బీఎండబ్ల్యూ 1-సిరీస్

` 23.7 - 34.1 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

బీఎండబ్ల్యూ ఇతర కారు మోడల్లు

 
*Rs

బీఎండబ్ల్యూ 1-సిరీస్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


బిఎండబ్లు 1 సిరీస్ సంస్థ యొక్క పోర్ట్ఫోలియో లో తక్కువ ఖరీదు కలిగిన మోడల్ అయినప్పటికీ అంచనాలను చేరుకోలేకపోయింది. అనేక లక్షణాలను కలిగియున్నప్పటికీ ఇది తక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తిగా మారింది. ఇప్పుడు, దాని అమ్మకాలను పెంచేందుకు తయారీసంస్థ దేశంలో దాని ఫేస్లిఫ్ట్ వెర్షన్ పరిచయం చేసింది. ఇది 118డి స్పోర్ట్ లైన్ వేరియంట్లోనే అందుబాటులో ఉంది. ఈ వాహనం ఒక 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో అమర్చబడి ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జెనీవా మోటార్ షోలో ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ప్రదర్శితమైంది మరియు ఇప్పుడు, అది భారత తీరాలకు నిశ్శబ్దంగా ప్రవేశించింది. మునుపటి దానితో పోలిస్తే, క్యాబిన్ లోపల ఎక్కువ స్పేస్ కోసం ఇది పొడుగ్గా తయారుచేయబడినది. బయట మార్పుల కోసం మాట్లాడుకుంటే, ఇది కొత్త హెడ్లైట్స్ సమూహం మరియు రేడియేటర్ గ్రిల్ తో మొత్తం స్పోర్టి లుక్ ని మెరుగుపరుస్తుంది. దీని ప్రక్క రూపం దాని మునుపటి మోడల్ లానే ఉంటుంది కానీ వెనుక టెయిల్ లైట్స్ 'ఎల్ ' ఆకారంలో ఉంటాయి. అదనంగా, వెనుక బంపర్ ఇప్పుడు ద్వంద్వ ఎగ్జాస్ట్ గొట్టాలను కలిగి ఉంది. అంతర్భాగాలలోనికి వస్తే, డిజైన్ ఒకేలా ఉంటుంది కానీ నవీకరించబడిన అపోలిస్ట్రీ మరియు మెటాలిక్ చేరికలు క్యాబిన్ కి కొత్త లుక్ ని ఇస్తాయి.

తయారీసంస్థ ఈ వాహనానికి ప్రామాణికమైన లక్షణంగా డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అందిస్తోంది. ఈ వాహనం ప్రామాణికంగా 6.5-అంగుళాల అధిక రిజల్యూషన్ ప్రదర్శన తో ఒక నవీకరించబడిన ఐడ్రైవ్ సమాచార వ్యవస్థను పొంది ఉంది. ది కాక, ఈ హాచ్బాక్ యొక్క అన్ని ఇతర లక్షణాలు పాతదాని వలే ఉంటాయి. 1 సిరీస్ యొక్క ఈ వెర్షన్ దాని తరగతి మరియు చక్కదనం పునరుద్ధరించడానికి ప్రామాణిక స్పోర్ట్ లైన్ స్టైలింగ్ ప్యాకేజీని పొంది ఉంది. ఈ ప్యాకేజీ లో 8 పలకలతో హై గ్లోస్ బ్లాక్ కిడ్నీ, బిఎండబ్లు హోదా తో ఎంట్రీ సిల్స్, నలుపు క్రోమ్ లో టెయిల్ లైట్స్ మరియు స్పోర్టీ లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ హ్యాచ్బాక్ ఒక ఇంటిలిజెంట్ ఎనర్జీ నిర్వహణ వ్యవస్థ వంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లక్షణాలను కలిగి ఉంది. ఈ వ్యవస్థ గరిష్ట పనితీరు మరియు సస్టైనబుల్ మొబిలిటీ నిర్ధారించడానికి ఆటోమేటిక్ ప్రారంభం / స్టాప్ ఫంక్షన్, స్టీరింగ్ వీల్ మరియు బ్రేక్ శక్తి పునరుత్పత్తి వంటి వాటికి సహకరిస్తుంటుంది. ఇటువంటి హైటెక్ లక్షణాలను మరియు మెరుగైన సౌందర్య అంశాలను కలిగి ఉండి ఈ వాహనం మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ మరియు వోల్వో వి40 వంటి వాటికి కఠినమైన పోటీ ఇస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్ధ్యం:


మునుపటి మోడల్ కి వ్యతిరేకంగా 2015 వెర్షన్ ఎవి డీజిల్ ఇంజిన్ ఎంపికతో ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 1995cc మొత్తం స్థానభ్రంశం సామర్థ్యం కలిగిన 4-సిలిండర్ ఇంజిన్. ఒక పెద్ద మరియు శక్తివంతమైన ఇంజిన్ కనుక తక్కువ మైలేజ్ ని ఆశిస్తాము కాని ఇది ఆశ్చర్యపరిచే విధంగా 23.26kmpl మైలేజ్ ని అందిస్తుంది.

