ఫోర్డ్ క్లాసిక్

` 5.4 - 8.0 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

ఫోర్డ్ ఇతర కారు మోడల్లు

 
*Rs

ఫోర్డ్ క్లాసిక్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


ఈ సంస్థ యొక్క ప్రఖ్యాత సెడాన్ మోడల్ సిరీస్ లలో ఫోర్డ్ క్లాసిక్ ఒకటిగా చెప్పవచ్చు. ఈ మోడల్ సిరీస్ ఎల్ ఎక్స్ ఐ, సి ఎల్ ఎక్స్ ఐ మరియు టైటానియం వంటి మూడు ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఒక డ్యూరాటెక్ పెట్రోల్ లేదా ఒక డ్యూరాటార్క్ డీజిల్ ఇంజన్ తో మనకి అందించారు. కంపెనీ చాలా సమర్థవంతంగా పనిచేసే ఒక బ్రేకింగ్ మెకానిజంను అందించింది.ఇది ఖచ్చితమైన పనిని అందిస్తుంది. దీని యొక్క ముందు చక్రాలు, వెంటిలేషన్ డిస్కుల సమితితో బిగించబడి ఉంటాయి మరియు వెనుక చక్రాలు ప్రామాణిక సెల్ఫ్ సర్దుబాటు డ్రమ్స్ తో అమర్చబడి ఉంటాయి. ఇది ఒక సమర్థవంతమైన సస్పెన్షన్ వ్యవస్థతో సంఘటితం చేయబడి ఉంటుంది. దీని ముందు ఆక్సిల్, స్వతంత్ర మక్ఫెర్సొన్ ఆఫ్సెట్ కాయిల్ స్ప్రింగ్ తో పొందుపరిచారు. మరోవైపు, రియర్ ఆక్సిల్ , ట్విన్ ట్యూబ్ డంపర్లతో కూడిన పాక్షిక స్వతంత్ర హెవీ డ్యూటీ ట్విస్ట్ బీమ్ తో బిగించబడి ఉంటుంది. దాని యొక్కఅగ్ర శ్రేణి వేరియంట్ లో బ్రేకింగ్ మెకానిజం మరింతగా, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇది మరింతగా దాని బ్రేకింగ్ సామర్ధ్యంను పెంచుతుంది. దాని సాంకేతిక లక్షణాల పరంగా చూస్తే, ఇది రెండు రకాల ఇంధన వ్యవస్థలతో కూడి ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ 1.6 లీటర్ డ్యూరాటెక్ ఇంజిన్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది 1596cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 6500rpm వద్ద గరిష్టంగా 99.6bhp శక్తిని, 3400rpm వద్ద 146Nm టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది. ఒక సెఫి సరఫరా వ్యవస్థతో కూడి ఉంది. ఇది దాని ఇంధన అభివృద్ధిని పెంచడంలో సహాయపడుతుంది. మరో వైపు, దీని డీజిల్ వేరియంట్ ఒక 1.4 లీటర్ డ్యూరాటెక్ ఇంజన్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది 1399cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 4000rpm వద్ద సుమారు 67bhp శక్తిని మరియు 2000rpm వద్ద 160Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సెడాన్ దాని విభాగంలో అత్యంత ప్రముఖమైన సియాజ్, హ్యుందాయ్ వెర్నా, చెవ్రోలెట్ సెయిల్, టొయోటా ఎతియోస్ మరియు ఇంకా కొన్ని ఇతరుల సెగ్మెంట్లతో పోటీ పడనుంది. కంపెనీ ఈ సెడాన్ ను భారతీయ వినియోగదారులకు నచ్చే విధంగా రూపొందించింది. దీని డిజైన్ ను వెలుపల మరియు లోపల చాలా అద్భుతంగా కనిపించే విధంగా రూపొందించారు. ఈ సెడాన్ సిరీస్ చాలా ఆకర్షించే విధంగా బయట సౌందర్యం అద్భుతంగా ఉంది. ఇది ఒక దృఢమైన క్రోమ్ తో