హోండా సిఆర్-వి

` 21.5 - 26.3 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హోండా ఇతర కారు మోడల్లు

 
*Rs

హోండా సిఆర్-వి వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ఈ సంస్థ అనేక అధునాతనమైన కార్లు తయరుచేసే సంస్థగా ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.ఇవి అద్భుతమైన ఇంజిన్లను కలిగినటువంటి అనేక ఆధునిక కార్లతో ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో అంచెలు అంచెలుగా ఎదుగుతున్నది. ఇది ఒక గరుకైన ఎస్ యువి ఐనటువంటి హోండా సీఅర్ వి ని కలిగి ఉంది. దీనిలో ఆకర్షణీయమైన అంతర్భాగాలు అలానే బాహ్య భాగాలు ఉన్నాయి. ఈ స్పొర్ట్స్ యుటిలిటీ వాహనం వినియోగదారులు ఎంచుకొనేందుకు 2.0 లీటర్, 2.4 లీటర్ పెట్రోల్ ఇంజన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్టైలిష్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం యొక్క అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది 4 వీల్ డ్రైవ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ డ్రైవర్ చాలా సులభంగా నాలుగు చక్రాల మరియు రెండు చక్రాల ఎంపికను ఎంచుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని 2.0 లీటర్ మోటారు ఒక ఎస్ ఒ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 153.9బి హెచ్ పి శక్తిని మరియు 190ఎన్ ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో అలాగే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థ తో అందుబాటులో ఉంది. అదే సమయంలో దాని 2.4 లీటర్ ఐ-విటెక్ ఇంజిన్ ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో వ్యవస్థ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ వరుసగా 187.4బి హెచ్ పి శక్తిని మరియు 226ఎన్ ఎం టార్క్ ని అందిస్తుంది. దీని బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం అసమాన రోడ్లపై వాహనం సులువుగా ప్రయాణించేందుకు ఉపయోగపడతాయి. వీటిలో 17.7 సెం.మీ. ఆధునిక టచ్స్క్రీన్ డిస్ప్లే, సిరి ఐస్ ఫ్రీ వాయిస్ గుర్తింపు, హెచ్ డి ఎం ఐ వీడియో అనుకూలత, బహుళ కోణం దృశ్యాలను కలిగిన రేర్ వ్యూ కెమేరా, ఆడియో ప్రదర్శన, పుష్ ఇంజిన్ / స్టాప్ బటన్ మరియు కొన్ని ఇతర అంశాలను కలిగి ఉంది. ఇంకా, ఇది సిక్స్ ఎయిర్బ్యాగ్స్, భద్రతా అలారం వ్యవస్థ, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వివిధ ముఖ్యమైన భద్రత అంశాలను కలిగి ఉంది. ఇది స్థిరత్వం సహాయం మరియు భద్రత సూచీ జోడించే సీటు బెల్టులను అందుబాటులో ఉంది. ఇది నమ్మకమైన డిస్క్ బ్రేకింగ్ మెకానిజం ని కలిగి ఉంది. సస్పెన్షన్ వ్యవస్థ కూడా రెండు యాక్సిల్స్ అమర్చిన కాయిల్ స్ప్రింగ్స్ తో సమర్థవంతంగా పనిచేస్తుంది.

