చెవ్రోలెట్ కాప్టివా

` 26.3 - 28.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

చెవ్రోలెట్ ఇతర కారు మోడల్లు

 
*Rs

చెవ్రోలెట్ కాప్టివా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


జనరల్ మోటార్స్ ఇప్పుడు భారత కార్ల మార్కెట్లో తమ యొక్క అమ్మకాల సంఖ్య పెంచుకోవడానికి దాని విలాసవంతమైన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం, షెవ్రొలెకాప్టివా యొక్క నవీకరించిన వెర్షన్ ను కార్ల మార్కెట్లో విడుదల చేసింది. దాని పూర్వపు కారు వలెనే, కంపెనీ అదే ఎంటి 2డబ్ల్యూడి మరియు ఏటి 4డబ్ల్యూడి మోడల్ సిరీస్ లను కొనుగోలుదారులు ఎంచుకోవడానికి అందిస్తుంది. అంతర్గతంగా చేసిన మార్పులు తప్ప ఈ ఎస్యూవిలో మిగతా అన్ని ఫీచర్లు అలాగే ఉన్నాయి. ఈ నవీకరించబడిన అంశాలు ఏమిటనగా బ్రాండ్ ను పునఃరూపకల్పన ఇన్స్ట్రుమెంట్ పానెల్ మరియు ఒక కొత్త క్లస్టర్ అయోజైనర్. ఈ కొత్త క్లస్టర్ అయోజైనర్ క్యాబిన్ లో దుర్వాసనను పోగోట్టుటకు అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. సాంకేతిక వివరణల పరంగా, ఇది 2.2 లీటర్ పవర్ ప్లాంట్ డీజిల్ ఇంజిన్ తో హుడ్ క్రింద అందించబడుతుంది. ఇది 2231cc స్థానభ్రంశ సామర్థ్యంతో మనకి అందించబడుతుంది. ఈ వాహనం 3800rpm వద్ద 184 bhp గరిష్ట శక్తి అవుట్పుట్ ను మరియు 2000rpm వద్ద గరిష్టంగా 424 Nm టార్క్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ 2డబ్ల్యూడి వెర్షన్ నైపుణ్యంగా ఒక సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సిస్టమ్ తో ఉంది. అలాగే ఇంకో వెర్షన్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది దాని యొక్క ఇంజిన్ పవర్ ను వీల్స్ కి సరఫరా చేస్తుంది. దీని బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం చాలా సమర్థవంతంగా ఉంటాయి. ఇది ఎల్లవేళలా వాహనాన్ని బాగా సమతుల్యంగా మరియు స్థిరంగా ఉంచుతాయి. ఇది సౌకర్యం కోసం ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు ఒక ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ తో అందించబడుతుంది. ఈ యుటిలిటీ వాహనం శక్తివంతమైన ఇంజిన్ తో పాటు అనేక సౌలభ్య మరియు భద్రతా లక్షణాలతో అందజేయబడుతుంది. ఇది కొనుగోలుదారులకు మరింత ఆకర్షణగా ఉంటుంది. కంపెనీ ఒక విశాలమైన అంతర్గత క్యాబిన్ తో అందించబడుతుంది. ఇది సౌలభ్యమైన మరియు విలాసవంతమైన పరిపూర్ణ కలయికతో డ్రైవింగ్ అనుభూతిని మరింతగా పెంచుతుంది. ఈ క్యాబిన్ ప్రీమియం బ్లాక్ లెదర్ అపాలస్ట్రీ తో కప్పబడి ఉన్న మంచి కుషన్ సీట్లతో రూపొందించబడి ఉంది. రెండవ వరుసలోని సీట్లు, రిక్లైనింగ్ ఫంక్షన్ తో కూడిన్న స్ప్లిట్ డబుల్ ఫోల్డబిల్ సీట్లతో అందించబడ్డాయి. ఇవి ఆటోమేటిక్ ఫోల్డబిల్ హెడ్ రెస్ట్రైన్స్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. వీటితోపాటు, కొన్ని అధునాతన లక్షణాలయినటువంటి కొన్ని ఇన్పుట్ ఎంపికలతో ఒక ఆధునిక సమాచార వ్యవస్థ, 8-వే సర్దుబాటు డ్రైవర్ సీటు, యాంబియెంట్ లైటింగ్, రహదారులపై స్థిరమైన