రూపొందించబడిన రేడియేటర్ గ్రిల్ తో, గ్రిల్ కి మధ్యలో కంపెనీ చిహ్నం తో అందించబడుతుంది. దీనిని మరింతగా ఆకర్షణీయంగా కనబడేలా ముందు భాగంలో ఒక ప్రకాశవంతమైన క్రిస్టల్ బారెల్ ఆధారంగా చేసిన హెడ్ లైట్ క్లస్టర్ ను అమర్చారు. దీని యొక్క సైడ్ లుక్ ను మరింతగా పెంచేంతగా సన్నని లైన్స్ తో డిజైన్ చేయడం వలన ఇది ఒక ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. దీని సైడ్ ప్రొఫైల్ విలక్షణముగా, పూర్తి వీల్ ఆర్చెస్ తో మరియు ఇంకా ఇతర కారకాలతో ప్రకాశవంతమైనదిగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ వెనుక భాగంలో ఒక పెద్ద విండ్స్క్రీన్ మరియు వేరియంట్ బ్యాడ్జింగ్ వంటి ఇతర విషయాలతో పాటు కర్వీ బూట్ మూతను కలిగి ఉంది. దీని అంతర్గత భాగాల విషయానికొస్తే, అనేక లక్షణాలతో కూడిన ఒక రూమి డ్యుయల్ టోన్ ఆధారంగా తయారు చేసిన క్యాబిన్ ఉంది. ఇవి మాత్రమే కాకుండా, ఒక ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ వంటి అనేక అంశాలను కలిగి ఉంది. దాని సమాచార క్లస్టర్ అనేక నోటిఫికేషన్లను కలిగి ఉంది. అవి ఒక జత రౌండ్ ఆకారం గల మీటర్లు, ఒక డిజిటల్ ట్రిప్ మీటర్, హెడ్ల్యాంప్ నోటిఫికేషన్లు, డోర్ అజార్ వార్నింగ్ ల్యాంప్, ఒక టాకొమీటర్, అల్ప ఇంధన హెచ్చరిక లైట్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ వంటి లక్షణాలను ఇది కలిగి ఉంది. సీట్లు బాగా వాలుగా హెడ్ రెస్ట్ రీస్ట్రెయిన్లను కలిగి ఉన్నాయి. దీనివలన షోల్డర్ స్పేస్ మరియు లెగ్ స్పేస్ పెరిగి ప్రయాణికులకు కావలసిన సౌకర్యాన్ని అందిస్తుంది. దీని డ్యుయల్ టోన్ డాష్బోర్డ్, ఒక లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో అనుసంధానం చేయబడి ఉంది( బేస్ వేరియంట్ కాకుండా) . ఇది సామాన్లు పెట్టుకోవడానికి కావలసిన ఒక పెద్ద గ్లవ్ బాక్స్ మరియు ఏసి వెంట్స్ ను కలిగి ఉంది. సంస్థ ఈ సెడాన్ ను ఒక సంవత్సరం లేదా 100000 కిలోమీటర్ల ( ఏది ముందు వస్తే అది) వారంటీతో అందిస్తుంది. వినియోగదారులు ఈ వారంటీ కాలాన్ని అధికార డీలర్ల వద్ద అదనపు ధరతో 2 సంవత్సరాల వరకు లేదా 100000 కిలోమీటర్ల వరకు పొడిగించుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ మోడల్ దాని డీజిల్ వేరియంట్, ఒక ప్రామాణిక టర్బోచార్జెడ్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ద్వారా పొందుపరచడం జరిగింది. ఇది నగరాలలో సుమారు 17.0 kmpl మైలేజ్ ను మరియు రహదారులపైన 19.68 kmpl మైలేజ్ ను అందిస్తుంది. దీని పెట్రోల్ మోటార్, ఒక సీక్వెన్షియల్ ఎలక్ట్రిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంధన సప్లై వ్యవస్థతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది నగరాలలో దాదాపు 10.4 kmpl మైలేజ్ ను, రహదారులపై 14.6 kmpl మైలేజ్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