దీని పెద్ద వీల్ బేస్ మరియు ఆకర్షణీయమైన గ్రౌండ్ క్లియరెన్స్ ఏ రహదారి పరిస్థితుల లోనైనా వ్యవహరించడానికి వీలుగా ఉంటుంది. దీని ముందరి ముఖ భాగం స్పోర్టీ రేడియేటర్ గ్రిల్ ని కలిగి ఉంది. దీని బోనెట్ పైన గీతలు కలిగి ఉండి చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని పక్క భాగానికి వస్తే కిటికీల చుట్టూ ఒక క్రోమ్ ఆకారం ద్వారా రూపొందించబడింది. దీని ముందరి ముఖ భాగానికి వస్తే మూడు సమాంతరమైన స్లాట్లు కలిగియున్న రేడియేటర్ గ్రిల్ ని కలిగి ఉంది. ఇది సంస్థ యొక్క చిహ్నాన్ని మధ్యలో ఉంచబడిన క్రోమ్ లో కలిగి ఉంది. అలానే దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి. దీని మిగిలిన వేరియంట్లలో శక్తివంతమైన హాలోజన్ హెడ్ల్యాంప్స్ ఉంటాయి. దీని విండ్స్క్రీన్ చాలా పెద్దదిగా ఉండి మెరుగైన వీక్షణ అందిస్తుంది మరియు వేరియబుల్ వైపర్స్ జంటతో అమర్చబడి ఉంది. సొగసైన మరియు ఏటవాలుగా ఉన్న బోనెట్ పైన లైన్స్ ఉన్న కారణంగా ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిలో డ్యుయల్ టోన్ బంపర్ నలుపు రంగు రక్షణ కవచాన్ని కలిగి ఉండడం వలన చిన్న డేమేజ్ లను ఎదుర్కొనగలదు. బంపర్ ఒక విస్తారమైన ఎయిర్ డ్యామ్ ని కలిగి ఉండి ఇంజిన్ చల్లబడేందుకు దోహదం చేస్తుంది. ఈ ఎయిర్ డ్యామ్ చుట్టూ ఫాగ్ ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది. దీనివలన దీని ముందరి భాగం చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని వెనుక భాగం విశాలమైన విండ్షీల్డ్ తో పాటూ డిఫాగర్ మరియు వైపర్ ని కలిగి ఉంటుంది. ఇది హై మౌంట్ స్టాప్ ల్యాంప్ తో జతచేయబడిన స్పోర్టి రేర్ స్పాయిలర్ ని కలిగి ఉంది. దీని బూట్ వాల్యూమ్ విశాలంగా చాలా సామానులు పట్టే విధంగా ఉంటుంది. దీనిలో డ్రైవర్ సీటుకి లంబర్ సపోర్ట్ అలానే హైట్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ అందుబాటులో ఉంది. దీనిలో డాష్బోర్డ్ కి అధిక నాణ్యత గల ప్లాస్టిక్ మరియు లెథర్ అపోలిస్ట్రీ క్లాస్సి లుక్ ఇస్తుంది. మరోవైపు, ఈ ఎస్ యు వి అధునాతన సంగీతం వ్యవస్థని కలిగి ఉంది. ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ఎయిర్ వెంట్స్ తో చాలా అద్భుతంగా పనిచేసి అతి తక్కువ సమయంలో క్యాబిన్ ని చల్లబరుస్తుంది. ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికెల్ ఈ విభాగంలో టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ శాంటా ఫే, మహీంద్రా ఎక్స్ యు వి 500, చేవ్రొలెట్ కాప్టివా, ఫోర్డ్ ఎండీవర్, రెనాల్ట్ కొలియోస్, ఇసుజు ఎం యు 7, స్కోడా ఏతి వంటి మరియు ఇతర వాహనాలకు గట్టి పోటీ ఇస్తుంది. దీని వారంటీ ఇంకో రెండు సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల కు పెంచవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనంలో రెండు పెట్రోల్ ఇంజిన్లు ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో జత చేయబడి ఉండడం వలన దీని సామర్ధ్యం పెరుగుతుంది. 2.0 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్ హైవేస్ లో 13.7kmpl మైలేజ్ అందిస్తుంది మరియు నగర రోడ్లపై 10.9 Kmplమైలేజ్ ఇస్తుంది. వేరొక ఇంజిన్ పెద్ద రోడ్లపై 12 kmpl మైలేజ్ ఇవ్వగా నగర పరిధిలో సుమారు 9.8kmpl మైలేజ్ అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఎస్ ఒ హెచ్ సి ఆధారిత పెట్రోల్ ఇంజన్ 6500rpm వద్ద 153.86bhp గరిష్ట శక్తి ఉత్పత్తి చేస్తుంది మరియు 4300rpm వద్ద 190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, 2.4 లీటర్ పవర్ ప్లాంట్ 7000rpm వద్ద 187.4bhp శక్తిని ఇస్తుంది మరియు 4400rpm వద్ద 226Nm టార్క్ ని అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


