మారుతి వాగన్-ఆర్-స్టింగ్రే

` 4.5 - 5.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి వాగన్-ఆర్-స్టింగ్రే వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెట్ లో అనేక బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు అందించింది. అటువంటి వాటిలో అందమైన హాచ్బాక్ మారుతి వ్యాగన్ఆర్ స్టింగ్రే. ఈ మోడల్ సిరీస్ మూడు వేరియంట్లో అందుబాటులో ఉంది. అందులో ఒకటి 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 998 సీసీ డిస్ప్లేస్మెంట్ సామర్థ్యంతో 67.06bhpశక్తి ని మరియు 90Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ కేబుల్ టై గేర్ షిఫ్ట్ బాక్స్ జత చేయబడుతుంది. ఇంకా ఈ వాహనం ఫ్రేమ్ రకం ఫ్రంట్ సస్పెన్షన్ వ్యవస్థ చేర్చబడి డ్రైవర్ కి మంచి అనుబూతిని అందిస్తుంది. దాని డిస్క్ మరియు డ్రమ్ ఆపే యంత్రాంగం చాలా నమ్మకమైన మరియు గరిష్ట భద్రత నిర్ధారిస్తుంది. ఇది కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు దాని ప్రయాణీకులకు రక్షణ అధిక స్థాయిలో ఇచ్చే భద్రత అంశాలను కలిగి ఉంది. వీటిలో కొన్ని యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ ఎస్ ఆర్ ఎస్ ఎయిర్బాగ్, తెలివైన కంప్యూటరీకరణ యాంటీ దొంగతనం వ్యవస్థ మరియు అనేక ఇతర వంటి కీలక లక్షణాలతో అందించబడుతున్నాయి. బాహ్య లుక్స్ పరంగా, ఈ హాచ్ మరింత అందంగా కనిపిస్తోంది. ఇంతలో, రిఫ్లెక్టర్ రేడియేటర్ గ్రిల్ మరియు పెద్ద హెడ్ల్యాంప్స్ వంటి అంశాలు దీని ముందర భాగాన్ని బోల్డ్ గా కనిపించేలా చేస్తుంది. అయితే, దాని వెనుక భాగం క్రోమ్ అలంకరించిన టెయిల్ ల్యాంప్స్ మరియు ఒక స్పోర్టి స్పాయిలర్ ని కలిగి ఉంది. దీని లోపల భాగానికి వస్తే, కాబిన్ పూర్తి క్రోమ్ ఇన్సర్ట్స్ కలిసి నలుపు రంగు స్కీమ్ తో అలంకరించబడి ఉంటుంది. అలానే దీనిలో మంచి సౌకర్యం అందించే సీట్లు, అలానే కొన్ని లక్షణాలు కలిగినటువంటి బాగా రూపకల్పన చేసిన డాష్బోర్డ్ అందుబాటులో ఉంది. దీనిలో విశాలమైన లెగ్రూం అలానే హెడ్ స్పేస్ కూడా అందించడం జరిగింది. దీనితో పాటుగా దీనిలో విశాలమైన బూట్ కంపార్ట్మెంట్ అందించడం జరిగింది. అంతేకాక, అది కూడా 12వి అనుబంధ సాకెట్, డ్రైవర్ వైపు నిల్వ షెల్ఫ్ , సహాయ గ్రిప్ మరియు కప్ హోల్డర్లతో పాటు కొన్ని ఇతర అంశాలతో అందించబడుతుంది. దీనిలో ఆడియో వ్యవస్థ ఉండడం మరో ఆశక్తికరమైన అంశం. అలానే, దీనిలో ఉన్నతమైన ధ్వనిని అందించే స్పీకర్లు, పవర్ పనిచేసే విండోస్, ఎయిర్ కండీషనింగ్ యూనిట్, వంపు స్టీరింగ్ వీల్, టాకొమీటర్, విద్యుత్ తో సర్దుబాటు తలుపు అద్దాలు వంటి లక్షణాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ ఆకర్షణీయమైన రంగు ఎంపికలు అందిస్తుంది. ఇది మిగతా వాహనాలయినటువంటి నిస్సాన్ మైక్రా, టాటా బోల్ట్, హ్యుందాయ్ ఐ 10, హోండా బ్రియో వంటి కార్లతో పోటీ పడుతుంది. అయితే, ఇది 24 నెలలు లేదా 40, 000 కిలోమీటర్ల ఒక ప్రామాణిక వారంటీ, తో అందించబడుతుంది. కొనుగోలుదారులు వారంటీ కాలాన్ని మరింతగా పెంచవచ్చు. కొనుగోలుదారులు ఈ కాలాన్ని అధనపు ఖర్చుతో పెంచుకోవచ్చు. వారంటీ కాలం రెండు సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్లు పెంచవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీనిలో కె సిరీస్ పెట్రోల్ ప్లాంట్ బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థ తో అమర్చబడి ఉంటుంది. ఇది హైవేస్ లో 20.51kmpl మైలేజ్ ని అందిస్తుంది. అయితే, ఈ మైలేజ్ నగర పరిధిలలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న కారణంగా 16 నుండి 17 కిలోమీటర్ల వరకూ తగ్గచ్చు.

శక్తి సామర్థ్యం:


ఈ హాచ్ తేలికైన పెట్రోల్ ఇంజిన్ తో అమర్చబడి 6200rpm వద్ద 67.06bhp శక్తిని మరియు 3500rpm వద్ద 90Nm టార్క్ ని అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనంలో ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి ఉంటుంది. దీని వలన వాహనం గరిష్టంగా 120 నుండి 130కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. అలానే ఇది 15 సెకెన్లలో 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


ఈ వాహనం ఏరోడైనమిక్ శరీర నిర్మాణం కలిగి ఉండి కొన్ని గుర్తించదగిన లక్షణాలతో అమర్చబడి ఉంటాయి. దాని వైపు ప్రొఫైల్ తో ప్రారంభిస్తే, నల్లని రంగు బి-పిల్లర్స్, డోర్ హ్యాండిల్స్ మరియు స్పోర్టీ సైడ్ స్కర్ట్లను కలిగి ఉంటుంది. దీని ఎల్ ఎక్సై వేరియంట్లో వెనుక వ్యూ మిర్రర్స్ నల్లని రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి. అదే మిగతా వేరియంట్లో శరీర రంగులో అందించబడి ఉంటాయి. దీనిలో డోర్ మిర్రర్స్ తెలుపు రంగు సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అమర్చబడి ఉంటాయి. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో వీల్ ఆర్చులు స్టీల్ వీల్ సమితితో అమర్చబడి వీల్ కవర్స్ తో కప్పబడి ఉంటాయి. వీల్ కవర్స్ పైన ఎస్-బాడ్జింగ్ కూడా కలిగి ఉంటుంది. దీనిలో వి ఎక్సై మరియు వి ఎక్సై ఆప్ష్నల్ వేరియంట్లు ఆకర్షణీయమైన గన్ మెటల్ గ్రే కలర్ అలాయ్ వీల్స్ సమితితో అమర్చబడి స్పోర్టీ లుక్ ని ఇస్తాయి. దీనిలో వెనుకభాగం వైపు బాగా చెక్కిన బంపర్ శరీర రంగులో పెయింట్ చేయబడి ఉంటుంది. అలానే దీని బూట్ కంపార్ట్మెంట్ పైన క్రోమ్ స్ట్రిప్ మరియు సంస్థ యొక్క బాడ్జ్ అమర్చబడి ఉంటుంది. దీనిలో టెయిల్ లైట్ క్లస్టర్ చాలా పొడవుగా మరియు సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అమర్చబడి ఉంది. దీని విశాలమైన విండ్స్క్రీన్ డీఫాగర్ మరియు వైపర్ తో అమర్చబడి ఉంటుంది. ఇంకా ఇది హై మౌంట్ స్టాప్ ల్యాంప్ తో అమర్చబడి ఉన్న ఒక స్పోర్టి స్పాయిలర్ కలిగి ఉంది. దీని విశాలమైన విండ్స్క్రీన్ టింటెడ్ గ్లాస్ మరియు ఒక జత వైపర్స్ సమితితో అమర్చబడి ఉంటాయి. దీనిలో రిఫ్లెక్టర్ రేడియేటర్ గ్రిల్ చాలా ఆకర్షణీయంగా మరియు క్రోమ్ పూతతో అందించబడుతుంది. అంతేకాక, సంస్థ యొక్క లోగో కూడా ఈ గ్రిల్ యొక్క సెంటర్ వద్ద చిత్రించబడి ఉంటుంది. ఈ గ్రిల్ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లు కలిగియున్నటువంటి సొగసైన మరియు వ్యక్తీకరణ హెడ్లైట్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది. దీని ముందరి భాగం ఇంజిన్ కూలింగ్ కోసం ఒక గాలి తీసుకొనే విభాగం అమర్చబడినటువంటి శరీర రంగు బంపర్ ని కలిగి ఉంటుంది. దీని వలన ఇంజిన్ చల్లబడుతుంది. ఇది తదుపరి ఒక జత ఫాగ్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


కొలతలు పరంగా, ఇది మొత్తం పొడవు 3636mm, ఎత్తు 1670mmమరియు దీని వెడల్పు వెనుక వ్యూ అద్దాలతో కలిపి 1475mm. దీని పొడవైన వీల్బేస్ 2400mm కలిగి ఉండి కాబిన్ ని చాలా విశాలంగా ఉండేందుకు తోత్పడుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165mm మరియు టర్నింగ్ రేడియస్ 4.6 మీటర్లు. ఇది పక్కన పెడితే, దీని ముందర ట్రేడ్ 1295mm మరియు వెనుక ట్రేడ్ 1290mm. వాహనం మొత్తం 1350 కిలోలు బరువును కలిగి ఉంటుంది.

లోపలి డిజైన్:


దీనిలో ప్రీమియం నలుపు రంగుతో అలంకరించబడిన ఒక విశాలమైన క్యాబిన్ ఉంటుంది. దీనిలో అందరి ప్రాణికులకి పుష్కలమైన లెగ్ స్పేస్ ఉండడం వలన ప్రయాణికులకి వారి ప్రయాణం అంతా సాఫీగా జరుగుతుంది. ఇది మంచి కుషన్ సీట్లతో అందుబాటులో ఉంది. ఈ సీట్లు సౌకర్యం కోసం అమర్చబడి ఉన్నాయి. సంస్థ ఈ సీట్లు నాణ్యత వస్త్రం గల అపోలిస్ట్రీ తో కప్పబడి ఇవి తదుపరి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్రైన్స్ మరియు ఫోల్డబుల్ సీట్లు కలిగి ఉంటాయి. . ఇవి మంచి సౌకర్యం అలానే మద్దతును అందిస్తాయి. ఈ సీట్లు కవర్ చేసేందుకు నాణ్యమైన అపోలిస్ట్రీ ని సంస్థ అందజేస్తుంది. తదుపరి సంస్థ దీనికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్రైన్స్, వెనుక సీటు ఫోల్డింగ్ ఫంక్షన్ తో వచ్చి బూట్ కంపార్ట్మెంట్ సామర్ధ్యాన్ని పెంచుతుంది. మరోపక్క, కాక్పిట్ క్లాస్సి పియానో బ్లాక్ ఫినిషింగ్ మరియు కొన్ని ఆధునిక పరికరాలు తో అమర్చిన బాగా రూపకల్పన డాష్బోర్డ్ తో చాలా స్టైలిష్ కనిపిస్తోంది. ఇది ఒక మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు విశాలమైన గ్లోవ్ బాక్స్ కంపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. దీనిలో స్టైలిష్ సెంటర్ కన్సోల్, ఒక మ్యూజిక్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటుంది. అలానే, క్రోమ్ పూత గల ఎయిర్ వెంట్లు క్యాబిన్ ని చల్లబరిచేందుకు ఉపయోగపడతాయి. ఇది పక్కన పెడితే, ఇది పలు విధులు మరియు కొన్ని నోటిఫికేషన్లు ప్రదర్శించే నీలం రంగుతో ప్రకాశవంతమైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ నికలిగి ఉంది. సంస్థ తదుపరి డోర్ ట్రింస్ కి ఫాబ్రిక్ ఉపయోగిస్తుంది మరియు ఆడియో నాబ్ ని క్రోమ్ తో అలకన్రిసంచి దాని లుక్ ని మరింతగా పెరిగేలా చేసింది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో స్టీరింగ్ వీల్ మంచి లెథర్ తో చుట్టబడి ఆడియో నియంత్రణలు అమర్చబడి ఉంటాయి. దీనిలో మూడు పొజిషన్లలో ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి ముందర, ఇంకొకటి వెనుక మరియు మూడవది బూట్ కంపార్ట్మెంట్ లో అందుబాటులో ఉంది. వీటితో పాటు, కాబిన్ లగేజ్ పార్సెల్ ట్రే, అచ్చుపోసిన పైకప్పు లైనింగ్ మరియు నీడిల్ పంచ్ ఫ్లోర్ కార్పెట్, డే/నైట్ అంతర్గత వెనుక వ్యూ మిర్రర్ వంటి అంశాలను కలిగి ఉంటుంది.

లోపలి సౌకర్యలు:


ఈ హాచ్బాక్ అనేకమైన వినూత్న లక్షణాలను కలిగి ఉంది. దీని వలన ప్రయాణికులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సీట్లుతో ప్రారంభిస్తే, దీనిలో సీట్లు కుషన్ తో అందించబడినవి. దీనిలో సీట్లు 60:40 స్ప్లిట్ మడత సౌకర్యంతో వస్తుంది. దీని వలన అధనపు సౌకర్యం చేకూరుతుంది. దీనిలో ముందర మరియు వెనుక విండోస్ పవర్ తో ఆపరేట్ అవుతాయి. దానితో పాటుగా ఫ్యూయెల్ లిడ్అలానే టెయిల్ గేట్ ఓపెనర్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిలో విద్యుత్ తో సర్దుబాటు చేయగల బయట వెనుక వీక్షణ అద్దాలు సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఇది హీటర్ మరియు రోటరీ నియంత్రణలను కలిగి ఉన్నటువంటి ఎయిర్ కండీషనింగ్ యూనిట్ తో అందుబాటులో ఉంది. దీనివలన గాలి ఎయిర్ వెంట్లు ద్వారా ఏకరీతిలో వ్యాప్తి చేందేందుకు సహాయపడుతుంది. ఈ ఎయిర్ వెంట్లు డాష్బోర్డ్ పైన అమర్చబడి ఉంటాయి. కారులో వినోదాన్ని అందించేందుకుగానూ ఇది ఒక ఒక సమగ్ర సంగీతం వ్యవస్థతో అమర్చబడి ఉంది. ఈ వ్యవస్థ ఎంపి3 ప్లేయర్ అలానే సహాయక ఇన్పుట్ ఎంపికలను అందిస్తుంది. దీనిలో స్టోరజ్ స్పేస్ లు కూడా అందుబాటులో ఉంది. దీని ముందరి ప్రయాణికుల క్రింద సీట్ ట్రే, డ్రైవర్ వైపు నిల్వ షెల్ఫ్ మరియు పుష్ టైప్ అదనపు నిల్వ స్థలాన్ని కూడా అందిస్తుంది. ఇది పక్కన పెడితే, డోర్ ట్రింస్ పైన మ్యాప్ పాకెట్స్, ముందరి ప్రయాణికుని సీటు వెనుక ప్యాకెట్, మరియు కప్ హోల్డర్ తో ఫ్లోర్ కన్సోల్ ఇవన్నీ కూడా మరింత సౌలభ్యాన్ని పెంచేందుకు అందించబడుతున్నాయి. అలానే, దీనిలో ప్రయాణికులు మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎల్క్ట్రానిక్ పరికరాలు చార్గింగ్ చేసుకునేందుకుగానూ 12వి పవర్ సాకెట్ అందుబాటులో ఉంది. పియానో ఫినిషింగ్ తో 3 స్పోక్ స్టీరింగ్ వీల్ టిల్ట్ అడ్జెస్ట్మెంట్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, బహుళ సమాచార ప్రదర్శన ఓడోమీటార్, టాకొమీటర్, ట్రిప్ మీటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ నోటిఫికేషన్ మరియు ఇంధన వినియోగం ఇవన్నీ కూడా డ్రైవర్ ని అప్డేట్ చేస్తాయి. అలానే, డ్రైవర్ వైపు టికెట్ హోల్డర్ తో పాటూ సన్ విజర్ మరియు పాసింజర్ వైపు వానిటీ అద్దం అందుబాటులో ఉంది.వీటితో పాటు అధనంగా, ఈ హాచ్ అధిక నాణ్యత స్పీకర్లు, రెక్లైంగ్ మరియు స్లైడింగ్ ఫంక్షన్ తో పూర్తి ఫ్లాట్ సీట్లు, ఫోల్డబుల్ గ్రిప్స్, పుష్ టైప్ కప్ హోల్డర్లు తో అమర్చబడిన ఇన్స్ట్రుమెంట్ పానెల్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్, టెయిల్ గేట్ ఓపెనర్ మరియు డిజిటల్ క్లాక్ ఇవన్నీ కూడా ప్రయాణికులకి సౌకర్యాన్ని అందిస్తాయి.

లోపలి కొలతలు:


వాహన తయారీదారుడు ఈ వాహనంలో ఐదుగురు ప్రయాణికులు కూర్చునే విధంగా సౌకర్యం కల్పించారు. దీనిలో పుధ్ఖలమైన లెగ్రూం అందుబాటులో ఉంది. అలానే, ముందర మరియు వెనుక లెగ్ స్పేస్ చాలా పుష్కలంగా ఉంటుంది. అలానే, దీనిలో పుష్కలమైన షోల్డర్ స్పేస్ ఉండి ప్రయాణికులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో 180లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ ఉంది. దీని వెనుక సీట్లు మడుచుకోవడం ద్వారా దీని సామర్ధ్యాన్ని మరింతగా పెంచవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ మోడల్ సిరీస్, 1.0 లీటర్ ఆల్ అల్యూమినియం, తేలిక బరువు కలిగిన కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, 998 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, భారత్ స్టేజ్ ఈవ్ మరియు ఓబిడి-ఈఈ ఎమిషన్ నిబంధనలను రెండిటినీ అనుకూలిస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ మూడు సిలండర్లను మరియు 12 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థ తో జత చేయబడి ఉంటుంది మరియు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు, ఈ ఇంజన్, అత్యధికంగా 6200 rpm వద్ద 67.06 bhp పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 3500 rpm వద్ద 90 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఈ పెట్రోల్ ఇంజన్, 20.51 kmpl మైలేజ్ ను అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ప్రయాణికులకి వినోదాన్ని మరియు ఆనందాన్ని అందించేందుకు గానూ ఈ వాహనం సంగీతం వ్యవస్థ తో అందించబడింది. కానీ ఈ లక్షణం మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లకి మాత్రమే ప్రామాణికంగా అందుబాటులో ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఆడియో యూనిట్ బ్యాక్ లిట్ బటన్ తో వచ్చి చూడడానికి చాలా స్టయిలిష్ గా కనిపిస్తుంది. ఇది యుఎస్బి పోర్ట్ అలాగే ఆక్సిలరీ ఇంపుట్ సాకెట్లకు మద్దతు ఇస్తుంది. అంతేకాక, కాబిన్ యొక్క ముందు మరియు వెనుక భాగం సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ తో అద్భుతమైన శ్రవణ అనుభవాన్ని అందిస్తాయి. మరోవైపు, ప్రయాణికులు కూడా వాహనం వినియోగించటానికి అనేక లక్షణాలను ఎంచుకోవచ్చు. ఇంకా దీనిలో బాద్డీ డెకేల్స్, ఎల్ ఎక్స్ ఐ ట్రిమ్ లో అల్లాయ్ వీల్స్ సమితి, సైడ్ మౌల్డింగ్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు అనేక ఇతర అంశాలు అందుబాటులో ఉంటాయి. అలానే, దీని లోపల నాణ్యత లెదర్ సీటు కవర్లు, కారు పెర్ఫ్యూం, నావిగేషన్ సిస్టమ్, స్టీరింగ్ వీల్ కవర్, ఆటో డిమ్మింగ్ అద్దం మరియు కొన్ని ఇతర అంశాలు అందించడం జరుగుతుంది.

వీల్స్ పరిమాణం:


దీనిలో మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లు స్టయిలిష్ గన్ మెటల్ గ్రే కలర్ అలాయ్ వీల్స్ తో అమర్చబడి స్పోర్టి లుక్ ని ఇస్తుంది. తలో, దాని ప్రవేశ స్థాయి ఎల్ ఎక్స్ ఐ వేరియంట్లు స్టీల్ వీల్స్ తో అమర్చబడి 'ఎస్ బాడ్జ్ ని కలిగి ఉన్న వీల్ కవర్ తో కప్పబడి ఉంటుంది. ఈ రింస్ అన్నీ కూడా155/65 R14 పరిమాణం గల తదుపరి ట్యూబ్ లేని రేడియల్ టైర్ల తో కప్పబడి మంచి పట్టు ని అందిస్తాయి. వీటితో పాటూ బూట్ కంపార్ట్మెంట్ లో అధనపు చక్రం అందించబడింది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ మోడల్ సిరీస్ లో ఉన్న చాలా ఉత్తమమైన విషయాలలో బ్రేకింగ్ వ్యవస్థ ఒకటి. దీని ముందరి వీల్స్ వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లు సమితితో అమర్చబడి ఉండగా, దీని వెనుక బ్రేక్లు డ్రమ్ బ్రేక్లుల సమితితో అమర్చబడి ఉన్నాయి. దీని అగ్ర శ్రేణి వేరియంట్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండి ఈ విధానాన్ని మరింతగా పెంచేందుకు సహాయపడుతుంది. మరోవైపు, ఇది ఒక సమర్ధవంతమైన సస్పెన్షన్ వ్యవస్థతో అమర్చబడి వాహనాన్ని స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అమర్చబడి ఉండగా, దీని వెనుక ఆక్సిల్ ఐసొలేటెడ్ ట్రెయిలింగ్ లింక్ తో అమర్చబడి ఉంటుంది. ఇది తదుపరి కాయిల్ స్ప్రింగ్స్ తో అమర్చబడి అసమాన రోడ్ పరిస్థితుల సమయంలో కలిగే జెర్క్స్ ని ఎదుర్కోడంలో సహాయపడుతుంది. ఇది పక్కన పెడితే, ఇది ఒక ఎలెక్ట్రానిక్ పవర్ సహాయక స్టీరింగ్ వ్యవస్థ తో అమర్చబడి అసాధారణమైన ప్రతిస్పందన ఇస్తుంది . ఇది టిల్ట్ అడ్జస్టబుల్ ఫంక్షన్ తో అమర్చబడి భారీ ట్రాఫిక్ పరిస్థితుల్లో డ్రైవర్ యొక్క శ్రమను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

