డాట్సన్ గో-ప్లస్

` 3.8 - 4.9 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

డాట్సన్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

డాట్సన్ గో-ప్లస్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు 


జూన్ 17, 2015: డాట్సన్ గో + ఇప్పుడు రూ 4.81 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే టాప్ వేరియంట్ టి (ఓ) వాహనం లో డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్ అందించబడుతుంది. సంస్థ యొక్క వెబ్సైట్ లో ఉన్న సమాచారం నవీకరించబడినది మరియు ఏ సందేహాలు అలాగే గందరగోళం లేకుండా సమాచారం ఇవ్వబడింది. డీలర్ లను సంప్రదించినట్లైతే, ఎయిర్బాగ్ లను కలిగి ఉన్న మోడల్స్ యొక్క బుకింగ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అని తెలిపారు మరియు వీటి రెండిటి ధర సుమారు రూ 15000 వరకు ఉండవచ్చునని చెప్పారు. ఈ డాట్సన్ గో + వాహనం, డ్రైవర్ వైపు ఎయిర్ బాగ్ తో పాటు, స్పీడ్ సెన్సిటివ్ వైపర్, కారు శరీర రంగులో ఉండే బంపర్లు, ముందు పవర్ విండోలు, యూఎస్బి చార్జర్, మొబైల్ డాకింగ్ స్టేషన్ (ఎం డి ఎస్) మరియు సెంట్రల్ లాకింగ్ వంటి అంశాలను కలిగి ఉంది. మరోవైపు ఈ డాట్సన్ గో + వాహనం యొక్క బోనెట్ క్రింది భాగం విషయానికి వస్తే, ఈ వాహనానికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించబడింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 68 పి ఎస్ పవర్ ను అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 104 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, ఈ ఎం పి వి వాహనం అత్యధికంగా 20.6 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

అవలోకనం


పరిచయం


Image 1 ఈ సంస్థ, మార్చి 2014 లో పునరుద్ధరణ ఆచరణలోకి వచ్చినప్పటి నుండి డాట్సన్, (గో, గో +, ఎం ఐ - డి ఓ & ఓ ఎన్ - డి ఓ) అను నాలు మోడల్స్ ను ప్రవేశపెట్టింది మరియు ఇది, ఇండియా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా మరియు రష్యా అను నాలుగు దేశాలలో ప్రవేశపెట్టింది మరియు 3 దేశాల్లో (భారతదేశం, ఇండోనేషియా & రష్యా) అను 3 ప్లాంట్ల వద్ద ఉత్పత్తిని ప్రారంభించింది. స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, ప్రస్తుత మార్కెట్ లో రెండు మోడల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గో అనునది మొదటి మోడల్ మరియు గో + అనునది రెండవ మోడల్ మరియు ఈ గో + అనునది కొన్ని నెలల క్రితమే ప్రవేశపెట్టబడింది.

ఈ గో + అనునది, బారీ ఎంపివి వాహనాన్ని బర్తీ చేయడానికి వచ్చిన ఒక కాంపాక్ట్ లాంటిది అలాగే సాధారణ హాచ్బాక్ లకు ఒక పెద్ద ప్రత్యమ్నాయం వంటిది. సంస్థ ఏం చెబుతుంది అంటే, గో + అనునది ఎస్టేట్ / స్టేషన్ వ్యాగన్ మరియు ఇది 5+2 సీటింగ్ అమరిక తో అందించబడుతుంది. అయితే వేరే వేరు చోట ఈ వాహనాన్ని, బారీ బూట్ సామర్ధ్యాన్ని కలిగిన 5 సీటర్ వాహనం అని పిలుస్తారు (ఆప్షనల్ 7 సీటర్ ఎంపివి)

