మహీంద్రా ఈ2ఓ

` 5.3 - 6.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్లు

 
*Rs

మహీంద్రా ఈ2ఓ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతదేశపు అతి పెద్ద ఎస్యువి తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా హుడ్ కింద శక్తి ప్యాక్ ఇంజిన్లు బిగించి కఠినమైన వాహనాలు అందించడం ద్వారా యుటిలిటీ వాహనం విభాగంలో పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ క్రిందటి సంవత్సరమే ఎలక్ట్రిక్ వాహనం విభాగంలో రేవా ఇ20 ద్వారా అడుగు పెట్టింది. ఇది టి01 మరియు టి2 రెండు రకాల అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వాహనాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో కొనుగోలుదారులు నుండి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తయారీసంస్థ వినియోగదారుల కోసం సుమారు రూ 1.0 లక్షల గణనీయమైన పరిమాణంలో ఈ అధునాతన ఎలక్ట్రిక్ కారు ధర ట్యాగ్ తగ్గించింది. దీనితో పాటుగా భారత ప్రభుత్వం ప్లగ్-ఇన్ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల కి ప్రోత్సాహాలు అందించింది. ఇది ఒక పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారు కాబట్టి, ప్రభుత్వం అందించిన అన్ని రాయితీలకు అర్హత సాధించింది. దీని వలన కూడా తయరీ సంస్థకి దీని ధర తగ్గించే అవకాశం ఏర్పడింది. న్యూ ఢిల్లీ లో దీని బేస్ ట్రిమ్ టి2 ధర 5.92లక్షలు(ఎక్స్-షోరూమ్). అయితే వినియోగదారుడు ప్రతి నెల కారు రక్షణ పథకం భాగంగా బ్యాటరీ నిర్వహణ కోసం రూ. 2999 / - ఖర్చు చేయవలసి ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడికి ప్రతీ నెల ఇవ్వడానికి ఆశక్తి లేకపోతే ప్రొటెక్షన్ ప్లాన్ నిలిపివేయవచ్చు. అప్పుడు ఈ టి2 ట్రిమ్ ధర 7.51 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ మోడల్ లైన్ అప్ లో త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ సిటీ ప్రయాణాల కోసం ఉత్తమమైన శక్తిని అందించేందుకుగానూ అందుబాటులో ఉంది. ఇది 3750rpm వద్ద 25.4bhp శక్తిని మరియు 3400rpm వద్ద 53.9Nmటార్క్ ని అందించడం ద్వారా సంస్థ తన ప్రావీణ్యం చాటుకుంది. దీనిలో కొత్తతరం లిథియం బ్యాటరీ ని ఉపయోగిస్తారు. టి2 వేరియంట్లో పూర్తి చార్గింగ్ పైన 120 కిలోమీటర్లు అందిస్తుంది. దీని బ్యాటరీ 15 ఆంపియర్లు ఇంటి వద్ద అయినా, ఆఫీసులోనైనా ఎక్కడైనా చార్గింగ్ చేయవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాహనాల కోసం రూపొందించిన ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీనిలో ఎం & ఎం ఆటోమొబైల్ ఔత్సాహికులకు పెరుగుతున్న అవసరాలను అర్ధం చేసుకొని కొత్త మోడల్స్ ని అందించడంలో ముందంజలో ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడింది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడింది. ఇది ఒక రిమోట్ కంట్రోల్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ ని కలిగి ఉంది. ఈ లక్షణాలన్నీ కలగలిసి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని మరింత పటిష్టం చేశాయి.

