హోండా మొబిలియో

` 7.5 - 12.9 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హోండా ఇతర కారు మోడల్లు

 
*Rs

హోండా మొబిలియో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ఈ సంస్థ దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీదారులలో ఒకటి. ఇటీవల ఇది దాని మొట్టమొదటి ంPV మోడల్ హోండా మొబీలియొ ను కారు మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కొనుగోలుదారులకు ఎంచుకోవడానికి ఈ కంపెనీ దీనిని పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తుంది. హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ యొక్క శరీర ప్లాట్ఫారమ్ ఆధారంగా ఈ వాహనాన్ని నిర్మించారు. అయితే,ఇది పరిమాణం ద్రుష్ట్యా చాలా పెద్దగా మరియు 4386మ్మ్ మొత్తం పొడవు తో వస్తుంది. దీని యొక్క అద్భుతమైన వెలుపలి డిజైన్ ముఖ్యాంశంగా నిలుస్తుంది. దీని వెనుక ప్రొఫైల్ చూడచక్కని విధంగా రూపుదిద్దబడింది. ఇది పెద్ద విండ్స్క్రీన్ మరియు ప్రకాశవంతమైన టైల్ లైట్ క్లస్టర్ తో అందంగా కనిపిస్తుంది. దీని ముందు ప్రొఫైల్ లో క్రోమ్ పూతతో ఉన్న రేడియేటర్ గ్రిల్ ఇంకా దాని చుట్టు ఉన్న హెడ్ లైట్ క్లస్టర్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే శరీర రంగు గల బంపర్స్, బోనెట్ ఇంక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. బేస్ మరియు మధ్య స్థాయి వేరియంట్లు ఉక్కు చక్రాలు కలిగి ఉండగా, దాని అగ్ర శ్రేణి వేరియంట్లు అందమైన 10-స్పోక్ డిజైన్ లొ ఉన్న అల్లాయ్ వీల్స్ తో అమర్చబడి ఉంటాయి.

మరో వైపు, ఈ వాహనం విశాలమైన అంతర్గత క్యాబిన్ తో వస్తుంది. ఇది రెండు వేర్వేరు రంగులతో అలంకరించబడింది. దీని డాష్బోర్డ్ నలుపు రంగులో వస్తుంది అయితే, ఇది కొన్ని ఆధునిక అంశాలతో పొందుపరచబడి ఉంది. అవి ఏంటంటే సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్, ఆC యూనిట్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ఇంకా మరి కొన్ని అంశాలు. ఈ డాష్బోర్డ్ పై వున్న చెక్క పలకలు దానిని ఇంకా అందంగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా, ఇందులో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ప్రయాణీకులకు తగిన సౌకర్యం కలిగించేందుకు తొడ్పడతాయి. ఇది 2-ఢీణ్ ఆడియో సిస్టమ్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, 15.7cమ్ టచ్స్క్రీన్ డిస్ప్లే, రియర్ పార్కింగ్ కెమెరా ఇంకా ఆడియో వీడియో నావిగేషన్ సిస్టెం వంటివి ప్రత్యేకంగా ఱ్S వేరియంట్లో ఉన్నాయి.

