:లో బ్రాండ్ కార్లు :దేశం

1899 వ సంవత్సరం లో లూయిస్, మార్సెల్ మరియు ఫెర్నాండ్ ఈ ముగ్గురు సోదరులు కలిపి రెనాల్ట్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ కు "రెనాల్ట్ SA” అని పేరు పెట్టరు. ఫ్రాన్స్ లో ఒక బహుళజాతి కారు తయారీ సంస్థ ను స్థాపించారు. అధికారికంగా సంస్థ యొక్క పునాది రాయి 1899 లో వేసినప్పటికి 1898 లోనే ఒక రెనాల్ట్ కారుని రెనాల్ట్ బ్యాడ్జ్ తో అమ్మడం జరిగింది. ఈ మొట్టమొదటి రెనాల్ట్ బ్యాడ్జ్ తో వచ్చిన కారు పేరు "రెనాల్ట్ వైటురెట్టి”. ఈ కారుని లూయిస్ రెనాల్ట్ స్వయంగా తయారుచేసాడు. అంతేకాకుండా ఆ సమయంలో లూయిస్ రెనాల్ట్ ఒక తెలివైన యువ ఇంజనీర్ కూడా, మరియు స్వయంగా అతను చాలా రకముల మొడల్స్ ను ప్రవేశపెట్టడు. ఇతను మొదటి సారిగా ప్రవేశపెట్టిన కారుని లూయిస్ రెనాల్ట్ యొక్క సోదరుడి ద్వారా అతని యొక్క స్నేహితుడి తండ్రి కొనుగోలు చేసారు.

1903 వ సంవత్సరం లో రెనాల్ట్ దాని స్వంత డిజైన్ లతో ఇంజిన్ల ను తయారుచేయడం ప్రారంభించారు. ఆ తరువాత రెండు సంవత్సరాలలోనే సొసైటీ డెస్ ఆటోమొబైల్స్ సంస్థ వారు బారీ మొత్తం లో రెనాల్ట్ AG1 కార్ల మొత్తన్ని కొనుగోలు చేశారు. ఆ తరువాత సొసైటీ డెస్ ఆటోమొబైల్స్ సంస్థ వారు కొనుగోలు చేసిన కార్లు అన్నింటిని టాక్సీలుగా వాడేవారు. ఫ్రాన్స్ లో 1908 వ సంవత్సరంలో 3,575 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేసి రెనాల్ట్ యొక్క పేరు ని మరింత బలపడేలా చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో ఫ్రాన్స్ లో రెనాల్ట్ అగ్ర స్థానంలో నిలచింది.

భారతీయ కార్ మార్కెట్ లో 2005 వ సంవత్సరంలో రెనాల్ట్ మహింద్రా & మహింద్రా తో కలిసి భాగస్వామ్యాన్ని మొదలుపెట్టింది. అప్పుడు ఈ సంస్థ పేరు మహింద్రా రెనాల్ట్ లిమిటెడ్ గా మారింది. వీళ్ళిద్దరు కలిసి మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టీన కారు "లోగాన్". ఈ లోగాన్ ను మే 2007 వ సంవత్సరంలో ప్రవేశపెట్టరు. ఆ తరువాత వీళ్ళిద్దరి భాగస్వామ్యం విడిపొయినతరువాత మళ్ళి దీని యొక్క పేరు రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా అక్టోబర్ 2010 వ సంవత్సరంలో మార్చబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై నగరంలో ఉంది. రెనాల్ట్ యొక్క ఉత్పత్తిని తమిళనాడు లో ప్రారంబించారు. ఆ తరువాత భారతదేశంలో రెనాల్ట్ ఇండియా, నిస్సాన్ ఇండియా తో కలిసి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ అనే పేరుతోమార్చి 2010 వ సంవత్సరం నుండి వాటి యొక్క ఉత్పత్తిని చెన్నై లో ప్రారంబించారు.

రెనాల్ట్ భారతదేశం ప్రైవేట్ లిమిటెడ్ అయిన తరువాత దాని యొక్క ఉత్పత్తిని 2010 వ సంవత్సరంలో ప్రారంబించారు. ప్రారంబించిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన కారు రెనాల్ట్ ఫ్లూయెన్స్ సెడాన్, ఈ కారుని మే 2011 భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత నాలుగు నెలలోనే అంటే సెప్టెంబర్ లో రెనాల్ట్ కొలియోస్ SUV ను ప్రవేశపెట్టాడు. ఈ కారుని ప్రవేశపెట్టిన నెలలోనే 120 బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. దీని కారణంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎర్పరచుకుంది. ఆ తరువాత వాహన తయారీదారుడు ఎప్పుడు వెనుదిరిగి చూడలేదు. భారతదేశ ఆటోమొబైల్ రంగంలో కొత్త కారు ప్రవేశపెట్టీన ప్రతిసారి అత్యంత అద్భుతమైన విజయాల్ని చోటుచేసుకుంది. ఆతరువాత విజయవంతంగా జూలై 2012 వ సంవత్సరంలో రెనాల్ట్ డస్టర్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రెనాల్ట్ 6 కారు మొడల్స్ ను కలిగి ఉంది. వాటి పేర్లు వరుసగా రెనాల్ట్ పల్స్, రెనాల్ట్ స్కాల, రెనాల్ట్ లోజి, రెనాల్ట్ డస్టర్ మరియు రెనాల్ట్ ఫ్లూయెన్స్.