ఈ మోడల్ సిరీస్ లో పునరుత్పాదక బ్రేకింగ్ వ్యవస్థ వంటి అధునాతన లక్షణాలు ఉన్నాయి. మొత్తంగా 10 ఆన్లైన్ కంప్యూటర్లు వాహనం యొక్క విధులు,శక్తి స్థాయిని, అంచనా దూరం మరియు వాహన ఉష్ణోగ్రత సంబంధించిన సమాచారం అందించేందుకుగానూ ఉపయోగపడతాయి. డ్రైవర్ సమాచార వ్యవస్థ ఒక ఆకర్షణీయమైన డిజిటల్ ప్రదర్శన వ్యవస్థ ను కలిగి ఉంది. ఇవి డ్రైవ్ మోడ్, ఓడోమీటార్, స్టేట్ ఆఫ్ చార్జ్, సందేశాల ప్రదర్శన మరియు స్పీడ్ ప్రదర్శనను అందిస్తుంది. వీటితో పాటు, ఇది కప్ మరియు బాటిల్ హోల్డర్స్, ప్రయాణీకుల వైపు వానిటీ అద్దం తో సన్ విజర్స్, ముందరి సీటు బ్యాక్ పాకెట్స్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంటుంది. దీనిలో జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ 6.2 అంగుళాల టచ్స్క్రీన్ రంగు ప్రదర్శనను కలిగి ఉండి ఆడియో యూనిట్ నియంత్రణలను కూడా కలిగి ఉంది. ఇది రెండు డోర్లు మాత్రమే ఉన్న వాహనం అయినప్పటికీ నలుగురు కూర్చునే విధంగా ఉండి లెగ్ రూమ్, పుష్కల లెగ్ స్పేస్ అందించడం జరిగింది. ఈ వాహనానికి అత్యుత్తమమైన అంతర్భాగాలు మరియు లోపలి భాగాలు అందించడం జరిగింది. ముఖ్యంగా దీని ముందరి భాగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ముందరి భాగం రేడియేటర్ గ్రిల్ తో అమర్చబడి గ్రిల్ మధ్యలో కంపెనీ లోగో తో చిత్రించబడి ఉంటుంది. ముందరి భాగంలో కొద్దిగా క్రిందకి వస్తే బాడీ రంగు బంపర్ గాలి లోపలకి తీసుకొనే విభాగాన్ని అమర్చబడి ఉంటాయి. వీటితో పాటూ దీనిలో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇది చిన్న వాహనమే అయినప్పటికీ మిగత వాహనాలకి ఏ మాత్రం తీసిపోదు. బోనెట్ దాని విండ్షీల్డ్ చివర హెడ్ల్యాంప్స్ పాటు ముందు గ్రిల్ వరకూ విస్తరించింది. దీని విండ్షీల్డ్ విశాలంగా ఉండి ఒక జత వైపర్స్ సమితితో అమర్చబడి ఉంటాయి. ఇది రెండు డోర్ల వాహనం చిన్న వాహనం కావున పెద్దగా ప్రమాదాలు జరగవు. సంస్థ ఈ వాహనాన్ని మూడు సంవత్సరాలు లేదా 36000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ మరియు మూడు సంవత్సరాలు లేదా 60000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ తో పాటు అందిస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీనిలో బేస్ వేరియంట్ ఇంజిన్ 80 కిలోమీటర్ల మైలేజ్ పంపిణీ చేస్తుంది. దీని బ్యాటరీ పూర్తిగా చార్గింగ్ అయ్యేందుకుగానూ దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అయితే, 25 కి.మీ. వెళ్ళాలంటే ఒక గంట చార్గింగ్ సరిపోతుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్ పూర్తి చార్గింగ్ కొరకు 5 గంటల సమయం తీసుకుని 120 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. దీనిలో ఒక గంట మాత్రమే చార్గింగ్ తీసుకుంటే 20 కి.మీ. వరకూ మాత్రమే వెళ్ళగలదు. దీనిని ఇంటి వద్ద కానీ లేదా ఆఫీసు వద్దనైనా చార్గింగ్ చేసుకోవచ్చు. దీని చార్గింగ్ కొరకు 220వి, 15 పవర్ సాకెట్ మాత్రమే అవసరం అవుతుంది.

