:లో బ్రాండ్ కార్లు :దేశం

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, భారతదేశం లో దక్షిణ కొరియా హ్యుందాయ్ మోటార్ కంపెనీ యొక్క పూర్తి ఆధీనంలో ఉండేది. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలో మే 1996లో వచ్చింది. అప్పటికి ఆటోమొబైల్ మార్కెట్ కేవలం ఐదు కారు తయారీదారుల ఆధిపత్యంలో ఉండేది వాటి పేర్లు, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ (ప్రస్తుతం మారుతి సుజుకి), హిందుస్థాన్ మోటార్స్, ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్, టెల్కో (ఇప్పటి టాటా మోటార్స్), మహీంద్రా అండ్ మహీంద్రా. ప్రయాణీకుల కార్ల విభాగంలో అమ్మకాల పరంగా మారుతీ ఉన్నత స్థానాన్ని అధిరోహించింది.

భారతదేశంలో హ్యుందాయి నుండి బయటకి వచ్చిన మొట్టమొదటి అద్భుతమైన కారు సాంట్రో ఇది సెప్టెంబర్ 23,1998న ప్రారంభించబడింది. ఆ తరువాత ఇది భారతదేశంలో రెండవ అతి పెద్ద ఆటోమొబైల్ తయారీదారిగా మరియు అతి పెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారిగా అవ్వడానికి కొన్ని నెలల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు.

ప్రస్తుతం, హ్యుందాయ్ రెండు అధునాతన కారు తయారీ ప్లాంట్లను భారతదేశంలో చెన్నైకి సమీపంలో కలిగి ఉంది. రెండూ కలిపి సంవత్సరానికి 6,30,000కార్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది భారతదేశంలో దాదాపు 346 డీలర్షిప్ మరియు 800 సర్వీసు సెంటర్లు భారీ నెట్వర్క్ కలిగి ఉంది. దీని ఆటోమోటివ్ ప్రయాణం 1968 లో కోర్టినా అని ఒక కారుతో ప్రారంభించబడినది. ఇది ఫోర్డ్ మోటార్ కంపెనీ మరియు హ్యుందాయ్ రెండిటి సమన్వయంతో నిర్మించబడినది. అప్పటి నుండి వాళ్ళ సమన్వయం చాలా దూరం వచ్చింది. నేడు హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుల జాబితా లో నాలుగో స్థానంలో ఉంది.దాని సియోల్ ప్రధాన కార్యాలయం నుండి, ప్రపంచవ్యాప్తంగా డీలర్ నెట్వర్క్ యొక్క 6000 డీలర్షిప్ మరియు దుకాణముల సహాయంతో ఈ వాహనతయారీ సంస్థ ప్రపంచ నలుమూలల 193 దేశాలలో వాహనాలు విక్రయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ కార్లు అస్థిరమైన డిమాండ్లను అందుకోవడానికి, కంపెనీ తనంతట తానుగా ఉల్సాన్ లో అంతిమ తయారీ సౌకర్యం నిర్మించుకుంది, ఇది ప్రపంచంలో అతిపెద్ద సమగ్ర ఆటోమొబైల్ ఉత్పత్తి యూనిట్ మరియు 1.6 మిలియన్ యూనిట్ల కార్లు సంవత్సరానికి ఉత్పత్తి చేయగలిగే సామర్ధ్యం కలిగి ఉంది.

