మహీంద్రా వెరిటో-వైబ్

` 6.5 - 7.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్లు

 
*Rs

మహీంద్రా వెరిటో-వైబ్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


మహీంద్రా వెరిటో వైబ్ మోడల్ సిరీస్ యొక్క వాహనాలు అధిక పనితీరును కలిగి అలాగే అనేక సౌకర్య లక్షణాలతో ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ మహీంద్రా యొక్క ఉతత్తి అంతా కూడా ఉన్నత ప్రమాణాలతో రూపొందించడం జరిగింది. అందువలన పెరుగుతున్న మార్కెట్ లో కొనుగోలుదారుల ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకుంటుంది. ఇది ఒక పటిష్టమైన రూపాన్ని కలిగి ఉంది మరియు డిజైనర్లు, ఈ వాహనం యొక్క బాహ్య భాగాలను చాలా ఆకర్షణీయం గా తయారు చేశారు. ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక వైపు బాడీ కలర్ బంపర్స్ అందించడం జరిగింది. అంతేకాకుండా, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు అలాగే వెలుపలి డోర్ హ్యాండిల్స్ కూడా బాడీ కలర్ లోనే అందించడం వలన ఒక సొగసైన రూపాన్ని సొంతం చేసుకుంది. దీనితో పాటు ముందరి భాగం లో పెద్ద గ్రిల్ ను అందించడం జరిగింది దీని మధ్య భాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపర్చారు. దీని వలన ముందు భాగం చాలా అకర్షణీయం గా కనపడుతుంది. ఈ వాహనం యొక్క అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ రైల్స్ వలన ఈ వాహనం ఆధునికంగా కనబడుతుంది. ఈ వాహన సిరీస్ యొక్క భద్రతా విభాగం విషయానికి వస్తే, ఈ వాహనం అనేక ఆధునిక మెకానిజమ్ లను కలిగి ఉంది. బ్రేకింగ్ మెకానిజం విషయం లో, ఈ వాహనాలు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లను కలిగి ఉంటాయి. ఈ రెండు వ్యవస్థలు అన్ని రకాల రోడ్ల పై నియంత్రణ ను మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి. కొల్లాప్సబుల్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉండటం వలన ఛాతీ గాయాలు తప్పించడంలో సహాయపడుతుంది మరియు ముందు ప్రయాణికులు సర్దుబాటయ్యే సీట్ బెల్ట్ లను కలిగి ఉంటారు. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క వెనుక డోర్ కు చైల్డ్ సేఫ్టీ లాక్ ను అందించడం జరిగింది. దీనితో పాటు ఇంజన్ ఇమ్మొబిలైజర్ ను అమర్చారు. డ్రైవర్ సౌలభ్యం కోసం సమాచార వ్యవస్థ ను అందించారు, దీనిలో సగటు ఇంధన వినియోగం, వేగం, ట్రిప్ మీటర్ మరియు దూరం వంటి ఇతర నోటిఫికేషన్లను ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా, మైలేజ్, బయట ఉష్ణోగ్రత మరియు ఇంధన ప్రమాణాలు వంటి చాలా ముఖ్యమైన విధులను ఎల్ ఈ డి ప్రదర్శన ద్వారా చూపిస్తుంది. వీటన్నింటితో పాటు, డ్రైవర్ సౌలభ్యం కొరకు డ్యూయల్ హార్న్, హెడ్లైట్ ఆన్ హెచ్చరిక మరియు డోర్ ఓపెనింగ్ హెచ్చరిక వంటి అనేక ముఖ్యమైన లక్షణాలను అందించడం జరిగింది. ఈ వాహనాలలో ఉండే సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, జరిగేటటువంటి తాకిడి శోషణ తప్పించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, తల గాయాలు నుండి డ్రైవర్ రక్షించటం