శక్తి సామర్థ్యం:


ఈ మోడల్ లైన్ అప్ లో త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ సిటీ ప్రయాణాల కోసం ఉత్తమమైన శక్తిని అందించేందుకుగానూ అందుబాటులో ఉంది. ఇది 3750rpm వద్ద 25.4bhp శక్తిని మరియు 3400rpm వద్ద 53.9Nmటార్క్ ని అందించడం ద్వారా సంస్థ తన ప్రావీణ్యం చాటుకుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనం యొక్క విద్యుత్ మోటారు పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉత్తమమైన త్వరణం మరియు పికప్ ని అందజేస్తుంది. ఇది సుమారు 81 కిలోమీటర్ల గరిష్ట వేగం వరకూ చేరుకోగలదు. అంతేకాకుండా ఇది 12 సెకెన్లలో 60 కిలోమీటర్ల వేగం వరకూ వెళ్ళగల సామర్ధ్యం ఉండడం ఒక ఎలక్ట్రిక్ కారుకి చాలా గొప్ప విషయం.

వెలుపలి డిజైన్:


కంపెనీ ఈ మోడల్ సిరీస్ కి ఆకర్షణీయమైన శరీరాకృతిని ఇచ్చింది. అద్భుతమైన అనేక లక్షణాలు ఉండడం ద్వారా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కార్లు ప్రాథమిక రూపకల్పన స్మృతిగా అయితే దీని అద్భుతమైన రూపకల్పన మరియు నిర్వహణకి కారు తయారీదారుడు కి కృతజ్ఞతలు తెలపాలి. దీని ముందరి వైపు ఉన్న హెడ్లైట్ క్లస్టర్లో శక్తివంతమైన హాలోజన్ ల్యాంప్స్ మరియు సైడ్ టర్న్ ఇండికేటర్ అమర్చబడి కారుని డీసెంట్ గా కనిపించేలా చేస్తాయి. దీని ముందరి భాగం రేడియేటర్ గ్రిల్ తో అమర్చబడి గ్రిల్ మధ్యలో కంపెనీ లోగో తో చిత్రించబడి ఉంటుంది.ముందరి భాగంలో కొద్దిగా క్రిందకి వస్తే బాడీ రంగు బంపర్ గాలి లోపలకి తీసుకొనే విభాగాన్ని అమర్చబడి ఉంటాయి. వీటితో పాటూ దీనిలో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇది చిన్న వాహనమే అయినప్పటికీ మిగత వాహనాలకి ఏ మాత్రం తీసిపోదు. బోనెట్ దాని విండ్షీల్డ్ చివర హెడ్ల్యాంప్స్ పాటు ముందు గ్రిల్ వరకూ విస్తరించింది. దీని విండ్షీల్డ్ విశాలంగా ఉండి ఒక జత వైపర్స్ సమితితో అమర్చబడి ఉంటాయి. దీని ప్రక్క వైపు చూస్తే ఇది ప్రకాశవంతమైన మరియు ప్రముఖ కర్వ్స్ తో అమర్చబడి ఉంటుంది. ఇది రెండు డోర్ల వాహనం చిన్న వాహనం కావున పెద్దగా ప్రమాదాలు జరగవు. దీని డోర్ హ్యాండిల్స్ బాడీ రంగులో ఉండగా రేర్ వ్యూ మిర్రర్స్ నల్ల రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి. దీని ప్రక్క భాగంలో వెనుక వ్యూ అద్దాలు క్రింద 'రేవా' అనే పేరు గల బాడ్జ్ ఉండడం వలన ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. విలక్షణముగా రూపొందించిన చక్రం ఆర్చ్లు 13 అంగుళాల స్టీల్ చక్రాల సమితితో బిగించబడి అధిక పనితీరు గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లు తో కప్పబడి ఉంటాయి. దీని వెనుక భాగం బాగా టైల్ ల్యాంప్స్ తో పాటు పార్కింగ్ లైట్స్ ఒక జత తో పెద్ద లోయర్ బంపర్ కలిగి ఉంది. వెనుక విండ్షీల్డ్ విస్త్రుతంగా ఉండి డ్రైవర్ కి చుట్టూ పర్యావరణం యొక్క సరైన వీక్షణ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. దీనిలో బూట్ డోర్ మీద కూడా ప్రముఖ కంపెనీ యొక్క బాడ్జ్ ఉంటుంది. వెనుక నంబర్ ప్లేట్ బంపర్ యొక్క మధ్యలో అమర్చబడి ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ముందరి ఏరియా లో ఏంటీనా అమర్చబడి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


