డాట్సన్ గో

` 3.2 - 4.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

డాట్సన్ ఇతర కారు మోడల్లు

 
*Rs

డాట్సన్ గో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


డాట్సన్ ఇండియా, నిస్సాన్ మోటార్స్ యొక్క పూర్తి సొంతమైన అనుబంధ సంస్థ. ఇది మళ్ళీ దాని హాచ్బాక్ సిరీస్లో ఒక లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ను పరిచయం చేయటం ద్వారా ముఖ్యాంశాలలో చేరింది. ఈ వేరియంట్ యొక్క పేరు డాట్సన్ గో ఎన్ ఎక్స్ టి. ఈ వాహనం, కొన్ని వినూత్న అంశాలతో మరియు కొన్ని కాస్మెటిక్స్ తో మార్పు చేయబడింది. అంతేకాకుండా, ఈ వాహనం రాబోయే పండుగ సీజన్ లో ఎక్కువ అమ్మకాలను సొంతం చేసుకొనుటకు ముందడుగు వేస్తుంది. కంపెనీ వర్గాలు, 1000 యూనిట్ల ఉత్పత్తిని మాత్రమే అందించింది. ఈ వాహన సంస్థ, ఈ కొత్త వేరియంట్ యొక్క అనేక లక్షణాల జాబితాను కేవలం 20,000/- రూపాయిలకు మాత్రమే అందిస్తుంది. ఈ జాబితా లో లక్షణాలు వరుసగా, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రిమోట్ భద్రతా లాక్, రేర్ పార్సిల్ షెల్ఫ్, క్రోమ్ ఎగ్జాస్ట్ పైప్ మరియు పియానో నలుపు రంగు ఫినిషింగ్ లో ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అంశాలను ఈ కొత్త వాహనం కలిగి ఉంది. ఇప్పటికే ఉన్న వేరియంట్లు ఏ నవీకరణలు లేకుండా అదే విధంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉన్న వేరియంట్ల వలే, ఈ లిమిటెడ్ ఎడిషన్ అయిన గో ఎన్ ఎక్స్ టి వాహనం కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది అంతేకాకుండా, ఈ వాహనం 1198 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ హాచ్బాక్ కు సొగసైన బాహ్య రూపాన్ని అందించడం జరిగింది.

ఈ వాహన సిరీస్ యొక్క బాహ్య భాగంలో ప్రకాశవంతమైన హెడ్ లైట్ క్లస్టర్, కారు బాడీ కలర్ లో ఉండే బంపర్లు, డోర్ హ్యాండిల్స్, రెండు స్పీడ్ సెన్సిటివ్ వైపర్ లను కలిగి ఉన్న విండ్ స్క్రీన్, కారు యొక్క బాడీ కలర్ లో ఉండే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు వంటి అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. మరోవైపు ఈ కాంపాక్ట్ హాచ్బాక్, సౌకర్యవంతమైన అంతర్గత క్యాబిన్ తో పాటు సౌకర్యవంతమైన సీట్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ సీట్లు ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. దీని యొక్క డాష్బోర్డ్ పై, మూడు స్పోక్ ల స్టీరింగ్ వీల్, ఒక గ్లొవ్ బాక్స్ మరియు ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ అమర్చబడి ఉంటాయి. ఈ ప్యానెల్ లో, డ్రైవర్ సౌలభ్యం కోసం కొన్ని ముఖ్యమైన ప్రకటనలను హెచ్చరిస్తుంది. వీటితో పాటు, ఈ వాహన సిరీస్ డోర్ ఆర్మ్ రెస్ట్ లను, కనెక్టెడ్ ముందు సీట్లను, పూర్తి మోల్డెడ్ డోర్ ట్రిం లను కూడా కలిగి ఉంటాయి. ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లు అయిన ఏ మరియు టి వాహనాలు, ఒక హీటర్ తో పాటు ఒక ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ను కలిగి ఉంటాయి. కారు తయారీదారుడు, ప్రయాణికులకు రక్షణ ను అందించడానికి అనేక భద్రతా అంశాలను ఈ వాహన సిరీస్ కు అందించడం జరిగింది. అంతేకాకుండా, వాహనాన్ని దొంగతనాల బారీ నుండి కాపాడటానికి మరియు ఏ అనదికార యాక్సిస్ లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఈ మోడల్ కు ఇంజన్ ఇమ్మోబిలైజర్ పరికరాన్ని అందించడం జరిగింది. వెనుక విండ్ స్క్రీన్ కు, ఒక హై మౌంటెడ్ థర్ద్ బ్రేక్ లైట్ బిగించడం జరిగింది. దీని వలన భద్రతా సూచీ మరింత పెరుగుతుంది. ముందు సీట్ల కోసం మూడు పాయింట్ల సీటు బెల్ట్ లను అందించడం జరిగింది. అయితే, వెనుక మధ్య సీటు కు మాత్రం రెండు పాయింట్ల సీటు బెల్ట్ మాత్రమే అందించబడింది. మొత్తం మీద, అనేక సౌకర్య లక్షణాలను, మంచి ఇంజిన్ పనితీరును మరియు సహేతుకమైన ధర పరిధి ని కలిగి ఉన్న ఈ వాహనాన్ని ఒక ఖచ్చితమైన వాహనం అని చెప్పవచ్చు. ఈ హాచ్బాక్, రెండు సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్ల వారెంటీ ను కలిగి ఉంది. ఈ వారెంటీ ను ఒక అదనపు ఖర్చు వద్ద ఈ కాలాన్ని మరింత పొడిగించవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్ధ్యం:


ఈ వాహన సిరీస్ యొక్క 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఒక ఎలక్ట్రానిక్ గ్యాసోలైన్ ఇంధనం ఇంజక్షన్ వ్యవస్థ తో విలీనం చేయబడి ఆరోగ్యకరమైన ఇంధనాన్ని అందిస్తుంది. ఈ ఇంజన్, నగరాలలో 17 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే, రహదారులలో ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫికేట్ ద్వారా 20.63 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్ధ్యం:


ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వాహనాలు 1198 సిసి స్థానభ్రంశాన్ని కలిగిన పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్, డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా మూడు సిలండర్లను మరియు 12 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క పవర్ మరియు టార్క్ ల విషయానికి వస్తే, అత్యధికంగా 5000 ఆర్ పి ఎం వద్ద 67.06 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 104 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


   ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వాహనాలు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఇది, ఒక మంచి త్వరణాన్ని మరియు పికప్ లను పంపిణీ చేయడం లో సహాయపడుతుంది. ఈ ఇంజన్ ను కలిగి ఉన్న వాహనం, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 15 నుండి 16 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఇదే వాహనం 150 నుండి 160 కె ఎం పి హెచ్ గల అత్యధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టబడిన లిమిటెడ్ ఎడిషన్ అయిన 'గో ఎన్ ఎక్స్ టి ' వాహనం యొక్క బాహ్య డిజైన్ ఇప్పటికే ఉన్న వాహనాల వలే ఒకేలా ఉంది. అయితే, ఈ వాహన యొక్క మొత్తం బాడీ ను స్క్రాచ్ నిరోధక డిజైనర్ మోల్డింగ్ లతో తయారు చేయటం వలన, ఇతర వాహనాలతో పోలిస్తే బిన్నమైనదిగా కనబడుతుంది. ఈ మోడల్ ప్రీమియం హాచ్బాక్ వైఖరిని కలిగి ఉండటం వలన ఈ మోడల్, ముందు ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్ మరియు వెనుక ప్రొఫైల్స్ చాలా ఆకర్షణీయంగా కనబడతాయి. ఈ మోడల్ సిరీస్ యొక్క ముందు భాగం విషయానికి వస్తే, దీని యొక్క డి మరియు డి1 వాహనాలలో సిల్వర్ ఫినిషింగ్ తో కూడిన రేడియేటర్ గ్రిల్ అందించబడుతుంది. అదే మిగిలిన రెండు వేరియంట్ల విషయానికి వస్తే, క్రోం ఫినిషింగ్ కలిగిన రేడియేటర్ గ్రిల్ అందించబడుతుంది. అంతేకాకుండా, ఈ రేడియేటర్ గ్రిల్ మధ్య భాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. దీనికి ఇరువైపులా హాలోజన్ ల్యాంప్ లు మరియు సైడ్ టర్న్ సూచికలను కలిగిన ప్రకాశవంతమైన హెడ్ లైట్ క్లస్టర్ బిగించబడి ఉంటుంది. ఈ వాహన సిరీస్ యొక్క ఏ మరియు టి వేరియంట్ లలో ముందు బంపర్, కారు యొక్క శరీర రంగులో ఉంటుంది. అదే మిగిలిన వేరియంట్ లలో అయితే, నలుపు రంగు బంపర్ బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా, ఇంజన్ ను చల్లబరచడం కోసం ఒక ఎయిర్ డాం కూడా బిగించబడి ఉంటుంది. వీటితో పాటు, బోనెట్ పై ఎక్స్ప్రెస్సివ్ లైన్లు ముందు భాగానికి మరింత ఆకర్షణీయతను అందిస్తాయి.

