చెవ్రోలెట్ సైల్

` 5.2 - 7.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

చెవ్రోలెట్ ఇతర కారు మోడల్లు

 
*Rs

చెవ్రోలెట్ సైల్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


కంపెనీ అన్ని సార్లు, రాజీ లేని విధంగా పనితీరును కనబరిచే మరియు సౌకర్యానికి మరో రూపమైన వాహనాలను మనకి అందిస్తుంది. వారి యొక్క చేవ్రొలెట్ సెయిల్ సెడాన్ కూడా అలా సృష్టించిన వాహానాలలో డీజిల్ అలాగే పెట్రోల్ వెర్షన్లతో కూడిన వాహనంగా చెప్పవచ్చు. బ్రేకింగ్ సామర్థ్యంతో కలిపి వివిధ లక్షణాలతో అనేక వేరియంట్స్ ఉన్నాయి. ఈ రెండు వెర్షన్ల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఆధునిక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అందించబడుతున్నాయి. ఈ మెకానిజం అన్ని రకాల రోడ్లలో ఒక గొప్పఉన్నతమైన పట్టును అందిస్తుంది. ఈ లక్షణాలే కాకుండా, దొంగతనాల నుండి రక్షించడానికి ఇమ్మొబిలైజర్, డబుల్ ఇంపాక్ట్ కొరకు డ్యయల్ హార్న్, ప్రమాదాల నుండి రక్షణ కొరకు ఎయిర్ బ్యాగ్స్ మరియు సీట్ బెల్టులు ఇంక ఎన్నో ఇతర అంశాలను ఇది కలిగి ఉంది. ఈ బాడీ డిజైన్ సురక్షిత కేజ్ బాడీ నిర్మాణం ఆధారంగా రూపొందించబడింది. ఇది బలమైన మరియు దృఢంగా ఉండి, దొంగతనాలకు వ్యతిరేకంగా వాహనాన్ని రక్షిస్తుంది. దీని యొక్క అంతర్భాగములు నలుపు మరియు లేత గోధుమరంగు డ్యుయల్ టోన్ షేడ్స్ తో అలంకరించబడి ఉంటాయి. ఇది ఒక అధునాతన లుక్ ను అందిస్తుంది. మొత్తం కంపార్ట్మెంట్ క్రోమ్ పెయింట్ తో అలంకరించబడి ఉంది. మొదటగా, లోపల డోర్ హ్యాండిల్స్, పార్కింగ్ బ్రేక్ బటన్, హెచ్ వి ఏ సి నియంత్రణ పై రింగ్ అలాగే ఏసి వెంట్స్ బెజల్లు కూడా క్రోమ్ తో అందించబడ్డాయి. దీని అంతర లుక్ మొత్తం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇంకా, ముందు సీట్లకు బ్యాక్ పాకెట్స్, డోర్లకు మ్యాప్ పాకెట్స్ ప్లస్ అధిక వాల్యూమ్ గ్లోవ్ బాక్స్ వీటితో పాటు ఫ్రంట్ కన్సోల్ లో కప్ హోల్డర్లు వంటి నిల్వ స్థాలలు దీనిలో ఉన్నాయి. బేస్ వేరియంట్లు మరియు మధ్య వేరియంట్ల యొక్క సీట్లు ఫాబ్రిక్ అపాలస్ట్రీ తో అందించబడుతున్నాయి. అయితే, అగ్ర శ్రేణి వేరియంట్లు మాత్రం లెదర్ అపాలస్ట్రీ తో అందించబడుతున్నాయి. ఒక సమర్థవంతమైన ఇంజన్ రెండు వెర్షన్ల తో, పెట్రోల్ ట్రిమ్ 22.1 kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఇది ఈ సెడాన్ లో చాలా యుక్తకరమైనదిగా చెప్పవచ్చు. అలాగే దీని డీజిల్ ట్రిమ్ 22.1 kmpl మైలేజ్ ను అందిస్తుంది. ఇంకా, ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం అనేక అంశాలను దీనిలో జోడించారు. క్యాబిన్ వెనుక భాగం లో ఉన్న ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆర్మెస్టు తో అమర్చారు. ఇది వెనుక డోర్లకు కప్ హోల్డర్లు మరియు పవర్ విండోస్ ను కలిగి ఉంది.దీనిలో డ్రైవర్ సౌకర్యం కొరకు పవర్ స్టీరింగ్ వీల్ ను అందించారు. ఇది టిల్ట్ అడ్జస్టింగ్ ఫంక్షన్లతో అనుసంధానించబడి ఉంటుంది. డ్రైవర్ సౌలభ్యం కొరకు మరింతగా ఒక రిమోట్ ఫ్యూయెల్ ఫిల్లర్ మరియు టెయిల్ గేట్ రిలీజ్ లను పెంచడం జరిగింది. ఇవి డ్రైవర్ కి ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. దీని యొక్క అన్ని ట్రిమ్స్ బహుళ ప్లేయర్లకు మద్దతునిచ్చే ఒక అధునాతన ఆడియో సిస్టమ్ తో బిగించబడి ఉంటుంది. ఈ వాహనం ఒక ఆధునిక 2-డిన్ ఆడియో యూనిట్ తో అందజేయబడుతుంది.

