మారుతి ఆల్టో-800

` 2.4 - 3.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి ఆల్టో-800 వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


మారితీ అనే ఈ కార్ల తయారీ కంపెనీ కి దేశంలో ఎంతో గొప్ప పేరు ఉంది. ఇది ఈనాటిది కాదు, ఎన్నో తరాలుగా ఈ దేశంలోని కొనుగోలుదారులకు నాణ్యమైన కార్లను అందించడంలో సఫలీకృతమవుతూ వస్తోంది. ఎప్పుడూ కూడా ఈ కంపెనీ సరికొత్త మోడల్స్ తో మర్కెట్లను నింపివేయడం అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒక ప్రయత్నమే ఈ ఆల్టో-800 అనే హ్యచ్బ్యాక్ కూడా. ఇందులో ఎంతో సక్తివంతమైన ఇంజినుని అమర్చడంతో, దీని పని తీరుని చూసి మెచ్చేవారు ఎంతో మంది వున్నారు. అదే సమయంలో, ఇది అందించే మైలేజీని చూసి కొనుగోలుదారులు మరింతగా మురవాల్సిందే. డిస్కు బ్రేకులు వీల్స్ కి బిగించడం వంటి అధునాతనమైన సాకేంతికతలు అందించడం జరిగింది. వాహనం యొక్క రక్షణ మరింతగా పెంచేందుకు గాను ఉపయోగపడే ఏంటీ -లాక్ బ్రేకింగ్ సిస్టముతో పాటుగా ఏలెక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యుషన్ ని జత చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసమై ఏయిర్ కండిషనింగ్ యూనిట్ ని మరియూ దానికి తోడుగా హీటరుని అందించడం అనేది ఒక వెసులుబాటు మాత్రమే. ఇలాంతి సౌకర్యాలు ఈ కారులో మరేన్నో జత చేయబడ్డాయి. డిక్కీ డోరుతో పాటుగా ఫ్యుఎల్ లిడ్ ని కూడా క్యాబిన్ లోపలి నుండే తెరిచి మూయగలిగే వెసులుబాటు అందించారు. ప్రయాణంలో ఎంత దూరం వెల్లము అనె విషయం తెలుసుకోనేందుకు గాను ట్రిప్ మీటరుని, మరియూ ఒక స్పీడోమీటరుని కూడ అందివ్వడం అయ్యింది. డిక్కీ లో దూర ప్రాంతాలకు సైతం వెల్లేదుకు సరిపడ సామాను పెట్టుకోడానికి సరిపోయేంత స్థలం ఇచ్చారు. ఇదే కాకుండా క్యాబిన్ లోపల కూడా ఏవైనా వస్తువులు పెట్టుకోడానికి అవసరమైన స్థలం ఇవ్వడం జరిగింది. బాటిళ్ళను మరియూ కప్ లను పెట్టుకునే పాకెట్స్ ని అమర్చారు. ఈ కారులో పవర్ విండోస్ సౌకర్యాన్ని అందించడం విశేషం. ప్రయాణికులకు వినోదం కోసమై ఒక మ్యూసిక్ సిస్టము అమర్చారు. దీనికి సీడీని, యూఏస్బీని మరియూ ఔక్స్-ఇన్ ని సపోర్ట్ చేసే వీలు కల్పించారు. కారు యొక్క భద్రత కొరకు ఇంజిను ఇమ్మోబిలైసరుని మరియూ ప్రయానికుల రక్షణకై ఏయిర్ బ్యగ్స్ తో పాటుగా సీటు బెల్ట్లు కూడా జత చేయడమైంది. సౌకర్యాలు అనేవి ప్రయాణికులకే కాక డ్రైవరుకి కూడా ఉండతం ఎంతో అవసరం. ఈ విషయాన్ని కంపెనీ ఉత్పత్తిదారులు బాగా ద్రుస్టిలో ఉంచుకుని ఈ కారుని తయారు చేశారేమో అనిపించక మానదు. ఇన్ని సౌలభ్యాలని కలిగిన ఈ కారు మరెన్నో కార్లకి పోటీగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కంపెనీ యొక్క సర్వీసు కూడా గొప్పగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కారుకి మరొక ఆకర్షణ ఏమిటంతే, దీనికి, రెండు సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారెంటీని కల్పించడం. ఈ వారెంటీని ఇంకొంత మోత్తం చెల్లించి, మరిన్ని సంవత్సరాలకు గాను పెంచుకునే అవకాసం కూడా కల్పిస్తున్నారు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీనిలో మల్టీ పాయింట్ ఇంజెక్షన్ ఫ్యుఎల్ సప్ప్లై సిస్టము పెట్టడం వలన ఆకర్షనీయమైన మైలేజీ ఇవ్వడం సాధ్యమైంది. పెట్రోలు వేరియంట్స్ రహదార్లపైన లీటరుకి 22.7 కిలోమీటర్లు నడవగలదు మరియు సిటీ రోడ్లపై గంటకు 17 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. మరో పక్క, సీఏంజీ ట్రింస్ కి కేజీ కి 28.29 కిలోమీటర్ల మైలేజీని ఇచే సామర్ధ్యం కలిగి ఉండటం విశేషం.