శక్తి సామర్థ్యం:


దీని పెట్రోల్ వేరియంట్, 1.6 లీటర్ డ్యూరాటెక్ ఇంజన్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఇది 1596cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 6500rpm వద్ద గరిష్టంగా 99.6 bhp శక్తిని, 3400 rpm వద్ద 146 Nm టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది. దీని డీజిల్ ట్రిమ్ 1.4 లీటర్ డ్యూరాటెక్ ఇంజన్ తో అనుసంధానం చేయబడి ఉండి, 4000rpm వద్ద సుమారు 67bhp శక్తిని మరియు 2000rpm వద్ద 160 Nm ఉత్తమమైన టార్క్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


దీని పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో పొందుపరచబడ్డాయి. దీని పెట్రోల్ వేరియంట్ 11.43 సెకన్లలో 100 kmphమార్క్ ను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు ఇది గరిష్టంగా ఒక గంటలో 170 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. మరోవైపు, దీని డీజిల్ ట్రిమ్ కేవలం 12.8 సెకన్లలో 100 kmphమార్క్ ను దాటుకుని వెళ్లగలదు. ఇంకా ఇది ఒక గంటలో 165 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగల సామర్థ్యంతో ఉంది.

వెలుపలి డిజైన్:


ఈ సెడాన్ సిరీస్ చాలా ఆకర్షించే విధంగా బయట సౌందర్యం అద్భుతంగా ఉంది. మార్కెట్లో దొరికే అద్భుతమైన కార్లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఇది ఒక దృఢమైన క్రోమ్ తో రూపొందించబడిన రేడియేటర్ గ్రిల్ తో, గ్రిల్ కి మధ్యలో కంపెనీ చిహ్నం తో అందించబడుతుంది. దీనిని మరింతగా ఆకర్షణీయంగా కనబడేలా ముందు భాగంలో ఒక ప్రకాశవంతమైన క్రిస్టల్ బారెల్ ఆధారంగా చేసిన హెడ్ లైట్ క్లస్టర్ ను అమర్చారు. దీని యొక్క సైడ్ లుక్ ను మరింతగా పెంచేంతగా సన్నని లైన్స్ తో డిజైన్ చేయడం వలన ఇది ఒక ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. దీని సైడ్ ప్రొఫైల్ విలక్షణముగా, పూర్తి వీల్ ఆర్చెస్ తో మరియు ఇంకా ఇతర కారకాలతో ప్రకాశవంతమైనదిగా ఉంటుంది. ఈ సెగ్మెంట్ వెనుక భాగంలో ఒక పెద్ద విండ్స్క్రీన్ మరియు వేరియంట్ బ్యాడ్జింగ్ వంటి ఇతర విషయాలతో పాటు కర్వీ బూట్ మూతను కలిగి ఉంది.బంపర్స్ కూడా ముందు మరియు వెనుక, రెండు వైపులా ఒకే కలర్ తో రూపొందించారు. దీని వలన అదనంగా మొత్తం బాడీకి ప్రకాశవంతమైన రూపం చేకూరుతుంది. దీని ఎయిర్ డ్యామ్ కూడా విస్తారమైనదిగా మరియు ఇంకా ఇంజిన్ కూలింగ్ సహాయతతో అందించబడుతుంది. హై ఎండ్ వేరియంట్ చాలా స్టైలిష్ గా ఉండి ఒక జత ఫాగ్ ల్యాంప్స్ తో చాలా మంచి ప్రత్యక్షతను అందించడంలో సహాయపడుతుంది. దీని గ్రీన్ టింటెడ్ ఫ్రంట్ విండ్ షీల్డ్ అంతరాయక వైపర్స్ తో బిగించబడి ఉంటుంది. దీనిబేస్ వేరియంట్ లో డ్రైవర్ మరియు ప్రయాణీకుల వైపు అనుసంధానం చేయబడి బయట వెనుక వీక్షణ అద్దాలు నల్ల రంగులో ఉంటాయి. అయితే వేరే ట్రిమ్స్ లో మాత్రం ఇవి బాడీ కలర్లో ఉండి యూనిఫామ్ రూపాన్ని కలిగి ఉంటాయి. ఇంకా, హై ఎండ్ ట్రిమ్ అదనపు సహాయత మరియు లుక్ కోసం బాహ్య అద్దాల మీద టర్న్ ఇండికేటర్లతో అందించబడుతుంది. ఈ ట్రిమ్ అదనంగా బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ తో అందించబడుతుంది. అదనంగా ఇది వెనుక విండ్ స్క్రీన్ , ఒక డీఫాగర్ తో అనుసంధానించబడి, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ తో అందించబడుతుంది. ఒక యాంటీనా కూడా దీని యొక్క రూఫ్ పైన అందించబడుతుంది. ఇది చాలా యోగ్యకరంగా కనబడుతుంది. ఇన్ని అంశాలతో ఈ సెడాన్, ఎంచుకోవడానికి ఆరు అద్భుతమైన షేడ్స్ లో మరియు వివిధ రకాల రంగులలో మనకి అందించబడుతుంది.