శక్తి సామర్ధ్యం:


ట్విన్ పవర్ టర్బోచార్జర్ యొక్క 2.0 లీటర్ చమురు బర్నర్ మెరుగైన విద్యుదుత్పాదన మరియు వాంఛనీయ పనితీరుని అందిస్తుంది. ఇది 148bhp శక్తిని మరియు 320Nm టార్క్ ని అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఇప్పటికీ ఇతర నమూనాలతో పోలిస్తే ఇది వెనుకపడిన విభాగం. ఇది ఒక 8-స్పీడ్ స్టెప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జతచేయబడి 212 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. సగటు సమయంలో, ఈ హ్యాచ్ 8.1 సెకన్ల సమయంలో 100kmph వరకూ చేరుకుంటుంది.

వెలుపలి డిజైన్:


ఈ వాహన సిరీస్ యొక్క బాహ్య భాగం మరియు స్టైల్ విషయానికి వస్తే, అవుట్గోయింగ్ మోడల్ వలె ఉన్నప్పటికీ ప్రతి మూలల నుండి గనుక చూసినట్లైతే ఒక ఆడంబరత కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మోడల్ యొక్క ముందు ముఖభాగం, సంస్థ యొక్క బ్రాండ్ అంశాలను కలిగి ఉంది. అయితే, ఇది హాచ్బాక్ అయినప్పటికీ ఉప 4 మీటర్ విభాగం కిందకు రాదు, దీని యొక్క మొత్తం పొడవు 4324 మిల్లీ మీటర్లు. ముందుగా ఈ వాహనం యొక్క ముందు ముఖభాగం విషయానికి వస్తే, శక్తివంతమైన ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్ లతో పాటు డ్యూయల్ టోన్ ను కలిగి ఉన్న ఒక జత ఉగ్రమైన కంటి ఆకారపు హెడ్ లైట్ క్లస్టర్ లను చూడవచ్చు. అంతేకాకుండా, ముందు భాగం లో కిడ్నీ ఆకారపు క్రోం తో కూడిన రేడియేటర్ గ్రిల్ మరియు నిలువుగా ఉండే స్లాట్లు ముందు భాగానికి ఆదిపత్యం వహిస్తాయి. ముందు భాగానికి అందాన్ని ఇచ్చే సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం హుడ్ పై భాగం లో అమర్చబడి ఉంటుంది. ముందు క్రింది భాగానికి వస్తే, శరీర రంగు బంపర్ పై ఒక జత ఎయిర్ డక్ట్ లు మరియు ఇంజన్ ను త్వరగా చల్లబరచడం కోసం ఒక ఎయిర్ డాం బిగించి ఉంటుంది. ఈ క్రోం స్ట్రిప్ ను కలిగి ఉన్న ఎయిర్ డక్ట్ పై ఒక జత రౌండ్ ఆకారపు ఫాగ్ ల్యాంప్ లను చూడవచ్చు. అంతేకాకుండా, ముందు భాగానికి ఒక ఆకర్షణీయమైన లుక్ ను అందించడానికి, ఎయిర్ డాంకు ఒక క్రోమ్ స్ట్రిప్ అందించబడుతుంది. ఈ వాహన సిరీస్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, సొగసైన బాడీ ఆకృతిని మరియు అందమైన వీల్ ఆర్చులను కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో ఉండే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు మరియు డోర్ హ్యాండిల్స్ రెండూ కూడా కారు శరీర రంగులో అలంకరించబడి ఉంటాయి. ఈ వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లకు టర్న్ సూచికలు అందించబడతాయి మరియు వీల్ ఆర్చులు, ఒక జత స్టైలిష్ అల్లాయ్ వీల్స్ తో జత చేయబడి ఉంటాయి. ఈ వాహన సిరీస్ యొక్క వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, స్టైలిష్ గా ఉన్నప్పటికీ చాలా సాధారణంగా ఉంటుంది. వెనుక ప్రొఫైల్ లో, శరీర రంగు బంపర్, స్టైలిష్ టైల్ లైట్ క్లస్టర్, పెద్ద విండ్ షీల్డ్, వంటి వాటిని మనం గమనించవచ్చు. బూట్ లిడ్ చాలా సొగసైనది గా ఉంటుంది మరియు వెనుక విండ్ షీల్డ్ వైపర్ కింది భాగంలో సంస్థ యొక్క ప్రముఖ చిహ్నం అమర్చబడి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


