మహీంద్రా తార్

` 5.0 - 8.9 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్లు

 
*Rs

మహీంద్రా తార్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
మహీంద్రా అండ్ మహీంద్రా, అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆటోమొబైల్ బ్రాండ్. ఇది ప్రయాణణికులకు మరియు వాణిజ్య పరంగా వాహనాలలో వినియోగ వాహనాల ఉత్పత్తి కి ప్రసిద్ధిచెందింది. ఇది దేశం యొక్క ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఆఫ్ రోడ్ వాహనం. ఈ దేశం యొక్క ఆఫ్-రోడ్ అభిమానులు కు 2010 సంవత్సరం లో మహీంద్రా థార్ ను పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుండి, అది స్టైలింగ్, సౌకర్యము, భద్రతా లేదా సాంకేతిక లక్షణాలలో ఏ ఒక్కదానిలో కూడా నవీకరణలు పొందలేకపోయింది. అయితే, చాలా కాలం తరువాత, నవీకరించబడిన వెర్షన్ ను అనేక బాహ్య మార్పులతో మరియు మంచి నాణ్యతతో ఇటీవల విడుదల అయ్యింది. అయితే, దాని పూర్వదాని వలెనే అదే డీజిల్ ఇంజన్ ఆప్షన్ లతో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ యొక్క మధ్య మరియు దిగువ శ్రేణి వేరియంట్ లు 2523 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ అత్యధికంగా 63 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, 182.5 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, రెండవ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 2498 సిసి స్థానభ్రంశం కలిగిన ఇంజన్ అత్యంత శక్తివంతమైనది. ఈ ఇంజన్, అత్యధికంగా 105 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 247 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సిరీస్ యొక్క డి ఐ ఇంజన్ ను కలిగి ఉన్న వాహనాలు 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 16 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనం 150 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, 2498 సిసి స్థానభ్రంశాన్ని కలిగిన సి ఆర్ డి ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 13 నుండి 14 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 160 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 2523 సిసి స్థానభ్రంశాన్న్ కలిగిన ఈ ఇంజన్, అత్యధికంగా (4X2 వెర్షన్ లో) 18.06 కె ఎం పి ఎల్ మైలేజ్ ను మరియు (4X4 వెర్షన్ లో) 16.55 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. రెండవది అయిన సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజన్ అత్యధికంగా 18.06 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. కంపెనీ, ఈ వాహనానికి ఈటన్ రూపొందించబడిన లోకర్ అనే ఆప్షనల్ ఫీచర్ ను అందించింది. ఇది జిగురు ఉండే మైదానాలలో ఒక యాంత్రిక లాకింగ్ సిస్టమ్ లా ఉపయోగపడుతుంది.

