బీఎండబ్ల్యూ 3-సిరీస్

` 37.8 - 48.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

బీఎండబ్ల్యూ ఇతర కారు మోడల్లు

 
*Rs

బీఎండబ్ల్యూ 3-సిరీస్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


ప్రస్తుతం భారత మార్కెట్ లో, బాగా సదుపాయాలను కలిగిన మరియు విలాసవంతమైన కారు మోడల్స్ లో ఈ బిఎండబ్ల్యూ 3 సిరీస్ ఒకటి. ఇది కొన్ని రకాల వేరియంట్స్ తో ఇప్పటికే అందుబాటులో ఉంది. అయినప్పటికీ సంస్థ వారు, దాని శ్రేణిలో గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్ అను పేరు గల వేరియంట్ ను ప్రవేశపెట్టారు. సంస్థ యొక్క తయారీ యూనిట్ వద్ద, ఈ వాహనం స్థానికంగా అసెంబుల్ చేయబడింది. ఈ తయారీ సంస్థ చెన్నై సమీపం లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాహనాల బాహ్య భాగాలలో మరియు అంతర్గత భాగాలలో ఏమేమి అద్భుతమైన అంశాలను కలిగి ఉందో చూద్దాం. ముందుగా ఈ వాహన సిరీస్ యొక్క బాహ్య భాగాల విషయానికి వస్తే, కిడ్నీ ఆకృతి లో ఉండే రేడియేటర్ గ్రిల్ స్లాట్ లను కలిగి ఉంటుంది మరియు హై గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ తో అలంకరించబడిన ఎయిర్ బ్రీథర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ రెండూ కూడా ప్రధాన ప్రత్యేకతలు. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, మాట్టీ బ్లాక్ ఫినిషింగ్ ను కలిగిన సైడ్ విండో ఫ్రేం లు, సొగసైన అల్లాయ్ వీల్స్ సమితి వంటివి వాహనానికి స్పోర్టీ లుక్ ను అందిస్తాయి. అంతేకాకుండా, అంతర్గత భాగాలలో ఉండే అంశాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. బిఎండబ్ల్యూ స్పోర్ట్ అను పేరును, దాని అల్యూమినియం ఎంట్రీ సిల్స్ మీద అందంగా చిత్రించబడి ఉంటుంది. దీని వలన వాహనానికి ఒక ఖరీదైన అప్పీల్ వస్తుంది. కాక్పిట్ విభాగం లో ఉన్న ఒక మృదువైన డాష్బోర్డ్ పై కొన్ని ఆధునిక మరియు స్టైలిష్ పరికరాలను విలీనం చేశారు. స్టీరింగ్ వీల్ నాణ్యత కలిగిన లెధర్ తో కప్పబడి ఉంటుంది మరియు సెంట్రల్ కన్సోల్ లో ఒక నియంత్రణను కలిగి ఒక ఆకర్షణీయమైన లుక్ ను అందిస్తుంది. వీటితో పాటు, క్యాబిన్ లో ఉండే కుషన్ సీట్లు ప్రీమియం లెధర్ తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా, దీని శైలిని మరింత పెంచడానికి ఈ లెధర్ పై రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్ ఉంటుంది. క్యాబిన్ లో ఉండే ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఒక ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ తో పాటు వెనుక ఏసి వెంట్స్ ను కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా, క్యాబిన్ లో ఉండే ఆడియో సిస్టం, బ్లూటూత్ మరియు అనేక కనెక్టవిటీలకు మద్దతిస్తుంది. వీటితో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందించడం కోసం, కొన్ని నిల్వ కంపార్ట్మెంట్ లు మరియు వినియోగ ఆధారిత లక్షణాలు కూడా దీనిలో పొందుపరచబడ్డాయి.