పైన పేర్కొన్న విధంగా, ఈ హాచ్బాక్ దాని పరిమాణంలో పెద్దది. దీని యొక్క మొత్తం పొడవు 4329 మిల్లీ మీటర్లు, వెడల్పు 1984మిల్లీ మీటర్లు. దీని యొక్క మొత్తం ఎత్తు 1440 మిల్లీ మీటర్లు అంతేకాకుండా ఈ వాహనం 2690మిల్లీ మీటర్లు గల బారీ వీల్బేస్ ను కలిగి ఉంది. ఇంత బారీ వీల్బేస్ కారణంగా లోపలి క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది.

లోపలి డిజైన్:


ఈవాహన సిరీస్ యొక్క లోపలి కాబిన్ విభాగం చాలా విశాలంగా, ఖరీదైనది గా ఉండటమే కాకుండా లోపల ఉండే వారికి ఒక ఆహ్లాదకరమైన మరియు విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ లోపలి భాగానికి ఎక్కువ మొత్తంలో క్రోం చేరికలను అందించడం వలన ఒక ఖరీదైన లుక్ ను కలిగి ఉంటుంది. ఈ క్రోం చేరికలు ఎక్కడెక్కడ ఉంటాయంటే, ఏసి వెంట్స్, డోర్ ట్రింస్, సెంట్రల్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్ పై అందంగా పొందుపరచబడి ఉంటాయి. అంతేకాకుండా, డాష్బోర్డ్ పై ఉండే మూడు స్పోక్ల స్టీరింగ్ వీల్ పూర్తిగా ప్రీమియం లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటుంది మరియు వాల్యూమ్ నియంత్రణ, కాల్ ఫంక్షన్ బటన్ల తో పాటు అనేక నియంత్రణ స్విచ్చులు ఈ స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడి ఉంటాయి. లోపలి భాగంలో ఉండే డాష్బోర్డ్ చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా, దీనిపై స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసి వెంట్లు మరియు సెంట్రల్ కన్సోల్ వంటివి అందంగా పొందుపరచబడి ఉంటాయి. ఈ సెంట్రల్ కన్సోల్ లో ఒక ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ మరియు ఒక టచ్ స్క్రీన్ డిస్ప్లే తో కూడిన ఒక అధునాతన సమాచార వ్యవస్థ వంటివి పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా ఇదే సెంట్రల్ కన్సోల్ పై, కప్ హోల్డర్స్, లెధర్ తో కప్పబడిన గేర్ షిఫ్ట్ నాబ్, సౌకర్య స్థాయిని పెంచే బహుళ నియంత్రణ స్విచ్చులు అమర్చబడి ఉన్నాయి. ఈ క్యాబిన్ లో ఉండే సీట్లు విస్తారంగా కుషన్ సౌకర్యాన్ని కలిగి, ప్రీమియం లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ క్యాబిన్, ప్రీమియం సెడాన్ వలే విశాలంగా ఉండటమే కాకుండా ఐదుగురు ప్రయాణికులకు విలాసవంతమైన సీటింగ్ కూడా అందించబడుతుంది. వీటన్నింటితో పాటు క్యాబిన్ లో, కప్ హోల్డర్లు, బాటిల్ హోల్డర్లు, గ్లోవ్ బాక్స్ కంపార్ట్మెంట్ మరియు ఇతర అంశాలు అందించబడతాయి.