కొరకు డి6 వేరియంట్ లో డ్రైవర్ ఎయిర్బాగ్ ను అందించడం జరిగింది. ఈ సిరీస్ లో విలీనం చేసిన 1.5-లీటర్ డి సి ఐ డీజిల్ ఇంజన్, చాలా ప్రభావవంతమైనది మరియు అన్ని రకాల పరిస్థితులలో ఒక గొప్ప ప్రదర్శన ను అందిస్తుంది. ఈ వాహనం 2630 మిల్లీ మీటర్లు గల అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉండటం వలన ఈ వాహనం యొక్క క్యాబిన్ స్పేస్ చాలా విశాలంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహన ప్రయాణికులకు వినోదాన్ని అందించడం కోసం అనేక ప్లేయర్ లకు మద్దతిచ్చే ఒక 2- డిన్ సంగీత వ్యవస్థ అందించడం జరిగింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం వెనుక సీట్ల కు మూడు హెడ్ రెస్ట్ లను అందించారు మరియు దానితో పాటు, వెనుక సీటు హాయిగా ముగ్గురు ప్రయాణీకులు కూర్చునేలా మద్దతిస్తుంది. అనెతేకాకుండా, ఇది చాలా విస్తారమైనది. క్యాబిన్ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఈ వాహనం లో ఒక ఆధునిక ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ తో పాటు ఎర్గొనోమిక్ నియంత్రణలు అందించబడ్డాయి. దీని యొక్క డాష్బోర్డ్ చూడటానికి చాలా అధునాతనంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇన్స్ట్రుమెంట్ పానెల్ ఒక ఏకరీతి డిజైన్ ను కలిగి చాలా స్టైలిష్ కనిపిస్తోంది. డ్రైవర్ సౌలభ్య స్థాయిలను మరింత పెంచేందుకు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లను లోపలి నుండి సర్దుబాటు సౌకర్యాన్ని, టైల్గేట్ అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ వంటివి ఈ వాహనానికి అధనంగా అందించబడ్డాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పవర్ స్టీరింగ్ ఫీచర్, డ్రైవింగ్ సమయం లో డ్రైవర్ కు చాలా సౌకర్యవంతంగా పనిచేస్తుంది మరియు అలాగే మంచి నిర్వహణ కు సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ వాహనం లో ఒక ఉన్నతమైన సస్పెన్షన్ యంత్రాంగాన్ని విలీనం చేశారు. ఇది డ్రైవింగ్ నాణ్యత ను మరింత పెంచుతుంది. ఈ వాహనం యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం రహదారుల పై 20.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. ఈ వాహనం యొక్క వారెంటీ మూడు సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు. దీనిని అదనపు ఖర్చు వద్ద మరింత పెంచవచ్చు. ప్రస్తుతం కొనుగోలుదారులు ఈ సిరీస్ ను ఎంచుకోవడానికి ఏడు అద్భుతమైన షేడ్స్ లో అందుబాటులో ఉంది. ఇది కాక, సంస్థ 24X7 రోడ్ సైడ్ సహాయం అందిస్తుంది. ఇది ఒక గొప్ప ప్రయోజనం అని చెప్పవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనాలు, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి మరియు ఈ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా రహదారుల పై 20.80 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే నగరాలలో 18 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ మైలేజ్ భారతదేశం ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ చే సర్టిఫై చేయబడినది.