తయారీదారుడు, ఈ వాహన సిరీస్ యొక్క కొత్త వేరియంట్లో బిఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ స్విచ్ ను అందించాడు. దీని ద్వారా డ్రైవర్, డ్రైవింగ్ పరిస్థితులు ఆధారంగా కంఫర్ట్, ఈకోప్రో, స్పోర్ట్ మరియు స్పోర్ట్ + వంటి వివిధ మోడ్ లను ఎంచుకోవచ్చు. ఈ బ్రాండ్ నుండి వచ్చిన ప్రతి మోడల్ లో వివిధ భద్రతా అంశాలను పొందుపర్చారు. ఈ మోడల్ కలిగి ఉన్న బద్రతా అంశాలు వరుసగా, ఇంజన్ ఇమ్మోబిలైజర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్, ముందు సీటు బెల్ట్ లకు బెల్ట్ టెన్సినర్స్ మరియు అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ వంటి భద్రతా అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మోడల్, ఎటువంటి డ్రైవింగ్ పరిస్థితులలో నైనా వాహనం స్థిరంగా ఉండటానికి డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫంక్షన్ ను కలిగి ఉంది. సాంకేతిక వివరణలు పరంగా, ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వాహనాలు, 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ 1995 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 184 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పికప్ చాలా అద్భుతమైనది. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క మైలేజ్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మొత్తంమీద, మొదటి చూపులో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఈ వాహనాన్ని అనేక అంశాలతో రూపకల్పన చేశారు.

మైలేజ్ మరియు ఇంధన సామర్ధ్యం:


ఈ వాహనం యొక్క ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ తో విలీనం చేయబడి అధిక మైలేజ్ ను అందిస్తుంది. ఈ ఇంజన్ రహదారుల పై 17 నుండి 18 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది. అదే విధంగా, నగరాలలో 14 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తుంది.

శక్తి సామర్ధ్యం:


ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వాహనాలు 1995 సిసి స్థానభ్రంశాన్ని కలిగి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటాయి. ఈ ఇంజన్ అత్యధికంగా, 4000 ఆర్ పి ఎం వద్ద 184 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1750 నుండి 2750 ఆర్ పి ఎం మధ్య లో 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


   ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వాహనాలు 8- స్పీడ్ స్టెప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. ఈ వాహనాల త్వరణం విషయానికి వస్తే, ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 7.4 నుండి 7.9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 225 నుండి 235 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వెలుపలి డిజైన్:


బలమైన శరీర నిర్మాణం మరియు అసాధారణ బాహ్య రూపాన్ని కలిగి ఉన్న ఈ వాహనాన్ని అనేక మంది కొనుగోలుదారులు ఎంచుకుంటున్నారు. ముందు రేడియేటర్ గ్రిల్ మరియు వెనుక టైల్ లైట్ క్లస్టర్ ల విషయంలో ఈ వాహనం, ఇతర వాహనాలతో పోలిస్తే ఒక విలక్షణమైన లుక్ ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ వాహన సిరీస్ లో కొత్తగా ప్రవేశపెట్టబడిన జిటి స్పోర్ట్ లైన్ వాహనం, కిడ్నీ ఆకృతి లో ఉండే రేడియేటర్ గ్రిల్ ను కలిగి ఉంటుంది. దీనితో పాటు, హై గ్లాస్ బ్లాక్ కలర్ లో ఉండే తొమ్మిది స్లాట్లను కూడా కలిగి ఉంటుంది. దీని చుట్టూ మందపాటి క్రోమ్ తో అలంకరించబడి ఉంటుంది. ముందరి బోనెట్ పై భాగం లో కంపెనీ యొక్క లోగో పొందుపరచబడి ఉంటుంది. డైనమిక్ ఆకృతి లో ఉండే హెడ్ లైట్లు, ఈ ప్రొఫైల్ లో గమనించదగ్గ మరొక గొప్ప భాగం. ఈ హెడ్ లైట్ క్లస్టర్ లో ఉండే బై జినాన్ హెడ్ లైట్లు, ఒక ప్రకాశవంతమైన కాంతి మార్గాన్ని ఉత్పత్తి చేస్తాయి. అదే విధంగా ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు, ఈ వాహనం యొక్క శైలిని మరింత విస్తరింపచేస్తాయి. దీని క్రింది భాగంలో, ఒక బంపర్ బిగించి ఉంటుంది. దీనిపై ఒక జత ఫాగ్ ల్యాంప్స్ బిగించి ఉంటాయి. అంతేకాకుండా, బంపర్ పై ఒక ఎయిర్ ఇంటేక్ సెక్షన్ అందించబడుతుంది. వీటితో పాటు, ముందు ఒక పెద్ద విండ్ స్క్రీన్ అందించబడుతుంది. దీనిపై ఒక జత రైన్ సెన్సింగ్ వైపర్లు బిగించి ఉంటాయి. దీని వలన రోడ్ స్పష్టంగా కనబడుతుంది. ఈ వాహన సిరీస్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, హై గ్లాస్ బి పిల్లార్లు, విండో చుట్టూ మాట్టీ బ్లాక్ ఫినిషింగ్ వంటివి వాహనానికి ఒక అద్భుతమైన అప్పీల్ ను అందిస్తాయి. మడత వేయగల వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు, హీటింగ్ మరియు ఆటోమేటిక్ యాంటీ డాజిల్ ఫంక్షన్ లను కలిగి ఉంటాయి. వీటికి సైడ్ టర్న్ సూచికలు బిగించి ఉంటాయి. అంతేకాకుండా, దాని యొక్క డోర్ హ్యాండిల్స్ కారు యొక్క బాడీ కలర్ లో ఉంటాయి మరియు వాహనం పొడవునా ఎక్స్ప్రెసివ్ లైన్లు పొందుపరచబడి ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, బహుళ స్పోక్ లను కలిగి ఉన్న స్టైలిష్ అల్లాయ్ వీల్స్ సమితి. వీటితో పాటు, ఈ వాహన సిరీస్ యొక్క కొత్త వేరియంట్ లో ముందు వీల్ ఆర్చులకు ఒక ఎయిర్ బ్రెథర్ ను అందించడం జరిగింది. ఈ వాహన సిరీస్ యొక్క వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, వెనుక భాగం లో గుర్తించదగ్గ అంశాలు ఏమిటంటే, టర్న్ సూచికలను కలిగిన తేజస్సు గల టైల్ లైట్ క్లస్టర్ మరియు డిఫోగ్గర్ ను కలిగిన విస్తృత విండ్షీల్డ్. అంతేకాకుండా, బూట్ లైడ్ పై ఒక యాక్టివ్ స్పాయిలర్ బిగించి ఉంటుంది. ఇది స్పోర్టీ లుక్ ను ఇవ్వడమే కాకుండా, దాని డ్రైవింగ్ డైనమిక్స్ లో సహాయపడుతుంది. వీటితో పాటు, వెనుక భాగంలో ఉండే బంపర్ పై ఒక జత రిఫ్లెక్టార్ లు బిగించి ఉంటాయి మరియు క్రోమ్ పూతను కలిగి ఉన్న ఎగ్జాస్ట్ పైపులు వంటివి అద్భుతమైన అప్పీల్ ను అందిస్తాయి.