వెలుపలి కొలతలు:


ఈ సెడాన్ చాలా పెద్దగా మరియు పొడవైనదిగా కనిపిస్తోంది. ఎందుకనగా దాని కొలతలు ఆ విధంగా ఉన్నాయి. ఇది సుమారు మొత్తం 4282 mmపొడవుతో మరియు 1686mm వెడల్పుతో ఉంది. ఎత్తు చాలా ఎక్కువగా 1468mm ఉండడం వలన ఇది బాగా ఆకట్టుకుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 168mm ఉంటుంది మరియు దీని వీల్ బేస్ చాలా బాగా 2486mmఉంటుంది. అయితే దాని ముందు ట్రాక్ 1474mm ఉంది అలాగే దాని వెనుక ట్రాక్ 1444mm ఉంటుంది.

లోపలి డిజైన్:


ఈ సెడాన్ సిరీస్ సొంపుగా రూపొందించబడిన ఒక విశాలమైన అంతర్గత క్యాబిన్ ను కలిగి ఉంది. ఇది మంచి వాలుగా ఉన్న కుషన్ సీట్లతో హెడ్ రీస్ట్రెయిన్లను కలిగి ఉంది. దీనివలన షోల్డర్ స్పేస్ మరియు లెగ్ స్పేస్ పెరిగి కనీసం ప్రయాణికులకు కావలసిన సౌకర్యాన్ని అందిస్తుంది. దీని వెనుక సీట్ 100 శాతం ఫోల్దింగ్ సౌకర్యంతో బూట్ వాల్యూమ్ పెంచేందుకు తోడ్పడుతాయి. బేస్ వేరియంట్ కాకుండా, మిగిలిన వేరియంట్స్ డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు ఫీచర్ తో అందించబడుతున్నాయి. ఒక ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ అనేక అంశాలను కలిగి ఉంది. అవి శూన్యం నుండి డిస్ప్లే దూరం, ఒక డిజిటల్ టాకొమీటర్, హెడ్ ల్యాంప్ ఆన్ మరియు డోర్ అజార్ వార్నింగ్ నోటిఫికేషన్, అల్ప ఇంధన వార్నింగ్ ల్యాంప్ మరియు ఒక ఎలక్ట్రానిక్ డిజిటల్ ట్రిప్ మీటర్ లక్షణాలను కలిగి ఉంది. దీని డ్యుయల్ టోన్ డాష్బోర్డ్, ఒక లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో అనుసంధానం చేయబడి ఉంది. ఇది సామాన్లు పెట్టుకోవడానికి కావలసిన ఒక పెద్ద గ్లవ్ బాక్స్ మరియు ఏసి వెంట్స్ ను కలిగి ఉంది. ఈ సెడాన్ చాలా వినియోగ ఆధారిత లక్షణాలను కలిగి ఉంది. డ్రింక్ హోల్డర్స్, ఫ్రంట్ సీటు బ్యాక్ పాకెట్స్, ఫ్రంట్ డోర్ బాటిల్ హోల్డర్, ముందు మరియు వెనుక మ్యాప్ ల్యాంప్స్ వంటి అంశాలతో నిండి ఉంది. ఇది ఒక 430 లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది. దీనిని వెనుక సీటు ఫోల్దింగ్ చేయడం ద్వారా మరింత విస్తరించవచ్చు. ఈ అధ్యయనాలే కాకుండా, ఇది కూడా లోపల నుండి సర్దుబాటు చేసుకునే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఔట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ ను కలిగి ఉంది. డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్ తో ఉన్న అన్ని నాలుగు పవర్ విండోస్, విద్యుత్ బూట్ విడుదల ఫంక్షన్ మరియు ఇంకా ఎన్నో ఫంక్షన్లను కలిగి ఉంది. అయితే, దీని అగ్ర శ్రేణి వేరియంట్ కూడా ఒక తెలివైన రేర్ డీఫాగర్ తో విలీనం చేయబడి ఉంది. ఒక రేర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, సర్దుబాటు చేసుకోగల రేర్ హెడ్ రె స్ట్రెయిన్స్, డ్రైవ్ అవే లాక్స్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ మోడల్ యొక్క క్యాబిన్ లో యజమానులకు గొప్ప సౌకర్యం అందించే ఉద్దేశ్యంతో అనేక అంశాలను దీనిలో జత చేశారు. క్యాబిన్ ఉష్ణోగ్రత నియంత్రణ తో ప్రారంభిస్తే, ఇది ఒక విద్యుత్ పునః ప్రసరణ ఫంక్షన్ కలిగిన ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ను కలిగి ఉంది. ఇంకా, ఈ యూనిట్ లోపల హీటర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దీని అన్ని వేరియంట్స్ అదనంగా టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ కలిగిన పవర్ స్టీరింగ్ ఫీచర్ ను కలిగి ఉంటాయి. ఇది డ్రైవర్ యొక్క కృషిని కొంత మేరకు తగ్గించి డ్రైవర్ కి ఒక గొప్ప ఉపశమనంను అందిస్తుంది. ఈ సెడాన్ ఒక గొప్ప సౌకర్యం కారకమైనటువంటి అన్ని డోర్ పవర్ విండోస్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీనిలో ఉన్న విద్యుత్ బూట్ రిలీజ్ డ్రైవర్ కి మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. దీని రేర్ విండ్ స్క్రీన్ ఒక మంచి డీఫాగర్ తో అందించబడుతుంది. వెనుక సీట్లకు ఆర్మెస్ట్ ను అమర్చడం వలన అది ఒక మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లు వెనక సీట్లకి హెడ్ రెస్ట్ లతో అందించబడుతున్నాయి. ఇవి సర్దుబాటు ఫంక్షన్ తో వస్తున్నాయి. దీని హై ఎండ్ వేరియంట్ టైటానియం ఎలక్ట్రిక్ సర్దుబాటు ఔట్ సైడ్ వెనుక వీక్షణ అద్దాలతో అందించబడుతుంది. ఇలాంటి గొప్ప లక్షణాలతో ఈ సెడాన్ సౌకర్యంగా మరియు సౌలభ్యంగా ఉంటుంది.