ఈ హాచ్బాక్ సిరీస్ యొక్క వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ మోడల్ ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉండటమే కాకుండా, కారు శరీరం రంగులో ఉండే బంపర్ ను మరియు స్టైలిష్ టైల్ లైట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. దీని యొక్క బూట్ మూత పై మోడల్ అక్షరాలతో ఒక వ్యక్తీకరణ డిజైన్ ను కలిగి ఉంది. ఈ వాహనం యొక్క విండ్షీల్డ్ కు, భద్రతను చేకూర్చే అధిక మౌంట్ బ్రేక్ లైట్ బిగించబడి ఉంటుంది. ఈ వాహన సిరీస్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, సైడ్ ప్రొఫైల్ అద్భుతమైన డిజైన్ తో పాటు బలమైన క్యారెక్టర్ లైన్స్ ను కలిగి ఉంటుంది. ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో డోర్ హ్యాండిల్స్ మరియు ఓ ఆర్ వి ఎం లు కారు యొక్క బాడీ కలర్ లో ఉంటాయి. అదే మిగిలిన వేరియంట్ ల విషయానికి వస్తే, ఈ రెండూ కూడా బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈ వాహన సిరీస్ యొక్క ఏ మరియు టి వేరియంట్ల వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు, అంతర్గతంగా సర్దుబాటు అవుతాయి. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ల వీల్ ఆర్చులకు, బలమైన స్టీల్ వీల్స్ అందించబడతాయి. అదే వీటి యొక్క రింల విషయానికి వస్తే, ఈ రింలు ట్యూబ్లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే వీల్ కవర్ లు అందించబడతాయి. అదే మిగిలిన మూడు వేరియంట్ల విషయానికి వస్తే వీల్ క్యాప్ లు మాత్రమే అందించబడతాయి. వీటన్నింటితో పాటు, ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, రేర్ డోర్ ఫినిషర్ కు మరియు సెంటర్ పిల్లర్ లకు సాష్ టేప్ బిగించి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్, 2450 మిల్లీ మీటర్లు గల వీల్బేస్ ను కలిగి ఉన్న కారణంగా పుష్కలమైన లెగ్ స్పేస్ కు మద్దతిస్తుంది. దీని యొక్క కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీ మీటర్లు. ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 3785 మిల్లీ మీటర్లు, ఎత్తు 1485 మిల్లీ మీటర్లు, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ తో సహ మొత్తం వెడల్పు 1635 మిల్లీ మీటర్లు. అంతేకాకుండా, ఈ మోడల్ 265 లీటర్లు గల బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది. దీనిని వెనుక సీటు మడవటం ద్వారా మరింత పెంచవచ్చు. మరొక విషయం ఏమిటంటే, దీని స్టీరింగ్ వీల్, 4.6 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధానికి మద్దతు ఇస్తుంది.

లోపలి డిజైన్:


ఈ వాహన సిరీస్ యొక్క గో ఎన్ ఎక్స్ టి వాహన అంతర్గత క్యాబిన్, ప్రస్తుతం ఉన్న మిగిలిన వాహనాల కంటే చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే, ఈ వాహనం లో ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పియానో బ్లాక్ ఫినిషింగ్ తో అలంకరించబడి ఉంటుంది. అదనంగా సంస్థ, ప్రయాణికులకు అవసరమైన అన్ని నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకునేందుకు పార్సెల్ ట్రే ను అందిస్తోంది. ఈ విభాగం లో ఉన్న ఇతర వాహనాల కంటే కూడా ఈ వాహనం యొక్క అంతర్గత క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. దీని యొక్క కాక్పిట్ విభాగం, కనెక్టడ్ సీట్స్ తో అలంకరించబడి ఉంటుంది. దీని వలన ప్రయాణికులకు అదనపు స్పేస్ అందించబడుతుంది. అదే వెనుక క్యాబిన్ విషయానికి వస్తే, విస్తృత బెంచ్ సీటు అందించబడుతుంది. దీని వలన ముగ్గురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునే సదుపాయం అందించబడుతుంది. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ కు, బాటిల్ హోల్డర్స్ ను కలిగిన ముందు డోర్లు, డ్రైవర్ మరియు ప్రయాణికుడి వైపు స్టోరేజ్ ట్రే తో పాటు కాయిన్ హోల్డర్, ఒక గ్లొవ్ కంపార్ట్మెంట్, వెన్నుముక కు మద్దతిచ్చే ముందు సీట్లు, మోల్డెడ్ డోర్ ట్రింస్, ఎర్గనామికల్ గా ఉన్న పార్కింగ్ బ్రేక్ మరియు ముందు సీటు వెనుక పాకెట్లు (టి వాహనం లో మాత్రమే ఉన్నాయి) వంటి కొన్ని వినియోగ ఆధారిత లక్షణాలు అందించబడ్డాయి. ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో స్పీకర్స్ మరియు యాంప్లిఫైయర్ తో కూడిన సంగీత వ్యవస్థ అందించబడింది. ఈ సంగీత వ్యవస్థ, ఆక్స్- ఇన్ పోర్ట్ మరియు యూఎస్బి ఇంటర్ఫేస్ వంటి కనెక్టవిటీ లకు మద్దతిస్తుంది. వీటితో పాటు ఈ హాచ్బాక్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్ పరికరం, సిల్వర్ ఫినిషింగ్ తో కూడిన ఏసి వెంట్లు, బి మరియు సి పిల్లార్ పూర్తి ట్రిం లు (అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే), స్లైడ్ మరియు రిక్లైనింగ్ ఫంక్షన్ లను కలిగిన ముందు సీట్లు, డోర్ ఆర్మ్ రెస్ట్లు, ముందు డోర్లకు స్పీకర్ గ్రిల్ మరియు అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాహనం, మొబైల్, ల్యాప్టాప్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కోసం సెంటర్ కన్సోల్ లో ఒక 12వి పవర్ సాకెట్ ను కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ మోడల్ సిరీస్ యొక్క అంతర్గత క్యాబిన్ చాలా ఆకర్షణీయంగా రూపొందించబడింది మరియు యజమానుల సౌలభ్యం కోసం అనేక అధునాతన లక్షణాలు అందించబడ్డాయి. అంతేకాకుండా డ్రైవర్ సౌలభ్యం కోసం, కొన్ని ఫంక్షన్లతో కూడిన ప్రకాశవంతమైన ఇన్స్ట్రుమెంట్ పానెల్ ను ఈ వాహన సిరీస్ కు అందించడం జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో, ఒక డిజిటల్ టాకొమీటర్, డోర్ అజార్ వార్నింగ్, సగటు ఇంధన సామర్ధ్యం మరియు డిస్టెన్స్ టు ఎంటీ లతో కూడిన డ్రైవ్ కంప్యూటర్ వంటి లక్షణాల జాబితాను పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా, ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిక లైట్, ఒక డిజిటల్ ట్రిప్ మీటర్ మరియు ఒక ఎలక్ట్రానిక్ ఇంధన గేజ్ మరియు గేర్ షిఫ్ట్ గైడ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ విషయానికి వస్తే, ఇది స్పీడ్ సెన్సిటివ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వ్యవస్థ ను కలిగి ఉంటుంది. ఇది, భారీ ట్రాఫిక్ పరిస్థితులలో కూడా హ్యాండ్లింగ్ ను సులభతరం చేస్తుంది. అదే, డి, డి1 మరియు ఏ వేరియంట్ల విషయానికి వస్తే, వీటిలో మాన్యువల్ స్టీరింగ్ వీల్ అందించబడుతుంది. ఈ వాహనాలలో, ప్రయాణికులకు తగినంత లెగ్ స్పేస్ ను అందించే సౌకర్యవంతమైన సీట్లు పొందుపరచబడ్డాయి. ఈ సీట్లు ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా, అన్ని సీట్లకు హెడ్ రెస్ట్ లు అందించబడతాయి. ఈ సంస్థ, ఈ వాహనానికి రిమోట్ ఫ్యూయల్ లిడ్ మరియు టైల్ గేట్ ఓపెనర్, ఫ్రంట్ పవర్ విండోస్ (అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే), మూడు స్పోక్ ల స్టీరింగ్ వీల్, వెనుక సీటు బెంచ్ తో పాటు ఫోల్డింగ్ ఫంక్షన్, అంతర్గత రూం ల్యాంప్, రేర్ అసిస్ట్ గ్రిప్ మరియు అనేక ఇతర లక్షణాలు అందించడం జరిగింది. ఈ సంస్థ యొక్క తయారీదారుడు, ఇటీవల కొత్తగా విడుదల అయిన గో ఎన్ ఎక్స్ టి వాహనానికి రేర్ పార్కింగ్ సెన్సార్లను అందించాడు. దీని వలన మూలల్లో వాహనాన్ని సులభంగా పార్క్ చేసేందుకు సహాయపడుతుంది.