శక్తి సామర్థ్యం:


దీనికి మూడు సిలిండర్లని మరియూ పన్నిండు వాల్వులను అందించింది. ఇవి ద్యూల్ ఒవర్ హెడ్ క్యం షాఫ్ట్ వాల్వ్ కాంఫిగరేషన్ మీద ఆధారపడి ఉన్నాయి. దీనికి 6000ఆర్పీఏం వద్ద 47.5బీహెచ్పీని ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉన్నాయి. ఇంకా 3500ఆర్పీఏం వద్ద 69ఏనెం టార్కు విడుదల చేయగలదు. ఈ 0.8-లీటరు ఇంజిను 796చ్చ్ యొక్క డిస్ప్లేస్మెంట్ విడుదల చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ సీరీస్ మొత్తం ఒక ఫైవ్ స్పీడ్ మాన్యూల్ ట్రన్స్మిషన్ గేరు బాక్సుతో వస్తుంది. ఇది ఎంతో సమర్ధవంతమైన లక్షణమనే చెప్పాలి ఎందుకంటే, ఇది ఈ కారు శక్తివంతంగా పనిచేయడానికి ఉపయోగ పడుతుంది గనుక. 15 నిండి 16 సెకన్లలో కారు 100 కిలోమీటర్ల మార్క్ ని చేరుకోగలదు. 140 నుండి 145 కిలోమీటర్లను చేరుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోపక్క, దీని సీఏంజీ వేరియంట్స్ 100 కిలోమీటర్ల మార్క్ ని 17 నుండి 18 సెకన్లలో చేరుకుంటాయి.

వెలుపలి డిజైన్:


ఎన్నో ప్రత్యేకతలు అందించడం వలన ఈ కారు చూడటానికి ఎంతో అందంగా మరియూ ఆకర్షాణీయంగా ఉంటుంది. కారు ముందు వైపు ఉన్న గ్రిల్లుకి ఒక వైవిద్యమైన రూపకల్పన ఇవ్వడంతో చూడటానికి చాల బావుంటుంది. కోము పైంటు వేయడం వలన్ ఈ గ్రిల్లు మరింతగా శోభిస్తుంది. ముందు వైపు ఉన్న బంపర్ కూడా కారు యొక్క శరీర రంగులో ఉండడడం వలన ఎంతో బాగా ఉంటుంది. పాకా నుండి చూసినప్పుడు ఈ కారు ఒక వేవ్ ఫ్రంట్ డిజైను కలిగి ఉంటుంది. డోర్ యొక్క బయతి హ్యండల్స్ కూడా శరీర రంగులోనే ఉంటాయి. కాకపోతే, ఈ అలకరణ టప్ ఏండ్ వేరియంట్స్ కి మాత్రమే ఇవ్వబడింది. అన్ని వేరియంట్స్ కి స్టీలు వీల్స్ ని జత పరచడం అయ్యింది. బేస్ ఏండ్ మిడిల్ ట్రింస్ కి హబ్ క్యాప్స్ ని ఇవ్వడం జరిగింది. ఇక వేరే ట్రింస్ కి ఫుల్ వీల్ కవర్స్ ఇచారు. కారుకి బయట ఇరువైపులా రెండు అద్ధాలను బిగించడం జరిగింది, పైగా ఇవి పవరు తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం కేవలం కొన్ని వేరియంట్స్ కి మాత్రమే ఇవ్వబడింది. ఇంకా ఇలంటి ఎన్నో అలంకరణలు కారుకి ఇవ్వబడ్దాయి.

