మారుతి వాగన్-ఆర్

` 3.9 - 5.3 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి వాగన్-ఆర్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యంశాలు


నవంబర్ 7, 2015: మారుతి వ్యాగన్ ఆర్ రూ. 4.76 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. అంతకుముందు ఈ కారు ఏఏంటి గేర్బాక్స్ తో అనధికారికంగా కనిపించిది. తయారీదారులు వారి బడ్జెట్ కార్లకు ఏఏంటి గేర్బాక్స్ ఎంపిక అందించే ప్రయత్నాలలో ఉన్నారు. దానికంటే ముందు వ్యాగన్ఆర్ అవన్స్ అనే వ్యాగన్ఆర్ పరిమిత ఎడిషన్ మోడల్ ని ప్రారంభించబడింది. అవన్స్, వ్యాగన్ ఆర్ యొక్క LXI మరియు Lxi CNG వేరియంట్లపై ఆధారపడి ఉంటుంది మరియు బ్లూటూత్ తో 2 డిన్ స్టీరియో, ద్వంద్వ టోన్ డాష్బోర్డ్, లేత గోధుమరంగు ఇన్సర్ట్స్ మరియు వెనుక సీట్ పవర్ విండోస్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. బాహ్య భాగాలలో ఈ కారు కొత్త బాడీ గ్రాఫిక్స్, గన్ మెటల్ రంగులో రూఫ్ రెయిల్స్, కీలెస్ ఎంట్రీ తో రేర్ స్పాయిలర్ మరియు సెంట్రల్ లాకింగ్/సెక్యురిటీ వంటి లక్షణాలను కలిగి ఉంది. అవన్స్ ఎడిషన్ LXI శ్రేణి కోసం రూ.4,29,944 లక్షల ధరకి అందించబడుతుంది మరియు LXI సిఎన్జి వేరియంట్ రూ.4,83,973 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకే అందించబడుతుంది.

అవలోకనం


పరిచయం


వ్యాగన్ ఆర్ ప్రపంచంలో పొడవు బాడీ డిజైన్ ని కలిగియున్న మొదటి కార్ల మధ్యలో ఉంది. చిన్న నోస్ మరియు దాదాపు నిటారుగా ఉండే నిష్పత్తులు ఈ కారుని చిన్న హ్యాచ్బ్యాక్ ల మధ్యలో ఉంచేందుకు సహాయపడుతుంది. దేశీయ మార్కెట్ నిజానికి వ్యాగన్ ఆర్ లో బాక్సీ ప్రపోషన్స్ ని తగ్గించింది. అయితే సంవత్సరాలుగా వ్యాగన్ఆర్ చాలా సముచిత మూల్యంగా అభివృద్ధి చేయబడింది. దాని 3 వ పునరుక్తి లో, వ్యాగన్ఆర్ అమ్మకాల పరంగా ఇప్పటికీ సంస్థకి అద్భుతమైన వాహనంగా ఉంది. అటువంటి విధంగా అమ్మకాలు పెంచుకొనేందుకు వ్యాగన్ఆర్ ఏమి చేస్తుంది? ఇక్కడ కనుక్కోండి!

అనుకూలతలు1.దీనిలో అతి ముఖ్యమైన అంశం స్థలం, ఇది చాలా విశాలమైన హ్యాచ్బ్యాక్.
2. ఈ వాహనంలో అద్భుతమైన పెట్రోల్ ఇంజిన్ అందించబడుతుంది. ఇది నగరానికి ఎంత పవర్ కావాలో అంత అందిస్తుంది.
3.అన్ని వేరియంట్లలో ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ఆప్ష్నల్ గా అందించబడుతుంది.
4.ఆప్షనల్ AMT డ్రైవర్ సౌలభ్యం కోసం అందించబడుతుంది.

ప్రతికూలతలు1.అంతర్గత భాగంలో ఉపయోగించిన మెటీరియల్ యొక్క నాణ్యత ఇంకా మెరుగుగా ఉండాల్సిన అవసరం ఉంది.
2. ఈ వాహనంలో NVH స్థాయులు అంత ఉత్తమంగా లేవు, క్యాబిన్ లో ఇంజిన్ శబ్ధం చాలా ఎక్కువగా ఉండడం ప్రతికూలత.
3. బ్రేకులు చాలా స్పాంజీ గా ఉంటాయి, దీనికి ఇంకా మంచి పెడల్ అందించాల్సింది.
4. దీనిలో డీజిల్ మోటార్ అందించబడలేదు మరియు చేవ్రొలెట్ బీట్ అదే ధర పరిధిలో డీజిల్ ఇంజిన్ ని అందిస్తుంది.