సంస్థ ఈ చిన్న కారుకి సులభంగా నలుగురు వ్యక్తులు కూర్చునే విధంగా సాధారణ ప్రామాణిక కొలతలు ఇచ్చింది. దీని పొడవు 3280mm, వెడల్పు, రెండు బాహ్య రేర్ వీక్షణ అద్దాలతో కలిపి 1514mm మరియు ఎత్తు 1560mm. ఇది 180mm గ్రౌండ్ క్లెయరెన్స్ కలిగి ఉండి అకస్మికంగా బ్రేకులు వేసినపుడు మరియు అసమాన రోడ్లపైన ప్రయాణం సులుభదాయకం అవుతుంది. దీని వీల్బేస్ కేవలం 1958mm మరియు దీనికి టర్నింగ్ రేడియస్ 3.9 మీటర్లు.

లోపలి డిజైన్:


కాబిన్ లోపల స్థలం విశాలంగా నలుగురు కూర్చునే విధంగా ఉంటుంది. ఇది రెండు డోర్లు మాత్రమే కలిగిన వాహనం కావడం వలన దీని ముందరి సీట్లు కొద్దిగా మడిచి వెనుక సీట్లు దగ్గరకి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికాక్పిట్ లో ఉన్న హెడ్ రూమ్ విశాలంగా ఉంటుంది కానీ దీని కాక్పిట్ విభాగం కొద్దిగా స్థలం తక్కువగా ఉంటుంది. ఈ కాబిన్ లో ఒక మంచి నిర్మాణాత్మక డాష్బోర్డ్ ఉంది. ఈ డాష్బోర్డ్ పై ఏ.సి వెంట్లు, ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్, ఆధునిక ఇన్స్ట్రుమెంటల్ పానెల్, నిల్వ బాక్స్ మరియు ఒక మూడు స్పోక్ స్టీరింగ్ వీల్, క్రోమ్ పూత తో కంపెనీ చిహ్నంతో అలంకరించబడి ఉంటుంది. దీనిలో కుషన్ సీట్లు వెనుక సపోర్ట్ తో అందుబాటులో ఉన్నాయి. అన్ని సీట్లు సౌలభ్యం కొరకు హెడ్ రెస్ట్రైన్స్ తో అందుబాటులో ఉన్నాయి. . దీని వెనుక సీట్లు మడుచుకునేందుకు వీలుగా ఉంటాయి. దీని ద్వారా బూట్ సామర్ధ్యాన్ని మరింత పెంచవచ్చు. డిజిటల్ డ్రైవర్ సమాచార వ్యవస్థ ఒక ఆకర్షణీయమైన ప్రదర్శన వ్యవస్థ ను కలిగి ఉంది. ఇవి డ్రైవ్ మోడ్, ఓడోమీటార్, స్టేట్ ఆఫ్ చార్జ్, సందేశాల ప్రదర్శన మరియు స్పీడ్ ప్రదర్శన ను అందిస్తుంది. వీటితో పాటు, ఇది కప్ మరియు బాటిల్ హోల్డర్స్, ప్రయాణీకుల వైపు వానిటీ అద్దం తో సన్ విజర్స్, ముందరి సీటు బ్యాక్ పాకెట్స్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంటుంది.