ఈ వాహనం ప్రయాణీకులకు ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. కారు తయారీదారు దీనిని ఎన్నో భద్రత అంశాలతో అందజేసింది. వీటిలో పాదచారుల గాయం తీవ్రతను తగ్గించే సాంకేతికం, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎయిర్ బ్యాగులు కొన్ని ముఖ్యమైనవి. సాంకేతిక వివరణలు పరంగా, దీని పెట్రోల్ వేరియంట్స్ 1497cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం గల 1.5-లీటర్, ఇ-VఠేC ఇంజన్ తో బిగించబడి ఉన్నాయి. దీనికి 117.3భ్ప్ శక్తి మరియు 145ణ్మ్ టార్క్ ను పంపిణీ చేసే సామర్థ్యం ఉంది. మరో వైపు దీని యొక్క డీజిల్ వెర్షన్ 1.5 లీటర్, ఇ-ఢ్ఠేC మోటర్తో అమర్చబడి ఉంది. ఇది 98.6భ్ప్ శక్తి మరియు 200ణ్మ్ టార్క్ ను అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జతచేయబడింది. ఈ రెండు ఇంజన్లు దాని ముందు చక్రాలు శక్తిని అందిస్తాయి. ఈ ంఫ్వ్ మారుతి ఎర్టిగా, నిస్సాన్ ఎవాలియా , మహీంద్రా క్వాంటో, చేవ్రొలెట్ ఎంజాయ్ మరియు ఇతర వాహనాలతో పోటీ పడుతుంది. మరోవైపు, ఇది రెండు సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీ తో వస్తుంది. అయితే, వినియోగదారులు కొంత అదనపు ఖర్చు చెల్లించి ఈ వారంటీ కాలాన్నిమరొక రెండు సంవత్సరాలకు పొడిగించవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని యొక్క పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్ సిస్టెం తో వస్తుంది. ఇది ఈ ంPV ని నగరం ట్రాఫిక్ పరిస్థితులలో 14.3క్మ్ప్ల్ మరియు పెద్ద రోడ్లు 17.8క్మ్ప్ల్ గరిష్ట మైలేజ్ ను అందించటానికి అనుమతిస్తుంది. మరోవైపు డీజిల్ మోటర్ కామన్ రైల్ ఆధారిత ఫ్యూయెల్ ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థతో అమర్చబడి ఉంది. ఇది నగర పరిధిలో 20క్మ్ప్ల్ మరియు రహదారులపై దగ్గరదగ్గరగా 24.3క్మ్ప్ల్ వరకు ఇస్తుంది.

శక్తి సామర్థ్యం:


దీని యొక్క పెట్రోల్ మిల్లు 6600ర్ప్మ్ వద్ద 117.3భ్ప్ శక్తి మరియు 4600ర్ప్మ్ వద్ద 145ణ్మ్ టార్క్ ను ఇస్తుంది. అయితే, దీని 1498cc డీజిల్ మిల్లు 3600ర్ప్మ్ వద్ద 98.6భ్ప్ శక్తి తొ పాటు 1750ర్ప్మ్ వద్ద 200ణ్మ్ అత్యధిక టార్క్ ను అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ కారు తయారీదారు పెట్రోల్ ఇంకా డీజిల్ రెండు ఇంజన్లను 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జతపరచింది. ఇది వాహనం యొక్క ముందు చక్రాలకు మిల్లు శక్తిని పంపిణీ చేస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్లను సుమారుగా 150 నుండి 160క్మ్ఫ్ వేగాన్ని చేరుకోవడానికి అనుమతినిస్తుంది. అయితే, ఇవి 100క్మ్ఫ్ వేగాన్ని చేరుకొవడానికి కనీసం 13 నుంచి 14 సెకన్ల సమయం తీసుకుంటుంది. మరోవైపు, దీని యొక్క డీజిల్ వేరియంట్లు దాదాపుగా 14 సెకన్లలో 100క్మ్ఫ్ వేగాన్ని తాకుతుంది. అయితే, ఈ మోటర్ దీనిని 160 నుండి 165క్మ్ఫ్ గరిష్ట వేగాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది.

వెలుపలి డిజైన్:


హోండా మొబీలియొ మోడల్ సిరీస్ను అత్యంత ఆకర్శణీయంగా మరియు ఎన్నో వినూత్నమయిన అంశాలతొ రూపొందించబడింది. దాని ముందు ప్రొఫైల్ తో ప్రారంభిస్తే, ఒక శక్తివంతమైన హెడ్ లైట్ క్లస్టర్ కలదు. ఇది హాలోజన్ హెడ్ల్యాంప్స్ మరియు సైడ్ టర్న్ ఇండికేటర్లతో బిగించబడి ఉన్నది. ఒక పెద్ద రేడియేటర్ గ్రిల్ క్రోమ్ పూతతో ఉంటుంది ఇంకా ప్రముఖ కంపెనీ లోగో దాని మధ్యలో పొందుపరచబడింది. దాని క్రింద శరీర రంగులో ఉన్న బంపర్, ఎయిర్ డ్యాం మరియు గుండ్రటి ఆకారంలో గల ఫాగ్ ల్యాంపులతో వస్తుంది. ఇవి కాకుండా, వైపర్లతో బిగించబడిన పెద్ద విండ్స్క్రీన్ ఇంకా బోనెట్ దీని ముందు ప్రొఫైల్ కు మరింత అందాన్ని ఇస్తుంది. ఈ ంఫ్వ్ యొక్క సైడు ప్రొఫైల్ శరీర రంగులో ఉన్న డోర్ హ్యండిల్స్, ఓఱ్Vంస్ ఇంక భ్ మరియు C పిల్లర్లతో వస్తుంది. దీని వీల్ ఆర్చులకు బిగించబడిన మిశ్రమ లోహ చక్రాలు ఈ వాహనానికి మరింత ఆకట్టుకొనే రూపాన్ని ఇస్తుంది. మరో వైపు, దీని వెనుక ప్రొఫైల్ లో ఒక వెడల్పు విండ్స్క్రీన్ ఉంది. అది థర్డ్ బ్రేక్ లైట్, వైపర్, ఇంకా డీఫాగ్గర్ తో సహా వస్తుంది. దీని టైల్ లైట్ క్లస్టర్ ఎక్కువ తీవ్రత గల బ్రేక్ లైట్ మరియు టర్న్ ఇండికేటర్లతో అమర్చబడి ఉంది. ఇలా ఉండగా, దీని టైల్ గేట్ క్రోమ్ పూత కలిగి, సంస్థ యొక్క లోగో మరియు మోడల్ అక్షరాలతో ఉంటుంది. ఇంతే కాకుండా, దీని బంపర్ రెండు రిఫ్లెక్టర్లతో తో పాటు నల్ల రంగు స్ట్రిప్ తో వస్తుంది.

వెలుపలి కొలతలు:


ఈ వాహనం 4386మ్మ్ మొత్తం పొడవు మరియు 1603మ్మ్ తగు ఎత్తు తో నిర్మించబడింది. డోర్ అద్దాలను చేర్చినతరువాత, దీని పూర్తి వెడల్పు 1683మ్మ్ వరకు వస్తుంది. దీని యొక్క వీల్ బేస్ 2652మ్మ్ కొలతతో చాలా విశాలంగా ఉంటుంది. అయితే, దీని కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 189మ్మ్ ఉండగా, టర్నింగ్ రేడియస్ వేరియంట్ల ఆధారంగా 5.2 నుండి 5.4 మీటర్ల వరకు ఉంటుంది.

లోపలి డిజైన్:


ఈ వాహనం యొక్క లోపలి డెజైన్ బహు ఆకర్శణీయంగా రెండు రంగులతో అలంకరించబడింది. కాక్పిట్ లోని డాష్బోర్డ్ నలుపు రంగులో ఉండగా, దానికి పొందిపరచబడిన కొన్ని పరికరాలకు వెండి పూతతో అద్భుతంగా కనిపిస్తుంది. దీనికి తదుపరి ఇన్స్ట్రుమెంట్ పానెల్, ఆC యూనిట్, మూడు స్పోక్ డెజైన్ గల స్టీరింగ్ వీల్ మరియు ఆడియో సిస్టమ్ వంటి అధునాతన అంశాలను అమర్చబడింది ఉన్నాయి. ఇందులో ఉన్న సీట్లు ప్రయాణీకులకు ఎంతో సౌకర్యాని అందిస్తాయి. వీటన్నిటికీ హెడ్ రెస్ట్రైంట్స్ బిగించబడి ఉండగా, డ్రైవర్ సీటుకు విద్యుత్ తో ఎత్తు సర్దుబాటు చేసుకోగల ఫంక్షన్ ఉంటుంది. రెండవ వరుస సీటుకు 60:40 స్ప్లిట్ మడత సౌకర్యం ఉండగా, 50:50 స్ప్లిట్ మడత సౌకర్యం గల మూడవ వరుస సీట్లు లగేజ్ వుంచే స్థలాన్ని మరింత పెంచడానికి సహాయపడుతుంది. కార్ల తయారీదారు ఇందులో మరి కొన్ని ఉపయోగపడే అంశాలను అందించారు. ఇవి కప్ మరియు బాటిల్ హోల్డర్స్, పెద్ద గ్లవ్ బాక్స్ యూనిట్, వ్యానిటీ అద్దం కలిగి ఉన్న సన్ వైసర్స్, పవర్ విండోస్, డే అండ్ నైట్ రియర్ వ్యూ అద్దం వంటి అనేక అంశాలు ఈ మోడల్ లో ఉన్నాయి.

