మహీంద్రా TUV 300

` 7.6 - 10.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్‌లు

 
*Rs

మహీంద్రా TUV 300 వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


డిసెంబర్ 10, 2015: పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా మహీంద్రా సంస్థ, టియువి 300 యొక్క ఉత్పత్తిని పెంచేందుకు యోచిస్తోంది. (ముఖ్యంగా ఏ ఎం టి వేరియంట్లు వలన) వినియోగదారులు నుండి ఒక అద్భుతమైన స్పందన పొందిన తరువాత, భారత కార్ల తయారీ సంస్థ, సుమారు నెలకు 6,000 యూనిట్ ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి నిర్ణయించింది. నెలకు సుమారు 4,000 యూనిట్ల వాహనాలను అమ్మకాలు జరుపుతుంది. మహీంద్రా టియువి 300 వాహనం, ఈ అత్యంత పోటీ విభాగంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలచింది. తాజా నవీకరణ ప్రకారం, తాజా నవీకరణ ప్రకారం, ఈ టియువి 300 వాహనం 16,000 కంటే ఎక్కువ అభియోగాలను నమోదు చేసుకుంది. కొత్త సంవత్సరం చివరిలో ఈ ఉత్పత్తి పెంపుదల ఉంటుంది అని అన్నారు మరియు ఇది, అన్ని వాహన ఆటోమొబైల్ పరిశ్రమలో ఊపందుకుంది అని భావిస్తున్నారు.

అవలోకనం


పరిచయం


మహీంద్రా, ఎస్యూవి బారీ సేకరణ తో ప్రజల గుండెలను గెలుచుకుంటుంది. ఈ సంస్థ, ఎస్యువి విభాగాన్ని మరింత బలేపేతం చేయడం కోసం మాత్రమే ఈ టియువి 300 వాహనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరియు ఈ విభాగం యొక్క స్థానాన్ని చూపించడం కోసం అందించబడిన మరొక యంత్రం. ఈ వాహనం మొదటి చూపులోనే ఒక అందమైన అద్భుతమైన ముద్ర ను రాబట్టుకుంది. ఈ వాహనం గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం మరియు అనుకూలాలు అలాగే ప్రతికూలాలు మధ్య గల తేడాలను కూడా తెలుసుకుందాం.

అనుకూలాలు:1. ఈ వాహనానికి బారీ క్యాబిన్ స్పేస్ అందించబడింది. దీని వలన ముందు రెండు వరుసల ప్రయాణికులకు పుష్కలమైన హెడ్ రూం అలాగే లెగ్ రూం లు అందించబడతాయి.
2. ఈ వాహనానికి, 384 లీటర్ల బారీ బూట్ సామర్ధ్యన్ని అందించడం జరిగింది. ఈ విభాగంలో బూట్ సామర్ధ్యం పరంగా మొదటి స్థానం లో నిలుస్తుంది.
3. ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు, ద్వంద్వ ఎయిర్బాగ్ లతో పాటు ఏబిఎస్ మరియు ఈబిడి వంటి అంశాలను అందించడం జరిగింది.

 

ప్రతికూలాలు:1. ఈ మోడల్ సిరీస్ యొక్క వాహనాలలో ఎన్విహెచ్ స్థాయిలు ఉత్తమంగా లేవు. పెడల్స్ మరియు గేర్ షిఫ్ట్ లెవర్ లు శబ్దాన్ని విడుదల చేస్తాయి.
2. ఈ వాహనానికి అందించబడిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అంతగా శుద్ది చేయబడినది కాదు. ఈ ఇంజన్ ఎక్కువ శబ్దాన్ని విడుదల చేస్తుంది.
3. మూడవ వరుస జంప్ సీట్లు ఆచరణాత్మకంగా పనికిరానివి గా ఉంటాయి. ఈ వాహనాన్ని, ఉత్తమ 5- సీటర్ గా ఉపయోగించవచ్చు.

