మారుతి సెలిరియో

` 4.1 - 6.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి సెలిరియో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


డిసెంబర్ 01, 2015: మారుతి సుజుకి సెలెరియో యొక్క దిగువ శ్రేణి వెర్షన్ తో సహ అన్ని వాహనాలలో, ద్వంద్వ ఎయిర్బాగ్లు మరియు ఏబిఎస్ వంటివి ఆప్షనల్ గా అందించబడతాయి. మారుతి సుజుకి సంస్థ నుండి విడుదల అయిన ఈ సెలిరియో వాహనం, మూడు ఇంజన్ ఎంపికలతో వచ్చే మొదటి వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనానికి, కాంపాక్ట్ 800 సిసి డీజిల్ ఇంజన్ కూడా అందించబడుతుంది. అంతేకాకుండా ఈ వాహనం, కలిగి ఉండే మూడు ఎంపికలు వరుసగా, పెట్రోల్, డీజిల్ మరియు సిఎంజి ఇంజన్లు. ఈ మోడల్ సిరీస్ యొక్క పెట్రోల్ వాహనాలు, 1.0 లీటర్ 3 సిలండర్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 6000 ఆర్ పి ఎం వద్ద 67 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 3500 ఆర్ పి ఎం వద్ద 90 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే 800 సిసి ఇంజన్ విషయానికి వస్తే, ఈ డీజిల్ ఇంజన్ అత్యధికంగా 3500 ఆర్ పి ఎం వద్ద 47 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 2000 ఆర్ పి ఎం వద్ద 125 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్హ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహనం కలిగి ఉన్న మూడు ఇంజన్ ఎంపికలు, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ వెర్షన్ మాత్రమే, 4- స్పీడ్ ఏ ఎం టి ట్రాన్స్మిషన్ ఎంపిక తో జత చేయబడి ఉంటుంది.

అవలోకనం


పరిచయం


సెలిరియో వాహనం అనేది, మారుతి పోర్ట్ఫోలియో నుండి వచ్చిన మరోక హాచ్బాక్ అని చెప్పవచ్చు. అయితే, ఈ వాహనం ఇండో- జపనీస్ ఆటో దిగ్గజం కోసం, అపరిచిత భూభాగాలను పరీక్షించడానికి ఒక బలమైన సాధనంగా ఉంది. ఈ మారుతి సెలిరియో వాహనం, రెండు కీలకమైన అంశాలను మొదటిసారిగా తెచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏ ఎం టి) మరియు మొదటి సారిగా మారుతి నుండి అబివృద్ది చేయబడిన డీజిల్ మోటారు అయిన డి డి ఐ ఎస్ 125. ఈ రెండు అంశాలు, మొదటిసారిగా ఈ మారుతి సెలిరియో వాహనంలో అందించబడ్డాయి అలాగే ఇప్పటి వరకు ఏ హాచ్బాక్ లో కూడా అందించబడలేదు. సెలిరియో వాహనం, ఏ ఏ అంశాలను తీసుకొని వచ్చిందో చూద్దాం రండి.

అనుకూలాలు1. ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు ఏఎంటి ఎంపిక ఆప్షనల్ గా అందించబడింది. దీని వలన రద్దీగా ఉండే నగరంలో డ్రైవ్ సులభం అవుతుంది.
2. ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు, ఏ బి ఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ) ప్రామాణికంగా అందించబడుతుంది మరియు ఎయిర్బాగ్లు అన్ని వేరియంట్ లకు ఆప్షనల్ గా

అందించబడతాయి.3. పెప్పీ పెట్రోల్ ఇంజన్ మరియు మితవ్యయ డీజిల్ ఇంజిన్ లు అందించబడ్డాయి. 
4. వాహనం ఇరుకుగా ఉన్నప్పటికీ, ఈ వాహనానికి ఆకర్షణీయమైన క్యాబిన్ స్పేస్ అందించబడింది.

ప్రతికూలాలు1. శుద్ధీకరణ & ఎన్ విహెచ్ స్థాయిలు. ముఖ్యంగా 2- సిలిండర్ డీజిల్ మోటార్ తో - క్యాబిన్ లోపల విపరీతమైన శబ్దం మరియు అనేక శబ్ద ఫిల్టర్లు
2. నిర్మాణ నాణ్యత మెరుగు పడవలసిన అవసరం ఉంది. డోర్లను మూసివేసినప్పుడు గణగణమని ద్వని విడుదల - కొద్దిగా బలహీనమైన అనుభూతి
3. ఏఎంటి వెర్షన్ లో డ్రైవింగ్ సమయంలో జర్క్లు ఉత్పన్నమౌతాయి. ఈ కన్వెన్షినల్ ఆటోమేటిక్, మృదువైన డ్రైవ్ ను ఇవ్వలేదు.
4. ఈ రెండు ఇంజన్ ఎంపికలు, నగర ప్రయాణాలకు ఉత్తమం అని చెప్పవచ్చు. రహదారులపై తక్కువ పవర్ ను అందిస్తుంది.

అత్యద్భుతమైన లక్షణాలు1. ఏ ఎం టి గేర్బాక్స్. దేశంలో చౌకైన ఆటోమేటిక్ గా ఉంది ఈ సెలిరియో వాహనానికి ఆ పెరు ను, ఈ జెడ్ డ్రైవ్ ను ఉపయోగించి తయారు చేయడం జరిగింది.
2. మారుతి యొక్క అమ్మకాల తరువాత సేవా నెట్వర్క్ బాగా వ్యాప్తి చెందినది. దీనిని ఏ సంస్థ ఓడించలేదు మరియు ఇక్కడ మనసు ప్రశాంతం పూర్తి భరోసా

అవలోకనం


మారుతి, నగర హాచ్బాక్ లకు ఒక ప్రత్యేక స్థానంలో నిలచిపోయింది. తక్కువ నిష్పత్తిలలో, తేలికపాటి స్టీరింగ్ వీల్ మరియు ఇంధన వినియోగం వంటివి ఈ వాహనానికి అందించబడ్డాయి. అంతేకాకుండా, సెలిరియో వాహనం ఏ జి ఎస్ అనగా, ఆటో గేర్ షిఫ్ట్ అంశం తో మారుతి సంస్థ, ఒక అడుగు ముందుకు వెళ్ళగలిగింది. ఈ సెలిరియో వాహనం, మారుతి సంస్థ లో ఉండే ఏ స్టార్ మరియు ఎస్టిలో వాహనాలను భర్తీ చేయనుంది. ఈ సెలిరియో వాహనం, ఒక పెప్పీ పెట్రోల్ ఇంజన్ తో, ఫ్రూగల్ డీజిల్ ఇంజన్ తో అలాగే ఆప్షనల్ గా సిఎంజి వేరియంట్ లతో అందుబాటులో ఉంది.

Background & Evolution


మారుతి సెలెరియో వాహనాన్ని, 2014 వ సంవత్సరం లో భారతదేశం లో, ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ తో ఆరు వేరియంట్ లలో పరిచయం చేయబడం జరిగింది. 2015 వ సంవత్సరంలో, మారుతి సంస్థ ప్రపంచపు అతి చిన్న కామన్ రైల్ డీజిల్ మోటార్ అయిన డి డి ఐ ఎస్ 125 డీజిల్ ఇంజన్ ను సెలిరియో వాహనం కోసం అబివృద్ది చేసింది. భవిష్యత్తు కోసం ఈ సెలిరియో వాహనం, కొన్ని భద్రతా అంశాలతో నవీకరణ చేయబడింది. ప్రస్తుతం ఈ నవీకరించబడిన సెలిరియో వాహనం, దాని దిగువ శ్రేణి వేరియంట్ నుండి ఎయిర్బాగ్లు మరియు ఏబిఎస్ వంటి అంశాలతో అందుబాటులో ఉంది.

బాహ్య భాగం


ఈ సెలిరియో వాహనం యొక్క స్టైలింగ్, మారుతి యొక్క సి ఐ సి ఓ (కర్వ్ ఇన్, కర్వ్ అవుట్) డిజైన్ థీం ను అనుసరిస్తుంది. డిజైన్ మూలకాలు ప్రధానంగా అణచివేయబడ్డారు మరియు సాంప్రదాయవాదులు అలాగే ఏ విధంగా అయిన పద్ధతిలో సంచలనాత్మక ఉంది.

ఈ మారుతి సెలిరియో వాహనం యొక్క బాహ్య భాగ కొలతలు విషయానికి వస్తే, గ్రాండ్ ఐ 10 వాహనాన్ని సెలిరియో వాహనం తో పోలిస్తే పూర్తిగా 40 మిల్లీ మీటర్ల ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. అంతేకాకుండా సెలిరియో వాహనం, ఖచ్చితంగా అదే వీల్బేస్ ను కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా అందించబడిన ప్యాక్ అంశాలు అన్నియూ కూడా ఈ మారుతి వాహనానికి అందించబడతాయి. ఈ వాహనానికి మరింత ఎక్కువ వీల్బేస్ ను అందించడం వలన ఈ వాహనానికి, విశాలమైన క్యాబిన్ అందించబడుతుంది.

Table1

Image 1

ఈ హాచ్బాక్ వాహనాన్ని, సరైన నిష్పత్తిలో వంకరులు మరియు ముడతలు వంటి వాటితో బాగా ఆకర్షణీయంగా రూపొందించడం జరిగింది. ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, బారీ క్రోం గ్రిల్ అందించబడుతుంది మరియు దీనికి ఇరువైపులా వేలాడే హెడ్ ల్యాంప్ లు పొందుపరచబడి ఉంటాయి. అంతేకాకుండా దీని పై భాగంలో ఉండే బోనెట్ కు సూక్ష్మ ముడతలు విలీనం చేయబడి ఉంటాయి మరియు ఈ సెలిరియో వాహనం మరింత దూకుడు స్వభావాన్ని కలిగి లేదు.

Image2

ఈ హాచ్బాక్ యొక్క నీడ, సాధారణ మారుతి వలే కనిపిస్తుంది. ఒక ఆధిపత్య లైను, వాహనం పొడవునా విలీనం చేయబడి ఉంది. ఇదే అంశాన్ని మారుతి లో ఇప్పటికే ఉన్న ఆల్టో వాహనంలో లేదా కె 10 వాహనాలలో చూడవచ్చు. అంతేకాకుండా, ఈ వాహనాన్ని ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్లు అందించబడతాయి. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, నలుపు రంగు బి పిల్లార్ అందించబడుతుంది. వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లపై టర్న్ సూచికలు మరియు ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు 14 అంగుళాల వీల్స్ వంటి అంశాలు అందించబడతాయి. ఈ అంశాలు అన్నియూ కూడా ఈ సెలిరియో వాహనానికి ప్రీమియం లుక్ ను అందిస్తాయి.

Image3

ఈ వాహనం యొక్క వెనుక భాగం, బంపర్ కింద ఎగ్జాస్ట్ పైపులతో శుభ్రంగా మరియు సాధారణంగా ఉంటుంది. ఈ వాహనం యొక్క వెనుక భాగంలో ఉండే టైల్ ల్యాంప్ లను చూడగానే మొదటి చూపులోనే, ఆల్టో 800 వాహనం గుర్తుకొస్తుంది. ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, వెనుక భాగంలో ఒక వాషర్, ఒక వైపర్ మరియు ఒక డిఫోగ్గర్ వంటి అంశాలు అందించబడతాయి.

Image4

ఈ వాహనానికి, 235 లీటర్ల మంచి బూట్ సామర్ధ్యాన్ని అందించడం జరిగింది. కానీ, గ్రాండ్ ఐ 10 వాహనం తో పోలిస్తే తక్కువ అని చెప్పవచ్చు ఎందుకంటే, గ్రాండ్ ఐ 10 వాహనానికి, 256 లీటర్ల బూట్ సామర్ధ్యాన్ని అందించడం జరిగింది. మరోవైపు చెవ్రోలెట్ బీట్ తో పోలిస్తే, ఈ వాహనం ఎక్కువ బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చెవ్రోలెట్ బీట్ యొక్క సామర్ధ్యం 170 లీటర్లు.

Table2

ఈ సెలిరియో వాహనం యొక్క డిజైన్ ఖచ్చితంగా తటస్థంగా ఉంటుంది. ఈ వాహనం, అత్యద్భుతమైన అంశాలను కలిగి లేదు లేదా వర్గీకరణపరంగా బోరింగ్ గా ఉంది. ఈ వాహనం యొక్క నిష్పత్తులను గనుక గమినిస్తున్నట్లైతే, ఈ వాహనం నగరాలకు అనుకూలం అని చెప్పవచ్చు. మరోవైపు ఈ వాహనాన్ని పూర్తిగా గమనించినట్లైతే, నిర్మాణ నాణ్యత కాస్త మెరుగ్గా ఉంటుంది అని చెప్పవచ్చు.

అంతర్గత భాగం


క్యాబిన్ లోపలి భాగంలో అడుగుపెట్టగానే, తెలిసిన మారుతి లేఅవుట్ స్వాగతమిస్తుంది. లోపలి భాగం మరింత ఆనందాన్ని అందించడానికి, డ్యూయల్ టోన్ బీజ్ మరియు నలుపు రంగు కలయికలతో మరింత ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, ఈ లోపలి భాగం మరింత అందంగా అలాగే క్లాస్ లుక్ ను అందించడానికి సెంట్రల్ కన్సోల్ చుట్టూ వెండి చేరికలను అందించడం జరిగింది. దీని వలన లోపలి భాగం మరింత అందంగా కనబడుతుంది.

Image5

ఈ సెలిరియో వాహనం యొక్క లోపలి భాగం, పాత మారుతి వాహనం తో పోలిస్తే మరింత అందంగా ఉంటుంది. నాణ్యత విషయానికి వస్తే ఈ సెలిరియో వాహనం అందంగా ఉంటుంది అలాగే, ఇదే విభాగంలో ఉండే జికా మరియు గ్రాండ్ ఐ10 వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. మరోవైపు అత్యంత నమ్మకమైన విషయం ఏమిటంటే, సెలిరియో వాహనం సమర్ధత పరంగా అధిక స్కోర్ ను సాదించింది. అంతేకాకుండా ఈ వాహనం అందరికి అందుబాటులో ఉండే సరైన వాహనం అని కూడా చెప్పవచ్చు.

ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ ఐ (ఓ) వేరియంట్ విషయానికి వస్తే, ఈ వాహనం లో డ్రైవర్ సీటు, ఆరోగ్యకరమైన పరిది తో పాటు ఎత్తు సర్ధుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాహన క్యాబిన్ లో సర్ధుబాటయ్యే స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది. అంతేకాకుండా దీని వలన సరైన మద్దతును ఇవ్వడమే కాకుండా, డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ కు సులభమైన అలాగే సౌకర్యవంతమైన రైడ్ అందించబడుతుంది. వీటన్నింటితో పాటు, వెనుక మద్దతు అలాగే తొడ క్రింది భాగంలో మద్దతు ఇవ్వబడుతుంది. మరోవైపు క్యాబిన్ లో ఉండే ప్రయాణికులందరికీ మెడ భాగాన్ని మంచి మద్దతు ఇవ్వడానికి క్యాబిన్ లో ఉండే అన్ని సీట్లకు ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ లను అందించడం జరిగింది. కానీ, పొడవైన వ్యక్తులు క్యాబిన్ లో ఉన్నట్లైతే, వారికి ఈ హెడ్ రెస్ట్లు మెడ భాగానికి మద్దతును ఇవ్వలేవు. డ్రైవర్ సీటు నుంది గనుక వీక్షించినట్లైతే ఈ వాహనం యొక్క లోపలి భాగం అందంగా ఉంటుంది. అయితే, ఏ పిల్లార్ కొంచెం మందపాటిగా ఉంటుంది. ఒకవేళ లోపలి నుండి టర్న్ అవ్వలి అనుకుంటే కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది.

  Image6

ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ ను స్విఫ్ట్ వాహనం నుండి తీసుకోవడం జరిగింది. డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం అలాగే స్పర్శ అనుభూతిని అందించడానికి, కాల్ అలాగే ఆడియో నియంత్రణా స్విచ్చులు స్టీరింగ్ వీల్ పై అందంగా పొందుపరచబడి ఉన్నాయి. ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్, ఒక అస్పష్టత నిర్మాణాన్ని కలిగి ఉంటుంది మరియు గ్రాండ్ ఐ 10 వాహనంలో స్టీరింగ్ వీల్ లెధర్ తో చుట్టబడినట్లుగా ఈ వాహనం లో ఉండే స్టీరింగ్ వీల్ ఏ రకమైన అపోలిస్ట్రీ తో చుట్టబడి ఉండదు.

Image7

ఈ స్టీరింగ్ వీల్ పై భాగంలో, మూడు మీటర్ లను కలిగిన ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందించబడుతుంది. ఈ క్లస్టర్ లో, ఒక టాకోమీటర్, స్పీడోమీటర్ మరియు ఒక ఎం ఐ డి వంటి మీటర్లు అందించబడతాయి. ఈ మీటర్ల సహాయంతో, సగటు ఇంధన సామర్ధ్యం, డిస్టెన్స్ టు ఎంప్టీ అలాగే తక్షణ సగటు వంటి సమాచారం అందించబడుతుంది.

Image8

కాక్పిట్ విభాగంలో ఒక సెంట్రల్ కన్సోల్ అందించబడుతుంది. దీనిలో, యూఎస్బి, ఆక్స్ ఇన్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టవిటీ లకు మద్దతిచ్చే ఒక ఇంటిగ్రేటెడ్ సంగీత వ్యవస్థ అందించబడుతుంది మరియు ఇది కూడా, ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. అంతేకాకుండా ఈ వేరియంట్ లో, మాన్యువల్ ఎయిర్ కాన్ నియంత్రణలు అందించబడతాయి. ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లలో, తరువాత మార్కెట్ సంగీత వ్యవస్థ కోసం 2 దిన్ స్లాట్ అందించబడుతుంది. ఈ క్యాబిన్ లో అందించబడిన ఎయిర్ కాన్, ఉత్తమ మైన యూనిట్ల మధ్య సాధారణ మారుతి గా ఉంటుంది. క్యాబిన్ చాలా త్వరగా చల్లబడుతుంది మరియు ముందు భాగంలో ఎటువంటి పిర్యాదులు లేవు.

Image9

క్యాబిన్ లో ఉండే వెనుక బెంచ్ సీట్లు, ముందు భాగంలో అందించబడిన సీట్లు కంటే, కాస్త ఎక్కువగా ఉంటాయి మరియు ఈ వెనుక బెంచ్ సీటు, ఒక కోణంలో కొంచెం వెనుకకు వంగి ఉంటుంది. ఈ సీట్లు మద్దతు మరియు కుషనింగ్ పరంగా ఉత్తమం వద్ద సాధారణంగా ఉంటాయి. వెనుక బెంచ్ సీట్లు, ఇద్దరు వ్యక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే మూడవ వ్యక్తి కూర్చున్నట్లైతే, కొంచెం అసౌకర్య కరంగా ఉంటుంది అలాగే గట్టిగా నొక్కబడినట్లుగా ఉంటుంది. గ్రాండ్ ఐ 10 వాహనం వలే కాకుండా ఈ సెలిరియో వాహనం లో, వెనుక ఏసి వెంట్లు అందించబడవు. కానీ, ఇదేమి డీల్ బ్రేకర్ కాదు.

Image10

మారుతి లోపలి భాగంలో ఉండే చిన్ని కొలతలు కారణంగా, ఈ కారు యొక్క లోపలి స్థలం తక్కువ అందించబడుతుంది. ఈ వాహనం యొక్క లోపలి భాగంలో, గ్రౌండ్ బ్రేకింగ్ వంటి లక్షణాలను కలిగి లేదు లేదా ప్రామాణిక ఛార్జీల మారుతి కన్నా సమూలంగా భిన్నమైనదిగా ఉంది. అయితే ఇది కేవలం నగరాలకు, ఒక ఆచరణాత్మక హ్యాచ్బ్యాక్ గా ఉంది.

పనితీరు


సెలిరియో డీజిల్


Image11

మారుతి సుజుకి సంస్థ సొంతంగా సెలిరియో వాహనం కోసం ప్రపంచపు అతి చిన్న ఇంజిన్ అయిన 0.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ను ఈ సంవత్సరం పరిచయం చేసింది. సంస్థ ఈ వాహనానికి 0.8 లీటర్ డి డి ఐ ఎస్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, 793 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా రెండు సిలండర్లను అలాగే ఎనిమిది వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 3500 ఆర్ పి ఎం వద్ద 47 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 2000 ఆర్ పి ఎం వద్ద 125 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 5- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 21.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 130 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, నగరాలలో 23.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే రహదారులలో 27.62 కె ఎం పి ఎల్ మైలేజ్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ సెలిరియో వాహనం యొక్క పోటీదారులతో పోలిస్తే, ఈ డీజిల్ సెలిరియో వాహనం అన్నింటికన్నా తక్కువ పవర్ ను అలాగే తక్కువ టార్క్ ఉత్పత్తులను విడుదల చేస్తుంది. అయితే, ఈ వాహనం యొక్క తక్కువ కెర్బ్ బరువు మారుతిని చిన్నదిగా చేస్తుంది.

Table3

సెలిరియో పెట్రోల్


Image12

సంస్థ ఈ మోడల్ సిరీస్ యొక్క పెట్రోల్ వాహనాలకు, 1.0 లీటర్ కె 10బి పెట్రోల్ ఇంజన్ ను అందించింది. ఈ ఇంజన్, 998 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా మూడు సిలండర్ లను 12 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుందా ఈ ఇంజన్ అత్యధికంగా, 6000 ఆర్ పి ఎం వద్ద 67.04 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 3500 ఆర్ పి ఎం వద్ద 90 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోఅవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15.05 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, అత్యధికంగా 150 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, నగరాలలో 20 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే రహదారులలో 23.1 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇదే ఇంజన్ సి ఎన్ జి వేరియంట్ లలో కూడా ఇదే విధంగా పనిచేస్తుంది కానీ, పవర్ అలాగే టార్క్ ఉత్పత్తులలో మార్పులు సంభవిస్తాయి. సిఎంజి వేరియంట్లలో ఇదే ఇంజన్ అత్యధికంగా, 6000 ఆర్ పి ఎం వద్ద 58.2 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 3500 ఆర్ పి ఎం వద్ద 78 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15.05 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 150 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, నగరాలలో 26.02 కిలో మీటర్ / కేజీ అలాగే రహదారులలో 31.79 కిలోమీటర్ / కేజీ అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Table4

గమనిక: ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏ ఎం టి)


Image13

సంస్థ ఈ సెలిరియో వాహనానికి ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను అందించడం జరిగింది. దీనిలో రెండు పెడల్స్ మాత్రమే అందించబడతాయి మరియు దీని యొక్క ఆపరేషన్ ఒక కన్వెన్షినల్ ఆటోమేటిక్ వాహనం లా ఉంటుంది. ఈ క్లచ్ యొక్క ఆపరేషన్, ఒక హైడ్రాలిక్ చోదక వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది - తద్వారా డ్రైవర్ యొక్క ఎడమ కాలు ను నివారించవచ్చు. ఈ చిన్న మారుతి లో ఏఎంటి వెర్షన్ యూనిట్ అంతగా, పాలిష్ చేయబడలేదు. ఈ ఏఎంటి వెర్షన్ లో, డ్రైవ్ సమయంలో పైకి వెళ్ళేటప్పుడు మరియు క్రిందికి దిగేటప్పుడు స్వల్ప జర్క్ లు సంభవిస్తాయి. కానీ, అవి సులభంగా రోజూ ప్రయాణాల సమయంలో నిర్లక్ష్యం అవ్వవచ్చు. అంతేకాకుండా, మాన్యువల్ మోడ్ లోకి తరలించడం ద్వారా గేర్లు పై మనమే బాధ్యత వహించవలసి ఉంటుంది.

రైడ్ మరియు హ్యాండ్లింగ్


తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అన్నివేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటానికి నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించడం జరిగింది. అన్ని మారుతి సంస్థ లో ఉండే వాహనాల వలే ఈ సెలిరియో వాహనంలో కూడా, మృదువైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించడం జరిగింది. ముందుగా ఈ సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్, మెక్ఫోర్షన్ స్ట్రట్ తో విలీనం చేయబడి ఉంటుంది అలాగే వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, ఒక జత టోరిసన్ బీం లతో జత చేయబడి ఉంటుంది. ఈ మెకానిజం, రోడ్లపై ఉండే గతుకులను మరియు జర్క్ లను సులభంగా శోషించుకుని సౌకర్యవంతమైన డ్రైవ్ ను అందిస్తుంది. అయితే, పెద్ద గుంతలు మరియు పెద్ద పెద్ద గతుకులు ఉన్న రోడ్ల పై డ్రైవ్ చేసినప్పుడు, అలాగే ఠండ్లు క్యాబిన్ లోనికి తరలించబడతాయి. క్యాబిన్ లో ఉండే స్టీరింగ్ వీల్ కూడా, చాలా తేలికగా మరియు మృదువుగా ఉంటుంది వేగాన్ని బట్టి బరువు ఆధారపడి ఉంటుంది.

Image14

ఈ సెలిరియో వాహనం తో మూలలలో డ్రైవ్ కష్ట తరం అవుతుంది కానీ, సమర్ధత ఉంటే సులభం అని చెప్పవచ్చు. 120 కిలో మీటర్ / గంట వరకు అధిక వేగ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం అసహన అనుభూతిని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు చక్రాలు, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ లను అలాగే వెనుక చక్రాల విషయానికి వస్తే డ్రం బ్రేక్ లతో బిగించబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ బ్రేకింగ్ మెకానిజం అనేది ఒక ప్రామాణిక చార్జీ గా ఉంది. ఈ వాహనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.

భద్రత


Image15

మెచ్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఇటీవల మారుతి సెలిరియో యొక్క అన్ని వేరియంట్ లకు, ఆప్షనల్ ఏబిఎస్ మరియు ఎయిర్బాగ్లు ఆప్షనల్ గా అందించబడతాయి. ఈ విభాగంలో ఏ అంశాలు అయితే అందించబడతాయో అన్ని అంశాలతో ఈ వాహనం సమంగా ఉంది. యూరో ఎన్ క్యాప్ పరిక్షలలో, సెలిరియో యొక్క అగ్ర స్రేణి వెర్షన్ కేవలం ఐదు పాయింట్లకు గాను మూడు పాయింట్ లను స్కోర్ సాదించగలిగింది.

Table5

వేరియంట్లు


Table6

ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎల్ వాహనం విషయానికి వస్తే, వినోద వ్యవస్థ, కీ లెస్ ఎంట్రీ మరియు పవర్ విండోలు వంటి కీలకమైన అంశాలు అందించబడలేదు. అయితే, ఈ వేరియంట్ కొన్ని నిత్యవసర అంశాలు అయినటువంటి పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ తో మాన్యువల్ ఎయిర్ కండీషనర్ మరియు హీటర్ వంటి అంశాలు అందించబడతాయి. మీరు ఒక సంపూర్ణ బడ్జెట్ ను గనుక కలిగి ఉంటే, ఎల్ (ఓ) వేరియంట్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వేరియంట్ కు, ఖచ్చితంగా ప్రీమియం నాణ్యత కలిగిన ఏబిఎస్ మరియు ఎయిర్బాగ్లు అందించబడతాయి. మరోవైపు ఈ మోడల్ సిరీస్ యొక్క మధ్య శ్రేణి వేరియంట్ అయిన వి వాహనం విషయానికి వస్తే, పవర్ విండోలు మరియు అన్ని అంటే ఐదు డోర్ లకు సెంట్రల్ లాకింగ్ సిస్టం వంటివి అందించబడతాయి. అంతేకాకుండా ఈ వాహనానికి, 60:40 స్ప్లిట్ మడత కలిగిన వెనుక సీటు, వెనుక లగేజ్ షెల్ఫ్, అంతర్గత రేర్ వ్యూ మిర్రర్ మరియు ముందు ప్రయాణికుడి వైపు వానిటీ మిర్రర్ వంటి అంశాలు అందించబడతాయి. మరోవైపు ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ వాహనం విషయానికి వస్తే, రేడియో, సిడి ప్లేయర్, ఆక్స్ ఇన్, బ్లూటూత్ మరియు యూఎస్బి కనెక్టవిటీ వంటి అంశాలకు మద్దతిచ్చే ఒక ఇంటిగ్రేటెడ్ సంగీత వ్యవస్థ అందించబడుతుంది. అంతేకాకుండా ఈ వేరియంట్ కు, టిల్ట్ సర్ధుబాటు ను కలిగిన స్టీరింగ్ వీల్ మరియు దీని పై అనేక నియంత్రణలు, వెనుక వాష్ వైపర్ అలాగే డిఫోగ్గర్ ఫంక్షన్ వంటి అంశాలు అందించబడతాయి. మరోవైపు, జెడ్ లేదా జెడ్ (ఓ) వేరియంట్లు, పూర్తి ప్యాకేజీ సమర్ధతను కలిగిన వేరియంట్ లు అని చెప్పవచ్చు.

తుది విశ్లేషణ


ఈ సెలిరియో అనేది ఒక నేచురల్ కారు అని చెప్పవచ్చు. ఈ వాహనాన్ని గనుక ఎంపిక చేసుకోదలచుకుంటే, ప్రాశాంతత ను అందించే పద్దతిలో పని చేస్తుంది. ఈ మారుతి, అద్భుతమైన సేవ కు మద్దతు ఇచ్చే నెట్వర్క్ ను కలిగి ఉంటుంది మరియు కొనుగోలుదారులు ఒక ఖచ్చితమైన యాజమాన్యపు అనుభవాన్ని కలిగి ఉంటుంది. అవును, ఇది అస్థిరమైన నాణ్యత, నీరసమైన డీజిల్ ఇంజన్ వంటి కొన్ని సమస్యలు కలిగి ఉంది మరియు పోటీ ను ఇవ్వడం విషయంలో గట్టి పోటీ ను ఇవ్వడానికి అన్ని అంశాలను కలిగి లేదు. కానీ, నగర ప్రయాణాలకు ఈ సెలిరియో వాహనం ఉత్తమం అని చెప్పవచ్చు. ముఖ్యంగా దీని పెట్రోల్ ఆధారిత అవతార్ లో నిరాశ లేదు.