, రెండు వేర్వేరు రంగులతో రూపుదిద్దబడింది. ఇందులో కొన్ని వినూత్నమైన అంశాలతో మార్కెట్లో ప్రవేశపెట్టారు. అవి ఏంటంటే పార్కింగ్ సెన్సార్స్, ఆన్ బోర్డు ట్రిప్ కంప్యూటర్, ంఎడిఅణాV నావిగేషన్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఇతర కొన్ని అంశాలు కలవు. భద్రత విశయానికి వస్తే, ఇందులో ఆటోమేటిక్ డోర్ లాకింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, వెనుక డీఫోగ్గర్ వంటి అంశాలు అత్యధిక రక్షణను అందిస్తాయి.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఇందులో అమర్చబడిన డీజిల్ ఇంజన్ కామన్ రైల్ ఆధారిత ఫ్యూయెల్ ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థతో అమర్చబడి ఉంది. ఇది సుమారుగా 19.98క్మ్ప్ల్ నుండి గరిష్ట 21.04క్మ్ప్ల్ మైలేజ్ ను ఇవ్వడనికి తొడ్పడుతుంది.

శక్తి సామర్థ్యం:


కారు తయారీదారి ఈ వహనాన్ని 1.5 లీటర్ డీజిల్ ఇంజనుతో అందించింది. ఇది 3750ర్ప్మ్ వద్ద 83.8భ్ప్ గరిష్ట శక్తి మరియు, 1900ర్ప్మ్ వద్ద 200ణ్మ్ టార్క్ ను పంపిణీ చేస్తుంది. అయితే, ఇదే మిల్లు దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో 4000ర్ప్మ్ వద్ద 108.45భ్ప్ శక్తి మరియు, 1750ర్ప్మ్ వద్ద 245ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


దీని యొక్క 108.45భ్ప్ శక్తినిచ్చే డీజిల్ ఇంజన్, ఈ వహనాన్ని 170క్మ్ఫ్ గరిష్టత వేగాన్ని సాధించడానికి సహాయపడుతుంది. అదే సమయంలో, దీనిని 13 సెకన్లలో 100క్మ్ఫ్ అవరోధాన్ని దాటేందుకు తొడ్పడుతుంది. మరోవైపు, దాని తక్కువ శక్తి ఉత్పత్తి చేసే మిల్లు, వాహనాన్ని 160క్మ్ఫ్ గరిష్టత వేగాన్ని సాధించడానికి అనుమతిస్తుంది. పికప్ పరంగా, ఇది సుమారు 100క్మ్ఫ్ వేగ పరిమితి దాటడానికి 15 సెకన్లు తీసుకుంటుంది.

వెలుపలి డిజైన్:


కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ ంPV మంచి శరీర నిర్మాణం కలిగి ఉంటుంది. ఈ విభాగంలో ఉన్న ఇతర వహనాలతో పొల్చి చూస్తే, ఇది కొన్ని అద్భుతమైన వెలుపలి అంశాలతో వస్తుంది. దీని యొక్క ముందు ప్రొఫైల్ ను గమనిస్తే, రేడియేటర్ గ్రిల్ కొత్తగా మరియు వినూత్నంగా క్రోం పూతతో అమర్చబడి ఉంది. ఈ గ్రిల్ మధ్యలో సంస్థ యొక్క లోగో పొందుపరచబడి ఉన్నది. దీని చుట్టూ మంచి రూపకల్పన గల హెడ్ లైట్ క్లస్టర్ బిగించబడి ఉంది. ఇది కారు యొక్క ముందు ప్రొఫైల్ ను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. దీని క్రింద, నల్లటి రంగు స్ట్రిప్పులతో కూడిన బంపర్ ఉంది. ఇది తదుపరి రెండు గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంపులు మరియు ఎయిర్ డ్యామ్ తో బిగించబడి ఉన్నది. ఈ ంPV యొక్క సైడు విభాగం, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని వీల్ ఆర్చ్లులు అందమైన అల్లాయ్ వీల్సుతో వస్తాయి. అంతే కాకుండా, దీనికి శరీర రంగు ఓఱ్Vంస్ మరియు డోర్ హ్యాండిల్స్ తో సహా నలుపు రంగు బి-పిల్లర్లు కలవు. మరో వైపు, దీని వెనుక ప్రొఫైల్ లో పెద్ద టైల్ లైట్ క్లస్టర్, విండ్స్క్రీన్, మూడవ బ్రేక్ లైట్, లైసెన్స్ ప్లేట్ మరియు టైల్ గేట్ వంటి అంశాలు ఉన్నాయి.

