:లో బ్రాండ్ కార్లు :దేశం

జర్మనీ యొక్క జ్విక్కావ్ లో ఆడి AG అనే సంస్థను జూలై 16, 1909 వ సంవత్సరం లో స్థాపించారు. ఈ ఆడి అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా జర్మనీ లో ఉన్న 3 ఉత్తమ సంస్థలలో ఇది కూడా ఒకటి. ఈ మూడు సంస్థల పేర్లు వరుసగా మెర్సిడెస్ బెంజ్ మరియు BMW లతో పాటు, ఆడి కూడా. ఈ మూడు సంస్థలను కలిపి జర్మనీ లో 'జర్మన్ బిగ్ 3' అంటారు. ఈ సంస్థ ప్రపంచ మొత్తంలో ఉత్తమ లగ్జరీ కార్ల తయరీదారులు అని చెప్పవచ్చు. ఆడి యొక్క 99.55% వాటాలు జర్మనీ యొక్క వోక్స్వ్యాగన్ గ్రూప్ యాజమాన్యంలో ఉన్నాయి. అంతేకాకుండా 1966 వ సంవత్సరం నుండి ఆడి యొక్క వాటాలను వోక్స్వ్యాగన్ గ్రూప్ ఆదీనం లో ఉన్నాయి. ప్రస్తుతం దీని యొక్క అద్భుతమైన ప్రధాన కార్యాలయం జర్మనీ యొక్క బవేరియా లో ఇన్గాల్స్ట్యాట్ అనే నగరం లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆడి యొక్క అమ్మకాలను 100 కు పైగా దేశాలలో విస్తరింపచేసింది.

ఈ సంస్థ యొక్క మూలాలను నవంబర్ 14, 1899 వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. అదే రోజున ఆగస్టు హొర్చ్ అనే అతను తన కారు సంస్థను స్థాపించాడు. ఈ సంస్థకు A. హొర్చ్ & సై అను నామకరణం చేశాడు. అదే సంవత్సరం మొదటి భాగంలో, ప్రపంచంలో ఎన్నడు చూడలేని మొట్టమొదటి కారుని ప్రవేశపెట్టాదు. దానికి టైప్-B అను పేరు పెట్టాడు. ఆ తరువాత ఆడి తయరీదారుడు ఎన్నడు వెను తిరిగి చూడలేదు.

భారతదేశం లో, ఆడి యొక్క కార్లు మొదటిసారుగా 2004 వ సంవత్సరం లో కనిపించాయి. కాకపొతే మార్చ్ 2007 వ సంవత్సరం లో పూర్తి స్థాయి లో వోక్స్వ్యాగన్ గ్రూప్ సేల్స్ ప్రెవేట్ లిమిటెడ్ యొక్క ఉత్పత్తులను మరియు అమ్మకాలను భారతదేశం లో మొదటి సారిగా ప్రవేశపెట్టారు. భారతదేశంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర లో ఉన్న ముంబై నగరంలో ఉంది. అంతేకాకుండా దీని యొక్క దీలర్షిప్లను భారతదేశ మొత్తంలో వ్యాపించి ఉన్నారు. 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 11 రాష్ట్రాలలో 25 దీలర్షిప్లను కలిగి ఉంది. ఆడి ప్రపంచంలోని 6 వివిధ దేశాలలో 7 ఉత్పత్తి యూనిట్లను మరియు తయారీ సౌకర్యాలను కలిగి ఉంది. మహారాష్ట్ర యొక్క ఔరంగాబాద్ లో స్కోడా యొక్క ఉత్పత్తి కర్మాగారలు ఎక్కడైతే ఉన్నయో, అక్కడ ఆడి కార్ల యొక్క ఉత్పత్తి కూడా జరుగుతుంది.

ప్రపంచంలో ఉన్న ఇతర బ్రండ్స్ లాగానే భారతదేశంలో ఉన్న ఈ ఆడి సంస్థ కూడా అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం వలన అనేక అధ్బుతమైన మొడల్స్ తిసుకొని రాగలుగుతుంది. అందుచేత కొనుగోలుదారుల అభిమానాన్ని ఈ ఆడి సొంతం చేసుకోగలుగుతుంది. అంతేకాకుండా ఈ ఆడి సరికొత్త మొడల్స్ ను మరియు అందమైన లుక్స్ తో ఆటోమొబైల్ రంగలో ప్రవేశపెడుతుంది. అందువలన ఈ ఆడి బారతదేశంలోనే కాక ప్రపంచమొత్తం లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఆడి కలిగి ఉన్న కార్లు వరుసగా ఆడి A3, ఆడి Q3, ఆడి A4, ఆడి A6, ఆడి A3 కాబ్రియోలేట్, ఆడి Q5, ఆడి TT, ఆడి Q7, ఆడి S6, ఆడి RS5, ఆడి A8, ఆడి RS7, ఆడి R8.

