ఫోర్డ్ ఫియస్టా

` 8.8 - 10.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

ఫోర్డ్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

ఫోర్డ్ ఫియస్టా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ఈ సంస్థ యు.ఎస్.ఎ ఆధారిత ఆటోమొబైల్ తయారీసంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కారు మార్కెట్లలో స్థాపించబడినది. ఈ మార్కెట్ లో చాలా అద్భుతమైన వాహనాలు ఉన్నాయి. వాటిలో, ఫోర్డ్ ఫియస్టా సంస్థ యొక్క చాలా ప్రాముఖ్యత చెందిన వాహనం. దీని కాంపాక్ట్ పరిమాణం మరియు పనితీరు గల శక్తిమంతమైన ఇంజిన్, నగర రోడ్లకి తగ్గట్టుగా ఉంటుంది. సంస్థ దీనిని మూడు వేరియంట్లలో అమ్మకాలు చేస్తుంది. దానిలో మొదటిది ఏంబియంట్, రెండవది ట్రెండ్ మరియు మూడవది టైటానియం. ఈ అన్ని వేరియంట్లు 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ కలిగి ఉండి అత్యుత్తమ పనితీరు ని అందిస్తుంది. ఇది ఎస్ ఒ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారం గా పనిచేస్తూ 89.75bhp శక్తిని మరియు 240Nm టార్క్ ని గరిష్టంగా ఉత్పత్తి చేస్తుంది. అత్యుత్తమమైన బ్రేకింగ్ విధానంతో అమర్చబడి ఉంది. దీనిలో ఏంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా ఉంటుంది. దీనిలో సస్పెన్షన్ విధానం చాలా నైపుణ్యం గలది. అసమాన రోడ్లపై కూడా వాహనాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. దీని బూట్ సామర్ధ్యం 430 లీటర్స్. వెనుక సీట్లు మడవడం ద్వారా దీని బూట్ సామర్ధ్యాన్ని మరింత పెంచవచ్చు. దీని ఇంధన ట్యాంక్ 40 లీటర్లు డీజిల్ పట్టే విధంగా ఉంటుంది. దీని వలన దూరపు ప్రయాణాలు సులభ సాధ్యం అవుతాయి. ఈ మోడల్ సిరీస్ లో అనేక భద్రతా లక్షణాలు ఉన్నాయి. ఇవి వాహనం లో ప్రయాణించే ప్రయాణికులకి మాత్రమే కాకుండా వాహనాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుతాయి. దీనిలో బేస్ వేరియంట్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ తో అందుబాటులో ఉండగా మిగతా రెండు వేరియంట్లు డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ సిరీస్‌లో అన్ని వేరియంట్స్ కుడా ఏదినా ప్రమాదం జరిగేటప్పుడు వచ్చే షాకులని తట్టుకోగలిగే బంపర్స్ మరియు డోర్ రెయిన్ ఫోర్స్ మెంట్ తో పాటుగా క్రుంపల్ జోన్స్ ని కలిగి ఉంటాయి. వీటితోపాటు, ఇది ఏంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా ఉంది. అలానే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, గ్రీటింగ్ ల్యాంప్స్ తో రిమోట్ ప్రోగ్రామబుల్ కీ ఎంట్రీ , వెనుక డోర్లకి చైల్డ్ లాక్స్ మరియు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ , ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ తో పాటు ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల ఇ ఎల్ ఆర్ సీటు బెల్ట్ , ఇంజిన్ ఇమ్మొబలైజర్ ని వంటి బద్రతా లక్షణాలని కలిగి ఉంది. మరోవైపు దీని అంతర్గత కాబిన్ విశాలంగా మరియు డ్యుయల్ టోన్ రంగు స్కీమ్ లో రూపొందించబడింది. ఈ వాహనం అనేక ఆధునిక లక్షణాలతో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.

