ఫోర్డ్ ఎండీవర్

` 22.1 - 31.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

ఫోర్డ్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

ఫోర్డ్ ఎండీవర్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ఫోర్డ్ ఎండీవర్ భారతదేశం లో చాలా బాగా పేరున్న ఒక లగ్జరి ఎస్యూవి మోడల్. ఇది దాని యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తో దాని వెలుపల మరియు అంతర్గతంగా అనేక నవీకరణలతో దేశంలో ప్రారంభించబడింది. అయితే, దాని సాంకేతిక వివరాలు మరియు లక్షణాలు మాత్రం ఔట్ గోయింగ్ మోడల్ లో లక్షణాలను పోలి ఉన్నాయి. కార్ల తయారీ సంస్థ మొత్తం మోడల్ సిరీస్ ను వెలుపల మరియు అంతర్గత దృష్ట్యా పునశ్చరణ చేసింది. ప్రస్తుతం, కొనుగోలుదారులు ఎంచుకోవడానికి 3 ఎస్యూవి ట్రిమ్స్ స్థాయిల్లో అందుబాటులో ఉంది. దాని యొక్క ప్రవేశ స్థాయి వేరియంట్ ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో జతగా ఒక 2.5-లీటర్ ఇంజన్ తో అందించబడుతుంది. అయితే దీని మధ్య మరియు టాప్ ఎండ్ వేరియంట్స్ ను శక్తివంతమైన 3.0 లీటర్ ఇంజిన్ తో అమర్చారు. ఇది ఒక అధునాతన 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో అనుసంధానం చేశారు. దాని యొక్క టాప్ ఎండ్ వెర్షన్ 4x4 ఎంపికను కలిగి , అది ఎలక్ట్రిక్ షిఫ్ట్-ఆన్ ఫ్లై ఫంక్షన్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఇది, 2డబ్ల్యూ డి మరియు 4 డబ్ల్యూ డి ఎంపికలతో అందుబాటులో ఉంది. అదే సమయంలో, ఈ వాహనం కూడా ఒక మెరుగైన ఉపగ్రహము ద్వారా నడుచు నావిక వ్యవస్థతో సంఘటితం చేయబడి ఉంటుంది. అది ఆటోమేటిక్‌గా కెమెరా మోడ్ ను రివర్స్ లో మార్చుతుంది. అయితే, ఈ ఫీచర్ టాప్ ఎండ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగిలిన ట్రిమ్స్ అన్ని ఒకే దగ్గర విలీనమయి ఉంటాయి. ఈ తాజా వెర్షన్, అన్ని కాస్మెటిక్ నవీకరణలను గురించిన విషయానికొస్తే ముఖ్యంగా దాని వెలుపల భాగాలకు మంచి అలంకరణను ఇచ్చింది. తయారీ దారుడు, దాని మునుపటి వెర్షన్ మాదిరిగానే మొత్తం బడీ నిర్మాణాన్ని అలాఘే ఉంచుతూ దాని లక్షణాలలో అనేక మార్పులు చేశారు. దాని ఫ్రంట్ ప్రొఫైల్ లో మాత్రం బంపర్ మరియు స్కిడ్ ప్లేట్లతో పాటుగా సవరించబడిన ఫాగ్ ల్యాంప్స్ ను జత చేశారు. వీటితోపాటుగా, దాని సైడ్ క్లస్టర్ మరియు రేడియేటర్ గ్రిల్ బ్రాండ్ కొత్త లుక్ ని కలిగి ఒక ఉగ్రమైన వైఖరిని ఇస్తుంది. కార్ల తయారీ సంస్థ దీనిని క్రోం పూతతో అల్లాయ్ వీల్స్ సెట్ తో దాని చక్రం ఆర్చ్ లను సమకూర్చుకోవడం ద్వారా సైడ్ ప్రొఫైల్ కి కొన్ని మార్పులు చేసింది. దీని లోపలిభాగాలలో కూడా చేసిన మార్పులు అవి, రిఫైన్డ్ డాష్‌బోర్డ్ మరియు సీటింగ్ ఏర్పాటు తో బ్రాండ్ ఒక కొత్త రూపం ను పొందుతుంది. ఇది దీనియొక్క ఖరీదు తత్వాన్ని మరింత కనపడేలా చేస్తుంది. మరోవైపు, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మునుపటి వెర్షన్ వలె అన్ని సౌలణ్యాలు మరియు భద్రత కోణాలను కలిగి ఉంది. వాటితో పాటుగా, ఈ ఎస్యూవి కూడా తన స్టీరింగ్ వీల్ మీద అమర్చిన నియంత్రణల స్విచ్‌లు తో ఒక క్రూయిస్ కంట్రోల్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఇది ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, హోండా సి ఆర్-వి మరియు ఇసుజు ఎమ్యు 7 వంటి వాటితో పోటీ పడుతుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని ప్రవేశ స్థాయి ట్రిమ్ 2.5 లీటర్ టిడిసి ఐ ఇంజిన్ తో జతచేయబడి ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ సాంకేతికతను కలిగి ఉంది. ఈ పవర్ ప్లాంట్, నగర రోడ్లపైన 10 kmpl కనీస మైలేజ్ ని సరఫరా చేయగల సామర్థ్యంను కలిగి ఉంది మరియు ఇది రహదారులపై గరిష్టంగా 13.1 kmpl వేగం తో వెళుతుంది. దాని ఇతర రెండు వేరియంట్స్ ఒక 3.0-లీటర్ ఇంజన్ తో అమర్చబడి ఉండి, ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ వ్యవస్థతో విలీనం చేయబడి ఉంటాయి. ఈ మోటార్ , వాహనాన్ని 8.2 kmpl నుండి 11.4 kmpl పరిధి వరకు మైలేజీని ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. ఇది కూడా చాలా యుక్తకరంగా ఉంటుంది.

