మహీంద్రా గ్జైలో

` 8.1 - 11.8 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్‌లు

 
*Rs

మహీంద్రా గ్జైలో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
మహీంద్రా దశాబ్దాల నుండి ప్రామాణిక నాలుగు చక్రాల వాహన తయారీ సంస్థ గా అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుగులేని రీతిలో ప్రయాణం సాగించింది. ఈ సంస్థ వినియోగదారుల అవసరాల మేరకు వాహనాన్ని అందిస్తుంది. ఈ సంస్థ అందించే మోడళ్ళలో ముఖ్యమైన మోడల్ అయినటువంటి మహీంద్రా జైలో చాలా దృడమైనదిగా మరియు సురక్షితమైనదిగా రూపొందించబడింది. ఇది బహుళ వినియోగ వాహనం అనేక మంది ప్రయాణికులకు సరిపడే విధంగా ఉంటుంది. మహింద్రా జైలో అంతర్భాగం విశాలంగా ఎక్కువ మంది కూర్చునే విధంగా మరియు ఎక్కువ సామానులు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఎంచుకునే వేరియంట్ ని బట్టి సీటింగ్ సామర్థ్యం 7 నుండి 9 వరకూ ఉంటుంది. అన్ని సీట్లు పెద్దవిగా వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇది కేవలం భారీ వాహనం మాత్రమే కాకుండా చూసేందుకు కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని పక్క భాగం వైపు మరియు వెనుక భాగం వైపు క్రోమ్ హైలైట్స్ ఉండడం వలన ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని పైకప్పు పైన ఉండే ఒక జత రెయిల్స్ తో మరియు ప్రకాశవంతమైన స్పాయిలర్ తో స్పోర్టి లుక్ ఇస్తుంది. దీని వెలుపలి డోర్ హ్యాండిల్స్ మరియు బాహ్య వింగ్ మిర్రర్స్ నల్లటి రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి. ఇరువైపులా బంపర్స్ శరీరం రంగు లో పొరలుగా ఉండి వాహనాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. దీని పక్క భాగం గ్రాఫిక్స్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని వెనుక భాగం కూడా చాలా నైపుణ్యం మరియు అభిరుచి తో పెయింట్ చేయబడింది. దీని పక్క భాగంలో బాడీ క్లాడింగ్ అమర్చబడి ఉంటుంది. ఇది నలుపు రంగుతో, స్టీల్ చేరికలతో అందుబాటులో ఉంటుంది. దీనిలో దిగువ శ్రేణి వేరియంట్లో వెలుపలి పిల్లర్స్ నలుపు రంగులో అందుబాటులో ఉంటాయి. ఇతర వేరియంట్లో అయితే బాడీ రంగులో అందుబాటులో ఉన్నాయి. ఉన్నత శ్రేణి వేరియంట్లలో ముందు మరియు వెనుక క్రోమ్ హైలైట్స్ అందించటం ద్వారా చాలా ప్రకాశవంతమైనదిగా కనిపిస్తుంది. దీని అంతర్గత థీమ్ ప్రీమియం బ్లాక్ మరియు లేత గోధుమ రంగులో చాలా ఆకర్షణీయంగా పివిసి చేరికలతో కూడిన ఫాబ్రిక్ ని కలిగి ఉండి హుందాగా కనిపిస్తుంది.