చెవ్రోలెట్ క్రుజ్

` 13.3 - 14.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

చెవ్రోలెట్ ఇతర కారు మోడల్లు

 
*Rs

చెవ్రోలెట్ క్రుజ్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


జనరల్ మోటార్స్ యొక్క ఉత్తమ విక్రయ మోడళ్లలో ఒకటైన షెవర్లె క్రూజ్ ఇప్పుడు దాని రెండవ తరం మోడల్ ను చూస్తుంది. అంతేకాకుండా ఈ కారు ఇటీవల బహిర్గతమైంది మరియు ఇప్పుడు మరింత ఆడంబరమైన దాని బలమైన రూపాన్ని చూపించబోతుంది మరియు ఉత్కంఠభరితమైన లుక్ తో రాబోతుంది. ఈ వాహనం ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ల తో పాటు ఒక కొత్త డీజిల్ ఇంజన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ లతో రాబోతుంది. ఈ ప్రీమియం సెడాన్, వచ్చే ఏడాది నాటికి భారత తీరం చేరుతుందని భావిస్తున్నారు. ఈ వాహనం, అనేక లక్షణాలతో మరియు కొనుగోలుదారులను ఆకర్షించేలా దీనిని రూపొందించారు. అంతేకాకుండా ఈ వాహనం ఆకర్షణీయమైన లుక్స్ తో పాటు అదిక పనితీరు ను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఒక సురక్షితమైన వాహనం గా తయారుచేయుటకు గాను తయారీదారుడు ఈ వాహనానికి బలమైన రక్షణ అందించే అనేక భద్రతా లక్షణాల తో మెరుగుపరిచాడు. ఆ బద్రతా లక్షణాలు ఏమిటంటే, ఇంజన్ ఇమ్మోబిలైజర్, యాంటీ థెఫ్ట్ అలారం, ఆటో డోర్ లాకింగ్ మరియు అన్లాకింగ్ వంటి అనేక ఇతర లక్షణాలు ఈ వాహనం లో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా ఇటువంటి లక్షణాలు అన్ని వేరియంట్ లలో అందించబడ్డాయి. వీటితో పాటు పిల్లల సీటు నిబంధనలు, ఎత్తు సర్దుబాటు సీట్ బెల్ట్లు, సైడ్ ఎయిర్బ్యాగ్స్ తో పాటు మెరుగైన రక్షణ ను అందించడం కోసం డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ యజమానులకు గొప్ప రక్షణను అందిస్తాయి. అంతేకాకుండా ఇలాంటి కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. బ్యాటరీ రన్ డౌన్ ఫంక్షన్ , డ్యూయల్ హార్న్ మరియు డ్రైవర్ కు సౌలభ్యాన్ని అందించే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, చాలా ఆకర్షణీయం గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ముందరి భాగం క్రోమ్ గ్రిల్ మధ్య భాగం లో సంస్థ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. దీని వలన ఈ వాహనం యొక్క ముందరి భాగం మరింత అద్భుతమైనది గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రేడియేటర్ గ్రిల్ డ్యూయల్ టోన్ ను కలిగి ఉంటుంది. ముందరి బంపర్ కారు యొక్క బాడీ కలర్ లో ఉంటుంది. దీని వలన వాహనం అంతా ఏకరీతిలో ఉంటుంది. అదే వెనుక భాగం లో ఉండే బంపర్ డ్యూయల్ టోన్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు మరియు డోర్ హ్యాండిల్ కూడా కారు యొక్క బాడీ కలర్ లోనే ఉంటాయి. ఈ గ్రిల్ క్రింది భాగానికి వస్తే హెడ్ లైట్ క్లస్టర్ అమర్చబడి