శక్తి సామర్థ్యం:


4x2 ఎం టి వెర్షన్ 2499 cc డీజిల్ ఇంజన్ తో అమర్చబడి, ఒక వేరియబుల్ జామెట్రీ టర్బోచార్జర్ తో పొందుపర్చారు. ఇది 141 bhp కమాండింగ్ శక్తి ని బయటకు సరఫరా చేయడానికి ఈ మోటార్ సహాయపడుతుంది మరియు 330 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ను కలిగి ఉంది, ఇది చాలా యోగ్యకరంగా ఉంటుంది. మరోవైపు, దాని మిగతా వేరియంట్స్ 2953cc డీజిల్ మోటార్ తో అనుసంధానం చేయబడి ఒక డబుల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా అమర్చబడి ఉంటాయి. ఈ పవర్ ప్లాంట్ 153.86 bhp శక్తిని బయటకు పంపుతుంది, మరియు 380 Nm టార్క్ ను విడుదల చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


పైన చెప్పినట్లుగా, ఇటీవలే విడుదల చేసిన ఎస్యూవి నుండి కొనుగోలుదారులు ఎంచుకోవడానికి రెండు ఇంజన్ ల ఆప్షన్లతో లభ్యమవుతుంది. ప్రవేశ స్థాయి ట్రిమ్ ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో జతగా ఒక 2.5-లీటర్ ఇంజన్ శక్తితో అందిచబడుతుంది. ఈ పవర్ ప్లాంట్ సుమారు 13 నుంచి 14 సెకన్లలో 0 నుండి 100 kmph మార్క్ ను వేగవంతం చేసుకోగల సామర్థ్యం ను కలిగి ఉంది. ఈ ట్రిమ్, యొక్క టాప్ స్పీడ్ 155 kmph నుండి160 kmph పరిధిలో వేగాన్ని చేరుకోగల సామర్థ్యంను కలిగి ఉంది. మరోవైపు, దాని మధ్య మరియు టాప్ ఎండ్ వెర్షన్స్ ఒక 3.0-లీటర్ మిల్లు ఇంజిన్ తో బిగించబడి ఉంటాయి. ఇది ఒక 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ మోటార్ వాహనం యొక్క టాప్ స్పీడ్ 160 నుండి 165 kmph వరకు ఉంటుందిమరియు ఇది సుమారు 14 నుండి 15 సెకన్లలో 100 kmph మార్క్ ను చేరే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వెలుపలి డిజైన్:


తయారీ దారుడుకారు యొక్క బాడీ ని నవీకరించేటపుడు, దాని వెలుపలి భాహ్య భాగాల రూపాన్ని మార్చకుండా అలాగే నిలిపివేశారు ఇది ఈ బ్రాండ్ కి ఒక కొత్త లుక్ ని ఇస్తుంది. సవరించిన ఎయిర్ డ్యామ్ మరియు బంపర్ తో పాటు స్పష్టమైన నిర్మాణాత్మక ఫాగ్ ల్యాంప్స్ రూపంలో దాని ఫ్రంట్ విభాగంలో ప్రధాన మార్పులు చేశారు. వీటితోపాటుగా, దీని యొక్క బంపర్ స్కిడ్ ప్లేట్స్ ని కూడా కలిగి ఒక కఠినమైన అప్పీల్ ను ఇస్తుంది. పైన చెప్పిన విధంగా , ఇది చాలా పెద్దగా ఉండే రేడియేటర్ గ్రిల్ తో అమర్చబడి దాని పైన అడ్డంగా అమర్చబడిన స్లాట్స్ తో కంపనీ లోగో ను కలిగి ఉంది. వీటితోపాటు, కార్ల తయారీ సంస్థ చుట్టబెట్టిన డిజైన్ ఇవ్వడం ద్వారా సైడ్ క్లస్టర్ సవరించబడి ఉంది మరియు దీనిని శక్తివంతమైన హాలోజన్ ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో అమర్చారు. దీనికి అమర్చిన అధునాతన ఎంపికల ద్వారా ఒక కొత్త లుక్ తో ఈ మోడల్ మనకి కనిపిస్తుంది. దాని సైడ్ ప్రొఫైల్, మునుపటి వెర్షన్ కంటే చాలావరకు ఒకే విధంగా ఉంది. కానీ దాని మస్కులైన్ వీల్ ఆర్చ్‌లు ఇప్పుడు అందమైన క్రోమ్ పూతతో అల్లాయ్ వీల్స్ సమితితో బిగించబడి ఉంటాయి. దీనికి అదనంగా, దాని బాహ్య భాగంలోని వింగ్ మిర్రర్స్ ఇప్పుడు బ్లైండ్ స్పాట్ మిర్రర్ తో చేర్చబడ్డాయి. ఇది మరింత సౌలభ్యాన్ని చేకూర్చుతుంది. కారు తయారీ దారుడు దీనికి అదనంగా సైడ్ ప్రొఫైల్ కి అధునాతన బాడీ డిజైన్ తో రూపొందించాడు. ఇది మరింతగా దాని శైలిని జతచేస్తుంది. రబ్బరు స్టడ్‌లతో ఒక అల్యూమినియం సైడ్ స్టెప్పర్ ఉంది, ఇది సులభంగా క్యాబిన్ లోపలికి ప్రవేశించడానికి సహాయ పడుతుంది. కారు తయారీదారుడు కూడా దాని బంపర్ ను పునః ఆకృతి చేసి దాని వెనుక ప్రొఫైల్ ను నవీకరించాడు. అదనపు భద్రతను అందించదం కోసం ఒక రక్షణ కవచం కూడా బిగించబడి ఉంటుంది. టెయిల్ లైట్ క్లస్టర్ దాని డి స్థూపం పైన అమర్చబడి ఉంటుంది మరియు దానిని అధిక తీవ్రతను కలిగిన బ్రేక్ లైట్లతో, కర్టసీ ల్యాంప్ మరియు టర్న్ ఇండికేటర్లతో అమర్చారు. దీని చుట్టూ ఇది ఒక పెద్ద విండ్‌స్క్రీన్ ఉంటుంది ఇది ఒక డీఫాగర్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. మరియు మూడవ బ్రేక్ లైట్ తో పాటు వైపర్ తో కలిసి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సిరీస్ లో వెడల్పు మరియు ఎత్తు తో పాటుగా పొడవు ను కూడా పెంపొందించారు. దీని మొత్తం పొడవు ఇప్పుడు 5062మి.మీ మరియు దాని ఎత్తు 1826 మి.మీ ఉంటుంది. దీని మొత్తం వెడల్పు 1788మి.మీ మరియు లాంగ్ వీల్ బేస్ 2860 మి.మీ ఉంటుంది. మరోవైపు, అది 210 మి.మీ కనీస గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి చాలా యోగ్యకరంగా ఉంటుంది.

