:లో బ్రాండ్ కార్లు :దేశం

ఉత్తరప్రదేశ్ కి చెందిన నోయిడాలో ప్రధాన కార్యాలయం ఏర్పరుచుకున్న హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్, మొదటిసారిగా జపాన్ కు చెందిన హోండా యొక్క మాతృ సంస్థ మరియు భారతదేశంలో సిద్ధార్థ్ శ్రీరామ్ గ్రూప్ యొక్క ఉషా ఇంటర్నేషనల్ తో భాగస్వామ్యం అవుతూ, హోండా సియాల్ కార్స్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతో డిసెంబర్ 1995 న భారతదేశంలో అడుగు పెట్టింది. కొన్ని సంవత్సరాల నుండి జపాన్ కి చెందిన హోండా సంస్థ ఏటా 14 మిలియన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లను తయారుచేస్తుంది. వీటిలో ప్రతీ ఒక్కటి ఆటోమొబైల్ రంగానికి ఎంతో ప్రముఖమైనది. అందువలనే జపనీస్ కారు-మేజర్ నేడు ప్రపంచంలో చాలా నమ్మకమైన కారు ఇంజన్ మేకర్స్ జాబితా లో ప్రధమ స్థానంలో నిలిచింది. అంతే కాకుండా 2001 లో, హోండా జపాన్ యొక్క రెండవ అతి పెద్ద వాహన తయారీ సంస్థగా పేరు పొందింది.

2011 లో అయితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారులు మధ్య ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అత్యంత విజయవంతమైన వాహన తయారీ సంస్థల మధ్య లెక్కించబడుతుంది. అన్ని వేళలా కొన్ని అసాధారణమైన కార్లను కొత్త కొత్త మోడళ్లను అందించడం వలన భారతదేశంలో హోండా చాలా మంది వినియోగదారుల అభిమానం పొందగలుగుతుంది.

హోండా భారీ తయారీ స్థావరాన్ని మరియు విస్తృతమైన అమ్మకాలు నెట్వర్క్ ఏర్పాటు చేయడంతో పాటూ మరింత వారి యాజమాన్య అనుభవం అభివృద్ధి చేయడం కోసం దాని వినియోగదారులకు అందుబాటులో ఉంటూ ఇతర సౌకర్యాలు మరియు సేవలు అందిస్తుంది. హోండా సంస్థ వినియోగదారులని దృష్టిలో ఉంచుకుని హోండా భీమా పధకం ద్వారా వినియోగదారులకు నిరాటంకమైన-ఉచిత భీమాని అందిస్తుంది. అంతేకాకుండా ఆటో టెర్రస్ ద్వారా వినియోగదారులకి హోండా యొక్క పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనాలు తీసుకొనే విదంగా ఏర్పాటు చేసింది. వాళ్ళ ఇద్దరి భాగస్వామ్యం కలిపి భారతదేశం లో ఈ సేవలు మరియు సౌకర్యాలకి హోండా మొత్తం పెట్టుబడి రూ 16.2 బిలియన్ అధిగమించేలా చేశారు.

హోండా సంస్థ గత 20 సంవత్సరాలుగా భారతదేశంలో కనీ విని ఎరుగనటువంటి మోడళ్లు తీసుకురావడంలో దానికి అదే సాటి. ఇది ఎల్లప్పుడూ వినియోగదారుల మనోభావాలకి అనుగుణంగా దాని పనితీరుని అందిస్తుంది. ఇన్ని సంవత్సరాల్లో ఈ హోండా సంస్థ బోలెడన్ని కార్లను ప్రవేశపెట్టింది. ఈ కార్లు అన్నీ కుడా ఎంతో ప్రజాధారణ పొందాయి. ప్రస్తుతం హోండా భారతదేశంలో హోండా బ్రియో, హోండా అమేజ్, హోండా మొబిలియో, హోండా సిటీ మరియు ఈ హోండా CR V మొత్తం 5 కార్ల్లతో చక్రం తిప్పుతుంది. వీటిలో హోండా బ్రియో, హోండా అమేజ్, హోండా మొబిలియో, హోండా సిటీ ఇవి నోయిడా లో తయారుచేయబడినవి.