వెలుపలి కొలతలు:


ఈ వాహనం, 4824 మిల్లీ మీటర్ల పొడవు తో, 2047 మిల్లీ మీటర్ల వెడల్పు తో మరియు 1508 మిల్లీ మీటర్ల ఎత్తు తో నిర్మించబడింది. దీని యొక్క వేల్బేస్ 2920 మిల్లీ మీటర్లు మరియు కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీ మీటర్లు.

లోపలి డిజైన్:


ఈ వాహనాల అంతర్గత బాగం విషయానికి వస్తే, క్యాబిన్ లోపల కుషన్ సీట్లు రెండు రంగుల పధకంతో అలంకరించబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ కనెక్టెడ్ డ్రైవ్, ఏసి యూనిట్ మరియు కొన్ని ఇతర అధునాతన లక్షణాలు సమకాలీన అనుభూతిని అందిస్తాయి. క్యాబిన్ లోకి ప్రవేశించగానే, డోర్ సిల్స్ సులభంగా గుర్తించే విధంగా ఉంటాయి మరియు కొత్త వాహనం లో 'బిఎండబ్ల్యూ స్పోర్ట్ ' లెటరింగ్ ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్, చక్కని చెక్క ఇన్సర్ట్స్ తో పెర్ల్ క్రోం ప్లేటింగ్ మరియు లెధర్ సీటు కవర్ల పై రెడ్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ వంటి వాటిని అధనంగా కలిగి ఉంది. అంతేకాకుండా, ఎయిర్ వెంట్స్, గ్లోవ్ బాక్స్ కంపార్ట్మెంట్ మరియు ప్రకాశవంతమైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని కలిగి ఉన్న డాష్బోర్డ్ ను అందంగా రూపకల్పన చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్యూయల్ గేజ్, స్పీడో మీటర్, రెవ్ కౌంటర్ మరియు ఇతర మీటర్లను కలిగి ఉంది. ఈ వాహనం స్పోర్టీ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, దీనిని నాణ్యత కలిగిన లెధర్ తో కప్పబడి ఉంచారు. ముందు వరుస లో ఉండే రెండు సీట్లు, విధ్యుత్ తో సర్దుబాటు అవుతాయి మరియు డ్రైవర్ సీటుకు అధనంగా మెమోరీ ఫంక్షన్ ను కూడా అందించడం జరిగింది. ఆకర్షణీయమైన గ్లాస్ సన్ రూఫ్ గాలి ని తీసుకోవడానికి, వెచ్చని ఎండ వంటి వాటికి అనుమతిస్తుంది మరియు సౌలభ్యాన్ని మరింత పెంచుతుంది. వెనుక సీటు సెంటర్ ఆర్మ్ రెస్ట్, రెండు కప్ హోల్డర్స్ ను కలిగి ఉంది. వీటితో పాటు, ఈ వాహనం అసిస్ట్ గ్రిప్, డోర్లకు పాకెట్లు, స్మోకర్స్ ప్యాకేజ్, వెలోర్ లో ఫ్లోర్ మ్యాట్స్, లైట్స్ ప్యాకేజ్ తో పాటు యాంబియంట్ లైటింగ్ వంటి అంశాలను కలిగి ఉంది.