లోపలి డిజైన్:


ఫోర్డ్ ఎండీవర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క అంతర భాగాలను కంపెనీ చిన్న సర్దుబాటులు చేసి దాని ప్లాస్టిక్ నాణ్యతను అభివృద్ధి చేసి మరియు పరికరాలను పునఃఅమర్చింది.కాక్‌పిట్ లోని గేర్‌బాక్స్ కన్సోల్ ఒక ప్రధాన నవీకరణ తో ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ షిఫ్ట్ అన్న్-ఫ్లై వ్యవస్థతో అనుసంధానం చేయబడింది. అదే సమయంలో, దాని డాష్‌బోర్డ్ కి సంస్థ ఉపయోగించిన ప్రీమియం నాణ్యతా మెటీరియల్ ఉండటం మూలంగా ఇది మార్కెట్ లో మంచి ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కొన్ని అధునాతన పరికరాలైన నైపుణ్యం గల ఎయిర్ కండీషనింగ్ యూనిట్, సమాచార వ్యవస్థ మరియు శాస్త్ర విఙ్ఞానం తో కూడీన నియంత్రణ స్విచ్‌ల స్థానాల వంటి వాటిని దీనిలో పొందుపరిచారు. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను అలాగే ఉంచేసి, దీనిని అనేక ఫంక్షన్లతో అమర్చారు, ఒక టాకొమీటర్, స్పీడోమీటర్, ఇంధన గేజ్, నోటిఫికేషన్ లైట్లు మరియు ఇతర కోణాల ఆధారంగా డ్రైవర్ సమాచారం వంటి వాటిని అమర్చారు. దాని డాష్‌బోర్డ్ ఫోర్ స్పోక్ లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో విలీనం చేయబడి ఉంటుంది, అది ఆ సంస్థ యొక్క లోగో తో పొందుపరచబడింది. ఇంకా, అది కూడా ఆడియో మరియు కాల్స్ యొక్క బహుళ స్విచ్‌లను కలిగి ఉంది. ఇది డ్రైవర్ కి సౌలభ్యాన్ని జతచేస్తుంది. దీని క్యాబిన్ నల్లని మరియు ఒంటె కలర్ స్కీమ్ తో ఉంది మరియు ఇది ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్స్ ద్వారా మెరుగుపరచబడి ఉంది. అయితే, ఈ అంశాలను మధ్య మరియు టాప్ ఎండ్ వెర్షన్ కి మాత్రమే అందిస్తారు. మరోవైపు, క్యాబిన్ బహుముఖ సీటింగ్‌తో, దాని రెండవ వరుసలో సీటు 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్ తో, దాని మూడవ వరుసలో ఫోల్దబిల్ మరియు రిమ్మొవబుల్ బెంచ్ సీటు అమరిక తో కూడి ఉంది. కారు తయారీ దారుడు దీని యొక్క సీట్లను అధిక నాణ్యత కలిగిన లెదర్ తోలుతో కప్పి తయారు చేశాడు. ఇది యజమానులకు అదనపు సౌలభ్యంను అందిస్తుంది. మరోవైపు, అది కూడా ఒక టచ్ ఎనేబుల్ ఉపగ్రహము ద్వారా నడుచు నావిక వ్యవస్థ విలీనం చేయబడి ఉంటుంది. ఇది వెనుక పార్కింగ్ కెమెరా ద్వారా కూడా దృశ్యాలను ప్రదర్శింపజేస్తుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ సరి కొత్త వెర్షన్ దాని అవుట్గోయింగ్ మోడల్ లో వలె అన్ని లక్షణాలను కలిగి ఉంది. వాటితో పాటుగా, అది కూడా ఒక కొత్త రేర్ పార్కింగ్ కెమెరాతో సహా నవీకృతమైన ఉపగ్రహము ద్వారా నడుచు నావిక వ్యవస్థను కలిపి ఉంచారు. ఇది డ్రైవర్ కి అద్భుతమైన సహాయాన్ని అందిస్తుంది. అయితే, ఈ ఫంక్షన్ టాప్ ఎండ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన రెండు వేరియంట్స్ ప్రామాణిక లక్షణాలను కలిగి ఉంటాయి. దీని ప్రవేశ స్థాయి వేరియంట్ , కాలమ్ స్టేల్డ్ ఆడియో కంట్రోల్స్ , స్వతంత్ర నియంత్రణతో కూడిన డ్యూయల్ జోన్ ఎసి యూనిట్, టిల్ట్ సర్దుబాటు తో పవర్ స్టీరింగ్, వాషర్ మరియు వైపర్ తో సహా వెనుక డీఫాగర్ ఒక టచ్ ఆపరేషన్ పవర్ విండోస్, విద్యుత్‌తో సర్దుబాటు చేసుకునే బయట అద్దాలు మరియు ఎత్తు సర్దుబాటు చేసుకునే ముందు సీట్ బెల్ట్స్ వంటి అంశాలను కలిగి ఉంది. వీటితోపాటు, క్లచ్ ఫుట్ రెస్ట్, రిమూవబుల్ యాష్‌ట్రే,ప్రకాశం గల భారీ గ్లవ్ బాక్స్ మరియు నిల్వ బిన్ తో ఫ్రంట్ సెంటర్ ఆర్మెస్ట్ వంటి అంశాలను కలిగి ఉంది. ఈ ట్రిమ్ కూడా మూడు 12వోల్ట్స్ పవర్ సాకెట్లు, సిగరెట్ లైటర్, సిక్స్ కప్ హోల్డర్లు, స్టీరింగ్ వీల్ మరియు లెదర్ తోలు మరియు గేర్ నాబ్ వంటి వినియోగ ఆధారిత లక్షణాలను కలిగి ఉంది. వీటితోపాటు, దాని మధ్య మరియు టాప్ ఎండ్ వేరియంట్స్ స్పోర్టి పెడల్స్ మరియు ఇల్యుమినేటేడ్ స్కఫ్ ప్లేట్లు వంటి అంశాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


ఫోర్డ్ ఎండీవర్ యొక్క ఈ పునరుద్ధరించిన వెర్షన్ మెరుగైన లెగ్ స్పేస్ తో భారీ అంతర్గత క్యాబిన్ ను కలిగి, ఇది సులభంగా కనీసం ఏడుగురు ప్రయాణికులకు సదుపాయాన్ని అందించేలా దీనిని రూపొందించారు. ఇది ఒక పెద్ద బూట్ కంపార్ట్మెంట్ ను కూడా కలిగి, మరింత సౌకర్యంగా మూడవ వరుస బెంచ్ సీటు ను మడవటం లేదా తొలంగించడం ద్వారా బూట్ కంపార్ట్మెంట్ స్పేస్ ని పెంచవచ్చు. రెండవ వరుసలో 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్ బెంచ్ సీటు బిగించబడి ఉంటుంది, ఇది మరింత నిల్వ సామర్థ్యంను పెంచడానికి సహాయపడుతుంది. మరోవైపు, ఈ ఎస్యూవి భారీగా 71 లీటరు సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది, ఇది చాలా యోగ్యకరంగా ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఫోర్డ్ సంస్థ యొక్క తయారీదారుడు, ఈ ఫోడ్ ఎండీవర్ వాహనం యొక్క సాంకేతిక లక్షణాలు పరంగా ఏ మార్పులు చేయలేదు. అయితే, కాస్మటిక్ పరంగా అనేక మార్పులు చేశాడు. 4x2 ఏటి, 4x4ఏటి వాహనాలకి 3- లీటర్ టిడిసి ఐ డీజిల్ ఇంజన్ ను అమర్చాడు. ఈ ఇనజన్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ టెక్నాలజీ తో జత చెయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 4 సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క స్థానభ్రంశం 2953cc. అంతేకాకుండా ఈ వాహనాల ఇంజన్లు టర్బోచార్జర్ చే జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్, 3200 rpm వద్ద 153.86 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 2500 rpm వద్ద 380 Nm గల పీక్ టార్క్ విడుదల చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజన్, ఆధునిక 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా ఈ వాహనాల యొక్క టార్క్ ను, వాటి ముందు చక్రాలకు పంపబడుతుంది. అయితే, 4x4 ఏటి వెర్షన్, షిఫ్ట్ ఆన్ ఫ్లై తో జత చేయబడి ఉండటం వలన వీటి టార్క్ నాలుగు వీల్స్ కు అందించబడుతుంది. మరోవైపు, వీటి దిగువ శ్రేణి వేరియంట్ లు 2.5 లీటర్ టిడిసి ఐ డీజిల్ ఇంజన్ తో పాటు కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ వ్యవస్థ తో జత చేయబడి ఉంతాయి. ఈ వాహనాల యొక్క స్థానభ్రంశం 2499cc. ఈ వాహనాల ఇంజన్, 4 సిలండర్లను, 16 వాల్వ్ లను కలిగి ఉంది. ఈ ఇంజన్ టర్బోచార్జర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 3500 rpm వద్ద 141 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 1800 rpm వద్ద 330 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ పవర్ ప్లాంట్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా టార్క్ ను ముందు వీల్స్ కు పంపిణీ చేయబడుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనాల యొక్క దిగువ శ్రేణి వేరియంట్ల డాష్‌బోర్డ్ పై సిడి ప్లేయర్ తో పాటు రేడియో ను ట్యూన్ చేసుకునేందుకు ఎంపి3 ప్లే బ్యాక్ మరియు ఆక్స్-సాకెట్ల ను పొందుపర్చారు. అంతేకాకుండా, సిడి చేంజర్ తో పాటు కుటుంబసభ్యుల వినోదం కోసం ఆరు స్పీకర్లను కలిగి ఉంది. మధ్య శ్రేణి వేరియంట్ల విషయానికి వస్తే, డివిడి ప్లేయర్ తో పాటుగా ఎల్ సిడి టచ్ స్క్రీన్ ఆడియో సిస్టం వంటివి అందించబడతాయి. మరోవైపు, ఎ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్లలో ఒక శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ తో పాటు మ్యాప్‌లు మరియు ఒక ఆధునిక టచ్‌స్క్రీన్ ఎల్ సిడి ప్రదర్శన అమర్చారు. వీటితో పాటు, రివర్స్ పార్కింగ్ సెన్సార్ల తో పాటు రేర్ కెమెరా సహాయంతో వీటి ప్రదర్శనను సట్నావ్ స్క్రీన్ లో చూడవచ్చు. అంతేకాకుండా ఈ అగ్ర శ్రేణి వేరియంట్ లో బ్లూటూత్ కనెక్టవిటీ తో పాటు ఆడియో నియంత్రణలతో స్ట్రీరింగ్ వీల్ పై అమర్చారు.

