చెవ్రోలెట్ టవెరా

` 7.9 - 12.0 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

చెవ్రోలెట్ ఇతర కారు మోడల్లు

 
*Rs

చెవ్రోలెట్ టవెరా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిన వినియోగాధారిత ప్రముఖ ఆటోమొబైల్ తయారీసంస్థ. ఇది అత్యుత్తమ వాహనాలను అందించడంలో ప్రఖ్యాతిగాంచిన సంస్థ. ఈ సంస్థ సేవా కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉండడం వలన కొనుగోలుదారులకు మంచి ప్రయోజనం కలిగి ఉంది. ఈ ప్రత్యేక మోడల్, షెవ్రొలె టవెరా క్లాసిక్ సిరీస్ ఒక యుటిలిటీ వాహనం ప్రదర్శనకు ఒక మంచి ఉదాహరణ. ఈ వాహనం ఒక డీజిల్ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ దీనిలో చాలా వేరియంట్లు సీటింగ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఈ వాహనం సుమారు 3 సంవత్సరాలు లేదా 100,000 కిలోమీటర్ల వారంటీతో అందుబాటులో ఉంది. ఈ బహుళ ప్రయోజనం గల యుటిలిటీ వాహనం భారీ సామానులని తీసుకువెళ్ళే విధంగా మరియు ప్రయాణికులకి కూడా సౌకర్యాన్ని కలిపిస్తుంది. ఇది ఏడు సీట్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు 780 లీటర్ల బూట్ సామర్ధ్యంతో అందుబాటులో ఉంది. ఈ వాహనం డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి మంచి పనితీరుని అందిస్తుంది. అలానే ఈ వాహనం 2.5 లీటర్ టిసిడిఐ మోటార్ హైవేస్ లో 13.58 kmpl మైలేజ్ ని మరియు నగర పరిధిలలో 10.0 kmpl మైలేజ్ ని అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. భారీ కొలతలతో నిర్మించబడిన ఈ వాహనం ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ వాహనం యొక్క బాహ్య రూపం క్రోం చేరికలు కలిగిన రేడియేటర్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మరింత బాడీ రంగు బంపర్స్, బాహ్య అద్దాలు మరియు డోర్ హ్యాండిల్స్ తో మెరుగుపరచబడినది. దీనిలో క్యాబిన్ డ్యుయల్ టోన్ థీమ్ మరియు వివిధ భాగాలపై నల్లని ఫినిషింగ్ తో బాహ్య రూపం కంటే కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనిలో 55.2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్ధ్యం ఉండడం వలన దూరపు ప్రయాణాలకు ఈ వాహనం చాలా అనుకూలమైనది. దీనిలో పిల్లల డోర్ లాక్స్, సీటు బెల్టులు మరియు కేంద్ర మౌంట్ స్టాప్ దీపం వంటి కొన్ని భద్రతా లక్షణాలు అందించబడి ప్రయాణికులను ప్రమాదాల భారి నుండి కాపాడతాయి. అలానే దీనిలో సంగీత వ్యవస్థ వినోదం కొరకు మరియు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సౌకర్యార్ధమై అందుబాటులో ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కలగలిసిన ఈ భారీ వాహనం వినియోగదారులకి మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్ధ్యం:


ఈ సిరీస్ డీజిల్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది మరియు అనేక వేరియంట్లు విభిన్నమైన సీటింగ్ సామర్థ్యంతో అందించబడతాయి. ఈ ఇంజిన్ ప్రామాణిక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. 2.5 లీటర్ టిసిడిఐ మోటార్ హైవేస్ లో 13.58 kmpl మైలేజ్ ని మరియు నగర పరిధిలలో 10.0 kmpl మైలేజ్ ని అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

శక్తి సామర్ధ్యం:


టర్బోచార్జెడ్ 2.5 లీటర్ ఇంజన్ నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వులను కలిగియుండి 2499cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 3900rpm వద్ద 72.4bhp శక్తిని మరియు 1800rpm వద్ద 171Nm టార్క్ ని అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ సిరీస్ ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జతచేయబడి 21 నుంచి 23 సెకన్లలో 100 కంఫ్ వేగం వరకూ చేరుకోగలదు. ఈ వాహనం సమర్థవంతమైన ఇంజన్ తో అమర్చబడి 135 నుండి 140 కిలోమీటర్ల గరిష్ట వేగం చేరుకోగలదు. ఈ ఇంజిన్ 2499cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది.

