చెవ్రోలెట్ ఎంజోయ్

` 4.9 - 8.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

చెవ్రోలెట్ ఇతర కారు మోడల్లు

 
*Rs

చెవ్రోలెట్ ఎంజోయ్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


జనరల్ మోటార్స్ కి సొంతమైన షెవ్రొలె ఇండియా, భారతదేశంలో ఎంపివి మోడల్ అయిన షెవ్రొలె ఎంజాయ్ యొక్క నవీకరించబడిన మోడల్ ను ప్రవేశపెట్టడం జరిగింది. కాస్మటిక్ మార్పులకు సంబందించి పూర్తి నవీకరణలను పొందింది, అదే నిర్దేశాలు మరియు లక్షణాల విషయానికి వస్టే, అవి ఏ మార్పులను చోటు చేసుకోలేదు. అంతేకాకుండా, తయారీదారుడు ఈ మోడల్ సిరీస్ కు అవుట్గోయింగ్ మోడల్ లో ఉండే అదే పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ లను అందించాడు. అదే సమయం లో కొనుగోలుదారులకు ఏడు మరియు ఎనిమిది సీట్లు మధ్య రకాలను ఎంచుకోవడానికి ఒక ఎంపికను అందించాడు. అంతేకాకుండా, బాహ్య భాగాలలో నలుపు రంగు బి పిల్లార్స్ మరియు సి పిల్లార్స్ తో పాటు వెనుక లైసెన్స్ ప్లేట్ కన్సోల్ పై క్రోం గార్నిష్ వంటివి మాత్రమే నవీకరించబడినవి. క్యాబిన్ లోపలి భాగం విషయానికి వస్తే, కొత్త స్టీరింగ్ వీల్ తో పాటు బంగారు పూత కలిగిన షెవ్రొలె లోగో , స్టీరింగ్ వీల్ మధ్య భాగం లో పొందుపరచబడి ఉంటుంది. అదనపు సౌలభ్యం కోసం ఆడియో నియంత్రణ స్విచ్చులు స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడి ఉంటాయి. ఇంకా క్యాబిన్ డిజైన్ మారలేదు కానీ, డోర్ హ్యాండిల్స్ పై, పార్కింగ్ లెవర్ పై మరియు గేర్ షిఫ్ట్ నాబ్ పై క్రోం చేరికలు పొందుపరచబడి ఉంటాయి. మరొక నవీకరణ ఏమిటంటే, క్యాబిన్ లోపలి భాగానికి ఒక కొత్త అప్పీల్ ను ఇవ్వడం కోసం లోపలి భాగం లో ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ ను ఉపయోగించడం జరిగింది.