వీల్స్ పరిమాణం:


అన్ని కొత్త సిరీస్ లు, కొత్తగా రూపొందించబడిన 16-అంగుళాల క్రోమ్ పూతతో కూడిన అల్లాయ్ వీల్స్ సమితి తో అనుసంధానించబడ్డాయి. ఈ తేలికైన రిమ్స్ 245/70 R16 పరిమాణం గల అతి సామర్థ్యం గల రేడియల్ ట్యూబ్ లెస్ టైర్ల సమితి తో కప్పబడి ఉంటాయి. ఇది ఏ రహదారి పరిస్థితుల పైన అయినా గొప్ప పట్టును అందిస్తుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దాని ముందు ఆక్సిల్ సస్పెన్షన్ స్వతంత్ర డబుల్ విష్బోన్ రకంతో అమర్చబడి ఉంది ఇది ఒక స్టెబిలైజర్ తో పాటు టోరిసన్ బార్ స్ప్రింగ్ తో మరింతగా లోడ్ చేయబడి ఉంటుంది. దాని వెనుక యాక్సిల్, ప్రోగ్రెసివ్ లీనియర్ రేటు ఆకు స్ప్రింగ్స్ సస్పెన్షన్ తో బిగించబడి ఉండి,ఆ తక్కువ ఘర్షణతో ప్యాడ్స్ తో కలిసి ఉంటుంది. వీటితోపాటు, కారు తయారీ దారుడు కూడా దీనిని టేబులర్ డబుల్ యాక్టింగ్ టైప్ గ్యాస్ తో నింపి ఉన్న షాక్అబ్జార్బర్స్ తో విలీనం చేశారు. మరోవైపు, దాని ముందు వీల్స్ వెంటిలేషన్ డిస్క్ బ్రేక్‌లతో బిగించి ఉంటాయి. అయితే, దాని వెనుక వాటిని సర్దుబాటు చేసుకునే విధమైన సెల్ఫ్ డ్రమ్ బ్రేకులతో అమర్చారు.కంపెనీ కూడా దీనిని ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో విలీనం చేసింది, ఇది బ్రేకింగ్ విధానాన్ని చాలా పటిష్టంగా ఉంచుతుంది. ఇవేవి కాకుండా, ఈ ఎస్యూవి కూడా వేరియబుల్ శక్తి సహాయంతో కూడిన బాల్ మరియు నట్ రకం స్టీరింగ్ వీల్ సిస్టం తో విలీనం చేసి ఉంది, అది డ్రైవర్ కి ప్రయాసను తగ్గించడంలో తోడ్పడుతుంది మరియు చాలా సులభంగా నిర్వహణ చేస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ సిరీస్ లో అన్ని వేరియంట్స్ ను కీలకమైన భద్రతా కోణాలతో విలీనం చేశారు. ఇది వాహనంను మరియు దాని ప్రయాణీకులను రక్షిస్తుంది. దీని ప్రవేశ స్థాయి వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ తెఫ్ట్ అలారం తో రిమోట్ కీ లెస్ఎంట్రీ , ముందువైపు ఫాగ్ ల్యాంప్స్, మరియు లోడ్ పరిమితితో సహా ముందు టెన్షనర్ తో మూడు పాయింట్ల సీట్ బెల్టుల వంటి లక్షణాలను కలిగి ఉంది. మధ్య శ్రేణి ట్రిమ్ కూడా ముందు ప్రయాణీకుల కోసం సైడ్ ఎయిర్బాగ్స్ ను కలిగి ఉండి, మెరుగైన భద్రతను అందిస్తుంది. మరోవైపు, దీని టాప్ ఎండ్ వేరియంట్, ఒక ఆధునిక లిమిటెడ్ స్లిప్ డిఫెరెన్షియల్ ఫంక్షన్ తో అందించబడుతుంది, ఇది మరింతగా కర్షణ కోల్పోవడాన్ని తగ్గిస్తుంది మరియు ఈ వాహనం యొక్క స్థిరత్వంను మెరుగుపరుస్తుంది.

అనుకూలాలు:


1. వెనుక పార్కింగ్ వ్యవస్థ మరియు ఉపగ్రహము ద్వారా నడుచు నావిక వ్యవస్థ దాని ప్లస్ పాయింట్లు.
2. నవీకరించిన బాహ్య లక్షణాల వలన అది ఒక నాగరీకమైన లుక్ ని ఇస్తుంది.
3. ఇంజిన్ పనితీరు చాలా అద్భుతమైనదిగా ఉంది.
4.లోపల షోల్డర్, లెగ్ మరియు హెడ్ స్పేస్ చాలా సౌకర్యంగా ఉంది.
5. అంతర్గత భాగాల నాణ్యత చాలా ఆకట్టుకుంది.

ప్రతికూలాలు:


1. నిర్వహణ మరియు విడి భాగాలు కొద్దిగా ఖరీదైనవి.
2. ఇంకా కొన్ని లక్షణాలు జోడించవలసిన ఆస్కారం ఉంది.
3. ఆరంభ ఖర్చు ఇంకా మరింత పోటీపడి పెంచారు.
4. ఇంధన వ్యవస్థ దాని పోటీ దారులను ఓడించే విధంగా లేదు.
5. చిన్న చిన్న రోడ్లపై చాలా భారీగా ఉంది.