సీటింగ్ పరంగా, సంస్థ కాబిన్ లో కుషన్ మరియు అధిక నాణ్యత వస్త్రం ఆధారంగా చేయబడిన లెథర్ తో కప్పబడి ఉంటుంది. దీని వెనుక భాగంలో మడవగలిగే సీట్లు ఉన్న కారణంగా లోపల మరింత సామాను పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. దీనిలో టిల్ట్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉన్న కారణంగా ట్రాఫిక్ అధికంగా ఉండే పరిస్థితులలో డ్రైవర్ కి శ్రమ తగ్గుతుంది. దీనిలో అధునాతనమైన సంగీత వ్యవస్థ సిడి, ఎంపి3 ప్లేయర్, మరియు ఆరు ఉన్నతమైన నాణ్యత గల స్పీకర్ల తో పాటూ ఎ ఎం/ ఎఫ్ ఎం రేడియో ట్యూనర్ ని కలిగి ఉంది. అంతేకాకుండా ఇది ఆక్స్-ఇన్ పోర్ట్ మరియు బ్లూటూత్ తో పాటుగా యు ఎస్ బి కనెక్షన్లను కలిగి ఉంది. ఇది దాని డ్రైవర్ సౌలభ్యం కోసం ఆడియో మరియు కాల్ నియంత్రణ బటన్లను కలిగియున్న ఒక బహుళ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, గైడ్ మి హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఫుట్ వెల్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్, ఇంధన కంప్యూటర్, డిజిటల్ గడియారం కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ ట్రిప్‌మీటర్, డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక ల్యాంప్, టాకొమీటర్, తక్కువ ఇంధన వినియోగం అలాగే వార్నింగ్ నోటిఫికేషన్ పైన హెడ్‌ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది "ఏప్ లింక్" అనే ఫంక్షన్ ను కూడా కలిగి ఉంది. ఈ ఫంక్షన్ ఒక సాధారణ వాయిస్ కమాండ్ తో స్మార్ట్‌ఫోన్ కి కనెక్ట్ అయ్యేందుకుగాను సహాయపడుతుంది. ఇది ఒక నైపుణ్యం గల ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ తో అమర్చబడి కాబిన్ అంతా చల్లబరించేందుకు దోహదం చేస్తుంది. ఈ మోడల్ సిరీస్ అంతర్గత విభాగం ఆకర్షణీయమైన డ్యుయల్ టోన్ రంగు పథకం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించే అనేక ఆధునిక లక్షణాలను కలిగి ఉంది. ఇది నీలం రంగుతో ప్రకాశించే అధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ ని మరియు లెదర్ తో చుట్టబడిన అందమైన స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంది. ఈ సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్ అలాగే లేత గోధుమరంగు రంగు ఫాబ్రిక్ అపోలిస్ట్రీ కారణంగా దీని అంతర్భాగాలు క్లాసీ గా కనిపిస్తాయి. మరోవైపు, 15 అంగుళాల అలాయ్ వీల్స్, లెదర్ గేర్ నాబ్, లెదర్ కవర్ సీట్లు, స్పోర్టి పెడల్స్, నిల్వ స్పేస్ తో ఆర్మ్‌రెస్ట్‌లు, ప్రకాశవంతమైన డోర్ స్కఫ్ ప్లేట్లు, అందమైన శరీర గ్రాఫిక్స్, క్రోమ్ ప్యాకేజీ, పిల్లల సీట్లు మరియు అనేక ఇతర అంశాలను సౌలభ్యం కొరకు కలిగి ఉంది. దీనిలో పుష్కల లెగ్ మరియు భుజం స్పేస్ అందించే కుషన్ సీట్లు ఉన్నాయి.