లోపలి కొలతలు:


దీని యొక్క లోపల కంపార్ట్మెంట్ చాలా విశాలంగా చేయబడి ప్రయాణికులందరికి ఒక సౌకర్యవంతమైన డ్రైవ్ ని అందిస్తుంది. లెగ్ రూమ్ ముందు భాగంలో చాలా బాగా 1215mm స్థలాన్ని కలిగి ఉంటుంది. అలాగే, వెనక భాగం క్యాబిన్ లో 890mm స్పేస్ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో హెడ్ రూమ్ 940mm మరియు వెనక భాగంలో 925mm ఉంటుంది. ఇది ఒక ఒక ఉదారమైన షోల్డర్ స్పేస్ ను కలిగిఉంటుంది. ప్రయాణికులు ఎలాంటి రాపిడి లేకుండా కూర్చునేలా 1330mm ఉంటుంది. ఇది సుమారు 430 లీటర్ల ఒక గొప్ప బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లతో అందుబాటులో ఉంది. దీని పెట్రోల్ వేరియంట్ 1.6 లీటర్ డ్యూరాటెక్ ఇంజిన్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది 1596 cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 6500rpm వద్ద గరిష్టంగా 99.6 bhp శక్తిని, 3400 rpm వద్ద 146 Nm టార్క్ అవుట్పుట్ ను అందిస్తుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వ్స్ ను కలిగి ఉంటుంది మరియు ఇది డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పని చేస్తుంది. ఇది నగరాలలో సుమారు 10.4 kmpl మైలేజ్ ను మరియు రహదారులపైన 14.6 kmpl మైలేజ్ ను అందిస్తుంది. ఇది ఒక 5 - స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని డీజిల్ వేరియంట్ ఒక 1.4 లీటర్ డ్యూరాటెక్ ఇంజన్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది 1399 cc స్థానభ్రంశ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు ఎనిమిది వాల్వ్స్ ను కలిగి ఉంటుంది మరియు ఇది సింగిల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పని చేస్తుంది.ఇది కామన్ రైల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంధన సప్లై వ్యవస్థతో సంఘటితం చేయబడి ఉంటుంది. ఇది 4000 rpm వద్ద సుమారు 67 bhp శక్తిని మరియు 2000 rpm వద్ద 160 Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది నగరాలలో సుమారు 17.0 kmpl మైలేజ్ ను మరియు రహదారులపైన 19.68 kmpl మైలేజ్ ను అందిస్తుంది. ఇది ఒక 5 - స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ సిరీస్ బేస్ వేరియంట్ లో ఆడియో సిస్టమ్ లేదు కానీ ఒక మ్యూజిక్ సిస్టమ్ క్యాబిన్ లో ఇన్స్టాల్ చేయబడి అందించబడుతుంది. వినియోగదారులు ఒకవేళ కావాలనుకుంటే అదనపు ధరతో డీలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. మిడ్ వేరియంట్ ఒక ఆడియో సిస్టమ్ తో పొందుపరిచారు. ఈ ఆడియో సిస్టం , ఒక ఎంపి3 ప్లేయర్ మరియు ఆక్స్-ఇన్ మరియు రేడియో తో ఎఫ్ ఎమ్/ ఏ ఎమ్ అంశాలను కలిగి ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం చాలా ఎక్కువ లక్షణాలతో అందించబడుతుంది. ఇది ఒక స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్ మరియు ఒక బ్లూటూత్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉంది. ఇంకా ఒక పూర్తి ఫోన్బుక్ యాక్సెస్, ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ కాల్స్ కోసం కాల్ లాగ్, కాల్ స్వాప్, కాల్ హోల్డ్, కాల్ మ్యూట్, మరియు గోప్యతా మోడ్ లతో అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఎస్ఎంఎస్ నోటిఫికేషన్, ఆడియో స్ట్రీమింగ్ మరియు యుఎస్బి మద్దతు ఎనేబుల్ కూడా ఉంది. ఇంకా, అనేక ఇతర ఉపకరణాలను ఈ కారులో చేర్చి వ్యక్తిగతీకరించి సౌకర్యవంతమైనదిగా తయారుచేయవచ్చు. ఫ్లోర్ మాట్స్, విజర్స్, గొప్ప సౌకర్యాన్ని అందించే యాంబియంట్ లైట్ ప్యాకేజీ దీనిలో ఉంది. లెదర్ తోలు సీట్లను సౌకర్యవంతంగా ఉంచడమే కాకుండా క్యాబిన్ కి ఒక రిచ్ లుక్ ను అందిస్తుంది.

వీల్స్ పరిమాణం:


ఈ వాహనం యొక్క బేస్ మరియు మిడ్ వేరియంట్స్ ప్రామాణిక మరియు బలమైన 14 అంగుళాల స్టీలు చక్రాల సమితితో బిగించబడి ఉంటాయి. వీటిని అదనంగా స్టైలిష్ గా ఉండే పూర్తి వీల్ కవర్స్ తో కప్పుతారు. ఈ సెడాన్ యొక్క చక్రాలను 14 అంగుళాల మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ తో బిగిస్తారు. ఈ రిమ్స్ 175/65R14 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పుతారు. దీనిలో అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి ఒక పూర్తి పరిమాణం గల అదనపు వీల్ ను టూల్ కిట్ తో పాటుగా బూట్ కంపార్ట్మెంట్ లో అందిస్తున్నారు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీని యొక్క ముందు చక్రాలు, వెంటిలేషన్ డిస్కుల సమితితో బిగించబడి ఉంటాయి మరియు వెనుక చక్రాలు ప్రామాణిక సెల్ఫ్ సర్దుబాటు డ్రమ్స్ తో అమర్చబడి ఉంటాయి. ఇది ఒక సమర్థవంతమైన సస్పెన్షన్ వ్యవస్థతో సంఘటితం చేయబడి ఉంటుంది. ఇది ఈ సెడాన్ ను మరింత సమర్థవంతంగా పని చేసేలా చేస్తుంది. దీని ముందు ఆక్సిల్, స్వతంత్ర మక్ఫెర్సొన్ ఆఫ్సెట్ కాయిల్ స్ప్రింగ్ తో పొందుపరిచారు. మరోవైపు, రియర్ ఆక్సిల్ ను, ట్విన్ ట్యూబ్ డంపర్లతో కూడిన పాక్షిక స్వతంత్ర హెవీ డ్యూటీ ట్విస్ట్ బీమ్ తో బిగించబడి ఉంటుంది. గ్యాస్ తో నిండిన షాక్అబ్జార్బర్స్ సమితిని ముందు మరియు వెనుక చక్రాల వద్ద బిగించి ఉంచుతారు. దీనికి అదనంగా, ఒక ఎలక్ట్రిక్ సహాయక స్టీరింగ్ సిస్టమ్ బిగించబడి ఉంటుంది. ఇది డ్రైవర్ తన నిర్వహణలను మరింత సమర్ధవంతంగా నిర్వహించడంలో సహాయ పడుతుంది.