ఉంటుంది. దీన్ క్రింది భాగం లో ఒక జత ఫాగ్ ల్యాంప్స్ బిగించబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క క్యాబిన్ మోనోటోన్ జెట్ బ్లాక్ సీట్లను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా ఈ సీట్లు టైటానియం కుట్లతో కుట్టబడి ఉంటుంది. ఇది ప్రీమియం బ్లాక్ మరియు టైటానియం రాప్ రౌండ్ థీమ్ తో జతపరచబడి ఉంటుంది. ఈ క్యాబిన్ అదే సమయంలో చాలా విభిన్నమైన మరియు అధునాతన లుక్ ను ఇస్తుంది. ఈ వాహనాల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లు లెదర్ అపోలిస్ట్రీ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ వాహనం లో ఉండే గేర్ నాబ్ మరియు స్టీరింగ్ వీల్ కూడా లెదర్ కవర్ తో కప్పబడి ఉంటాయి. ట్రిపుల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేక ప్రకటనలను అందుబాటులో ఉంచుతుంది. క్యాబిన్ కు మరింత అందాన్ని చేకూర్చడానికి ఒక నీలం ప్రకాశం ఇవ్వబడుతుంది. ఈ వాహనం లో ముందు ఆర్మ్ రెస్ట్ మరియు వెనుక ఆర్మ్రెస్ట్లు రెండు కప్ హోల్డర్ ను అదే విధంగా అనేక నిల్వ ఖాళీలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్యాబిన్ యొక్క ముందు మరియు వెనుక క్యాబిన్ మంచి లైటింగ్ ను అందించడం కోసం ఒక జత రీడింగ్ ల్యాంప్స్ అందించబడతాయి. డ్రైవర్ యొక్క కేంద్రీకృతమైన విధుల గురించి చెప్పడానికి వస్తే, ఈ వాహనాల స్టీరింగ్ వీల్ టిల్ట్ మరియు టెలిస్కోపిక్ ఫంక్షన్ లతో కూడిన పవర్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది. దీనిని కలిగి ఉండటం వలన డ్రైవర్ యొక్క శ్రమ తగ్గుతుంది. అంతేకాకుండా గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది. డ్రైవర్ కొరకు క్యాబిన్ లో క్లచ్ ఫూట్ రెస్ట్ అమర్చబడి ఉంటుంది. ఒక ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ను కూడా అందించడం జరిగింది. దీనితో పాటుగా వెంట్ లతో కూడిన ఎలక్ట్రానిక్ ఆటో ఎయిర్ కండిషనింగ్ యూనిట్ బిగించబడి ఉంటుంది. ఈ వాహనం లో ఆడియో వ్యవస్థ కూడా అందించబడుతుంది. ఈ సంగీత వ్యవస్థ, అనేక ప్లేయర్ లను మరియు బ్లూటూత్ లకు మద్దతిస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ప్రస్తుతం ఈ సెడాన్ 2.0 లీటర్ వి సి డి ఐ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడ్ లో 17.3 కె ఎం పి ఎల్ ఇంధన సామర్ధ్యాన్ని ఇస్తుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడ్ లో అయితే అత్యధికంగా 14.2 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. ఈ వాహన సంస్థ ఇటీవల క్రూజ్ యొక్క 2016 వెర్షన్ ను ఆవిష్కరించింది. ఇది ఒక 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ లతో అందుబాటులో అవతరిస్తుంది అని వివరించింది. అయితే, తయారీదారుడు ఈ మిల్లుల ఇంధన సామర్ధ్యం గురించి ఏ సమాచారం బహిర్గతం చేయలేదు.