వెలుపలి డిజైన్:


ఈ వాహనం యొక్క బాహ్య భాగం సొగసైన అంశాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో అన్ని వేరియంట్లు టర్న్ ఇండికేటర్స్ తో హెడ్ల్యాంప్స్ ని కలిగి ఉన్నాయి. ఎనిఒ3 మరియు ఎనిఒ3 మాక్స్ వేరియంట్స్ నల్లని రంగు బంపర్స్ మరియు స్టీల్ సైడ్ స్టెప్స్ తో అమర్చబడి ఉన్నాయి. అయితే ఎనిఒ3 ఎల్ఎస్ ట్రిం శరీరం రంగు ముందర మరియు వెనుక బంపర్స్ ని మరియు సైడ్ స్టెప్స్ ని కలిగి ఉంటుంది. ఇంకా ఎల్ఎస్ మరియు ఎల్టి వేరియంట్లు వాహనం ఇరువైపులా శరీరం రంగు లో పెయింట్ చేయబడిన బయట వెనుక వీక్షణ అద్దాలు వంటి ఇతర అంశాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణం వాహనం లుక్ ని మరింతగా పెంచుతుంది. అంతేకాకుండా, దీని డోర్ హ్యాండిల్స్ మరియు టెయిల్ గేట్ హ్యాండిల్స్ కూడా శరీరం రంగులో అందించబడి ప్రక్క భాగం లుక్ ని మరింతగా పెంచుతాయి. ఎనిఒ3 మ్యాక్స్ వీల్స్ కి హబ్ కాప్స్ ని అందించగా, ఎల్ఎస్3 మరియు ఎల్టి వేరియంట్లు పూర్తి వీల్ కవర్ తో కప్పబడి ఉంటాయి. ఇది చాలా స్టయిలిష్ గా మరియు వాహనం యొక్క పూర్తి చిత్రాన్ని మెరుగు పరిచే విధంగా ఉంటుంది. ఈ ట్రింస్ అధనంగా క్రోం చేరికలు కలిగిన రేడియేటర్ గ్రిల్ తో ముందరి భాగానికి ఆకర్షణీయమైన లుక్ ని అందిస్తాయి. మిగిలిన వేరియంట్స్ బలమైన స్టీల్ చక్రాల సమితితో అమర్చబడి ఉంటాయి మరియు అగ్ర శ్రేణి వేరియంట్ 15 అంగుళాలు అలాయ్ వీల్స్ సమితితో అమర్చబడి ఉంటాయి. దీని ఎల్టి వేరియంట్ తదుపరి మరిన్ని లక్షణాలతో అలంకరించబడి ఉంటాయి. అలానే ఈ వాహనం ముందరి భాగంలో ఫాగ్ల్యాంప్స్ అమర్చబడియుండి క్రోం తో పెయింట్ చేయబడి ఉంటాయి.

వెలుపలి కొలతలు:


ఈ వాహనం ఎక్కువ మంది ప్రయాణికులకి సరిపడే విదంగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 4435mm, వెడల్పు 1680mm మరియు ఎత్తు 1765mm. దీని వీల్బేస్ 2685mm చాలా పెద్దది మరియు అంతర్గత కొలతలు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170mm దీనిని ఇంకా కొంచెం పెంచవచ్చు. ఈ వర్గంలో వాహనాలు భారీగా మరియు బలమైనవిగా ఉంటాయి మరియు ఈ నమూనా కూడా అదే విధంగా రూపొందించబడినది.

లోపలి డిజైన్:


ఈ వాహనం అన్ని వేరియంట్లలో క్యాబిన్ లోపల అంతర్భాగాలు డ్యుయల్ టోన్ తో అలంకరించబడి ఉంటాయి. ఇది ప్రదర్శనను విస్తరించేందుకు మాత్రమే కాకుండా ఒక స్పోర్టి లుక్ ని కూడా అందిస్తుంది. అన్ని ట్రిం లో పూర్తి ఫాబ్రిక్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ కలిసి కాళ్ల ప్రాంతంలో కూడా గొప్పతనాన్ని జతచేస్తాయి. ఎల్ఎస్ మరియు ఎల్టి వేరియంట్లు 3 స్పోక్ల స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటాయి. అయితే ఇతర వేరియంట్లు రెండు స్పోక్ల స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటాయి. దీని ముందర సీట్లు వినియోగదారులకి గొప్ప సౌకర్యాన్ని అందిస్తాయి మరియు అధనంగా డ్రైవర్ సీటు హెడ్రెస్ట్ తో అమర్చబడి ఉంటుంది. దీని క్యాబిన్ లో బహుళ ప్రకటనలను ప్రదర్శించే ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీని ప్యానెల్ నీలం రంగులో ప్రకాశిస్తూ కంపార్ట్మెంట్ ని ఆకర్షణీయంగా ఉంచుతుంది. క్యాబిన్ ముందు మరియు వెనుక వైపుల రూఫ్ ల్యాంప్స్ అందించబడి ఉంటాయి. అయితే, బేస్ వేరియంట్ లో ముందర మాత్రమే ల్యాంప్ అందించబడుతుంది. ఎల్ఎస్ మరియు ఎల్టి వేరియంట్లు అధనపు లక్షణాలతో పొందుపరచబడ్డాయి. ఈ అధనపు లక్షణాలలో ఈ రెండు ట్రింస్ యొక్క సీట్లుకి ఫాబ్రిక్ అపోలిస్ట్రీ అందించబడడం అలానే ఏడు సీట్ల ఎల్టి ట్రిమ్ లెథర్ సీట్లతో అందించబడడం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా డోర్ ట్రిం పైన ఫాబ్రిక్ చేరికలు ఒక ఆహ్లాదకరమైన లుక్ ని ఇస్తాయి. డ్రైవర్ మరియు ప్రయాణీకుల ముందరి సీటు వెనుక పత్రిక పాకెట్స్ తో బిగించి ఉంటుంది. దీనిలో గేర్షిఫ్ట్ నాబ్ అధిక నాణ్యత గ్లోస్ ఫినిషింగ్ తో పొరలుగా ఉంటుంది. ఇదే రకమైనటువంటి ఫినిషింగ్ స్విచ్లు మరియు సెంటర్ కన్సోల్ కి కూడా అందించడం జరిగింది.

లోపలి సౌకర్యాలు:


ఈ మోడల్ సిరీస్ లో చాలా సౌకర్యలక్షణాలు అమర్చబడి ఈ వర్గంలో ఇది అత్యంత సౌకర్య లక్షణాలు కలిగిన వాహనంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ వాహనం పవర్ స్టీరింగ్ తో అందించబడి డ్రైవర్ శమను తగ్గిస్తుంది. కానీ ఈ లక్షణం ఒక అగ్ర శ్రేణి వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, ఎనిఒ3 మరియు ఎనిఒ3 మాక్స్ వేరియంట్లలో మానవీయ స్టీరింగ్ కలిగి ఉంది. ఒక స్పేర్ వీల్ కూడా అధనపు సౌకర్యం కొరకు అందించబడుతున్నది. ఒక డెడ్ పెడల్ డ్రైవర్ పాదాల ప్రాంతము వద్ద బిగించబడి ఒక ఫుట్ రెస్ట్ లాగా పనిచేస్తుంది. ఈ వాహనం రెండు గ్లోవ్ బాక్సులను కలిగి ఉండి నిల్వా స్థలాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఈ గ్లోవ్ బాక్స్ లాకింగ్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. అలానే దీనిలో ఫ్యుయల్ లిడ్ ఓపెనర్ మరియు తక్కువ ఇంధన హెచ్చరిక సూచిక వంటివి కూడా సౌలభ్యం కొరకు అందించబడుతున్నవి. అంతేకాకుండా దీనిలో అన్ని వేరియంట్లలో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ అందుబాటులో ఉంది.

లోపలి కొలతలు:


కంపార్ట్మెంట్ చలా బాగా రూపకల్పన చేయబడి ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యాన్ని కలిపిస్తుంది. దీని షోల్డర్ స్పేస్ పుష్కలంగా ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో హెడ్ స్పేస్ కూడా పొడవైన వ్యక్తులకు సరిపడా అందించబడుతుంది. దీనిలో ముందర మరియు వెనుక కూర్చునే ప్రయాణికులకి మోకాలి గది కూడా చాలా విశాలంగా కాళ్ళు మరియు సీట్లు మధ్య ఏ ఘర్షణ లేని విధంగా ఉంటుంది. దీనిలో ఇంధన ట్యాంక్ సామర్ధ్యం 55.2 లీటర్లు ఉండి దీర్ఘ ప్రయాణాల కొరకు సులభదాయకంగా ఉంటుంది.