నవీకరణల విషయానికి వస్తే, నవీకరించిన బంపర్స్ తో పాటు ఫెండర్ ఎక్స్టెన్షన్స్ ను కలిగి ఉంది. వాహనం లో సులభంగా వెనుక నుండి ప్రవేశించుటకు ఫూట్ రెస్ట్ వెనుక భాగంలో అమర్చబడి ఉంటుంది. అంతర్గత భాగాలలో అనేక మార్పులను చోటు చేసుకుంది. అవి ఏమిటంటే, డ్యూయల్ టోన్ డాష్బోర్డ్, కొత్త గా రూపకల్పన చేయబడిన ఎయిర్ వెంట్స్ తో పాటు సిల్వర్ ఫినిషింగ్ మరియు స్మార్ట్ లుక్ ను కలిగి ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం లో సీట్లు చాలా వెడల్పు గా కుషనింగ్ ఎఫక్ట్ ను కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్, ఏ.సి నియంత్రణలు, గేర్ లివర్ మరియు హ్యాండ్ బ్రేక్ వంటి కొన్ని అంశాలను ఎస్యువి అయిన బొలీరో నుండి తీసుకోవడం జరిగింది. అయితే చాలా వరకు మార్పులు అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే జరిగాయి. ఇంతేకాకుండా, అన్ని ఇతర లక్షణాలు దాని ముందుదాని వలే అలాగే ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే, ఈ వాహనానికి ఎం ఎం బాడీ షెల్ ను అమర్చడం జరిగింది. దీని వలన వాహనానికి వాహనం లో ఉండే ప్రయాణికులకు ఏ హాని జరగకుండా ఉంటుంది. ఈ వాహనం మంచి సస్పెన్షన్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఈ వాహనాల డీజిల్ ఇంజన్, డ్యూయల్ సర్క్యూట్ బ్రేకింగ్ సిస్టమ్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీనితో పాటుగా, టెన్డం మాస్టర్ సిలిండర్ మరియు వాక్యూమ్ అసిస్టెడ్ సర్వో లతో కూడి ఉంటుంది. ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ల విషయానికి వస్తే, హైడ్రాలిక్ బ్రేకింగ్ మెకానిజం లో టెండం మాస్టర్ సిలండర్ తో పాటు ఎల్ సి ఆర్ వి లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనానికి మరింత పటుత్వాన్ని ఇవ్వడం కోసం అద్భుతమైన బ్రేకింగ్ మెకానిజం ను కలిగి ఉంది. ఈ వాహనాల ముందు బ్రేక్లు డిస్క్ బ్రేక్లతో మరియు వెనుక బ్రేక్లు డ్రమ్ బ్రేక్ లతో అనుసంధానం చేయబడి ఉంటాయి. మరోవైపు, ఈ సిరీస్ యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్ లలో ముందు మరియు వెనుక ఆక్సిల్స్ కూడా లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అగ్ర శ్రేణి వేరియంట్ లలో అయితే, వాహనాల ముందరి ఆక్సిల్ ఒక స్వతంత్ర ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. అదే విధంగా వెనుక ఆక్సిల్, సెమీ ఎల్లిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో జత చేయబడి ఉంటుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనం సాంకేతిక నిర్దేశాల పరంగా కంపెనీ ఏ మార్పులను చేయలేదు.అదే విధంగా పాత వాహనం లో ఉండే అవే డీజిల్ ఇంజన్ లతో ఈ కొత్త వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. మొదటి ఇంజన్ అయిన ఎం డి ఐ 3200 టి సి ఎల్ డీజిల్ ఇంజన్, డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సాంకేతికతను కలిగి ఉంది. అంతేకాకుండా 2523 సిసి స్థానభ్రంశాన్ని కలిగిన ఈ ఇంజన్, అత్యధికంగా (4X2 వెర్షన్ లో) 18.06 కె ఎం పి ఎల్ మైలేజ్ ను మరియు (4X4 వెర్షన్ లో) 16.55 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. రెండవది అయిన సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజన్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 18.06 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ సిరీస్ వాహనాల యొక్క రెండు డీజిల్ ఇంజిన్లు డబుల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లను మరియు 16- వాల్వ్స్ ను కలిగి ఉంటాయి. ఈ సిరీస్ యొక్క మధ్య మరియు దిగువ శ్రేణి వేరియంట్ లు 2523 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ అత్యధికంగా 63 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, 182.5 ఎన్ ఎమ్ గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, రెండవ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 2498 సిసి స్థానభ్రంశం కలిగిన ఇంజన్ అత్యంత శక్తివంతమైనది. ఈ ఇంజన్, అత్యధికంగా 105 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 247 ఎన్ ఎమ్ గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఇది ఒక స్వచ్ఛమైన ఆఫ్-రోడ్ వాహనం అని చెప్పవచ్చు. ఈ సిరీస్ యొక్క సి ఆర్ డి ఐ ఇంజన్ ను కలిగి ఉన్న వాహనాలు 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 16 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనం 150 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, 2498 సిసి స్థానభ్రంశాన్ని కలిగిన సి ఆర్ డి ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 13 నుండి 14 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 160 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