ఈ వ్యవస్థ ఏ ఎం/ఎఫ్ ఎం రేడియో ట్యూనర్ తో పాటు సిడి, ఎంపి3 ప్లేయర్ లతోఅందించబడుతుంది. దీనిలో బ్లూటూత్ తో పాటు యుఎస్బి పోర్ట్, సహాయక ఇన్పుట్ ఎంపికలతో మద్దతునిస్తుంది. ఈ యూనిట్ ను మొబైల్ ఫోన్ తో స్ట్రీమింగ్ కొరకు జత చేయవచ్చు. అదనంగా, ఇది ఐదు ఫోన్ పెయిరింగ్ తో, ఆటోమేటిక్ పునః అనుసంధానంతో, కాల్ చేయడం మరియు స్వీకరించడం , కాల్ ముగించడం లేదా ఒక కాలర్ ఐడి తో పాటు ఒక కాల్ తిరస్కరించడం వంటి అంశాలను కలిగి ఉంది. అన్నివేరియంట్స్ ముందు మరియు వెనుక బాడీ రంగు బంపర్స్ తో అందజేయబడి ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ మరియు హాక్ వింగ్ శైలి హెడ్ల్యాంప్స్ షూటింగ్ స్టార్ ఆధారిత డిజైన్ దాని చిత్రాన్ని ప్రత్యేకతంగా కనిపించేలా మరింత ఆకర్షణను జోడిస్తున్నాయి. దీని విశాలమైన గ్రిల్ బంగారు రంగు పెయింట్ లో డ్యుయల్ పోర్ట్ తో తగినట్లుగా ఉంది. ఆపై, సైడ్ ప్రొఫైల్ అగ్ర శ్రేణి వేరియంట్ లో ఆధునికమైన అల్లాయ్ వీల్స్ తో మరియు ఇతర ట్రిమ్స్ బలమైన స్టీల్ వీల్స్ సమితితో అందించబడుతుంది. సంస్థ దీనిని మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ( ఏది ముందు వస్తే అది) వారంటీతో అందిస్తుంది. దీని యొక్క సర్వీస్ సెంటర్లు దేశమంతటా ఉన్నాయి మరియు ఇవి దీని యొక్క అమ్మకాల తరువాతి సేవలు కూడా నమ్మదగిన విధంగా ఉన్నాయి.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని పెట్రోల్ ట్రిమ్స్ ఒక బహుళ పాయింట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారిత 1.2-లీటర్ ఇంజన్ తో అనుసంధానించబడి ఉంటాయి. ఈ వేరియంట్ రహదారులపై 18.2kmpl మైలేజ్ ను మరియు నగరంలో ట్రాఫిక్ పరిస్థితులలో 15.9 kmpl మైలేజ్ ని సరఫరా చేయడానికి అనుమతిస్తుంది. మరోవైపు, దాని డీజిల్ వేరియంట్ ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారిత 1.3 లీటర్ ఇంజన్ తో పొందుపరచబడ్డాయి. ఇది నగర పరిస్థితుల్లో దాదాపు 18.9 kmpl మైలేజ్ ను మరియు ఫ్రీ వే లపై 22.1 kmpl మైలేజ్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

శక్తి సామర్థ్యం:


దీని పెట్రోల్ ఇంజన్ నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వుల తో డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ఆధారంగా పని చేస్తుంది. ఇది 6000rpm వద్ద 82.4bhp గరిష్ట శక్తి అవుట్పుట్ ను మరియు 5000rpm వద్ద గరిష్ట ంగా 108.5Nm టార్క్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్లాస్ లో ఇది చాలా యోగ్యకరమైనది. అయితే, డీజిల్ ఇంజన్ 4000rpm వద్ద 74bhp గరిష్ట శక్తి ఉత్పత్తిని మరియు 1750rpm వద్ద 190Nm టార్క్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