శక్తి సామర్థ్యం:


ఈ మోడల్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 4000 ఆర్ పి ఎం వద్ద 64.1 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 2000 ఆర్ పి ఎం వద్ద 160 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

యాక్సలరేషన్ మరియు పికప్:


ఈ సిరీస్ వాహనాలు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటాయి. ఈ మోటార్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగన్ని చేరడానికి 17.2 సెకన్ల సమయం పడుతుంది. మోవైపు ఇదే వాహనం 140 నుండి 145 కె ఎం పి హెచ్ గరిష్ట వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


ఈ వాహనం బయట నుండి చూడటానికి చాలా ఆకర్షణీయం గా, సొగసైనదిగా మరియు ఆధునికంగా కనిపించడం కోసం అనేక అంశాలతో ఈ వాహనాన్ని అలంకరించడం జరిగింది. ముఖ్యంగా, ఈ వాహనం యొక్క ముందు భాగం మొదటిసారి చూడగానే చాలా ఆకర్షణీయం గా కనపడటానికి అనేక లక్షణాలను పొదుపరచడం జరిగింది. ముందరి భాగం లో ఉండే గ్రిల్ చాలా విస్తృతంగా మరియు అధునాతనమైనది. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన డి2 వాహనం అలాగే మధ్య శ్రేణి వేరియంట్ అయిన డి4 వాహనాలలో పైన మరియు కింద బెజెల్, మట్టే నలుపు రంగుతో అందించడం జరిగింది. అదే విధంగా మరోవైపు, ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన డి6 వాహనం యొక్క ముందరి గ్రిల్, నిగనిగలాడే కార్బన్ తో చిత్రీకరించడం జరిగింది. ఈ వాహనం యొక్క ముందరి విండ్స్క్రీన్ కు ఒక జత 2- స్పీడ్ ఇంటర్మిట్టెంట్ వైపర్స్ తో పాటు వాషర్ ను అందించడం జరిగింది. ఈ లక్షణం ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో చూడవచ్చు. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క ముందరి మరియు వెనుక బంపర్స్ రెండూ కూడా బాడీ కలర్ లో అందించబడతాయి. దీని వలన అది ఏకరీతి లుక్ కలిగి మరియు దీనితో పాటుగా మొత్తంగా ఒక సొగసైన రూపాన్ని అందిస్తుంది. ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ బాడీ కలర్ సైడ్ మౌల్డింగ్స్ ను కలిగి ఉంటుంది. అదే ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇదే వేరియంట్ యొక్క వీల్ ఆర్చులకు అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. అదే ఈ మోడల్ యొక్క మిగిలిన వేరియంట్ లలో రోబొస్ట్ స్టీల్ వీల్స్ తో పాటు ట్యూబ్ లెస్ రేడియల్స్ అందించబడతాయి. అదే దిగువ శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, వీటి యొక్క రిం లు హబ్ క్యాప్స్ తో కప్పాబడి ఉంటాయి. అదే విధంగా మధ్య శ్రేణి వేరియంట్ లో పూర్తి వీల్ కవర్ తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా, సైడ్ ప్రొఫైల్ మరింత అందంగా కనపడటం కోసం ఈ మోడల్ యొక్క అగ్ర మరియు మధ్య శ్రేణి వేరియంట్ లలో వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు మరియు డోర్ హ్యాండిల్స్ కూడా కారు బాడీ కలర్ లో నే ఉంటాయి. అన్ని వేరియంట్ లలో వెనుక విండ్ స్క్రీన్ కు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ను బిగించడం జరిగింది. ఇది భద్రతా సూచీ ను మరింత పెంచుతుంది అలాగే ఇది ఒక ప్రామాణికమైన అంశం. ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ లో, స్పష్టమైన లెన్స్ ఆధారిత ఫాగ్ ల్యాంప్స్ ముందు బంపర్ పై అమర్చబడి ఉంటాయి. ఈ ల్యాంప్స్ ఒక అధునాతన డిజైన్ తో మరియు ఒక ఫాషన్ లుక్ ను జతచేస్తాయి. ఈ వాహనాల పై భాగం లో ఒక జత స్పోర్టీ రూఫ్ రైల్స్ బిగించబడి ఉంటాయి. ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన డి6 వేరియంట్ యొక్క వెనుక భాగం, క్రోం తో అలంకరించబడి ఉంటుద్ని. అదే మిగిలిన వేరియంట్ ల విషయానికి వస్తే, వెనుక భాగం నలుపు రంగు తో అలంకరించబడి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ వాహనాన్ని సరైన పరిమాణాలతో రూపొందించడం వలన, చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 3991 మిల్లీ మీటర్లు, మొత్తం వెడల్పు 1740 మిల్లీ మీటర్లు, మొత్తం ఎత్తు 1540 మిల్లీ మీటర్లు. అంతేకాకుండా, ఈ హాచ్బాక్ 2630 మిల్లీ మీటర్లు గల బారీ వీల్బేస్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 172 మిల్లీ మీటర్లు, మొత్తం బరువు 1655 కిలోలు మరియు స్థూల బరువు 1155 కిలోలు.