లోపలి సౌకర్యాలు:


ఈ వాహనం ఉత్తమ సౌకర్యాన్ని అందించడం కోసం అనేక వినూత్న అంశాలతో నిండిపోయింది. బహుళ- ఫంక్షనల్ స్టీరింగ్ కాలమ్ నుండి మాట్లాడితే, సౌలభ్యాన్ని పెంచడం కోసం వివిధ స్విచ్లు దీనిపై అమర్చబడి ఉన్నాయి. క్యాబిన్ లో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ను అందించారు. అంతేకాకుండా, క్యాబిన్ మొత్తం చల్లగా ఉండటానికి మరియు ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం రేర్ ఏసి వెంట్స్ ను అందించడం జరిగింది. వెనుక మరియు సైడ్ విండోల కోసం రోలార్ సన్ బ్లైండ్స్ ను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు, హీటింగ్ మరియు మెమోరీ ఫంక్షన్ లను కలిగి ఉన్నాయి. ఆధునిక కనెక్టెడ్ డ్రైవ్, అనేక ఆసక్తికరమైన యాప్ లకు అనుమతిస్తుంది. ఇది ఒక ప్రధాన అంశం అని చెప్పవచ్చు. ఒక హై రిజల్యూషన్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, ఎక్స్టెండెడ్ కంటెంట్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, లోపలి రేర్ వ్యూ మిర్రర్ ఆటోమేటిక్ యాంటీ డాజిల్ ఫంక్షన్ ను కలిగి ఉంది. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క అన్ని విండోలు పవర్ తో సర్దుబాటు అవుతాయి మరియు సన్ వైజర్లకు వానిటీ మిర్రర్ లు బిగించి ఉంటాయి. ప్రయాణికులు, ప్రయాణ సమయంలో వారికి ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించడానికి అనుమతించే ఒక ఇంఫోటైన్మెంట్ యూనిట్ ను కూడా ఈ మోడల్ లో పొందుపరిచారు. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క జిటి స్పోర్ట్ లైన్ వాహనం, పనోరామిక్ గ్లాస్ రూఫ్ ను, 40:20:40 స్ప్లిట్ సీట్ సౌకర్యాన్ని, బిఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ క్సంట్రోల్ స్విచ్చు ను, ఐ డ్రైవ్ సిస్టం ను మరియు స్టీరింగ్ కాలం వంటి అంశాలను కలిగి ఉంది. ఈ అంశాలు, ప్రయాణికుల సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.

లోపలి కొలతలు:


ఈ వాహన సిరీస్ యొక్క అంతర్గత క్యాబిన్ విశాలంగా ఉండటం కారణంగా పుష్కలమైన లెగ్ స్పేస్ ను, షోల్డర్ మరియు హెడ్ స్పేస్ లను కలిగి ఉంది. దీర్ఘ ప్రయాణాల కోసం ఈ మోడల్ ఒక 60 లీటర్ల బారీ ఇంధన ట్యాంక్ ను కలిగి ఉంది. కొత్త వేరియంట్ యొక్క ముందరి హెడ్ స్పేస్ 1048 మిల్లీ మీటర్లు, వెనుక హెడ్ స్పేస్ 974 మిల్లీ మీటర్లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహన సిరీస్ 520 లీటర్లు గల బారీ బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. క్యాబిన్ వెనుక సీటు ను మడవటం ద్వారా దీనిని 1600 లీటర్ల వరకు పెంచవచ్చు.