లోపలి సౌకర్యలు:


ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం ఇచ్చేందుకుగానూ సంస్థ అనేక ఉన్నతమైన లక్షణాలని అందించింది. ఇది ఒక రిమోట్ కంట్రోల్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ ని కలిగి ఉంది. దీనిలో జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ 6.2 అంగుళాల టచ్స్క్రీన్ రంగు ప్రదర్శనను కలిగి ఉండి ఆడియో యూనిట్ నియంత్రణలను కూడా కలిగి ఉంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్ కారు యొక్క అనేక విధులను సంబంధించిన వివరాలు అందించే ఒక ఆధునిక డ్రైవర్ సమాచార వ్యవస్థ తో పొందుపరచబడింది. వీటితోపాటు, ఇది ఒక రిమోట్ లాక్ / అన్లాక్ ఫంక్షన్ ని కుడా కలిగి ఉంది మరియు ఇది ఒక స్మార్ట్ ఫోన్ తో ఎక్కడ నుండి అయినా ఆపరేట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఉపయోగించి రోజువారీ కోసం ఏసీ షెడ్యూల్ చేయవచ్చు. మొత్తంగా 10 ఆన్లైన్ కంప్యూటర్లు వాహనం యొక్క విధులు, శక్తి స్థాయిని, అంచనా దూరం మరియు వాహన ఉష్ణోగ్రత సంబంధించిన సమాచారం అందించేందుకుగానూ ఉపయోగపడతాయి. దీనితో పాటుగా రివర్స్ కెమెరా ఉండడం వలన డ్రైవర్ కి పార్కింగ్ సులభం అవుతుంది. వీటితో పాటు, హిల్ అసిస్ట్, వైపర్స్ సమితి, డ్యుయల్ డాంపింగ్ గ్లోవ్ బాక్స్, ఫాలో-మీ హోమ్ హెడ్ల్యాంప్స్, డ్రైవర్ వైపు ఆటో డౌన్ ఫంక్షన్, ఒక డిజిటల్ యూజర్ మాన్యువల్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


ఈ మోడల్ సిరీస్ అంతర్గత క్యాబిన్ దీని 3280mm పొడవు కారణంగా చాలా విశాలంగామరియు తగింత లెగ్రూమ్ దీని ముందరి సీట్లు మాత్రమే కాకుండా వెనుక సీట్లకి కుడా ఉంది. దీనిలో బూట్ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. దీని వెనక సీట్లను పొడిగించి దీని బూట్ సామర్ధ్యాన్ని పెంచవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


బోనెట్ క్రింది భాగానికి వస్తే, ఈ వాహనం లో, 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ తో అమర్చడం జరిగింది. ఇది 48వి లిథియం అయాన్ బ్యాటరీ తో కలిసి పనిచేస్తుంది. ఇది 15 ఎ సాకెట్ ఎక్కడైనా, 220 వి ఛార్జ్ చేయబడడం ఒక ప్లస్ పాయింట్. ఈ మోటార్ 3750rpm వద్ద 25.4bhp గరిష్ట శక్తి ని మరియు 3400rpm వద్ద 53.9Nm టార్క్ ని అందిస్తుంది. ఈ యంత్రం పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో అమర్చబడి మంచి పనితీరుని అందిస్తుంది. ఇది పూర్తిగా చార్గింగ్ అయ్యి 120 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. దీనిలో ఒక గంట మాత్రమే చార్గింగ్ తీసుకుంటే 20 కి.మీ. వరకూ మాత్రమే వెళుతుంది. దీని బేస్ వేరియంట్లలో బ్యాటరీ పూర్తిగా చార్గింగ్ అయ్యేందుకుగానూ దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అదే దీని అగ్ర శ్రేణి వేరియంట్ లో పూర్తి చార్గింగ్ కొరకు 5 గంటల సమయం తీసుకుంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