భారతదేశం లో ప్రతి ప్రయాణీకులు, కారు కొనుగోలు విషయం లో, లగ్జరీ విభాగం తప్ప, మిగిలిన కొనుగోలుదారులు ధర మీద ఆధరపడి ఉంటారు. ఈ విషయం లో రెనాల్ట్ మాత్రం భారతీయ కొనుగోలుదారులను దృష్ట్టి లో ఉంచుకొని రెనాల్ట్ ధరను మరియు అద్భుతమైన మొడల్స్ లుక్స్ నిర్ణయించే విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ద వహిస్తుంది. ఈ కారణం ఆదారంగా రెనాల్ట్ భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఎర్పరచుకుంది. అంతేకాకుండా రెనాల్ట్ ధర విషయంలో, ఇతర తయారీదారులకు భారత ఆటోమొబైల్ రంగంలో ఒక గట్టి పోటీను కూడా ఇస్తుంది. రెనాల్ట్, హాచ్బాక్స్ మరియు సెడాన్ లేదా SUV లను కలిగి ఉంటుంది. రెనాల్ట్ అతి తక్కువ ధరలో అందించే కారు ఎమిటంటే "రెనాల్ట్ పల్స్". ఈ రెనాల్ట్ పల్స్ కొనుగోలుదారులకు రూ 4,46,100 ధరకే అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో రెనాల్ట్ వచ్చిన ప్రారంభరోజుల నుండి, రెనాల్ట్ దానియొక్క అద్భుతమైన సాంకేతిక ఉపకరణాలను మరియు లక్షణాలను అత్యద్బుతమైన మొడల్స్ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేసింది. మొట్టమొదటి ఇంజెన్ 1903 వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. అంతేకాకుండా తరువాత "ఆధునిక ఎక్స్ట్రోనిక్ కంటిన్యుస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్" ను మొట్టమొదటి సారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన సంస్థ రెనాల్ట్. అంతేకాకుండా రెనాల్ట్ ఎన్నో సాంకేతిక అవిష్కరణలు మరియు కొత్త కొత్త మొడల్స్ ను ప్రవేశపేట్టినప్పటికి, రెనాల్ట్ సంస్థ ఎప్పుడు విశ్రమించలేదు. రెనాల్ట్ అనేక రకాల న్యు లుక్ మొడల్స్ ను సరసమైన ధరలకే అంధుబాటులో ఉంచుతుంది. అంతేకాకుండా అధిక ధరను కలిగిఉన్న మొడల్స్ను కూడా కలిగి ఉన్నాయి. దీనిలో భాగంగా రెనాల్ట్ లో అధిక ధరను కలిగి ఉన్న మొడల్ ఎమిటంటే "రెనాల్ట్ కోలియొస్". ఈ రెనాల్ట్ కోలియొస్ కొనుగోలుదారులకు రూ 23,47,898 ధరకు అందుభాటులో ఉంటుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్ లో ఒక కారును కొనుగోలు చేయాలంటే ముఖ్యంగా ఆలోచించే విషయాలలో ఒకటి 'ధర' మరొకటి 'ఇంధన సామర్ధ్యం'. ఈ రెండిటిని భారతీయ ఆటొమొబైల్ రంగంలో మనకు అందుభాటులో ఉంచేది ఈ రెనాల్ట్ సంస్థ ఒకటి. దీని కారణంగా భారతదేశ ఆటొమొబైల్ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఏర్పరచుకుంది. ఈ రెనాల్ట్ లో అతి తక్కువ ధరను మరియు అత్యధిక ఇంధన సామర్ద్యాన్ని ఇచ్చే కారు ఒకటి ఉంది, అది ఏమిటంటే "రెనాల్ట్ పల్స్". ఈ రెనాల్ట్ పల్స్ కొనుగోలుదారులకు రూ 4,46,100 ధరకే అందుబాటులో ఉంది.

భారత గడ్డపై 2005 వ సంవత్సరంలో అడుగు పెట్టినప్పటి నుండి, రెనాల్ట్ సంస్థ ఎప్పటికప్పుదు భారతీయ అభిమానుల కోసం కొత్త కొత్త మొడల్స్ ను మరియు ఉత్సాహకరమైన మొడల్స్ ను తీసుకురావడం లో బిజీగా ఉంది. రెనాల్ట్ సంస్థ అసాధారణ సెడాన్ ఫ్లూయెన్స్ ను, చిన్నగా ఇంకా స్టైలిష్ గా కనిపించేహాచ్బాక్ పల్స్ ను, మరియు ఆధునికంగా ఉండే కొలియోస్ SUV లను లేదా కేవలం అద్భుతమైన కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ డస్టర్ను, ఇప్పటివరకు ప్రవేశపెట్టీంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ రెనాల్ట్ కొనుగోలుదారులను ఆశ్చర్యపడేలా చేస్తుంది. ప్రస్తుతం రెనాల్ట్ 6 కారు మొడల్స్ ను కలిగి ఉంది. రాబోయే రోజుల్లో రెనాల్ట్ మరియొక 4 మొడల్స్ ను ప్రవేశపెట్టబోతుంది. అవి వరుసగా రెనాల్ట్ సిలియో, రెనాల్ట్ డొక్కర్, రెనాల్ట్ సేండిరో మరియు రెనాల్ట్ XBA.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి రెనాల్ట్ డీలర్ in India

Other Car Models In India