అద్భుతమైన లక్షణాలు1. ఈ వాహనంలో ఆప్ష్నల్ ఏఎంటి అందించబడి ప్రయాణాలలో చాలా అనుకూలంగా ఉంటుంది.
2. ఇంకా దీనిలో బేస్ వేరియంట్ నుండి ఎయిర్బ్యాగ్స్ మరియు ఆభ్శ్ వంటి భద్రతా లక్షణాలు అందించబడుతున్నాయి.

అవలోకనం


వ్యాగన్ఆర్ ఎంఎస్ఐఎల్ కోసం భారీ అమ్మకాలను కలిగి ఉంది. ఈ హ్యాచ్బ్యాక్ వాస్తవానికి నిజ రూపంగా ఉంటుంది. వ్యాగన్ఆర్ దేశంలో ఏ ఇతర హ్యాచ్బ్యాక్ లేనటువంటి విధంగా విభాగంలో ఆధిపత్యం చేస్తుంది. నిజానికి హ్యుందాయి శాంత్రో వాహనం తీసుకుంటే, వ్యాగన్ఆర్ అత్యుద్భమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ కారు యొక్క డిజైన్ కెయి కారు వారసత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాగన్ఆర్ పెద్ద గ్లాస్ హౌస్, పొట్టిగా మందంగా ఉన్న నోస్ మరియు పొడవైన ఎత్తు వంటి లక్షణాలతో దాని ముందు వాహనన్ని పోలి ఉంటుంది. అదే విధంగా ఇది మారుతి సుజుకి మూడు సిలిండర్ల, కె-సిరీస్ ఇంజిన్ తో ప్రారంభించబడిన మొదటి కార్లు మధ్య ఉంది. అత్యంత మితవ్యయం గల ఇంజిన్లు మధ్య ఇది పెట్రోల్ మరియు CNG ఇంధన ఎంపికలతో అందుబాటులో ఉంది. వ్యాగన్ఆర్ వాహనం విభాగంలో ఏ ఇతర వాహనం లేని విధంగా స్నేహపూర్వకమైన వాహనం.

సమగ్ర విశ్లేషణ


వ్యాగన్ ఆర్ 1999 లో తొలిసారి భారత మార్కెట్ లోనికి ఆవిర్భవించింది. ఇది మారుతి పోర్ట్ఫోలియో లో ఇతర హ్యాచ్బ్యాకుల వలే 1 లీటర్ మోటార్ ని కలిగి ఉంది. మారుతి సంస్థ వ్యాగన్ ఆర్ కి సమయానుకూలంగా అనేక నవీకరణలు చేసింది. కొద్దిగా రిఫ్రెష్ వెర్షన్ 2006 లో షోరూమ్ లోనికి వస్తుంది. ఈ హ్యాచ్బ్యాక్ 2010 లో A1 హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో మూడవ ఇన్నింగ్స్ లో ప్రవేశించింది. దీనికి ముందు ఈ వాహనం కాస్మెటిక్ నవీకరణలు పొందలేదు. వ్యాగన్ఆర్ వాహనానికి కొద్దిగా తిరిగి రూపకల్పన చేసిన గ్రిల్ మరియు బంపర్స్, అన్ని వేరియంట్స్ లో ఆప్ష్నల్ ఎయిర్బ్యాగ్స్ & ABS మరియు ఆప్ష్నల్ AMT వంటి నవీకరణలు ఇటీవల చేయబడ్డాయి.