దీని కాక్‌పిట్ విభాగంలో డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్ నలుపు రంగుతో తయారైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చుడడానికి హుందాగా కనిపిస్తుంది. వీటిలో ఇంకా పెద్ద గ్లోవ్ బాక్స్, ఒక ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్, ఏ సి వెంట్లు, బహుళ ఫంక్షనల్ స్విచ్‌లు కలిగియున్న మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి చాలా లక్షణాలు అమర్చారు. వీటితోపాటు, దీనిలో కప్ హోల్డర్లు, పత్రిక హోల్డర్లు మరియు వంటి కొన్ని నిల్వ స్థలాలు ఉన్నాయి. బాహ్య భాగానికి వస్తే ఇది దృడమైన శరీరాకృతితో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని పక్క భాగానికి వస్తే, శరీర రంగు డోర్ హ్యాండిల్స్ ని కలిగి ఉంటాయి. డోర్ మిర్రర్స్ శరీర రంగులో ఉండి సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అమర్చబడి ఉంటాయి. అలానే ఆకర్షణీయమైన వీల్ ఆర్చులు మరియు బి పిల్లర్ చాలా హుందాగాకనిపించేలా చేస్తాయి. దీని వెనుక భాగం శరీర రంగు బంపర్, రకాశవంతమైన టైల్ లైట్ క్లస్టర్, మరియు హాలోజెన్ ఆధారిత ల్యాంప్స్ ని కలిగి ఉంటాయి. దీని ముందరి భాగానికి వస్తే ఈ సెడాన్ అద్భుతమైన లక్షణాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది విస్తృత క్రోమ్ ఆధారిత రేడియేటర్ గ్రిల్, ఐదు సమాంతర మెటాలిక్ స్ట్రిప్స్ మరియు దాని పైన సంస్థ యొక్క చిహ్నం తో అమర్చబడి వస్తుంది. ఈ వాహనం ప్రస్తుతం వినియోగదారులు ఎంచుకోవడానికి కొన్ని ఆకర్షణీయమైన శరీర రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఈ లక్షణాలు అన్నీ కలిసి ఈ వాహనాన్ని చాలా ఆకర్షణీయంగా చేస్తున్నాయి. ఈ వాహనం ప్రత్యేక విభాగంలో హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, టాటా జెస్త్, చెవ్రొలెట్ సెయిల్ , ఫియట్ లీనియా, మారుతి సియాజ్, నిస్సాన్ సన్నీ మరియు కొన్ని ఇతర వాహనాలతో పొటీ పడుతుంది. మరోవైపు, ఇది ఒక సంవత్సరం లేదా 100000 కిలోమీటర్లు ప్రామాణిక వారంటీ తో అందుబాటులో ఉంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఇది ఒక సాధారణ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థను కలిగియున్న 1.5-లీటర్ టర్బో చార్జెడ్ డీజిల్ ఇంజన్ తో అమర్చబడి ఉంది. ఇది ప్రామాణిక డ్రైవింగ్ పరిస్థితులలో హత్తుకొనే ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశం యొక్క ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ ద్వారా సర్టిఫికేట్ పొందింది. ఇది పెద్ద రహదారులలో 25.01kmpl మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో,ఇది నగర రోడ్లపై 20.02kmpl మైలేజ్ అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ డీజిల్ ఇంజిన్ 3750rpm వద్ద 89.75bhp గరిష్ట శక్తిని మరియు 2000 నుండి 2750rpm వద్ద 204Nm టార్క్ ని ఇండియన్ రహదారి మరియు ట్రాఫిక్ పరిస్థితులలో అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సహాయంతో, ఈ పవర్ ప్లాంట్ సుమారు 160 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. అదే సమయంలో, 12 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