దీనిలో 2.0 లీటర్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి గరిష్టంగా 190 kmp వేగం వరకూ వెళ్ళగలదు. అదే సమయంలో, 10 సెకన్లలో 100 kmp వేగం వరకూ చేరుకోగల సామర్ధ్యం ఉంది. అయితే, ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో ఇంజిన్ 11 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. 2.4 లీటర్ ఇంజన్ ఒక ఐదు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి 195 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. ఇది 10 సెకెన్లలో 100 కిలోమీటర్ల వేగం చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


సంస్థ ఈ మోడల్ సిరీస్ కి అసంఖ్యాక విశిష్టతలను అందించి చూడడానికి ఆకర్షణీయంగా ఉండేలా చేసింది. ఇది ఎ.సి.ఇ (ఆధునిక అనుకూలత ఇంజనీరింగ్) శరీర నిర్మాణం మరియు వినియోగదరుల దృష్టిని ఆకర్షించే విదంగా అద్భుతమైన రూపం కలిగి ఉంది. దీని పక్క భాగం కి వస్తే బలమైన లైన్స్ మరియు క్రోమ్ విండో సిల్ తో రూపకల్పన చేయబడింది. దీనిలో ప్రధమ శ్రేణి వేరియంట్లు క్రోమ్ హ్యాండిల్స్ ని కలిగి ఉంటాయి. అయితే దీనిలో మిగతా వేరియంట్లు బాడీ కలర్ హ్యాండిల్స్ ని కలిగి ఉంటాయి. దీనిలో డ్యుయల్ టోన్ వెలుపలి వెనుక వీక్షణ అద్దాలు సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో జతచేయబడి ఉంటాయి. దీనిలో వీల్ ఆర్చులు అల్లాయ్ వీల్స్ సమితితో బిగించబడి ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. దీని ముందరి ముఖ భాగానికి వస్తే మూడు సమాంతరమైన స్లాట్లు కలిగియున్న రేడియేటర్ గ్రిల్ ని కలిగి ఉంది. ఇది సంస్థ యొక్క చిహ్నాన్ని మధ్యలో ఉంచబడిన క్రోమ్ లో కలిగి ఉంది. అలానే దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి. దీని మిగిలిన వేరియంట్లలో శక్తివంతమైన హాలోజన్ హెడ్ల్యాంప్స్ ఉంటాయి. దీని విండ్స్క్రీన్ చాలా పెద్దదిగా ఉండి మెరుగైన వీక్షణ అందిస్తుంది మరియు వేరియబుల్ వైపర్స్ జంటతో అమర్చబడి ఉంది. సొగసైన మరియు ఏటవాలుగా ఉన్న బోనెట్ పైన లైన్స్ ఉన్న కారణంగా ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిలో డ్యుయల్ టోన్ బంపర్ నలుపు రంగు రక్షణ కవచాన్ని కలిగి ఉండడం వలన చిన్న డేమేజ్ లను ఎదుర్కొనగలదు. బంపర్ ఒక విస్తారమైన ఎయిర్ డ్యామ్ ని కలిగి ఉండి ఇంజిన్ చల్లబడేందుకు దోహదం చేస్తుంది. ఈ ఎయిర్ డ్యామ్ చుట్టూ ఫాగ్ ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది. దీనివలన దీని ముందరి భాగం చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని వెనుక భాగం విశాలమైన విండ్షీల్డ్ తో పాటూ డిఫాగర్ మరియు వైపర్ ని కలిగి ఉంటుంది. ఇది హై మౌంట్ స్టాప్ ల్యాంప్ తో జతచేయబడిన స్పోర్టి రేర్ స్పాయిలర్ ని కలిగి ఉంది. దీని బూట్ వాల్యూమ్ విశాలంగా చాలా సామానులు పట్టే విధంగా ఉంటుంది. వీటిలో విద్యుత్ తో పనిచేసే సన్రూఫ్ దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో అందుబాటులో ఉంది.