బాహ్య రూపం


వ్యాగన్ ఆర్ కారు చాలా పొడవాటి డిజైన్ ని కలిగి ఉంది, దీని అర్ధం ఇది ఇరుకుగా ఉంటుంది కానీ చాలా పొడవైనది. ఉదాహరణకు, ఈ వాహనం చేవ్రొలెట్ బీట్ మరియు హ్యుందాయ్ ఐ 10 కంటే 100mmతక్కువ వెడల్పును కలిగి ఉంటుంది. అయితే, వ్యాగన్ ఆర్ చేవ్రొలెట్ బీట్ కంటే 180mm పొడవైనది మరియు హ్యుందాయి ఐ10 కంటే 150mm పొడవుగా ఉంటుంది. దీని బాక్సీ నిర్మాణం కారణంగా ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంది, ముఖ్యంగా క్యాబిన్ లోపల హెడ్ రూం చాలా విశాలంగా ఉంటుంది. ఈ వాహనం 2400mm వీల్బేస్ ని కలిగి ఉన్న నిస్సాన్ మైక్రా ఆక్టివ్ తరువాత రెండవ వాహనం.

Table 1 Image1_MaruthiWagonR ఈ వాహనం యొక్క ముదరి భాగం పెద్ద హెడ్ ల్యాంప్స్ ని కలిగి ఉన్నాయి, వాటిలో నీలం రంగు అందించబడి ఉంటుంది. దీని కారణంగా మారుతి సంస్థ దీనిని 'బ్లూ ఐడ్ బాయ్ ' అని పిలుస్తుంది. దీనిలో ఉన్న పెద్ద హెడ్ల్యాంప్స్ ఈ వాహానాన్ని చాలా విధేయంగా కనిపించేలా చేస్తాయి. దీని యొక్క గ్రిల్ టాప్ భాగంలో సన్నని క్రోం అందించబడుతుంది మరియు మధ్యలో పెద్ద చిహ్నం కలిగి ఉంది. అంతేకాకుండా దీనిలో పెద్ద మూడు స్లాట్ల ఎయిర్డ్యాం క్రింద అమర్చబడి మరియు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ అందించబడి ఉన్నాయి.

Image2_WagonR ప్రక్కభాగానికి వెళితే దీని యొక్క డిజైన్ బీట్ లో ఉన్న మాదిరిగా అధిక ముడతలు లేదా పదునైన పంక్తులు దీనిలో ఉన్నాయి. దీనిలో రెండు పేలవమైన లైన్స్ డోర్స్ చుట్టూ ఉంటాయి. ఒక పొడవాటి బాడీ తో వ్యాగన్ ఆర్ చదునైన A-పిల్లర్ మరియు పెద్ద గ్లాస్ ఏరియా ని కలిగి ఉంది. దీని సైడ్ ప్రొఫై లో వీల్ ఆర్చులు మరియు కొన్ని అద్భుతమైన లక్షణాలు దీనిని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తున్నాయి. ఇవి లేకుంటే దీని యొక్క ప్రక్క ప్రొఫైల్ చాలా బోరింగ్ గా కనిపిస్తుంది. అయితే అలాయ్ వీల్స్ ఏ ట్రిం లోని అందించబడలేదు, ఎవరైన వాటిని కావాలనుకుంటే డీలర్ వద్ద ఆప్షనల్ గా వస్తువుగా కొనుగోలు చేయవచ్చు.

Image3_WagonR ఈ కారు యొక్క వెనుక భాగం చూసినట్లయితే గనుక పొడవైన వైఖరి తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక ప్రొఫైల్ చూడడానికి అదే విధమైన టెయిల్ ల్యాంప్స్ తో ముందు తరం వ్యాగన్ ఆర్ ని యొక్క పరిణామంగా అంపిస్తుంది. పెద్ద విండ్ స్క్రీన్ టాప్ స్పెక్ VXi ట్రిమ్ లో వాష్ వైప్ ఫంక్షన్ తో విభాగంలో ప్రామాణికమైనదిగా వస్తుంది. వ్యాగన్ ఆర్ యొక్క ముందు రూపు వద్ద ఒక మందమైన క్రోం పట్టిక అమర్చబడి ఉంది. ఇది కూడా అధిక-మౌంట్ స్టాప్ ల్యాంప్ మరియు అధనంగా క్రిందకి అమర్చబడిన బ్రేకింగ్ లైట్స్ ని కలిగి ఉంది. క్యాబిన్ స్పేస్ పెంచడానికి మారుతి సంస్థ బూట్ స్పేస్ ని తగ్గించుకొని 180 లీటర్స్ ని కలిగి ఉంది.