వేగంను కొనసాగించడానికి క్రూజ్ నియంత్రణ వ్యవస్థ, వాతావరణ నియంత్రణతో కూడిన సమర్థవంతమైన ఎయిర్ కండీషనింగ్ యూనిట్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. ప్రయాణికులకు ఎలాంటి ఒత్తిడి లేని ఉచిత డ్రైవింగ్ అనుభవాన్ని అందించేందుకు రక్షణనిచ్చే లక్షణాలు దీనిలో చాలా ఉన్నాయి. ఈ జాబితాలో ఆరు ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు బ్రేక్ అసిస్ట్ తో పాటు యాంటీ బ్రేకింగ్ సిస్టం, ఒక ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ప్రిటెన్షనర్ మరియు లోడ్ లిమిటర్ తో పాటు ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్స్, వాహనాన్ని దొంగతనాల నుండి రక్షించడానికి ఒక ఆధునిక ఇంజిన్ ఇమ్మొబిలైజర్ మరియు ఇంకా ఎన్నో లక్షణాలను ఇది కలిగి ఉంది. మరోవైపు, ఈ తాజా వెర్షన్ ఆకర్షణీయముగా ఉండే బాహ్య రూపంతో అందించబడుతుంది. ఇది సొగసైన బాడీ నిర్మాణంతో దృఢమైన రేడియేటర్ గ్రిల్ ను కలిగి ఉంది. ఇది రెండు భాగాలుగా విభజించబడింది. అది ఒకటి ప్రముఖ కంపెనీ యొక్క బాడ్జ్ కలిగి ఉన్న ఒక మందపాటి సమాంతర స్ట్రిప్ తో వస్తుంది. ఈ అధ్యయనాలే కాక, అది ఒక ప్రకాశవంతమైన హెడ్ లైట్ క్లస్టర్, ఒక జత ఫాగ్ ల్యాంప్స్ తో బాడీ రంగు ఫ్రంట్ బంపర్, విద్యుత్తో సర్దుబాటు చేయగల బయట వెనుక వీక్షణ అద్దాలు మరియు ఒక జత అంతరాయక వైపర్స్ తో ఒక పెద్ద విండ్స్క్రీన్ వంటి లక్షణాలను కలిగి ఉంది. దాని సైడ్ ప్రొఫైల్ లో చూసినట్లయితే, ధృఢనిర్మాణంగల వీల్ ఆర్చులు స్టైలిష్ గా ఉండే అల్లాయ్ వీల్స్ సమితితో బిగించి ఉండడం వలన మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ వీల్స్ మరింతగా అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో బిగించబడి ఉంటాయి. ఇవి ఎలాంటి రోడ్డు పరిస్థితులలో అయినా సరే మంచి పట్టును అందిస్తాయి. దీని అగ్ర శ్రేణి వేరియంట్ చిన్న చిన్న నష్టాలను నిరోధించే సిల్వర్ పెయింటెడ్ స్కిడ్ ప్లేట్లను, ఒక ఎలక్ట్రిక్ సన్రూఫ్ ను, ఒక జత రూఫ్ రెయిల్స్ మరియు ఉన్నతమైన లుక్ కోసం క్రోమ్ బెల్ట్ లైన్ మోల్డింగ్ లను కలిగి ఉంటుంది. సంస్థ దీనిని మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ( ఏది ముందు వస్తే అది) వారంటీతో అందిస్తుంది. వినియోగదారులు ఈ వారంటీ కాలాన్ని అధికార డీలర్ల వద్ద అదనపు ధరతో పొడిగించుకోవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ మోడల్ ఇయర్ 15క్యాప్టివా మోడల్ సిరీస్ అదే డీజిల్ ఇంజన్ తో వస్తుంది మరియు ఇది ఒక సాధారణ రైల్ ఆధారిత ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ తో చేర్చబడి ఉంటుంది. ఇది మాన్యువల్ వేరియంట్ కి రహదారులపై 14.6kmpl మైలేజ్ ను మరియు నగరంలో ట్రాఫిక్ పరిస్థితులలో 11.3 kmpl మైలేజ్ ని సరఫరా చేయడానికి అనుమతిస్తుంది. అయితే, ఆటోమేటిక్ వెర్షన్ నగరం లోపల 9.8 kmpl మైలేజ్ ను మరియు పెద్ద రోడ్లపై 12.12kmpl మైలేజ్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది దాని విభాగంలో చాలా యోగ్యకరంగా ఉంటుంది.