 

అత్యద్భుతమైన లక్షణాలు:1. ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కు బ్లూ సెన్స్ టెక్నాలజీ ను అందించడం జరిగింది. ఈ వ్యవస్థ కోసం, ఫోన్ నుండి బిటి రిమోట్ కు అత్యావశ్యకముగా మారుతుంది.
2. మైక్రో హైబ్రిడ్ టెక్ అనునది ఈ విభాగంలో మొదటి సారిగా అందించబడింది మరియు ఇది, సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

 

అవలోకనం:


ఈ వాహనానికి అందించిన డిజైన అనేక మంది మనస్సును దోచుకుంటుంది. భారీ పరిమాణం, ప్రముఖ శరీర పంక్తులు, మరియు విస్తృత బోనెట్ వంటి అన్ని అంశాలను కలిగిన ఈ వాహనాన్ని చూడగానే, ఖచ్చితంగా ప్రజలు ఆకర్షితులు అవుతారు. మహింద్రా సంస్థ ముందుగా అందించిన క్వాంట్రో వాహనం ఇదే ధర ట్యాగ్ వద్ద అందించబడింది. దీని యొక్క అంతర్గత అంశాలతో పోలిస్తే ఈ మహింద్రా టియువి వాహనం యొక్క అంతర్గత భాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వాహనానికి అనేక సౌకర్య అంశాలు అందించబడ్డాయి. అవి వరుసగా, రూఫ్ ల్యాంప్‌లు, నిల్వ ట్రే లు, కప్ హోల్డర్లు, పవర్ విండోలు, బ్లూటూత్ కనెక్టవిటీ మరియు స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు వంటి అనేక సౌకర్యాలు అందించబడ్డాయి. ఈ వాహనానికి మిత వ్యయం కలిగిన డీజిల్ మోటార్ ను అందించడం జరిగింది మరియు ఒక ఏఎంటి ఆప్షనల్ ఎంపిక కూడా అందించబడింది. ఈ వాహనాలలో ఏ ఏ అంశాలు అందించబడ్డాయో చూద్దాం రండి.

బాహ్య భాగం


Image 1

మహింద్రా ప్రొజెక్ట్లు టియువి 300 వాహనం గురించి ఏంచెబుతున్నాయి అంటే, ఇది ఒక మందపాటి, కటినమైన అలాగే గరుకైన వాహనం గా పరిగణించారు. ఈ వాహనం యొక్క స్టైలింగ్ ను, యుద్ద ట్యాంక్ ప్రేరణ నుండి తీసుకోవడం జరిగింది. ఈ వాహనం యొక్క స్టైలింగ్, ఇతర వాహనాల స్టైలింగ్ లు కంటే ఆకర్షణీయంగా ఉంది.

Image 2

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, ముందు మధ్య భాగంలో ఒక విస్తృత ఐదు స్లాట్ల క్రోం గ్రిల్ అందించబడింది మరియు క్రోం చేరికలను అందించడం వలన దీనిని మనం సులభంగా గుర్తించవచ్చు.

Image 3

దీనికి ఇరువౌపులా చదరపు ఇష్ ఆకారపు హెడ్ లైట్ క్లస్టర్లు విలీనం చేయబడి ఉన్నాయి. మహింద్రా సంస్థ, ఈ హెడ్ లైట్ క్లస్టర్లలో డే టైం రన్నింగ్ లైట్లను అందించింది. అంతేకాకుండా, వీటిని కెయువి 100 వాహనంలో కూడా చూడవచ్చు.