శక్తి సామర్థ్యం:


ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెర్షన్, 1998 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉన్న 2 లీటర్ ఇంజన్ గరిష్ట్టంగా 163.7 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, రాబోయే 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఇప్పడు ఉన్న వెర్షన్ కు దగ్గరగా పవర్ ను మరియు టార్క్ అవుట్పుట్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు, రాబోయే ఈ వాహనాల యొక్క పెట్రోల్ వెర్షన్, అత్యధికంగా 153 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 240 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ప్రస్తుతం, ఈ సెడాన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ ఎంపికను తో కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 9.7 సెకెన్ల సమయం పడుతుంది. అదే విధంగా ఈ వాహనం మరోవైపు, 184 కె ఎం పి హెచ్ అత్యధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


ఈ సెడాన్, ఇప్పటికే అమెరికన్ ఆటో దిగ్గజం చే నిర్మించిన అందమైన నమూనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇటీవల బహిర్గతం అయిన దీని యొక్క కొత్త వెర్షన్ ఆకర్షణీయమైన కొత్త సౌందర్య మరియు మెరుగైన ఏరోడైనమిక్స్ తో స్టైలిష్ గా రాబోతుంది. ఈ వాహనం యొక్క ముందరి గ్రిల్ హై గ్లాస్ బ్లాక్ ఫినిష్ తో మార్పు చేయబడి రాబోతుంది. న్యూ స్టైలింగ్ అప్పీల్ ను అందించే సంస్థ యొక్క లోగో ఈ గ్రిల్ మధ్య భాగం లో పొందుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా ముందరి భాగం లో ఒక బంపర్ కూడా పొందుపరచబడి ఉంటుంది. దీనికి ఒక ఎయిర్ డాం కూడా అందించబడుతుంది. ఇది హెగ్జాగోనల్ ఆకృతి ని కలిగి ఉంటుంది. దీనితో పాటుగా ఇది గ్లాస్సీ బ్లాక్ ఫినిషింగ్ ను కలిగి మరియు ఒక సన్నని క్రోమ్ తో చుట్టబడి ఉంటుంది. ఈ వాహనం యొక్క హెడ్ లైట్ క్లస్టర్ మార్పు చేయబడి రాబోతుంది. దీనిలో డే టైం రన్నింగ్ లైట్ లతో పాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పొందుపరచబడి ఉంటాయి. ఫ్రంట్ బంపర్ దిగువ విభాగం వద్ద ఒక నల్లని రంగు కలిగిన లిప్ ఒక మస్కులైన్ ఆకృతి ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, బంపర్ పై ఒక జత ఫాగ్ ల్యాంప్స్ క్రోమ్ చేరికలతో పొందుపరచబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఒక అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క స్టైలింగ్ మరియు ఏరోడైనమిక్స్ తదుపరి స్థాయి ని చూపిస్తుంది. ఈ కారు యొక్క ఫెండర్లు అందంగా చెక్కబడి ఉంటాయి. అదే డోర్ ప్యానల్స్ విషయానికి వస్తే, వాటి పై కూడా అనేక పంక్తులతో చెక్కబడి ఉంటాయి. ఈ మోడల్ యొక్క రాబోయే వెర్షన్ 5 స్పోక్ అకృతి కలిగిన రిమ్స్ ను చూడవచ్చు. దీని వలన రాబోయే వెర్షన్ ఒక నవీన అప్పీల్ ను కలిగి ఉంటుంది. అలానే దీనిలో క్రోమ్ సరౌండ్ తో కూడిన విండో సిల్స్ ను చూడవచ్చు. అంతేకాకుండా, ఈ వెర్షన్న్ యొక్క బి- పిల్లార్ నిగనిగలాడే నలుపు రంగు ను కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ఒక జత టైల్ లైట్ క్లస్టర్ లను మరియు మార్పు చేయబడిన బంపర్ ను చూడవచ్చు. బూట్ మూత కూడా ఒక అధునాతన కొత్త నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆకర్షణీయతను మరింత జోడించేందుకు ఈ వాహనం డెక్లిడ్ స్పాయిలర్ ను కలిగి ఉంటుంది. రక్షణ కోసం ఈ వాహనం యొక్క బంపర్ పై ఒక జత రిఫ్లెక్టార్ లను కలిగి ఉంటుంది. దీనితో పాటు లోయర్ క్లాడింగ్ ను కూడా చూడవచ్చు.

వెలుపలి కొలతలు:


2016 వెర్షన్, ఇప్పటికే ఉన్న మోడల్ కన్నా పెద్దది గా మరియు విశాలమైన క్యాబిన్ తో రాబోతుందని తయారీదారుడు పేర్కొన్నాడు. అయితే, దాని కొలతలు గురించి ఖచ్చితమైన సమాచారం వెల్లడించలేదు. ప్రస్తుతం ఉన్న వెర్షన్ యొక్క కొలతలను గనుక చూసినట్లైతే ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4597 మిల్లీ మీటర్లు, బాహ్య అద్దాలను మినహాయించి మొత్తం వెడల్పు 1788 మిల్లీ మీటర్లు, మొత్తం ఎత్తు1477 మిల్లీ మీటర్లు, దీని యొక్క వీల్ బేస్ 2685 మిల్లీ మీటర్లు మరియు ఈ వాహనం యొక్క కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీ మీటర్లు.