Table 2 దీని యొక్క డిజైన్ చెవ్రొలెట్ బీట్ వలే ఈ వాహనం ఆకర్షణీయంగా లేదా బాక్సీ గా ఉండదు మరియు వ్యాగన్ఆర్ సాధరణ ఫిలాసఫీ ని ఫాలో అవుతుంది. సౌందర్య పరంగా వ్యాగన్ఆర్ యొక్క న్యూట్రల్ డిజైన్ అంత ఉత్తమంగా ఏమీ ఉండదు.

అంతర్గత భాగాలు


పెద్ద డోర్లు చక్కగా మరియు విశాలంగా ఉంటాయి. ఈ వ్యాగన్ ఆర్ వాహనంలో లోపలికి ప్రవేశించడం మరియు బయటకి వెల్లడం చాలా సులభం. మీరు కారు యొక్క క్యాబిన్ లోనికి వెల్లాలనుకుంటే నిస్సాన్ మైక్రా వలే లోనికి వెళ్ళి కూర్చుండి పోవలసిన అవసరం ఈ వాహనం తో రాదు. ఎందుకంటే దీనిలో చాలా విశాలమైన హెడ్ రూం అందించబడి ఉంటుంది. అధిక సీటింగ్ మీరు ముందు విండోల నుండి ఒక మంచి కమాండింగ్ వీక్షణ ఇస్తుంది.

Image4_MarutiWagonR దీని యొక్క అంతర్భాగాలు నలుపు మరియు లేత గోధుమ రంగు కలయికలో ఫినిషింగ్ చేయబడతాయి. సెంటర్ కన్సోల్ చుట్టూ అల్యూమిన్యం రంగు చేరికలు, డోర్ హ్యాండిల్స్ మరియు స్టీరింగ్ వీల్ ఉన్నాయి. అయితే డాష్బోర్డ్ యొక్క డిజైన్ గురించి వ్రాయడానికి ఏమీ లేదు, నాణ్యత ఖచ్చితంగా మునుపటి తరంతో పోలిస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది ఇప్పటికీ విభాగంలో బెంచ్మార్క్ గా కొనసాగుతున్న హ్యుందాయి ఐ10 వలే అంత ప్రాముఖ్యత చెందలేదు.

Image5_WagonR దీనిని చూడగానే దృష్టిని ఆకర్షించే ముఖ్యమైన అంశం, దీనిలో ఉండే ఆరెంజ్ రంగు చేరికల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది త్రీ పాడ్ యూనిట్, దీనిలో టాకొమీటర్,స్పీడోమీటర్ మరియు ఇండికేటర్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. దీనిలో స్పీడో యొక్క స్థావరం వద్ద ఒక చిన్న LCD స్ట్రిప్ అందించబడి ఉంటుంది, అది డిజిటల్ ఇంధన గేజ్ మరియు ఒక ఓడోమీటార్ తో అమర్చబడి ఉంటుంది.

Image6_WagonR సెంటర్ కన్సోల్ ఇంబిల్ట్ మ్యూజిక్ వ్యవస్థతో నిర్మించబడి ఉంటుంది మరియు ఎయిర్ కండిషనింగ్ కోసం కంట్రోల్స్ అమర్చబడి ఉంటాయి. దీనిలో డయిల్స్, స్విచ్చులు యొక్క స్థానాలు చూడడానికి బాగుంటాయి మరియు దీనిని సులభంగా చేరుకోవచ్చు మరియు ఆపరేట్ చేయవచ్చు. దీనిలో ఆడియో వ్యవస్థ CD, USB & రేడియో కి మద్దతు ఇస్తుంది మరియు నాలుగు స్పీకర్లతో జతచేయబడి ఉంటుంది. దీనివలన అవుట్పుట్ చాలా ఉత్తమంగా ఉంటుంది.

Image7_WagonR ఈ వాహనంలో ముందరి సీట్లు భారీగా ఉన్న వ్యక్తులకు కూడా చాలా మద్దతుని ఇస్తాయి. దీనికి గాను సహాయపడిన 1700mm ఎత్తు కి కృతజ్ఞత చెప్పాలి, వ్యాగన్ ఆర్ ముందర మరియు వెనుక అద్భుతమైన హెడ్ రూం కలిగి ఉంది. అయితే డ్రైవర్ మాత్రం కూర్చొనేటప్పుడు అతని భుజం సహ ప్రయాణికుడికి తగులుతుంది. దీనిలో స్టీరింగ్ వీల్ పెద్దది మరియు గ్రైని నిర్మాణం కలిగి ఉంటూంది. డ్రైవర్ కి సౌకర్యవంతమైన డ్రైవింగ్ స్థానం అందించేందుకు గానూ ఒక రేక్ (కోణం)లో సర్దుబాటు చేయబడి ఉంటుంది.