Image 4

ఈ గ్రిల్ క్రింది భాగంలో ఒక బంపర్ అందించబడింది. దీనికి, ఒక జత ఫాగ్ ల్యాంప్‌లు విలీనం చేయబడి ఉన్నాయి మరియు ఇవి, రోడ్లపై ప్రయాణ సమయాలలో మరింత ప్రత్యక్షతను అందిస్తాయి. ఈ ఫాగ్ ల్యాంప్‌ల చుట్టూ క్రోం సరౌండ్ ను అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాహనం యొక్క ముందు భాగం, మహీంద్రా ప్రమాణాలు ద్వారా ఊహించినంత ఆకర్షణీయంగా ఉండదు. అంతేకాకుండా ఈ వాహనం యొక్క బాహ్య భాగం అనుకూలాలను అలాగే ప్రతికూలాలను కూడా కలిగి ఉంది.

Image 5

మరోవైపు ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, చదరపు ఆకారంలో ఉండే వీల్ ఆర్చులను వేరే డిజైన్ విధానం కోసం తయారు చేయడం జరిగింది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీల్ ఆర్చ్ కు అలాగే వీల్ కు ఎక్కువ స్థలాన్ని మనం గమనించవచ్చు.

Image 6

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ టియువి వాహనం యొక్క వీల్ ఆర్చులకు ఆకర్షణీయమైన ఒక జత వీల్స్ ను అందించడం జరిగింది. వీటికి 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను అందించడం జరిగింది మరియు చూడటానికి ఈ వాహనం చాలా పెద్దదిగా ఉంటుంది.

Image 7

వాహనానికి మరింత అందాన్ని ఇవ్వడం కోసం సైడ్ ప్రొఫైల్ లో ఉండే సైడ్ స్టెప్ కు నలుపు రంగు ను అందించడం జరిగింది మరియు వాహనం యొక్క పై భాగంలో నలుపు రంగు కలిగిన రూఫ్ రైల్స్ ను కూడా అందించడం జరిగింది.

Image 8

వెనుక భాగానికి అందించబడిన స్టైలింగ్ వలన వాహనానికి ఒక ఆకర్షణీయమైన లుక్ తెచ్చిపెడుతుంది. దీని వలన వాహనం సమతుల్యంగా కూడా ఉంటుంది. ఈ కారుకు సంప్రదాయబద్ధంగా రూపొందించిన ప్రొఫైల్ ఉండగా కొనుగోలుదారులు, వేరే వాహనం జోలికి ఎందుకు వెళతారు. ఇన్ని అంశాలతో ఈ వాహన స్టైలింగ్, మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Image 9

ఈ వాహనం యొక్క వెనుక భాగంలో, బూట్ లిడ్ కు ఇరువైపులా ర్యాప్ అరౌండ్ టైల్ ల్యాంప్ లను అందించడం జరిగింది. దీని వలన వాహనానికి ఒక మంచి రూపకల్పన అందించబడుతుంది. అంతేకాకుండా వెనుక భాగంలో టైల్ గేట్ కు కుడి వైపు, ఒక విడి చక్రం బిగించబడి ఉంటుంది. వీటి వలన వెనుక భాగం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Table 1

Table 2

అంతర్గత భాగం:


ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, బీజ్ రంగు మరియు నలుపు రంగు తో లోపలి భాగం మొత్తం అలంకరించబడి ఉంటుంది అలాగే లోపలి భాగం మరింత అందంగా కనబడటం కోసం కొన్ని వెండి చేరికలను కూడా అందించడం జరిగింది. మహింద్రా సంస్థ నుండి ఉత్తమ వాహనం కాకపోయినా దీని ధర పరంగా ఒక మంచి వాహనం అని చెప్పవచ్చు. లోపలి క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది మరియు తయారీదారుడు ఈ క్యాబిన్ ను ఖచ్చితమైన నిష్పత్తిలో రూపొందించాడు. పొడవుగా మరియు లావుగా ఉండే ప్రయాణికులు, ప్రయాణ సమయంలో కొద్దిగా పిర్యాదులు అందించే అవకాశం ఉంది.