భద్రత మరియు రక్షణ:


వాహన తయారీదారుడు ఈ వాహనానికి అనేక భద్రతా లక్షణాలు అమర్చారు. దీని వలన ప్రయాణికులకు మరింత భద్రత చేకూరుతుంది. దీనిలో కొలాప్సబుల్ స్టీరింగ్ వీల్, ప్రకాశవంతమైన హెడ్ల్యాంప్స్ మరియు వెనుక విండో డిఫాగర్ వంటి భద్రతా అంశాలు కలవు. అలానే దీని వెనుక డోర్లకు చైల్డ్ సేఫ్టీ లాక్స్ పిల్లల భద్రత కొరకు అందించడం జరిగింది. అలానే దీనిలో సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ లాకింగ్ మరియు తలుపులు అన్లాకింగ్ కి సహాయపడతాయి. దీనిలో మూడు పాయింట్ ఇ ఆర్ ఎల్ సీట్ బెల్ట్స్ అందరి ప్రయాణికులకు అందుబాటులో ఉంది . అలానే సంస్థ మరింత భద్రత మెరుగుపర్చేందుకు సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ తో శరీర నిర్మాణం కలిగి ఉంది. అలానే దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ భద్రత కొరకు అందించబడింది. ఈ బ్రేకింగ్ వ్యవస్థ సడన్ గా బ్రేక్ వేసేటపుడు వాహనం దొర్లిపోకుండా కాపాడుతుంది. ఇది ఇంజిన్ ఇంజిన్ ఇమ్మొబలైజర్ తో కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా వాహనంలో ప్రవేశించే అనధికార ఎంట్రీ ని తొలగించవచ్చు. అలానే దీనిలో సీట్ బెల్ట్ ఇండికేటర్ మరియు వార్నింగ్ బజర్ పైన లైట్స్ వంటి ఇతర అంశాలతో అందుబాటులో ఉంది. దీనిలో ఎయిర్ బాగ్స్ ముందర మరియు వెనుక సీట్లు వారికి అందుబాటులో ఉంది. దీనితో పాటుగా సీట్ బెల్ట్స్ కూడా అందించడం జరిగింది.

అనుకూలాలు:


1.అమ్మకాల తరువత సేవ చాలా బాగుంటుంది.
2.సమర్ధవంతమైన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం ఉండడం అనుకూలత.
3.ధర పరిధి చాలా అనుకూలంగా ఉంటుంది.
4.హెడ్ స్పేస్ మరియు షోల్డర్ స్పేస్ చాలా పుష్కలంగా ఉంటుంది.
5.దీనిలో పెట్రోల్ ఇంజిన్ మంచి మైలేజ్ ని అందిస్తుంది.

ప్రతికూలాలు:


1.దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది.
2.సామాను కంపార్ట్మెంట్ మరింత అభివృద్ధి చేయవచ్చు.
3.దీనిలో అన్ని వేరియంట్లకి లెథర్ సీటు కవర్లు ఇవ్వవచ్చు. 4.బాహ్య ప్రదర్శన మరింత ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. 5.కొన్ని మరింత సౌకర్య లక్షణాలు జోడించే ఆస్కారం ఉంది.