అనుకూలాలు1. ఈ ధర పరిదిలో ఈ కారు మాత్రమే మూడు వరుస సీట్లతో అందించబడూతుంది మరియు దీనిలో ఏడుగురు వ్యక్తులు సౌకర్య్వంతంగా కూర్చునే అవకాసం అందించబడుతుంది. ఇదే ధర పరిధిలో, అన్ని ఇతర ఎంపికలు 5 సీటర్ హాచ్బాక్ ల రూపంలో అందించబడుతున్నాయి.
2. మూడవ వరుస సీటును మడిచినట్లైతే, 347 లీటర్ల బారీ బూట్ సామర్ధ్యం అందించబడుతుంది
3. ఈ వాహనానికి, ఖరీదైన లక్షణాలు అయినటువంటి, ఫాలో మీ హోం హెడ్ ల్యాంప్‌లు, సమగ్ర బహుళ సమాచార డిస్ప్లే, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ మరియు స్పీడ్ సెన్సిటివ్ ఇండికేటర్లు వంటి అంశాలు అన్నియూ కూడా ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ నుండి కూడా అందించబడుతున్నాయి.

ప్రతికూలాలు1. ఈ వాహనానికి, సాధారణ ప్రాదమిక అంశాలు అందించబడ్డాయి. ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో కూడా సరైన సమాచార వ్యవస్థ అందించబడలేదు.
2. ఈ వాహనం, ధర తగ్గింపు ఫీచర్ జాబితాలోనే కాకుండా భద్రతా అంశాలలో కూడా రాజీ కి దారితీసింది.
3. డాట్సన్ బ్రాండ్ అనునది, భారత మార్కెట్ లో కొత్త బ్రాండ్ మరియు దీని చిత్రం ప్రతికూలంగా రూపొందించబడి. భద్రత మరియు నాణ్యత రెండిటి పరంగా ఉత్పాదించబడింది.
4. డాట్సన్ కు తరువాత సేవా కేంద్రాలు లేకపోవడం వలన, నిస్సాన్ యొక్క అమ్మకాల తరువాత సేవా కేంద్రాలను ఉపయోగించుకుంటుంది.

అత్యద్భుతమైన లక్షణాలు1. ఈ వాహనం చాలా అత్య్ధికంగా 26 కె ఎం పి ఎల్ గల మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక అత్యధిక 7 సీటర్ ఎం పివి. అలాగే ఈ వాహనాన్ని, ఇతర పోటీ వాహనాలతో పోలిస్తే దీని యొక్క ఆకారం బారీ గా ఉంటుంది.
2. ఈ ఏడు మీటర్ల వాహనం, అత్యధ్బుతంగా సబ్ 4 మీటర్ల లో అందించబడింది.

బాహ్య భాగం


Image 2

గో + వాహనం, ప్రాదమికంగా వెనుక భాగంలో ఒక అదనపు ఖాళీ తో వస్తుంది, కాబట్టి ఈ వాహనాన్ని సరిగ్గా చూసినట్లైతే ఖచ్చితంగా హాచ్ కౌంటర్ భాగం లా కనిపిస్తుంది. ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, షట్కోణ ఆకృతి లో ఉందే రేడియేటర్ గ్రిల్ అలాగే దీనితో పాటు హనీ కోంబ్ మెష్, వి ఆకారపు బోనెట్, అనేక మెటర్ చేరికలతో కూడిన కోణీయా ఆకారపు హెడ్ ల్యాంప్‌లు మరియు విండ్ స్క్రీన్ వంటి అంశాలు అన్నియూ కూడా ఒకే విధంగా ఉంటాయి. అలాగే గో వాహనం యొక్క సాధారణ ఇంకా సమర్ధవంతమైన రూపకల్పన వంటి అంశాలు గో + వాహనానికి అందించబడ్డాయి.

