చెవ్రోలెట్ బీట్

` 3.9 - 6.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

చెవ్రోలెట్ ఇతర కారు మోడల్లు

 
*Rs

చెవ్రోలెట్ బీట్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతదేశ కారు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమమైన అమ్మకాలలో షెవ్రోలె బీట్ ఒకటి. ఇది చిన్న మరియు స్టయిలిష్ వాహనం. దీనిలో ఐదుగురు వ్యక్తులు కూర్చునేందుకు చాలా సదుపాయంగా ఉంటుంది. ఇది నాలుగు పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో తో అందించబడుతుంది. ఇటీవల కంపెనీ అంతర్గత మరియు బాహ్య అంశాల యొక్క ఒక ప్రత్యేక సెట్ తో ఒక మాంచెస్టర్ యునైటెడ్ లిమిటెడ్ ఎడిషన్ జోడించారు. దీని యొక్క బాహ్య స్వరూపాలు మాంచెస్టర్ యునైటెడ్ లోగో తో పాటూ స్పోర్టి చేరికలతో అలంకరించబడి అందమైన లుక్ ఇస్తుంది. దీని అంతర్భాగాలు కూడా ఖరీదైన బ్లాక్ కార్పెట్ మ్యాట్స్, ప్రత్యేక సీటు కవర్లు మరియు ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్స్ వంటి కొన్ని అంశాలతో నవీకరించబడినది. దీని ముందరి భాగానికి ఒక బోల్డ్ ఫ్రంట్ ద్వంద్వ పోర్ట్ రేడియేటర్ గ్రిల్ ఉంది. అలానే హెడ్లైట్ క్లస్టర్ చాలా అధునాతనంగా రూపొందించబడినది. వెనుక భాగంలో ఒక ద్వంద్వ టోన్ బంపర్ మరియు ఆభరణాల వంటి ఎఫెక్ట్ తో టెయిల్ ల్యాంప్స్ వంటి అద్భుతమైన కారకాలు ఉన్నాయి. వీటితోపాటు, ఇది స్పాయిలర్ మౌంటెడ్ ఎల్ ఇడి స్టాప్ ల్యాంప్, టింటెడ్ గ్లాస్ తో తయారుచేయబడిన విండ్స్క్రీన్ మరియు సిల్వర్ శాటిన్ పూర్తి చేయబడిన పైకప్పు పట్టాలు వంటి లక్షణాలను కలిగి ఉంది. దీనిలో పెట్రోల్ వేరియంట్లు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి 1197 సిసి స్థానభ్రంశము అందిస్తాయి. ఈ మోటార్ 4-సిలిండర్లు మరియు 16 కవాటాలు కలిగిన ఒక డిఒహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6200rmవద్ద 79.6bhp శక్తిని మరియు 4400rpm వద్ద 108Nm గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో పెట్రోల్ ఇంజిన్ 6200rpm వద్ద 79.3bhp గరిష్ట శక్తిని మరియు 4400rpm వద్ద 108Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఉన్నత స్థాయి శక్తి మరియు టార్క్ ఫలితాల కారణంగా అద్భుతమైన త్వరణం మరియు ఇంజిన్ పనితీరు కలిగి ఉంటుంది. ఎల్ పిజి మోడ్ లో 6400rpm వద్ద 78.9bhp అసాధారణ శక్తి మరియు 4400rpm వద్ద 104Nmటార్క్ ని అందిస్తుంది. ఈ కామన్ రైల్ డీజిల్ ఇంజిన్ 4000rpm వద్ద 57.6bhp శక్తిని మరియు 1750rpm వద్ద 150Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. మరోవైపు డీజిల్ వేరియంట్లు 1.0 లీటర్ స్మార్టెక్ ఇంజిన్ తో అమర్చబడి 936cc స్థానభ్రంశాన్ని అందిస్తాయి. ఇది 4000rpm వద్ద 57.6bhp గరిష్ట శక్తి ని మరియు 1750rpm వద్ద 150Nmటార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా క 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి ఇంధన సామర్ధ్యాన్ని సమర్ధవంతం చేస్తుంది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో బిగించబడి ఉండగా, దీని వెనుక ఆక్సిల్ సమ్మేళనం లింక్ టైప్ మెకానిజం ని కలిగి ఉంటుంది. దీని ప్రవేశ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు 14 అంగుళాల స్టీల్ చక్రాల సమితితో అమర్చబడి ఉంటాయి. ఇవి 165/65 R14 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. కారు తయారీదారుడు ఈ వాహనంలో అనేక భద్రతా లక్షణాలను అమర్చారు. దీని ద్వారా ప్రయాణికులకు అలానే వాహనానికి కూడా భద్రత చేకూరుతుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లలో లోడ్ లిమిటర్ తో ముందరి సీట్ బెల్ట్ మరియు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. దీని ఇతర వేరియంట్లలో సెంట్రల్ లాకింగ్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి ఇన్స్ట్రుమెంట్ పానెల్ మీద అందుబాటులె ఉన్నాయి. ఈ ఫైవ్ సీటర్ హాచ్బాక్ మూడు సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో అందించబడుతుంది. ఈ వారంటీ కాలాన్ని అధనపు ఖర్చుపై పొడిగించవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీనిలో పెట్రోల్ వేరియంట్లు 1.2ఎల్ ఎస్ టి ఇసి II ఇంజిన్ తో అమర్చబడి ఉంటాయి. ఇది పోర్ట్ డీ ఏక్టివేషన్ టెక్నాలజీ ని కలిగి ఉండి శబ్దం మరియు ఇంధన సామర్థ్యం తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇది నగర రోడ్లపై 14.5kmplసామర్ధ్యాన్ని మరియు హైవేస్ పైన 18.6kmpl సామర్ధ్యాన్ని అందిస్తుంది. దీనిలో ఎల్ పిజి ఇంధన కిట్, పెట్రోల్ ఇంజిన్ తో జతచేయబడి 13.3 km/kg మైలేజ్ ని అందిస్తుంది. దీనిలో డీజిల్ వేరియంట్లు 1.0-లీటర్, ఎక్స్ ఎస్ డి ఇ ఇంజిన్ కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ ఏఆర్ఏఐ ప్రమాణాల ప్రకారం హైవే పైన 25.44 km/L మైలేజ్ ని అందిస్తుంది. ఇది మంచి ఇంధన సామర్ధ్యాన్ని అందించే కారుగా ఇండికా ఇవి2 ను అధిగమిస్తుంది. అయితే, నగరం రోడ్లపై మైలేజ్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