లోపలి డిజైన్:


ఈ వాహన సిరీస్ యొక్క అంతర్గత భాగాలు చాలా ఆకర్షణీయం గా మరియు చాలా సౌలభ్యాన్ని అందించేలా రూపొందించారు. ముఖ్యంగా ఈ వాహనం యొక్క సీట్లు మంచి నాణ్యత కలిగి ఉన్నాయి మరియు చాలా కుషనీ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్ లలో సీట్లు, వోవెన్ జాక్వర్డ్ ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. అదే అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, దీనిలో సీట్లు సర్క్యులర్ ఇన్సర్ట్ ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో అందించబడతాయి. అదే గేర్ నాబ్ విషయానికి వస్తే, ఇది నలుపు రంగులో చాలా స్పోర్టీ లుక్ ను కలిగి ఉంటుంది మరియు ఇలా ఈ సిరీస్ యొక్క మధ్య, దిగువ శ్రేణి వేరియంట్ లలో మాత్రమే చూడవచ్చు. అదే అగ్ర శ్రేణి వేరియంట్ లో గేర్ షిఫ్ట్ లెవెర్ నాబ్, సిల్వర్ కలర్ తో చిత్రించబడి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ పానెల్ ఒక టాపర్ ప్యాడ్ ను కలిగి ఉంటుందిమరియు ఒక సెంట్రల్ కన్సోల్ తో పాటు గొప్ప నిల్వ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. దిగువ శ్రేణి వేరియంట్ లో సెంటర్ ఫేసియా నలుపు రంగు ముగింపు తో వస్తుంది. అదే మధ్య శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, సెంటర్ ఫేసియా చిత్రీకరించబడి ఉంటుంది. ఈ సిరీస్ యొక్క అన్ని వాహనాల బూట్ కంపారట్మెంట్ చక్కని లుక్ ను అందించడం కోసం ఒక కార్పెట్ ను కలిగి ఉంటుంది. అగ్ర శ్రేణి వేరియంట్ లో ఒక బాటిల్ హోల్డర్ అందించబడుతుంది. అన్ని వేరియంట్ లలో రెండు సన్ వైసర్స్ అందించబడతాయి. దానిలో ఒకటి డ్రైవర్ సైడ్ మరియు రెండవది ముందు ప్రయాణికుడి వైపు, దీనికి ఒక వానిటీ మిర్రర్ నుకూడా అందించడం జరిగింది. ఈ వాహనాల డాష్బోర్డ్ కు ఒక కంప్యూటరీకరణ సమాచార వ్యవస్థ విలీనం చేయబడి ఉంటుంది. ఈ వాహనం లో ఉండే ఇన్స్ట్రుమెంట్ పానెల్, ట్రిప్ మీటర్, సగటు ఇంధన వినియోగం ప్రదర్శన, సగటు వేగం మరియు దూరం వంటి అనేక ప్రకటనలను కలిగి ఉంది. వీటన్నింటితో పాటు డ్రైవర్ సౌలభ్యం కోసం ఒక టాకోమీటర్ కూడా అందించబడినది. ఈ పానెల్ అధనంగా ఒక ఎల్ ఈ డి ప్రదర్శనను కలిగి ఉంటుంది. దీనిలో డిజిటల్ గడియారం, పూర్తి మైలేజ్ ఇండికేటర్ మరియు ట్రిప్ మైలేజ్ వంటి వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. దీనితో పాటుగా, ఇంధన ప్రమాణాల తో పాటు బయట ఉష్ణోగ్రత ప్రదర్శన ను కూడా కలిగి ఉంటుంది. డ్రైవర్ సౌకర్యం కోసం, ద్వని తో కూడిన డబుల్ ఇంపాక్ట్ ను ఉత్పత్తి చేసే డ్యూయల్ హార్న్ ను కలిగి ఉంటుంది. వీటన్నింటితో పాటు, డోర్ ఓపెన్ హెచ్చరిక లైట్ లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. దీనిలో ప్రామాణికమైన లక్షణం ఏమిటంటే, డ్రైవర్ కోసం లోపలి వైపు రేర్ వ్యూ మిర్రర్ ను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా ఒక కర్టసీ ల్యాంప్ కూడా బిగించి ఉంటుంది.