ఇంజన్ మరియు దాని పనితీరు:


ఈ మోడల్ సిరీస్ టర్బోచార్జ్డ్ ఇది ఒక 2.5-లీటర్ ఇంజిన్ తో సుమారు 2499cc యొక్క స్థానభ్రంశాన్ని అందిస్తుంది. తదుపరి ఇది 3900rpm వద్ద 72.3bhp శక్తిని మరియు 1800rpm వద్ద 171Nm టార్క్ ని అందిస్తుంది. ఇది ఒక డ్యుయల్ ఓవర్హెడ్ కామ్షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలిండర్లను మరియు పదహారు వాల్వులను కలిగి ఉంది. ఇది ఒక ప్రామాణిక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ అధారంగా ఉంది. ఇటువంటి సమర్థవంతమైన విధానంతో, ఈ వాహనం రహదారులపై 13.58kmpl మైలేజ్ ని మరియు నగర పరిధిలలో 10.0kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఈ మోటార్ బిఎసీII ఎమిషన్ నిబంధనల సమ్మతితో అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వాహనం ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


దీని అగ్ర శ్రేణి వేరియంట్ ఆక్స్ ఇన్ పోర్ట్ ని కలిగియున్న 2-డిన్ ఆడియో వ్యవస్థతో అమర్చబడి ఉంటుంది. ఒక యాంటీనా రూఫ్ పైన అమర్చబడి ఉంటుంది మరియు ఎఫ్/ఎఎం మరియు రేడియో ట్యూనర్ క్యాబిన్ లో అందుబాటులో ఉంది. ఇది 4 స్పీకర్లకు మరియు రెండు టిటర్లకు మద్దతు ఇస్తూ ఎనిఒ3 ఎల్టి వేరియంట్లో అందుబాటులో ఉంది. ఈ వాహనం అదనంగా ఇతర ఉపకరణాలతో అమర్చబడి ఉండవచ్చు మరియు వినియోగదారులు కొనుగోలుదారుల ప్రాధాన్యత ప్రకారం మడ్ ఫ్లాప్స్ వంటి లక్షణాలతో అనుకూలీకరించవచ్చు. ఎయిర్బ్యాగ్స్ భద్రత కోసం ముందు ప్రయాణీకులకు అమర్చబడి ఉంది. వెనుక వైపు స్పాయిలర్స్ మరియు రూఫ్ రెయిల్స్ మంచి శైలి మరియు లుక్ కోసం జత చేయబడినవి. దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ అమర్చబడి అనధికార ప్రవేశాన్ని వాహనం నుండి తొలగించడానికి ఉపయోగపడుతుంది మరియు అధనపు ఫ్యాన్సీ డికేల్స్ బాహ్య శరీరం మీద పెయింట్ చేయబడి వాహనానికి ట్రెండీ మరియు స్పోర్టీ లుక్ ని ఇస్తుంది. ఇది కాక, అనేక ఉపకరణాలు అదనపు ఖర్చు వద్ద కొనుగోలుదారు యొక్క ఎంపిక ప్రకారం జోడించవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ నమూనా ఒక ఎంపివి మరియు అన్ని వాహనాలు ముఖ్యంగా వారి టైర్లు మరియు చక్రాలతో మంచి ప్రదర్శనను అందిస్తాయి. ఇది రోడ్లు వివిధ రకాల మీద ఉపయోగించబడుతుంది మరియు అందుకే బలమైన అంతర్నిర్మిత టైర్లు సమితితో అందించబడుతుంది. ఈ టైర్లు ట్యూబ్ లేకుండా మరియు 205/65 R15 పరిమాణాన్ని కలిగి ఉంటాయి. తదుపరి ఈ టైర్లు 15 అంగుళాలు పరిమాణం గల అలాయి వీల్స్ పై కప్పబడి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీని ముందరి వీల్స్ సమర్థవంతమైన డిస్క్ బ్రేక్లు సమితితో బిగించబడి ఉండగా వెనుక బ్రేకులు ప్రామాణిక డ్రమ్ బ్రేక్లు సమితితో అమర్చబడతాయి. ఈ సస్పెన్షన్ బాగా అమర్చబడి ఉంది మరియు ఇది ఇటువంటి వినియోగ వాహనాలకు చాలా అవసరం. దీని ముందరి ఆక్సిల్ ఇండిపెండెంట్ టార్షన్ బార్ స్ప్రింగ్ తో అమర్చబడి ఉండగా మరియు వెనుక ఆక్సిల్ సెమీ దీర్ఘవృత్తాకార మరియు లీఫ్ స్ప్రింగ్ టైప్ మెకానిజంతో అమర్చబడి ఉంటుంది. గ్యాస్ తో నిండియున్న షాక్ అబ్జార్బర్స్ నాలుగు చక్రాలకు అమర్చబడి ఉంటుంది. దీని బేస్ వేరియంట్స్ మన్యూవల్ స్టీరింగ్ తో అమర్చబడి ఉండగా దీని అధిక శ్రేణి వేరియంట్లు పవర్ స్టీరింగ్ తో అమర్చబడి ఉంటాయి. దీని కనీస టర్నింగ్ రేడియస్ 5.6మీటర్లు.