యాక్సలరేషన్ మరియు పికప్:


ఈ పెట్రోల్ ఇంజిన్ 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 12.9 సెకన్లలో 100kmph మార్కును చేరుకోగలదు. ఇది 145- 150 kmph గరిష్ట వేగాన్ని సాధించగలదు. ఇది తగినంత మంచిదిగా ఉంది. అయితే,దీని డీజిల్ ఇంజిన్ 150-155kmph వేగాన్ని చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు ఇది దాదాపు 11.9 సెకన్లలో జీరో నుంచి 100 kmph వరకు వేగవంతం చేసుకునే సామర్థ్యంతో ఉంది.

వెలుపలి డిజైన్:


ఈ సెడాన్ సిరీస్ యొక్క బాహ్య రూపం అత్యంత జాగ్రత్తగా మరియు వివరణాత్మకంగా కనిపించేలా రూపొందించబడింది. ఇది అత్యంత ప్రశంసనీయంగా మరియు దాని సెగ్మెంట్లో ఇంతకు ముందెరుగని విధంగా పోటీతత్వం తో మనకి అందించబడుతుంది. బాహ్య పరమైన అంశాలు అన్నీ క్రోమ్ తో పెయింట్ చేయబడి ఉంటాయి. అందువలన ఇది ప్రకాశవంతమైనదిగా కనిపిస్తుంది. దీని ముందు భాగం డ్యుయల్ పోర్ట్ డిజైన్ తో ఒక రేడియేటర్ గ్రిల్ ను కలిగి అందంగా అలంకరించబడి ఉంటుంది. ఇది మరింతగా ఒక నల్లటి మెష్ తో కలిపి మరియు దాని చుట్టూ క్రోమ్ ఫినిషింగ్ తో ఉంటుంది. ఇంకా, దాని యొక్క బ్యాడ్జ్ పైన కంపెనీ యొక్క చిహ్నం ముద్రించబడి ఉంటుంది. గోల్డ్ ప్లేటింగ్ తో పొరలుగా ఉన్నందు వలన ముందు భాగం చూడడానికి ప్రకాశవంతమైనదిగా కనిపిస్తుంది. గ్రిల్ ఇరువైపులా, ఒక జత హెడ్ లైట్ క్లస్టర్లు హాక్ వింగ్ డిజైన్ తో అందమైనదిగా కనిపిస్తుంది. ఈ క్లస్టర్లు, హై ఇంటెన్సిటీ ల్యాంప్స్ తో మరియు టర్న్ ఇండికేటర్లతో అలాగే వాటి లోపల ఉన్నాయి. ముందు బంపర్ బాడీ రంగు లో ఉంది మరియు అందుకే ఇతర లక్షణాలు కూడా తగినంత మంచిగా అందించబడ్డాయి. దీనిని విస్తృతమైన ఎయిర్ డ్యామ్ తో పొందుపరిచారు. ఇది ఇంజిన్ ను చల్లబరచడంలో సహాయపడుతుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్, ఎయిర్ డ్యామ్ క్రింద ఫాగ్ ల్యాంప్స్ సమితితో అందించబడింది. ఇవి క్రోమ్ తో పెయింట్ చేయబడి ఉండడం వలన చాలా నాగరికంగా కనబడుతున్నాయి. ముందు వైపు ఉన్న విండ్ షీల్డ్ ల్యామినేట్ చేయబడి ఉంటుంది మరియు అక్కడక్కడా వైపర్స్ తో బిగించబడి ఉంటుంది. సైడ్ నుండి ప్రొఫైల్ ను చూసినట్లయితే చాలా అలంకరణలతో చాలా ఉత్తేజకరమైనదిగా ఉంది. ముందుగా, మన మొదటి చూపు చక్రాల పైకి వెళుతుంది మరియు అవి బేస్ ట్రింస్ లో స్టీల్ వీల్స్ తో పూర్తిగా అధునాతన కవర్లతో కప్పబడి అద్భుతమైన లుక్ తో అందించబడతాయి. అయితే, దీని అగ్ర శ్రేణి వేరియంట్ 12 స్పోక్స్ కలిగిన స్టైలిష్ అల్లాయ్ వీల్స్ సమితితో అందించబడుతుంది. అంతేగాక, ఈ రిమ్స్ అత్యధిక నాణ్యతను కలిగిన మరియు అన్ని రకాల రోడ్లలో తాకిడిని తట్టుకునే రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లతో కప్పబడి ఉంటాయి. ఆ తరువాత, బయట వైపు డోర్ హ్యాండిల్స్ మరియు బయట వెనుక వీక్షణ అద్దాలు రెండు బాడీ రంగులో ఉండడం వలన కారు చూడడానికి మరింత సొగసైనదిగా కనిపిస్తుంది. ఈ వెలుపలి అద్దాలు అదనంగా సైడ్ టర్న్ ఇండికేటర్ల తో అమర్చబడి ఉంటాయి. ఈ ఫీచర్ అగ్ర శ్రేణి వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెనుక భాగం నుండి చూసినట్లయితే, దీని తయారీలో తన వంతు వాటాను సొంతం చేసుకున్నట్లుగా ఈ సెడాన్ వెనక భాగం చెబుతుంది. బంపర్ కి ఇరువైపులా ఒక టెయిల్ లైట్ క్లస్టర్ అమర్చబడి ఉంటుంది మరియు దీని రూపకల్పన చూడడానికి చాలా అధునాతనంగా ఉంది. ఈ బంపర్ బాడీ రంగు లో ఉంది మరియు ఇది కారు యొక్క మొత్తం చిత్రం ఆకర్షణను పెంచుతుంది. దీనిలో బూట్ లిడ్ కొన్ని హారిజంటల్ స్ట్రైప్స్ ను కలిగి క్రోమ్ తో పెయింట్ చేయబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క విండ్ స్క్రీన్ ఒక డీఫాగర్ మరియు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ లను కలిగి ఉంది. ఇవి సహాయతకు మరియు భద్రత కోసం బిగించారు. దీని యొక్క రూఫ్, యాంటెన్నా తో బిగించబడి ఉంటుంది. ఇది క్యాబిన్ లోపల రేడియో యూనిట్ తో కనెక్ట్ చేయబడి ఉంటుంది మరియు ఇది చాలా యోగ్యకరంగా కనబడుతుంది.