లోపలి సౌకర్యలు:


ఇందులో అమర్చబడిన కొన్ని వినూత్నమైన అంశాలు ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇందులోని ఎయిర్ కండీషనింగ్ యూనిట్, వెనుక ఆఛ్ వెంట్లతో సహా వస్తుంది. అంతే కాకుండా, డస్ట్ మరియు పోలెన్ ఫిల్టర్ క్యాబిన్ గాలిని శుభ్రపరుస్తాయి. మరో వైపు, దీని ఇన్స్ట్రుమెంట్ పానెల్ డోర్ అజార్ హెచ్చరిక, డిజిటల్ టాకొమీటర్, ఎలక్ట్రానిక్ త్రిప్మెతెర్, డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక వంటి అంశాలతో వస్తుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్ ఆడియో మరియు కాల్ నియంత్రణ బటన్లను విలీనం అయ్యి వున్న బహుళ ఫంక్షన్లు గల స్టీరింగ్ వీల్ తో వస్తుంది. ఇవన్నిటితో పాటు, ఇందులోని ఎత్తు సర్దుబాటు చేసుకోగల డ్రైవర్ సీటు, గ్లవ్ బాక్స్ లోవున్న సన్ గ్లాస్ హోల్డర్,సన్ వైసర్స్ ఇంకా మరి కొన్ని అంశాలు చాలా సౌకర్యాన్ని ఇస్తాయి.

లోపలి కొలతలు:


దీని విశాలమైన క్యాబిన్ లో పెద్ద బూట్ కంపార్ట్మెంట్ కలదు. ఈ స్థలాన్ని వెనుక సీట్ మడవటం ద్వారా మరింతగా పెంచుకొవచ్చు. అయితే, ఇది 42 లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్ తో బిగించబడి వస్తుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఇతీవల కొత్తగ మార్కెట్లో ప్రవెశపెట్టిన ఈ వాహనం కొనుగోలుదారులు ఎంచుకోవడానికి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. దీని యొక్క 1.5 లీటర్ పెట్రోల్ ఇ-VఠేC పెట్రోల్ ఇంజనుకు 1497cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం ఉంది. ఇది SఓఃC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లు మరియు పదహారు కవాటాలతో అమర్చబడి ఉంది. ఈ మోటర్ 117.3భ్ప్ శక్తి తో సహా 145ణ్మ్ గరిష్ట టార్క్ ను అందిస్తుంది. మరోవైపు, దాని డీజిల్ వెర్షన్ ఢోఃC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 1.5-లీటర్ ఇ-ఢ్ఠేC ఇంజిన్ తో వస్తుంది. ఇది కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ మరియు టర్బో ఛార్జింగ్ యూనిట్ తో కలిసి ఉంటుంది. ఈ 1498cc మిల్లు 98.6భ్ప్ శక్తి మరియు 200ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోటార్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడ్డాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ ంPV యొక్క మధ్య ఇంకా అగ్ర శ్రేణి వేరియంట్లు ఆధునిక 2-ఢీణ్ ఆడియో యూనిట్ తో వస్తుంది. ఇది ంP3 / Cఢ్ ప్లేయర్, రేడియో, ఊSభ్ మరియు ఆఉx-ఇన్ స్లాట్లతో వస్తుంది. దాని బేస్ వేరియంట్లో ముందు స్పీకర్లు ఉంది. ఇది మ్యూజిక్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొనే సదుపాయంతో వస్తుంది. ఇదిలా ఉండగా, దీని యొక్క ఱ్S వేరియంట్ ఆధునిక ఆVణ్ సిస్టెం తో వస్తుంది. ఇది టచ్స్క్రీన్ డిస్ప్లే తో సహా భ్లుఎతూథ్ కనెక్టివిటీ, SVC (వేగం వాల్యూమ్ పరిహారం), ంP3 ప్లేయర్, Fం/ఆం రేడియోలతో వస్తుంది.