Image 3

ఈ వాహనం యొక్క ప్రొఫైల్ ను చూసినట్లైతే, ఇది ఒక చిన్న పరిమాణం గల ఏడు సీట్ల వాహనం అని చెప్పవచ్చు. ఇది ఒక (5+2) సీట్ల వాహనం. బయట నుండి, ఈ వాహనం యొక్క వెనుక భాగాన్ని గనుక చూసినట్లైతే, గో వాహనం లో వలే ఈ గో + వాహనం లో కూడా ఉబ్బెత్తుగా ఉండే భాగం అందించబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఉండే కాంపాక్ట్ సెడాన్ వాహనాల వలే కాకుందా, ఈ వాహనం కొంచెం బిన్నంగా కనిపిస్తుంది మరియు ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ గో + వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కోణీయ ఆకారాన్ని కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఒక ఏడు సీట్ల వాహనం గా ఉన్నప్పటికీ, ఇది పెద్ద పొడవును కలిగి లేదు. ఈ వాహనం మరియు గో వాహనం యొక్క పొడవును గనుక గమనించినట్లైతే, గో వాహనం కంటే కేవలం 210 మిల్లీ మీటర్ల ఎక్కువ పొడవును మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే వెడల్పు మరియు వీల్‌బేస్ లు సమానం. కాబట్టి ఈ వాహనాన్ని ఎర్టిగా లేదా మొబిలియో వాహనాల వలే ఊహించకండి.

ఈ వాహనం యొక్క బారీ వీల్ ఆర్చులకు, చిన్న పరిమాణం కలిగిన 155 / 70 R13 పరిమాణం గల వీల్స్ ను అందించడం జరిగింది. ఇక్కడ 15 పరిమాణం కోసం దారి లేదు కేవలం 14 పరిమాణం వరకు ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా, సైడ్ భాగంలో ఉండే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ క్యాప్ లు నలుపు రంగులో అందించబడతాయి. అంతేకాకుండా ఏ మరియు బి పిల్లార్ లు కూడా అదే నలుపు రంగు లో అందించబడతాయి. మరోవైపు ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ఇంధన ట్యాంక్ యొక్క సమాచారాన్ని మరియు సస్పెన్షన్ నుండి ఎగ్జాస్ట్ పైపు వరకు ప్రతీదాని గురించి తెలియజేస్తుంది.

Image 4

ప్రారంభం లో పేర్కొన్న విధంగా, ప్రాధమికంగా అందించబడిన అంశాల విషయానికి వస్తే, వెనుక బంపర్ వెనుకకు విస్తరించి ఉంటుంది. డాట్సన్ వెనుక భాగానికి మరింత ప్రముఖంగా ఉండేలా వెనుక భాగాన్ని అందించింది. వెనుక భాగంలో ఉండే టైల్ గేట్ భాగం చాలా తేలికగా ఉంటుంది. నిజానికి ఇంత తేలికైన టైల్ గేట్ ను ఇప్పటి వరకూ ఎన్నడూ చూడలేదు.

డ్రైవర్ యొక్క వైపు విడుదల ద్వారా అన్‌లాక్ ఉంది - అక్కడ ఒక ప్రత్యేక కీహోల్ లేదా బూట్ తెరిచేందుకు ఒక లివర్ వంటివి అందించబడలేదు.

ఈ గో + వాహనం యొక్క వెనుక భాగం లో ఉండే నెంబర్ ప్లేట్ టైల్ గేట్ కు తరలించబడింది (అంటే వెనుక బంపర్ పై భాగానికి తరలించబడింది). వెనుక భాగం మరింత శుభ్రంగా ఉంటుంది అలాగే మొత్తం స్టైలింగ్ చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తం మీద ఈ వాహనం, మంచి లుక్ ను అలాగే సరైన నిష్పత్తిలో రూపొందించబడింది.

Table 1

Table 2

అంతర్గత భాగం


Image 5

ఈ గో + వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, మూడవ వరుస ను మినహాయిస్తే, మిగిలిన లోపలి భాగం హాచ్బాక్ లా ఒకే విధంగా ఉంటుంది. లోపలి భాగంలో ఉండే డాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానళ్ళు గ్రైజ్ రంగులో (అంటే గ్రే అలాగే బీజ్ రంగుల కలయిక) అందించబడతాయి. ఇక్కడ ప్లాస్టిక్ నాణ్యత, చాలా ప్రాథమిక మరియు కేవలం సంతృప్తికరమైనది గా ఉన్నప్పటికీ, ప్యానెల్లు చాలా బలిష్టంగా ఉంటాయి. ఇది, ఇక్కడ గమనించ దగిన అంశాలలో ఒకటి.