శక్తి సామర్థ్యం:


దీని 2.2 లీటర్ పవర్ ప్లాంట్ 3800rpm వద్ద 184 bhp గరిష్ట శక్తి అవుట్పుట్ ను మరియు 2000rpm వద్ద గరిష్టంగా 424Nm టార్క్ ను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్లాస్ లో ఇది చాలా యోగ్యకరమైనది.

యాక్సలరేషన్ మరియు పికప్:


సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సహాయంతో, ఈ మోటార్ 2 డబ్ల్యూ డి వేరియంట్ 190- 200 kmph పరిధిలో గరిష్ట వేగాన్ని సాధించగలదు. ఇది తగినంత మంచిదిగా ఉంది. అయితే, ఇది ఉన్న స్థలం నుండి 9.6 సెకన్లలో దగ్గరగా 100kmph వేగాన్ని అవరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు, ఈ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ , ఇంజిన్ కి సుమారు 195 కిలోమీటర్ల టాప్ వేగాన్ని చేరుకునే శక్తిని అందించగలుగుతుంది. అదే సమయంలో,ఇది దాదాపు 11 సెకన్లలో 0 నుంచి 100 kmph వరకు వేగవంతం చేసుకునే సామర్థ్యంతో ఉంది. ఇది లోపల కూర్చుని ఉన్న ప్రయాణికులకు చాలా ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇస్తుంది.

వెలుపలి డిజైన్:


సంస్థ దాని యొక్క బాహ్య రూపంలో ఏ విధమైన కాస్మెటిక్ మార్పులు లేకుండా ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం యొక్క నవీకరించిన సంస్కరణను విడుదల చేసింది. ఇది ఆకర్షణీయముగా ఉండే అసంఖ్యాక విశిష్ట లక్షణాలతో బిగించబడి ఉంటుంది. ఇది రోడ్లపై వెళుతుంటే అందరినీ ఆకర్షించే విధంగా ఉంది. మొదట సైడ్ ప్రొఫైల్ విషయానికొస్తే, ఈ మోడల్ సిరీస్ చాలా సొగసైనదిగా మరియు వీటిని క్రోమ్ అధారిత పట్టుకుని ఉండే డోర్ హ్యాండిల్స్ తో మరియు చక్కదనం జోడించేలా విండో సిల్ మీద క్రోమ్ గార్నిష్ తో డిజైన్ చేయబడి ఉంది. బాడీ కలర్లో ఉండే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే విధంగా సైడ్ టర్న్ బ్లింకర్స్ తో సంఘటితం చేయబడి ఉన్నాయి. ఇది మంచిగా చెక్కబడిన వీల్ ఆర్చులతో సొగసైన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ సెట్ తో అమర్చారు. దీని సైడ్ ప్రొఫైల్ ఒక స్పోర్టీ రూపాన్ని ఇస్తుంది. ఈ రిమ్స్ మరింతగా ఎలాంటి భూభాగం పై అయినా ఉన్నత రోడ్డు పట్టును కలిగి ఉండేలా ఇవి ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో బిగించబడి ఉంటాయి. ఏటి 4డబ్ల్యూడి ట్రిమ్ ఒక విశాల దృశ్య సన్ రూఫ్ ను కలిగి ఉంది మరియు స్యాటిన్ సిల్వర్ రూఫ్ రెయిల్స్ కూడా మరింత ఆకర్షణను దీనికి చేకూర్చుతాయి. దీని రేర్ ఎండ్ విషయానికి వచ్చినట్లయితే, డీఫాగర్ తో పాటుగా వైపర్ మరియు వాషర్ ఫంక్షన్లను కలిగిన ఒక పెద్ద విండ్ షీల్డ్ తో రూపొందించబడింది. ఇంకా ఇది ఒక స్పోర్టీ రేర్ స్పాయిలర్ తో వస్తుంది. ఇది మధ్య భాగంలో ఉన్న హై మౌంట్ స్టాప్ ల్యాంప్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఇది భద్రతా సూచీని కూడా జోడిస్తుంది. దీనిలో బూట్ లిడ్ ఒక మందపాటి క్రోమ్ స్ట్రిప్ తో రూపొందించబడింది మరియు వేరియంట్ బ్యాడ్జింగ్ తో పొందుపరచబడింది. దీనిలో బాడీ రంగు బంపర్ , పార్కింగ్ సెన్సార్లతో మరియు ఒక జత ప్రకాశవంతమైన పరావర్తనాలతో అమర్చబడి ఉంటుంది. ఈ బంపర్ ఒక సిల్వర్ ప్లేటెడ్ క్లాడింగ్ తో వస్తుంది. దీని వలన చిన్న చిన్న ప్రమాదాల నుండి బంపర్ నిరోధిస్తుంది. వీటితో పాటు, ముద్రించిన యాంటెన్నా మరియు జంట క్రోమ్ ఫినిష్డ్ ఎగ్సాస్ట్ పైపులను కలిగి ఉంది.ప్రకాశవంతమైన టెయిల్ లైట్ క్లస్టర్, హాలోజెన్ ఆధారిత బ్రేక్ లైట్లతో మరియు రివర్స్ ల్యాంప్స్ మరియు సైడ్ ఇండికేటర్లతో శక్తివంతమవుతాయి. మరోవైపు, సంస్థ ఆకట్టుకునే ముందు భాగాన్ని కలిగి ఉంది. ఇది ఒక బోల్డ్ రేడియేటర్ గ్రిల్ తో మాట్టే నలుపు రంగుతో అందించబడుతుంది. ఇది రెండు భాగాలుగా విభజించబడింది. అది ఒకటి ప్రముఖ కంపెనీ యొక్క బాడ్జ్ కలిగి ఉన్న ఒక మందపాటి సమాంతర స్ట్రిప్ తో వస్తుంది. ఈ గ్రిల్ చుట్టూ ఉన్న డ్యూయల్ పోర్ట్ క్రోమ్, ఒక తేజస్సుగల హెడ్ లైట్ క్లస్టర్ తో చుట్టబడి ఉంటుంది. ఇది హై ఇంటెన్సివ్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అనుసంధానించబడి ఉంటుంది. బాడీ రంగు బంపర్ కూడా విస్తృతమైన చిల్లుల ఎయిర్ డ్యాం తో నల్ల రంగులో అందించబడుతుంది. ఈ ఎయిర్ ఇంటేక్ విభాగం ఒక జత రౌండెడ్ షేప్ ఫాగ్ ల్యాంప్స్ తో అందించబడుతుంది. ఇది దృష్టి గోచరతను మరింత పెంచుతుంది. దీనిలో పెద్ద విండ్ స్క్రీన్ దృఢమైన ల్యామినేటెడ్ గ్లాస్ తో తయారు చేయబడింది. ఇది డ్రైవర్ కి ఒక విస్తృతమైన దృశ్యంను అందిస్తుంది. ఇది ఒక జత అంతరాయక వైపర్స్ తో బిగించబడి ఉంటుంది. అలాగే ఇవి రెయిన్ సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది. దీనిలో ఏటవాలుగా ఉండే ఒక జత విజిబుల్ క్యారెక్టర్ లైన్స్ ని కలిగి ఉంది. ఇవన్నీ లక్షణాలు కలిసి ఈ వాహనాన్ని దాని క్లాస్ లో ఒక మంచి వాహనంగా తయారు చేస్తున్నాయి.