శక్తి సామర్థ్యం:


దీనిలో పెట్రోల్ ఇంజిన్ 6200rpm వద్ద 79.3bhp గరిష్ట శక్తిని మరియు 4400rpm వద్ద 108Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఉన్నత స్థాయి శక్తి మరియు టార్క్ ఫలితాల కారణంగా అద్భుతమైన త్వరణం మరియు ఇంజిన్ పనితీరు కలిగి ఉంటుంది. దీని వలన 100kmph మార్క్ దాటిన తరువాత కూడా ప్రకంపనాలు ఎప్పుడూ రావు. ఎల్ పిజి మోడ్ లో 6400rpm వద్ద 78.9bhp అసాధారణ శక్తి మరియు 4400rpm వద్ద 104Nmటార్క్ ని అందిస్తుంది. ఈ కామన్ రైల్ డీజిల్ ఇంజిన్ 4000rpm వద్ద 57.6bhp శక్తిని మరియు 1750rpm వద్ద 150Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ హాచ్బాక్ సిరీస్ తక్కువ బరువు గల డి ఒ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి రాపిడిని తగ్గించి మరియు ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జతచేయబడి మంచి ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఈ ఇన్-లైన్ ఇంజిన్ మంచి పనితీరుని అందించి మెరుగైన కుదింపు నిష్పత్తులను తో మంచి శక్తి ని మరియు టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది నగరం డ్రైవింగ్ పరిస్థితుల్లో మంచి ప్రారంభ మరియు తరలింపు త్వరణం అందిస్తుంది. ఈ వాహనం కేవలం 15.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకుంటుంది. అలానే గరిష్టంగా 145kmph వేగం వరకూ చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


ఈ సిరీస్ బలమైన మరియు స్పోర్టి రూపాన్ని కలిగి ఒక క్లాస్సి హాచ్బాక్ లా కనిపిస్తుంది. దీని ముందరి భాగం ద్వంద్వ పోర్ట్ రేడియల్ గ్రిల్ ని కలిగి ఉంటుంది. ఇది అధిక తీవ్రత హెడ్ల్యాంప్స్ ని కలిగియున్న హెడ్లైట్ క్లస్టర్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఇది విస్తృత గాలి తీసుకొనే విభాగం మరియు ఫాగ్ ల్యాంప్స్ తో అమర్చబడియున్న శరీరం రంగు బంపర్ ని కలిగి ఉంది. దీనిలో విండ్స్క్రీన్ విశాలంగా టింటెడ్ గ్లాస్ మరియు వైపర్స్ యొక్క జతతో అమర్చబడి ఉంటుంది. సొగసైన బోనెట్ ముందుకి కొంచెం ఏటవాలుగా ఉండి కొన్ని క్యారెక్టర్ లైన్స్ ని కలిగి ఉంటుంది. దీని ప్రక్క ప్రొఫైల్ బాడీ రంగు డోర్ హ్యాండిల్స్, బయట వెనుక వీక్షణ అద్దాలు మరియు బి -పిల్లర్ స్టైలింగ్ స్ట్రిప్ వంటి కొన్ని అద్భుతమైన అంశాలను కలిగి ఉంటుంది. దీని విండో సిల్, బి-స్తంభాలు మరియు డోర్ హ్యాండిల్స్ అద్భుతమైన నలుపు రంగు లో అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు, ఇది సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అమర్చబడియున్న స్టైలిష్ బయట అద్దాలను కలిగి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ హాచ్బాక్ ఐదుగురు ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 3640mm, వెడల్పు 1595mm మరియు ఎత్తు 1550mm (పైకప్పు పట్టాలు తో కలిపి). దీని వీల్బేస్ 2375mmచాలా పెద్దదిగా మరియు విశాలమైన అంతర్గత క్యాబిన్ ని సూచిస్తుంది. దీని పెట్రోల్ వేరియంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165mm మరియు డీజిల్ వేరియంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ 175mm.

లోపలి డిజైన్:


అంతర్గత విభాగం ఆకట్టుకునే మరియు స్థితి ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది ఒక ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉండిమొదటి చూపులోనే కారు ఔత్సాహికులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కారుతయారీదారుడు ఒక విశాలవంతమైన క్యాబిన్ మరియు అనేక అధునాతన అంశాలతో ఈ వాహనాన్ని అందించారు. డాష్బోర్డ్ పైన పియానో ఫినిషింగ్ ఒక సొగసైన రూపాన్ని ఇస్తుంది. ఇది సిల్వర్ తో ఫినిషింగ్ చేయబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, గాలి గుంటలు, కేంద్ర కన్సోల్ మరియు ఒక మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి కొన్ని పరికరాలతో అమర్చబడి ఉంది. ఇన్స్ట్రుమెంట్ పానెల్ పైన నీలం రంగు ప్రకాశంతో పాటూ ఒక టాకొమీటర్, డిజిటల్ గడియారం మరియు ట్రిప్మీటర్ కూడా ఉంది. ఇంకా దీనిలో డోర్ అజార్ వార్నింగ్ ల్యాంప్, తక్కువ ఇంధన వినియోగం ప్రదర్శన మరియు డ్రైవర్ సీటు బెల్ట్ రిమైండర్ వంటి కొన్ని అంశాలు డ్రైవర్ సౌలభ్యం కొరకు చేర్చబడినవి. ఇది ఒక రియర్ పార్సిల్ షెల్ఫ్ , సీట్ బ్యాక్ షాపింగ్ హుక్స్, ముందు మరియు వెనుక కప్ హోల్డర్లు, ముందరి డోర్ మ్యాప్ పాకెట్స్, బాటిల్ హోల్డర్స్ మరియు వినియోగదారులు చార్జింగ్ చేసుకునేందుకు శక్తి అవుట్లెట్ వంటి వినియోగాధారిత అంశాలను కూడా కలిగి ఉంది. ఇంకా క్యాబిన్ లో ముందు మరియు వెనుక మూడు స్థానాల్లో ల్యాంప్స్, సన్ విజర్ మరియు యాంటీ గ్లేర్ లోపల వెనుక వ్యూ అద్దం వంటి అంశాలు అందుబాటులో ఉన్నాయి. పరిమిత ఎడిషన్ వేరియంట్స్ వర్ణ ఖరీదైన బ్లాక్ కార్పెట్ మాట్స్, మాంచెస్టర్ యునైటెడ్ బ్యాడ్జ్ తో ప్రత్యేక ఎరుపు రంగు సీటు అపోలిస్ట్రీ మరియు స్టీరింగ్ కవర్ వంటి అంశాలతో అందుబాటులో ఉన్నాయి.

లోపలి సౌకర్యలు:


ఈ వాహనం అనేక అధునాతన సౌకర్య లక్షణాలతో అమర్చబడి ఒక ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది విశాలమైన మరియు సెమీ ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో ఉన్న మంచి కుషన్ సీట్లతో అమర్చబడి ఉంది. దీనిలో డ్రైవర్ సీటు ఎత్తు సర్ద్దుబాటు ఫంక్షన్ తో వస్తుంది. అలానే వెనుక సీట్ 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ సౌకర్యంతో అందుబాటులో ఉంది. దీనిలో సీటింగ్ అమరిక చాలా సౌకర్యవంతంగా ఉండి దూరపు ప్రయాణాలను సులువుగా చేస్తుంది. ఇంకా దీనిలో హీటర్ తో పాటూ హెచ్ విఎసి (తాపన, ప్రసరణ మరియు ఎయిర్ కండిషనింగ్) యూనిట్ క్యాబిన్ లోపల ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా దీనిలో శక్తితో పనిచేసే ముందు మరియు వెనుక విండోస్, అలానే అంతర్గతంగా సర్దుబాటు చేయగల బయట అద్దాలు ఉన్నాయి. ఇంకా దీనిలో ఆడియో వ్యవస్థ ఉండడం వలన ప్రయాణికులకు వారి ప్రయాణం అంతటా వినోదం లభిస్తుంది. ఇంకా వీటిలో ఎత్తు సర్దుబాటు చేసుకొనే ముందు సీటు హెడ్రెస్ట్, డ్యూయల్ హార్న్, బ్యాటరీ సేవర్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ మరియు టెయిల్ గేట్ ఓపెనేర్ వంటి ఇతర సౌకర్య లక్షణాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

లోపలి కొలతలు:


ఈ హాచ్ యొక్క అంతర్గత కొలతలు, ఫ్రంట్ హెడ్రూం 980cm, వెనుక హెడ్రూం 890cm, ముందరి లెగ్ స్పేస్ 1270cm, దీని గరిష్ట వెనుక మోకాలి గది 810cm, వెనుక మోకాలి రూం మరియు షోల్డర్ రూం వరుసగా 630cm మరియు 1270cm.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


దీనిలో పెట్రోల్ వేరియంట్లు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి 1197 సిసి స్థానభ్రంశము అందిస్తాయి. ఈ మోటార్ 4-సిలిండర్లు మరియు 16 కవాటాలు కలిగిన ఒక డిఒహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6200rmవద్ద 79.6bhp శక్తిని మరియు 4400rpm వద్ద 108Nm గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అయితే దీని ఎల్ పిజి వేరియంట్లు 6400rpm వద్ద 78.94bhp శక్తిని మరియు 4400rpm వద్ద 104Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. మరోవైపు డీజిల్ వేరియంట్లు 1.0 లీటర్ స్మార్టెక్ ఇంజిన్ తో అమర్చబడి 936cc స్థానభ్రంశాన్ని అందిస్తాయి. ఇది 4000rpm వద్ద 57.6bhp గరిష్ట శక్తి ని మరియు 1750rpm వద్ద 150Nmటార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా క 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి ఇంధన సామర్ధ్యాన్ని సమర్ధవంతం చేస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


సంస్థ నాలుగు స్పీకర్లు కలిగి ఉన్న సమగ్ర ఆడియో సిస్టమ్ తో అమర్చబడి ఉంది. దీనిలో బేస్ మోడల్ కి ఇంబిల్ట్ సంగీతం వ్యవస్థ నిబంధన లేదు. కానీ వినియోగదారులు సంగీత వ్యవస్థని పొందవచ్చు. ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వినియోగదారులకు ఆనందాన్ని అందించడం కొరకు ఇందులో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఇష్టమైన రాగాలు విని వినియోగదారులు ఆనందంగా ఉండవచ్చు. సంస్థ దీని అగ్ర శ్రేణి వేరియంట్లకు ఐస్ బ్లూ లిట్ మ్యూజిక్ సిస్టం ని విలీనం చేసింది. దీని లిమిటెడ్ ఎడిషన్ ట్రిం బ్లూటూత్ కనెక్టివిటీ మరియు స్పీకర్లు కి మద్దతు ఇచ్చే ఒక ఆధునిక సంగీతం వ్యవస్థ తో అందుబాటులో ఉంది.

వీల్స్ పరిమాణం:


దీని ప్రవేశ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు 14 అంగుళాల స్టీల్ చక్రాల సమితితో అమర్చబడి ఉంటాయి. ఇవి 165/65 R14 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. దీని పెట్రోల్ వేరియంట్లు 14 అంగుళాల స్టీలు చక్రాల సమితితో బిగించబడి 155/70 R14 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. అయితే, అగ్ర శ్రేణి ఎల్ టి వేరియంట్ అందమైన అల్లాయి వీల్స్ తో అమర్చబడి 55/70 R14 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ హాచ్బాక్ సిరీస్ యొక్క సస్పెన్షన్ వ్యవస్థ చాలా నైపుణ్యం కలది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో బిగించబడి ఉండగా, దీని వెనుక ఆక్సిల్ సమ్మేళనం లింక్ టైప్ మెకానిజం ని కలిగి ఉంటుంది. ఇది తదుపరి గ్యాస్ తో నిండియున్న షాక్అబ్జార్బర్స్ తో లోడ్ చేయబడి మరింతగా ఈ విధానాన్ని పటిష్టం చేస్తుంది. దీనిలో బ్రేకింగ్ విధానానికి సంబంధించినంతవరకూ ముందు చక్రాలు డిస్కులతో మరియు వెనుక చక్రాలు డ్రమ్ బ్రేక్లు సమితితో అమర్చబడి ఉంటాయి. దీనిలో అగ్ర శ్రేణి వేరియంట్లు ఎబిఎస్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ హాచ్ శక్తి సహాయక స్టీరింగ్ వ్యవస్థతో అమర్చబడి 4.85 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధాన్ని కలిగి ఉండి చాలా సులభంగా హ్యాండ్లింగ్ చేస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ హాచ్బాక్ వాహనం అనేక భద్రతా లక్షణాలతో వాహనానికి మరియు ప్రయాణికులకు భద్రత కలిపిస్తుంది. ఈ వాహనం ఇంపాక్ట్ ప్రొటెక్షన్ బీమ్స్ ని కలిగియున్న అధిక శక్తి గల స్టీల్ మెటీరియల్ తో నిర్మించబడి తాకిడి సందర్భంలో వాహనాన్ని రక్షిస్తుంది. ఇంకా దీనిలో ఎత్తు సర్ద్దుబాటు చేసుకునే హెడ్ రెస్ట్రైన్స్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, ట్యూబ్ లేని టైర్లు మరియు ముందరి ఫాగ్ ల్యాంప్స్ వంటి భద్రతా అంశాలు అందుబాటులో ఉన్నాయి. దీని అగ్ర శ్రేణి వేరియంట్లు కూడా ముందరి సీట్ లోడ్ లిమిటర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటిని కలిగి ఉంది.

అనుకూలాలు:


1. ధర పరిధి అనుకూలంగా ఉండడం అనేది ఒక అదనపు ప్రయోజనం.
2. రెండు ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.
3. దీని కాంపాక్ట్ పరిమాణం నగరం రోడ్లపై సులభంగా డ్రైవింగ్ చేసేలా చేస్తుంది.
4. దీని బాహ్య రూపం చాలా అధునాతనంగా ఉంటుంది.
5. పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో కూడా ఇంధన సామర్ధ్యం మెరుగుగా ఉంటుంది.

ప్రతికూలాలు:


1. క్యాబిన్ స్పేస్ చాలా తక్కువ ఉండడం అనేది ఒక ప్రతికూలత.
2. ప్రవేశ స్థాయి వేరియంట్లో తక్కువ సౌకర్య లక్షణాలు ఉండడం ఒక ప్రతికూలత.
3. ఎంచుకోవడానికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో లేదు.
4. బూట్ సామర్ధ్యం చాలా తక్కువగా ఉంది.
5. ఎల్ పిజి వెర్షన్ యొక్క ఇంధన సామర్ధ్యం అంతగా లేకపోవడం అనేది ఒక ప్రతికూలత.