Image 6

సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే, చాలా అకార్షణీయంగా కనబడటం కోసం నలుపు రంగులో అందించబడుతుంది. డాష్‌బోర్డ్ లో మిగిలిన భాగం కంటే ఆకర్షణీయంగా అలాగే సున్నితంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సెంట్రల్ కన్సోల్, ఒక గ్రైనీ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ప్లాస్టిక్ ప్యానళ్ళు యొక్క నాణ్యత చాలా అందంగా ఉంది మరియు ఈ గో + వాహనం, సనీ ఆకారంగ్లో ఉండే డోర్ హ్యాండిళ్ళను ఉపయోగించడం జరిగింది (క్రోం వాడకాన్ని తగ్గించడం కోసం)

ఈ గో + వాహనం, పాత స్కూల్ యొక్క స్టిక్ ఆకారపు లాకింగ్ నాబ్ లను ఉపయోగించడం జరిగింది. ఈ వాహనం గురించి గుర్తుంచుకోవలసిన అంశాలలో ఒకటి ఏమిటంటే, కారు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు దీనిని ప్రశంసించడం కొంచెం కష్టం. సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ, ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది.

ఈ రూఫ్ అనుభవం, బలహీనంగా అనిపిస్తుంది. ఈ రూఫ్ మరిన్ని అంగుళాల పైకి ఉన్నట్లైతే మరింత అందంగా అలాగే ఊహించనంత ఆకర్షణీయంగా విశాలంగా ఉండేది. ఈ గో + వాహనానికి, గో వాహనం లో ఉండే సన్ వైజర్ లను అందించడం జరిగింది మరియు వానిటీ మిర్రర్ లు అందించబడటం లేదు.

Image 7

ఈ గో + వాహనం యొక్క వీల్‌బేస్, మిగిలిన అన్ని హాచ్బాక్ వాహనాల కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. దీని ఫలితంగా ఈ వాహనం యొక్క లోపలి భాగంలో ఉండే ముందు రెండు వరుసలకు బారీ క్యాబిన్ స్పేస్ అందించబడుతుంది. అంతేకాకుండా లోపలి భాగం లో బారీ హెడ్ స్పేస్, బారీ షోల్డర్ స్పేస్ అలాగే లెగ్ స్పేస్ లు అందించబడతాయి. అయితే ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ వాహనానికి సర్దుబాటయ్యే స్టీరింగ్ వీల్ ను అందించాడు. దీని వలన డ్రైవర్ కు మరింత సౌకర్యం అందించబడుతుంది.

ఈ గో + వాహనం లో ఉండే ముందు భాగంలో, కనెక్టెడ్ సీట్లు అందించబడతాయి అవి మనం హెచ్ ఎం అంబాస్డర్ వాహనం లో చూడవచ్చు. డ్రైవర్ సీటు కన్వెన్షినల్ అలాగే ముందు ప్రయాణికుడి సీటు మధ్యలో ఉండే ఖాళీను పూరించడానికి పొడిగించబడి ఉంటుంది. ఈ మధ్య ప్రాంతం అవసరమైన అంశాలను అలాగే హ్యాండ్ బ్యాగ్ లను పెట్టుకోవడానికి అనువైన స్థలం అని డాట్సన్ సంస్థ వివరించింది. కానీ, ఏ సంధరంలో నైనా ఈ స్థలం లో ఏవరైన కూర్చున్నట్లైతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మరోవైపు స్టీరింగ్ వీల్ పై భాగంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరచబడి ఉంటుంది. క్యాబిన్ లో ఉండే చల్లని గాలి త్వరగా విస్తరించడం కోసం, దీనికి ఇరువైపులా ఎయిర్ వెంట్ లు పొందుపరచబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టీరింగ్ వీల్ మరింత అందంగా కనబడటం కోసం, దీని మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది.