దీని అగ్ర శ్రేణి వేరియంట్ 4 స్పీకర్లు మరియు రెండు ట్విటర్లు కలిగియున్న ఒక ఆధునిక జెబిఎల్ సంగీతం వ్యవస్థతో అమర్చబడి ఉంది. వీటితోపాటు, ఎంపి3 ప్లేబ్యాక్ తో పాటూ డివిడి / సిడి ప్లేయర్ మరియు యుఎస్ బి మరియు ఆక్స్-ఇన్ పరికరాల కోసం కనెక్టివిటీ పోర్ట్సు కలిగి ఉంది. అంతేకాకుండా ఇది ఒక ఒక బ్లూటూత్ ఫంక్షన్ ని కలిగి ఉంది. దీని ద్వారా కాల్స్ మరియు ఆడియో స్ట్రీమింగ్ వంటివి చేయవచ్చు. వీటితో పాటు, కాక్పిట్ 6.2-అంగుళాల టచ్స్క్రీన్ కలర్ డిస్ప్లేతో అమర్చబడి ఉంది. ఈ టచ్స్క్రీన్ లో మ్యాప్ లు మరియు జిపిఎస్ నావిగేషన్ వ్యవస్థ ఉంటాయి. అదే సమయంలో, బేస్ వేరియంట్ వాహనానికి సమాచార వ్యవస్థ, పవర్ సాకెట్లు, నావిగేషన్ సిస్టమ్ మరియు కొన్ని ఇతర అంశాలను చేర్చడం జరిగింది. అంతేకాకుండా సీటు కవర్లు, స్కఫ్ పేల్ట్లు, అందమైన శరీర గ్రాఫిక్స్, రేర్ స్పాయిలర్స్, న్యూడ్ గార్డ్లు మరియు అనేక ఇతర అంశాలు అధనపు ఖర్చు కి లభిస్తాయి.

వీల్స్ పరిమాణం:


ఈ మోడల్ సిరీస్ లో వీల్ ఆర్చులు 13 అంగుళాల స్టీల్ చక్రాల సమితితో బిగించబడ్డాయి. ఈ వీల్స్, వీల్ క్యాప్స్ తో అమర్చబడి ఉంటాయి. ఈ రిమ్స్ తరువాత 155/70 R13 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. ఇలా రేడియల్ టైర్ల సమితితో కప్పడం వలన రోడ్లపై మంచి గ్రిప్ వస్తుంది. దీని బూట్ కంపార్ట్మెంట్లో ఒక అధనపు వీల్ అమర్చబడి ఉంటుంది. వీటితో పాటూ ఇతర టూల్స్ ని కూడా టైర్ మార్చుకునేందుకుగానూ బూట్ కంపార్ట్మెంట్ లో ఉంచుతారు. ఈ రెండు కూడా అన్ని వేరియంట్లలో ఉండే ప్రామాణిక లక్షణాలు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఇది ఒక ఎలక్ట్రిక్ వాహనం కావడం వలన ఖచ్చితంగా అత్యుత్తమ బ్రేకింగ్ విధానం తో అమర్చబడి ఉంది. దీని ద్వారా రోడ్లపై సులువుగా వాహనాన్ని నియంత్రించవచ్చు. దీని ముందరి వీల్స్ 215mm డిస్క్ బ్రేక్లు సమితితో అమర్చబడి ఉండగా దీని వెనుక బ్రేక్లు 180mm డ్రమ్ బ్రేక్ల సమితితో అమర్చబడి ఉండి అన్ని వాతావరణాల్లో నిర్విరామంగా పనిచేస్తాయి. మరోవైపు, దాని ముందరి ఆక్సిల్ మెక్ఫెర్సన్ స్ట్రట్ తో అమర్చబడి గ్యాస్ తో నింపబడిన షాక్అబ్జార్బర్స్ మరియు ఏంటీ రోల్ బార్ తో లోడ్ చేయబడి ఉంటాయి. దీనిలో రేర్ ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్స్ ని కలిగియున్న ట్రెయిలింగ్ లింక్ టైప్ మెకానిజంతో, పాన్ హార్డ్ రాడ్ మరియు వాయువుతో నిండి ఉన్నషాక్అబ్జార్బర్స్ తో అమర్చబడి ఉంటాయి. ఇవి ఒక మృదువైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. మరోవైపు, దీని అగ్ర శ్రేణి వేరియంట్లు ఒక ఆధునిక విద్యుత్ శక్తి సహాయక స్టీరింగ్ వ్యవస్థ ను కలిగియుండి కేవలం 3.9 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధం అందిస్తాయి. ఈ స్టీరింగ్ అధికంగా ట్రాఫిక్ ఉన్నప్పుడు డ్రైవర్ కి ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే ఇతర వేరియంట్లలో మాన్యువల్ స్టీరింగ్ వ్యవస్థ చేర్చబడింది.