వెలుపలి కొలతలు:


ఈ ఏడు సీట్ల యొక్క మొత్తం కొలతలు ఏ మాత్రం మార్చలేదు మరియు ఇది దాని యజమానులకు తగినంత మంచి ప్రయాణాన్ని అందించడానికి అనేక సౌకర్యాలతో వస్తుంది. దాని మొత్తం పొడవు దాదాపు 4673mm ఉంటుంది మరియు వెనుక వీక్షణ అద్దాలతో కలిపి 1870mm వెడల్పును కలిగి ఉంది. ఇది మొత్తం ఎత్తు 1755mm ఉంటుది మరియు ఒక పెద్ద వీల్ బేస్ 2705mmఉంటుంది. ఇది క్యాబిన్ స్పేస్ ను నిర్ధారిస్తుంది. దీని స్టీరింగ్ వీల్ 5.8 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్దతునిస్తుంది.

లోపలి డిజైన్:


సంస్థ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం 2015 వెర్షన్ క్యాప్టివా యొక్క అంతర్గత విభాగంలో చిన్న చిన్న మార్పులను చేసింది. ఇది క్యాబిన్ లుక్ మెరుగుపరచడం కోసం ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను దీనిలో బిగించింది. వీటితో పాటు, దీనిలో ఒక కొత్త లక్షణం కొత్త క్లస్టర్ అయోజైనర్, ఇది క్యాబిన్ లో దుర్వాసనను పోగోట్టుటకు అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. దీని యొక్క అంతర్భాగాలు దివ్యమైన నలుపు రంగు షేడ్ తో సీట్ల మీద ప్రీమియం లెథర్ అపాలస్ట్రీ తో అందించబడుతున్నాయి. ఇది దాని పరిసరాల ద్వారా వచ్చే కాంతి ద్వారా మరింత అద్భుతంగా కనబడుతుంది. ఇది స్టీరింగ్ వీల్ పైన, గేర్ షిఫ్ట్ నాబ్ మరియు పార్కింగ్ లివర్ టిప్ పైన లెదర్ కవరింగ్ తో వస్తుంది. ఇవి క్యాబిన్ కి ఒక మంచి లుక్ ను అందిస్తున్నాయి. దీనిలో సీటింగ్ విధానం చాలా విలాసవంతంగా ఉంది. రెండవ వరుసలో సీటు రిక్లైనింగ్ ఫంక్షన్ తో పాటు స్ప్లిట్ డబుల్ ఫోల్డింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. స్ప్లిట్ కొలాప్సబల్ మూడవ వరుస సీట్లకు ఆటోమేటిక్ ఫోల్డ్ డౌన్ హెడ్ రెస్టులను మరింత సౌకర్యం కోసం జతచేశారు. దీని యొక్క నునుపైన డాష్బోర్డ్ ఎసి వెంట్స్ ను, కొన్ని ఫంక్షన్ల తో కూడిన ఒక ప్రకాశవంతమైన ఇన్స్ట్రుమెంట్ పానెల్, శీతలీకరణ ప్రభావాన్ని కలిగియున్న ఒక పెద్ద గ్లోవ్ బాక్స్ మరియు బహుళ-ఫంక్షనల్ స్విచ్ల తో ఒక స్పోర్టి స్టీరింగ్ వీల్ వంటి లక్షణాలను ఇది కలిగి ఉంది. డ్రైవర్ వివిధ హెచ్చరికలు మరియు ప్రకటనలతో అప్రమత్తంగా ఉండేలా ఒక ఆధునిక డ్రైవర్ సమాచార వ్యవస్థను కలిగి ఉంది. ఇది లోఫ్యుయెల్ వార్నింగ్ లైట్, డిజిటల్ ట్యాకోమీటర్, బహుళ ట్రిప్ మీటర్, బాహ్య ఉష్ణోగ్రత ప్రదర్శన, సగటు వేగం మరియు ఇంకా కొన్ని ఇతర అంశాలను దీనిలో పొందుపరిచారు. సంస్థ, ఈ ఎస్యూవి కి అనేక వినియోగ ఆధారిత కోణాలను అందించింది. అవి ముందు మరియు వెనక కప్ హోల్డర్స్ తో సెంటర్ ఆర్మ్రెస్ట్, సిగరెట్ లైటర్, ఒక పోర్టబుల్ యాష్ట్రే, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్, ముందు సీటు బ్యాక్ పాకెట్స్, మరియు రేర్ పార్సిల్ షెల్ఫ్ తో ఒక విశాలమైన బూట్ కంపార్ట్మెంట్. దీనిలో ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కోసం మొదటి మరియు రెండవ వరుసలలో ఒక జంట విద్యుత్ సాకెట్లు ఉన్నాయి. టిల్ట్ మరియు టేలీస్కోపిక్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ చాలా ప్రతిస్పందించే విధంగా ఉంది మరియు ఇది పీక్ ట్రాఫిక్ పరిస్థితుల్లో కూడా అనుకూలమైన నిర్వహణను అందిస్తుంది. ఇది మొబైల్ ఛార్జింగ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల చార్జ్గ్ కోసం ఒక జంట 12 వోల్ట్స్ పవర్ సాకెట్లను కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ మోడల్ సిరీస్ దాని యజమానులకు ఒక సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం కోసం అసంఖ్యాక లక్షణాలను దీనిలో అందజేసింది. ఇది డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్ తో నాలుగు పవర్ విండోస్ ను, వానిటీ మిర్రర్ మరియు టిక్కెట్ హోల్డర్లతో సన్ విజర్స్, భద్రతను జోడించే విధంగా రేర్ పార్కింగ్ సెన్సార్స్, పవర్ అడ్జస్టబుల్ బయట వెనుక వీక్షణ అద్దాలు మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. ఇది క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్ ను కలిగి ఉంది. ఇది రహదారులపై డ్రైవర్ ద్వారా సెట్ చేయబడి రోడ్లపై ఒక స్థిరమైన వేగంను కలిగి ఉంటుంది. క్యాబిన్ సమర్థవంతమైన జోన్ డ్యుయల్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ తో అమర్చబడి ఉంటుంది. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ను కలిగి క్యాబిన్ లో గాలిని నియంత్రిస్తుంది. దీనిలోని కొత్త క్లస్టర్ అయోజైనర్ క్యాబిన్ లో దుర్వాసనను పోగోట్టుటకు అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. క్యాబిన్ ను త్వరగా శీతలీకరణం చేయడానికి దీనిని రేర్ ఏసి వెంట్స్ తో అమర్చారు. దీనిలో 2-డిన్ సంగీత వ్యవస్థ, ఏఎం / ఎఫెం ట్యూనర్ తో రేడియో, సిడి/ఎంపి3 ప్లేయర్ తో ఎనిమిది స్పీకర్లను మరియు మొబైల్ ఫోన్ జత కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో అనుసంధానించబడి ఉంది. ఇది ఆడియో, కాల్ మరియు క్రూజ్ నియంత్రణ బటన్లతో మౌంట్ చేయబడిన ఒక బహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ దీనిలో ఉంది. డ్రైవర్ సీట్ ను ఎనిమిది రకాలుగా సర్దుబాటు చేయవచ్చు. డ్రైవర్ యొక్క ఎత్తు మరియు బరువు ఆధారంగా సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఈ సీటు యొక్క స్థానంను ఆ విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దాని ఆధునిక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక డిజిటల్ టాకొమీటర్ ను, స్పీడోమీటర్, లో ఫ్యుయెల్ వార్నింగ్ లైట్, బాహ్య ఉష్ణోగ్రత ప్రదర్శన, ఎలక్ట్రానిక్ ట్రిప్ మీటర్, డ్రైవర్ సీటు బెల్ట్ హెచ్చరిక నోటిఫికేషన్ మరియు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడానికి అనేక ఇతర అంశాలను ఇది కలిగి ఉంది. వీటితోపాటు, ఒక ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ , రెయిన్ సెన్సింగ్ వైపర్స్, టిల్ట్ మరియు టేలీస్కోపిక్ సర్దుబాటు పవర్ స్టీరింగ్ వీల్, ఒక రిమోట్ కీలెస్ఎంట్రీ, డోర్ పడల్ ల్యాంప్స్, యాంటీ గ్లేర్ ఇన్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ మరియు ఇంకా ఎన్నో లక్షణాలను ఇది కలిగి ఉంది. ఇంకా ఎన్నో అంశాలు వినియోగదారులను ప్రలోభ పెడుతున్నాయి.