దీనిలో హెచ్8 వేరియంట్ ప్రీమియం ఫాబ్రిక్ తో అందించబడుతుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లో ఇటాలియన్ లెథర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఫ్లాట్ బెడ్ సీట్లు ప్రయాణికుల సౌలభ్యం కోసం చేర్చబడ్డాయి. బ్రేకింగ్ సిస్టమ్ బాగా ఆధునిక విధానాలతో పొందుపరచబడింది. ఇటువంటి యాంటీ-లాక్ బ్రేకింగ్ టెక్నాలజీ అధిక శ్రేణి వేరియంట్లలో అమర్చబడి ఉంది. అదనంగా, ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరింత భద్రత కొరకు చేర్చడం జరిగింది. ముందు స్థానాల్లో కూర్చునే వినియోగదారుల సంరక్షణ కోసం ఒక జత ఎయిర్‌బ్యాగ్స్ అమర్చబడి ఉంటాయి. ఈ లక్షణం హెచ్8 వేరియంట్లో ఆప్ష్నల్ గా అందుబాటులో ఉంది మరియు అగ్ర శ్రేణి వేరియంట్లో సాధారణంగా అందుబాటులో ఉంది. వీటిలో అన్ని వేరియంట్లు ఇంజిన్ ఇమ్మొబలైజర్ తో అమర్చబడి ఉంటాయి. దీని అధిక శ్రేణి వేరియంట్లు హెచ్8 మరియు హెచ్9 , 2-డిన్ సంగీతం వ్యవస్థ తో పొందుపరచబడింది. అంతేకాకుండా హెచ్9 వేరియంట్ బ్లూటూత్ కనెక్టివిటీ ని కలిగి ఉంది. అదనంగా, ఈ వేరియంట్ ఒక వాయిస్ కమాండ్ టెక్నాలజీ తో అమర్చబడి ఉంది. ఈ నియంత్రణలు అన్నీ స్టీరింగ్ వీల్ లో అమర్చబడి ఉంటాయి. దీనిలో అన్ని వేరియంట్స్ కి పవర్ స్టీరింగ్ డ్రైవర్ సౌలభ్యం కొరకు అందించబడింది. ఈ స్టీరింగ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ తో అందుబాటులో ఉంది. ఈ వాహనంలో అన్ని డోర్లకు పవర్ విండోస్ ఏర్పాటు చేశారు మరియు అధనంగా వన్ టచ్ డౌన్ ఫంక్షన్ స్విచ్ డ్రైవర్ పక్కన అందించడం జరిగింది. అంతేకాకుండా సెంట్రల్ లాకింగ్ మరియు కీలెస్ ఎంట్రీ వంటివి డ్రైవర్ కి శ్రమను తగ్గించేందుకు సౌకర్యం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిరీస్ రెండు వేర్వేరు డీజిల్ ఇంజిన్లతో మరియు 5 షేడ్స్ లో వివిధ వేరియంట్లలో వినియోగదారులు ఎంచుకునేందుకుగాను అందుబాటులో ఉంది. బహుళ లక్షణాలతో ఈ మోడల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇది 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో అందుబాటులో ఉంది. వీటిలో ఏది ముందుగా అయిపోయినా సరే వారంటీ అయిపోయినట్లే.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనాల ఎండి ఐ, సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ చే జత చేయబడి ఉంటుంది. ఈ వాహనాలు నగరాలలో 9.1 kmpl మైలేజ్ ను మరియు రహదారులపై 12.2 kmpl మైలేజ్ ను అందిస్తాయి. మరొక ఎంపిక ఏమిటంటే, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా ఎం హాక్ మోటార్ జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, నగరాలలో 10 kmpl మైలేజ్ ను మరియు రహదారులపై 15 kmpl మైలేజ్ ను అందిస్తాయి.