క్యాబిన్ లో ఉండే సీట్లు, పుష్కలమైన సౌకర్యాన్ని అందించడమే కాకుండా, మరింత కుషన్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటాయి. క్యాబిన్ లో ఉండే ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం, ఈ అన్ని సీట్లకు ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ లను అందించడం జరిగింది. వెనుక కూర్చున్న ప్రయాణికుణి మోకాలు కొన్ని సందర్భాలలో ఇబ్బంది పెడే అవకాశాలు ఉన్నాయి.

పనితీరు


పెట్రోల్


Table 3

ఈ కాంపాక్ట్ ఎంపివి వాహనానికి, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1198 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంది మరియు డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా, మూడు సిలండర్ లను అలాగే 12 వాల్వ్ లను కలిగి ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 5000 ఆర్ పి ఎం వద్ద 67 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 104 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ ఇంజన్ 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 140 కె ఎంపి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, ఈ జి ఐ ఎస్ ఇంధన సరఫరా వ్యవస్థ తో జత చేయబడి ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఈ ఇంజన్ నగరాలలో, 16.3 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 20.62 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

Image 8

ఇదే ఇంజన్ ఇదే ఆర్ పిఎం వద్ద గో వాహనంలో, 20 కిలోగ్రాముల ఎక్కువ పవర్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్ తిరిగి నవీకరించబడింది కానీ, ఈ సి యూ మాత్రం ఏ మార్పులను చోటు చేసుకోలేకపోయింది. ఈ నిస్సాన్ ఇంజనీర్లు, మోటార్ యొక్క మొత్తం డ్రైవరబిలిటీ మరియు శుద్ధీకరణ మెరుగుపర్చే విషయంలో ఒక గొప్ప పాత్రను పోషించారు.

ఈ వాహన బరువు నిష్పత్తుల పరంగా ఆకట్టుకునే పవర్ ను అదే విధంగా టార్క్ లను విడుదల చేసింది. ఈ గో + ఇంజన్, అందరినీ ఆకట్టుకుంటుంది మరియు చాలా బాధ్యత వహిస్తుంది. ఈ ఎంపివి, నిదానమైన అనుభూతిని కలిగి లేదు. అంతేకాకుండా మరోవైపు చిరాకు లేకుండా నిరంతరం పని చేస్తూనే ఉండటం లో సహాయపడుతుంది. ఈ ఇంజన్, 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి చాలా తక్కువ సమయం పడుతుంది మరోవైపు ఇదే ఇంజన్ సులభంగా 120 కె ఎం పి హెచ్ గల వేగాన్ని చేరుకోగలుగుతుంది. దీని కంటే ఎక్కువ వేగాన్ని సిఫార్చు చేయడం లేదు.

ఈ ఇంజన్ యొక్క ఎన్ వి హెచ్ మరియు ఇన్సులేషన్ లు, గో వాహనం కంటే మెరుగైనవి అని చెప్పవచ్చు. కానీ ఇంజన్ అలాగే గాలి శబ్దం సులభంగా క్యాబిన్ గూండా పంపిస్తాయి. ఈ మోటార్ శబ్దాని మాత్రమే కాకుండా ఎగ్జాస్ట్ శబ్దాన్ని కూడా వినవచ్చు. ఇవి చాలా చిరాకు పుట్టిస్తాయి. ఈ వాహనం యొక్క సస్పెన్షన్ కూడా చాలా శబ్ధం చేస్తుంది మరియు గతుకుల రొడ్లపై టైర్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది.