భద్రత మరియు రక్షణ:


ఈ సిరీస్ లో అందుబాటులో ఉన్న భద్రతా కోణాలు చాలా నిరాడంబరమైనవి కావచ్చు. కానీ, ఈ వాహనాన్ని అత్యంత భద్రత గల వాహనంగా పరిగణించి సాధారణంగా కఠినమైన పద్ధతిలో మరియు ఎక్కువగా కఠినమైన రహదారులలో వాడుతారు. ఒక యుటిలిటీ వాహనానికి ముఖ్యంగా ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్ళే వాహనానికి అన్ని సీట్లకు సీట్ బెల్ట్ అమర్చబడి ఉండడం చాలా ముఖ్యం. ఈ వాహనానికి అన్ని సీట్లకి సీటు బెల్ట్లు అమర్చబడి ఉండడమనేది అత్యంత భద్రతా కారకమైన అంశం. అలానే వాహనంలో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ కూడా అందుబాటులో ఉంది. దీని వెనుక స్పాయిలర్ కి మధ్య భాగంలో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అమర్చబడి ఉంటుంది. ఈ వాహనానికి ఉండే కాంతి హెచ్చరికల కారణంగా దూరంగా ఉన్న వాహనాన్ని కూడా సులువుగా గుర్తించగలము. దీని బాహ్య భాగానికి ఉన్న సైడ్ ఇంపాక్ట్ బీంస్ కారణంగా ప్రభావాల నుండి వాహనాన్ని కాపాడుతుంది. ఈ వాహనం డ్రైవర్ యొక్క సహాయత కొరకు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ తో అమర్చబడి ప్రయాణికులకి మెరుగైన రక్షణను కలిపిస్తుంది. అధన్మగా ఈ వాహనంలో వెనుక తలుపులు పిల్లల భద్రతా తాళాలతో అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా పిల్లలు బయటకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. ఇంకా, దీనిలో పూర్తి విడి చక్రం ఫ్లోర్ పైన అమర్చబడి ఉండగా టూల్ కిట్ బూట్ కంపార్ట్మెంట్ లో అమర్చబడి ఉంటుంది. దీనిలో హాలోజన్ హెడ్ల్యాంప్స్ స్వచ్చమైన దూర దృష్టి కొరకు అందించబడుతుంది మరియు వైపర్స్ సహాయత కొరకు అందించడం జరుగుతుంది. అలానే దీనిలో వెనుక వ్యూ అద్దాలు ప్రయాణీకుల వైపు బిగించబడి అదనపు భద్రత మరియు సౌకర్యాన్ని అందిస్తాయి. అలానే దీనిలో ఇంధన ట్యాంక్ మధ్యలో అమర్చబడి ఉండి ఏదైనా విఘటన మరియు లీకేజ్ తప్పించడంలో ఉపయోగపడుతుంది.

అనుకూలాలు:


1.అనేక రంగులలో అలానే నీడ వైవిధ్యాలలో అందుబాటులో ఉంది.
2. అధిక సంఖ్య గల ప్రయాణికులను అనుమతించేందుకుగానూ విశాలమైన స్థలం అందుబాటులో ఉంది.
3. ఈ సిరీస్ లో అన్ని వేరియంట్లలో ధర పరిధి చాలా సహేతుకంగా ఉంటుంది.
4. అంతర్భాగాలు విభిన్నంగా ఉంటాయి మరియు ఎంపివి కి తగినట్టుగా ఉంటాయి.
5. దూర ప్రయాణాలు చేపట్టేందుకు అందుబాటులో ఉన్న ఉత్తమ వాహనాలలో ఇది ఒకటి.

ప్రతికూలాలు:


1. ఒక ఎంపివి కోసం తగినంత గ్రౌండ్ క్లియరెన్స్ లేదు.
2.అన్ని వేరియంట్లలో కనీసం డ్రైవర్ కి కూడా ఎయిర్బ్యాగ్స్ లేకపోవడం ఒక ప్రతికూలత.
3. ఇంధన సామర్ధ్యం రెండు ఇంజిన్లకు మెరుగుపర్చవలసిన ఆస్కారం ఉంది.
4.బాహ్య స్వరూపాన్ని మరింత స్టయిలింగ్ అంశాలతో మెరుగుపరచవలసిన ఆస్కారం ఉంది.
5. అతి తక్కువ భద్రతా అంశాలను మాత్రమే అందించడం జరిగింది.