:లో బ్రాండ్ కార్లు :దేశం

భారతదేశంలో అతి ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఒకటి. ఈ మారుతి సుజుకి ని 1981 వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు. దీనిని మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ (MUL) అని కూడా పిలుస్తారు. దాని వాటాలు 18.28% భారత ప్రభుత్వం యొక్క యాజమాన్యంలో ఉండేవి. భారతదేశంలో ప్రస్తుత ఆటో మార్కెట్లో, మారుతి బ్రాండ్ అనేది ప్రజలలో ఒక నమ్మదగిన బ్రాండ్ గా ఉండిపొయింది. ఈ మారుతి బ్రాండ్ 1983 వ సంవత్సరం లో ఉత్పత్తిని ప్రారంభించింది. మారుతి సుజుకి మొట్ట మొదటి సారిగా ప్రవేశపెట్టీన కారు "మారుతి 800". ఈ కారుతో పోటిపడ్డవి హిందూస్తాన్ అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని ఈ రెండు మాత్రమే, కాని ఈ రెండు కార్లు మారుతి 800 తో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్న కార్లు అని చెప్పవచ్చు.

భారతదేశంలో మారుతి కార్లు ప్రస్తుతం మార్కెట్లో సుమారు 45% కార్లు అమ్ముడుపోతున్నాయి. ఎందుచేతనంటే మారుతి బ్రాండ్ వివిధ రకములైనటువంటి మొడల్స్ ను మరియు వెరియంట్స్ ను ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం రాజధాని న్యూ ఢిల్లీ నగరంలో ఉంది. గుర్గాన్ మరియు మనేసర్ లో అందమైన భారీ తయారీ సౌకర్యాలను కలిగి ఉంది. గుర్గాన్ మరియు మనేసర్ ఈ రెండు కలిసి సంవత్సరానికి 14,50,000 కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కారు మార్కెట్లలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎర్పరచుకుంది. దానితో మారుతి ఆటోమేకర్ తన ఉత్పత్తిని ప్రపంచమంతా విస్తరించాడు. అంతేకాకుండా నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అల్జీరియా వంటి దేశాలలో విడదీయరాని ఒక ప్రత్యేక స్థానాన్ని ఎర్పరచుకుంది.

భారతదేశంలో, అతిపెద్ద ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి ఒకటి, మరియు ఈ మారుతి ఆటోమొబైల్ రంగంలో పురాతనమైనదే కాదు ఇది అతిపెద్ద పరిశ్రమ కూడా. అంతేకాకుండా ఈ మారుతి సుజుకి హ్యాచ్బ్యాక్ల నుండి సెడాన్ ల వరకు మరియు SUV నుండి MUV లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ రోజు వరకు గాను 14 మొడల్స్ ను కలిగి ఉంది. అంతేకాకుండా వినియొగదారులకు ఇష్టమైన రీతిలో ఉండేటట్లు మరియు అందుబాటులో ఉండేటట్లు 147 పైగా వేరియంట్ రకాలను కలిగి ఉంది. మారుతి సుజుకి కలిగి ఉన్న 14 మొడళ్ళు ఎమిటంటే మారుతి ఓమ్ని, మారుతి ఆల్టో 800, మారుతి సుజుకి ఎకో, మారుతి ఆల్టో K10 మరియు మారుతి సుజుకి వాగన్ R, మారుతి సెలెరియో, మారుతి వాగన్ R స్టింగ్రే, మారుతి రిట్జ్, మారుతి స్విఫ్ట్, మారుతి స్విఫ్ట్ డిజైర్, మారుతి జిప్సీ, మారుతి ఎర్టిగా, మారుతి సియాజ్, మారుతి గ్రాండ్ విటారా.