లోపలి డిజైన్:


ఇటీవల ఆవిష్కరించిన అన్ని వాహనాల యొక్క లోపలి భాగాలు చాలా ఆకర్షణీయంగా మరియు క్యాబిన్ అంతా నలుపు రంగు ముగింపు తో అందజేయబడ్డాయి. ఈ వాహనం యొక్క డాష్బోర్డ్ అధిక నాణ్యత కలిగిన ప్లాస్టిక్ ను ఉపయోగించి తయారు చేయడం జరిగింది మరియు లెధర్ అపోలిస్ట్రీ కు విరుద్ధంగా కుట్టు తో అలంకరించబడి ఉంటుంది. ఈ వాహనం లో ఉండే సెంట్రల్ కన్సోల్ ఏసి యూనిట్ తో మరియు ఒక టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ వంటి ఆధునిక పరికరాలు తో లోడ్ చేయబడతాయి. అదనంగా, దీని యొక్క డాష్బోర్డ్ పై లోహపు చేరికల తో పాటు నిగనిగలాడే నలుపు రంగు ముగింపు ను కలిగి ఉంది. క్యాబిన్ అలాగే పలు అవసరమైన మరియు అలంకరణ లక్షణాలు తో ఇమిడి ఉంది. ఈ వాహనం యొక్క సీట్లు ప్రయాణికులకు అధనపు సౌకర్యాన్ని అందించుట కొరకు కుషన్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. దీనితో పాటుగా ఈ వాహనం లో ఉండే గేర్ షిఫ్ట్ నాబ్ మరియు స్టీరింగ్ వీల్ రెండూ కూడా లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. స్టీరింగ్ వీల్ ఒక కొత్త మూడు స్పోక్ ల రూపకల్పన కలిగి మరియు బంగారు లోహపు చేరికలతో పాటు సంస్థ యొక్క లోగో పూత అమర్చబడి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పోర్టి లుక్ ను కలిగి ఎరుపు డైల్స్ తో పాటు ఒక బహుళ సమాచార ప్రదర్శన తో ఒక ఆకర్షణీయమైన కొత్త రూపాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాహనానికి మరింత సౌలభ్యం చేకూర్చడానికి నియంత్రణ స్విచ్చులు స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడి ఉంటాయి.

లోపలి సౌకర్యాలు:


ప్రస్తుతం ఉన్న వెర్షన్ లో అందుబాటులో ఉన్న లక్షణాలతోనే 2016 వెర్షన్ కూడా కలిగి ఉండవచ్చని ఊహిస్తున్నాము. అదే సమయంలో, ఇది మరింత సౌకర్యం చేకూర్చడానికి మరిన్ని అధనపు లక్షణాలతో కూడా రావచ్చు. ప్రస్తుతం, ఇప్పటికే ఉన్న సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు అనేక సౌకర్య లక్షణాలతో అందించబడ్డాయి. డ్రైవర్ కు అపారమైన ప్రయోజనం చేకూర్చడానికి ఈ వాహనం మొట్టమొదటి ఫంక్షన్ అయిన టిల్ట్ మరియు టేలీస్కోపిక్ ఫంక్షన్ ను కలిగిన పవర్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంది. ఈ వాహనం లోపల గాలి ఉష్ణోగ్రత ను నియంత్రించుట కొరకు, డస్ట్ ఫిల్టర్ మరియు ఇతర ముఖ్యమైన పనుల కోసం ఒక ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం విద్యుత్తో సర్దుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు, ఫాలో మీ హోమ్ హెడ్ల్యాంప్స్, పవర్ విండోస్, వెనుక విండ్స్క్రీన్ డీఫాగర్ , క్లచ్ ఫుట్ రెస్ట్, ట్రంక్ రూం ఇల్లుమినేషన్ వంటి అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం ఎత్తు సర్ధుబాటు సౌకర్యాన్ని కలిగిన డ్రైవర్ సీటు, జ్వలన కీ రిమైండర్, ఒక సిగరెట్ లైటర్, సన్ గ్లాస్ హోల్డర్ మరియు ఒక పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్ తో పాటు ఒక ప్రోగ్రామబుల్ కీ లెస్ ఎంట్రీ వంటి అధనపు లక్షణాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