వెలుపలి కొలతలు:


దీని మొత్తం పొడవు 4545mm, వెడల్పు 1820mm ఉండి రెండు బాహ్య రేర్ వ్యూ మిర్రర్స్ కలిగి ఉంటుంది. దీని ఎత్తు 1685mm, వీల్బేస్ 2620mm మరియు తగినంత లెగ్ రూమ్, హెడ్ స్పేస్ అలానే షోల్డర్ స్పేస్ కలిగి ఉంటుంది. దీని గ్రౌండ్ క్లెయరెన్స్ 170mm. ఇది పక్కన పెడితే, దీని ముందరి మరియు వెనుక త్రెడ్ 1565mm. 2 వీల్ డ్రైవ్ వేరియంట్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో 1470 మరియు 1480 కిలోల పరిధిలో బరువు ఉంటుంది. అయితే ఆట్ వేరియంట్లు 1500 మరియు 1510 కిలోలు మధ్య పరిధిలో బరువు ఉంటుంది. మరోవైపు, 4 వీల్ డ్రైవ్ వేరియంట్ 1600 కిలోల కెర్బ్ బరువు ఉంటుంది.

లోపలి డిజైన్:


కారు అంతర్భాగం విషయానికి వస్తే, కాబిన్ లో అద్భుతంగా రూపొందించబడిన సీట్లు, ఎంచుకున్న వేరియంట్ ని బట్టి ఫాబ్రిక్ లేదా లెదర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. డ్రైవర్ సీటుకి లంబర్ సపోర్ట్ తో పాటు గా ఉన్న 8వే పవర్ సర్దుబాటు ఫంక్షన్ ఉంది. వెనుక సీట్ 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ సౌకర్యం ఉండడం వలన దీని బూట్ సామర్ధ్యం మరింత పెంచుకోవచ్చు. దీని ముందరి సీట్ కి స్లైడింగ్ ఆర్మ్ రెస్ట్ ఉంది. అలానే దీని వెనుక భాగంలో ఉన్న సెంటర్ ఆర్మ్ రెస్ట్ రెండు కప్ హోల్డర్లను కలిగి ఉంటుంది. దీనిలో సూపర్ విజన్ క్లస్టర్ ఇల్ల్యుమినేషన్ కంట్రోల్ ఫంక్షన్ తో వస్తుంది. ఇంకా దీనిలో తక్కువ ఇంధన హెచ్చరిక కాంతి, డిజిటల్ ట్రిప్ మీటర్, బయట ఉష్ణోగ్రత డిస్ప్లే, డోర్ అజార్ వార్నింగ్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. దీని ముందరి భాగంలో మరియు దీని మధ్య వరుసలో 12 వి పవర్ సాకెట్ మొబైల్ చార్గింగ్ కోసం అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం కప్ హోల్డర్స్ ని కలిగియున్న సెంటర్ ఆర్మ్ రెస్ట్, ముందరి సీట్లకి వెనుక పాకెట్స్ మరియు బాటిల్ హోల్డర్స్, హుక్ మరియు లైట్ తో బూట్ కంపార్ట్మెంట్, అన్ని డోర్లకి మ్యాప్ పాకెట్స్ మరియు కూలింగ్ ఎఫెక్ట్ తో కూడిన ప్రకాశవంతమైన గ్లోవ్ బాక్స్ వంటి వాటితో అందుబాటులో ఉంది. వీటితో పాటు, ఇది 4 పవర్ విండోస్ ని కలిగి ఉంది. దీనిలో డ్రైవర్ సైడ్ అటో డౌన్ ఫంక్షన్ అందుబాటులో ఉంది. అలానే పిచ్ గార్డ్ ఫంక్షన్, పాడిల్ షిఫ్ట్, వన్ పుష్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, కీ లెస్ ఎంట్రీ తో సెంట్రల్ డోర్ లాకింగ్, కాంతిని సర్దుబాటుచేసుకోడానికి వీలుగా ఉండే ప్రకాశవంతమైన బహుళ సమాచార ప్రదర్శన మరియు అసిస్ట్ సిస్టమ్ నికలిగి ఉంటాయి. ఈ లక్షణాలు అన్నిటితో కలిపి దీనిలో డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

లోపలి సౌకర్యాలు :