వెలుపలి కొలతలు:


ఈ సీరీస్ మొత్తం ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే బయట నుండి చూసినప్పుడు, ఎంతో విశాలంగానూ, వైభవంగానూ అనిపిస్తుంది. దీని మొత్తం పొడవు 3395మ్మ్ గ ఉంది. వెడల్పు విషయానికి వచే సర్కి, దీనికి మొత్తం 1490మ్మ్ ఉండటం వలన్, ఎంతో వైభవంగా కనబడుతుంది. ఇక ఎత్తు చూస్తే, 1475మ్మ్ గా ఉంది. ఇది మంచి ఏత్తు అనే చెప్పాలి. గ్రౌండ్ చ్లియరెన్స్ ఏమో 160మ్మ్ ఇవ్వగా, స్టీరింగు వీలు యొక్క టర్నింగ్ రేడియస్ 4.6 మీటర్లుగా ఉంది. స్త్థూల బరువు 1185 కేజీలు కాగా, ఈ హ్యచ్బ్యాక్ ఎంతో ఆకర్షణీయమైన కారు అనే చెప్పాలి.

లోపలి డిజైన్:


ఒక హ్యాచ్ బ్యాక్ కి ఉండవలసిన అన్ని సదుపాయాలను ఈ కారులో అందివ్వడం జరిగింది. అన్నిటికంతే ముఖ్యమైన విషయం కారులోని సీట్లు. అవి ఎంతో సౌకర్యంగా అందించారు. మెత్తగా మరియు వీలుగా ఉన్న ఈ సీట్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. అందరు హాయిగా కూర్చునేడత్తు గా ఈ సీట్లు చేర్చబడ్డాయి. వీటిని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చును. అన్ని వేరియంట్స్ కి మురికి అంటకుండా ఫ్లోర్ మ్యట్స్ అందించడం విశేషం. క్యాబిన్ లో ఒక లైటుని బిగించారు. ఇది వెలుతురు అవసరమైనప్ప్డు బాగా ఉపయోగ పడుతుంది. లోపల డోరు హ్యండల్స్ కి వెండి పూత పూయబడింది. ఇందులో ఒక స్పీడో మీటరు ఇవ్వడంతో పాటుగా దనికి కూడా వెండి పూత పూయబడింది. సీట్లకి హెడ్ రెస్ట్స్ బిగించబడ్డాయి మరియూ ఒక ప్రామాణిక సదుపాయంగా ఒక ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అందించడం జరిగింది.

లోపలి సౌకర్యలు:


సౌకర్యం లేని కారు యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు అనే చెప్పాలి. పవరు స్టీరింగ్ కల్పించడం వల్ల ఈ కారు డ్రైవరుకి ఎంతో సౌలభ్యాన్ని ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కారు యొక్క డిక్కీని క్యాబిన్ లోపలి నుండే తెరవగలగడం అనేది ఒక గొప్ప వెసులుబాటు. లగ్గేజీని పెట్టుకోడానికి ఈ డిక్కీలో బోలెడంత చోటు అందివ్వడం జరిగింది. అంతే కాకుండా, క్యాబిన్ లోపల కూడా అవసరమైన వస్తువులు పెట్టుకోనేందుకు అణుగునంగా ఎన్నో ఖాళీ ప్రదేసాలు ఇచారు. ఏయిర్ కండిషనింగ్ తో పాటుగా హీటరుని కూడా అందివ్వడం ప్రయాణికులకు ఒక గొప్ప వరం అని అనుకోవచ్చును. డ్యష్బోర్డ్ కి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్యనెల్ ని బిగించడంతో పాటుగా ఒక డిజిటల్ క్లాకుని కూడా ఇవ్వడం జరిగింది.

లోపలి కొలతలు:


క్యాబిన్ లోపలి భాగం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి కారణం దీనికి ఉన్న భారీ వీల్బేస్. ఐదుగురు ప్రయాణికులను అవలీలగ కూర్చోపెట్టుకోగల స్తలము సామర్ధ్యము ఇందులో ఉన్నాయి. కాళ్ళ దగ్గర గానీ, భుజాల దగ్గర గానీ, తలకి గానీఇ, ఎక్కడా కూడా అసౌకర్యంగా లేకుండా ఉండేట్టు ఈ క్యబిన్ నిన్ తయారు చేసారు. పొడుగుగా ఉండే వాల్లకి కూడా ఇది సౌకర్యవంతంగా ఉండే కారు అని చెప్పవచ్చు. మొత్తం ముప్పై అయిదు లీటర్ల పెట్రోలుని ఉంచుకోగలిగే ఫ్యుఎల్ ట్యాంకు కలిగి ఉంది. లగేజీ గట్రా సామాను పెట్టుకునే స్తలమైన డిక్కీ లో, మొత్తం వంద డేబ్బై అయిదు లీటర్ల లగేజీని నిపుకోగలిగేంత స్తలం ఉండటం విశేషం.

ఇంజిను దాని పనితీరు:


పెట్రోలు వేరియంట్స్ కి 0.8-లీటరు F8D ఇంజిను పెట్టబడి ఉంది. ఇది 796ccని విడుదల చేస్తుంది. దీనికి మూడు సిలిండర్లని మరియూ పన్నిండు వాల్వులను అందించింది. ఇవి ద్యూల్ ఒవర్ హెడ్ క్యం షాఫ్ట్ వాల్వ్ కాంఫిగరేషన్ మీద ఆధారపడి ఉన్నాయి. దీనికి 6000ఆర్పీఏం వద్ద 47.5బీహెచ్పీని ఉత్పత్తి చేసే శక్తి కలిగి ఉన్నాయి. ఇంకా 3500ఆర్పీఏం వద్ద 69ఏనెం టార్కు విడుదల చేయగలదు. ఈ సీరీస్ మొత్తం ఒక ఫైవ్ స్పీడ్ మాన్యూల్ ట్రన్స్మిషన్ గేరు బాక్సుతో వస్తుంది. ఇది ఎంతో సమర్ధవంతమైన లక్షణమనే చెప్పాలి ఎందుకంటే, ఇది ఈ కారు శక్తివంతంగా పనిచేయడానికి ఉపయోగ పడుతుంది గనుక. 15 నిండి 16 సెకన్లలో కారు 100 కిలోమీటర్ల మార్క్ ని చేరుకోగలదు. 140 నుండి 145 కిలోమీటర్లను చేరుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోపక్క, దీని సీఏంజీ వేరియంట్స్ 100 కిలోమీటర్ల మార్క్ ని 17 నుండి 18 సెకన్లలో చేరుకుంటాయి. దీనిలో మల్టీ పాయింట్ ఇంజెక్షన్ ఫ్యుఎల్ సప్ప్లై సిస్టము పెట్టడం వలన ఆకర్షనీయమైన మైలేజీ ఇవ్వడం సాధ్యమైంది. పెట్రోలు వేరియంట్స్ రహదార్లపైన లీటరుకి 22.7 కిలోమీటర్లు నడవగలదు మరియు సిటీ రోడ్లపై గంటకు 17 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. మరో పక్క, సీఏంజీ ట్రింస్ కి కేజీ కి 28.29 కిలోమీటర్ల మైలేజీని ఇచే సామర్ధ్యం కలిగి ఉండటం విశేషం.

స్టీరియో మరియు ఉపకరణాలు:


టాప్ ఏండ్ ట్రింలకి రేడియో తో పాటు ఏంటీనా ని అందించారు. ఈ మ్యూసిక్ సిస్టముకి యూఏస్బీ మరియు ఔక్షిన్ పోర్ట్లు కలిగి ఉన్నాయి. వినియోగదారుడు వారికి కావలిసిన రీతిలో మరిన్ని సౌకర్యాలను పొందు పరుచుకునే అవకాసం ఈ కారులో కల్పించడం జరిగింది. వాటిలో కొన్ని, మురికి అంటకుండా ఉండేందుకు ఫ్లోర్ మాట్సు, మరింత సౌకర్యం కోసం లెదర్ సీట్లని , బయట నుండి చూడటానికి మరింత బాగుండేటట్టుగా గ్రాఫిక్సుని వేయించుకోవచ్చును. మ్యూసిక్ సిస్టము లేని వారు దానిని పెట్టించుకోవచ్చును. క్యబిన్ అందాన్ని ఇనుమడింప చేసేందుకు గాను చెక్క చెరకలతో దాష్బోర్డును తీర్చిదిద్దవచ్చును.డ్రైవరు యొక్క సమ్రక్షన కొరకై ఏయిర్ బ్యగ్స్ ని పెట్టించుకోవచ్చును.