ఈ వాహన సిరీస్ యొక్క ఇంజన్ పనితీరు విషయానికి వస్తే, ఈ వాహన పెట్రోల్ వేరియంట్ 1.4 లీటర్ స్మార్టెక్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా, 6000 ఆర్ పి ఎం వద్ద 98.82 బి హెచ్ పి పవర్ ను మరియు అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 131 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ మోటార్ బహుళ పాయింట్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ తో విలీనం చేయబడి 11.2 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. మరోవైపు, ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజన్, 1.3 లీటర్ స్మార్టెక్ ఇంజన్ తో జత చేయబడి 1248 సిసి స్థానబ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజన్ లు కూడా డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా 15.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ వాహన సిరీస్ పెట్రోల్ వేరియంట్ లు అలాగే డీజిల్ వేరియంట్ లు రెండూ కూడా 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. పెట్రోల్ వేరియంట్ లు అత్యధికంగా 175 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ వాహనాలు 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 14.8 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా మరోవైపు, డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 21.36 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఇదే వాహనం 160 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ వాహనాల అంతర్గత భాగాలలో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ను ప్రక్కన పెడితే, లక్షణాల జాబితాలో ఎటువంటి నవీకరణలను చోటు చేసుకోలేదు. ఈ ఎంపివి, సెంట్రల్ డోర్ లాకింగ్, రిమోట్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ మరియు విద్యుత్ తో సర్దుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు వంటి అసంఖ్యాక విశిష్టతలను కలిగి ఉన్న ఈ లక్షణాలు డ్రైవర్ కు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వాహనం లో ఉన్న అన్ని సీట్లు హెడ్ రెస్ట్ లను కలిగి ఉంటాయి. ఆ హెడ్ రెస్ట్ లను ప్రయాణికుల వారి అవసరాల మేరకు సర్దుబాటు చేయవచ్చు. అంతేకాకుండా, ఈ వాహనం లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక వినోద విభాగం లో ఒక మ్యూజిక్ సిస్టమ్ ను పొందుపర్చారు. ఈ సంగీత వినోద వ్యవస్థ అనేక ప్లేయర్ లకు మద్దతిస్తూ నాలుగు స్పీకర్లను మరియు ఒక యాంటిన్నా ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ యుటిలిటీ వాహనం యొక్క భద్రత విషయానికి వస్తే, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ మరియు డ్యూయల్ ఎయిర్బాగ్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యవస్థలను ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో మాత్రమే అందించడం జరిగింది. అంతేకాకుండా, ఈ బ్రేకింగ్ మెకానిజం చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం అనేక బాగ్లు పెట్టుకునేందుకు మంచి బూట్ స్పేస్ ను కలిగి ఉంది. ఈ వాహనం యొక్క డీజిల్ మరియు పెట్రోల్ వెర్షన్ల మైలేజ్ ఆకట్టుకునే విధంగా ఉంది. కంపెనీ, ఈ వాహనానికి 3 సంవత్సరాలు లేదా 45,000 కిలోమీటర్ల వారెంటీ ను అందించింది. ఏది ముందు ముగిసినా వారెంటీ ముగిసినట్లే.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ మోడల్ యొక్క పెట్రోల్ వెర్షన్, 1.4 లీటర్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ మోటార్, బహుళ పాయింట్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థ తో విలీనం అయ్యి రహదారుల పై 13.7 కె ఎం పి ఎల్ మైలేజ్ ను మరియు నగరాలలో 11.2 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తాయి. మరోవైపు, ఈ మోడల్ యొక్క డీజిల్ వెర్షన్ విషయానికి వస్తే, ఇది సి ఆర్ డి ఐ (కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్), తో విలీనం అయ్యి 1.3 లీటర్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఈ మోటార్, రహదారులపై 18.2 కె ఎం పి ఎల్ మైలేజ్ ను మరియు నగరాలలో 15.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్ లు అలాగే డీజిల్ వేరియంట్ లు రెండూ కూడా డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటాయి. ఈ సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్ లు 6000 ఆర్ పి ఎం వద్ద 98.82 బి హెచ్ పి పవర్ ను మరియు అలాగే 4000 ఆర్ పి ఎం వద్ద 131 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా ఈ వాహనాల డీజిల్ వేరియంట్ ల విషయానికి వస్తే, 4000 ఆర్ పి ఎం వద్ద 73.77 బి హెచ్ పి పవర్ ను మరియు 1750 ఆర్ పి ఎం వద్ద 172.5 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

యాక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్ లు అలాగే డీజిల్ వేరియంట్ లు రెండూ కూడా 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, ఈ వాహనాలు 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 14.8 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా 175 కె ఎం పి హెచ్ గరిష్ట వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అదే డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 21.36 సెకన్ల సమయం పడుతుంది. అలానే 160 కె ఎం పి హెచ్ గరిష్ట వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