కారు తయారీదారు ఈ మోడల్ సిరీస్ కి ఖరీదైన భావాన్ని ఇచ్చే అనేక అత్యుత్తమ లక్షణాలని అందించారు. దానివలన ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో ఇండిపెండెంట్ డ్యుయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ రేర్ ఏసి వెంట్లలో అందుబాటులో ఉంది. ఇంకా దీనిలో ఉన్న డస్ట్ మరియు పోలెన్ ఫిల్టర్ క్యాబిన్ గాలి శుద్ది పరిచేందుకుగానూ ఉపయోగపడుతుంది. దీనిలో ఫైవ్ అంగుళాల రంగు టచ్ స్క్రీన్ బహుళ సమాచార ప్రదర్శన ని కలిగి ఉంది. ఈ సమాచార వ్యవస్థ ఇంధన వినియోగం, డిజిటల్ గడియారం మరియు అనేక ఇతర అంశాలతో పొందుపరచబడింది. ఇది ఒక క్రూయిజ్ నియంత్రణ ఫంక్షన్ ని కలిగి ఉండడం వలన డ్రైవర్ ద్వారా ఒక స్థిరమైన స్పీడ్ ని నిలబెట్టేందుకు సహాయపడుతుంది. టిల్ట్ మరియు సర్దుబాటు స్టీరింగ్ వీల్ ఉండడం మూలాన ఇది రద్దీ రోడ్లపై కూడా వాహనాన్ని నియంత్రించగలదు. దీనిలో ప్రధమ శ్రేణి వేరియంట్లు ఏ.వి.ఎన్ సిస్టంతో 6.1 అంగుళాల టచ్స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఎస్ విసి(వేగం వాల్యూమ్ పరిహారం)ఫంక్షన్ తో పాటుగా రాబోతున్నది. ఇది డబ్ల్యుఎం ఎ / ఎంపి3 ప్లేయర్, ఎఫెం / ఎ ఎం రేడియో మరియు ఐ-పాడ్ మరియు యుఎస్ బి పరికరాల కోసం పోర్ట్లు వంటి లక్షణాలని కలిగి ఉన్నాయి. దీనిలో ఇతర వేరియంట్లు ఆధునిక 2-డిన్ మ్యూజిక్ ప్లేయర్ తో అమర్చబడినది. ఈ మ్యూజిక్ ప్లేయర్ సిడి / ఎంపి3 ప్లేయర్, ఎం /ఎఫెం ట్యూనర్ రేడియో, యుఎస్ బి / ఐ పాడ్ కనెక్టివిటీ మరియు ఆరు స్పీకర్లకి మద్దతు ఇస్తుంది. 4 వీల్ డ్రైవ్ ఏ.టి వేరియంట్ బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ని కలిగియుండి వాటిపై ఆడియో, క్రూయిజ్ మరియు కాల్ నియంత్రణ బటన్లను కలిగి ఉంటుంది. వీటితో పాటు, ఇది ఫుట్ రెస్ట్,అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్రైన్స్, గ్లోవ్ బాక్స్ లో సన్ గ్లాస్ హోల్డర్,వానిటి మిర్రర్స్ మరియు లైట్ తో కూడిన సన్ విజర్స్, మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. దీనిలో ప్రధమ శ్రేణి వేరియంట్లు రేర్ వ్యూ కెమేరా కలిగి ఉంటుంది. దీని యొక్క వివిద కోణాల దృశ్యాలను ముందర ఉన్న ఆడియో డిస్ప్లే లో చూడవచ్చు. దీనిలో ఇతర వేరియంట్లు ఏక వీక్షణని మాత్రమే ఐ-మిడ్ డిస్ప్లే లో చూడగలరు.