ఈ ఆఫ్ రోడ్ వాహనం యొక్క బాహ్య బాగాలను చూసినట్లైతే, స్వచ్ఛమైన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం లా కనిపిస్తుంది. ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ వాహనం యొక్క బాహ్య భాగాలలో విలువైన మార్పులను చేశాడు. ప్లాస్టిక్ ఆకారంతో బంపర్స్ ను పునఃరూపకల్పన చేశాడు. అదే సమయంలో, ఈ వాహనం ఆకర్షణీయమైన లుక్ ను సొంతం చేసుకుంది. ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, రేడియేటర్ గ్రిల్ అమర్చబడి ఉంటుంది. దీనిపై రౌండ్ ఆకారంలో హెడ్లైట్ క్లస్టర్ బిగించబడి ఉంటుంది. బోనెట్ ను ఏ మాత్రం మార్పు చేయలేదు. అదే విధంగా పాత దానిలో ఉండేలా అవే వంపుల అంచులతో పాటు ఒక ఫ్లాట్ ఉపరితలం తో కొనసాగుతోంది. ఈ వాహనం యొక్క విండ్స్క్రీన్ వెడల్పుగా, చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా గ్రిల్ యొక్క మధ్య భాగంలో సంస్థ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, వాహనానికి బోల్డ్ అప్పీల్ ను ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఫెండర్లను రూపకల్పన చేశాడు. దీనిలో కొత్తగా గమనించే విషయం ఏమిటంటే, నవీకరించబడిన ఫెండర్లను పొందుపరచడం.అంతేకాకుండా సైడ్ ప్రొఫైల్ లో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఒక జత స్టీల్ రిమ్స్ బిగించి ఉంటాయి. ముందు దాని లాగే ఈ వాహనం కూడా క్లాస్సి అప్పీల్ ను ఇస్తుంది. వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు బ్లాక్ కలర్ క్యాప్స్ తో కప్పబడి ఉంతాయి. అంతేకాకుండా వీటిని మాన్యువల్ గా సర్దుబాటు చేయవచ్చు. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, అవుట్గోయింగ్ మోడల్ కంటే, దీనిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయబడ్డాయి. ముందు బంపర్ వలె వెనుక బంపర్ కూడా ప్లాస్టిక్ మరియు మెటల్ సమ్మేళనంతో రూపొందించబడి ఉంటుంది. పాత దానిలో ఉండే అదే టైల్ లైట్ క్లస్టర్ ను మనం దీనిలో కూడా చూడవచ్చు. దీనిలో ఏ మార్పులు చోటు చేసుకోలేదు. ఈ టైల్ లైట్ క్లస్టర్ లో బ్రేక్ ల్యాంప్స్ తో పాటు కర్టసీ లైట్ మరియు టర్న్ ఇండికేటర్స్ ను చూడవచ్చు.

వెలుపలి కొలతలు:


పాత దాని వలనే కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ ఆఫ్ రోడ్ వాహనం యొక్క కొలతలు వరుసగా, మొత్తం పొడవు 3920 మిల్లీ మీటర్లు, వెడల్పు 1726 మిల్లీ మెటర్లు, ఎత్తు 1930 మిల్లీ మీటర్లు, కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిల్లీ మీటర్లు, ఫ్రంట్ ట్రాక్ 1445 మిల్లీ మీటర్లు, రేర్ ట్రాక్ 1346 మిల్లీ మీటర్లు. అయితే డి ఐ ఇంజన్ ను కలిగి ఉన్న వాహనాల వెడల్పు 1640 మిల్లీ మీటర్లు గా ఉంది. ఫ్రంట్ ట్రాక్ 1314 మిల్లీ మీటర్లు, రేర్ ట్రాక్ 1295 మిల్లీ మీటర్లు గా ఉంది. మరోవైపు, ఈ వాహనాల వీల్బేస్ 2430 మిల్లీ మీటర్లు గా చెప్పవచ్చు. ఇది ఏమి ఆశ్చర్య పడవలసిన విషయం కాదు,ఎందుకంటే ఈ వాహనం భిన్నమైన సీటింగ్ ఆకృతీకరణ ను కలిగి ఉంది. అంతేకాక, ఈ వాహనం 30 డిగ్రీల కోణాన్ని మరియు 46 డిగ్రీల కోణాన్ని కలిగి ఉంది. ఇలా ఉండటం వలన టెర్రైన్స్ ను ఎదుర్కోవటానికి సహాయపడతాయి.

లోపలి డిజైన్:


ఈ సంస్థ యొక్క తయారీదారుడు, ఈ సరికొత్త వెర్షన్ అయిన థార్ అవుట్గోయింగ్ వెర్షన్ కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకై దాని యొక్క అంతర్గత క్యాబిన్ ను మార్పు చేయడం జరిగింది. ఈ వాహనం యొక్క కాక్పిట్ లో ఉండే డాష్బోర్డ్ రెండు రంగుల పథకంతో అలంకరించబడి ఉంటుంది. అదే సమయంలో, ఒక గేర్బాక్స్ కన్సోల్ తో పాటు ఒక హ్యాండ్ బ్రేక్ ను కూడా ఫ్లోర్ కన్సోల్ లో బిగించడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మూడు ట్యూబ్ల డిజైన్ తో క్రోమ్ చేరికలతో రూపకల్పన చేయబడి ఉంటుంది. దీని యొక్క సెంట్రల్ కన్సోల్ చిన్నగా మార్పులు చేయబడి ఉంటుంది. ఈ వాహనానికి డైనమిక్ అపీల్ ను ఇవ్వడం కోసం దీనిపై థార్ అక్షరాలతో పొందుపరచబడి ఉంటుంది. వాహన తయారీదారుడు ఈ వాహనం లో ఉండే ఏసి వెంట్ల ను కూడా పునఃరూపకల్పన చేశాడు. అంతేకాకుండా ఈ ఏసి వెంట్లను మెటాలిక్ చేరికలతో చుట్టూ అలంకరించాడు. ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ బొలీరో నుండి తీసుకోబడింది. అంతేకాకుండా ఈ స్టీరింగ్ వీల్ లోహ చేరికలతో అలంకరించబడి ఉంటుంది. ఇంతేకాకుండా, తయారీదారు సీట్లను వెడల్పు చేసి మరియు మెరుగైన సౌకర్యాన్ని అందించుట కోసం సీట్లకు కుషన్ సౌకర్యాన్ని అందించాడు. ఈ క్యాబిన్ కు మంచి ఆకర్షణీయమైన లుక్ ను ఇవ్వడం కోసం క్యాబిన్ లో ఉండే గేర్ షిఫ్ట్ నాబ్ లెదర్ తో కప్పబడి ఉంచాడు. క్యాబిన్ యొక్క మిగిలిన అన్ని అంశాలను అవుట్గోయింగ్ వెర్షన్ లో ఉండే విధంగా ఉంటాయి. ఈ కాంపాక్ట్ వాహనం పరిమిత సీటింగ్ ఎంపిక తో కనిపిస్తోంది, కానీ కంపెనీ కనీసం ఏడు కుటుంబసభ్యులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా ఉంటుంది అని చెబుతుంది. కాక్పిట్ లో ఫ్రెంట్ ఫేసిన్ సీట్లను కలిగి ఉంటుంది. అదే విధంగా వెనుక వైపు రెండువైపులా బెంచ్ సీట్లను కలిగి ఉంటుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ ఎస్యువి ఒక ఆఫ్ రోడింగ్ వాహనం మాత్రమే కాదు ఒక సాహసోపేతమైన వాహనం కూడా. ఈ వాహనం లోపలి భాగంలో అనేక లక్షణాలను పొందుపరచినప్పటికీ ఈ వాహనం సౌకర్యం పరంగా వెనుకబడి ఉంది. దీని కాక్పిట్ విభాగంలో పునఃరూపకల్పన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు రౌండ్ ఆకారంలో ఉన్న మూడు అనలాగ్ మీటర్లు పొందుపర్చబడ్డాయి. ఈ మూడు మీటర్లు వరుసగా స్పీడోమీటర్, ఆర్ పి ఎం మీటర్, ఇంధన గేజ్ మరియు కొన్ని ఇతర నోటిఫికేషన్ల ల్యాంప్లు బిగించబడ్డాయి. కొత్తగా నవీకరించబడిన ఈ వెర్షన్, బొలీరో లో ఉండే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ తో అందుబాటులో ఉంది. దీని వలన క్యాబిన్ వాతావరణం ఆహ్లదకరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, వీటి నియంత్రణలు డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని జోడించుట కొరకు దగ్గరలో అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా, వాహన తయారీదారుడు ఈ వాహనం యొక్క ఫ్లోర్ కన్సోల్ లో కప్ హోల్డర్స్ ను అమర్చాడు. ఇది ఒక ఆఫ్ రోడింగ్ వాహనం. చెప్పుకోదగ్గ మరొక విషయం ఏమిటంటే, ఈ వాహనం లో ఉండే స్టీరింగ్ వీల్ 5.25 మీటర్ల టర్నింగ్ రేడియస్ ను మద్దతిస్తుంది. ఈ ఫీచర్ వాహనం యొక్క మధ్య శ్రేణి మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో ప్రామాణిక లక్షణం గా ఉంటుంది. ఈ వాహనం రేర్ వీల్ డ్రైవ్ తో నడుస్తుంది. ఈ సంస్థ ఈ వాహనానికి ప్రిమియం సాఫ్ట్ కనోపీ ను అందిస్తోంది. అంతేకాకుండా, ఈ ప్రతి ఆఫ్-రోడ్ వాహనానికి అవసరమైన లక్షణాలను ఈ వాహనం కలిగి ఉంది.