భద్రత మరియు రక్షణ:


అనేక రకాలైన భద్రతా అంశాలను దీనిలో అందించారు. ఇవి ఎలాంటి విపత్తులు జరగకుండా నిరోధిస్తాయి. ఈ మోడల్ సిరీస్ అన్ని రకాలలో ధ్వంసమయ్యే స్టీరింగ్ కాలమ్ ను అందించారు. ఇది డ్రైవింగ్ ని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా, ఒక సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ చాలా గొప్ప ఉపశమన కారకంగా దీనిలో అందించారు. దీని వెనక భాగంలో ల్యాంప్ క్లస్టర్లు డ్యుయల్ ఫాగ్ ల్యాంప్స్ తో అనుసంధానించబడి ఉంటాయి. ముఖ్యంగా పెట్రోల్ వేరియంట్స్ లలో ఇంధన కట్ ఆఫ్ స్విచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా క్రాష్ సమయంలో మరమ్మత్తు జరుగుతుంటే ఈ స్విచ్ ను ఆపి వేయడం ద్వారా సరఫరాను నిలిపివేయవచ్చు. దీని వలన ఇంధన లీకేజ్ మరియు పరిమాణం వంటి వాటిని నివారించవచ్చు. దీనిలో ఒక ఇమ్మొబిలైజర్ అన్ని ట్రిమ్స్ కి బిగించబడి ఉంటుంది. దీనిని నిష్క్రియాత్మక యాంటీ దొంగతన వ్యవస్థ (పాసివ్ యాంటి తెఫ్ట్ సిస్టమ్) అని పిలుస్తారు. ఇది ఎలాంటి అనధికార వ్యక్తిని కూడా వాహనం లోనికి చొరబడనివ్వదు. దీని వలన కొంతమేరకు దొంగతనాలను అరికట్టవచ్చు. ఇది ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఒక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అందజేయబడి ఉంది. ఇది ఎలాంటి రోడ్ల పైనా అయినా సరే మంచి బ్రేకింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదనపు సహయం కోసం ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ముందు భాగంలో అందించబడుతున్నాయి. అతి ముఖ్యమైన లక్షణం ఎయిర్బ్యాగ్స్, వీటిని డ్రైవర్ కి అలాగే సహ డ్రైవర్ కి అందిస్తున్నారు.

అనుకూలాలు:


1. ధర పరిధి చాలా సహేతుకమైనదిగా ఉంది.
2. బ్లూటూత్ ఇంటర్ఫేస్ తో నిండిపోయింది.
3. క్యాబిన్ స్పేస్ చాలా ఉదారంగా మరియు సౌకర్యవంతంగా ఉంది.
4. భద్రతా విభాగం బాగా ఆధునిక ఫంక్షన్లతో చేర్చబడింది.
5. వెలుపలి లుక్ చాలా ఆకర్షణీయంగా మరియు సొగసైనదిగా కనిపిస్తోంది.

ప్రతికూలాలు:


1. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా నిరాశాజనకంగా ఉంది.
2. ఇన్స్ట్రుమెంట్ పానెల్ లో మరికొన్ని నోటిఫికేషన్లు అవసరమవుతాయి.
3. ఇంధన సామర్ధ్యంలో కూడా కొంత అభివృద్ధి అవసరం.
4. డీజిల్ ఇంజన్ నుండి వచ్చే ధ్వని ఎక్కువగా ఉంది.
5. నిర్వహణ కూడ కొద్దిగా సమస్యాత్మకంగా ఉంది.