లోపలి కొలతలు:


ఈ మోడల్ సిరీస్ 2620mm వీల్బేస్ కలిగియున్న కారణంగా భారీ క్యాబిన్ స్పేస్ కలిగి ఉంది. ప్రయాణికులకి కూడా పుష్కలమైన హెడ్ మరియు షోల్డర్ స్పేస్ తో పాటూ తగినంత లెగ్ రూమ్ ఉన్నందున చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అధనంగా దీని బూట్ కంపార్ట్మెంట్ 589 లీటర్లు ఉంటుంది మరియు దీని వెనుక సీటుని మడవడం ద్వారా దీని బూట్ సామర్ధ్యం మరింత పెంచుకోవచ్చు. ఇది మంచి ఇంధన ట్యాంక్ ని కలిగి ఉండి 58 లీటర్ల డీజల్ వరకు నింపుకోవచ్చు. దీని వలన దూరపు ప్రయణాలు సులభ సాధ్యం.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సిరీస్ భారతీయ కారు మార్కెట్ లో స్టైలిష్ ఎస్ యు వి లో ఒకటి. ఇది రెండు పెట్రోల్ ఇంజిన్లలో వినియోగదారులకి అందుబాటులో ఉంది. దీనిలో 2 లీటర్ ఇన్ లైన్ పవర్ ప్లాంట్ 1997cc స్థానభ్రంశంతో వస్తుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు 16 కవాటాలు కలిగి ఉండి సింగిల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఇంజన్ 4300rpm వద్ద 190Nmటార్క్ ని మరియు 6500 rpm వద్ద 153.9bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2 వీల్ డ్రైవ్ ఎం టి వేరియంట్ ఆరు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడింది. అయితే 2 వీల్ డ్రైవ్ ఎ టి వేరియంట్ 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఇంజిన్ శక్తిని దాని ముందరి వీల్స్ కి పంపిణీ చేస్తుంది. మరోవైపు, 2.4 లీటర్ ఐ-వి టెక్ పెట్రోల్ ఇంజన్ 2354cc డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఈ పవర్ ప్లాంట్ 4400rpm వద్ద 226Nm టార్క్ తో పాటు 7000rpm వద్ద 187.4bhp శక్తి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ రెండు ఇంజన్లు ఒక పోగ్రామ్ ఇంధన ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థతో జతచేయబడి మంచి మైలేజ్ ని అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


దీని ఎగువ శ్రేణి వేరియంట్ నావిగేషన్ వ్యవస్థ, 6.1 అంగుళాల టచ్స్ర్కీన్ డిస్ప్లే తో పాటు వివిధ నియంత్రణలని కలిగి ఉంది. . అలాగే ఇది సిరి- ఐస్ ఫ్రీ వాయిస్ రికగ్నిషన్, హెచ్ డిఎంఐ వీడియో కంపాటిబిలిటీ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ని కలిగి ఉంది. ఇతర వేరియంట్స్ స్పీడ్ వాల్యూమ్ కంపన్సేషన్ తో ఒక సమగ్ర సంగీత వ్యవస్థ ని కలిగి ఉంటాయి. ఆడియో కంట్రోల్స్ యూనిట్ డ్రైవర్ కోసం చాలా సౌకర్యవంతంగా చుట్టబడిన స్టీరింగ్ వీల్ పై అమర్చబడి ఉంటాయి. యజమానులు కూడా స్ప్లాష్ గార్డ్లు, హుడ్ ఎయిర్ డెఫ్లెక్టర్, ఫాగ్ లైట్ కిట్, ఎగ్జాస్ట్ ఫినిషర్, డోర్ విజర్స్, ఫ్లోర్ మ్యాట్స్, కార్గో నెట్, వెనుక సీట్ కవర్లు మరియు వంటి కొన్ని అదనపు లక్షణాలు కలిగి ఉంటారు.

వీల్స్ పరిమాణం:


దీని వీల్ ఆర్చ్లు 17 అంగుళాల, 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ సమితి తో బిగించబడి సొగసైన రూపాన్ని ఇస్తుంది. ఈ రిమ్స్ మరింత 225/65 R17 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. ఈ సంస్థ ఒక స్పేర్ వీల్ తో పాటూ టైర్ మార్చుకునేందుకు ఇతర టూల్స్ ని కూడా అందిస్తుంది. ఇది అన్ని రూపాంతరాలలో ఒక ప్రామాణిక అంశం.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