ప్రస్తుతం భారతదేశంలో హోండా లో హ్యాచ్బాక్స్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (SUV), ఎగ్జిక్యూటివ్ సెడాన్, ప్రీమియం సెడాన్, కాంపాక్ట్ సెడాన్ వంటి విస్తృతమైన నమూనాలు ఉన్నవి. ఈ మోడళ్ళు అన్నీ కూడా చూడడానికి కళ్ళు చెదిరే విదంగా అధిక పనితీరు మరియు విశ్వసనీయతని కలిగి ఉంటాయి. హోండాలో వినియోగదారుల మనోభావాలకు అనుగుణంగా మధ్య తరగతి వారు కొనుగోలు చేసే విదంగాను అలానే ధనిక స్థాయిలో ఉన్న వారు కొనుగోలు చేసే విదంగా అన్ని రకాల మోడళ్లు లభిస్తాయి. వాటిలో సామర్ధ్యం కలిగిన హోండా బ్రియో సామాన్యులు సైతం కొనుగోలు చేసే విదంగా 4,21,400 తక్కువ ధరతో భారతదేశంలో లభిస్తుంది.

హోండా, అనేక సంవత్సరాల నుండి భారతదేశ ఆటో పరిశ్రమలో ప్రీమియం కార్ల తయారీ సంస్థ గా పేరు పొందింది. శక్తిమంతమైన ఇంజిన్లు, అధికపనితీరు, థ్రిల్లింగ్ రైడ్, ఆధునికత అనేవి దీని ప్రత్యేకతలు. ఖరీదైన అంతర్భాగాలు, చక్కటి పనితీరు మరియు అందమైన రూపం కలిగిన కార్లను హోండా సంస్థ వినియోగదారులకి అందజేస్తుంది. వినియోగదారుల అవసరాలపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం హోండా కి చెందిన ఖరీదైన మోడల్ హోండా CR-V యొక్క ధర 21,09,000. ఇది హోండా లో అత్యధిక ఖరీదు గల మరియు చక్కటి సదుపాయాలు కలిగిన కారు.

ఇది హోండా బ్రియో, హోండా అమేజ్ లేదా మరి ఏ ఇతర హోండాకి సంబందించిన కారు అయినా ఆధునిక డిజైన్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, మన్నిక, విశ్వసనీయత మరియు ఇంధన సామర్థ్యం వంటి వాటిని కలిగి ఉంటాయి. హోండా సంస్థ ఎప్పటికప్పుడు దాని ఇంధన సామర్ధ్యం పెంచుకుంటూ వస్తుంది. ఇంధన వివియోగాన్ని తగ్గించి అధిక సామర్ధ్యం మరియు పనితీరుని అందించడంలో హోండా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. భారతదేశంలో హోండా కార్లలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న కారు హోండా సిటీ ఇది ప్రస్తుతం 7,53,000 ధరతో లభిస్తుంది.

ఎప్పటినుంచో హోండా సంస్థ కార్ల తయారీ సంస్థ గానే కాకుండా ఒక వినూత్నమైనది మరియు అద్భుతమైన సంస్థ గా కుడా పేరు పొందింది. అయితే, ప్రస్తుతం, భారతదేశం లో హోండా కార్లలో మొత్తం 5 మోడళ్ళు ఉన్నాయి. రానున్న రోజుల్లో హోండా జాజ్, హోండా అకార్డ్, హోండా ణ్శ్X మరియు హోండా విజన్ Xశ్ 1 మోడల్స్ ని హోండా సంస్థ ప్రవేశపెట్ట బోతుంది.

మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి హోండా డీలర్ in India

Other Car Models In India