వెలుపలి కొలతలు:


ఈ మొత్తం సిరీస్ పెద్దగా మరియు చూడడానికి విశాలంగా రూపొందించబడింది మరియు హాయిగా ఐదుగురు ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా దీనిని నిర్మించారు. ఇది సుమారు 4249mm మొత్తం పొడవు మరియు 1690mm మొత్తం వెడల్పును కలిగి ఉంది. ఇది దాదాపు 1503mm ఎత్తు వద్ద నిలుస్తుంది.ఇది డీజిల్ వేరియంట్లలో 174mm గ్రౌండ్ క్లియరెన్స్ ను మరియు పెట్రోల్ వేరియంట్లో 168mm గ్రౌండ్ క్లియరెన్స్ తో ఒక గొప్ప శైలిలో నిలుస్తుంది. ఇది సుమారు 2465mm ఒక పెద్ద వీల్ బేస్ తో అందజేయబడి ఉంది.

లోపలి డిజైన్:


ఈ వాహనం యొక్క లోపలి వైపు అనేక అంశాలను పొందుపరిచారు. ఇవి క్యాబిన్ కి లుక్ ను అందించడమే గాక ఇది కంపార్ట్మెంట్ లో ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా డ్రైవర్ కి సౌలభ్యంను అందించాలనే లక్ష్యంతో అనేక లక్షణాలను దీనిలో పొందుపరిచారు. మొత్తం నేపథ్యం నలుపు మరియు లేత గోధుమ రంగు లో ఒక డ్యుయల్ టోన్ పథకంతో ఉండడం వలన చాలా అధునాతనంగా కనబడుతుంది. దీని స్టీరింగ్ వీల్ బ్యాడ్జ్ తో పొందుపరచబడి ఉండి, నలుపు రంగు లో దానిపై కంపెనీ లోగో బంగారు లేపనంతో ముద్రించబడి ఉంటుంది. ఈ సీట్లు చాలా కుషనీ గా మరియు చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. బేస్ వేరియంట్లు మరియు మధ్య వేరియంట్ల యొక్క సీట్లు ఫాబ్రిక్ అపాలస్ట్రీ తో అందించబడుతున్నాయి. అయితే, అగ్ర శ్రేణి వేరియంట్లు మాత్రం లెదర్ అపాలస్ట్రీ తో అందించబడుతున్నాయి. ఈ సీట్లు మరింతగా అందరు ప్రయాణికులకు ఎక్కువ సుఖంగా సౌకర్యాన్ని అందించే విధంగా రూపొందించబడ్డాయి. దీని డాష్బోర్డ్ స్క్రాచ్ ప్రూఫ్ తో మంచి నాణ్యత కలిగిన ప్లాస్టిక్ నుంచి తయారు చేసారు. దీనిని అలాగే ఆడియో వ్యవస్థ మరియు ఇన్స్ట్రుమెంట్ పానెల్ తో పొందుపర్చారు. చాలా అంశాలను పెట్టుకోవడానికి అధిక వాల్యూమ్ కలిగిన గ్లవ్ బాక్స్ తో విలీనం చేయబడి ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్ కి ఒక గొప్ప సహాయం అందించడానికి అనేక ప్రకటనలతో మరియు హెచ్చరికలతో పొందుపరచబడి ఉంది. సంస్థ ఒక డిజిటల్ గడియారం, లో ఫ్యుయల్ వార్నింగ్ లైట్, ఒక ట్రిప్ మీటర్ మరియు సగటు ఫ్యుయల్ కన్సంప్షన్ రీడింగ్ వంటి అంశాలను అందించలేకపోయింది. దీని అగ్ర శ్రేణి వేరియంట్ మంచి సహాయం మరియు భద్రత కోసం డోర్ అజార్ వార్నింగ్ మరియు డ్రైవర్ సీట్ బెల్టు వార్నింగ్ సదుపాయాలను కలిగి ఉంది. ఇంకా డ్రైవర్ మరియు సహ డ్రైవర్ కి వ్యానిటీ మిర్రర్స్ తో పాటుగా సన్ విజర్స్ ను కూడా అందించడం జరిగింది. ఒక ప్రామాణికమైన లక్షణంగా, కంపార్ట్మెంట్ లోపల బిగించబడిన లోపల రే వ్యూ మిర్రర్ ఉంది. వీటితో పాటుగా, అనేక ఇతర లక్షణాలను ఈ సెడాన్ సిరీస్ యొక్క క్యాబిన్ లో పరిపూర్ణత కోసం అమర్చడం జరిగింది.

లోపలి సౌకర్యాలు:


ఈ సిరీస్ లో అందిస్తున్న అనేక అంశాలు ప్రయాణీకులందరికి ఒక గొప్ప సౌకర్యంగా భావిస్తారు. డ్రైవర్ సౌలభ్యం కోసం అనేక లక్షణాలు దీనిలో ఉన్నాయి, కానీ వాటన్నింటిలో అత్యంత ముఖ్యమైనది పవర్ స్టీరింగ్. ఇది డ్రైవర్ యొక్క కృషిను తగ్గించడం లో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ మెరుగుపరిచిన స్టీరింగ్ వీల్, టిల్ట్ అడ్జస్టింగ్ ఫంక్షన్లతో అనుసంధానించబడి ఉంటుంది. అన్ని వేరియంట్లు, క్యాబిన్ ఉష్ణోగ్రత నియంత్రణ కొరకు ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ తో అనుసంధానం చేయబడ్డాయి. సముచిత సమ గాలి ప్రసరణ కొరకు కంపార్ట్మెంట్ లోపల ఈ యూనిట్ యొక్క వెంట్లను ఉంచుతారు. ముందు మరియు వెనుక డోర్లు అన్నీ కూడా పవర్ విండోస్ తో జత చేయబడి ఉన్నాయి. ఇది ప్రయాణీకులందరికీ ఒక గొప్ప ప్రయోజనకరమైనదిగా మరియు సౌలభ్య కరమైన వాహనంగా అందించబడుతుంది. కానీ ఈ ఫీచరు బేస్ వేరియంట్ లో అందించబడలేదు. అలాగే పవర్ విండోస్ కూడా ఒక ముందు డోర్లకు మాత్రమే అందించబడ్డాయి. దీని యొక్క బయట వెనుక వీక్షణ అద్దాలు అంతర్గతంగా సర్దుబాటు చేసుకునే విధంగా ఉన్నాయి. ఇవి డ్రైవర్ కి చాలా సౌకర్యవంతంగా ఉంతాయి. ఆ తరువాత, ఒక ప్రామాణికమైన లక్షణంగా, అన్ని వేరియంట్లలో క్యాబిన్ లోపల బిగించబడిన పగలు మరియు రాత్రి సమయాల్లో కనిపించే వెనుక వ్యూ అద్దాలు ఉన్నాయి. వెనుక సీట్లు ఆర్మెస్టులతో అనుసంధానం చేయబడి, అదనంగా అదనపు సౌలభ్యం మరియు నిల్వ కోసం కప్ హోల్డర్స్ తో అందచేయబడి ఉన్నాయి. ఈ వాహనంలో ముందు సీట్లు హెడ్ రెస్టులను కలిగి ఉన్నాయి. ఇవి వారికి ఎత్తు సర్దుబాటు సౌకర్యంతో అందించబడుతున్నాయి. దీనివలన ముందు కూర్చునే ప్రయాణికులకు చాలా ప్రయోజనంగా ఉంటుంది. డ్రైవర్ సౌలభ్యం కొరకు మరింతగా ఒక రిమోట్ ఫ్యూయెల్ ఫిల్లర్ మరియు టెయిల్ గేట్ రిలీజ్ లను పెంచడం జరిగింది. డ్రైవర్ మరియు సహ డ్రైవర్ యొక్క సీట్లను ఫ్రంట్ సన్ విజర్స్ తో అందించారు. అంతేకాక, ప్రయాణీకుల విజర్ ను అదనపు సౌకర్యం కోసం వానిటీ మిర్రర్ కి బిగించారు. దీనిలో కర్టసీ ల్యాంప్ ఒక ప్రామాణికమైన లక్షణంగా అందించబడుతుంది మరియు బూట్ కంపార్ట్మెంట్ కూడా ల్యాంప్ తో బిగించబడి ఉంటుంది. ఇది పగటి పూట వెలుతురు లేని సమయాల్లో ఒక గొప్ప ప్రయోజనంగా ఉంటుంది. ఇంకా అన్ని వేరియంట్లలో 12 వోల్ట్స్ పవర్ సాకెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ పరికరాలు చార్జింగ్ చేసుకోవడం లో సౌకర్యవంతంగా ఉంటుంది. అన్ని ట్రిమ్ లలో ఒక డిజిటల్ టాకొమీటర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఆధునిక సాంకేతిక సమాచారం మరింతగా ఖచ్చితత్వం కోసం అందించడంలో ఉపయోగపడుతుంది. ఒక బేస్ ట్రిం లో తప్ప మిగతా అన్ని ట్రింస్ లో అన్నిడోర్లు కూడా కేంద్ర డోర్ లాకింగ్ సిస్టమ్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇది కాక, ఇంకా డ్రైవర్ కి మరింత సహాయత కోసం కీలెస్ ఎంట్రీ అందుబాటులో ఉంది. దీనిలో కన్వెన్షనల్ అనలాగ్ గడియారం కి బదులుగాఈ సిరీస్ ఒక డిజిటల్ గడియారంతో బిగించబడి ఉంటుంది. దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో రేర్ విండ్ స్క్రీన్ కి డీఫాగర్ తో జత చేయబడి ఉంటుంది.

లోపలి కొలతలు:


ఈ వాహన అంతర్భాగములు చాలా విశాలంగా మొత్తం ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా దీనిని రూపొందించారు. దీని యొక్క బూట్ స్పేస్ భారీగా సుమారు 370 లీటర్లు ఉంటుంది. దీని యొక్క రవాణా సామర్థ్యం ఒక పెద్ద పరిమాణంలో లగేజ్ ను పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ సిరీస్ లో అందించిన భారీ వీల్ బేస్ అందరు ప్రయాణికులకు చాలా ప్రశాంతమైన లెగ్ రూమ్ ను అందిస్తుంది. హెడ్ మరియు షోల్డర్ స్పేస్ చాలా దాతృత్వముగా అందించబడుతుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఆకట్టుకునే విధంగా సుమారు 42 లీటర్ల పెట్రోల్ మరియు 40 లీటర్ల డీజిల్ తో వస్తుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ వాహనం పెట్రోల్ అలాగే డీజిల్ వెర్షన్ లో లభ్యమవుతోంది. దీని పెట్రోల్ వేరియంట్ 1199cc స్థానభ్రంశ సామర్థ్యంతో 1.2 లీటర్, స్మార్టెక్ ఇంజన్ తో పొందుపరచబడ్డాయి. దీని పెట్రోల్ ఇంజన్ నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వుల తో డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ఆధారంగా పని చేస్తుంది. ఇది 6000rpm వద్ద 82.4 bhp గరిష్ట శక్తి అవుట్పుట్ ను మరియు 5000rpm వద్ద గరిష్ట ంగా 108.5 Nm టార్క్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, దీని డీజిల్ వెర్షన్ 1248cc స్థానభ్రంశముతో 1.3-లీటర్, స్మార్టెక్ ఇంజన్ తో పొందుపరచబడ్డాయి. దీని ఇంజన్ నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వుల తో డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పని చేస్తుంది. ఈ మోటార్ 22.1 kmpl ఇంధన వ్యవస్థ కలిగిన ఒక కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో కలిసి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