తయరీదారుడు ఈ వాహనానికి సమర్ధవంతమైనబ్రేకింగ్ సిష్టం ని అందించారు. అలానే దీని అన్ని వీల్స్ సాలిడ్ డిస్క్ బ్రేక్లు సమితి కలిగి ఉన్నాయి. ఈ బ్రేకింగ్ మెకానిజం ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటూ ఏంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని కలిగి ఉంది. ఇది అత్యవసర బ్రేకింగ్ సమయంలో వాహనం అదుపు తప్పకుండా సహాయపడుతుంది. వీటితో పాటూ హిల్ స్టార్ట్ ఎసిస్ట్ మరియు వెహికిల్ స్టెబిలిటి అదనపు భద్రత కోసం అందించడం జరిగింది. ఇంకోపక్క, దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అమర్చబడి ఉంటుంది. అలానే దీని వెనుక ఆక్సిల్ డబుల్ విష్బోన్ టైప్ మెకానిజం ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఆక్సిల్స్ తరువాత కాయిల్ స్ప్రింగ్స్ మరియు యాంటీ రోల్ బార్ తో అమర్చబడి ఉంటుంది. ఇది చలన అనుకూల ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ ని కూడా కలిగి ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం కి జి- ఫోర్స్ నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం (జి-సి ఓ న్) తో పాటు (ఆధునిక అనుకూలత ఇంజనీరింగ్) శరీర నిర్మాణం ఇవ్వడం జరిగింది. ఇది ఎటువంటి సందర్భంలో అయిన వాహనం క్రాష్ అయినపుడు ప్రయాణికులు సురక్షితంగా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు, ఇవి స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, పార్కింగ్ బ్రేక్, ప్రయాణికులకు మరియు డ్రైవర్ కొరకు 3-పాయింట్ సీటు బెల్ట్ మరియు కీ లెస్ ఎంట్రీ తో పాటూ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి వాటిని భద్రత కొరకు చేర్చడం జరిగింది. ఇవేకాకుండా ఎస్ ఆర్ ఎస్ ఎయిర్బ్యాగ్స్ పక్కన మరియు కర్టెన్ ఎయిర్బ్యాగ్స్ ప్రయాణికుల రక్షణ కొరకు అందుబాటులో ఉన్నాయి. ఇది వెహికెల్ స్టెబిలిటీ ఎసిస్ట్ ఫంక్షన్, ఇ బి డి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో పాటూ ఎ బి ఎస్( ఏంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు హ్యాండ్ లివర్ టైప్ పార్కింగ్ బ్రేక్ వంటి వాటిని కలిగి ఉంది. ఇవి పక్కన పెడితే దీనిలో బేస్ వేరియంట్, ఇతర వేరియంట్స్ హిల్ స్టార్ట్ ఎసిస్ట్ ఫంక్షన్ తో అనుసంధానం చేయబడినది. ఇది ఒక ఆధునిక ఇంజిన్ ఇమ్మొబలైజర్ ని కలిగి ఉంటుంది. దీని ద్వారా అనధికార ఎంట్రీ ని తొలగిస్తుంది. వీటితోపాటు, ఇది రేర్ వ్యూ కెమెరా తో పాటూ రేర్ పార్కింగ్ సెన్సార్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, డిఫాగర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది.

అనుకూలాలు:


1. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ మరియు వీల్ బేస్ కలిగి ఉంటుంది.
2. మంచి త్వరణం మరియు పికప్ తో ఇంజిన్ పనితీరు బాగుంటుంది.
3. కాబిన్ విశాలంగా ఉండి అనేక సౌకర్యవంతమైన అంశాలను కలిగి ఉంటుంది.
4. ఆకర్షణీయమైన బాహ్య స్వరూపం దీనికి ఒక అనుకూలత.
5. అమ్మకాల తర్వాత సేవ చాలా సంతృప్తిని ఇస్తుంది.

ప్రతికూలాలు:


1.భారీ ట్రాఫిక్ పరిస్థితుల సమయంలో నిర్వహణ కష్టం.
2. ఇంధన సామర్ధ్యం ఆశించినంతగా లేకపోవడం ఒక ప్రతికూలత.
3. యాజమాన్య ప్రారంభ ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
4. సన్రూఫ్ మరియు నావిగేషన్ సిస్టమ్ ప్రామాణికంగా ఇవ్వకపోవడం ఒక ప్రతికూలత.
5. దాని లోపలి ఆకృతిని ఇంకా మెరుగుపరచవలసి ఉంది.