Image 10

కాక్‌పిట్ విభాగంలో ఉండే డాష్‌బోర్డ్ విషయానికి వస్తే, కొత్త డాష్‌బోర్డ్ లే అవుట్ అంతా మనం ఊహించిన దాని కంటే అద్భుతంగా ఉంటుంది మరియు ఈ కొత్త మోడల్ బీజ్ అలాగే నలుపు మిశ్రమాలతో ఈ మహింద్రా వాహనానికి సమర్ధవంతం చేస్తుంది. ఈ డాష్‌బోర్డ్ మధ్య భాగంలో నలుపు రంగు అందించబడుతుంది. అలాగే పైన సగ భాగానికి మరియు క్రింది సగ భాగానికి భాగాలకు బీజ్ రంగు అందించబడుతుంది.

Image 11

నలుపు డిజైన్, ముందు కన్సోల్ దాకా వ్యాపించి ఉంటుంది మరియు ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టెర్ అలాగే స్టీరింగ్ వీల్ వరకు కూడా వ్యాపించి ఉంటుంది. సెంట్రల్ కన్సోల్, సాధారణ డిజైన్ ను కలిగి ఉంటుంది మరియు ఇది, కంటిని ఆకర్షింప చేసే విధంగా ఉంటుంది. ఈ సంస్థ నుండి విడుదల అయిన ఇతర నమూనాలతో పోలిస్తే ఈ వాహనానికి ఒక ఆకర్షణీయమైన క్యాబిన్ ను అందించడం జరిగింది. లోపలి భాగానికి మరింత అందాన్ని చేకూర్చడానికి క్యాబిన్ భాగంలో ఉండే సెంట్రల్ కన్సోల్ కు పియానో బ్లాక్ ఫినిషింగ్ ను అందించడం జరిగింది మరియు మరింత అందాన్ని ఇవ్వడానికి, ఈ భాగం అంతా వెండి చేరికలతో అలంకరించబడి ఉంటుంది.

కన్సోల్ పై భాగంలో, రెండు ఏసి వెంట్ లు విలీనం చేయబడి ఉంటాయి మరియు కుడి వైపు క్రింది భాగంలో బ్లూటూత్, ఆక్స్, యూఎస్బి మరియు అనేక ఇతర ఫంక్షన్ లతో వచ్చే 2 దిన్ ఆడియో వ్యవస్థ అందించబడుతుంది. రేడియో యొక్క బటన్లు, చిన్న స్క్రీన్ చుట్టూ అందంగా పొందుపరచబడి ఉంటాయి.

Image 12

ఈ సెంట్రల్ కన్సోల్ క్రింది భాగంలో, మూడు బారీ ఏసి నాబ్ లు క్రోం సరౌండింగ్ తో అందించబడతాయి. యూఎస్బి మరియు ఆక్స్ ఇన్ పోర్ట్ లతో కూడిన 12 వి పవర్ సాకెట్, ముందు భాగంలో ఉండే గేర్ లెవర్ వద్ద అందించబడుతుంది. మరో ముఖ్య మైన విషయం ఏమిటంటే, ముందు భాగం లో అందించబడిన రెండు సీట్ల మధ్య్లో ఒక ఖాళీ స్థలం అందించబడుతుంది. దానిలో కప్ హోల్డర్ లు మరియు ఇతర నిల్వ ఆప్షన్లు అందించబడతాయి.

Image 13

అంతేకాకుండా, నాలుగు డోర్ల పవర్ విండోల స్విచ్చులు అన్నియూ కూడా రెండు సీట్ల మద్య భాగంలోనే అందించబడతాయి. అయితే, హ్యాండ్ బ్రేక్ ప్రక్కన భాగంలో ఒక చిన్న నిల్వ పాకెట్ అందించబడుతుంది. వ్యక్తిగతంగా చెప్పాలంటే, ఈ చిన్న చిన్న పాకెట్ లలో ఏమైన వస్తువులను పెట్టుకునేందుకు సహాయపడుతుంది. కానీ, దీనిలో అత్యవసర అంశాలు అయిన చిల్లర, తాళాలు మరియు చిన్న చిన్న తినుబండారాలు పెట్టుకునేందుకు సహాయపడూతుంది.