దీని యొక్క అన్ని ట్రిమ్స్ బహుళ ప్లేయర్లకు మద్దతునిచ్చే ఒక అధునాతన ఆడియో సిస్టమ్ తో బిగించబడి ఉంటుంది. ఒక ఆధునిక 2-డిన్ ఆడియో యూనిట్ తో అందజేయబడుతుంది. ఈ వ్యవస్థ ఏ ఎమ్/ఎఫ్ ఎమ్ రేడియో ట్యూనర్ తో పాటు సిడి, ఎమ్ పి3 ప్లేయర్ లతోఅందించబడుతుంది. దీనిలో బ్లూటూత్ తో పాటు యుఎస్బి పోర్ట్, సహాయక ఇన్పుట్ ఎంపికలతో మద్దతునిస్తుంది. ఇది ఒక పెద్ద ప్రయోజనకరమైన విషయంగా చెప్పవచ్చు. దానితో పాటుగా, దృశ్య నావిగేషన్ డిస్ప్లే వ్యవస్థ ఈ సిరీస్లో అందించిన ఒక ముఖ్యాంశంగా చెప్పవచ్చు. ఇంకా, కొనుగోలుదారులు వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా వాహనాన్ని వివిధ యాక్సెసరీస్ తో అనుకూలీకరించవచ్చు. ఈ యాక్సెసరీస్ ని అధికార డీలర్స్ నుండి అదనపు ఖర్చుతో పొందవచ్చు. దీనిలో ఫ్లోర్ మ్యాట్స్, ఫాన్సీ బాడీ డికేల్స్, లెథర్ మరియు స్పాయిలర్స్ వంటి ఫీచర్స్ ను అదనంగా జోడించవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ వాహన అగ్ర శ్రేణి వేరియంట్స్ స్టైలిష్ అల్లాయ్ వీల్స్ సమితి తో అనుసంధానించబడి 175/70R14 పరిమాణం గల రేడియల్ టైర్ల తో కప్పబడి ఉంటాయి. మిగతా ట్రిమ్స్ దృఢమైన స్టీల్ వీల్స్ సమితితో ఫుల్ వీల్స్ కవర్లతో కప్పబడి ఉంటాయి. ఒక ప్రామాణికమైన లక్షణం కాకుండా, అన్ని వేరియంట్లు ఒక ఫ్లాట్ అదనపు టైర్ ను ఒక టూల్ కిట్ తో పాటు బూట్ కంపార్ట్మెంట్ లో అమర్చుతారు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీని ముందు చక్రాలు డిస్క్ బ్రేక్ల సమితితో బిగించబడి ఉంటాయి మరియు వెనుక చక్రాలు డ్రమ్ బ్రేక్లతో అమర్చబడి ఉంటాయి. దాని సస్పెన్షన్ వ్యవస్థ, ఫ్రంట్ ఆక్సిల్ కి మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అనుసంధానించబడి ఉంటుంది మరియు రేర్ ఆక్సిల్ టార్షన్ బీమ్ తో బిగించబడి ఉంటుంది. అదనంగా, షాక్అబ్జార్బర్స్ అసమాన రోడ్ల పైన ప్రభావం తగ్గించడానికి ఈ ఆక్సిల్స్ తో బిగించబడి ఉంటాయి. దీని అగ్ర శ్రేణి వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు వెర్షన్లతో అందించబడుతుంది. ఇది ఒక ఆధునిక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పొందుపరచబడింది. ఇది మరింతగా ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కలిసి ఉంటుంది. ఈ విధానం మంచిగా వాహన నియంత్రణలో సహాయపడుతుంది మరియు అన్ని రకాల రోడ్ల పైన గట్టి పట్టును పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది 5.15 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్ధతునిస్తుంది. ఇది చాలా యోగ్యకరమైనది. అదనంగా, అన్ని వేరియంట్లు పవర్ స్టీరింగ్ తో అందజేయబడి ఉంటాయి ఇది ఒక టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ తో సహాయకంగా ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ సెడాన్ సిరీస్ యొక్క మొత్తం