వీల్స్ పరిమాణం:


అన్ని వేరియంట్స్ కి బలమైన పన్నిండు అంగులాల గల స్టీలు వీల్స్ ని అమర్చారు. వీటికి మంచి నాణ్యత కలిగిన 145/80 ఋ12 సైజు గల రేడియల్ ట్యుబ్లెస్ టైర్లను అమర్చారు. టప్ ఏండ్ ట్రిం కి అల్లొయ్ వీల్స్ ని అందించగా, బేస్ వేరియంట్స్ కి హబ్ క్యప్స్ మరియూ మిడిల్ వేరియంట్స్ కి ఫుల్ వీల్ కవర్లను తొడిగారు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ కారులో బ్రేకింగు మరియూ సస్పెన్షన్ సిస్టము రెండూ ఎంతో పటిషటంగా రూపొందించబడాయి. ముందు వీల్స్ కి డిస్కు బ్రేక్లు మరియు వెనుక వీల్స్ కి డ్రం బ్రేక్లు అమర్చడం జరిగింది. అదే కాకుండా, ముందు ఏక్సల్ కి మెక్ఫర్సన్ స్టట్ తో పాటు గా టోర్సన్ రోల్ కంట్రోల్ డివైస్ ని బిగించారు. రేర్ ఏక్సల్ కి కాయిల్ స్ప్రింగ్ మరియూ గ్యాస్ నింపిన షాక్ అబ్సార్బర్స్ తో పాటుగా లింక్ రిగిడ్ ఏక్సల్ మరియు ఐసోలటెడ్ ట్రైలింగ్ ఆర్మ్ ఉన్నాయి.

భద్రత మరియు రక్షణ:


ప్రతీ వాహనానికీ భద్రతే ప్రధాన లక్షణం. దీని కోసం ఎన్నో రకాలైన పరికరాలను సమకూర్చి ఎంతో రక్షణ కలిగిన వాహనంగా ఈ కారుని మలిచారు. అందులో భాగంగా, స్టీలుని ఉపయోగించి తయారు చేసిన ఈ కారు ఎంతో సురక్షితమైనది. స్టీలు వాడటం వలన ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా వాహనం చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రయ్యణికులు సురక్షితంగా ఉండేందుకు అధిక రక్షణ కల్పిస్తుంది. ఒకవేల ఎవరైన అనుమతి లేకుండానైన లేదా దొంగతనానికైన వాహనం లోపలికి ప్రవేసంకై ప్రయత్నిస్తే, వెనువెంటనే ఇంజినుని స్తంబింబజేసే ఒక ఇమ్మొబిలైసర్ అనే ఒక సదుపాయం కల్పించారు. టప్ మోస్ట్ వేరియంట్స్ కి సెంట్రల్ లాకింగ్ సిస్టం ని మరియూ డ్రైవరు ఏయిర్ బ్యగ్స్ ని అందించారు. దీనితో బాటుగా అన్ని వేరియంట్స్ కి ట్యుబ్లెస్ టైర్లను అందించడం వలన పక్చర్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ. ముందు వైపు ఉన్న అద్దానికి వైపర్లు మరియు వాషర్లు పెట్టబడి ఉన్నాయి. ఇవి పొగ మంచు నుండి కూడా స్పష్టమైన దృష్టిని అందించేందుకు వీలుని కల్పిస్తాయి. వెనుక వైపు ఉన్న అధానికి పెట్టబడిన అదనపు బ్రేకు లైటు అవతల వచే వాహనాలకి ఈ వాహనన్ ఉందన్న సందేసం అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సీటు బెల్ట్లు ప్రయాణికుల రక్షణకై కల్పించబడాయి మరియూ డిస్కు బ్రేక్లు వాహన సం రక్షణకై ఉన్నాయి. అదనంగా, హెడ్ ల్యంప్స్ ని లోపలి నుండే సర్దుకోగలగటం ఒక రక్షణ సదుపాయం.

కాన్స్:1. బాహ్య రూపాన్ని మెరుగు చేయవచ్చు.
2. ఎయిర్బ్యాగ్స్ ఒక ప్రామాణికమైన లక్షణంగా ఇవ్వచ్చు.
3. హై ఏండ్ ట్రింలో కూడా అల్లొయ్ వీల్స్ లేకపోవుట.
4. గ్రౌండ్ క్లియరెన్స్ ఆకట్టుకునే లా లేదు.
5. అనేక ఇతర నోటిఫికేషన్లను ఇన్స్ట్రుమెంట్ పానెల్ కి చేర్చవచ్చు.

ప్రోస్:1. పెట్రోల్, సిఎన్జి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
2. భద్రత బాగా పటిష్టంగా అందించారు.
3. ఎన్నో సౌకర్య సదుపాయాలు ఉన్నాయి.
4. ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ బాగా ఏర్పాటు చేసారు.
5. ధర పరిధి చాలా సరంగా అందిస్తున్నారు.