మారుతి ఎకో

` 3.2 - 4.5 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి ఎకో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో కార్ల తయారీ సంస్థలలో మారుతి కూడా ఒక గొప్ప పేరు ఉన్న సంస్థ. అది ఒక స్థానిక ఆటోమొబైల్ తయారీ సంస్థ, ఇది దేశమంతటా సాటిలేని విధంగా దాని ఉత్పత్తులను అందిస్తోంది. అటువంటి ఉత్పత్తులలో ఒకటైన మారుతి ఈకో, దాని అద్భుతమైన లక్షణాలతో మనకి అందుబాటులో ఉంది. ఈకో యొక్క సమకాలీన రూపకల్పన నిర్మాణం నిజంగా ఎకో ఫ్రెండ్లీ పనితీరును మరియు ఒక ఆధునిక బాహ్య ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. ఇది కొద్దిగా ఓమ్ని ని పోలి ఉంటుంది. దీని సరికొత్త వెర్షన్, ఒక ఐదు సీట్ల డిజైన్ ను కలిగి ఏసి తో అందించబడుతుంది. ఈ మోడల్ కూడా ఒక శక్తివంతమైన 1196 cc బిఎస్-4 ఇంజిన్ తో వస్తుంది. దీనిలో ఒక యోగ్యకరమైన ఇంధన్ వ్యవస్థను అందించారు. ఇది భారత దేశ రోడ్లకు అనుగుణంగా 15. 1 kmpl మైలేజ్ ని అందిస్తుంది. కంపెనీ కూడా దీనిని ఒక కొత్త రీఫ్రెషింగ్ లుక్ తో అందించనుంది. ఇది 1196cc ఇంజిను పెట్రోల్ తో నడుస్తుంది మరియు ఇది 6000rpm వద్ద 73 bhp శక్తిని, 3000 rpm వద్ద 101 Nm టార్క్ ను అందిస్తుంది. ఈ పర్యావరణ స్నేహపూర్వక కారు విశాలమైన ఇంటీరియర్స్ తో, అనుకూలమయిన ఎక్స్టీరియర్స్ తో అందించబడుతుంది. దీని మొత్తం నిర్మాణం తక్కువ కంటకము తో, అదనపు అలంకారాలతో అందించబడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే, తయారీదారుడు వ్యాపారం కోసం ఈ మోడల్ ను తయారు చేశాడు మరియు దీని డిజైన్ కూడా అలాగే ఉంది. దీనిలో అమర్చిన 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్, వివిధ వేగాలతో వాహనాన్ని సులభంగా అమలు పరిచేలా ఉంది. దీని సి ఎన్ జి వేరియంట్, ఒక ద్విపద-ఇంధన రీతిలో రూపొందించబడింది. కాబట్టి ఇది రెండు పెట్రోల్ మరియు సి ఎన్ జి ఇంజన్లతో నడుస్తుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ రెండు ఇంధనాలు అదే 1200ccఇంజిన్ ను ఉపయోగించి నడుస్తాయి. కాబట్టి పనితీరు మరియు సౌకర్యాల విషయంలో పెద్దగా తేడా ఏమి ఉండదు. అయితే, దీని సి ఎన్ జి మోడ్ 6000 rpm వద్ద 63 bhp శక్తిని మరియు 3000 rpm వద్ద 84Nm టార్కును విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంటెలిజెంట్ గ్యాస్ పోర్ట్ ఇంజెక్షన్ బై ఫ్యూయల్ టెక్నాలజీ గా పేరొందిన ఐ-జిఐపి, ఫ్యుయెల్ ఎకానమీ మరియు భద్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఈ టెక్నాలజీనే సిఎన్ జి వేరియంట్ లోఉపయోగించారు. ఈ కారు గురించి చెప్పాలంటే, ఇది ప్రత్యేకమైనదిగా , సొగసైన వెలుపలి డిజైన్ తో మరియు ఉబెర్ చల్లని అంతర్గత డిజైన్ తో మరియు నిజంగా సంతృప్తికరమైన ప్రదర్శనతో అందించబడుతుంది. ఓమ్ని వంటి వాహనాలు విప్లవాత్మక ఉత్పత్తులను అందించటంలో పేరు పొందినవై, ఇది కూడా దానికి ఏ మాత్రం తీసిపోకుండా కొత్త రీతిలో ఉత్పత్తులను అందిస్తుంది. కొత్త కొత్త నవీకరణలు మార్కెట్లో డిమాండ్ ను పెంచుతున్నాయి. తయారీదారుడు దీనిని ఒక స్మైలీ వాహనంలాగా అధునాతన ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్స్ తో సరసమైన ధరతో అద్భుతమైన వాహనాన్ని మనకి అందించాడు. కొంత అదనపు డబ్బును చెల్లించడం ద్వారా వినియోగదారులు, యుఎస్బి తో ఆధునిక 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్ ను, ఒక జత శక్తివంతమైన 15 సెం.