శక్తి సామర్థ్యం:


ఈ వాహనాల యొక్క 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ డబుల్ ఓవర్‌హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ఆధారితమై ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 4000 rpm వద్ద 118.35 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 2400 నుండి 2800 rpm మధ్యలో 280 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అయితే, రెండవ మోటార్ విషయానికి వస్తే, ఈ వాహనాలు 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ డబుల్ ఓవర్‌హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ఆధారంగా నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వులను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 3600 rpm వద్ద 93.7 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, 1400 rpm నుండి 2800 rpm మధ్యలో 218 Nm గల పీక్ టార్క్ విడుదల చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ ఎం హాక్ ఇంజన్, ఒక సమర్థవంతమైన 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనాలు 0 నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 15 నుండి 16 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనాలు 150 నుండి 156 kmph వేగాన్ని చేరుకోగలవు. మరొక ఎంపిక విషయానికి వస్తే, ఎండి ఐ, సి ఆర్ డి ఐ ఇంజన్ సమర్థవంతమైన 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 100 kmph వేగాన్ని చేరడానికి 17 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ ఇంజన్ లు 150 నుండి 160 kmph వేగాన్ని చేరుకోగలుగుతుంది.

వెలుపలి డిజైన్:


మహీంద్రా జైలో యొక్క మొత్తం రూపం అన్ని లక్షణాలతో కలిసి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారులో ముఖ్యంగా పక్క భాగం గురించి చెప్పుకోవాలి. దీని పక్క భాగం గ్రాఫిక్స్ తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని వెనుక భాగం కూడా చాలా నైపుణ్యం మరియు అభిరుచి తో పెయింట్ చేయబడింది. దీని పక్క భాగంలో బాడీ క్లాడింగ్ అమర్చబడి ఉంటుంది. ఇది నలుపు రంగుతో స్టీల్ చేరికలతో అందుబాటులో ఉంటుంది. దీనిలో దిగువ శ్రేణి వేరియంట్లో వెలుపలి పిల్లర్స్ నలుపు రంగులో అందుబాటులో ఉంటాయి. ఇతర వేరియంట్లో అయితే బాడీ రంగులో అందుబాటులో ఉన్నాయి. ఉన్నత శ్రేణి వేరియంట్లలో ముందు మరియు వెనుక క్రోమ్ హైలైట్స్ అందించటం ద్వారా చాలా ప్రకాశవంతమైనదిగా కనిపిస్తుంది. దాని పై భాగంలో రూఫ్ రైల్స్ బిగించి ఉంటాయి. దాని వెనుక భాగం మీద ఉండే స్పాయిలర్ ప్రకాశవంతమైనదిగా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బేస్ వేరియంట్లో బంపర్స్, నలుపు రంగులో అందించబడతాయి. ఇతర వేరియంట్స్‌లో ముందు మరియు వెనక బంపర్స్, శరీర రంగులో అందించబడతాయి. అగ్ర శ్రేణి వేరియంట్లలో విస్తృతమైన గ్రిల్ పియానో నలుపు రంగులో అందించబడింది. ఇతర వేరియంట్స్‌లో అయితే గ్రిల్ నలుపు రంగులో ఉంటుంది. బయట డోర్ హ్యాండిల్స్ ఉన్నత శ్రేణి వేరియంట్లలో తప్ప మిగతా అన్ని వేరియంట్లో నల్ల రంగులో అందించబడతాయి. ఈ వేరియంట్లు అధనంగా ముందర మరియు వెనుక భాగంలో ఫాగ్ ల్యాంప్స్ తో అందించబడుతున్నాయి. వాహనం ఇరువైపులా చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని బేస్ వేరియంట్లో స్టీల్ వీల్స్ , సిల్వర్ తో పెయింట్ చేయబడిన రిమ్స్ ని కలిగి ఉంటాయి. మధ్య శ్రేణి వేరియంట్లో పూర్తి వీల్ కవర్స్ తో అందించబడతాయి. ముందు స్థానాల్లో కూర్చునే వినియోగదారుల సంరక్షణ కోసం ఒక జత ఎయిర్‌బ్యాగ్స్ అమర్చబడి ఉంటాయి. ఈ లక్షణం హెచ్8 వేరియంట్లో ఆప్ష్నల్ గా అందుబాటులో ఉంది మరియు అగ్ర శ్రేణి వేరియంట్లో సాధారణంగా అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్స్ ఫాగ్ ల్యాంప్ తో పాటు వెండి చేరికలతో విస్తృత ఎయిర్ డ్యామ్ ను కలిగి ఉంటుంది. అలానే దీని వెనుక విండ్‌స్క్రీన్, వైపర్ మరియు వాషర్ తో అందుబాటులో ఉంది.

వెలుపలి కొలతలు:


ఈ సిరీస్ వాహనం, ఒక బహుళ వినియోగ వాహనం అని పేరు పొందింది. దీని భారీ కొలతల కారణంగా ఎక్కువమంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా ఉంటుంది. దీని మొత్తం పొడవు సుమారు 4520mm మరియు వెడల్పు 1850mm మరియు దీని ఎత్తు 1880mm. దీని దిగువ శ్రేణి వేరియంట్లలో గ్రౌండ్ క్లియరెన్స్ 160mm మరియు దీని అగ్ర శ్రేణి వేరియంట్లో 186mm ఉంటుంది. ఈ వాహనాల వీల్‌బేస్ 2760mm.