Image8_WagonR ఇదే స్టోరీ వెనుక బెంచ్ వద్ద ఉంటుంది. ఈ వాహనంలో హెడ్రూం ఇతర వాహనాల కంటే అద్భుతంగా ఉంటుంది. అయితే లెగ్రూం మాత్రం ఎక్కువ లేదా సమానంగా తక్కువగా ఉంటుంది. వ్యాగన్ ఆర్ ఉత్తమంగా నాలుగు సీట్లను కలిగి ఉంటుంది. కాకపోతే దీనిలో షోల్డర్ రూం తక్కువగా ఉండడం వలన వెనుక కూర్చొనే ప్రయాణికుడికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో సౌకర్యవంతమైన బ్యాక్ రెస్ట్ ఉన్న కారణంగా దూరపు ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుంది.

Image9_WagonR అంతర్భాగాల యొక్క మొత్తం డిజైన్ లో స్టొరేజ్ స్పేస్ చాలా విలక్షణంగా రూపొందించబడింది. సెంటర్ కన్సోల్ మరియు గేర్ లెవెర్ ఏరియా చుట్టూ ఒక జంట గ్లోవ్ బాక్స్లు మరియు కొన్ని చిన్న గది రంధ్రాలు ఉన్నాయి. వ్యాగన్ ఆర్ వాహనంలో సహ డ్రైవర్ సీట్ క్రింది నిల్వ స్థలం ఒక యునీక్ లక్షణం. వ్యాగన్ ఆర్ వాహనం అంతర్భాగాలలో కొద్దిపాటి డిజైన్ ని కలిగి ఉంది. దీనిలో కొద్దిగా షోల్డర్ రూం తో రాజీ పడాల్సి ఉంటుంది తప్ప మిగతావన్నీ కూడా ఈ విభాగంలో వ్యాగన్ ఆర్ ఔత్సాహికుల కోరికకు తగ్గట్టుగా ఉంటుంది.

పనితీరు


వ్యాగన్ ఆర్ వాహనం ఎంఎస్ఐఎల్ నుండి వచ్చిన మొదటి కార్లలో ఒకటి. ఇది అల్యూమినియం కె-సిరీస్ మోటార్ తో అందించబడుతుంది. కొత్త మోటార్ నవీకరించబడిన ఎమిషన్ విధానాలతో, కొత్తగా రిఫైన్ చేయబడుతుంది. ఈ హ్యాచ్ 3 సిలిండర్, 1.0 లీటర్ మోటార్ తో అమర్చబడి 67bhp శక్తిని అందిస్తుంది మరియు 90NM టార్క్ ని అందిస్తుంది. గణాంకాలను చూసుకుంటే గనుక రోజురోజుకి ఈ మోటార్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

Image10_WagonR కీ ని టర్న్ చేయగానే 3 సిలెండర్ ఇంజిన్ కి ఉన్న ప్రామాణికమైన శబ్ధంతో ప్రకంపనాలు వస్తాయి. ఈ వాహనంలో NVH స్థాయిలు ఐ 10 లేదా మైక్రా తో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంజిన్ శక్తివంతమైనది కనుక, తక్కువ వేగంతో వాహనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంజిన్ మీద అధనపు భారాన్ని వేయాల్సి ఉంటుంది. వాహనం వెనక్కి వెళ్ళేటప్పుడు క్యాబిన్ లోపల చాలా చాలా శబ్దం వస్తుంది. ఈ ఇంజిన్ నగరంలో ప్రయాణించేందుకు తగినట్టుగా ఉంటుంది. సహజంగా అధిక వెగంతో వెళ్ళాల్సి వచ్చిప్పుడు ఇంజిన్ భారంతో ఆయాశపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇది 120 కిలోమీటర్ల వేగం క్రింద వెళితే చలా ఉత్తమమైన డ్రైవింగ్ ని అందిస్తుంది. ఏఆర్ఏఐ రేట్ మైలేజ్ 20,51Kmpl గా నిలిచి విభాగంలో అత్యుత్తమంగా ఉంటుంది.