ఇంజన్ మరియు దాని పనితీరు:


తయారీదారుడు, ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వాహనాలకు అత్యంత శక్తివంతమైన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఈ ట్విన్ టర్బో ఇంజన్ కేవలం ఒక అద్భుతమైన ప్రదర్శన ను మాత్రమే కాకుండా ఇంధన వినియోగ స్థాయిని నియంత్రిస్తుంది. ఈ ఇంజన్ డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 8- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 184 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 380 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహన సిరీస్ యొక్క ప్రయాణికుల వారి ఆసక్తికరమైన యాప్ ల యాక్సెస్ ను అనుమతించే బిఎండబ్ల్యూ కనెక్టడ్ డ్రైవ్ సిస్టం ను ఈ మోడల్ లో పొందుపరిచారు. ఈ సిస్టం, హ్యాండ్స్ ఫ్రీ, యూఎస్బి మరియు బ్లూటూత్ కనెక్టవిటీ తో ఆడియో స్ట్రీమింగ్ వంటి కనెక్టివిటీలకు మద్దతిస్తుంది. అంతేకాకుండా, ఈ సిస్టం లో ఒక రేడియో ట్యూనర్, సిడి / ఎంపి3 మరియు ఆక్స్- ఇన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉత్తమ సౌండ్ అవుట్పుట్ ను అందించేందుకు ఈ వాహన సిరీస్ కు, అధిక పనితీరు గల లౌడ్ స్పీకర్లతో పాటు ఒక యాంప్లిఫైయర్ ను మరియు ఒక అధునాతన ఈక్వలైజర్ ను కలిగిన హైఫై లౌడ్స్పీకర్ వ్యవస్థ ను అందించడం జరిగింది. ఐ డ్రైవ్ వ్యవస్థ ద్వారా, వినోదం, సమాచారం అలాగే కమ్యూనికేషన్ సంబంధించిన విధులను సులభంగా నియంత్రించవచ్చు. అంతేకాకుండా, ఈ మోడల్ 16.5 సెంటీమీటర్ల డిస్ప్లే స్క్రీన్ ను మరియు సెంటర్ కన్సోల్ లో ఒక నియంత్రణను కలిగి ఉంది. ఇవే కాకుండా, టెక్స్టైల్ ఫ్లోర్ మ్యాట్స్, స్టోరేజ్ బ్యాగ్, స్టోరేజ్ కంపార్ట్మెంట్ ట్రే, మడ్ ఫ్లాప్స్ మరియు కారు కవర్ వంటి అనేక ఉపకరణాలను తయారీదారుడు వారి అవసరాల మేరకు ఎంపిక చేసుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ వాహన సిరీస్ యొక్క 320డి ప్రెస్టీజ్ వీల్ ఆర్చులు, 16- అంగుళాల అల్లాయ్ వీల్స్ సమితి తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, రోడ్ల పై అధిక పటుత్వాన్ని ఇవ్వడానికి వీటి యొక్క రింలు 225/55 R16 పరిమాణం గల ట్యూబ్ లెస్ టైర్ లతో కప్పబడి ఉంటాయి. అదే మిగిలిన వేరియంట్ల విషయానికి వస్తే, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. అంతేకాకుండా, వీటి యొక్క రింలు 225/50 R17 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి. అదే జిటి స్పోర్ట్ లైన్ వేరియంట్ విషయానికి వస్తే, బహుళ-స్పోక్ శైలి కలిగిన 18- అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడతాయి. వీటి యొక్క రింలు 225/50 R18 పరిమాణం గల ట్యూబ్ లెస్ టైర్లతో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా, కొనుగోలుదారులు ఈ వాహనానికి 18 అంగుళాల స్టార్ స్పోక్ లేదా 19 అంగుళాల డబుల్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్: 