రైడ్ మరియు హ్యాండ్లింగ్


Image 9 తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అన్నివేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటానికి నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించడం జరిగింది. ఈ గో + వాహనం, నిజంగా ఒక అద్భుతమైన రైడ్ ను అందిస్తుంది. ముందుగా ఈ వాహనం యొక్క సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ముందు ఆక్సిల్ కు మక్ఫోర్సన్ స్ట్రట్ ను అలాగే వెనుక ఆక్సిల్ హెచ్ టైప్ టోరిసన్ బీం తో విలీనం చేయబడి ఉంటాయి. మరోవైపు తయారీదారుడు ఈ వాహనానికి తేలికపాటి స్టీరింగ్ వీల్ ను అందించాడు. ఈ తేలిక పాటి నియంత్రణ, నగరాలలో డ్రైవ్ ను మరింత సులభతరం చేస్తుంది. అంతేకాకుండా ఈ స్టీరింగ్ వీల్, 4.6 మీటర్ల టర్నింగ్ రేడియస్ కు మద్దతిస్తుంది.

తగినంత తక్కువ వేగంతో వాహనం వెళుతున్నప్పుడు, స్టీరింగ్ వీల్ చాలా తేలికగా ఉంటుంది మరియు రహదారులలో చాలా బరువుగా ఉంటుంది. ఇతర ఎలక్ట్రానిక్ యూనిట్ల వలే, అధిక వేగం వద్ద ఇది ఎక్కువ బరువు ను కలిగి ఉంటుంది. ఇతర ఎలక్ట్రానిక్ యూనిట్ల వలే, అధిక వేగంతో వాహనం ప్రయాణిస్తున్నప్పుడు కంగారు పడవలసిన అవసరం లేదు.

ఈ ఎంపివి అనునది కార్నర్ కార్వర్ కాదు. బాడీ రోల్, డ్రైవ్ సమయంలో చాలా స్పష్టంగా ఉంది. అధిక వేగంతో వాహనం వెళుతున్నప్పుడు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన డ్రైవ్ ను అందిస్తుంది మరియు అసమానంగా ఉండే రహదారులపై వెనుక భాగంలో ఎగిరి పడినట్టు ఉంటుంది.

ఈ గో+ వాహనం లో ప్రయాణించడానికి, ప్రయాణికులకు అద్భుతమైన డ్రైవ్ ను అందించడానికి ఈ వాహనం యొక్క వీల్స్ కు రోడ్లపై గట్టి పట్టును అందించే టైర్ లను సిఫార్సు చేయడం జరిగింది. అలాగే తెలియని బ్రాండ్ అయినటువంటి స్ట్రాడా బ్రాండ్ ను అందించడం జరిగింది. అంతేకాకుండా తయారీదారుడు వీటిని పలుకుబడి ఉన్న తయారీదారుడు నుండి 175 పరిమాణానికి నవీకరించాడు.

భద్రత


ఈ గో+ వాహనం లో, భద్రత అనునది ఒక పెద్ద ఆందోళనలలో ఒకటి. దీని తరువాత వచ్చిన వాహనం అయినటు వంటి డాట్సన్ గో వాహనం విషయానికి వస్తే, గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా పరీక్షింపబడింది మరియు దీని యొక్క ఫలితాలు, నిరాశాజనకంగా ఉన్నాయి. దీని పరంగా దీనికి జీరో స్టార్ రేటింగ్ అందించడం జరిగింది మరియు పరీక్ష అధికారాన్ని గో వాహనం లో ఉండే ఎయిర్ బాగ్స్ తో పరీక్షించడం జరిగింది కానీ, అప్పుడు ఫలితాలలో ఎలాంటి తేడా రాలేదు. కారు యొక్క నిర్మాణం ఊహించినంత ఆకర్షణీయంగా లేదు.

గో + వాహన శరీర నిర్మానం, గో వాహనాన్ని పోలి ఉంటుంది మరియు అలాగే ఆందోళనలు కూడా అదే విధంగా ఉన్నాయి.