లోపలి డిజైన్:


మహింద్రా జైలో యొక్క అంతర్గత కంపార్ట్మెంట్ వివిధ అంశాలు అలాగే అదనపు లక్షణాలతో నిర్మించబడింది. దీని అంతర్గత థీమ్ ప్రీమియం బ్లాక్ మరియు లేత గోధుమ రంగులో చాలా ఆకర్షణీయంగా పివిసి చేరికలతో కూడిన ఫాబ్రిక్ ని కలిగి ఉండి హుందాగా కనిపిస్తుంది. దీనిలో హెచ్8 వేరియంట్ ప్రీమియం ఫాబ్రిక్ తో అందించబడుతుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లో ఇటాలియన్ లెథర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఫ్లాట్ బెడ్ సీట్లు ప్రయాణికుల సౌలభ్యం కోసం చేర్చబడ్డాయి. అధిక శ్రేణి వేరియంట్లైన హెచ్8 మరియు హెచ్9 లో సీటింగ్ సదుపాయాలు చాలా ఉన్నాయి. కెప్టెన్ సీట్లు మూడు స్థానాలతో లంబర్ సపోర్ట్ ని కలిగి ఉంటాయి. ఆపై, డ్రైవర్ సీటు సర్దుబాటు విధులు అందజేయబడినవి. ఆర్మ్ రెస్ట్లు డ్రైవర్ కి మరియు సహ డ్రైవర్ కి అందించబడ్డాయి. దీనిలో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డ్రైవర్ సీటు ఒక నిల్వ ట్రే తో అందించబడుతుంది. అంతేకాకుండా ఈ వేరియంట్లు అదనంగా మరింత ఆకర్షణీయంగా వివిధ ఇతర అంశాలతో రూపొందించబడ్డాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త డిజైన్ లో తయారుచేయబడింది. దీని దిగువ శ్రేణి వేరియంట్లలో సెంట్రల్ బెజెల్ నల్ల రంగులో ఉంటుంది. అదే ఇతర వేరియంట్స్‌లో అయితే డార్క్ గ్రే రంగులో అందుబాటులో ఉంది. అధిక శ్రేణి వేరియంట్లలో ఒక డిజిటల్ సమాచార వ్యవస్థతో పొందుపరచబడింది. ఇతర వేరియంట్లు ఒక డిజిటల్ / ఎనలాగ్ క్లాక్ తో అందించబడతాయి. కళ్ళజోడు కోసం ఉన్న హోల్డర్ పైకప్పు కన్సోల్ పై అమర్చబడి ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పవర్ అవుట్లెట్ కంపార్ట్మెంట్ లో కన్సోల్ పై అమర్చబడి ఉంటుంది. బేస్ వేరియంట్ పి వి సి మెటీరీల్ సీట్లు మరియు మధ్య శ్రేణి వేరియంట్స్ ఫాబ్రిక్ మరియు పి విసి కలయికలో వస్తున్నాయి. రెండు విద్యుత్ అవుట్ లెట్లు ఉన్నత శ్రేణి వేరియంట్లలో అంది ఉంచబడుతున్నాయి. అన్ని వేరియంట్లు, డ్రైవర్ కోసం అలాగే సహ డ్రైవర్ కోసం సన్ విజర్స్ తో అందుబాటులో ఉన్నాయి. అయితే, అధిక శ్రేణి వేరియంట్లలో ప్రయాణీకుల వైపు ఉన్న సన్ విజర్ వానిటీ అద్దం తో అందించబడుతుంది. ఈ అద్దం అదనంగా ప్రకాశం తో అందించబడుతుంది. ఒక ప్రామాణికమైన లక్షణంగా, క్యాబిన్ ముందు మరియు వెనుక భాగాలలో అమర్చబడిన ఒక కర్టసీ ల్యాంప్ ఉంది. ఉన్నత శ్రేణి వేరియంట్లలో లైటింగ్ మూడవ వరుస లో అదనంగా మరో రెండు ల్యాంప్స్ ఇవ్వడం ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ వేరియంట్లు మరింత రేర్ విండ్‌స్క్రీన్ పై యాంటెన్నా అందించడం ద్వారా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

లోపలి సౌకర్యలు:


దీని అధిక శ్రేణి వేరియంట్లు వాయిస్ కమాండ్ టెక్నాలజీ ని కలిగి ఉంటాయి. దీనిలో డ్రైవర్ కి మాత్రమే కాకుండా ప్రయాణికులకి కూడా అనేక సౌకర్యాలు అందజేయబడ్డాయి. ఈ వేరియంట్లో ఆడియో మరియు క్రూజ్ వారి నియంత్రణలు స్టీరింగ్ వీల్ లో కలిగివుంటాయి. ఇలా ఆడియో నియంత్రణలు ఉండడం వలన డ్రైవర్ కి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మోడల్ యొక్క మంచి లక్షణం ఏమిటంటే దీనిలో అన్ని వేరియంట్స్ ఎయిర్-కండిషనింగ్ యూనిట్ తో అమర్చబడి ఉన్నాయి. దీని కాబిన్ లో హీటర్ మరియు ప్రసరణ సౌకర్యం ఉండడం వలన కాబిన్ నియంత్రణ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో అత్యుత్తమ ఇండివిజువల్ ఏసి వెంట్లు అందుబాటులో ఉన్నాయి. వినోదం కొరకు, అగ్ర శ్రేణి వేరియంట్లలో 2-డిన్ ఆడియో యూనిట్ అందుబాటులో ఉంది. ఇంకా దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. దీనిలో అన్ని వేరియంట్లకి పవర్ స్టీరింగ్ అందుబాటులో ఉంది. ఈ పవర్ స్టీరింగ్ సదుపాయం వలన డ్రైవర్ యొక్క శ్రమ తగ్గుతుంది. అంతేకాకుండా దీనిలో టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉంది. దీనిలో అన్ని డోర్లకి పవర్ విండోస్ అందుబాటులో ఉన్నాయి. ఇలా టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఉండడం అనేది ఏ వాహనానికైనా అత్యంత సౌకర్యవంతమైన లక్షణం. ఇంకా, డ్రైవర్ సైడ్ విండో కి ఒక టచ్ డౌన్ ఫంక్షన్ తో ప్రారంభించబడిన స్విచ్ ఉంది. అదనంగా, ఈ విండో భద్రత కోసం యాంటీ- పించ్ ఫంక్షన్ ని కలిగి ఉంది. ఈ ఫంక్షన్ దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. దీని బేస్ వేరియంట్లో విండోస్ మానవీయంగా నిర్వహించబడతాయి. మరోవైపు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అన్ని వేరియంట్లకి అందుబాటులో ఉండడం అనేది మరింత సౌకర్యవంతమైన అంశం. అదనంగా, అగ్ర శ్రేణి వేరియంట్లలో డ్రైవర్ అదనపు ప్రయోజనం కోసం కీలెస్ ఎంట్రీని కలిగి ఉంది. మరోవైపు, ప్రకాశవంతమైన కీ రింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లో సగం కన్సోల్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మిగతా వాటిలో మాత్రం పూర్తి కన్సోల్ అందుబాటులో ఉంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లో వెనుక విండ్ స్క్రీన్ కి డీఫాగర్ ఉంది. వీటిలో అన్ని వేరియంట్స్ ఒక ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ తో పొందుపరచబడి విద్యుత్తు తో నియంత్రించబడతాయి. అంతేకాకుండా దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో పడల్ ల్యాంప్స్ ముందర మరియు వెనుక డోర్స్ కి అందుబాటులో ఉన్నాయి.

లోపలి కొలతలు:


మహింద్రా జైలో అంతర్భాగం విశాలంగా ఎక్కువ మంది కూర్చునే విధంగా మరియు ఎక్కువ సామానులు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఎంచుకునే వేరియంట్ ని బట్టి సీటింగ్ సామర్థ్యం 7 నుండి 9 వరకూ ఉంటుంది. అన్ని సీట్లు పెద్దవిగా వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటాయి. దీని వీల్‌బేస్ 2760mm. దీని ముందర భాగంలో లెగ్ స్పేస్ 1260mmమరియు వెనుక భాగంలో లెగ్ స్పేస్ 1050mm. దీనిలో 376 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉండి చాలా సామానులు పట్టే విధంగా ఉంటుంది. దీని మూడవ వరుసలో ఉన్న సీట్లు మడుచుంటే గనుక దీని బూట్ సామర్ధ్యాన్ని 900 లీటర్ల వరకు పెంచవచ్చు. హెడ్ స్పేస్, లెగ్ రూమ్ మరియు భుజం స్పేస్ చాలా ఉదారంగా మరియు ప్రయాణికులకి అనుకులంగా ఉంటుంది. దీనిలో ఇంధన ట్యాంక్ సామర్ధ్యం 55 లీటర్లు ఉండడం వలన దూరపు ప్రయాణాలు సులభం అవుతాయి.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సిరీస్ డీజిల్ వెర్షన్ లో రెండు వేర్వేరు ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తూ 4000rpm వద్ద 118.35bhpగరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు 2400 నుండి 2800rpm వద్ద 280Nm టార్క్ ని అందిస్తుంది. ఇది 2179cc స్థానభ్రంశాన్ని కలిగి ఉంది. అలానే ఇది కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. తరువాత ఇది సమర్థవంతమైన ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో కలిసి పనిచేస్తుంది. కేవలం 15 నుండి 16 సెకన్లలో ఈ ఇంజిన్ 0 నుండి 100kmph వేగం వరకూ చేరుకోగలదు. ఇది సుమారు 150 నుండి156 కిలోమీటర్ల గరిష్ట వేగం వరకూ వెళ్ళగలదు. ఈ ఇంజిన్ హైవేలో 15 kmpl మైలేజ్ ని మరియు నగర పరిధిలో 10 kmpl మైలేజ్ ని అందిస్తుంది. అలాగే 2.5 లీటర్ ఇంజిన్ డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ , నాలుగు సిలిండర్లు మరియు పదహారు కవాటాలు ఆధారంగా పనిచేస్తుంది. ఇది 3600rpm వద్ద 93.7bhpగరిష్ట శక్తి ని మరియు1400rpm నుండి 2800rpm వద్ద 218Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఎండి ఐ సీఅర్ డి ఐ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 17 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు మరియు గరిష్టంగా 150 నుండి 160 కిలోమీటర్ల వేగం వరకూ వెళ్ళగలదు. ఇది కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ తో అమర్చబడి ఉంది. ఇది హైవేస్ లో 12.2 kmpl మైలేజ్ అందిస్తుంది. అలానే నగర పరిధిల్లో 9.1kmpl మైలేజ్ ఇస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


దీని అధిక శ్రేణి వేరియంట్లు హెచ్8 మరియు హెచ్9 , 2-డిన్ సంగీతం వ్యవస్థ తో పొందుపరచబడింది. అంతేకాకుండా హెచ్9 వేరియంట్ బ్లూటూత్ కనెక్టివిటీ ని కలిగి ఉంది. అదనంగా, ఈ వేరియంట్ ఒక వాయిస్ కమాండ్ టెక్నాలజీ తో అమర్చబడి ఉంది. ఈ నియంత్రణలు అన్నీ స్టీరింగ్ వీల్ లో అమర్చబడి ఉంటాయి. ఇతర వేరియంట్లు ఊహించిన అవసరమైన లక్షణాలను అందించబడి లేదు. కొనుగోలుదారులు అదనపు ఖర్చుతో తమకు కావలసిన లక్షణాలని పొందవచ్చు. అదనపు ఉపకరణాలు అయినటువంటి తోలు అపోలిస్ట్రీ రూపం మరియు సౌకర్యం కోసం సీట్లకు అందించబడింది. ఫ్లోర్ మ్యాట్స్, మట్టి ఫ్లాప్స్, ఫాన్సీ డికేల్స్ మరియు అదనపు పవర్ అవుట్‌లెట్స్ వంటి ఇతర లక్షణాలు మొత్తం వాహనాన్ని ఆకర్షణీయంగా ఉంచుతాయి. ఈ పరికరాలు అధీకృత డీలర్స్ నుండి పొందవచ్చు.

వీల్స్ పరిమాణం:


దీనిలో డి2 మరియు డి4 వేరియంట్స్ 15 అంగుళాల స్టీలు చక్రాల సమితి తో అమర్చబడి మరియు 205/65 R15 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. మరోవైపు హెచ్ 8 మరియు హెచ్ 9 వేరియంట్లు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ సమితి తో అమర్చబడి 215/75 R15 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. హెచ్4 వేరియంట్, బలమైన వీల్స్ తో బిగించబడి 215/75 R15 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. దీని బూట్ కంపార్ట్మెంట్ లో స్పేర్ వీల్ టూల్ కిట్ తో పాటుగా ఉంచుతారు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