Image 14

ఈ వాహనం యొక్క లోపలి భాగంలో ఉండే పై కప్పు లో ఒక క్యాబిన్ తేలికపాటి కన్సోల్ అందించబడుతుంది దీనిని చూసినట్లైతే, మహింద్రా స్కార్పియో వాహనాన్ని పోలి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క పై భాగంలో, స్వైవల్ ల్యాంప్‌లు మరియు బ్లూటూత్ మైక్ వంటివి అందించబడతాయి. ఈ లైట్లు, థియేటర్ డిమ్మింగ్ ప్రభావంతో అందించబడతాయి మరియు ఇవి డోర్ షర్ట్ తో అందించబడతాయి. వీటి వలన వాహనానికి ఒక ఆకర్షణీయమైన లుక్ అందించబడుతుంది. లోపలి సౌకర్యం గురించి మాట్లాడటానికి వస్తే, ఎర్గనామికల్ గా అందించబడిన సీట్లు సమర్ధవంతంగా ఉంటాయి మరియు ఇవి, మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. క్యాబిన్ ముందు భాగంలో ఉండే సీట్లకు వేర్వేరు ఆర్మ్ రెస్ట్ లు అందించబడతాయి అయితే, క్యాబిన్ లో ఉండే ప్రయాణికులందరికీ గరిష్ట స్థాయిలో సౌకర్యాన్ని అందించడానికి, అన్ని సీట్లకు హెడ్ రెస్ట్లు అందించబడతాయి.

Image 15

వినైల్ మరియు ఫాబ్రిక్ మిశ్రమ అపోలిస్ట్రీ, ఒక అందమైన విరామ అనుభవాన్ని ఇస్తుంది మరియు దీనిని మరింత వ్యక్తిగతంగా అందించవలసిన అవసరం ఉంది. కుడి చేయి వైపు ప్రామాణిక మహింద్రా డిజైన్ కలిగిన స్టీరింగ్ వీల్ అందించబడుతుంది. స్కార్పియో మరియు ఎక్స్యువి 500 వంటి వాహనాల మధ్య ఈ వాహనాన్ని సులభంగా గుర్తు పట్టేందుకు ఈ స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో సంస్థ యొక్క లోగో తో పాటు వాహనం యొక్క మోడల్ పేరు కూడా అందించబడుతుంది. ఈ స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో అందించబడిన సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా ఉండటమే కాకుండా వాహనానికి ఒక ఆకర్షణీయమైన లుక్ ను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా డ్రైవర్ యొక్క ఓత్తిడిని మరింత తగ్గించేందుకు, ఆడియో నియంత్రణా స్విచ్చులు ఎడమ వైపు విలీనం చేయబడి ఉంటాయి.

Image 16

స్టీరింగ్ వీల్ ను పట్టుకున్నప్పుడు ఒక ఒక మంచి, సేంద్రీయ అనుభూతిని ఖచ్చితంగా పొందుతాము దీనికి గల కారణం ఏమిటంటే, ఈ స్టీరింగ్ వీల్ కు, మృదువుగా ఉండే మెటీరియల్ ను అందించడం వలన ఈ అనుభూతి అందించబడుతుంది. ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో, వీల్ క్రింది భాగంలో సిల్వర్ ఫినిషింగ్ అందించబడుతుంది మరియు దీని వలన వాహనానికి, ఖరీదైన అనుభూతి అందించబడుతుంది.

Image 17

స్టీరింగ్ వీల్ పై భాగంలో ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విలీనం చేయబడి ఉంటుంది. దీనిలో ఒక టాకోమీటర్ మరియు స్పీడోమీటర్ వంటివి అందించబడతాయి మరియు దగ్గరగా చూసినట్లైతే, సంస్థ ఈ వాహనానికి ఎక్కువ మొత్తం లో క్రోం ను వినియోగించింది అని తెలుస్తుంది. డైల్స్ అన్నియూ కూడా క్రోం తో అందించబడతాయి.