మీ. స్పీకర్లు, డ్యుయల్ టోన్ సీటు కవర్లు, మన్నికైన బ్లాక్ ఫ్లోర్ మ్యాట్స్ సమితి మరియు స్టైలిష్ పూర్తి వీల్ కవర్లు, మడ్ ఫ్లాప్స్, మరియు బాడీ మీద ప్రత్యేక 'స్మైల్స్' స్టిక్కర్లు వంటి ఎన్నో అంశాలను ఈ పరిమిత ఎడిషన్ లో పొందవచ్చు. ఈ మోడల్ కూడా పెట్రోల్, సిఎన్ జి రెండు ఎంపికలతో అందుబాటులో ఉంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనం సృజనాత్మకమైన హై ప్రెజర్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో కూడి 15.1 kmpl ఉన్నత మైలేజ్ ను పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఇతర వాటితో పోలిస్తే చాలా విలక్షణంగా ఉంటుంది. దీని ఫోర్ సిలిండర్ 1196 cc ఎం పి ఐ ఇంజిన్ 6000 rpm వద్ద గరిష్టంగా 73 bhp శక్తిని, మరియు 3000 rpm వద్ద 101 Nm టార్క్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది సాధారణ ప్రయాణాల కోసం యోగ్యకరంగా ఉంటుంది. దీని సి ఎన్ జి వెర్షన్ అయితే ఒక 63 bhp శక్తిని మరియు కొద్దిగా తక్కువగా 83 Nm టార్క్ ను అందిస్తుంది. సి ఎన్ జి వెర్షన్ లో దీని ఇంధన సామర్థ్యం అధికంగా 65 లీటర్ పెట్రోల్ ను కలిగి ఉంటుంది. అలాగే, ఇది వాహనంలో 40 లీటర్ల పెట్రోల్ ను నిల్వ చేసుకోగలుగుతుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహనం బిఎస్-IV ఇంజిన్ తో మరియు 1196 cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి మంచి నిర్వహణను అందిస్తుంది. దీని యొక్క పెట్రోల్ వెర్షన్ 6000 rpm వద్ద ఒక అద్భుతమైన 73 bhp శక్తిని మరియు 3000 rpm వద్ద 101 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు దీని సిఎన్ జీ వేరియంట్ 6000rpm వద్ద ఒక మంచి 63 bhp శక్తిని, 3000rpm వద్ద 83 Nm టార్క్ ను అందిస్తాయి.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనం ఆటో మొబైల్ మార్కెట్లో అందించేంత టాప్ స్పీడ్ ను అందించలేదు. ఎందుకంటే, ఈ సెగ్మెంట్ ను ఆ విధంగా రూపొందించలేదు. కానీ ఈ సెగ్మెంట్, మంచిగా 146 kmph టాప్ వేగాన్ని అందిచేలా డిజైన్ చేసారు. ఈ వాహనం అన్ని రకాలుగా సాధారణ ప్రయాణికుల కొరకు అనుగుణంగా ఉంటుంది. ఈ వాహనం 15.7 సెకన్లలో 0 నుంచి 100 kmph వరకు వేగవంతం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో అమర్చిన బిఎస్ -4 కంప్లెయింట్ 1196 cc ఇంజిన్ ను తయారీదారుడు సరైన వేగాన్ని అందించే విధంగా మంచి డ్రైవింగ్ అనుభవాన్ని జోడించేలా రూపొందించాడు.. ఈ వాహనం ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది. ఇది సజావుగా ఎలాంటి శబ్దం లేకుండా గేర్లను మార్చడంలో సహాయపడుతుంది.