భారతదేశం లో, అత్యంత లగ్జరీ వాహనాలలో ఆడి ఒకటి, ఈ ఆడి లో అనేక రకాల మొడల్స్ ను కలిగి ఉంది. ఈ ఆడి లో కన్నులకు మైమరపించే కార్లు ఉన్నయి, అంతేకాకుండా ఈ కార్లు అత్యంత ఖరీదైనవి మరియు బడ్జెట్ లో అనుకూలమైన కార్లును కూడా కలిగి ఉంది. దీనిలో భాగంగా ఇటీవల ప్రస్తుతం విడుదల అయిన ఆడి A3 కారు మనకు అందుబాటులో ఉండే ధర ను కలిగి ఉంది. ఈ ఆడి ఆ3 కొనుగోలుదారులకు 24 లక్షలకే అందుబాటులో ఉంది.

ప్రపంచ టాప్ 3 లగ్జరీ కార్ల తయారీదారులలో ఆడి ఒకటి. ఈ ఆడి మంచి కంఫొర్ట్ ను, అద్భుతమైన లుక్స్ ను మరియు అత్యధ్బుతమైన రైడ్ ను ఇస్తుంది. అంతేకాకుండా భారతీయ వినియొగదారులకు ఉత్సహపరిచే మొడల్స్ ను ఆడి మనకు అందిస్తుంది. ఉన్నతి మరియు మెరులుగొలిపే అందాలను కొనుగోలుదారులకు సహజంగా కనపడేలా చేస్తాయి. అయితే, ఈ అసాధారణ విశిష్ట లక్షణాలు అదనపు ధర లేకుండా ఆటోమొబైల్ రంగంలోకి రావు. కాని ఈ ఆడి సంస్థ కొనుగోలుదారులు నమ్మలేనంత సరసమైన ధరలలో లగ్జరీ కార్లను అందుభాటులో ఉంచుతుంది. ఈ ఆడి కార్లు కూడా అదే స్థాయిలో వాటికున్న అందాల్ని చుపిస్తాయి. జర్మన్ ఆటో సంస్థ నుండి వచ్చిన ఆడి కార్లలో అత్యంత ఖరీదైన మోడల్ ఆడి R8. ఈ ఆడి R8 రూ 2.9 కోట్ల ధరకే కొనుగోలుదారులకు అందుభాటులో ఉంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్ లో ఒక కారును కొనుగోలు చేయాలంటే రాచరికపు సుఖాలు, డైనమిక్ రైడ్ నాణ్యత, ఆహ్లదభరితమైన బాహ్య స్వరూపం, ప్రపంచ స్థాయి పరికరాలు, ఆకట్టుకునే ఇంధన సామర్థ్యం కొనుగోలుదారులు సాధారణంగా కోరుకుంటారు.వీటినన్నింటిని భారతీయ ఆటొమొబైల్ రంగంలో మనకు అందుభాటులో ఉంచేది ఈ ఆడి సంస్థ ఒకటి. దీని కారణంగా భారతదేశ ఆటొమొబైల్ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఏర్పరచుకుంది. ఈ ఆడి లో అతి తక్కువ ధరను మరియు అత్యధిక ఇంధన సామర్ద్యాన్ని ఇచ్చే కారు ఆడి A3, ఈ మొడల్ రూ 24 లక్షలు ధరకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

జర్మన్ బిగ్ 3 సభ్యులు వరుసగా ఆడి, BMW, మెర్సిడెస్ బెంజ్ వీరు ముగ్గురు మధ్య అంతులేని యుద్ధం అని మనకు తెలిసిన విషయమే, అంతేకాకుండా లగ్జరీ కార్ల మార్కెట్ లో వీరి ముగ్గురు అగ్ర స్థానాన్ని సొంతం చేసుకోవాలని మూడు టైటాన్స్ మధ్య జరిగే అంతులేని పోరాటం అని మనకు తెలిసిన విషయమే, ఇదేమి రహస్యం కాదు. ఈ ముగ్గురు తయారీదారులు ఒకరికొకరు అత్యద్బుతమైన మొడల్స్ ను ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేస్తున్నారు. కాని ఆడి మాత్రం వినియోగదారులని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మొడల్స్ ను మరియు కొనుగోలుదారులను ఉత్సహపరిచే మొడల్స్ ను ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేస్తుంది. అంతేకాకుండా ఈ ఆడి భారతదేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాని యొక్క ఉత్పత్తిని విస్తరింపచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఆకర్షించే కారు మొడల్స్ ను ప్రారంభించడానికై నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆడి ప్రవేశపెట్టే కార్లు ఆడి A1, ఆడి Q3 ఫేస్ లిఫ్ట్, న్యూ ఆడి Q7, ఆడి RS6, ఆడి S7 మరియు ఆడి TT రోడ్స్టర్.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి ఆడి డీలర్ in India

Other Car Models In India