Table3

ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT)


వ్యాగన్ఆర్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అమర్చబడి ఉంటుంది. దీనిలో రెండు పెడల్స్ ఉన్నాయి మరియు ఒక సంప్రదాయ ఆటోమేటిక్ వాహనం లా ఆపరేట్ చేయబడుతుంది. కేవలం గేర్ లివర్ ని మార్చి బ్రేక్ సంస్థ మీద ఒత్తిడి తగ్గించడం ద్వారా వాహనం స్వయంగా ప్రయాణించే మోడ్ లోనికి సునాయాసంగా ఉంటుంది. క్లచ్ యొక్క ఆపరేషన్ హైడ్రాలిక్ చోదక వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది - తద్వారా డ్రైవర్ ఎడమ కాలిని క్లచ్ పై నుండి తీసేసి కూడా నడవచ్చు. ఈ మారుతి సంస్థ యొక్క వాహనంలో ఆంట్ అంత ఆకర్షణీయంగా ఉండదు. కారు గేర్ ని పైకి మరియు క్రిందకి మార్చే సమయాలలో కుదుపులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. మీరు సులభంగా మాన్యువల్ మోడ్ లోకి తరలించడం ద్వారా గేర్లను మార్చుకోవచ్చు.

రైడ్ & హ్యాండిలింగ్


మారుతి సంస్థ యొక్క స్టీరింగ్ లాగా ఇది తేలికగా ఉండి, ట్రాఫ్ఫిక్ మరియు నగర ప్రాంతాలలో కూడా ఇది సులభంగా వెల్లగలుగుతుంది. అయితే స్టీరింగ్ చాలా తేలికగా ఉండటం వలన రహదారులలో గానీ లేదా ఎక్కువ ఎత్తు ప్రదేశాలని అధిరోహించేటప్పుడు గానీ కొంచెం చిరాకు కలిగిస్తుంది. ఇది తక్కువ వేగంతో ఉన్నప్పుడు గోతులు ఉన్న ప్రాంతాలలో కూడా ఇది వెల్లగలుగుతుంది. కానీ అధిక వేగంతో వెళ్ళేటప్పుడు మాత్రం అత్యంత  సౌకర్యంగా  ఉండదు. అయితే పోల్చి చూసినప్పుడు మైక్రా అధిక వేగంతో వెళ్ళేటప్పుడు కూడా చాలా స్థిరంగా వెల్లగలుగుతుందని భావిస్తున్నారు.

భద్రత Image11_WagonR వ్యాగన్ఆర్ క్లిష్టమైన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు దానికి చాలా శక్తి అవసరం అవుతుంది. ఇటీవల చేసిన నవీకరణలలో అన్ని ట్రిమ్ స్థాయిల్లో కొత్త భద్రతా ఫీచర్లని ప్రవేశ పెట్టారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు వ్యతిరేక లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సిఎన్జి వేరియంట్ లు అన్నీ కూడా లభ్యం అవుతాయి

Table 4

వేరియంట్స్


Table 5

తుది విశ్లేషణ


మారుతి వ్యాగన్ ఆర్ వాహనం ముఖ్యంగా LXi (O) వేరియంట్ వెచ్చించిన డబ్బు కి తగినట్టుగా ఉంటుంది. ఈ వాహనం చూడడానికి అంత ఉత్తేజకరంగా లేనప్పటికీ ఈ వాహనం సాధారణంగా బాగుంటుంది. ఇది చాలా విశాలంగా, ఇంధన సామర్ధ్యం మరియు మారుతి సంస్థకి అమ్మకాల పరంగా అద్భుతమైన అమ్మకాలను అందిస్తుంది. వ్యాగన్ ఆర్ ఆచరణాత్మకమైన శైలిని అందిస్తుంది. మీరు గనుక ఆచరణాత్మక దృష్టితో గనుక చూసినట్లయితే వ్యాగన్ ఆర్ వాహనం మీరు వెచ్చిచిన డబ్బుకి సరైన న్యాయం చేస్తుంది.