వెలుపలి డిజైన్:


దీని యొక్క వెలుపలి భాగాల డిజైన్ ఓమ్ని మరియు వెర్సా ల ను పోలి ఉంటుంది. వీటి వలన ఇది ఒక ఫ్రెష్ అప్పీల్ తో కనబడుతుంది. దీని ముందు భాగం అసాధారనమైన ఫ్రంట్ హెడ్ ల్యాంప్ క్లస్టర్ తో మధ్యలో గ్రిల్ ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ బంపర్ పెద్దగా ఉండడం వలన, ఏదైనా ప్రమాదాలు సంభవించినపుడు వాహనం పై పెద్దగా ప్రభావం పడకుండా కాపాడుతుంది. దీనిలోని స్పష్టమైన లెన్స్ హెడ్ల్యాంప్స్ మరియు నలుపు రంగు బంపర్, ఫ్రంట్ ఫేసియా అన్నీ కూడా ఒక జత ఎయిర్ ఇంటేక్స్ తో అందించబడుతున్నాయి. దీని హెడ్ ల్యాంప్స్ విలక్షణంగా ఉండి వాహనం యొక్క ముందు భాగానికి ఒక ప్రత్యేకమైన అప్పీల్ ను అందిస్తున్నాయి. వెడల్పుగా ఉండే ముందు భాగంలో విండ్స్క్రీన్ ఒక మంచి ముందు వీక్షణ అందిస్తుంది. ఇది మరింతగా ఒక సొగసైన బోనెట్ తో ఉంటుంది. అంతే కాకుండా, ఇది డ్రైవర్ యొక్క ముందు వీక్షణకు అవరోధంగా కూడా ఉండదు. వాహనం యొక్క ఉన్నతమైన గ్రౌండ్ క్లియరెన్స్ వలన, విండోస్ తెరిచి ఉండడం చేత వెంటిలేషన్ కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి ఉన్న 4 డోర్ల వలన ప్రయాణికులు సులభంగా ఎక్కడానికి మరియు దిగడానికి వీలుగా ఉంటుంది. దీని సైడ్ ప్రొఫైల్ కొద్దిగా సాదా డిజైన్ తో అందించబడుతుంది. దీని వీల్ ఆర్చ్లు విస్తృతంగా ఉండడం వలన చాలా అసౌకర్యమైన డ్రైవ్స్ పరిస్థితులలో కూడా టైర్లు సులభంగా చలనాన్ని అందిస్తాయి. వెనుక వీక్షణ అద్దాలు మరియు డోర్ హ్యాండిల్స్ కారు యొక్క బాడీ రంగు నలుపు రంగులో ఉండడం వలన ఇవి ఎటువంటి బాడీ కలరుకి అయినా సరిపోయే విధంగా ఉంటాయి. వెనుక డిజైన్ ను చూసినట్లయితే, ఇది సాధారణంగా వర్టికల్ టెయిల్ ల్యాంప్స్ తో మరియు విస్తృతమైన విండ్స్క్రీన్ తో ఒక పెద్ద ఫ్రంట్ బంపర్ ను కలిగి ఉంటుంది. పరిమిత ఎడిషన్ అయితే చాలా రిఫ్రెష్ డిజైన్ తో అందించబడుతుంది. ముందు ఉన్న మడ్ ఫ్లాప్స్ మరియు అందమైన పూర్తి వీల్ కవర్స్ వాహనం యొక్క అధికారికతను విస్తరింపజేస్తున్నాయి. ఇవన్ని కలిపి వాహనానికి ఒక విజయవంతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. దీని ఉత్సాహపూరితమైన గ్రాఫికల్ డిజైన్ వలన వినియోగదారుల మనసుని వెంటనే ఆకట్టుకుంటుంది.