హ్యుందాయ్, భారతదేశంలో ఆటోమోటివ్ రంగంలో ఒక అందమైన అనుభవం మరియు విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సంస్థ చాలా మంది వినియోగదారుల కోసం బోలెడన్ని మోడళ్ళు అందిస్తుంది. ఇది వినియోగదారులందరికీ సెడాన్ మరియు SUV విభాగమే కావచ్చు లేదా హాచ్బాక్ విభాగమే కావచ్చు ఏదో రకంగా వినియోగదారులకి కొత్త మోడళ్ళు అందించి సంతృప్తి ఇస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలో హ్యుందాయ్ కార్ల విభాగంలో మొత్తం 9 మోడళ్లు ఉన్నాయి. ఇవి రకరకాల విభాగాలు అందించడమే కాకుండా వినియోగదారులకి వాటిని ఎంచుకోవడానికి తగినంత ఎంపికలు అందిస్తుంది.ఈ కార్ల అద్భుతమైన సమూహంలో హ్యుందాయ్ ఇయాన్, హ్యుందాయ్ i10, హ్యుందాయ్ గ్రాండ్ i10, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు హ్యుందాయ్ ఇలైట్ i20 ఈ మోడళ్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ భారతదేశంలో విస్తృతమైన కార్లు అమ్మకానికి పెట్టింది. వాటిలో దిగువ శ్రేణి హాచ్బాక్స్ నుండి ఉన్నత శ్రేణి హాచ్బాక్స్ వరకు మరియు ఎగ్జిక్యూటివ్ సెడాన్ నుండి ప్రీమియం సెడాన్ల తో పాటూ SUV లని కూడా కలిగి ఉంది. హ్యుందాయి లో లగ్జరీ, ఉన్నతమైన, సామర్ధ్యం వంటి లక్షణాలు కలిగిన మోడళ్లు చాలా ఉన్నాయి. వాటిలో సామర్ధ్యం కలిగిన హ్యుందాయి ఇయాన్ ప్రస్తుతం భారతదేశంలో 3,05,781ధరతో వస్తుంది.

భారతదేశంలో ఆటో మార్కెట్ లో హ్యుందాయి కళ్ళు చెదిరే మోడళ్ళను వినియోగదారులకి అందిస్తుంది. వినియోగదారులు ఎల్లప్పుడూ కొత్త మోడళ్లు, కళ్ళు చెదిరే మోడళ్ళు, ఖరీదైన అంతర్భాగాలు, అధునాతన సౌకర్యాలు మరియు అద్భుతమైన పనితీరును అందించే మోడళ్ళు కావాలి అనుకుంటారు. దానికి తగ్గట్టుగా హ్యుందాయి కళ్ళు చెదిరే మోడళ్లను వినియోగదారులకి అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో హ్యుందాయికి చెందిన ఖరీదైన మోడల్ హ్యుందాయి సాంటా ఫీ . ఇది 29,95,351 ధరతో లభిస్తుంది.

గత నాలుగు దశాబ్ధాలుగా హ్యుందాయి సంస్థ ఆటోమొబైల్ రంగంలో ఉంది. ఇది కొన్ని అద్భుతమైన ఇంజన్లతో రూపొందించబడినది. అందులో V8 Tauఅనేది ప్రముఖమైన ఇంజన్. అది 2009 గాను వాట్స్ ద్వారా ఎంపిక చేయబడిన పది ఇంజన్ల్లలో ఒకటిగా నిలిచింది. దాని యొక్క వైభవం సౌత్ కొరియా నుండి ఇండియాకి ప్రభలింది. భారతదేశంలో హ్యుందా కార్లలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న కారు హ్యుందాయి వెర్నా. ఇది ప్రస్తుతం 7,69,725 ధరతో లభిస్తుంది.

హ్యుందాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. అవి అద్భుతమైన పనితీరుని అందించి మారుతి సుజుకి ఇండియా, హోండా కార్స్ ఇండియా మరియు చెవ్రొలెట్ ఇండియా ఇంకా కొన్ని సంస్థలకి గట్టి పోటీ ఇస్తుంది. వినియోగదారులని దృష్టిలో ఉంచుకొని హ్యుందాయి సంస్థ అద్భుతమైన మోడల్స్ ని అందించబోతుంది. హ్యుందాయి సంస్థ రాబోయే రోజుల్లో హ్యుందాయ్ i25, హ్యుందాయ్ సొనాట మరియు హ్యుందాయ్ టక్సన్ మోడల్స్ ను ప్రవేశపెట్టబోతుంది. ఈ మోడళ్లు వచ్చిన తరువాత కంపెనీకి అదనపు బలం చేకూరుతుంది.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి హ్యుందాయ్ డీలర్ in India

Other Car Models In India