వీల్స్ పరిమాణం:


హోండా మొబీలియొ యొక్క బేస్ మరియు మధ్య శ్రేణి వరియంట్లలో 15-అంగుళాల ఉక్కు చక్రాలు ఉండగా, అగ్ర శ్రేణి వరియంట్లలు 15 అంగుళాల, 10-స్పోక్ డిజైన్ లో ఉన్న అలాయ్ వీల్స్ తో వస్తాయి. ఇవన్నీ 185/65 ఱ్15 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్ల తో అమర్చబడి ఉన్నాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం యొక్క ముందు చక్రాలకు డిస్క్ బ్రేక్లులు ఉండగా, వెనుక వాటికి డ్రమ్ బ్రేక్లులు బిగించబడి ఉన్నాయి. అగ్ర శ్రేణి పెట్రోల్ ఇంకా అన్ని డీజల్ వరీంట్లలో యాంటి లాక్ బ్రేకింగ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టెం అమర్చబడి ఉన్నాయి. దీని యొక్క సస్పెన్షన్ సిస్టెం వాహనాన్ని స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంచుతుంది. దీని ముందు ఆక్సిల్ కు మక్ఫెర్సొన్ స్ట్రట్ ఉండగా, వెనుక దానికి టార్షన్ బీం సిస్టెం కలదు. అయితే, ఇది విద్యుత్ శక్తి సహాయక స్టీరింగ్ సిస్టెం తఒ వస్తుంది. ఇది మంచి స్పందనను ఇస్తూ సులభమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


భద్రత పరంగా, ఈ కంపెనీ దీనిని అనేక ముఖ్యమైన అంశాలతో అందిస్తోంది. వీటిలో ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక, 3-పాయింట్ ఏళృ సీటు బెల్ట్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టం, ఇంకా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలు ఉన్నాయి. వీటితో పాటు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, దొంగతనం నుండి వాహనాన్ని పరిరక్షించడం కోసం ఒక ఆధునిక ఇంజిన్ ఇమ్మొబిలైజర్, డ్యూయల్ ఫ్రంట్ Sఱ్S ఎయిర్బ్యాగ్స్, ఆటో డోర్ లాక్, భద్రతా అలారం, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ ఇంకా కొన్ని కీలక అంశాలు ఇందులో వున్నాయి.

అనుకూలాలు:1) విశాలమైన లోపలి భాగము ఒక పెద్ద ప్రతికూలం.
2) డీజిల్ మిల్లు యొక్క ఇంధనం ఆకట్టుకుంటుంది.
3) అమ్మకాల తర్వాత సర్వీసు సంతృప్తినిస్తుంది.
4) పెట్రోల్ ఇంజిన్ ప్రదర్శన చాలా బాగుంది.
5) భద్రత లక్షణాలు ఇతర పోటీదారులకంటే మెరుగ్గా ఉన్నాయి.

ప్రతికూలాలు:1) ధర కొద్దిగా ఎక్కువగా ఉంది.
2) నిర్వహణ మరియు విడిభాగాలు వ్యయం అధికంగా ఉంది.
3) ఇంటీరియర్ ప్లాస్టిక్ నాణ్యతను ఇంకా మెరుగుపరచవచ్చు.
4) బేస్ వేరియంట్లో వెనుక ఆఛ్ వెంట్లు లేవు.
5) ప్రవేశ స్థాయి వేరియంట్లో ఆడియో సిస్టెం లేకపోవడం అసౌకర్యంగా ఉంటుంది.