వెలుపలి కొలతలు:


ఇది ఒక బహుళ ప్రయోజనకర వాహనం కావడం వలన, యుక్తమైన బాహ్య కొలతలను కలిగి ఉంది. ఇది 3675mm పొడవు ఉండడం వలన వాహనం రవాణా మరియు వ్యాపార అలాగే ఇతర ప్రయోజనాల కోసం ఉత్తమమైనదిగా సరిపోతుంది. 1475mm వెడల్పుతో బిజీగా ఉండే భారత దేశ రోడ్లపై కూడా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ఇది 1800mm ఎత్తుతో తగినంత హెడ్ రూం ను కలిగి ఉంది. దీని వీల్బేస్ 2350mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తగినంత 160mm ఉంటుంది. ఈ వాహనం ఇక్కడ ఉండే అసమాన భూభాగాల వల్ల ఎలాంటి అసౌకర్యం లేకుండా తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.

లోపలి డిజైన్:


ఈ సెగ్మెంట్ యొక్క అంతర్గత డిజైన్ చాలా విశాలంగా మరియు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించబడింది. దీనిలోని నాగరీకమైన డిజిటల్ మీటర్ శ్రేణి , ఇంధనం యొక్క స్థాయిని మనకి తెలియజేస్తుంది. ట్రిప్ మీటర్ మరియు ఓడోమీటార్ అలాగే దీని అద్భుతమైన రూపకల్పన మనకు అన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. దీనిలో స్పోర్టీ అప్పీల్ కలిగి ఉన్న ముందు సీట్ల వలన వాహనం అద్భుతంగా కనబడుతుంది. అలాగే, ఒక అందమైన డ్రైవింగ్ అనుభవాన్ని మరియు అనుభూతిని ప్రయాణికులకు అందజేస్తుంది. అందువలన ఈ వాహనం యొక్క డ్రైవింగ్ అసౌకర్యంగా ఉండదు. ఇవి సాధారణ కుటుంబాలకు తగిన విధంగా అన్ని అంతర్గత సౌకర్యాలతో రూపొందించడం జరిగింది. లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్s వలన లోపలి డిజైన్ కి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దీని అంతర్గత డ్యూయల్ టోన్ డిజైన్ వలన వాహనం పూర్తిగా చూడడానికి ఒక కొత్త స్థాయిలో లగ్జరీగా కనపడుతుంది. దీని వెనక సీట్ల భాగంలో రూపొందించిన బెంచ్ డీజైన్ వలన ఇది ఎక్కువ మంది ప్రయాణికులకు వసతిని కల్పించే విధంగా సౌకర్యవంతంగా ఉంది. దీనిలో ఉన్న సహాయక పట్టులు వెనక ప్రయాణికులను సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. మలచిన రూఫ్ లైనింగ్ మరియు క్యాబిన్ ల్యాంప్స్ వలన క్యాబిన్ లోపలి వాతావరణాన్ని మరింత మెరుగుపస్తుంది.

లోపలి సౌకర్యాలు:


దీనిలోని సీటింగ్ నమ్రత ఏ వాతావరణంలో అయినా ఒక సౌకర్యవంతమైన డ్రైవ్ ను అందించే ఉద్దేశ్యంతో రూపొందించబడి ప్రయాణికులకు చాలా అనువైనది చేస్తుంది. దీనిలో ఏసి చాలా శక్తివంతమైనదిగా మరియు హీటర్ యోగ్యకరమైనదిగా ఉంటుంది. ముందు సీట్లు హెడ్ రెస్ట్ లతో కూడిఉండడం వలన సుదూర ప్రయాణాలు వెళ్లే ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన రైడ్ ను అందిస్తాయి.

లోపలి కొలతలు:


అంబులెన్స్ వంటి వివిధ అనుకూలీకృత నమూనాలు అధారంగా దీని అంతర్గత భాగాలను విస్తరించారు. ఇంటీరియర్స్ 540 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తున్నాయి. సీటింగ్ అమరిక కూడా ఐదు నుండి ఏడుగురు ప్రయాణికులకు వసతి కల్పించేలా తగినంత స్థలాన్ని కలిగి ఉంది. దీని ముందు సీట్లు ఆనుకుని ఉంటాయి మరియు డ్రైవర్ సీటు సౌకర్యంగా ఉండేలా స్వారీకి అనుగుణంగా డ్రైవర్లు జరుపుకోవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


దీనిలోని అన్ని వేరియంట్స్ ఒకే రకమైన ఇంజన్ తో బిగించబడి, 1196 సిసి స్థానభ్రంశంను కలిగి ఉంటాయి. దీని బిఎస్-4 ఇంజిన్ ఒక మంచిపనితీరును అందిస్తూ, రెండు ఇంధన సమర్థతను మరియు ప్రదర్శనను అందిస్తుంది. దీని అల్యూమినియం ఇంజిన్ బహుళ పాయింట్ ఇంజెక్షన్ వ్యవస్థతో అనుసంధానం చేయబడి ఉంటుంది. అందుకే ఇది మంచి ఇంధన ఎకానమీని మరియు పనితీరును అందిస్తుంది. దీనిలో డి ఎస్ ఏ వ్యవస్థ తో కూడిన ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉంటుంది. ఇది సాఫీగా గేర్ మార్చడంలో సహాయపడుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనం ధర తక్కువ, అంటే ఉత్పాదక వ్యయం కూడా చాలా తక్కువ అని మనం గ్రహించవచ్చు. తయారీ సంస్థ దీనిలో చెప్పుకోదగ్గ రీతిలో ఎలాంటి ఇంటీరియర్ యాక్సెసరీస్ ను అందించలేదు. ఈ బ్రాండ్ లో హై ఎండ్ మోడల్స్ స్విఫ్ట్ లేదా ఎస్ఎక్స్ 4 వంటి వాటిలో మాత్రమే అన్ని ఫీచర్లు అందించారు. వీటిలో ఒక వేరియంట్ మాత్రమే ఒక ఏ.సి ఆప్షన్ ను కలిగి ఉంది. స్టీరియో సిస్టమ్ కూడా యజమానులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసినవే ఉన్నాయి. అయితే, లిమిటెడ్ వెర్షన్లో ఇతత వాటితో పాటుగా ఒక 15 సెం.మీ. స్పీకర్లను అందించారు.

వీల్స్ పరిమాణం:


ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా దీనిలో మన్నిక భరోసా మరియు వైవిధ్యభరితమైన 155R13 LT పరిమాణం గల ట్యూబ్లెస్ టైర్లను అమర్చారు. దీని సాధారణ వెర్షన్ స్టీల్ చక్రాలను అందిస్తుంది. అయితే, పరిమిత ఎడిషన్ వెర్షన్ మాత్రం ఒక పూర్తి కవర్ స్టైలిష్ చక్రాలతో వస్తుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీనిని ఐదు నుండి ఏడుగురు ప్రయాణికులు కూర్చోవడానికి అనుకూలంగా రూపొందించారు. కాబట్టి ఇది ఉత్తమమైన బ్రేకింగ్ వ్యవస్థను మరియు విపరీతమైన హ్యాండ్లింగ్ సామర్థ్యాలను కలిగి ఉందని భావిస్తున్నారు. ఒక క్లాసిక్ డ్రైవింగ్ సౌకర్యం, తగిన నిర్వహణ మరియు ఒక ఆశ్చర్యకరమైన స్థిరత్వంతో ఇది స్పష్టంగా భారత ఆటోమొబైల్ పరిశ్రమ యొక్క భద్రత నిబంధనలను పాటిస్తుంది. వెనుక భాగంలో బ్రేక్ డ్రమ్ తో పాటు ఉన్న వెంటిలేషన్ డిస్క్ బ్రేక్లు వాహనం అధిక వేగంలో ఉన్నా కూడా ఆపగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సస్పెన్షన్ వ్యవస్థ ఒక సౌకర్యవంతమైన రైడ్ ను అందించడంలోనే కాకుండా సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


దీనిలోని భద్రతా నిబంధనలలో మొదటిది ప్రయాణికులకు కావల్సిన విధంగా సౌకర్యాన్ని అందించడం అని చెప్పవచ్చు. ఇది ఒక 4.5 మీటర్ల టర్న్ వ్యాసార్థాన్ని మరియు సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రయాణికులకు మంచి సౌలభ్యాన్ని జతచేస్తుంది మరియు దీని క్లాస్ లో ఇది ఒక సురక్షితమైన వాహనంగా మనం పరిగణించవచ్చు. దీనిలోని ఫ్రేమ్ మరియు చేసిస్ యొక్క నిర్మాణ నాణ్యత ఉన్నతమైనదిగా ఉంది. కానీ లోపలి చిన్న గది విషయంలో మాత్రం చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. హెడ్ల్యాంప్స్ లెవలింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, కిడ్ లాక్స్ అన్ని కూడా రైడ్ కి మరింత సురక్షితను అందిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ప్రయాణీకులందరికీ సీటు బెల్టులను అందించారు. హై మౌంట్ స్టాప్ ల్యాంప్కూడా అంతర్గత నిర్వహణ లో ఒక ప్రముఖ కారకంగా పనిచేస్తుంది. దీనిలోని అధిక నాణ్యత భాగాలు మరియు రూపకల్పన కలిగిన అంశాలలో ఇంటిగ్రేటెడ్ వైరింగ్ హార్ష్ నెస్, సి ఎన్ జి వ్యవస్థ లీక్ ప్రూఫింగ్ వంటి అంశాలు కూడా భద్రతా కారకాలలో ఒకటిగా నిలుస్తాయి.

అనుకూలాలు:


1. కుటుంబాలకు ఇది ఒక అనువైన వాహనం.
2. నగరంలో దారులపై నడిపేందుకు చాలా సులభంగా ఉంటుంది.
3. దీనిలో ఫ్యూయల్ ఎకానమీ కావలిసిన స్థాయిలో ఉంది.
4. యాజమాన్య ప్రారంభ వ్యయం సరసమైనదిగా ఉంది.
5. ఇంటీరియర్స్ విశాలమైన స్థలాన్ని కలిగి ఉంది.

ప్రతికూలాలు:


1. ఇంజిన్ పనితీరు ఇంకా మెరుగైనదిగా తయారు చేయవలసిన ఉంది.
2. యాక్సిలరేషన్ మరియు పికప్ మెరుగుపరచవలసిన ఆస్కారం ఉంది.
3. అంతర్గత ప్లాస్టిక్ లుక్ చౌకదిగా కనిపిస్తుంది.
4. మరికొన్ని భద్రతా మరియు సౌకర్యవంతమైన లక్షణాలను జోడించవలసి ఉంది.
5. వెలుపలి ఆకృతి ఇంకా కొంచెం అందంగా కనబడేలా చేయాల్సిన ఆవశ్యకత ఉంది.