బాడీ నిర్మాణం చాలా బాగా ఎలాంటి వైపరిత్యాలనైనా ఎదుర్కునే విధంగా రూపొందించబడింది. ఈ బాడీ డిజైన్ సురక్షిత కేజ్ బాడీ నిర్మాణం ఆధారంగా రూపొందించబడింది. ఇది బలమైన మరియు దృఢంగా ఉంటుంది. ఆ తరువాత, దొంగతనాల నుంచి వాహనాన్ని రక్షించడానికి ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ను దీనిలో అన్ని వేరియంట్లలో అనుసంధానించారు. ఈ మెకానిజం వాహనం లో ఏవైనా సవరణలు ఉన్నప్పుడు దాని యొక్క ఇంజిన్ ను చల్లబరుస్తుంది. తయారీదారులు, సీటు బెల్టులను ప్రయాణికులందరికీ అందించారు మరియు ముందు సీట్లలో అదనంగా 3 పాయింట్ ఈ ఎల్ ఆర్ పద్ధతి బెల్ట్స్ ను కూడా అందించారు. డ్రైవర్ సీటు ఒక సీట్ బెల్ట్ రిమైండర్ తో అందించబడుతుంది. ఇది వాహనానికి అదనపు రక్షణను అందిస్తుంది. అదనంగా, కీ-ఇన్ రిమైండర్ కూడా అందించబడుతుంది. అగ్ర శ్రేణి వేరియంట్ ఒక ఆధునిక బ్రేకింగ్ మెకానిజం తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది ఎంపిక చేసిన వేరియంట్లలో మాత్రమే అందించబడుతుంది. ఈ వేరియంట్స్ ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఒక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పొందుపరచబడ్డాయి. ఈ వ్యవస్థ వాహనానికి ఒక మంచి నియంత్రణను అందిస్తూ మరియు అన్ని రకాల రోడ్లలో ఒక గొప్ప పట్టును అందిస్తుంది. దీని వెనుక విండ్ స్క్రీన్ కి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ బిగించబడి ఉంటుంది. ఈ వాహనం ఇతర వాహనాల యొక్క ఉనికిని గుర్తించి మరియు ప్రమాదాలను నివారించేందుకు సహాయపడుతుంది. ఈ సిరీస్ మరింతగా గొప్ప ప్రయోజనం కోసం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో చేర్చబడింది. ఈ ఫీచర్ అదనంగా స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్ తో మద్దతును ఇస్తుంది. ఈ మోడల్ లో అందచేసిన డ్యుయల్ హార్న్, రెట్టింపు ప్రభావం గల ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక డోర్లు సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ తో అనుసంధానించబడి ఉండడం వలన ప్రమాదాలు జరిగినపుడు నివారించేందుకు ఉపయోగపడతాయి.

అనుకూలాలు:


1. వెలుపలి ప్రదర్శన చాలా ఆకర్షణీయంగా ఉంది.
2. బ్రేకింగ్ యంత్రాంగం చాలా యోగ్యకరంగా ఉంది.
3. ఇంటీరియర్స్ చాలా సొగసుగా రూపొందించబడ్డాయి.
4. ఇంటీరియర్స్ చాలా విశాలంగా మరియు సౌకర్యవంతమైనవి ఉన్నాయి.
5. ధర పరిధి చాలా సహేకుతంగా ఉంది.

ప్రతికూలాలు:


1. డీజిల్ ఇంజన్ ధ్వని చాలా ఎక్కువగా ఉంది.
2. ఇంధన వ్యవస్థ కొంచెం అభివృద్ధి చేయవలసి ఉంది.
3. గ్రౌండ్ క్లియరెన్స్ తగినంత లేదు.
4. దాని అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే ఎయిర్బ్యాగ్స్ ను అందించారు.
5. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ను లోయర్ ట్రిమ్స్ లో కూడా అందించవలసి ఉంది.