బీఎండబ్ల్యూ ఐ 8

` 2.6 Cr*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

బీఎండబ్ల్యూ ఇతర కారు మోడల్లు

 
*Rs

బీఎండబ్ల్యూ ఐ 8 వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
అత్యధిక స్థాయిలో ఉన్న ఈ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, అధికారికంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత వినూత్న 'ఐ' సిరీస్ హైబ్రిడ్ కారు ను తయారు చేసింది. అది మరేంటో కాదు, బిఎండబ్ల్యూ ఐ8 లగ్జరీ కారు మరియు ఇది, విద్యుత్ మోటారు అలాగే ఒక పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఈ వాహనం రెండు ఇంజన్ల కలయికతో అత్యధికంగా 47.45 కె ఎం పి ఎల్ గల మైలేజ్ ను అందిస్తోంది. ఈ కార్ల తయారీదారుడు ఈ లగ్జరీ స్పోర్ట్స్ వాహనం యొక్క ముందు ఆక్సిల్ కు విద్యుత్ మోటారు ను అలాగే వెనుక ఆక్సిల్ కు ఒక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అందించాడు. త్వరణం పరంగా చెప్పాలంటే ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 4.4 సెకన్ల సమయం పడుతుంది. ఈ ఆధునిక లగ్జరీ వాహనం, క్యాబిన్ లో ఉండే ప్రయాణికులకు ఉత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి అనేక వినూత్న అంశాలతో వస్తుంది. ఈ విధ్యుత్తు మోటార్, లిథియం-అయాన్ అధిక వోల్టేజ్ బ్యాటరీ మరియు ఒక శక్తి నిర్వహణ వ్యవస్థ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది, ఒక వినూత్న శీతలీకరణ వ్యవస్థ ను కలిగి బ్యాటరీ ను సరైన ఉష్ణోగ్రతలో ఉంచుతుంది మరియు పనితీరును అలాగే మన్నికను మెరుగుపరుస్తుంది. అదే ఇంటిలిజెంట్ శక్తి నిర్వహణ వ్యవస్థ విషయానికి వస్తే, అధిక వోల్టేజ్ బ్యాటరీ మరియు టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ కలిసి, కనీస వినియోగం వద్ద గరిష్ట పనితీరును అందిస్తోంది. మరోవైపు ఈ స్పోర్ట్స్ కారు, వినూత్న ఈకో ప్రో మోడ్ ను కలిగి ఉంటుంది మరియు ఇది, 20 శాతం అధిక మైలేజ్ ను ఇవ్వడం లో తోడ్పడుతుంది. అంతేకాకుండా తయారీదారుడు ఈ వాహనానికి, ఒక థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ను కలిగిన ఒక గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ ను అందించాడు. దీని వలన వేడి, విధ్యుత్తు గా మారుతుంది మరియు బ్యాటరీ చార్జింగ్ కు సహాయపడుతుంది. ఈ సంస్థ నుండి వచ్చిన అద్భుతమైన ఈ లగ్జరీ వాహనం, ఆటోమొబైల్ రంగంలో ఉండే ఇతర వాహనాల వలే కాకుండా ఒక ఆల్ట్రా ఆధునిక బాహ్య రూపాన్ని కలిగి ఉంది. ఈ వాహనం యొక్క బాహ్య భాగంలో ఉండే ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, మోటార్ వే డ్రైవింగ్ కోసం ప్రత్యేక కాంతి పంపిణీ వ్యవస్థ ను కలిగిన U ఆకారపు ఎల్ ఈ డి హెడ్ లైట్లు ముందు భాగానికి అందించబడతాయి. అంతేకాకుండా, రేడియేటర్ గ్రిల్ తో పాటు వెనుక బంపర్, నీలి రంగులో ఉండే సైడ్ ప్యానళ్ళు వంటివి బాహ్య భాగానికి మరింత స్పోర్టీ లుక్ ను అందిస్తాయి. బాహ్య రూపం వలే అంతర్గత భాగం కూడా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే ఒక ఉత్కంఠభరితమైన డిజైన్ ను కలిగి ఉంది. ఈ అంతర్భాగానికి, ప్రకాశవంతమైన కరుం గ్రే మరియు నలుపు పథకాలను కలిగిన నెసో ఇంటీరియర్ ప్రామాణికంగా అందించబడుతుంది. అయితే కొనుగోలుదారుడు, ఈ వాహనానికి కార్ప్రో ఇమిడో లేదా కార్ప్రో ఐవోరీ వైట్ లేదా హాలో అను మూడు ఇంటీరియర్ ఎంపికలను ఎంచుకోవచ్చు. ఇది, ఈ వాహనానికి వివిధ రంగులు మరియు మెటాలిక్ చేరికలను ఎంపిక చేసుకోవడానికి సహాయపడతాయి. ప్రస్తుతం, ఈ వాహనం భారత ఆటోమొబైల్ మార్కెట్ లో ఈ విభాగంలో ఏకైక మోడల్ తో అందుబాటులో ఉంది మరియు దీనికి ఇదే పోటీ.