లోపలి కొలతలు:


ఈ మోడల్ సిరీస్ యొక్క వాహనాలు, విశాలమైన క్యాబిన్ స్పేస్ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనాలు 2450 మిల్లీ మీటర్ల వీల్బేస్ ను కలిగి ఉండటం వలన సౌకర్యవంతమైన సీటింగ్ ను కలిగి ఉండటమే కాకుండా, ప్రయాణికులందరికీ పుష్కలమైన లెగ్ రూం ను, హెడ్ రూం ను మరియు షోల్డర్ స్పేస్ లను కలిగి ఉంటుంది. ఈ వాహనం, 265 లీటర్లు గల ఒక విశాలమైన బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది. దీనిని వెనుక సీటు మడవటం ద్వారా మరింత పెంచవచ్చు.

ఇంజన్ మరియు దాని పనితీరు:


ఈ హాచ్బాక్ యొక్క అన్ని మోడళ్ళు 1.2 లీటర్, ఇన్ లైన్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజన్ 1198 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా మూడు సిలండర్లను మరియు 12 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ఎలక్ట్రానిక్ గాసోలిన్ ఇంజెక్షన్ వ్యవస్థ తో జత చేయబడి, ఆరోగ్యకరమైన ఇంధనాన్ని సరఫరా చేయగల సామర్ధ్యాన్ని ఈ హాచ్బాక్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 5000 ఆర్ పి ఎం వద్ద 67.06 బి హెచ్ పి పవర్ ను అలాగే 4000 ఆర్ పి ఎం వద్ద 104 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ (కేబుల్ టైప్ తో పాటు హైడ్రాలిక్ క్లచ్ ఆపరేషన్ సిస్టం) ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా, విడుదల అయిన టార్క్ అవుట్పుట్ ను వాహనం యొక్క ముందు వీల్స్ కు పంపిణీ చేయబడుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, మొబైల్ డాకింగ్ స్టేషన్ ను అందించడం జరిగింది. ఇది ఒక మొబైల్ హోల్డర్ ను మరియు యాంప్లిఫైయర్ కలిగి ఉంటుంది. అలాగే, యూఎస్బి పోర్ట్, ఆక్సిలర్ ఇన్పుట్ ఎంపికల తో పాటు ముందు స్పీకర్లకు మద్దతు ఇస్తుంది. ఇతర ఉపకరణాల విషయానికి వస్తే, ఈ వాహన సీట్లు కోసం అధిక నాణ్యత కలిగిన ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ, అంతర్గత కార్పెట్స్, మడ్ ఫ్లాప్స్ మరియు కొన్ని ఇతర అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా, కొనుగోలుదారుడు ఈ వాహనం కోసం ఒక స్పోర్టి రేర్ స్పాయిలర్, స్టైలిష్ బాడీ డికాల్స్, ప్రీమియం లెథర్ సీట్ కవర్లు, సైడ్ మోల్డింగ్స్ మరియు రక్షిత క్లాడింగ్స్ వంటి స్టైలింగ్ అంశాలను ఎంపిక చేసుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ అద్భుతమైన హాచ్బాక్ యొక్క వీల్ ఆర్చులు, చక్కని 13 అంగుళాల కన్వెన్షినల్ స్టీల్ చక్రాల సమితి తో బిగించి ఉంటాయి. వీటి యొక్క రిమ్ లు, రోడ్లపై ఒక ఉన్నత పట్టును అందించడానికి 155/70 R13 పరిమాణం గల అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ టైర్లతో కప్పబడి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