భద్రత మరియు రక్షణ:


సంస్థ ఈ కారుకి అనేక భద్రతా లక్షణాలని అందించింది. దీని ద్వారా డ్రైవర్ సురక్షితం గా డ్రైవ్ చేయవచ్చు. ఈ విద్యుత్ వాహనం ఒక వెల్డింగ్ గొట్టపు నిర్మాణం గల చాసిస్ ని కలిగి ఉంటుంది. ఇది వాహనం సమకాలిన పరిస్థితులలో ఎటువంటి ప్రమాదానికైనా గురైనప్పుడు వచ్చే షాకులని తట్టుకునేందుకు సహకరిస్తుంది. శరీరం ప్యానెల్ కూడా ఇంపాక్ట్ ప్రొటక్షన్ బీమ్స్ మరియు క్రుంపుల్ జోన్స్ ని కలిగి ఉంటాయి. ఇవి డామేజ్ నుండి వాహనాన్ని మరియు లోపల ప్రయాణికులని రక్షిస్తుంది. వీటితోపాటు, చైల్డ్ సీటు మౌంటింగ్, మూడు పాయింట్ల ఇ ఎల్ ఆర్ సీట్ బెల్ట్లు మరియు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్రైన్స్ వంటివి మరింత భద్రత కొరకు ఏర్పాటు చేయడమైనది. ఇవేకాకుండా గేర్ షిఫ్ట్, ఛార్జ్ ఇంటర్లాక్లు, డ్యుయల్ హార్న్స్, శక్తివంతమైన హెడ్ల్యాంప్స్, ట్యూబ్ లేని రేడియల్ టైర్లు వంటి లక్షణాలుఅధనంగా చేర్చబడ్డాయి. అంతేకాకుండా ఇంజిన్ ఇమ్మొబలైజర్ ఉండడం ద్వారా అనధికార ప్రవేశకులను తొలగించవచ్చు.

అనుకూలాలు:


1. యాజమాన్యం మరియు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది.
2. బాహ్య రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు దీని టైర్ల పరిమాణం నగర రోడ్లకి తగ్గట్టు ఉంటుంది.
3. పూర్తి చార్గింగ్ కి 120 కి.మీ మైలేజ్ ని అందించగలగడం గొప్ప విశేషం.
4. అత్యంత అధునాతన మరియు విలువైన పరికరాలను కలిగి ఉంది.
5. ఈ విభాగంలో భద్రతా స్థాయిలు చాలా బాగుంటాయి.

ప్రతికూలాలు:


1. ఈ కారు పూర్తి చార్జింగ్ అవ్వడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఈ సమయాన్ని కొంచెం తగ్గించవచ్చు కదా.
2. బూట్ సామర్ధ్యం మరియు వీల్ బేస్ తక్కువగా ఉండడం దీనికి ప్రతికూలత
3. మిశ్రమ లోహ చక్రాలు లేకపోవడం ఒక పెద్ద మైనస్ పాయింట్.
4. అధికారం సేవా కేంద్రాల సంఖ్య పెంచవచ్చు.
5. కేవలం రెండు తలుపులను మాత్రమే కలిగి ఉండటం వలన లోపలికి ప్రవేశించేందుకు మరియు బయటికి వెళ్ళేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది.