మారుతి ఎర్టిగా

` 6.1 - 10.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి ఎర్టిగా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


మారితీ కంపెనీ అయిన కారు ఉత్పత్తిదారులు మన్నిక గల ప్రామాణాలకి పెట్టింది పేరు. ఇది ముఖ్యంగా భారతీయ మార్కెట్లలో భారీ కస్టమర్ బేస్ కలిగి ఉంది. మరో సారి ఈ కంపెనీ తన సామర్ధ్యాన్ని చూపించడంలో వెనుగిడలేదు. అందరికీ నచ్చే విధంగా మరియు అందరు మెచ్చే విధంగా రూపందించిన ఒక సరికొత్త కారే ఈ మరుతీ ఏర్టిగా. ఒక కారు నుండి వినియోగదారులు కోరుకునే అన్ని రకాల సదుపాయాలను ఈ కంపెనీ అందించడం జరిగింది. ఈ సీరీసు పెట్రోలు, డీజిలు మరియు సీఎంజీలలో లభ్యమవుతుంది. భారీ బూట్ స్పేస్ ఉండటం వలన దూర ప్రయాణాలకు ఈ కారు ఎంతో ఉపయోగపడుతుంది. మొత్తం ఏడుగురు ప్రయాణికులు కూర్చునే విధంగా ఈ కారుని తయారు చేయటం అయ్యింది. భద్రత విషయంలో కూడా ఎంతో మెరిగైన విధంగ ఎన్నో పరికరాలు అమర్చబడి వున్నాయి. వాహనం యొక్క భద్రత కోసం ఇమ్మొబిలైసర్, డ్రైవరు యొక్క రక్షణ కోసం ఏయిర్ బ్యాగ్స్, అలారం సిస్టము కలిగి వున్నాయి. దీనికి తోడుగా ఆకర్షనీయమైన మైలేజీ కూడా కలిగి వుండటంతో ఈ కారు యొక్క ప్రత్యేకత మరింతగా పెరుగుతుంది. హెడ్ రెస్ట్లతో పాటుగా సీటు బెల్ట్లు మరియు సీట్లు ఎత్తు సర్దుబాట్లతో కలిగి ఉంది. కప్ హోల్డర్లు మరియు అవసరమైన వస్తువులు పెట్టుకోడానికి చోటు అనేక ప్రదేశాలలో కల్పించబడి వుంది. అందంగా ఉండేందుకు అల్లొయి వీల్స్ ని మరియూ వాహనం అనుకువగా ఉండేందుకు డిస్కు బ్రేకులని అందించడం జరిగింది. ఈ కారు ఏడు వైవిద్యమైన రంగులలో లభ్యమౌతుంది. అన్ని రంగులూ ఒకదానిని మించి ఒకటి ఉంటాయి. ఒక శక్తివంతమైన ఇంజినుకి ఒక సమర్ధవంతమైన సస్పెన్షను తోడై ఈ కారు యొక్క పనితీరుని మరింతగా పెచుతాయి. ఈ కారు వినియోగదారుల కోసం ఒక గొప్ప ప్రయోజనం లాగా అందించబడుతున్న ప్రత్యేకత ఏమిటంటే, సర్వీసు స్టేషన్లు దేశవ్యప్తంగా ఎన్నో చోట్ల స్థాపించబడి వున్నాయి. ఇన్ని సౌకర్యాలు కలిగిన ఈ కారు, ఎన్నొ కార్లకి పోటీగా నిలుస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ కారు పెట్రోల్ మరియు దీజిలు వేరియంట్స్ తో పాటుగా, సీఎంజీ లో కూడా లభ్యమవుతుంది. డీజిలు కార్లకి కామన్ రైలు డైరెక్టు ఇంజెక్షన్ ఫ్యుఎల్ సప్ప్లై సిస్టము వుంది. ఇది సిటీ రోడ్లలో 17.2 కిలోమీటర్లని మరియూ రహదార్లలోనేమో 20.77 మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ కార్లకి మల్టీ పొయింట్ ఫ్యుఎల్ ఇంజెక్షన్ సిస్టము అమర్చబడి ఉంది. ఇందువల్ల, రహదార్లలో 16.2 కిలోమీటర్లని మరియు సితీలో 12.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎంజీ కార్లకి గాను 22.8 కిలోమీతర్ల మైలేజీ నమోదు అయ్యింది.

శక్తి సామర్థ్యం:


పెట్రోల్ వేరియంట్స్ కి కే-సీరీసు మోటారుని అమర్చారు. దీనికి నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వులు ఉన్నాయి. 6000ఆర్పీఏం వద్ద 93.7బీహేచ్పీ పవరుని, 4000 ఆర్పీఏం వద్ద 130ఎనెం టార్కుని విడుదల చేస్తాయి. సీఎంజీ కార్లేమో 80.9బీహెచ్పీ ని ఇంకా 110ఎనెం ని ఉత్పత్తి చేస్తాయి. అదే డీజిలు వేరియంట్స్ కి డీడీఐఎస్ మోటారుని బిగించగా, అవి 4000 ఆర్పీఏం వద్ద 88.8బీహెచ్పీ ని ఇంకా 1750ఆర్పీఏం వద్ద 200ఎనెం ని విడుదల చేసే సామర్ధ్యం కలిగి ఉన్నాయి.

ఏక్సలరేషన్ మరియు పికప్:


పెట్రోల్ మరియు డీజిల్ రకాలలో సమర్థవంతమైన ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ని కలిగి ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ 155 కిలోమీటర్ల వేగాన్ని చేరతాయి అయితే కేవలం 14 సెకన్లలో 100 క్మ్ఫ్ మార్క్ ని అందుకోగలవు. డీజిల్ వేరియంట్స్ 15 సెకన్లలో 100 క్మ్ఫ్ ని చేరతాయి. ఇది దాదాపు 160 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకుంటాయి. మరోవైపు, సీఎన్జీ రకాలు 150 కిలోమీటర్ల వేగాన్ని చేరతాయి మరియు 16 సెకన్లలో 100 క్మ్ఫ్ చేరే సామర్ధ్యం కలిగి ఉన్నయి.

వెలుపలి డిజైన్:


ఈ కారు చూపరులని ఆకట్టుకునే విధంగా ఉంది. రేడియేటర్ గ్రిల్ కి సుజుకి యొక్క సంతకంలో ఒక బ్యాడ్జ్ బిగించి ఉంటుంది. ముందు వైపు ఉన్న బంపర్ కి హాలోజన్ ల్యాంప్స్ తగిలించి ఉండటంతో ఒక పదునైన అంచుగల రూపాన్ని కలిగి ఉంటుంది. దీనికి తోడుగా టర్న్ ఇండికేటర్లు ని జత చేశారు. భ్-స్థూపాన్ని బ్లాక్ లో మరియు విండో విభాగానికి ఒక ప్రయోగాత్మక రూపకల్పన ఇవ్వబడింది. టాప్ ఎండ్ ట్రిం కి అల్లొయ్ వీల్స్ ఇవ్వబడినందు వల్ల దీని అందం ఇనుమడింపబడింది. ఫ్రంట్ బంపర్ శరీర రంగులో ఉండటంతో చూడటానికి మరింత బావుంటుంది. ఏయిర్ డ్యాము విశాలంగా ఉన్నందు వలన ఇది ఇంజిన్ కూలింగ్ లో చాలా సహాయపడుతుంది. దీని వెనుక విండ్స్క్రీన్ దానికి అమర్చిన మూడవ బ్రేక్ కాంతి ల్యాంప్ తో అందించబడుతుంది. బురద నుండి దుమ్మూ ధూలీ నుండి రక్షణగా మడ్ ఫ్లాప్స్ ని ముందు మరియు వెనుక వైపు బంపర్స్ కి బిగించడం జరిగింది. వెనుక విండ్స్క్రీన్ కి డీఫాగ్గర్ అమర్చబడి ఉంది మరియు వైపర్లు వాషర్లు పెట్టబడ్డాయి. మిడిల్ మరియు టాప్ ఏండ్ ట్రింస్ కి ఒక జత ఫాగ్ ల్యంప్స్ ని జత చేయడమయ్యింది.

వెలుపలి కొలతలు:


ఈ సీరీస్ కి ఎంతో విశాలమైన కొలతలు అందించడంతో దీని లోపలి సౌకర్యం కూడా పెరిగింది. దీని మొత్తం పొడవు 4265మ్మ్ , పూర్తి వెడల్పు 1695మ్మ్ మరియు ఎత్తు 1685మ్మ్ గా వుంది. ఇది 2740మ్మ్ యొక్క ఒక గొప్ప వీల్బేస్ తో ఉంది. దాని ముందు ట్రాక్ 1480మ్మ్ గా ఉంది మరియు వెనుక ట్రాక్ 1490మ్మ్ గా ఉంది. ఈ వాహనం కి 185మ్మ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వబడింది.

లోపలి డిజైన్:


ఈ వాహనం దాని వీల్బేస్ ఫలితంగా చాలా సౌలభ్యంగా ఉంటుంది. డ్రైవర్ కోసం ఒకటి మరియు సహ-ప్రయాణీకుల కోసం కూడా సన్ వైసర్స్ రెండు ఉన్నాయి. కప్ హోల్డర్స్ తో పాటుగా మరెన్నో ఖాలీ స్థలాలు అవసరమైన వస్తువులు పెట్టుకోడానికి ఇచ్చారు. సీట్లు ఎర్గోనోమికల్ గా ఉండటమే గాక, ఎంతో సౌకర్యంగా మరియూ ప్రయోజనకరంగా ఉంటాయి. సీట్లుకి హెడ్ రెస్ట్స్ వుండి అవి సర్దుబాటు చేసుకునే వీలు కలిగి ఉన్నాయి. ఏడుగురు ప్రయాణికులు కూర్చోగలిగే విధంగా ఏడు సీట్లు ఉన్నాయి. క్యాబిన్ లోపల అవసరానికి ఉపయోగపడేటట్టు ఒక లైటు ఉంది. స్టీరింగ్ వీల్ మీద ఆడియో కంట్రోల్స్ ఇమడ్చబడి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కొరకు కంపార్ట్మెంట్లో పవర్ సాకెట్ ఉంది. ఒక డిజిటల్ గడియారం , ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలాగే ఒక టాకొమీటర్ కలిగి ఉంది.

లోపలి సౌకర్యలు:


వాహనం లోపలి భాగాన ఎన్నో సౌకర్యాలు అందించబడాయి. క్యాబిన్లో డే ఏండ్ నైట్ మిర్రర్ ని బిగించారు. మరింత సౌకర్యం కోసం ఏసీ యూనిట్ ని మరియూ దాని చల్లదనం క్యాబిన్ మొత్తం విస్తరించడానికి సరిపడ వెంట్స్ ని అమర్చడం జరిగింది. ప్రయానికుల వినోదం కోసమై ఒక అధునాతనమైన మ్యూసిక్ సిస్టము బిగించబడింది. దీనిలో సీడీ మరియూ ఎంపీత్రీ ప్లేయర్లు వున్నాయి. సెంట్రల్ కన్సోల్ లో ఒక కప్ హోల్డరు మరియు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో మరొక కప్ హోల్దరు అందించడం జరుగుతుంది. వెలుపల రెండు అద్దాలను అమర్చడంతో పాటు వాటిని పవరుతో సర్దుబాటు చేయగల వసతి కల్పించడం జరిగింది.

లోపలి కొలతలు:


ఈ వాహనం యొక్క కాబిన్ బాగా విశాలంగా రూపొందించబడింది మరియు చాలా సౌకర్యవంతంగా కుటుంబసభ్యులను కూర్చోపెట్టుకోవచ్చు. ఎక్కడా ఇరుకు అనేది లేకుండా ఏడుగురు సభ్యులు కూర్చోవచ్చును. బూట్ కంపార్ట్మెంట్ స్థలం 300 లీటర్ల వరకు ఉండగా, ఇందులో ఎంతో లగేజీ పెట్టుకోనేందుకు వీలు ఉంది. వెనుక సీట్లు మడవటం ద్వారా మరింత చోటు పెరిగే వీలు కూడా కల్పించడం అయ్యింది. సుమారు 45 లీటర్ల ఇంధనం పట్టే సామర్ధ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


పెట్రోల్ వెర్షన్ కి 1.4 లీటర్ కె-సిరీస్ ఇంజిను జత పరచారు మరియు దాని గురించి 1373cc డిస్ప్లేస్మెంట్ అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వులు డ్యూల్ ఓవర్ హెడ్ కేం వాల్వు షాఫ్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఇది ఒక బహుళ పాయింట్ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ సిస్టమ్తో జత చేయబడింది. మరియు రహదార్లలో లీటరుకి 16.2 కిలోమీటర్లు, సాధారణ సిటీ పరిసరాలలో లీటరుకి 12.3 కిలోమీటర్లు మైలేజ్ పంపిణీ ఉంది. ఈ మోటార్ 6000ఆర్పీఏం వద్ద 93.7బీహెచ్పీ శక్తి ని మరియు 4000ఆర్పీఏం వద్ద 130ణ్మ్ టార్క్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. సీఏంజీ ఇంజిన్ 4000ఆర్పీఏం వద్ద110ణ్మ్ యొక్క 6000ఆర్పీఏం మరియు టార్క్ అవుట్పుట్ వద్ద 80.9 బీహెచ్పీ శక్తి ఉత్పత్తి ఉంది . డీజిల్ వెర్షన్ కి 1750ఆర్పీఏం వద్ద 200ణ్మ్ మరియు 4000ఆర్పీఏం టార్క్ అవుట్పుట్ వద్ద 88.8భ్ప్ గరిష్ట శక్తి ఉత్పత్తి యొక్క సామర్ధ్యం ఉంది. దీనిలో ఒక 1.3-లీటర్ ఢ్ఢిS మోటార్ బిగించి ఉంటాయి. అన్ని ఇంజిన్లు ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ని కలిగి ఉన్నాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మారుతీ సీరీస్ లో ఎన్నో ఉపకరాలు చేర్చబడ్దాయి. దీనిలో పెట్టబడిన మ్యుసిక్ సిస్టము లో సీడీ ప్లేయరు తో పాటుగా యుఎస్బీ కూడా జత చేయబడింది. రడియో తో పాటుగా దానికి అవసరమైన ఏంటీనా కూడా ఉంది. ధ్వని మెరుగ్గా ఉండేందుకు నాలుగు స్పీకర్లు ఇచారు. ఇవే కాకుండా కారు యొక్క కొనుగోలుదారుడు మరిన్ని పరికరాలను వారి వారి అవసరాలకు అనుగుణంగ జత చేర్చుకునే అవకాసం ఉంది. కాళ్ళ మురికీ గట్రా అంటుకోకుండా ఫ్లోర్ మాట్సు, కారు బాహ్య రూపం ఇంకా మెరుగ్గా కనపడేందుకు గానూ బాడీ గ్రఫిక్సు, ప్రయాణాలకు సులువుగా ఉండేందుకు ఉపయోగపడే జీపీఏస్ సిస్టము ఇందులో పెట్టించుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


హై ఏండ్ వేరియంట్స్ కి 15 అంగుళాలు పరిమాణం గల అల్లొయ్ వీల్స్ ని అమర్చడంతో పాటుగా వాటికి 185/65 ఱ్15 సైజు గల యొక్క రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లను బిగించడం జరిగింది. టూల్ కిట్ తో పాటు బూట్ కంపార్ట్మెంట్ లో ఒక అదనపు వీల్ ని అందించడం జరిగింది. మిగిలిన వేరియంట్స్ కి స్టీలు వీల్స్ ని ఇవ్వడంతో పాటు అవే 185/65 ఱ్15 సైజు గల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లను బిగించారు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ సిరీస్ మంచి స్థిరత్వం మరియు గొప్ప సస్పెన్షన్ తో జత చేయబడింది. ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ తో మరియు రియర్ ఆక్సిల్ టోర్సన్ బీంతో జత చేయబడింది. ముందు చక్రాలకు డిస్క్ బ్రేక్లు బిగించి ఉంటాయి మరియు వెనుక చక్రాలకు డ్రం బ్రేక్లు బిగించబడి వున్నాయి. ఇది ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఒక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంది. దీనితో పాటుగా బ్రేక్ అస్సిస్ట్ అనేది కూడా అందించారు.

భద్రత మరియు రక్షణ:


భద్రత విధులు పరంగా, ఈ మారుతి ఎర్టిగా సిరీస్ బాగా సురక్షితమనే చెప్పాలి. కారు తయారీలో ఎంతో జాగ్రత్త తీసుకునీ సైడ్ ఇంపాక్ట్ బీంస్ ని జత పరిచి మరీ ఉక్కులాంటి రక్షణని కల్పించారు. ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని చేర్చడంతో బ్రేకింగ్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఇవ్వబడింది. ఈ ఫీచర్ డీజిల్ వెర్షన్ అన్ని రకాలలో అమర్చారు. అయితే, ఈ ఫీచర్ పెట్రోల్ వెర్షన్ బేస్ ట్రిమ్ లో లోపించాయి మరియు టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్ లో ఒక ప్రామాణికమైన సదుపాయంగా ఇవ్వబడింది. వాహనాన్ని ఎవరైనా దొంగలించడానికైనా మరే కారణంగానైనా కారులోనికి ప్రవేసించాలి అని ప్రయత్నించిన తరుణంలో ఇంజిన్ స్తంభింప చేసే సామర్థ్యం కలిగిన ఒక ఫంక్షన్ ఉంది, దాని పేరే ఇంజిన్ ఇమ్మోబిలైజర్. డ్రైవరుతో పాటుగా పక్కన కూర్చునే వ్యక్తికి కూడా ఒక ఏయిర్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అధిక రక్షణకై సీటు బెల్ట్లు కూడా ఉన్నాయి.. ఒక భద్రతా అలారం వ్యవస్థ అలాగే మరెన్నో సదుపాయాలను అందించడం జరిగింది.

అనుకూలాలు:1. కారు లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది.
2. బ్రేకింగు సిస్టము మెరుగ్గా వుంది.
3. ఏడు రంగుల షేడ్స్ లో కారు లభ్యమవుతుంది .
4. భారీ బూట్ స్పేస్ అందుబాటులో ఉంది.
5. సౌకర్య పరికరాలు మెండుగా అందించారు.

ప్రతికూలాలు:1. బేస్ మరియు మిడిల్ వేరియంట్స్ కి అల్లొయ్ వీల్స్ లేకపోవుట.
2. ఎంట్రీ స్థాయి వేరియంట్స్ కి మ్యూసిక్ సిస్టము లోపించింది.
3. లెదర్ సీట్లు ఇచి వుంటే బావుండేది.
4. బయట నుండి చూడటానికి ఇంకా బాగా తయారు చేసి వుండాల్సింది.
5. మైలేజీ అంతగా ఆకట్టుకునేలా లేదు.