లోపలి సౌకర్యాలు:


మహింద్రా వెరిటొ వైబ్ సిరీస్ లో అనేక భద్రతా లక్షణాలను ప్రయాణికులకు మాత్రమే కాదు డ్రైవర్ సౌకర్యం కొరకు కూడా అందించడం జరిగింది. క్యాబిన్ ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఒక ఎయిర్ కండీసహనింగ్ వ్యవస్థ ను కూడా అందించడం జరిగింది. దీనితో పాటుగా మంచి సౌలభ్యం కోసం ఒక హీటర్ ఫంక్షన్ ను అందించడం జరిగింది. ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో గల సీట్లు హెడ్ రెస్ట్ లను కలిగి ఉంటాయి. అవి సర్దుబాటు సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటాయి. ఈ వాహనం యొక్క ముందు డోర్లకు మ్యాప్ పాకెట్స్ బిగించబడి ఉంటాయి. అంతేకాకుండా, క్యాబిన్ లో కర్టసీ ల్యాంప్ తో పాటు డిమ్మింగ్ ఎఫెక్ట్ ను కూడా కలిగి ఉండేలా బిగించడం జరిగింది. ఈ వాహనం యొక్క బూట్ కంపార్ట్మెంట్ లో కూడా ఒక ల్యాంప్ ను అందించడం జరిగింది. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు మాన్యువల్ గా సర్దుబాటు చేసుకునే ఫంక్షన్ ను కలిగి ఉంటుంది. అదే మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్ ల విషయానికి వస్తే, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు విద్యుత్ తో సర్దుబాటు చేసుకునే ఫంక్షన్ ను కలిగి ఉంటాయి. డ్రైవర్ కు మరింత సౌలభ్యాన్ని చేకూర్చడానికి ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు పవర్ స్టీరింగ్ ఫంక్షన్ ను కలిగి ఉంటాయి. దీని వలన డ్రైవింగ్ సమయం లో డ్రైవర్ కు కృషి ని తగ్గించడం లో సహాయపడుతుంది. ఈ వాహనానికి ముందు మరియు వెనుక పవర్ విండోస్ అందించబడతాయి. ఈ పవర్ విండోస్ దిగువ శ్రేణి వేరియంట్ అయిన డి2 వాహనం లో ఉండవు. ఈ హాచ్బాక్ కు వినోదాన్ని అందించడం కోసం 2- డిన్ సంగీత వ్యవస్థ ఈ క్యాబిన్ కు అందించడం జరిగింది. ఈ సంగీత యూనిట్, రేడియో ట్యూనర్ కు మద్దతిస్తుంది. అంతేకాకుండా, ఈ యూనిట్ సిడి, ఎం పి3 ప్లేయర్ తో పాటు ఆక్స్ - ఇన్ మరియు యూఎస్బి పోర్ట్ వంటి యూనిట్ లకు మద్దతిస్తుంది. ఈ లక్షణాన్ని, డి6 వేరియంట్ మాత్రమే కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం సంగీత ద్వని సమంగా పంపిణీ అవ్వడం కోసం నాలుగు స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ యొక్క వెనుక విండ్ స్క్రీన్ డీఫాగర్ ఫంక్షన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వేరియంట్ సెంట్రల్ లాకింగ్ సిస్టం తో పాటు రిమోట్ డోర్ లాకింగ్ ను కూడా కలిగి ఉంటుంది. అదే మధ్య శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, దీనిలో సెంట్రల్ లాకింగ్ సిస్టం మాత్రమే అందించబడుతుంది.

లోపలి కొలతలు:


ఈ వాహనం, పెద్ద వీల్బేస్ ను కలిగి ఉంటుంది. దీని కారణంగా క్యాబిన్ అంతర్గత భాగం చాలా విశాలంగా హాయిగా ఐదుగురు కుటుంబసభ్యులు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశాన్ని ఈ వాహనం కలిగి ఉంటుంది. ముందు యజమానులకు కాళ్ళ మధ్య మరియు సీట్లు లేదా డాష్బోర్డ్ మధ్య రాపిడి ని తొలగించడానికి ఉదారమైన లెగ్ రూం ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క హెడ్ రూం చాలా విశాలంగా మరియు పొడవైన వ్యక్తులు కూడా సౌకర్యవంతంగా కూర్చునేలా ఈ వాహనాన్ని రూపొందించారు. పుష్కలమైన షోల్డర్ స్పేస్ ను కూడా కలిగి ఉంటుంది. దీని వలన ప్రయాణికుల మధ్య ఎటువంటి రాపిడి లేకుండా హాయిగా కూర్చోవడానికి సహాయపడుతుంది. ఈ వాహనం, 50 లీటర్ల డీజిల్ ఇంధన సామర్ధ్యాన్ని కలిగిన ఒక ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంటుంది. ఈ వాహన సిరీస్ 330 లీటర్లు కలిగిన బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంటుంది. దీనిని, వెనుక సీటు మడవటం ద్వారా ఈ స్పేస్ ను మరింత పెంచవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సిరీస్ యొక్క అన్ని వాహనాలు సమర్ధవంతమైన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంజన్ 1461 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి. ఈ వాహనం, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 4000 ఆర్ పి ఎం వద్ద 64.1 బి హెచ్ పి పవర్ ను మరియు 2000 ఆర్ పి ఎం వద్ద 160 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ ఆధారంగా రహదారులపై 20.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే నగరాలలో 18 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మోడల్ యొక్క అగ్రశ్రేణి వేరియంట్ లో, 2- డిన్ సంగీతం వ్యవస్థ అందించబడుతుంది. అంతేకాకుండా, ఇది సిడి, ఎం పి3 ప్లేయర్, యూఎస్బి మరియు ఆక్స్- ఇన్ వంటి అనేక ప్లేయర్ లకు మద్దతిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం రేడియో ట్యూనర్ ను కూడా కలిగి ఉంది. అదే విధంగా క్యాబిన్ లో ద్వని సమంగా పంపిణీ అవ్వడం కోసం నాలుగు స్పీకర్లను అమర్చడం జరిగింది. ఇవన్నీ కాక, కొనుగోలుదారులు అదికార డీలర్ నుండి అదనపు ఖర్చు వద్ద అనేక లక్షణాలను ఈ వాహనానికి ఎంపిక చేసుకోవచ్చు. ఆ ఉపకరణాలు ఏమిటంటే, ఫ్లోర్ మ్యాట్స్, లెథర్ అపోలిస్ట్రీ, స్పాయిలర్స్ మరియు బాహ్యా భాగాలపై ఫ్యాన్సీ డికాల్స్ వంటి అనేక ఇతర అంశాలను పొందవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన డి2 వాహనం మరియు మధ్య శ్రేణి వేరియంట్ అయిన డి4 వాహనం లో 14 అంగుళాల స్టీల్ వీల్స్ అందించబడతాయి. వీటి యొక్క రిం లు అందమైన పూర్తి వీల్ కవర్స్ తో కప్పబడి ఉంటాయి. అదే ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, అదే పరిమాణం గల 14- అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. అంతేకాకుండా, వీటి యొక్క రిం లు దృఢమైన మరియు బలమైన 185/70 R14 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్ల తో కప్పబడి ఉంటాయి. ఈ సిరీస్ లో ఒక ప్రామాణికమైన లక్షణం ఏమిటంటే, పూర్తి పరిమాణం గల ఒక విడి చక్రం తో పాటు ఒక ఫ్లాట్ టైర్ ను మార్చడానికి అవసరమైన అన్ని ఉపకరణాలు బూట్ కంపార్ట్మెంట్ లో అందించబడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ సిరీస్ యొక్క అన్ని వాహనాలు సుపీరియర్ బ్రేకింగ్ వ్యవస్థ ను అలాగే సమర్థవంతమైన సస్పెన్షన్ ను కలిగి ఉంటాయి. ముందుగా బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనాల ముందు చక్రాలు డిస్క్ బ్రేక్ ల సమితి తో బిగించబడి ఉంటాయి. అలాగే వెనుక చక్రాలు ప్రామాణిక డ్రమ్ బ్రేక్లు సమితి