:లో బ్రాండ్ కార్లు :దేశం

జపాన్ కి చెందిన ఐచీ నగరంలో ప్రధాన కార్యాలయం ఏర్పరుచుకున్న టయోటా మోటార్ కార్పోరేషన్ ఒక బహుళజాతి ఆటోమొబైల్ తయారీ సంస్థ ఇప్పుడు అనేక సంవత్సరాల నుండి ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీదారుల సంస్థల్లో అగ్ర స్థానంలో నిలిచింది. భారతదేశం లో టయోటా మోటార్ కార్పొరేషన్ సంస్థ మొదటిసారిగా కిర్లోస్కర్ గ్రూప్ తో భాగస్వామ్యం అవుతూ టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్టోబర్ 1997 లో వచ్చింది. దాని ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ లో ఉంది. టయోటా ఇండియా భారతదేశంలో తన కార్ల యొక్క తయారీ మరియు అమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తుంది మరియు ఇది ప్రస్తుతం మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా అండ్ చేవ్రొలెట్ సంస్థలతో పాటు దేశంలో ఆరవ స్థానంలో ఉంది. కార్ల తయారీ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తేవడంతో పాటు కార్ల యొక్క స్వరూపాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా టయోటా సంస్థ తన యొక్క వైభవాన్ని పర్యావరణ అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంలో తనని తాను నిరూపించుకుంది. దేశం యొక్క యువత కోసం కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడం సామాజిక సంక్షేమం లో ఒక గుర్తించదగిన పాత్ర పోషించడం మరియు ఎల్లప్పుడూ "వినియోగదారులకి మొదటి అవకాసం ఇవ్వడం" అనేవి టయోటా యొక్క ముఖ్య ఉద్దేశం.

1999 లో క్వాలీస్ MPV ను ప్రవేశపెట్టింది. ఆ తరువాత గత 15 సంవత్సరాలుగా కళ్ళు చెదిరే మోడళ్లను భారతదేశంలో ప్రవేశ పెట్టింది. అందువలన ఇది తనకు తానుగా ఒక ప్రత్యేఖ స్థానం ఏర్పరుచుకుంది. వివిధ రకాల మోడల్స్ ను ఆటో మొబైల్ మార్కెట్లో ప్రవేశపెట్టడం వలన ఈ సంస్థ ఇతర తయారీదారులకి గట్టి పొటీ ఇచ్చింది. క్వాలిస్ 2005 లో నిలిపివేసినప్పటికీ, ఇన్నోవా, ఎతియోస్ ట్విన్స్, ఫార్చ్యూనర్ మరియు క్యామ్రీ వంటి కొత్త మరియు మరింత ఆకట్టుకునే నమూనాలు స్థానిక ఉత్పత్తి కోసం రప్పించారు. ఫ్రాడో మరియు ల్యాండ్ క్రూయిజర్ వంటివి విదేశాల నుండి దిగుమతి చేయబడినవి. ప్రస్తుతం భారతదేశంలో టయోటా కార్లు టయోటా ఎతియోస్ లివా, టయోటా ఎతియోస్, టయోటా ఎతియోస్ క్రాస్, టయోటా ఇన్నోవా, ఫ్రాడో, ల్యాండ్ క్రూయిజర్, ఇన్నోవా, ఫార్చ్యూనర్, క్యామ్రీ మరియు టయోటా కరోల్ల ఆల్టిస్ మొత్తం పది మోడల్స్ ఉన్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో టయోటా లో దిగువ శ్రేణి హాచ్బాక్స్ నుండి ఉన్నత శ్రేణి హాచ్బాక్స్ వరకు మరియు ఎగ్జిక్యూటివ్ సెడాన్ నుండి ప్రీమియం సెడాన్ల తో పాటూ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (SUV s), మల్టీ పర్పస్ వాహనాలు (MPVs) లేదా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ని కూడా కలిగి ఉంది. కారు యొక్క ఆకారం బట్టి మరియు కారు యొక్క మోడల్ బట్టి కారు ధరలు ఆధారపడి ఉంటాయి. టయోటాలో మధ్య తరగతి వారు కొనుగోలు చేసే విదంగాను అలానే ధనిక స్థాయిలో ఉన్న వారు కొనుగోలు చేసే విదంగా అన్ని రకాల మోడళ్లు లభిస్తాయి. వాటిలో సామర్ధ్యం కలిగిన టయోటా ఎతియోస్ లివా 5,00,142 తక్కువ ధరతో లభిస్తుంది.

భారతదేశం లో టయోటా కార్లు విస్తృతమైన మరియు అద్భుతమైన కార్లను వినియోగదారుల అవసరాలని దృష్టిలో ఉంచుకొని తయారుచేస్తుంది. వినియోగదారులు ఎల్లప్పుడూ కొత్త మోడళ్లు, ఉత్కంఠభరితమైన శైలి, ఖరీదైన అంతర్భాగాలు, అధునాతన సౌకర్యాలు మరియు అద్భుతమైన పనితీరును అందించే మోడళ్ళు కావాలి అనుకుంటారు. దానికి తగ్గట్టుగా టయోటా కళ్ళు చెదిరే మోడళ్లను వినియోగదారులకి అందిస్తుంది. వినియోగదారుల అవసరాలపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం టయోటా కి చెందిన ఖరీదైన మోడల్ టయోటా ల్యాండ్ క్రూజర్ 200 యొక్క ధర 1,19,01,326.

ప్రపంచంలో అత్యధికంగా కార్ల తయారీ సంస్థల్లో పేరు పొందిన వాటిలో టయోటా ఒకటి. టయోటా తెలివైన ఉత్పత్తి పద్ధతులకు మరియు అద్భుతమైన మోడళ్లు అందించడంలో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటూ వచ్చింది.

ఇది కొన్ని అద్భుతమైన ఇంజన్లతో రూపొందించబడినది. పర్యావరణ అనుకూలమైన కార్లను మరియు అద్భుతమైన పనితీరు అందించే కార్లను తయారు చేయడంలో టయోటా ప్రముఖమైనది. భారతదేశంలో టయోటా కార్లలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న కారు టయోటా ప్రీయస్ ఇది ప్రస్తుతం 38,10,018. ధరతో లభిస్తుంది.

1997 సంవత్సరాల నుండి భారతదేశంలోకి టయోటా వచ్చిన దగ్గర నుండి నిరంతరం మరింత శక్తివంతమైన, మరింత ఉత్తేజకరమైన పనితీరు అందించేందుకు నిరంతరం కృషి చేస్తూ వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో టయోటా కార్లు టయోటా ఎతియోస్ లివా, టయోటా ఎతియోస్, టయోటా ఎతియోస్ క్రాస్, టయోటా ఇన్నోవా, ఫ్రాడో, ల్యాండ్ క్రూయిజర్, ఇన్నోవా, ఫార్చ్యూనర్, క్యామ్రీ మరియు టయోటా కరోల్ల ఆల్టిస్ మోడళ్లు ఉన్నాయి. టయోటా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన మోడళ్లను ,వినియోగదారులు ఆశించే విదంగా ఉండేటట్లు తీసుకురాబోతున్నది. టయోటా కేమ్రీ ఫేస్లిఫ్ట్, టయోటా VIOS, టయోటా ఇన్నోవా న్యూ ఇవి త్వరలో రానున్నవి. ఈ మోడళ్లు వచ్చిన తరువాత కంపెనీకి అదనపు బలం చేకూరుతుంది.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి టయోటా డీలర్ in India

Other Car Models In India