వెలుపలి కొలతలు:


రెనాల్ట్ లాడ్జి యొక్క మొత్తం పొడవు 4498మ్మ్ మరియు వెడల్పు 1751మ్మ్ ఉంటుంది. దీని మొత్తం ఎత్తు 1697మ్మ్ ఉండగా, దీని వీల్బేస్ 2810మ్మ్ కొలతతో చాలా విశాలంగా ఉంటుంది. అయితే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 174మ్మ్ మరియు, ఈ వాహనం యొక్క టర్నింగ్ వ్యాసార్ధం 5.55 మీటర్లు ఉంటుంది.

లోపలి డిజైన్:


దీని యొక్క అంతర్గత భాగాన్ని చూస్తే, ఈ వాహనం ఆశించిన దాని కంటే చాలా విశాలంగా కనిపిస్తుంది. దీనిని ఏడు మరియు ఎనిమిది సీట్ల ఆకృతీకరణతో అందించడం వల్ల కొనుగోలుదారులకు మంచి ఆప్షన్లను ఎంచుకొవడానికి అనుమతినిస్తుంది. దాని కాక్పిట్ విభాగంలో ఇద్దరు, మరియు రెండు ఇంకా మూడవ వరుసలలో కనీసం ఆరుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. డ్రైవర్ సీటుకు ఎత్తు సర్దుబాటు సౌకర్యం కలదు. మరోవైపు, దాని ఏడు సీట్లు వెర్షన్ లో, రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఇంకా అర్మ్ రెస్త్స్ ఉంటాయి. అయితే, ఏడు సీటింగ్ ఆప్షన్ ఱ్xZ వేరియంట్ లొ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కంపెనీ యొక్క ఇతర మోడల్స్ వలె, దీనిని కూడా రెండు రంగులతో అద్భుతంగా అలంకరించారు. దీని డాష్బోర్డ్ కు పొందుపరచబడి ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వలయాలు క్రోమ్ పూతతో ఆకర్శణీయంగా కనిపిస్తుంది. ఇది రెండు అనలాగ్ మీటర్లు, డిజిటల్ డిస్ప్లే మరియు కొన్ని నోటిఫికేషన్ ల్యాంపులతో వస్తుంది. తదుపరి, ఒక నిల్వ బాక్స్, ఆఛ్ వెంట్లు, కొన్ని నియంత్రణ స్విచ్లు వంటివన్ని డాష్బోర్డ్ కు పొందుపరచబడి ఉన్నాయి. స్టీరింగ్ వీల్ మూడు స్పోక్ డిజైన్ లో ఉంటుంది. దీనిని సంస్థ యొక్క బాడ్జ్ తో పాటు లోహ పూతతో అలంకరించబడినది. అయితే, ఈ ఫీచర్ అగ్ర శ్రేణి వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. వీటితోపాటు క్యాబిన్ లో కప్ హోల్డర్స్, స్టోరేజ్ యూనిట్, సన్ వైసర్స్, నేల తివాచీలు మరియు పవర్ సాకెట్ల వంటి అనేక వినియోగ అంశాలు ఉన్నాయి.

లోపలి సౌకర్యలు:


కారు తయారీదారు దీనిని మొత్తం మీద ఏడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. దీని యొక్క సీటింగ్ ఆకృతీకరణకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇది ప్రస్తుతం, ఏడు మరియు ఎనిమిది సీట్ల ఆప్షన్ తో అందించబడింది. మెరుగైన డ్రైవింగ్ సౌకర్యం కోసం దీని ఏడు సీట్ల వెర్షన్ లోని రెండో వరుసలో కెప్టెన్ సీట్లను అమర్చబడినది. డ్రైవర్ సీటు ఆర్మ్ రెస్ట్ మరియు ఎత్తు సర్దుబాటు చేసుకొనె ఫంక్షన్లతో వస్తుంది. అయితే, ఈ ఫీచర్ అగ్ర శ్రేణి వేరియంట్ లొ మాత్రమే లభయ్మవుతుంది. మరో వైపు, దాని బేస్ వేరియంట్ లలో కొన్ని ప్రామాణిక అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే శక్తి సహాయక స్టీరింగ్, మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ సిస్టెం, కప్ హోల్డర్లు మరియు కొన్ని నిల్వ యూనిట్లు ఉన్నాయి. అయితే, ఆన్ బోర్డు ట్రిప్ కంప్యూటర్, ఎలక్ట్రో-హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్, యాంటీ-పింఛ్ఛ్ ఫంక్షన్ లాంటి అంశాలు మధ్య శ్రేణి వేరియంట్లలో ఉన్నాయి. మరో వైపు, దీని యొక్క రెండవ మరియు మూడవ సీట్ల వరుసలో గాలి వెంట్లు అమర్చబడి ఉన్నాయి. ఇవి ప్రయాణీకులందరికీ అత్యంత ఆహ్లాదకరమైన అనుభవాన్ని కలిగిస్తుంది. తదుపరి, ఇందులో క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఫ్లైట్ ట్రే మరియు తొలగించగల మూడవ వరుస సీట్లు ఉన్నాయి.