తో బిగించి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్లు, అన్ని రకాల రోడ్ల పై ఒక బలమైన పట్టును అందించడం కోసం ఒక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి. దీని వలన బ్రేకింగ్ సామర్ధ్యం మరింత మెరుగుపడుతుంది. దీనితో పాటుగా ఈ వాహనం ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ను కూడా కలిగి ఉంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనాల ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో పాటు విష్బోన్ లింక్ తో బిగించి ఉంటుంది. అదే, వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, హెచ్- సెక్షన్ టోరిసన్ బీం తో పాటు ప్రోగ్రామెడ్ డిఫ్లెక్షన్ కాయిల్ స్ప్రింగ్ తో విలీనం చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనాల స్టీరింగ్ వీల్ ర్యాక్ అండ్ పినియన్ విధానం పై ఆధారపడి ఉంటుంది. ఈ వాహనం, గొప్ప సౌలభ్యాన్ని అందించడం కోసం దీని యొక్క స్టీరింగ్ వీల్ 5.25 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాశార్ధానికి మద్దతిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలు వాహనం యొక్క నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి మరియు డ్రైవ్ లో వాహనం మంచి నియంత్రణ ను మరియు గట్టి పటుత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ లో ముఖ్యమైన భద్రతా అంశం ఏమిటంటే, డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్ ను కలిగి ఉండటం. ఈ వాహనాల స్టీరింగ్ వీల్ కొల్లప్సబుల్ ఫంక్షన్ ను కలిగి ఉంటుంది. దీని వలన ఏమైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, చాతీ ఏ రకమైన నష్ట్టానికి గురి కాకుండా కాపాడతాయి. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లలో స్థిరంగా ఉండే సీట్ బెల్ట్స్ అందించబడతాయి. అదే మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్ ల విషయానికి వస్తే, వీటిలో ఉండే సీట్ బెల్ట్ లను వారి అవసరాలకు తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు కూడా ఇంజన్ ఇమ్మోబిలైజర్ ను కలిగి ఉంటాయి. ఈ వాహనాల ముందు చక్రాలు డిస్క్ బ్రేక్ లను కలిగి ఉండటం వలన రోడ్ల పై జారీ పోకుండా, మంచి స్థిరత్వాన్ని మరియు గట్టి పటుత్వాన్ని అందిస్తాయి. అంతేకాకుండా, ఈ వాహనం పిల్లల కోసం వెనుక డోర్లకు చైల్డ్ సేఫ్టీ లాక్స్ ను కలిగి ఉంటాయి. అన్ని వేరియంట్ల లోపలి భాగాలలో లోపలి రేర్ వ్యూ మిర్రర్ ప్రామాణిక అంశంగా అందించబడుతుంది. ఒక జత హాలోజెన్ హెడ్ల్యాంప్స్ రోడ్ల పై ప్రకాశవంతమైన ప్రత్యక్షత ను అందించడం లో సహాయపడతాయి. మరొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, సూర్యకాంతి వ్యాప్తి ప్రభావాన్ని తగ్గించడానికి ఈ వాహనం యొక్క విండ్షీల్డ్ ఒక పొరను కలిగి ఉంటుంది.

అనుకూలాలు:


1. అనేక సౌకర్య లక్షణాలు ఉండడం ఒక అనుకూలతగా చెప్పవచ్చు.
2. ధర పరిధి చాలా సరసమైనది గా ఉంది.
3. నిర్వహణ వ్యయం ఆకట్టుకునే విధంగా ఉంది.
4. ఈ వాహన సిరీస్ కు అనేక భద్రతా లక్షణాలను అందించారు.
5. అంతర్గత భాగం చాలా విశాలంగా ఉంటుంది.

ప్రతికూలాలు:


1. ఈ వాహన సిరీస్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఉండవలసినంత లేదు.
2. ఇంధన సామర్ధ్యం మెరుగు పడవలసిన అవసరం ఉంది.
3. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లో సంగీత వ్యవస్థ లేకపోవడం ఒక ప్రతికూలత గా బావించవచ్చు.
4. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లకు ఎయిర్బాగ్స్ అందించవలసిన ఆస్కారం ఉంది.
5. ఈ సిరీస్ యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్ లలో ఏబిఎస్ లేకపోవడం ఒక ప్రతికూలతగా చెప్పవచ్చు .