ఈ అద్భుతమైన సెడాన్ ఏరోడైనమిక్ శరీర నిర్మాణంతో వస్తుంది. ఇది అత్యుత్తమమైన లక్షణాలతో అసమాన రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించగలదు. దీని ముందరి భాగానికి వస్తే ఈ సెడాన్ అద్భుతమైన లక్షణాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది విస్తృత క్రోమ్ ఆధారిత రేడియేటర్ గ్రిల్, ఐదు సమాంతర మెటాలిక్ స్ట్రిప్స్ మరియు దాని పైన సంస్థ యొక్క చిహ్నం తో అమర్చబడి వస్తుంది. నక్క కంటి ఆకారంలో ఉన్న హెడ్ లైట్ క్లస్టర్ లో ట్విన్ చాంబర్ ప్రకాశవంతమైన రిఫ్లెక్టర్ ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ అమర్చబడి ఉంటాయి. దీని బోనెట్ పైన ఉన్న గీతలు వలన చూడడానికి స్టయిలిష్ గా కనిపిస్తుంది. బోనెట్ కింద శరీర రంగు బంపర్ విస్ర్తుతమైన ఎయిర్ డ్యామ్ తో అమర్చబడి ఉంది. ఇది ఇంజిన్ ని తొందరగా చల్లపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఇవి ఒక జత ప్రకాశవంతమైన వలయాకారపు ఫాగ్ ల్యాంప్స్ ని కూడా కలిగి ఉంది. దీని ద్వారా చెడు వాతావరణ పరిస్థితుల్లో, అన్నీ స్పష్టంగా కనిపించేలా ప్రత్యక్షత పెంచుతుంది. దీనిలో విండ్‌స్క్రీన్ లామినేటెడ్ గాజుతో తయారుచేయబడి ఒక జత వైపర్స్ ని కలిగి ఉంటుంది. దీని పక్క భాగానికి వస్తే, శరీర రంగు డోర్ హ్యాండిల్స్ ని కలిగి ఉంటాయి. డోర్ మిర్రర్స్ శరీర రంగులో ఉండి సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అమర్చబడి ఉంటాయి. అలాగే ఈ సైడ్ టర్న్ ఇండికేటర్స్ విద్యుత్‌తో సర్దుబాటు చేయగలిగేలా వస్తుంది. దీని ఎగువ శ్రేణి వేరియంట్లలో వీల్ ఆర్చులు అల్లాయ్ వీల్స్ సమితితో బిగించబడి ఉంటాయి. అయితే దీని ఇతర వేరియంట్లలో వీల్ ఆర్చులు స్టీల్ చక్రాలు సమితి కలిగి ఉంటాయి. తరువాత దీని రిమ్స్ అధిక పనితీరు గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లు తో కప్పబడతాయి. దీని వలన రోడ్లపై వాహనానికి మంచి గ్రిప్ వస్తుంది. క్రోం పూతతో చేయబడిన విండో సిల్ వాహనానికి స్టయిలిష్ లుక్ ఇస్తుంది. దీని వెనుక భాగం ప్రకాశవంతమైన ల్యాంప్స్ కలిగిన టెయిల్ లైట్ క్లస్టర్ మరియు సైడ్ టర్న్ ఇండికేటర్లతో వస్తుంది. దీని వెనుక బంపర్ పైన క్రోమ్ పూతతో చేయబడిన స్ట్రిప్ మరియు పార్కింగ్ సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి. దీని బూట్ మూత వేరియంట్ బాడ్జింగ్ మరియు లైసెన్స్ ప్లేట్ తో ఉంటుంది. ఈ లక్షణాలు ఆన్నీ కలిపి వాహనాన్ని అత్యుత్తమైన వాహనం గా చేస్తున్నాయి.

వెలుపలి కొలతలు:


ఈ సెడాన్ యొక్క ఆధునిక వెర్షన్ 4320mm పొడవు మరియు 1764mm వెడల్పు ని కలిగి ఉంది. అలానే ఇది 1486mm ఎత్తు కలిగి ఉండి ప్రయాణికులకి సరిపడినంత హెడ్ రూమ్ ని కలిగి ఉంది. ఈ వాహనం 2489mm వీల్‌బేస్ ని కలిగియుండి విశాలమైన లెగ్ స్పేస్ మరియు షోల్డర్ రూమ్ తో అందుబాటులో ఉంది. దీని ముందరి ట్రాక్ 1475mm అలానే దీని వెనుక ట్రాక్ 1462mm. దీని స్టీరింగ్ వీల్ టర్నింగ్ వ్యాసార్థం 5.2 మీటర్లు.

లోపలి డిజైన్:


ఈ సెడాన్ లో అంతర్గత కాబిన్ విశాలంగా మరియు డ్యుయల్ టోన్ (బొగ్గు నలుపు మరియు లైట్ బూడిద) రంగు స్కీమ్ లో రూపొందించబడింది. ఈ వాహనం అనేక ఆధునిక లక్షణాలతో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. సీటింగ్ పరంగా, సంస్థ కాబిన్ లో కుషన్ మరియు అధిక నాణ్యత వస్త్రం ఆధారంగా చేయబడిన లెథర్ తో కప్పబడి ఉంటుంది. దీని వెనుక భాగంలో మడవగలిగే సీట్లు ఉన్న కారణంగా లోపల మరింత సామాను పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. అలానే దీనిలో డ్రైవర్ సీటు ఎత్తుని సద్దుబాటు చేసుకోగల సౌకర్యం ఉంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో లోపల డోర్ హ్యాండిల్స్ మరియు సెంట్రల్ కన్సోల్ రాయల్ బ్లాక్ మెటాలిక్ పెయింట్ తో అలంకరించబడి ఉంటుంది. దీని బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు పెగాసస్ మరియు క్యాస్ట్రో సిల్వర్ తో ఫినిషింగ్ చేయబడ్డాయి. దీని కాక్‌పిట్ విభాగంలో డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్ నలుపు రంగుతో తయారైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చుడడానికి హుందాగా కనిపిస్తుంది. వీటిలో ఇంకా పెద్ద గ్లోవ్ బాక్స్, ఒక ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్, ఏ సి వెంట్లు, బహుళ ఫంక్షనల్ స్విచ్‌లు కలిగియున్న మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి చాలా లక్షణాలు అమర్చారు. అలానే దీనిలో ప్రయాణికులకి వినోదం పంచేందుకు అధునాతన సంగీత వ్యవస్థ ఉంది. అంతేకాకుండా, గైడ్ మి హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఫుట్ వెల్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్, ఇంధన కంప్యూటర్, డిజిటల్ గడియారం కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ ట్రిప్‌మీటర్, డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక ల్యాంప్, టాకొమీటర్, తక్కువ ఇంధన వినియోగం అలాగే వార్నింగ్ నోటిఫికేషన్ పైన హెడ్‌ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలో విశాలమైన గ్లోవ్ బాక్స్ కంపార్ట్మెంట్ ఉంది. అంతేకాకుండా డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల వైపు ఒక నిల్వ కంపార్ట్మెంట్ కుడా ఉంది.

లోపలి సౌకర్యలు:


ఈ సెడాన్ సిరీస్ ఆధునికమైన సౌకర్య లక్షణాలతో ప్రయాణికులకి ఆహ్లాదం కలిగించే విదంగా ఉన్నాయి. దీని ఏంబియంట్ వేరియంట్లో మాన్యువల్ హెచ్ విఎసి(తాపన, ప్రసరణ మరియు ఎయిర్ కండిషనింగ్) వస్తుంది. అలానే దీని ఇతర వేరియంట్లు ఆటోమేటిక్ ఏ.సి యూనిట్ తో వస్తాయి. దీని ఎంట్రీ లెవెల్ మరియు మధ్య స్థాయి వేరియంట్లు విద్యుత్‌తో సర్దుబాటు బాహ్య అద్దాలతో వస్తాయి. దీని ఎగువ శ్రేణి వేరియంట్లలో ఈ అద్దాలు మడుచుకునేందుకు వీలుగా ఉంటాయి. దీని ఎగువ శ్రేణి వేరియంట్లలో ఉన్న రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ద్వారా పార్కింగ్ సులభం అవుతుంది. దీనిలో ఉన్న సమాచార వ్యవస్థ వలన ప్రయాణికులకి వారి ప్రయాణం అంతటా వినోదం లభిస్తుంది. ఇది డ్రైవర్ వైపు ఉన్న వన్ టచ్ ఆపరేషన్ తో కారు నాలుగు డోర్లు ఆపరేట్ అవుతాయి. దీని వెనుక భాగంలో మడవగలిగే సీట్లు ఉన్న కారణంగా లోపల మరింత సామాను పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. దీనిలో అధునాతనమైన సంగీత వ్యవస్థ సిడి, ఎంపి3 ప్లేయర్, మరియు ఆరు ఉన్నతమైన నాణ్యత గల స్పీకర్ల తో పాటూ ఎ ఎం/ ఎఫ్ ఎం రేడియో ట్యూనర్ ని కలిగి ఉంది. అంతేకాకుండా ఇది ఆక్స్-ఇన్ పోర్ట్ మరియు బ్లూటూత్ తో పాటుగా యు ఎస్ బి కనెక్షన్లను కలిగి ఉంది. ఇది దాని డ్రైవర్ సౌలభ్యం కోసం ఆడియో మరియు కాల్ నియంత్రణ బటన్లను కలిగియున్న ఒక బహుళ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంది. దీని ఎగువ శ్రేణి వేరియంట్లలో వాయిస్ నియంత్రణ వ్యవస్థ అదనపు సౌకర్యం కోసం చేర్చబడినది. ఇంకా దీనిలో 12 వి పవర్ సాకెట్ మొబైల్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కోసం సెంటర్ కన్సోల్ లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, గైడ్ మి హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఫుట్ వెల్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్, ఇంధన కంప్యూటర్, డిజిటల్ గడియారం కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ ట్రిప్‌మీటర్, డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక ల్యాంప్, టాకొమీటర్, తక్కువ ఇంధన వినియోగం అలాగే వార్నింగ్ నోటిఫికేషన్ పైన హెడ్‌ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటూ ఏంబియంట్ లైటింగ్, వైపర్స్, విద్యుత్ బూట్ విడుదల, ఎత్తు సర్దుబాటు సీటు బెల్టులు, సర్దుబాటు వెనుక హెడ్ రెస్ట్లు మరియు టిల్ట్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉంది.

లోపలి కొలతలు:


ఈ సెడాన్ విశాలవంతమైన క్యాబిన్ కలిగి ఉండి ఐదుగురు వ్యక్తులు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుంది. దీని వెడల్పు కారణంగా తగినంత షోల్డర్ స్పేస్ ని కలిగి ఉంది. అలానే దీని లెగ్ రూమ్ మరియు హెడ్ రూమ్ విశాలంగా ఉండి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీని బూట్ సామర్ధ్యం 430 లీటర్స్. వెనుక సీట్లు మడవడం ద్వారా దీని బూట్ సామర్ధ్యాన్ని మరింత పెంచవచ్చు. దీని ఇంధన ట్యాంక్ 40 లీటర్లు డీజిల్ పట్టే విధంగా ఉంటుంది. దీని వలన దూరపు ప్రయాణాలు సులభ సాధ్యం.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


బోనెట్ కింద, ఈ మోడల్ సిరీస్ 1.5-లీటర్, ఇన్-లైన్ డీజిల్ ఇంజన్ తో బిగించబడి 1498cc స్థానభ్రంశాన్ని ఇస్తుంది. ఇది ఎనిమిది కవాటాలు కలిగినటువంటి నాలుగు సిలిండర్లతో అమర్చబడి ఉంది. ఇది సింగిల్ ఓవర్‌హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది మరియు టిడిసి ఐ ఇంధన సరఫరా వ్యవస్థ ను కలిగి ఉంది. ఈ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జతచేయబడి సులభంగా గేర్ మార్పులు చేసుకునేందుకు సహాయపడుతుంది. ఈ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ వ్యవస్థ ఇంజిన్ శక్తి ని దాని ముందరి వీల్స్ కి పంపిణీ చేస్తుంది. ఇది గరిష్టంగా 3750rpm వద్ద 89.75bhp శక్తిని మరియు 2000 నుండి 2750rpm మధ్య 204Nm టార్క్ ని అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


సంస్థ ఈ మోడల్ సిరీస్ కి అధునాతనమైన సంగీత వ్యవస్థని ఇచ్చింది. దీని ద్వారా ప్రయాణికులకి మంచి వినోదం లభిస్తుంది. ఈ వ్యవస్థ సిడి, ఎంపి3 ప్లేయర్, మరియు ఆరు ఉన్నతమైన నాణ్యత గల స్పీకర్ల తో పాటూ ఎ ఎం/ ఎఫ్ ఎం రేడియో ట్యూనర్ ని కలిగి ఉంది. అంతేకాకుండా ఇది ఆక్స్-ఇన్ పోర్ట్ మరియు బ్లూటూత్ తో పాటుగా యు ఎస్ బి కనెక్షన్లను కలిగి ఉంది. అంతేకాక, దీని ఎగువ శ్రేణి వేరియంట్లలో వాయిస్ నియంత్రణ వ్యవస్థ అదనపు సౌకర్యం కోసం చేర్చబడినది. మరోవైపు, 15 అంగుళాల అలాయ్ వీల్స్, లెదర్ గేర్ నాబ్, లెదర్ కవర్ సీట్లు, స్పోర్టి పెడల్స్, నిల్వ స్పేస్ తో ఆర్మ్‌రెస్ట్‌లు, ప్రకాశవంతమైన డోర్ స్కఫ్ ప్లేట్లు, అందమైన శరీర గ్రాఫిక్స్, క్రోమ్ ప్యాకేజీ, పిల్లల సీట్లు మరియు అనేక ఇతర అంశాలను సౌలభ్యం కొరకు కలిగి ఉంది.

వీల్స్ పరిమాణం:


దీని బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లలో వీల్ ఆర్చులు 15 అంగుళాల స్టీలు చక్రాల సమితితో చేయబడ్డాయి. అయితే దీని ఎగువ శ్రేణి వేరియంట్లు 5 ట్విన్ స్టార్ స్పోక్ తో డిజైన్ చేయబడ్డ 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో అమర్చారు. దీని రిమ్స్ అధిక పనితీరు కలిగిన 195/60R15 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లు తో కప్పబడ్డాయి. ఇది రోడ్ పైన వాహనానికి మంచి గ్రిప్ ని అందిస్తుంది. అధనంగా దీనిలో స్పేర్ వీల్ బూట్ కంపార్ట్మెంట్ లో ఉంచుతారు. దీనితో పాటుగా టైర్ ని మార్చుకునేందుకు కావలసిన టూల్స్ ని బూట్ కంపార్ట్మెంట్ లో ఉంచడం జరుగుతుంది. ఇది అన్ని వేరియంట్స్ కి సాధారణ లక్షణం.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