లోపలి కొలతలు:


ఈ అద్భుతమైన ఎస్యూవి యొక్క ఖరీదైన అంతర్గత క్యాబిన్ చాలా విశాలంగా మరియు సులభంగా కనీసం ఏడుగురు మంది ప్రయాణికులకు సదుపాయాన్ని కల్పించే విధంగా ఉంది. దీని వీల్ బేస్ చాలా పెద్దదిగా మరియు దానిలో ఉన్నవారికి హెడ్ మరియు షోల్డర్ స్పేస్ లతో పాటు పుష్కలమైన లెగ్ స్పేస్ ను కూడా అందిస్తుంది. అంతేకాక, మోకాలి గది మరియు ఎల్బో స్పేస్ మరింతగా వారికి సౌలభ్యాన్ని అందిస్తూ చాలా అద్భుతంగా ఉంది. వీటితోపాటు, ఇది విశాలమైన బూట్ కంపార్ట్మెంట్ (465 లీటర్లు) ను కలిగి ఉంది. మరింతగా దాని రెండవ మరియు మూడవ వరుస సీట్లను మడవటం ద్వారా దీనిని 1565 లీటర్ల వరకు పెంచవచ్చు. ఒక పెద్ద ఇంధన ట్యాంక్ (65 లీటర్లు) ఉంది. ఇది ఒక పెద్ద ఇంధన ట్యాంక్ (65 లీటర్లు) ను కలిగి ఉంది. అది దూర ప్రయాణాల ప్రణాళిక కోసం చాలా అనుగుణంగా ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