పైన చెప్పిన మాదిరిగానే, రాబోయే సెడాన్ ఇప్పటికే ఉన్న వెర్షన్ కంటే కూడా ఒక విశాలమైన క్యాబిన్ ను కలిగి రాబోతుందని చెప్పబడుతుంది. అందువల్ల, రాబోయే సెడాన్ , రూమి లెగ్ స్పేస్, విస్తృత షోల్డర్ రూం మరియు పుష్కలమైన హెడ్ స్పేస్ లతో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వెర్షన్ యొక్క ముందరి హెడ్ రూం వైశాల్యం 999 మిల్లీ మీటర్లు, వెనుక హెడ్ రూం 963 మిల్లీ మీటర్ల పరిమాణాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ముందరి లెగ్ రూం 1074 మిల్లీ మీటర్లు మరియు వెనుక లెగ్ రూం 917 మిల్లీ మీటర్ల పరిమాణాలను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ప్రస్తుతం, తయారీదారుడు హుడ్ కింద ప్రమాణంగా ఒక 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ను ఈ సెడాన్ కు అందించడం జరిగింది. ఇది సుమారు 1998 సిసి యొక్క ఒక స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ మోటార్ ఒక ఆధునిక వేరియబుల్ జ్యామితి టర్బోచార్జర్ మరియు ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ లతో సంఘటిత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 3800 ఆర్ పి ఎం వద్ద 163.7 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా 2000 ఆర్ పి ఎం వద్ద 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అదే మిగిలిన వేరియంట్ ల విషయానికి వస్తే, అన్నియూ కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, 2016 వెర్షన్, 1.6 లీటర్ డీజిల్, 1.4 లీటర్ పెట్రోల్ వంటి రెండు ఇంజన్ ఎంపికల తో వస్తుంది అని చెబుతున్నారు. డీజిల్ ఇంజన్ గురించి మాట్లాడటానికి వస్తే, ఇప్పుడున్న 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ స్థానాన్ని 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ బర్తీ చేయనుంది. కానీ అది శక్తివంతమైనది మరియు మంచి ఇంధన సామర్ధ్యాన్ని ఇవ్వడం లో సహయపడుతుంది అని చెప్పబడుతుంది. ఈ ఇంజిన్లు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ గేర్బాక్స్ రెండిటి ఎంపికలతో అందుబాటులోకి వస్తుంది అని ఆశిస్తున్నారు.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ విభాగం లో ఉండే ఏ ఇతర సెడాన్ లో వలే కాకుండా, ఈ 2016 వెర్షన్, వైఫై హాట్స్పాట్ సౌకర్యం తో పాటు 4జి ఎల్ టి ఈ వ్యవస్థ తో అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో, ఈ వాహనం ఒక 7-అంగుళాల టచ్స్క్రీన్ ప్రదర్శన ను కలిగి జనరల్ మోటార్స్ యొక్క మై లింక్ సమాచార వ్యవస్థ తో వచ్చే అవకాశాలు ఉన్నాయని అని చెబుతున్నారు. ఈ వాహనం ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫంక్షన్ లకు అనుకూలంగా ఉంది. అదే సమయంలో, ఈ వాహనం నావిగేషన్ వ్యవస్థ మరియు 8-అంగుళాల డిస్ప్లే తో పాటు సంస్థ వివిధ ఇతర ఫీచర్ లను అందించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్రీమియం సెడాన్ విభాగంలో ఇది కచ్చితంగా ఒక కఠినమైన పోటీదారుగా ఉండే విధంగా సహాయం చేస్తుంది.

వీల్స్ పరిమాణం:


ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో 16- అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. అంతేకాకుండా, వీటి యొక్క రిమ్స్ బలమైన సెట్ కలిగిన 205/60 R16 పరిమాణం గల టైర్లతో కప్పబడి ఉంటాయి. మరోవైపు, 2016 వెర్షన్, ప్రామాణికమైన లక్షణంగా పెద్ద 17 అంగుళాల రిమ్స్ తో వస్తుందని భావిస్తున్నారు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


2016 వెర్షన్ లో, బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ వ్యవస్థ పరంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకోవచ్చు లేదా చోటు చేసుకోకపోవచ్చు. అందువల్ల, ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక చక్రాలు వెంటిలేషన్ డిస్క్ బ్రేక్ల తో బిగించి రావచ్చునని ఆశించడమైనది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సహాయక లక్షణాలను ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత వెర్షన్ లో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేదు. కానీ, 2016 వెర్షన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ముందరి ఆక్సిల్ ను లీనియర్ సిలండ్రికల్ కాయిల్ స్ప్రింగ్ మరియు గొట్టపు స్టెబిలైజర్ బార్ సిస్టమ్ లతో అమర్చారు. అదే ఈ వాహనం యొక్క వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, కాంపౌండ్ క్రాంక్ టైప్ తో పాటు నాన్ లీనియర్ మరియు మిని బ్లాక్ కాయిల్ స్ప్రింగ్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఈ సస్పెన్షన్ ఒక సున్నితమైన మరియు నియంత్రిత డ్రైవ్ ను ఇవ్వడానికి సహాయపడుతుంది.