మనందరికి తెలుసు, బారతదేశం యొక్క కార్ల భవిష్యత్తు లగ్జరి కార్లను మినహయించి, మిగిలిన కార్ల వాటి యొక్క ధర పైన ఆదరపడి ఉంటాయి. అది హ్యాచ్బ్యాక్ ఏ కావచ్చు, ప్రారంభ స్థాయి సెడాన్ లేదా కాంపాక్ట్ SUV ఏదినా కావచ్చు, ఇవి అన్ని కూడా బారతదేశంలో ఆటోమొబైల్ రంగంలో దాని యొక్క పేరు నిలబెట్టుకోవాలంటే వాటికి ఉండే లక్షణాలు మరియు దానికి ఉండే అతి తక్కువ ధర పైన మాత్రమే ఆదారపడి ఉంటుంది. భారత కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేలా మారుతి సుజుకి ఒక కారుని ప్రవేశపెట్టింది. అది ఎమిటంటే మారుతి సుజుకి ఒమ్ని, దానిని మొట్టమొదటి సారిగా బారతదేశం లో మారుతి బ్రాండ్ అతి తక్కువ ధరతో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మారుతి ఒమ్ని మార్కెట్లో 2,28,623 ధర తో వస్తుంది.

మారుతి సుజుకి భారతదేశంలో కొనుగోలుదారులకి చాల రకములైన కార్లను అందజేస్తుంది. అవి కొనుగోలుదారులకి సరసమైన ధరలలో లబిస్తాయి. కాని అదే సమయం లో దనికుల కోసం ఎక్కువ ధర ఉన్న కార్లను కూడా మారుతి సుజుకి ప్రవేశపెట్టీంది. ఎక్కువ ధర తో పాటు అద్బుతమైన లక్షణాలను మరియు నిర్దేశాలను, అందమైన లుక్స్ తో మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి లో ఎక్కువ ధర తో ఉన్న కార్లు మారుతి జిప్సీ, మారుతి ఎర్టిగా, మారుతి సియాజ్ ఇవి కూడా కొనుగోలుదారులకి సరసమైన ధరలకే లబిస్తాయి. మారుతి సుజుకి అతి ఎక్కువ ధర తో ప్రవెశపెట్టిన కారు ఎమిటంటే మారుతి గ్రాండ్ విటారా, ఇది మనకు 22,68,064 ధరతో అందుబాటులో ఉంది.

నేడు మారుతి కార్లు అద్భుతమైన ఉత్తమ అమ్మకాలను కలిగి ఉండటానికి సరసమైన ధరలతో లబిస్తున్నాయనే కాదు, దాని యొక్క ఇంధన సామర్థ్యం కూడా. సాదరణంగా అధిక పెర్ఫామన్స్ ఇచ్చే కార్లు ఇంధన సామర్ద్యాన్ని ఎక్కువగా ఇవ్వలేవు, కాని మారుతి సుజుకి లో ఒక్క కారే కాదు ప్రతి ఒక్క కారు ఉత్తమ ఇంధన సామర్ద్యాన్ని ఇస్తుంది. అందుచేత ఇంధన సామర్థ్యం విషయం లో బారతదేశ ఆటొమొబైల్ రంగంలో మారుతి సుజుకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎర్పరచుకుంది. మారుతి సుజుకి లో అదిక ఇంధన సామర్ద్యాన్ని ఇచ్చే మొడల్ ఎమిటంటే మారుతి ఆల్టో K 10. ఈ మారుతి ఆల్టో K 10 మనకు 3,17,234 ధరతో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం భారతీయ ఆటో పరిశ్రమలో మరుతి సుజుకు 14 మొడళ్ళను కలిగి ఉంది. అంతేకాకుండా భారతదేశంలో మారుతి అతిపెద్ద ఆటో తయారీదారులలో ఒకటి. భారతీయ ఆటో పరిశ్రమలో మారుతి దాని యొక్క ఉత్పత్తిని పెంచుకోవడానికి వినియొగదారులకి అందుబాటులో ఉండేలా మరియు వినియొగదారులు ఆకర్షించే విదంగా మరి కొన్ని కొత్త మోడల్స్ ను ప్రవేశపెడుతుంది. అవి ఎమిటంటే మారుతి సెలెరియో డీజిల్, మారుతి సుజుకి సెర్వో, మారుతి సుజుకి గ్రాండ్ విటారా న్యూ, మారుతి సుజుకి IV- 4, మారుతి సుజుకి జిమ్ని, మారుతి MR వాగన్, మారుతి సుజుకి SX4 S క్రాస్, మారుతి సుజుకి వాగన్ R డీజిల్, మారుతి XA ఆల్ఫా మరియు మారుతి YRA.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి మారుతి డీలర్ in India

Other Car Models In India