సాంకేతిక వివరణల పరంగా, ఈ మోడల్ సిరీస్ దాని 2015 వెర్షన్ ఉన్నట్లుగానే ఉంది. ఇది ఒక శక్తివంతమైన 2.2 లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ తో అమర్చబడి ఉంది. ఇది 2231cc స్థానభ్రంశ సామర్థ్యంను కలిగి ఉంది. ఇది ఒక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ వ్యవస్థతో సంఘటితం చేయబడి ఉంటుంది. ఇది దాని ఇంధన సామర్ధ్యంను పెంచుతుంది. ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఎంపిక అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది. ఇది వేరియంట్ ను బట్టి ఇంజిన్ పవర్ ను రెండు లేదా నాలుగు వీల్స్ కి సరఫరా చేస్తుంది. ఇది డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలిండర్లు మరియు పదహారు వాల్వ్స్ తో అందించబడుతుంది. ఈ మోటార్ 3800rpm వద్ద గరిష్టంగా 184bhpశక్తిని అందించగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది మరియు అదే సమయంలో, ఇది 2000rpm వద్ద 424Nm పీక్ టార్క్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్లాస్ లో ఇది చాలా యోగ్యకరంగా ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనం ఒక ఆధునిక 2-డిన్ ఆడియో యూనిట్ తో అందజేయబడుతుంది. దీని వలన ప్రయాణికులు వారికి ఇష్టమైన సంగీతం విని వినోదాన్ని పొందవచ్చు. ఈ వ్యవస్థ ఏ ఎం/ఎఫ్ ఎం రేడియో ట్యూనర్ తో పాటు సిడి, ఎంపి3 ప్లేయర్ లతో అందించబడుతుంది. దీని ముందు మరియు వెనుక భాగాలలో మొత్తం ఎనిమిది స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కారు లోపల మంచి వినోదాన్ని అందిస్తాయి. దీనిలో బ్లూటూత్ తో పాటు యుఎస్బి పోర్ట్, సహాయక ఇన్పుట్ ఎంపికలతో మద్దతునిస్తుంది. ఈ యూనిట్ ను మొబైల్ ఫోన్ తో జత చేయవచ్చు. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ కి ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ నియత్రణలు ఉంటాయి. దీని వలన డ్రైవర్ సులభంగా నిర్వహణ చేసుకోవచ్చు. యజమానులు మరింతగా ఆకర్షణీయమైన దాని యొక్క బాహ్య రూపాన్ని బాడీ డికాల్స్ తో , ముందు మట్టి ఫ్లాప్ సెట్ తో, ఒక జత 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఒక సైడ్ స్టెప్ సామగ్రితో వాహనాన్ని అనుకూలీకరించవచ్చు. వీటితోపాటు, మరికొన్ని లోపలి ఫీచర్లయినటువంటి సైడ్ మరియు వెనుక విండోస్ కి ప్రైవసీ షేడ్స్ , వెనుక డివిడి వ్యవస్థ, విలోర్ ఫ్లోర్ మ్యాట్స్, ముందు సీటు నెట్, ఒక కార్గో ట్రే మరియు అనేక ఇతర అంశాలను దీనిలో జోడించవచ్చు.

వీల్స్ పరిమాణం:


తయారీదారుడు ఈ మోడల్ సిరీస్ వీల్ ఆర్చులను ఒక అందమైన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ సమితితో అందించాడు. ఇది దాని సైడ్ ప్రొఫైల్ యొక్క లుక్ ను పెంచుతుంది. ఈ స్పోర్టి రిమ్స్ 235/65R17 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పి ఉంచుతారు. ఇవి ఎలాంటి రహదారి పరిస్థితులపైన అయినా సరే ఒక బలమైన పట్టును అందించే విధంగా ఉంటాయి. అంతేకాకుండా, దీనిలో ముఖ్యమైన టూల్స్ తో పాటు బూట్ కంపార్ట్మెంట్ లోపల పూర్తి పరిమాణం గల ఒక అదనపు వీల్ ను ఉంచారు. ఈ టూల్స్ టైర్ ను మార్చడంలో ఉపయోగపడతాయి. దీని రెండు వేరియంట్లలో ఇది ఒక ప్రామాణిక లక్షణంగా ఉంటుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ కార్ల తయారీ దారుడు ఈ వాహనానికి నమ్మకమైన సస్పెన్షన్ విధానం తో పాటు సమర్థవంతమైన బ్రేకింగ్ సిస్టమ్ ను కూడా ఇచ్చారు. ఇది అన్ని సార్లు కారును బాగా సమతుల్యంగా ఉంచుతుంది. ఈ ఎస్యూవి యొక్క అన్ని చక్రాలు ధృఢ నిర్మాణంగల డిస్క్ బ్రేక్లతో ఉంటాయి. ఇవి దాని యొక్క పనితీరును పెంచుతాయి. ఈ బ్రేకింగ్ మెకానిజం మరింతగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటూ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను అందించడంలో సహాయపడుతుంది. అలాగే బ్రేకింగ్ సహాయతను కూడా పెంచుతుంది. మరోవైపు, దాని నైపుణ్యమైన సస్పెన్షన్ వ్యవస్థ ఒక మృదువైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి ఎలాంటి రోడ్డు పరిస్థితులలో అయినా దాని స్థిరత్వ నిర్వహణలో సహాయపడుతుంది. దీని యొక్క ఫ్రంట్ ఆక్సిల్, ఒక మక్ఫెర్సొన్ స్ట్రట్ తో జతచేయబడి ఉంటుంది. వెనుక వైపు లెవల్ రైడ్ టైప్ సిస్టమ్ తో పాటుగా బహుళ లింక్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు యాక్సిల్స్ మరింతగా ట్విన్ ట్యూబ్ గ్యాస్ ప్రెజర్ స్ట్రట్స్ కి సహాయకంగా ఉంటాయి. ఇవి ఈ మెకానిజం ను మరింతగా ప్రేరేపిస్తాయి. ఇది ఒక హైడ్రాలిక్ పవర్ సహాయక స్టీరింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది టిల్ట్ మరియు టెలీస్కోపిక్ సర్దుబాటు ఫంక్షన్ ను కలిగి ఉంటుంది. ఇది డ్రైవర్ సులభంగా అమలు చేసుకోవడానికి అనుకూలమైన నిర్వహణ ఫలితాలను అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ప్రయాణీకులకు ఒత్తిడి లేని ఉచిత డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వడానికి అనేక భద్రత అంశాల జాబితాను దీనిలో లోడ్ చేసింది. ఇది మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ముందు ప్రయాణికులకు సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే రూఫ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ రక్షణ కవచాలను క్యాబిన్ లోపల ప్రయాణీకులకు అందిస్తారు. ముందు భాగంలో బాధ్యతతో మరియు లోడ్ పరిమితులతో కూడిన సీటు బెల్టులను ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ వాహనం డిస్క్ బ్రేకింగ్ మెకానిజం తో అందజేయబడింది. ఇది చాలా సమర్థవంతమైనది మరియు వాహనాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో ఒక ఆధునిక యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే బ్రేక్ అసిస్ట్ తో చేర్చబడింది. ఇది దాని బ్రేకింగ్ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అలాగే ట్రాక్షన్ నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంది. ఇది రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ను కలిగి ఉంది. ఇది వాహనాన్ని రివర్స్ లో పార్క్ చేయడంలో సహాయపడుతుంది. వీటితోపాటు, ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, ముందు మరియు వెనుక ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ లెవల్ రైడ్ సస్పెన్షన్, రేర్ డీఫాగర్, క్రియాశీలక ఫ్రంట్ హెడ్ రెస్టులు అలాగే డే మరియు రాత్రి యాంటీ గ్లేర్ ఇంటర్నల్ రేర్ వ్యూ మిర్రర్స్ వంటి అనుకూల లక్షణాలను కలిగి ఉంది.

అనుకూలాలు:


1. పుష్కలమైన లెగ్ మరియు హెడ్ స్పేస్ తో విశాలమైన అంతర్గత క్యాబిన్ ఉంది.
2. నమ్మకమైన ఇంజిన్ పనితీరుతో మంచి యాక్సలరేషన్ మరియు పికప్ ఉంది.
3. ఇది అనేక సౌకర్య అంశాలతో అందించబడుతుంది.
4. బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానం చాలా నైపుణ్యంగా ఉంది.
5. ఆకర్షణీయమైన బాహ్య రూపంతో చాలా స్టైలింగ్ అంశాలను కలిగి ఉంది.

ప్రతికూలాలు:


1. గ్రౌండ్ క్లియరెన్స్ ఆశించినంతగా లేకపోవడం ఒక ప్రతికూలత.
2. మైలేజ్ ఆశించినంతగా లేకపోవడం ఒక ప్రతికూలత.
3. యాజమాన్య ప్రారంభ వ్యయం మరియు నిర్వహణ ఖర్చు బాగా ఎక్కువగా ఉంది.
4. అమ్మకాల తరువాతి సేవలు తగినంతగా లేవు.
5. డీజిల్ ఇంజన్ శబ్దం మరియు గరుకుతనం తగ్గించవలసి ఉంది.