మైలేజ్ మరియు ఇంధన సామర్ధ్యం:


ఈ లగ్జరీ వాహనం, ఒక ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఒక ట్విన్ పవర్ టర్బో పెట్రోల్ ఇంజన్ల కలయికతో వస్తుంది. లిథియం బ్యాటరీ పూర్తి చార్జింగ్ అవ్వడానికి రెండు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది మరియు ఇది, 37 కిలో మీటర్ల మైలేజ్ ను ఇచ్చే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు వెనుక ఆక్సిల్, 1499 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది, బహుళ పాయింట్ ఇంధన ఇంజక్షన్ టెక్నాలజీ తో జత చేయబడి ఆకట్టుకునే ఇంధన సామర్హ్ద్యాన్ని అందిస్తుంది. ఇది, ఎలక్ట్రిక్ మోటార్ తో జత చేయబడినప్పుడు అత్యధికంగా 47.45 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. రెండింటి కలయికతో వచ్చినప్పుడు ఈ వాహనం గరిష్టంగా, 600 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్ధ్యం:


ఈ సెడాన్ యొక్క ఎలక్ట్రిక్ ఇంజన్, 7.1 కిలో వాట్ హవర్ ఒక స్థూల సామర్ధ్యాన్ని కలిగి అత్యధికంగా 128 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 250 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం, ఒక ట్విన్ పవర్ టర్బో చార్జింగ్ యూనిట్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, అత్యధికంగా 231 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 320 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ లగ్జరీ సెడాన్, నమ్మలేనంత ఆకట్టుకునే త్వరణాన్ని మరియు పికప్ లను కలిగి ఉంది. ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 4.4 సెకన్ల సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ మోడ్ లో ఈ సెడాన్, 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 4.5 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 120 కె ఎం పి హెచ్ గల అత్యధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ సెడాన్ రెండు ఇంజన్ లను ఉపయోగించినప్పుడు, 250 కె ఎం పి హెచ్ గల అత్యధిక వేగాన్ని చేరుకోగలుగుతుంది.

వెలుపలి డిజైన్:


ఈ వాహనం, ఆటోమొబైల్ విభాగంలో ఏ ఇతర వాహనం వలే కాకుండా ఒక ఉత్కంఠభరితమైన బాహ్య రూపాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వాహనం, ఏరోడైనమిక్ శరీర నిర్మాణం తో పాటు కత్తెర వంటి తలుపులతో ఇది అద్భుతమైన లుక్ ను కలిగి ఉంటుంది. ఈ అల్ట్రా ఆధునిక స్పోర్ట్స్ కారు, తదుపరి తరం లుక్ ను అందించడానికి అనేక కాస్మటిక్ అంశాలతో రూపకల్పన చేయబడింది. ముందుగా, ముఖ భాగం విషయానికి వస్తే అనేక మెటాలిక్ చేరికలను కలిగిన కిడ్నీ ఆకారపు గ్రిల్ చుట్టూ నీలం లైన్ అందించబడుతుంది. దీని పై భాగం లో ఉండే బోనెట్ రెండు రంగుల పథకంతో అందంగా అలంకరించబడి ఉంటుంది మరియు దీనికి సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం కూడా పొందుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రిల్ కు ఇరువైపులా, నలుపు చేరికలను కలిగిన సొగసైన హెడ్ లైట్ క్లస్టర్లు అందించబడతాయి. దీని వలన ముందు భాగానికి మరింత అందం చేకూరుతుంది. ఈ హెడ్ లైట్ క్లస్టర్ లో, U ఆకారపు ఎల్ ఈ డి హెడ్ లైట్లతో పాటు డే టైం రన్నింగ్ లైట్లు అందించబడతాయి. బోనెట్ వలే ముందు బంపర్ కూడా, రెండు రంగుల పథకంతో ఉంటుంది మరియు దీనికి, ఒక జత ఎయిర్ ఇంటేక్ సెక్షన్లు విలీనం చేయబడి ఉంటాయి. ఒక ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చడానికి, ముందు బంపర్ నిగనిగలాడే నలుపు చేరికలతో అలంకరించబడి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, చాలా సొగసైనదిగా ఉంటుంది కానీ వీల్ ఆర్చులు పెద్దగా స్పోర్టీ లుక్ ను అందిస్తాయి. వీటి ఫెండర్లకు, 20 అంగుళాల స్టైలిష్ తేలికపాటి అల్లాయ్ వీల్స్ అందిచబడతాయి మరియు దీని మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం పొందుపరచబడి ఉంటుంది. కత్తెర వంటి డోర్ లకు రెక్కల అద్దాలు అందించబడతాయి మరియు ఇవి, నిగనిగలాడే నలుపు చేరికలతో అలంకరించబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ కత్తెర వంటి తలుపులకు డోర్ హ్యాండిళ్ళు విలీనం చేయబడి ఉంటాయి. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ముందు మరియు సైడ్ భాగాల కంటే కూడా స్పోర్టియర్ గా ఉంటుంది. ఇతర కన్వెన్షినల్ స్పోర్ట్స్ కార్ల వలే కాకుండా ఈ వాహనం, ఒక మంచి డిజైన్ ను కలిగిన ఎల్ ఈ డి టైల్ లైట్లను, డైనమిక్ గా రూపొందించిన బంపర్ మరియు అనేక ఇతర అంశాలను కలిగి ఉంది. వెనుక విండ్ స్క్రీన్ చాలా పెద్దదిగా ఉంటుంది మరియు దీనికి షార్క్ ఫిన్ యాంటిన్నా తో పాటు మూడవ ఎల్ ఈ డి బ్రేక్ లైటు విలీనం చేయబడి ఉంటుంది. వెనుక బంపర్ కూడా నీలం చేరికలతో అలంకరించబడి ఉంటుంది మరియు రిఫ్లెక్టార్లు అలాగే కర్టసీ లైట్లు విలీనం చేయబడి ఉంటాయి. వెనుక విండ్ స్క్రీన్ క్రింది భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది. దీని వలన వెనుక భాగం మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.

వెలుపలి కొలతలు:


తయారీదారుడు ఈ వాహనాన్ని, ఆకట్టుకునే బాహ్య కొలతలతో అందించాడు. ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4689 మిల్లీ మీటర్లు, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లను మినహాయిస్తే ఈ వాహనం యొక్క వెడల్పు 1942 మిల్లీ మీటర్లు. ఈ వాహనం యొక్క మొత్తం ఎత్తు 1298 మిల్లీ మీటర్లు అలాగే ఈ వాహనం, 2800 మిల్లీ మీటర్లు గల ఆకట్టుకునే వీల్బేస్ ను కలిగి ఉంది. మరోవైపు ఈ వాహనం, 1644 మిల్లీ మీటర్ల ముందు ట్రాక్ ను మరియు 1576 మిల్లీ మీటర్లు గల వెనుక ట్రాక్ ను కలిగి ఉంది.

లోపలి డిజైన్:


తయారీదారుడు ఈ మోడల్ యొక్క అంతర్గత భాగానికి, ఒక స్పొర్టీ డిజైన్ ను అందించాడు దీని వలన, లోపలి భాగం ఒక విలక్షణమైన లుక్ ను కలిగి ఉంటుంది. క్యాబిన్ లో ఉండే డాష్బోర్డ్, అనేక పరికరాలతో మరియు అనేక లేయర్లతో రూపకల్పన చేయబడింది. అనేక టచ్ నియంత్రణలను మరియు అనేక ఫంక్షన్ లను కలిగిన సమాచార స్క్రీన్, సెంట్రల్ కన్సోల్ పై భాగంలో పొందుపరచబడి ఉంటుంది. మూడు స్పోక్ల డిజైన్ ను కలిగిన స్టీరింగ్ వీల్ మధ్య భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది. అంతేకాకుండా ఇది, నీలం హైలైట్లతో కూడిన ప్రీమియం లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటుంది. దీని ప్రక్క భాగంలోనే పూర్తి డిజిటలైజెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చబడి ఉంటుంది మరియు ఇది, వేగం, బ్యాటరీ స్థాయిలు, హెచ్చరిక లైట్లు మరియు అనేక ఇతర అంశాల ముఖ్యమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. కాక్పిట్ విభాగంలో ఉండే సీట్లు, ప్రీమియం నాణ్యత కలిగిన లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. వెనుక భాగంలో, రెండు సీట్లు అందించబడతాయి అవి, పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటాయి. కాక్పిట్ విభాగంలో ఉండే రెండు సీట్లు, కప్ హోల్డర్లతో పాటు ప్రకాశవంతమైన నియంత్రణా స్విచ్చులను కలిగిన బారీ ఫ్లోర్ కన్సోల్ చే వేరు చేయబడతాయి. అంతేకాక, క్యాబిన్ లో ఉండే గేర్ షిఫ్ట్ లెవర్, అధిక దృడత్వం కలిగిన స్క్రాచ్ నిరోదక జిర్కోనియం ఆక్సైడ్ సెరామిక్ పదార్ధం తో తయారు చేయబడి ఉంటుంది మరియు దీని వలన క్యాబిన్ కు, ఒక ఆధునాతన లుక్ వస్తుంది. బాహ్య భాగం వలే అంతర్గత భాగం కూడా నీలం చేరికలతో అలంకరించబడి ఉంటుంది. ముఖ్యంగా వీటిని, డాష్బోర్డ్ పై, డోర్ ప్యానళ్ళ పై అలాగే ఫ్లోర్ కన్సోల్ పై చూడవచ్చు. ఇతర కన్వెన్షినల్ కార్ల వలే ఈ వాహనం కూడా, కప్ హోల్డర్లు, బారీ గ్లోవ్ బాక్స్, ఫ్లోర్ కార్పెట్లు మరియు నిల్వ కంపార్ట్మెంట్ ను కలిగిన ముందు సెంటర్ ఆర్మ్రెస్ట్ వంటి అంశాలను కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ప్రయాణ సమయంలో, ప్రయాణికులందరికీ ఒత్తిడి లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం కోసం, తయారీదారుడు ఈ వాహనంలో అనేక వినూత్న సౌకర్య లక్షణాలను అందించాడు. తయారీదారుడు అందించిన ప్రామాణిక లక్షణాలు వరుసగా, హీటర్ తో కూడిన రెండు జోన్ల ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, టిల్ట్ ఫంక్షన్ ను కలిగిన పవర్ స్టీరింగ్ వీల్, విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే విండోలు, కార్బన్ స్టైలింగ్ తో కప్పబడిన డోర్ సిల్ ట్రిం, ఆటోమేటిక్ యాంటీ డాజ్లింగ్ ఫంక్షన్ ను కలిగిన అంతర్గత మిర్రర్లు మరియు లెధర్ ట్రిం తో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అంశాలు ఈ వాహనానికి అందించబడ్డాయి. అంతేకాకుండా ఈ వాహనానికి, ఎల్ ఈ డి లతో పాటు మూడు యాంబియంట్ లైటింగ్ డిజైన్ ను కలిగిన లైటింగ్ ప్యాకేజీ, బహుళ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మరియు లుంబార్ మద్దతు తో పాటు మెమోరీ సెట్టింగ్ లను కలిగిన విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే సీట్లు వంటి అంశాలను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు ఈ మోడల్ సిరీస్ కు, నిల్వ కంపార్ట్మెంట్ ప్యాకేజీ, ముందు సీట్లకు హీటింగ్ ఫంక్షన్, రైన్ సెన్సింగ్ వైపర్లు మరియు డ్రైవింగ్ లైట్లు ఆటోమేటిక్ యాక్టివేషన్ వంటి అంశాలను అందించడం జరిగింది. అంతేకాకుండా, డ్రైవర్ కు అద్భుతమైన సహాయాన్ని అందించడం కోసం ఈ వాహనానికి ముందు మరియు వెనుక భాగంలో కెమెరా తో కూడిన ఒక ఆధునిక పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ వ్యవస్థ ను అందించడం జరిగింది.