Image 18

పనితీరు


తయారీదారుడు ఈ వాహనానికి ఒకే ఒక డీజిల్ ఇంజన్ ను అందించాడు. ఈ టి యు వి వాహనానికి, మహింద్రా యొక్క ఎం హాక్ 80 మోటార్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్. ఈ 1.5 లీటర్ డీజిల్ మోటార్ 1493 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఎస్ ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా మూడు సిలండర్ లను మరియు ఆరు వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 3750 ఆర్ పి ఎం వద్ద 84 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1500 నుండి 2250 ఆర్ పి ఎం మధ్యలో 230 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఆటోమేటిక్ వెర్షన్ లో ఈ ఇంజన్ అత్యధికంగా 81 బి హెచ్ పి పవర్ ను 230 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మహింద్రా టియువి 300 వాహనం, క్వాట్రో వాహనం తో పోలిస్తే 16 బి హెచ్ పి తక్కువ పవర్ ను అలాగే 10 ఎన్ ఎం గల తక్కువ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Image 19

ఈ పవర్ ప్లాంట్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. తక్కువ వేగం వద్ద ఈ ఇంజన్ అత్య అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఇంజన్ యొక్క త్వరణం విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి, 13.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 156 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ ఇంజన్ యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, సి ఆర్ డి ఐ ఇంధన ఇంజక్షన్ టెక్నాలజీ తో జత చేయబడి ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఈ ఇంజన్ నగరాలలో, 15.06 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 18.49 కె ఎం పి ఎల్ గల అధిక మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Image 20

Table 3

రైడ్ మరియు హ్యాండ్లింగ్


మహింద్రా సంస్థ, రోడ్డు యొక్క సౌండ్ అవగాహనలకు అనుగుణంగా అద్భుతమైన మెకానిజం లను అందించింది. ఈ ఇంజన్ ను కలిగిన టియువి 300 వాహనం, అద్భుతమైన రైడ్ ను అందిస్తుంది. తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అన్ని వేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటానికి నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించాడు. ముందుగా బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్యువి వాహనం యొక్క ముందు చక్రాలు డిస్క్ బ్రేక్ లతో అలాగే వెనుక చక్రాలు డ్రం బ్రేక్ లతో బిగించి ఉంటాయి. ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడానికి యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ ను అందించడం జరిగింది. సమర్ధవంతమైన నిర్వహణను అందించే సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్ డబుల్ విష్బోన్ తో విలీనం చేయబడి ఉంటుంది అలాగే వెనుక ఆక్సిల్, మల్టీ లింక్ టైప్ సస్పెన్షన్ తో విలీనం చేయబడి ఉంటుంది. మరోవైపు ఈ వాహనానికి, బారీ ట్రాఫిక్ పరిస్థితులలో డ్రైవర్ యొక్క హ్యాండ్లింగ్ ను సులభతరం చేయడానికి బలమైన పవర్ స్టీరింగ్ సిస్టం ను అందించాడు. ఈ స్టీరింగ్ వీల్, 5.35 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాశార్ధానికి మద్దతిస్తుంది.

Image 21

రైడ్ నాణ్యత ఖచ్చితంగా సగటుగా ఉంటుంది. ఈ వాహనానికి బారీ గ్రౌండ్ క్లియరెన్స్ ను అందించడానికి గల కారణం ఏమిటంటే, చిన్న చిన్న ఓడుదడుకులను అదికమించేందుకు ఇవ్వడం జరిగింది. అయితే, ముఖ్యంగా వెనుక సీట్ ప్రయాణికులకు కొద్దిగా ఎగిరి పడే అనిభవం కలుగుతుంది. క్యాబిన్ లో ఉండే డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది. సులభ యాక్సిస్ కోసం ఈ స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణా స్విచ్చులు అందంగా పొందుపరచబడి ఉంటాయి. అయితే, మీరు ఈకోస్పోర్ట్ నమూనాలలో ఉండే ఒక విద్యుత్ స్టీరింగ్ సెటప్ ఎదుర్కొని ఉంటే, మీరు ఈ ఒక పార్కింగ్ వేగం వద్ద కొద్దిగా ఎక్కువ బరువు ను కలిగి ఉంటారు అని గమనించవచ్చు. మొత్తం మీద స్టీరింగ్ వీల్ ఖచ్చితంగా మెరుగయ్యి సమతుల్యంగా ఉంటుంది.