లోపలి కొలతలు:


ఈ సరికొత్త ంPV వెలుపల నుండి చాలా కాంపాక్ట్ గా కనిపిస్తుంది, కానీ దాని క్యాబిన్ స్పేస్ చాలా విశాలంగా వుంటుంది. ఇది ఏడుగురు నుండి ఎనిమిది ప్రయాణికులు కూర్చొనే విధంగా రూపొందించబడింది. ఇది 207 లీటర్ల బూట్ వాల్యూమ్ తో నిర్మించబడింది. కానీ, ఈ స్థలాన్ని వెనుక సీట్ మడవటం ద్వారా 589 లీటర్ల వరకు విస్తరించవచ్చు. అంతే కాకుండా, రెండవ వరుస సీట్లు మడవటం ద్వారా దీనిని ఇంకా 1861 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ వాహనమును 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో మార్కెట్ లో ప్రవెశపెట్టారు. ప్రస్తుతం ఈ విభాగానికి చెందిన రెనాల్ట్ డస్టర్ మరియు ఇతర కొన్ని మోడల్స్ లో అదే మిల్లు అమర్చబడి ఉంది. ఇది 1461cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది ఢోఃC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లు మరియు పదహారు కవాటాలతో అమర్చబడి ఉంది. ఈ మోటార్ 108.45భ్ప్ గరిష్ట శక్తి తో పాటు 245ణ్మ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జతచేయబడింది. మరోవైపు, ఇదే మిల్లు దిగువ శ్రేణి వేరియంట్లలో కూడా అమర్చబడి ఉంది కానీ, ఇది కేవలం 83.8భ్ప్ శక్తి తో పాటు 200ణ్మ్ టార్క్ ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో వస్తుంది. తదుపరి, రాబోయే కాలంలో దీనిని పెట్రోల్ వెర్షన్ లో ప్రవెశపెట్టే అవకాశం కూడా ఉంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ కారు తయారీదారు ఇందులో ఎన్నో వినూత్నమైన అంశాలను అందించింది, ఇందులో ంఎడిఅణవ్ సిస్టెం ఒకటి. ఇది టచ్స్క్రీన్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది ఆడియో స్ట్రీమింగ్ కోసం వివిధ కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. ఇది ఊSభ్ పోర్ట్, ఆఊX-ఈన్ సాకెట్లు మరియు భ్లుఎటూత్ కనెక్టివిటీ తో సహా వస్తుంది. అయితే, దీని మధ్య శ్రెణి వేరియట్లలో 2-ఢీణ్ ఆడియొ సిస్టెం బింగించబడి ఉంది. ఇది Cఢ్ ప్లేయర్ సహా ఆధునిక ఆర్కమ్య్స్ సిస్టెం తో వస్తుంది. ఇవి కాకుండా, కంపెనీ కొనుగోలుదారులకు మరెన్నో ఆప్షనల్ అంశాలను అందిస్తుంది. ఇవి ఏంటంటే సైడ్ స్కర్ట్స్, బోనెట్ స్కూప్, వెలుపల ఆకట్టుకొనే గ్రాఫిక్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ గైడ్ ఇంకా మరెన్నో సౌకర్యాన్ని మరియు రక్శణను ఇచ్చే అంశాలను ఎంచుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


రెనాల్ట్ లాడ్జి యొక్క అగ్ర శ్రీణి ఱ్xZ వేరియంట్లు 15-అంగుళాల అలాయ్ వీల్స్ తో బిగించబడి ఉన్నాయి. ఈ తేలికైన మిశ్రమ లోహ చక్రాలు 185/65 ఱ్15 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్ల తో అమర్చబడి ఉన్నాయి. మరోవైపు, దాని బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు వీల్ కవర్స్ తో వస్తాయి. ఇవి 15-అంగుళాల స్టీల్ చక్రాలు కలిగి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ ంPV ఆధునిక బ్రేకింగ్ సిస్టెం తో అమర్చబడి వస్తుంది. దీని యొక్క ముందు చక్రాలు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేకులతో మరియు దాని వెనుక చక్రాలు డ్రమ్ బ్రేక్లులతో బిగించబడి ఉన్నాయి. అదే సమయంలో, ఈ కంపెనీ దీని యొక్క బ్రేకింగ్ విధానాన్ని మెరుగుపరచేందుకు, యాంటి-లాక్ బ్రేకింగ్ తో సహా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టెమును కూడా అందించారు. ఈ ప్రత్యేక అంశం అన్ని వేరియంట్లలోను లభ్యమవుతుంది. మరోవైపు, ఇది పవర్ సహాయక స్టీరింగ్ సిస్టెం తో వస్తుంది. అంతే కాకుండా , దీని యొక్క స్పీడ్ డెపెండెంట్ ఫంక్షన్ సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సస్పెన్షన్ పరంగా, ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్ ను మక్ఫెర్సొన్ స్ట్రట్ తో మరియు వెనుక ఆక్సిల్ ను టార్షన్ బీం తొ అమర్చబడినది. అదనంగా, ఈ రెండిటిని యాంటి-రోల్ బార్ల తో అమర్చారు. ఇవి వహనాన్ని స్థిరంగా వుంచేందుకు తొడ్పడతాయి.

భద్రత మరియు రక్షణ: ఈ ంPV సిరీస్ ను ఎన్నో భద్రత అంశాలతో ఈ కంపెనీ అందించింది. ఇవి వాహనం మరియు ప్రయాణీకులకు అవసరమైన రక్షణ కలిగిస్తుంది. ఇది యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టెం ఇంకా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఆధునిక అంశాలతో వస్తుంది. మూడు పాయింట్ల ఏళ్ఱ్ సీట్ బెల్టులు ప్రయాణీకులందరికి అందజేసారు. మరో వైపు, దీనికి డోర్ అజార్ హెచ్చరిక, శక్తివంతమైన హెడ్ల్యాంప్స్ మరియు మూడవ బ్రేక్ లైట్లు ఉన్నాయి. అదే సమయంలో, డ్రైవర్ యొక్క సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ డోర్ లాక్, కీ లెస్ ఎంట్రీ ఫంక్షన్, ఇంకా మరి కొన్ని అంశాలు. ఇంతే కాకుండా, ఈ వాహనములో ముందు రెండు ఎయిర్బ్యాగ్స్, ముందు సీట్ బెల్ట్ ఎత్తుని సర్దుబాటు చెసుకొనే ఫంక్షన్, వెనుక డిఫోగ్గెర్ కూడా వున్నాయి. ఇదులో ఇంజిన్ ఇమ్మొబిలైజర్ కూడా ఏర్పాటు చేసారు. ఇది కారుని దొంగతనం లేదా ఏదైనా అనాధికార ఆక్సెస్ నుండి పరిరక్షిస్తుంది. అయితే, ఇందులోని అనేక భద్రత అంశాలు ఱ్xZ వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతాయి.

అనుకూలాలు:1) సూక్ష్మ బాహ్య రూపం దీని యొక్క అతి పెద్ద అనుకూలత.
2) డీజిల్ ఇంజిన్ ప్రదర్శన చాలా బాగుంది.
3) విశాలమైన క్యాబిన్ స్పేస్ చాలా సౌకర్యాన్ని ఇస్తుంది.
4) ఆభ్S ఇంకా ఏభ్ఢ్ అన్ని వేరియంట్లలో అందించబడింది.
5) దీని యొక్క ప్రారంభ ధర తక్కువగా ఉంది.

ప్రతికూలాలు:1) గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా కొంచెం పెంచవచ్చు.
2) ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ప్రామాణికమైన అంశంగా ఇవ్వవచ్చు.
3) ఇంధన అభివృద్ధి చేయవచ్చు.
4) ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేకపోవడం నిరాశాజనకం.
5) అంతర్గథ డిజైన్ ను ఇంక మెరుగుపరచవచ్చు.