ఈ సెడాన్ సిరీస్ యొక్క బ్రేకింగ్ మెకానిజం చాలా నమ్మకమైనది. ఈ వాహనల అన్ని చక్రాలు,ఒక దృడ నిర్మాణం గల డిస్క్ బ్రేక్లలతో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ విధానాన్ని మరింత మెరుగుపరచడానికి యాంటీ లాక్ బ్రేకింగ్ మెకానిజం ను కలిగి ఉంటాయి. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనాల ముందు ఆక్సిల్ డబుల్ జాయింట్ టెన్షన్ స్ట్రట్ తో విలీనం చేయబడి ఉంటుంది. అదే వెనుక ఆక్సిల్ విషయానికి వస్తే, ఫైవ్ ఆర్మ్ తో విలీనం చేయబడి ఉంటుంది. ఈ వాహన సిరీస్, సెర్వోట్రోనిక్ ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ ను కలిగి ఉంటాయి. దీని కారణంగా సమర్థవంతమైన నిర్వహణ ను మరియు మొత్తం డ్రైవ్ సమయంలో అద్భుతమైన స్పందన ను అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ప్రయాణికులకు భద్రతా హామీ ను అందించడానికి, ఈ మోడల్ అనేక కీలకమైన అంశాలను కలిగి ఉంది. డ్రైవర్, వాహనాన్ని సులభంగా పార్కింగ్ చేసేందుకు గాను మరియు వెనుక భాగం వీక్షించడానికి ఈ వాహన సిరీస్ రేర్ వ్యూ కెమెరాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ, చక్రాల లాకింగ్ ను నివారించడానికి ఉపయోగపడుతుంది. క్యాబిన్ లో ఉన్న ప్రయాణికులందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్ లను అందించడం జరిగింది మరియు ముందు క్యాబిన్ లో వారికి పైరోటెక్నిక్ బెల్ట్ టెన్సినర్స్ మరియు ఫోర్స్ లిమిటర్స్ అందించడం జరిగింది. డైనమిక్ స్టెబిలిటీ మరియు కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ వంటి వ్యవస్థ లు, వాహనాన్ని స్థిరంగా మరియు జారిపోకుండా ఉంచడానికి సహాయపడతాయి. వీటితో పాటు ఈ వాహన సిరీస్, ఏ అనదికార ప్రవేశం జరగకుండా ఉండటానికి మరియు దొంగతనం బారీ నుండి వాహనాన్ని రక్షించడానికి ఇంజన్ ఇమ్మోబిలైజర్ ఫంక్షన్ ను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ వాహన సిరీస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ ను కూడా కలిగి ఉన్నాయి. రక్షణ మరింత మెరుగు పరచడానికి ఈ వాహన సిరీస్, ఇంటిలిజెంట్ ఎయిర్బాగ్ సిస్టం, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, సెంట్రల్ లాకింగ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటక్షన్ బీంస్, రన్ ఫ్లాట్ ఇండికేటర్, అత్యవసర స్పేర్ వీల్, ప్రథమ చికిత్స కిట్ తో వార్నింగ్ ట్రియాంగిల్ వంటి అంశాలను కలిగి ఉన్నాయి.

అనుకూలాలు:


1. ఈ వాహనం యొక్క త్వరణం మరియు పికప్ లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
2. ఈ వాహనం అనేక అంశాలతో అద్భుతమైన బాహ్య ప్రదర్శనను కలిగి ఉంటుంది.
3. పనోరామిక్ గ్లాస్ రూఫ్ అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా ఉంది.
4. ఈ వాహనానికి, కావలసినంత లెగ్ మరియు షోల్డర్ స్పేస్ అందించబడుతుంది..
5. ఈ వాహనం, సౌకర్యాన్ని పెంచడానికి అనేక వినూత్న అంశాలను కలిగి ఉంది.

ప్రతికూలాలు:


1. ఇంజన్ శబ్దం తగ్గించవలసిన అవసరం ఉంది.
2. భద్రతా పరిమాణాలను ఇంకా అభివృద్ధి చేయవచ్చు.
3. వెనుక క్యాబిన్ హెడ్ స్పేస్ మెరుగు పరచవలసిన అవసరం ఉంది.
4. ఇంధన సామర్ధ్యం సంతృప్తికరంగా లేదు.
5. అదనపు స్టైలింగ్ లక్షణాలను, అందించకపోవడం ఒక ప్రతికూలత.