 

భద్రత


ఈ టియువి 300 వాహనం, తదుపరి తరం భద్రతా పరిమాణాలను మెరుగుపరచడానికి బాడీ అన్ ఫ్రేం చాసిస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ప్రయాణికులకు అలాగే వాహనానికి భద్రతను అందించడానికి అనేక రక్షిత అంశాలు అందించబడ్డాయి. ఈ వాహనం ఏడు వేరియంట్ లలో అందుబాటులో ఉంది మరియు దీనిలో టి4 అనేది, దిగువ శ్రేణి వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనంలో, శక్తివంతమైన హెడ్ ల్యాంప్‌లు, సీటు బెల్ట్‌లు, కొల్లాప్సబుల్ స్టీరింగ్ వీల్, డ్రైవింగ్ సమయంలో ఆటో డోర్ లాక్ మరియు సైడ్ ఇంపాక్ట్ ప్రొటక్షన్ బీంలు వంటి అంశాలు అందించబడ్డాయి. అదనంగా, వాహనాన్ని దొంగతనాల బారి పడకుండా ఉండటానికి మరియు ఏ అనధికార ప్రవేశం జరగకుండా ఉండటానికి ఒక డిజిటల్ ఇమ్మోబిలైజర్ పరికరాన్ని అందించడం జరిగింది. తదుపరి స్థాయిలో ఉన్నది టి4 ప్లస్ వాహనం. దీనిలో, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ముందు రెండు ఎయిర్బాగ్లు మరియు యాంటీ థెఫ్ట్ వార్నింగ్ వ్యవస్థ వంటివి ప్రామాణికంగా అందించబడ్డాయి. అదే టి6 వేరియంట్ విషయానికి వస్తే, దీనిలో ముందు రెండు ఎయిర్బాగ్ లను మినహాయిస్తే టి4 ప్లస్ వాహనం లో అందించబడ్డ అన్ని అంశాలు ప్రామాణికంగా అందించబడతాయి. టి6 ప్లస్ వాహనం విషయానికి వస్తే, కీ లెస్ ఎంట్రీ, మూడవ బ్రేక్ లైట్లు మరియు ముందు ఫాగ్ ల్యాంప్‌లు వంటి భద్రతా లక్షణాలు అందించబడ్డాయి.

కొనుగోలుదారులు ఎంచుకున్న వేరియంట్ రకాన్ని బట్టి ద్వంద్వ ఎయిర్బాగ్లు, ఏబిఎస్ మరియు ఈబిడి లు అందించబడతాయి.