భద్రత మరియు రక్షణ:


2016 వెర్షన్, 10 ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, మరియు రోల్ ఆన్ మిటిగేషన్ కార్యక్రమం తో వస్తుందని చెబుతున్నారు. ఈ లక్షణాలు ఖచ్చితంగా లోపల యజమానుల యొక్క రక్షణ స్థాయి ని మెరుగుపర్చే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటికే ఉన్న వెర్షన్ ఒక యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఒక ఇంజిన్ ఇమ్మోబిలైజర్, యాంటీ తెఫ్ట్ అలారం వ్యవస్థ మరియు ఒక ఆటో డోర్ లాకింగ్ సిస్టమ్ వంటి ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ముందు మరియు వెనుక బంపర్స్ రెండూ కూడా ఇంపాక్ట్ ప్రూఫ్ విధానాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ విధానం దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. అంతేకాకుండా, ఈ వాహనం అండర్ బాడీ కోటింగ్ తో అందుబాటులో ఉంది. దీని వలన వాహనానికి తుప్పు పట్టకుండా లేదా ఏ ఇతర నష్టాల నుండి చట్రాన్ని రక్షించేందుకు సహాయపడతాయి. ముందు సీట్లకు సీట్ బెల్ట్లను కలిగి ఉంటాయి. అంతేకకుండా ఈ సీట్ బెల్ట్ లు ఎత్తు సర్ధుబాటు సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. ఈ వాహనం యొక్క ముఖ క్రింది భాగం ఒక జత ఫాగ్ ల్యాంప్ లను కలిగి ఉంటాయి. ఇవి డ్రైవింగ్ సమయం లో రోడ్ స్పష్ట్టంగా కనిపించేలా సహాయపడతాయి. అంతేకాకుండా ఈ వాహనంలో, బ్యాటరీ రన్ డౌన్ రక్షణ వ్యవస్థ అందించడం జరిగింది. దీని వలన బ్యాటరీ పూర్తిగా డిచ్ఛార్జ్ అంచుకు వచ్చినప్పుడు డ్రైవర్ కు హెచ్చరిక ను అందిస్తుంది. ఈ వాహనం లో పిల్లల కోసం సీట్లు, పరిపూరక కేటాయింపులను కలిగి ఉంది. దీని వలన వాహన కుటుంభ సభ్యులకు ఒక స్నేహపూర్వక సంభందాన్ని ఇస్తుంది. అదనపు సహాయాన్ని చేకూర్చుట కొరకు ఈ వాహనం సైడ్ ఎయిర్బ్యాగ్స్ ను ఈ వాహన సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో చూడవచ్చు.

అనుకూలాలు:


1. ఇంటీరియర్స్ లుక్స్ చాలా అధునాతన మరియు చూడటానికి ఆధునికంగా ఉంటాయి.
2. పెద్ద వీల్బేస్ కారణంగా అంతర్గత భాగం విశాలంగా ఉంటుంది.
3. ఈ వాహన సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు అల్లాయ్ వీల్స్ అందించబడతాయి.
4. ఈ వాహనం యొక్క బాహ్య భాగం చాలా అద్భుతంగా ఉంటుంది.
5. ఈ వాహన సిరీస్ లో చాలా సౌకర్య అంశాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రతికూలాలు:


1. ఈ వాహనాల యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఆకట్టుకునే విధంగా లేదు.
2. లెథర్ అపోలిస్ట్రీ ఈ వాహన సిరీస్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లో లేకపోవడం ఒక ప్రతికూలత గా భావించవచ్చు.
3. నావిగేషన్ వ్యవస్థ లేకపోవడం కూడా ఒక ప్రతికూలతే.
4. మైలేజ్ ఊహించినంత గొప్పగా ఏమి లేదు.
5. ధర పరిధి మరింత సమంజసంగా ఉంటే బాగుండేది