  ఈ వాహనం, స్థిరత్వంగా ఉండటానికి మరియు అసమాన రోడ్లు కారణంగా ఎత్తుపల్లాలను పరిష్కరించేందుకు సాధ్యపడేల సమర్థవంతమైన సస్పెన్షన్ వ్యవస్థ ను ఈ వాహన సిరీస్ కు అందించడం జరిగింది. ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో పాటు డబుల్ పైవోట్ లోయర్ ఆర్మ్ తో జత చేయబడి ఉంటుంది. అదే వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, హెచ్- టైప్ టోరిసన్ బీం తో జత చేయబడి ఉంటుంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ కు ఒక నమ్మకమైన బ్రేకింగ్ సిస్టమ్ ను అందించాడు. ఇది కీలకమైన అంశాలలో ఒకటి. దీనిలో భాగంగా, ఈ వాహనాల ముందు చక్రాలు వెంటిలేషన్ డిస్క్ బ్రేక్ల సమితి తో బిగించి ఉంటాయి. అదే విధంగా వెనుక చక్రాలు గట్టి డ్రమ్ బ్రేక్ల సమితి తో బిగించి ఉంటాయి. అంతేకాకుండా, ఈ హాచ్బాక్ కు స్పీడ్ సెన్సిటివ్ మరియు టిల్ట్ సర్దుబాటు ఫంక్షన్ లను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టం అందించడం జరిగింది. ఈ స్టీరింగ్ వీల్, 4.6 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్దానికి సహకరిస్తూ సౌకర్యవంతమైన నిర్వహణను అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన టి(ఓ) వాహనానికి డ్రైవర్ ఎయిర్బాగ్ ను ప్రామాణికంగా అందించడం జరిగింది. ఈ మోడల్ సిరీస్ యొక్క వాహనాలు రోడ్ల పై రక్షణను అందించడానికి అనేక రక్షిత లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ వాహనాలలో ఏ అనధికార యాక్సిస్ లోపలికి ప్రవేశించకుండా మరియు వాహనాన్ని దొంగతనాల బారీ నుండి కాపాడుటకు ఇంజన్ ఇమ్మోబిలైజర్ ను అందించడం జరిగింది. తయారీదారుడు, ఈ వాహనానికి శక్తివంతమైన హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ను అందించాడు. ఇవి, వాతావరణం సరిగా లేని పరిస్థితులతో డ్రైవర్ కు రోడ్లపై ప్రత్యక్షతను అందించడానికి సహాయపడతాయి. అదనపు భద్రతను అందించడానికి, వెనుక డోర్లకు చైల్డ్ సేఫ్టీ లాక్స్ ను అందించారు. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్లలో, ముందు మరియు వెనుక సీట్లకు మూడు పాయింట్ల సీటు బెల్ట్ లను అందించడం జరిగింది. అయితే, వెనుక మధ్య సీటు మాత్రం రెండు పాయింట్ల సీటు బెల్ట్ తో వస్తుంది. ఈ వాహన సిరీస్, డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ ల్యాంప్ ను కూడా కలిగి ఉంటాయి. దీని యొక్క ప్రదర్శన ఇన్స్ట్రుమెంట్ పానెల్ పై ప్రదర్శింపబడుతుంది. వీటన్నింటితో పాటు, ఈ వాహన సిరీస్ ప్రమాద సమయాలలో తాకిడి ప్రబావాన్ని తగ్గించి ప్రయాణికులకు రక్షణ ను అందించే ఒక దృఢమైన శరీర నిర్మాణం తో పాటు ముందు మరియు సైడ్ ఇంపాక్ట్ బీంస్ ను, సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టం లను కలిగి ఉన్నాయి.

అనుకూలాలు:


1. కనెక్ట్ అయిన ముందు సీట్లు ఎక్కువ స్పేస్ అందిస్తున్నాయి.
2. ఈ వాహనం, 296 లీటర్ల గల మంచి బూట్ స్పేస్ ను కలిగి ఉంది.
3. ఈ వాహనం లో డ్రైవర్ కు ఎయిర్బాగ్ ను అదనంగా అందించడం అనేది ఒక అనుకూలత అని చెప్పవచ్చు
4. పొడవైన వీల్బేస్ కారణంగా, తగినంత లెగ్ రూం కు అనుమతిస్తుంది.
5. దీని యొక్క నైపుణ్యం గల సస్పెన్షన్ సిస్టమ్, వాహనాన్ని బాగా సమతుల్యంగా ఉంచుతుంది.

ప్రతికూలాలు:


1. ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో కూడా ఏబిఎస్ మరియు ఎయిర్బ్యాగ్స్ లేకపోవడం అనేది ఒక పెద్ద ప్రతికూలత అని చెప్పవచ్చు.
2. వెనుక సీట్లు, తక్కువ సౌకర్యాన్ని అందిస్తాయి.
3. ఈ వాహన సిరీస్ లో మరికొన్ని అంశాలను జోడించవచ్చు.
4. బాహ్య రూపాన్ని ఇంకా అభివృద్ధి చేయవచ్చు.
5. అల్లాయ్ వీల్స్ లేకపోవడం ఒక ప్రతికూలత.