కొత్తగా పరిచయం చేయబడిన ఈ ఎంపివి, చిన్న చిన్న గమనించదగ్గ మార్పులను కలిగి ఉంది. దీని వలన అవుట్గోయింగ్ వెర్షన్ కంటే ఇది కొంచెం కొత్తదానిలా కనబడుతుంది. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ కొత్తగా కనిపించడం కోసం ప్రక్క భాగం లో ఉండే బి పిల్లార్ మరియు సి పిల్లార్ లు బ్లాక్ ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది. ఇవి కాక, ఈ వాహనం యొక్క మిగిలిన మొత్తం భాగం అలానే ఏ మార్పులను చోటు చేసుకోలేదు. ఈ సిరీస్ యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్ లలో స్టీల్ రింస్ అందించబడతాయి. అదే అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎల్టిజెడ్ వాహనం విషయానికి వస్తే, ఒక జత అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ దగ్గర నుండి అన్ని వేరియంట్ లు కూడా బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు బాడీ కలర్ వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ క్యాప్ లను కలిగి ఉంటాయి. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, లైసెన్స్ ప్లేట్ కన్సోల్ పై క్రోం చేరికలను గమనించవచ్చు. ఈ వెనుక భాగం లో ఇది మాత్రమే నవీకరించబడినది. మరోవైపు, ఈ వాహనం యొక్క ముందరి భాగం ఏ మార్పులను చోటు చేసుకోలేదు. దీని యొక్క రేడియేటర్ గ్రిల్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు దీని మధ్య భాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. దీని హెడ్ లైట్ క్లస్టర్ స్వెప్ట్ బేక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ హెడ లైట్ క్లస్టర్ లో హాలోజన్ ల్యాంప్స్ మరియు టర్న్ సూచికలను పొందుపరచడం జరిగింది. వేరియంట్ రకాన్ని బట్టి, రూఫ్ రైల్స్ అందించబడతాయి. వీటిని కలిగి ఉండటం వలన అదనపు ఆకర్షణను అందిస్తాయి.

వెలుపలి కొలతలు:


ఈ వాహనం యొక్క బాహ్య బాగాలలో అనేక మార్పులు ఉన్నప్పటికీ, అవుట్గోయింగ్ మోడల్ వలే ఈ వాహనం కూడా అవే వెలుపలి కొలతలతో అందుబాటులో ఉంది. ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4305 మిల్లీ మీటర్లు, మొత్తం వెడల్పు 1680 మిల్లీ మీటర్లు, మొత్తం ఎత్తు 1750 మిల్లీ మీటర్లు, ఈ వాహనం ఇంత ఎత్తు ను కలిగి ఉండటం వలన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని యొక్క వీల్బేస్ 2720 మిల్లీ మీటర్లు మరియు ఈ వాహన సిరీస్ యొక్క డీజిల్ వేరియంట్ల కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 161 మిల్లీ మీటర్లు, అదే విధంగా పెట్రోల్ వేరియంట్ ల విషయానికి వస్తే, ఈ వాహనాల గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీ మీటర్లు.

లోపలి డిజైన్:


ఈ వాహనం యొక్క అంతర్గత భాగం కొన్ని లోహ చేరికలతో పాటు ఒక కొత్త ఫ్యాబ్రిక్ / లెధర్ అపోలిస్ట్రీ రూపంలో ముఖ్యమైన నవీకరణలను పొందింది. క్యాబిన్ యొక్క డిజైన్ మాత్రం ఏ మార్పు ను చోటు చేసుకోకుండా అలానే ఉంది మరియు ఒక డ్యూయల్ టోన్ పధకంతో అలంకరించబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ కొత్త డిజైన్ ను కలిగి ఉండటం తో పాటు దాని పై వెండి చేరికలు అలంకరించబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో బంగారు పూతతో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. అదే సమయం లో, ఆడియో నియంత్రణ కొరకు మల్టీ ఫంక్షనల్ స్విచ్చులు మరియు కాల్ ఆపరేటింగ్ స్విచ్చులు ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడి ఉంటాయి. సీట్ల విషయానికి వస్తే, ఈ వాహనం గరిష్టంగా ఎనిమిది మంది ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చునే సీటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, మరోవైపు ఈ వాహనం ఏడు సీట్లతో కూడా అందుబాటులో ఉంది. ఏడు సీట్లు ఎలా అంటే, ఈ వాహనం యొక్క రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు అందించబడతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వాహనం లో ఉండే గేర్ షిఫ్ట్ నాబ్ మరియు డోర్ హ్యాండిల్స్ మరియు పార్కింగ్ లెవర్ వంటివి క్రోం చేరికలతో అందంగా అలంకరించబడి ఉంటాయి. వీటన్నింటినీ ప్రక్కన పెడితే, ఎయిర్ వెంట్స్ మరియు డోర్ ఆర్మ్ రెస్ట్ లు నిగనిగలాడే నలుపు రంగుతో ఫినిషింగ్ చేయబడి ఉంటుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ ఎంపివి సిరీస్ లో, ఒత్తిడి ని తగ్గించేందుకు మరియు సౌకర్య స్థాయిని అధికంగా పెంచేందుకు ఆధునిక మరియు విలాసవంతమైన లక్షణాలను చాలా సంఖ్య లో అందించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ వాహనం, స్మార్ట్ టెక్నాలజీ తో స్వయంచాలకంగా క్యాబిన్ ఉష్ణోగ్రత ను నియంత్రించడం లో సహాయపడుటకు ఒక ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ను కలిగి ఉంది. 60:40 స్ప్లిట్ మడత ను కలిగి ఉన్న వెనుక సీటు మరిన్ని సామాన్లను పెట్టుకునేందుకు సహాయపడుతుంది. అధనపు సౌకర్యాన్ని జోడించడం కోసం ఈ వాహనం వెనుక సీట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ను కలిగి ఉంది. ముందు రెండు సీట్లు కూడా వెనుక పాకెట్ లను కలిగి ఉన్నాయి. డ్రైవర్ యొక్క కృషి తగ్గించడం లో మరియు చాలా ఉపయోగపడే లక్షణం ఏమిటంటే, ఈ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ టిల్ట్ మరియు టెలిస్కోపిక్ సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. వన్ టచ్ డౌన్ సౌకర్యాన్ని కలిగి ఉన్న విద్యుత్ పవర్ విండో అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం లో డ్రైవర్ కు సమాచారాన్ని అందించడం కోసం చాలా ఉపయోగపడే ట్రిప్ కంప్యూటర్ అందుబాటులో ఉంది. చిన్న విద్యుత్ గాడ్జెట్ల ఛార్జింగ్ కోసం ఒక అదనపు విద్యుత్ సాకెట్ కూడా అందుబాటులో ఉంది. ముందు వరుస మరియు వెనుక వరుస సీట్ల కు హెడ్ రెస్ట్లు అందించబడ్డాయి. ఇవి సర్దుబాటయ్యే విధంగా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ వాహనం ముందు భాగంలో రెండు సన్ వైపర్స్ అందించబడతాయి. దానిలో ఒకటి టికెట్ హోల్డర్ ను కలిగి డ్రైవర్ సైడ్ అందించబడుతుంది. రెండవది వానిటీ మిర్రర్ ను కలిగి ముందు ప్రయాణికుడి వైపు అందించబడుతుంది. ఒక ప్రామాణికమైన లక్షణం గా ఒక కర్టసీ ల్యాంప్ అందించబడుతుంది. డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం రిమోట్ ఫ్యూయల్ రిలీజ్ ఎంపిక మరియు అలాగే ఒక హెడ్ల్యాంప్ లెవలింగ్ సౌకర్యం అందించబడుతుంది. ఈ వాహనం, బాహ్య అద్దాలను అంతర్గతం గా సర్దుబాటు చేసుకునే సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి పలు అంశాలు ముందు వరుస యజమానులను మాత్రమే కాదు రెండవ మరియు మూడవ వరుస ప్రయాణికులకు కూడా ఈ సౌకర్యాలు అందించబడతాయి.