Image 22

Table 4

వేరియంట్లు


మొత్తం మీద ఈ వాహనం ఏడు వేరియంట్ లలో అందించబడుతుంది. అవి వరుసగా, టి 4, టి 4 ప్లస్, టి 6, టి 6 ప్లస్, టి 6 ఏ ఎంటి, టి 8, టి 8 ఏఎంటి. ముందుగా ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్లు అయిన టి4 మరియు టి4 ప్లస్ వేరియంట్ల విషయానికి వస్తే, నామమాత్రపు లక్షణాలు అందించబడతాయి. అవి వరుసగా, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, హీటర్ తో కూడిన ఏ సి యూనిట్, మానవీయంగా సర్ధుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు, ముందు మరియు వెనుక పవర్ విండోలు, వెనుక వైపర్ మరియు వాషర్ వంటి అంశాలు అందించబడతాయి. తదుపరి వేరియంట్ లు అయిన టి 6, టి 6 ప్లస్ మరియు టి 6 ఏ ఎంటి వేరియంట్ల విషయానికి వస్తే, ఆటోమేటిక్ గేర్ బాక్స్ వెనుక డిఫోగ్గర్ ఫంక్షన్ తో వస్తుంది, వెనుక వైపర్ మరియు వాషర్ ఫంక్షన్లు అందించబడతాయి. వీటన్నింటితో పాటు, ఈ వాహనానికి, 2 దిన్ సమాచార వ్యవస్థ అందించబడుతుంది. ఈ వ్యవస్థ, ఆక్స్ ఇన్, యూఎస్బి మరియు బ్లూటూత్ అలాగే ప్రయాణికులకు ఉత్తమ సొంగీత అనుభవాన్ని అందించడానికి, మహింద్రా బ్లూ సెన్స్ మొబైల్ ఆప్ వంటి అంశాలను అందించడం జరిగింది. చివరి రెండు వేరియంట్లు అయిన టి 8 మరియు టి 8 ఏఎంటి వేరియంట్ల విషయానికి వస్తే, అత్యుత్తమ అంశాలు అందించబడతాయి. ఇక్క ప్రత్యేకంగా అందించబడిన అంశాలు ఏమిటంటే, డ్రైవర్ సమాచార వ్యవస్థ, వాయిస్ మెసేజింగ్ వ్యవస్థ, రిమోట్ లాక్ మరియు కీ లెస్ ఎంట్రీ, ఎత్తు సర్ధుబాటు ఫంక్షన్ ను కలిగిన డ్రైవర్ సీటు, ముందు ప్రయాణికులకు ఆర్మ్ రెస్ట్లు అలాగే లుంబార్ మద్దతు వంటి లక్షణాలు అందించబడతాయి. మీరు ఏ వేరియంట్ ను ఎంపిక చేసుకోవాలి అని సందేహ పడుతున్నట్లైతే, మీరు కొన్ని అంశాల విష్యంలో రాజీ పడే వాటి పై ఆధారపడి ఉంటుంది. ఉత్తమ సౌకర్య అంశాలను కావాలి అనుకున్నట్లైతే మరియు ధర పరంగా ఏ రకమైన ఇబ్బంది లేనట్లైతే మీరు ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వాహనాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ సహేతుకమైన ధర వద్ద తాక్కువ అంశాలను అందించడం లో రాజీ పడే ఉద్దేశ్యం ఉంటే ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ రెండు సమంగా కావలను కుంటే ఉత్తమ అంశాలను అలాగే ఆకర్షణీయమైన ధర పరిది ని కోరుకున్నట్లైతే వారికి ఈ మోడల్ సిరీస్ యొక్క మధ్య శ్రేణి వేరియంట్లు ఉత్తమం అని చెప్పవచ్చు.

Table 5

తుది విశ్లేషణ:


ఈ విధంగా ఉంటే చాలు అనుకుంటాం ఆ అంశాలు ఏమిటో చూద్దామా? ఐదుగురు కోసం ఒక బారీ క్యాబిన్ అందించే కాంపాక్ట్ వాహనం గురించి గనుక చూస్తున్నట్లైతే, ఈ టియువి వాహనం సరైన ఎంపిక అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వాహనం, సామాన్లను కూడా పెట్టుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వాహనం తో పోలిస్తే ఈ వాహనం, తక్కువ నిర్మాణ నాణ్యత ను అలాగే సగటు ఇంజన్ తో కొన్ని ప్రతికూలతలను కలిగి ఉంది. అంతేకాక, ఇదే విభాగంలో విటారా బ్రెజ్జా వాహనం ఉండగా టియువి 300 వాహనం యొక్క అవసరం ఉండదు.