లోపలి కొలతలు:


ఈ అగ్ర శ్రేణి స్పోర్ట్స్ వాహనం, ఒక మంచి క్యాబిన్ స్పేస్ ను కలిగి ఉంది. దీనితో పాటు, కాక్పిట్ విభాగంలో 983 మిల్లీ మీటర్ల హెడ్ రూం ను అలాగే 1522 మిల్లీ మీటర్ల షోల్డర్ రూం ను కలిగి ఉంది. అదే వెనుక క్యాబిన్ విషయానికి వస్తే, 824 మిల్లీ మీటర్ల హెడ్ రూం మరియు 1308 మిల్లీ మీటర్ల మంచి షోల్డర్ స్పేస్ ను కలిగి ఉంది.

ఇంజన్ మరియు దాని పనితీరు:


తయారీదారుడు ఈ ఎలక్ట్రిక్ వాహనానికి, అత్యంత శక్తివంతమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అందించాడు. ఈ ఇంజన్, 7.1 కిలో వాట్ హవర్ ఒక స్థూల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఈ ఇంజన్ అత్యధికంగా 128 బిహెచ్పి పవర్ ను అదే విధంగా 250 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ ఇంజన్, 2- స్పీడ్ సింక్రో స్విచ్చింగ్ స్టెప్ట్రోనిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు దీని ద్వారా, విడుదల అయిన టార్క్ అవుట్పుట్ వాహనం ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. ఈ వాహనం యొక్క వెనుక భాగానికి, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. దీనితో పాటుగా, ఒక ట్విన్ పవర్ టర్బో చార్జర్ యూనిట్ ను కూడా అందించారు. ఈ ఇంజన్, 1500 సిసి స్థానభ్రంశాన్ని కలిగి డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా మూడు సిలండర్లను మరియు 12 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, ఒక బహుళ పాయింట్ ఇంధన ఇంజక్షన్ వ్యవస్థ తో జత చేయబడి ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 5800 ఆర్ పి ఎం వద్ద 231 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 3700 ఆర్ పి ఎం వద్ద 320 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ ఇంజన్, 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు దీని ద్వారా, విడుదల అయిన టార్క్ అవుట్పుట్ వాహనం యొక్క వెనుక చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోవైపు ఈ రెండు ఇంజన్లు కలిసి అత్యధికంగా, 362 బిహెచ్పి పవర్ ను అదే విధంగా 570 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ మోడల్ కు, బిఎండబ్ల్యూ కనెక్ట్ డ్రైవ్ తో పాటు హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్ వ్యవస్థ ను కలిగిన ఒక ఆధునిక ఐ డ్రైవ్ టచ్ కంట్రోలర్ ను అందించడం జరిగింది. ఈ వ్యవస్థ, మ్యాప్ ల కోసం మరియు ఆడియో ఫైళ్ళ కోసం హార్డ్ డ్రైవ్ ను అలాగే 26 సెంటీమీటర్ల అధిక రిజల్యూషన్ కలర్ డిస్ప్లే ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వ్యవస్థ, బిఎండబ్ల్యూ యాప్లు, 22 సెంటీమీటర్ల కలర్ ప్రదర్శనను కలిగిన ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవింగ్ అసిస్టెన్స్ ప్యాకేజీ మరియు ఆడియో స్ట్రీమింగ్ కొరకు ఎక్స్టెండెడ్ బ్లూటూత్ కనెక్టవిటీ వంటి అంశాలను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఇది, కొన్ని ఆఫీస్ ఫంక్షన్ లను అలాగే వాయిస్ రికగ్నైజేషన్ సిస్టం లకు మద్దతిస్తుంది. వీటన్నింటితో పాటు ఈ కొత్త వాహనానికి, హార్మన్ కార్డన్ చే డిజైన్ చేయబడిన 360 వాట్ల హైఫై లౌడ్ స్పీకర్ వ్యవస్థ ను అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యవస్థ, అధిక సౌండ్ అవుట్పుట్ ను అందించడం కోసం 11 లౌడ్ స్పీకర్లను కలిగి ఉంది.

వీల్స్ పరిమాణం:


ఈ సూపర్ హైబ్రిడ్ స్పోర్ట్స్ కారుకు, డబ్ల్యూ స్పోక్ శైలి కలిగిన తేలికపాటి రింలు లేదా 20 అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. ఈ వాహనం యొక్క ముందు రింలు, 215/45 R20 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి అలాగే వెనుక రింలు, 245/40 R20 పరిమాణం గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం అన్నివేళలా స్థిరంగా మరియు సమతుల్యంగా ఉండటానికి నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని మరియు సమర్ధవంతమైన సస్పెన్షన్ విధానాన్ని అందించడం జరిగింది. ముందుగా బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క నాలుగు చక్రాలు, అధునాతన డిస్క్ బ్రేక్ లతో బిగించి ఉంటాయి. అంతేకాకుండా ఇవి, బిఎండబ్ల్యూ బ్లూ చేరికలను కలిగిన ఉన్నతమైన బ్రేక్ క్యాపిల్లరీస్ తో లోడ్ చేయబడతాయి. ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడానికి, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ సిస్టం మరియు బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్ వంటి వ్యవస్థలను అందించడం జరిగింది. మరోవైపు సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ లగ్జరీ సోర్ట్స్ వాహనం అధునాతన చాసిస్ టెక్నాలజీ తో పాటు డబుల్ విష్బోన్ సస్పెన్షన్ మెకానిజం ను కలిగిన డైనమిక్ డ్యాంపింగ్ కంట్రోల్ సిస్టం లను ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్ కు అందించడం జరిగింది. అదే వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, ఫైవ్ లింక్ సిస్టం తో విలీనం చేయబడి ఉంటుంది. ఈ సస్పెన్షన్ మెకానిజం, రోడ్లపై ఉన్న గతుకులను పరిష్కరించేందుకు మరియు ప్రయాణికులకు ఒక సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం లో సహాయపడుతుంది. నగరాలలో అలాగే రహదారులలో ఒక ఖచ్చితమైన స్పందనను అందించడం కోసం ఈ వాహనానికి, ఒక ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ సిస్టం ను అందించడం జరిగింది.

భద్రత మరియు రక్షణ:


ఈ లగ్జరీ వాహనం, లోపల ఉండే ప్రయాణికులకు అధిక స్థాయిలో రక్షణను కల్పించేందుకు, అనేక భద్రతా అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా క్యాబిన్ లో ఉండే ప్రయాణికులకు మరింత భద్రతను అందించడానికి సంస్థ, ఈ వాహనాన్ని కార్బన్ ఫైబర్ రైన్ ఫోర్స్డ్ ప్లాస్టిక్ తో పాటు తేలికపాటి మెటీరియల్స్ తో అలాగే స్థిరంగా ఉండటానికి అనేక అంశాలతో రూపొందించడం జరిగింది. ట్రాక్షన్ నష్టాన్ని నిరోదించడానికి మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచేందుకు ఈ వాహనంలో, ఒక ఆధునాతన ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రాం ను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు ఈ వాహనానికి, పిల్లల కోసం అకుస్టిక్ రక్షణ, అలారం తో కూడిన యాంటీ థెఫ్ట్ ప్యాకేజీ, ఇంటిలిజెంట్ ఎల్ ఈ డి లైట్ సిస్టం, ఎనిమిది ఎయిర్బాగ్లు, ఏబిఎస్ తో పాటు బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్, టైర్ పంక్చర్ మరమత్తు కిట్ మరియు ప్రథమ చికిత్సా కిట్ తో పాటు వార్నింగ్ ట్రైయాంగిల్ వంటి అంశాలు కూడా అందించబడ్డాయి.

అనుకూలాలు:


1. ఆకర్షణీయమైన శరీర నిర్మాణం, ఈ వాహనం యొక్క అతి పెద్ద అనుకూలత అని చెప్పవచ్చు.
2. ఈ మోడల్, ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
3. ఈ వాహనం ఒక హైబ్రిడ్ నమూనా ను కలిగి ఉన్నప్పటికీ, ఇది అసాధారణ పనితీరును కలిగి ఉంటుంది.
4. ఈ వాహనం మంచి త్వరణాన్ని మరియు పికప్ లను కలిగి ఉంది.
5. ఈ వాహనం యొక్క సౌకర్య మరియు భద్రతా లక్షణాలు, ఇతర వాహనాలతో పోలిస్తే సమంగా ఉన్నాయి.

ప్రతికూలాలు:


1. వెనుక క్యాబిన్ స్పేస్ ఆకట్టుకునే విధంగా లేదు.
2. నిర్వహణ ఖర్చు మరియు విడిభాగాల ఖర్చు చాలా ఖరీదైనవి.
3. అధీకృత సేవా కేంద్రాలను అబివృద్ది పరచవలసిన అవసరం ఉంది.
4. విద్యుత్ మోటార్ యొక్క ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఉంది.
5. యాజమాన్యం ప్రారంభ వ్యయం బాగా ఎక్కువగా ఉంటుంది.