లోపలి కొలతలు:


ఈ వాహనం, పెద్ద వీల్బేస్ ను కలిగి ఉన్న కారణంగా విశాలమైన అంతర్గత క్యాబిన్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క హెడ్ రూం మరియు షోల్డర్ రూం లు రెండూ కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. వీటితో పాటు, ఈ వాహనం పుష్కలమైన లెగ్ రూం ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం 50 లీటర్ల సామర్ధ్యం గల ఇంధన ట్యాంక్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ వాహనం, ఎక్కువ మొత్తం లో సామాన్లు నిల్వ చేసుకునేందుకు 195 లీటర్లు గల బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, ఈ బూట్ సామర్ధ్యాన్ని వెనుక సీటు మడవటం ద్వారా 630 లీటర్ల వరకు పెంచవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ వాహన సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్ 1.4 లీటర్ స్మార్టెక్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఇంజన్ ఒక బహుళ స్థాన ఫ్యూయెల్ ఇంజెక్షన్ మరియు ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా 13.7 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా, 6000 ఆర్ పి ఎం వద్ద 98.82 బి హెచ్ పి పవర్ ను మరియు అదే విధంగా 4000 ఆర్ పి ఎం వద్ద 131 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 1.3 లీటర్ స్మార్టెక్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 1248 సిసి స్థానబ్రంశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ కూడా డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా 15.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహన సిరీస్ యొక్క మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్ లు ఆధునిక సంగీతం వ్యవస్థ ను కలిగి ఉంటాయి. దీనితో పాటుగా ఒక రేడియో, సిడి మరియు ఎంపి3 ప్లేయర్ లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ వాహనం సంగీత వ్యవస్థ తో పాటు ముందు రెండు స్పీకర్లను మరియు వెనుక రెండు స్పీకర్లను మొత్తం నాలుగు స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇంకా, ఈ వాహనం యూఎస్బి మరియు ఆక్సలరీ పోర్ట్ వంటి వాటికి మద్దతిస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనం రూఫ్ రైల్స్ వద్ద ఒక యాంటిన్నా కూడా బిగించబడి ఉంటుంది. ఈ వాహన సిరీస్ యొక్క అంతర్గత భాగం అనేక ఉపకరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఆ ఉపకరణాలు ఏమిటంటే, ఫ్యాన్సీ బాడీ డికేల్స్ , మడ్ ఫ్లాప్స్, ఫ్లోర్ మ్యాట్స్, అదనపు అనుబంధ సాకెట్లు మరియు ఇతర అంశాలు వంటి లక్షణాలు ఈ వాహనంలో పొందుపరచబడ్డాయి.

వీల్స్ పరిమాణం:


ఈ వాహన సిరీస్ యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు బలమైన 14- అంగుళాల స్టీల్ వీల్స్ ను కలిగి ఉంటాయి. ఈ వాహనాల యొక్క వీల్ ఆర్చులు పూర్తి వీల్ కవర్స్ తో కప్పబడి ఉంటాయి. వీటి వలన చూడటానికి చాలా స్టైలిష్ గా కనబడుతుంది. అంతేకాకుండా, ఈ చక్రాలు 175/70 R14 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. అంతేకాక, బూట్ కంపార్ట్మెంట్ లో ఒక విడి చక్రం తో పాటుగా ఒక ఫ్లాట్ టైర్ ను మార్చడానికి అవసరమైన అన్ని ఇతర సాధనాలు అందించబడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం యొక్క ముందు చక్రాలు డిస్క్ బ్రేక్ల సమితి తో బిగించబడి ఉంటాయి. అదే వెనుక చక్రాల విషయానికి వస్తే, ప్రామాణికంగా డ్రం బ్రేక్లు అందించబడతాయి. ఈ వాహనం యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ఫ్రంట్ ఆక్సిల్ మక్ఫెర్సొన్ తో స్ట్రట్ తో బిగించబడి ఉంటుది. అదే విధంగా వెనుక ఆక్సిల్ మల్టీ లింక్ కాయిల్ స్ప్రింగ్ తో బిగించి ఉంటుంది. అంతేకాకుండా, నిర్వహణ మరింత సమర్థవంతం చేయడానికి, ఈ సిరీస్ యొక్క వాహనాలు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లతో విలీనం చేయబడి ఉంటాయి. వీటి వలన అన్ని రకాల రోడ్ల పై ఉన్నతమైన పట్టును అందించటం లో సహాయపడతాయి. అదనంగా, ట్విన్ ట్యూబ్ గ్యాస్ తో నిండిన షాక్అబ్జార్బర్స్ మంచి సహాయాన్ని అందించడానికి బిగించి ఉంటాయి. డ్రైవర్ కు అధనపు సౌకర్యాన్ని అందించుట కొరకు ఈ వాహనాల యొక్క స్టీరింగ్ వీల్ టిల్ట్ సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ సిరీస్ యొక్క అన్ని వాహనాలు, ప్రభావాలను మరియు ప్రమాదాలకు వ్యతిరేకంగా గొప్ప శక్తి కలిగి ఒక సురక్షిత బోనులో దీని యొక్క శరీర నిర్మాణం నిర్మించబడింది. ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక డోర్లకు ఇంపాక్ట్ బీంస్ పొందుపరచబడి ఉంటాయి. ఇవి వాహనాన్ని అన్ని రకాల ప్రభావాల నుండి రక్షిస్తాయి. ఈ వాహనం యొక్క సీట్లు, సీట్ బెల్ట్ లతో పాటు మూడు పాయింట్ల అత్యవసర లాకింగ్ రిట్రాక్టర్ లను కలిగి ఉంటాయి. మరింత రక్షణ కోసం, డ్రైవర్ సీటు సీట్ బెల్ట్ రిమెండర్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ సిరీస్ యొక్క వాహనాలు డోర్ అజార్ హెచ్చరిక ను కూడా కలిగి ఉంటాయి. వెనుక డోర్లు, పిల్లలకు రక్షణ ను అందించడం కోసం చైల్డ్ డోర్ లాక్స్ ను కలిగి ఉంటాయి. వెనుక స్పాయిలర్ కు మధ్య భాగం లో ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ బిగించబడి ఉంటుంది. ఈ ల్యాంప్ ను కలిగి ఉండటం వలన చాలా దూరం నుండి కూడా వాహనం యొక్క ఉనికి గురించి ఇతర వాహనాలకు హెచ్చరించేందుకు ఉపయోగపడుతుంది. ఈ వాహనం డబుల్ హార్న్ ను కూడా కలిగి ఉంది. ఈ వాహన సిరీస్ యొక్క మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్ లు అనేక భద్రతా అంశాలను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ వాహనాలు కీ ఇన్ రిమైండర్ ను మరియు హెడ్ ల్యాంప్ ఆన్ రిమైండర్ వంటి ఫంక్షన్ లను కలిగి ఉంది.

అనుకూలాలు:


1. ఈ వాహనం యొక్క లోపలి డిజైన్ మంచి లుక్ ను ఇవ్వడం కోసం ముఖ్యమైన మార్పులను కలిగి ఉంది
2. ఈ వాహనం, ఆధునిక సంగీతం వ్యవస్థ తో అలంకరించబడి ఉంది.
3. అనేక సర్దుబాటు సౌకర్యాలు సౌలభ్యం కోసం అందుబాటులో ఉన్నాయి.
4. ఈ వాహనానికి, అనేక అంతర్గత నిల్వ ఖాళీలు అందించబడుతున్నాయి.
5. ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లు ఉన్నతమైన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి.

ప్రతికూలాలు:


1. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లలో ఏబిఎస్ లేకపోవడం ఒక ప్రతికూలత గా భావించవచ్చు.
2. ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లలో అల్లాయ్ వీల్స్ అందించకపోవడం ఒక ప్రతికూలతగా చెప్పవచ్చు .
3. ఈ వాహన సిరీస్ యొక్క ఎల్ ఎస్ మరియు ఎల్ టి వాహనాలలో ఎయిర్బాగ్స్ అందించబడలేదు.
4. గ్రౌండ్ క్లియరెన్స్ ఆకట్టుకునే విధంగా లేదు.
5. ఇంధన సామర్ధ్యం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.