:లో బ్రాండ్ కార్లు :దేశం

ప్రపంచంలోని ప్రముఖమైన వాహన తయారీసంస్థలో నిస్సాన్ మోటార్ కంపెనీ లిమిటెడ్ ప్రతేఖమైనది. ఇది ఒక జపనీస్ బహుళజాతి కారు తయారీ సంస్థ దీని ప్రధాన కార్యాలయాలు నిషి-కు, యోకోహామా లో ఉన్నవి. దీని ఆటోమోటివ్ ఆవిష్కరణలు డిసెంబర్ 1933 న ప్రరంభమైనవి. జపాన్లో 15 అత్యంత శక్తివంతమైన వ్యాపార సంస్థల్లో ఒకటి. ఇది ఖ్యాతిగాంచిన నిస్సాన్ గ్రూపులో ముఖ్యమైన భాగం. నిస్సాన్ మోటార్ కంపెనీ తన తెలివైన తయారీ మరియు అద్భుతమైన ఆవిష్కరణలతో అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తనకి తానుగా ఒక వైవిధ్యమైన గుర్తింపు నిర్మించుకుంది . సంస్థ యొక్క సాంకేతిక పరిజ్ఞానం వలన V6 ఆకృతీకరణ గల VQ ఇంజన్ ఆవిష్కరించబడినది. అది వార్డ్ యొక్క 10 అత్యుత్తమ ఇంజిన్లలో జాబితాలో ఒకటిగా 14 సంవత్సరాల పాటూ స్థానం గెలుచుకుంది.

ఆటోమొబైల్ ఉత్పత్తిలో ప్రపంచ నాయకత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన ఒక ప్రధాన సంఘటన ఏమిటంటే నిస్సాన్ 1999 లో ఫ్రెంచ్ భారీ కార్ల సంస్థ రెనాల్ట్ SAతో పొత్తు కుదుర్చుకుని నేడు భారతదేశంలో కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఆర్ధిక సంక్షోభం తో బాదపడుతున్న సమయంలో నిస్సాన్ మోటార్ సంస్థ రెనాల్ట్ తో కలిసి రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ గా మారింది. దీని వలన జపాన్ యొక్క పూర్వ వైభవం తిరిగి రావడమే కాకుండా ఆటో మొబైల్ రంగంలో దాని స్థానాన్ని తిరిగి సంపాదించుకుంది. 2011 లో, నిస్సాన్ జనరల్ మోటార్స్, వోక్స్వ్యాగన్ గ్రూప్, టయోటా, హ్యుండాయ్ మోటార్ గ్రూప్ మరియు ఫోర్డ్ తర్వాత ప్రపంచంలో ఆరవ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుగాంచింది. 2012 లో రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ 8,097,197 వాహనాలు అమ్మకాల రికార్డు మార్క్ ని దాటి విజయం సాదించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన ప్రతి 10 కొత్త కార్లలో ఒకటి ఈ సంస్థకి చెందినది అవ్వడం విశేషం.

భారతదేశం లో, నిస్సాన్ 2005 లో తన కార్యకలాపాలను నిస్సాన్ మోటార్ ఇండియా ద్వారా ప్రారంభించింది. ఈ భారత వింగ్ ద్వారా దేశం లో ప్రారంభించిన మొదటి నిస్సాన్ కారు భారతదేశం లో CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా పూర్తిగా తయారుచేయబడి దిగుమతి చేయబడిన బలమైన SUVకలిగిన కారు నిస్సాన్ ఎక్స్-ట్రైల్. భారతదేశానికి ఎక్స్-ట్రైల్ వచ్చిన తరువత కొద్ది సంవత్సరాల పాటు అదే CBU మార్గంలో మధ్యతరహా విలాసవంతమైన కారు నిస్సాన్ టేనా 2007 లో అలానే స్పోర్ట్స్ కారు నిస్సాన్ 370Z 2010 లో వచ్చాయి. అది కారు మోడళ్ళు దిగుమతులపైనే కాకుండా నిస్సాన్ ఇండియా నిస్సాన్ మైక్రా, నిస్సాన్ సన్నీ మరియు నిస్సాన్ ఇవాలియా వంటి స్థానిక కార్ల తయారీ పైన కూడా దృష్టి పెట్టింది. దీనివలన భారతీయ కొనుగోలుదారులకు వివిధ రకాల కార్లు ఎంపిక చేసుకొనేందుకు మంచి అవకాసం లభించింది.

భారతదేశం లో నిస్సాన్ కార్లకు పెరుగుతున్న గిరాకీ తట్టుకొనేందుకు గానూ ఈ సంస్థ దేశంలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకుంది. వీటిలో ఒకటి చెన్నై లో ఇంకొకటి చెన్నై నగర శివార్లలో ఒరగాడం అనే పట్టణం లో ఏర్పాటు చెయ్యబడింది. రూ 45 కోట్ల విలువ గల ఒరగాడం కర్మాగారం, 650 ఎకరాల భూమి అంతా విస్తరించి ఉన్నది. భారతదేశం యొక్క దేశీయ కార్ల మార్కెట్ కోసం చాలా ప్రత్యేకంగా కొన్ని ఇతర నమూనాలతో పాటు భారత మరియు యూరోపియన్ మార్కెట్ కోసం నిస్సాన్ మైక్రా ఉత్పత్తి బాధ్యత తీసుకుంటుంది. ఇటువంటి సేల్స్, సర్వీస్, భాగాలు, మార్కెటింగ్ మరియు భారతదేశం లో నిస్సాన్ డీలర్ డెవలప్మెంట్ వంటి ఇతర కార్యకలాపాలను నిర్వహించడం కోసం ఆటోమొబైల్ ఇండియా 40 నిస్సాన్ డీలర్షిప్ల సమన్వయంతో 17 రాష్ట్రాలు మరియు 1 కేంద్ర పాలిత ప్రాంతం అంతటా 39 భారతీయ నగరాల్లో విస్తరించి ఆటో మొబైల్ రంగంలో మంచి అమ్మకాలను మరియు సేవలను అందిస్తున్నది.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి నిస్సాన్ డీలర్ in India

Other Car Models In India