సంస్థ దీనికి అత్యుత్తమమైన బ్రేకింగ్ విధానం ఇచ్చింది. దీనిలో ఏంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా ఉండడం మరింత జనాధారణను పెంచుకుంది. ఈ వ్యవస్థ ఉండడం మూలాన వాహనం అసమాంతర రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించగలదు. ఇవి ఏ వాహనంలోనైనా సాధారణం గా ఉండే అంశాలు. ఈ సంస్థ ఈ బ్రేకింగ్ విషయంలో మరింత జాగ్రత తీసుకుంది. దీని ముందరి చక్రాలు అధిక పనితీరు కలిగిన వెంటిలేషన్ డిస్కులతో అలానే దీని వెనుక చక్రాలు డ్రమ్ బ్రేక్‌ల సమితితో బిగించబడ్డాయి. మరోవైపు, దీని ముందరి ఆక్సిల్, కాయిల్ స్ప్రింగ్ మరియు యాంటీ రోల్ బార్ తో ఉన్న మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అమర్చబడ్డాయి. అలానే దీని వెనుక ఆక్సిల్, గ్యాస్ మరియు చమురు తో నిండి ఉన్న ట్విన్ షాక్అబ్జార్బర్స్ కలిగియున్న సెమీ ఇండిపెండెంట్ ట్విస్ట్ బీమ్ తో బిగించబడింది. ఇంకా, ఇది ఎలక్ట్రానిక్ పవర్ ఎసిస్టెడ్ స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంది. ఇది ఉండడం వలన అత్యధిక ట్రాఫిక్ పరిస్థితులలో సులభంగా వాహనాన్ని నియంత్రిచవచ్చు. దీనిలో టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ 5.2 మీటర్ల టర్నింగ్ వ్యాసార్ధం కలిగి ఉంటుంది. దీని వలన వాహనాన్ని టర్న్ చేసేటప్పుడు డ్రైవర్ యొక్క శ్రమ తగ్గుతుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ మోడల్ సిరీస్ లో అనేక భద్రతా లక్షణాలు ఉన్నాయి. ఇవి వాహనం లో ప్రయాణించే ప్రయాణికులకి మాత్రమే కాకుండా వాహనాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుతాయి. దీనిలో బేస్ వేరియంట్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ తో అందుబాటులో ఉండగా మిగతా రెండు వేరియంట్లు డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ సిరీస్‌లో అన్ని వేరియంట్స్ కుడా ఏదినా ప్రమాదం జరిగేటప్పుడు వచ్చే షాకులని తట్టుకోగలిగే బంపర్స్ మరియు డోర్ రెయిన్ ఫోర్స్ మెంట్ తో పాటుగా క్రుంపల్ జోన్స్ ని కలిగి ఉంటాయి. వీటితోపాటు, ఇది ఏంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటుగా ఉంది. అలానే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, గ్రీటింగ్ ల్యాంప్స్ తో రిమోట్ ప్రోగ్రామబుల్ కీ ఎంట్రీ , వెనుక డోర్లకి చైల్డ్ లాక్స్ మరియు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇవన్నీ కుడా వాహనానికి మరింత భద్రతని చేకూరుస్తాయి. ఇది ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ తో పాటు ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల ఇ ఎల్ ఆర్ సీటు బెల్ట్ ని కలిగి ఉంది. వీటితో పాటు, ఇది ఇంజిన్ ఇమ్మొబలైజర్ ని కలిగి ఉంది. ఈ భద్రతా లక్షణాలన్నీ కలిసి వాహనానికి మరింత భద్రత చేకూరుస్తాయి.

అనుకూలాలు:


1. దీని ఆధునిక బాహ్య భాగాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
2. దీని త్వరణం మరియు పికప్ ఉత్తమంగా ఉంటుంది.
3. దీని నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడం దీనికి అనుకూలత.
4. ఇంధన సామర్ధ్యం కావలసిన స్థాయిలో ఉంది.
5. దీని శరీర బలం బోరాన్ స్టీల్ చేర్చడం ద్వారా మరింత పెరిగింది.

ప్రతికూలాలు:


1. దీని ప్రారంభ యాజమాన్య ఖర్చు అధికంగా ఉండడం దీనికి ప్రతికూలత
2. దీని బేస్ వేరియంట్లలో మ్యూజిక్ సిస్టమ్ లేకపోవడం దీనికి ఒక ప్రతికూలత.
3. చాలా ఇతర అంశాలు జోడించవచ్చు.
4. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండడం దీనికి ప్రతికూలత.
5. దీనిలో ఎన్ హెచ్ వి స్థాయిలు తగ్గించవలసిన అవసరం ఉంది.