మహింద్రా జైలో వాహనాన్ని స్థిరంగా ఉంచేందుకుగానూ మరియు నియంత్రించేందుకుగానూ ఒక సమర్ధవంతమైన బ్రేకింగ్ విధానం అమర్చబడి ఉంది. దీనిలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ యొక్క ఆధునిక విధానం ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో అమర్చబడి ఉంది. దీని ముందరి వీల్స్ బలమైన డిస్క్ బ్రేక్‌లు సమితితో బిగించబడి ఉంటాయి. అలానే దీని వెనుక వీల్స్ ప్రామాణిక డ్రమ్ బ్రేక్‌లు సమితితో అమర్చబడి ఉంటాయి. దీని ముందు ఆక్సిల్ డబుల్ విష్బోన్ టైప్ ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ తో అమర్చబడి ఉంటుంది మరియు దీని వెనుక ఆక్సిల్ బహుళ లింక్ కాయిల్ స్ప్రింగ్ తో అమర్చబడి ఉంటుంది. దీనిలో అన్ని వేరియంట్స్ కి పవర్ స్టీరింగ్ టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ తో అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా వాహనాన్ని నియంత్రించడం మరింత సులభం అవుతుంది. దీని టర్నింగ్ రేడియస్ 5.5 మీటర్ల వ్యాసార్థం.

భద్రత మరియు రక్షణ:


యుటిలిటీ వాహనాలు ముఖ్యంగా కఠినమైన రహదారులలో ఉపయోగిస్తారు. భద్రత విభాగానికి వస్తే ఈ వాహనం అనేక భద్రతా లక్షణాలు కలిగి ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ బాగా ఆధునిక విధానాల తో పొందుపరచబడింది. ఇటువంటి యాంటీ-లాక్ బ్రేకింగ్ టెక్నాలజీ అధిక శ్రేణి వేరియంట్లలో అమర్చబడి ఉంది. అదనంగా, ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరింత భద్రత కొరకు చేర్చడం జరిగింది. దీని వలన వాహనానికి ఎక్కువ పట్టు లభించడమే కాకుండా మంచి స్థిరత్వం మరియు నియంత్రణ లభిస్తాయి. ఈ లక్షణం అన్ని వేరియంట్లలో అందుబాటులో లేదు. ఈ లక్షణం హెచ్4 వేరియంట్ లో ఆప్ష్నల్ గా అందుబాటులో ఉంది. ముందు స్థానాల్లో కూర్చునే వినియోగదారుల సంరక్షణ కోసం ఒక జత ఎయిర్‌బ్యాగ్స్ అమర్చబడి ఉంటాయి. ఈ లక్షణం హెచ్8 వేరియంట్లో ఆప్ష్నల్ గా అందుబాటులో ఉంది మరియు అగ్ర శ్రేణి వేరియంట్లో సాధారణంగా అందుబాటులో ఉంది. వీటిలో అన్ని వేరియంట్లు ఇంజిన్ ఇమ్మొబలైజర్ తో అమర్చబడి ఉంటాయి. ఈ లక్షణం ద్వారా అనధికార ప్రవేశాన్నితొలగించవచ్చు. దీని అధిక శ్రేణి వేరియంట్లు హెచ్8 మరియు హెచ్9 రివర్స్ పార్కింగ్ వ్యవస్థ తో పొందుపరచబడింది. ఇటువంటి పలు భద్రతా ఫీచర్లతో ఈ ఎంపివి వాహనం ఒక సురక్షితమైన వాహనంగా పరిగణించబడుతుంది.

అనుకూలాలు:


1. సీట్ల సామర్థ్యం ఎక్కువగా ఉండడం ఒక అనుకూలత.
2. వినియోగదారులకు అనుకూలమైన సౌకర్యాలు అందించడం ఒక అనుకూలత.
3. బాహ్య చిత్రాలు చాలా సొగసుగా మరియు అందంగా కనిపిస్తాయి.
4. ఉన్నతమైన సస్పెన్షన్ టెక్నాలజీతో అమర్చబడింది.
5. చాలా ఉన్నతమైన వీల్‌బేస్ ను అందించారు.

ప్రతికూలాలు:


1.దీని దిగువ శ్రేణి వేరియంట్లలో ఎయిర్‌బ్యాగ్స్ లేకపోవడం ఒక ప్రతికూలత.
2.ఈ వాహనంలో కొన్ని షేడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
3. ఏబిఎస్ మరియు ఇబిడి లేకపోవడం ఒక ప్రతికూలత.
4. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండడం ప్రతికూలత.
5. బేస్ ట్రిమ్ ఆడియో యూనిట్ తో పొందుపరచాలి.