లోపలి కొలతలు:


ఈ ఎస్యువి లో, ప్రయాణికులందరు సౌకర్యవంతంగా కూర్చునేలా ఈ సంస్థ తయారీదారుడు ఈ వాహనాన్ని తయారుచేశాడు. ఈ వాహనం లో ముందు కూర్చునే ప్రయాణికులకు మంచి లెగ్ మరియు షోల్డర్ స్పేస్ లను అందించాడు. అయితే వెనుక విషయానికి వస్తే, వెనుక సీట్లు బెంచ్ ఫోల్డింగ్ ను కలిగి ఉండటమే కాకుండా తక్కువ లెగ్ రూం ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనంలో 60 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఒక భారీ ఇంధన ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. బహుశా దాని విభాగంలో ఇదే పెద్దది అయ్యి ఉండవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


దాని పాత దాని వలనే, కొత్తగా మార్పు చేసి విడుదల చేయబడిన వెర్షన్ కూడా రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్ లతో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ యొక్క మధ్య మరియు దిగువ శ్రేణి వేరియంట్ లు 2.5 లీటర్ ఎం డి ఐ 320 టిసి ఎల్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్, 2523 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ నాలుగు సిలండర్లను కలిగి ఉంటుంది. దీనితో పాటు అత్యధిక పవర్ అవుట్పుట్ ను విడుదల చేయడానికి డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ టెక్నాలజీ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 63 బిహెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. టార్క్ విషయానికి వస్తే, 1500 నుండి 1800 ఆర్ పి ఎమ్ మధ్యలో 182.5 ఎన్ ఎమ్ గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. అదనంగా, ఈ సిరీస్ యొక్క మధ్య శ్రేణి వేరియంట్, 2- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ వాహనాల యొక్క టార్క్ అవుట్పుట్ ను ఈ ట్రాన్స్మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పంపిణీ చేస్తుంది. రెండవ ఇంజన్ విషయానికి వస్తే, ఈ సిరీస్ యొక్క మిగిలిన వాహనాలు 2.5 లీటర్ సి ఆర్ డి ఈ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. దీనితో పాటుగా ఈ ఇంజన్, కామన్ రైల్ డైరెక్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీ తో సంఘటిత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క పవర్ మరియు టార్క్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 3800 ఆర్ పి ఎం వద్ద 105 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుద్ని. దీనితో పాటుగా 1800 నుండి 2000 ఆర్ పి ఎమ్ మధ్య లో 274 ఎన్ ఎమ్ గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ బోర్గ్వార్నర్ మాన్యువల్ షిఫ్ట్ ట్రాన్స్ ఫర్ కేస్ ఆధారంగా దీని యొక్క టార్క్ అవుట్పుట్ ను వాహనం యొక్క నాలుగు వీల్స్ కు అందజేయబడుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఆఫ్ రోడ్లలో రాజు అయిన ఈ థార్, వినియోగదారులకు అవసరమైన అంతర్గత భాగాలతో పాటు వివిధ లక్షణాలతో అందుబాటులో ఉంది. ఈ వాహనం యొక్క సెంట్రల్ కన్సోల్, జిపిఎస్ తో కూడిన 2-దిన్ టచ్స్క్రీన్ ఆడియో వ్యవస్థ ను మరియు ఎంపి3 ప్లేయర్ ను కలిగి ఉంది. వీటితో పాటు అదనంగా, ఆక్స్-ఇన్, యూఎస్బి తో పాటు వివిధ ఇతర సౌలభ్యం ఫీచర్లతో అనేక లక్షణాలను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు సెంట్రల్ కన్సోల్ తో బాటిల్ హోల్డర్స్, స్టోరేజ్ జోన్స్, స్టీరింగ్ వీల్ కొరకు లెధర్ అపోలిస్ట్రీ, మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. అదే సమయంలో, ఈ వాహనం గ్రిల్, వీల్స్, టైర్లు మరియు ఫెండర్ల తో సహా వివిధ స్టైలింగ్ అంశాలను వినియోగించటానికి అవకాశం ఉంది.