తయారీదారుడు డాట్సన్ గో వాహనంలో, వాహనానికి అలాగే క్యాబిన్ లో ఉండే ప్రయాణికులకు గరిష్ట స్థాయిలో బద్రతను అందించడానికి తక్కువ మొత్తం లో భద్రతా అంశాలను అందించడం జరిగింది. అయితే ఈ గో + వాహనం, ఆప్షనల్ డ్రైవర్ వైపు ఎయిర్బాగ్ తో అమ్ముడుపోతుంది అలాగే అత్యంత సురక్షితమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వాహనాన్ని, సిఫార్సు చేయవచ్చు.

Table 4

వేరియంట్లు


డాట్సన్ గో + వాహనం యొక్క అంశాలను గనుక చూసినట్లైతే, చివరికి ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో కూడా తక్కువ అంశాలు అందించబడుతున్నాయి. ఈ గో + వాహనం, మొత్తం ఐదు వేరియంట్ లలో అందుబాటులో ఉంది.

ముందుగా ఈ మోడల్ సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన డి వాహనం విషయానికి వస్తే, ఫాలో మీ హోం హెడ్ ల్యాంప్‌లు మరియు 3 వ వరుస సీట్లు వంటి సాదారణ అంశాలు అందించబడతాయి. అయితే, ఎయిర్ కండీషనింగ్ యూనిట్ మాత్రం దీని తరువాతి వేరియంట్ అయిన ఏ వాహనంలో అందించబడుతుంది. దీనితో పాటు పవర్ స్టీరింగ్ ఈ వేరియంట్ లో అందించబడదు ఏ (ఈ ఎస్ పి) వేరైయంట్ లో మాత్రమే అందించబడుతుంది. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ కోసం ఈ ఎస్ పి అనునది ప్రామాణికంగా అందించబడుతుంది.

ఈ మోడల్ సిరీస్ యొక్క తదుపరి వేరియంట్ అయిన టి వేరియంట్ విషయానికి వస్తే, నాలుగు స్పీకర్ల మీడియా వ్యవస్థ తో కూడిన ఆక్స్ ఇన్ పుట్ మరియు ఫోన్ డాక్ వంటివి అందించబడతాయి. ఈ మీడియా అవసరాల కోసం ఆక్స్ మాత్రమే ఒక ఎంపిక అని చెప్పవచ్చు అలాగే యూఎస్బి, సిడి లేదా బ్లూటూత్ ఇన్పుట్ కోసం ఏ రకమైన ఎంపిక అందించబడటం లేదు. వీటన్నింటితో పాటు ఈ టి వేరియంట్ లో, పవర్ విండోలు అందించబడుతున్నాయి.

భద్రతా లక్షణం విషయానికి వస్తే, డ్రైవర్ వైపు ఎయిర్బాగ్, ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టి (ఓ) వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. ఎక్కువగా సుఫార్సు చేసినట్లైతే ఈ వేరియంట్ కు డ్రైవర్ వైపు ఎయిర్బాగ్ ఆప్షనల్ గా అందించబడుతుంది.

Table 5

తుది విశ్లేషణ


Image 10

డాట్సన్ ను, ఏడు సీట్ల ఎంపిక అని పిలుస్తారు అయితే, డాటస్ గో + వాహనం విషయానికి వస్తే, ఖచ్చితంగా ఈ పేరు సరైనది అని చెప్పలేము. మూడవ వరుస లగేజ్ సదుపాయం కోసం మాత్రమే అని చెప్పవచ్చు మరియు దీనిలో ఏ ఒక్క పెద్ద వాళ్ళు సౌకర్యవంతంగా కూర్చోలేరు. మీరు గనుక ఐదు సీట్ల వాహనం కోసం ఎదురు చూస్తున్నట్లైతే, ఈ డాట్సన్ గో + వాహనం, ఐదు సీట్ల వాహనం మాత్రమే కాదు ఇది ఒక సామాన్లకు తగిన స్థలాన్ని కలిగి ఉంది అని కూడా చెప్పవచ్చు. వీటి కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు ఈ వాహనం సరైనది అని చెప్పవచ్చు.