వీల్స్ పరిమాణం:


ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు 16- అంగుళాల స్టీల్ వీల్స్ ను కలిగి ఉంటాయి. టైర్ల విషయానికి వస్తే, ఈ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లు, P185 R16 పరిమాణం గల రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. అదే మిగిలిన వేరియంట్ల విషయానికి వస్తే, P185 R16 పరిమాణం గల టైర్లు పొందుపరచబడి ఉంటాయి. మరోవైపు, కొనుగోలుదారులకు ఆఫ్ రోడ్స్ కొరకు విస్తృత రేడియల్స్ తో అల్లాయ్ వీల్స్ ఆప్షనల్ గా అందించబడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనాల డీజిల్ ఇంజన్, డ్యూయల్ సర్క్యూట్ బ్రేకింగ్ సిస్టమ్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీనితో పాటుగా, టెన్డమ్ మాస్టర్ సిలిండర్ మరియు వాక్యూమ్ అసిస్టెడ్ సర్వో లతో కూడి ఉంటుంది. ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ల విషయానికి వస్తే, హైడ్రాలిక్ బ్రేకింగ్ మెకానిజం లో టెండం మాస్టర్ సిలండర్ తో పాటు ఎల్ సి ఆర్ వి లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో ఒక విషయం సాదారణం గా అన్నింటిలోనూ ఉంది. అది ఏమిటంటే, ఈ వాహనాల ముందు బ్రేక్లు డిస్క్ బ్రేక్లతో మరియు వెనుక బ్రేక్లు డ్రం బ్రేక్ లతో అనుసంధానం చేయబడి ఉంటాయి. మరోవైపు, ఈ సిరీస్ యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్ లలో ముందు మరియు వెనుక ఆక్సిల్స్ కూడా లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అగ్ర శ్రేణి వేరియంట్ లలో అయితే, వాహనాల ముందరి ఆక్సిల్ ఒక స్వతంత్ర ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. అదే విధంగా వెనుక ఆక్సిల్ సెమీ ఎల్లిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో జత చేయబడి ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ వాహనానికి లేడర్ ఫ్రేమ్ చాసిస్ ను ఇండియన్ మిలిటరీ కోసం తయారుచేశాడు. ఎటువంటి రోడ్ పరిస్థితుల లోనైనా అత్యంత అధిక సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఈ వాహనం దాని విభాగంలో విస్తృత టైర్లును కలిగి ఉంది. దీని వలన జారే రోడ్ల పై అద్భుతమైన పట్టు ను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనాన్ని దొంగతనం నుండి రక్షించేందుకు ఒక ఇంజన్ ఇమ్మోబిలైజర్ ను కలిగి ఉంది. ఈ సంస్థ, ఈ వాహనానికి వీటితో పాటు అనేక రక్షక లక్షణాలను అందించింది. అవి వరుసగా, సీట్ బెల్ట్ లు, శక్తివంతమైన 9 అంగుళాల బూస్టర్ల తో పాటు డిస్క్ బ్రేకులు, హాలోజెన్ హెడ్ల్యాంప్స్ తో టర్న్ ఇండికేటర్లు వంటి అంశాలను కలిగి ఉంది.

అనుకూలాలు:


1. దీని ఆఫ్-రోడ్ సామర్ధ్యాలు అద్భుతమైనవి గా ఉంటాయి.
2. సి ఆర్ డి ఈ ఇంజిన్ పనితీరు అత్యద్భుతంగా ఉంటుంది.
3. తక్కువ నిర్వహణ ఖర్చు అనేది ఈ వాహనం యొక్క ప్రయోజనంగా ఉంది.
4. యాజమాన్య ప్రారంభ ధర చాలా సరసమైనది గా ఉంది.
5. అమ్మకాల తర్వాత నెట్వర్క్ చాలా అద్భుతంగా ఉంది.

ప్రతికూలాలు:


1. బాహ్య నవీకరణలు అనుకున్న దాని కంటే అంత ఆకర్షణీయంగా ఏమి లేవు
2. భద్రత మరియు సౌకర్యం లక్షణాలు ఇంకా అభివృద్ధి చేయవచ్చు.
3. ఆప్షనల్ ఫీచర్స్ ప్రమాణంగా ఇవ్వవచ్చు కధా.
4. వెనుక క్యాబిన్ సీటింగ్ సౌకర్యవంతంగా ఉంటే బాగుండేది.
5. డీజిల్ ఇంజిన్ యొక్క త్వరణం మరియు పవర్ ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.