లోపలి సౌకర్యాలు:


ఈ మోడల్ సిరీస్ యొక్క అంతర్గత క్యాబిన్ లో ఉండే ముందు సీట్లు, స్పోర్టీ లుక్ ను కలిగి ఉండటమే కాకుండా, శరీరం ప్రకారం వాటిని సర్దుబాటు చేసే ఫంక్షన్ ను కూడా కలిగి ఉంటాయి. ముందు అలాగే వెనుక సీట్లు కూడా లెధర్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఒక విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తాయి. డాష్బోర్డ్ పై ఉండే సెంట్రల్ కన్సోల్ లో ఒక ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ తో పాటుగా ఒక సమాచార వ్యవస్థ కూడా అందించబడింది. డ్రైవర్ సౌలభ్యం కోసం, వీటి యొక్క నియంత్రణ స్విచ్చులు, స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడి ఉన్నాయి. అంతేకాకుండా, ఫోను మాట్లాడేందుకు అవసరమైన కాల్ ఫంక్షన్ బటన్ లు కూడా ఇదే స్టీరింగ్ వీల్ పై పొందుపరచబడ్డాయి. వీటన్నింటితో పాటు, డాష్బోర్డ్ పై నాలుగు ఏసి వెంట్లు అలాగే వెనుక ప్రయాణికుల కోసం రెండు ఏసి వెంట్లు వెనుక భాగంలో అందించబడ్డాయి. వీటితో పాటు ఈ ప్రీమియం హాచ్బాక్ కు, టిల్ట్ ఫంక్షన్ ను కలిగి ఉన్న పవర్ స్టీరింగ్ వీల్, ఓన్ టచ్ అప్ మరియు డౌన్ ఫంక్షన్ ను కలిగి ఉన్న పవర్ విండోలు, సీట్ బెల్ట్లు, సెంటర్ ఆర్మ్ రెస్ట్, హెడ్ రెస్ట్, ఎత్తు సర్దుబాటు కలిగిన డ్రైవర్ సీటు, సెంట్రల్ లాకింగ్, కీ లెస్ ఎంట్రీ, రిమోట్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, డాష్బోర్డ్ పై స్టోరేజ్ కంపార్ట్మెంట్, శీతలీకరణ గ్లోవ్ బాక్స్, డ్రైవర్ ఫూట్ రెస్ట్ మరియు అనేక ఇతర ఫంక్షన్ లు అందించబడ్డాయి. అంతేకాకుండా, యూఎస్బి / ఆక్స్- ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టవిటీ లకు మద్దతిచ్చే ఒక ఆడియో వ్యవస్థ ఈ వాహన సిరీస్ కు అందించబడింది.

లోపలి కొలతలు:


ఈ వాహనం కాక్పిట్ యొక్క హెడ్రూం 1018mm, షోల్డర్ స్పేస్ 1400mm. అయితే, వెనుక క్యాబిన్ యొక్క హెడ్రూం 972mmమరియు షోల్డర్ స్పేస్ 1417mm. దీని బూట్ సామర్ధ్యం కూడా 60:40 స్ప్లిట్ నిష్పత్తిలో వెనుక సీట్లు మడవడం ద్వారా పెంచుకోవచ్చు.

ఇంజన్ మరియు దాని పనితీరు:


ప్రస్తుతం, ఈ 1 సిరీస్ హాచ్బాక్ లో ఒక వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ నాలుగు సిలిండర్లతో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ తో పోలిస్తే, డీజిల్ ఇంజన్ అధిక పవర్ ను అలాగే అధిక మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 1995 సిసి స్థానభ్రంశంతో పాటుగా రెండు టర్బో చార్జర్ లను కలిగి 4000 ఆర్ పి ఎం వద్ద 148 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1500 నుండి 3000 ఆర్ పి ఎం మధ్యలో 320 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 50:50 లోడ్ పంపిణీని ప్రారంభించి ప్రయాణికులకు ఉత్తమం సౌకర్యం కోసం దోహదపడుతుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహన సిరీస్ కు, సీటింగ్ అమరిక అలాగే సమాచార వ్యవస్థ, మరియు అనేక ఇతర వినియోగ ఆధారిత ఫంక్షన్ లు అందించబడ్డాయి. వీటన్నింటితో పాటు, సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్ లు, డోర్ ట్రిం లు మరియు ఇతర ఉపకరణాలను ఎంపిక చేసుకోవచ్చు. బాహ్య ఉపకరణాలు పరంగా చెప్పాలంటే, రూఫ్ స్పాయిలర్, రేర్ స్పాయిలర్స్, మడ్ గార్డ్స్, సైడ్ స్కర్ట్స్, అల్లాయ్ వీల్స్, రక్షణ క్లాడింగ్ మరియు ఇతర ఉపకరణాలు వంటి వాటిని అవసరాన్ని బట్టి కొనుగోలుదారుడు ఎంపిక చేసుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


ప్రామాణికంగా 11డి స్పోర్ట్స్ లైన్ వెర్షన్ 17 అంగుళాల స్టార్ స్పోక్ అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది. ఇది 225/45 R17 పరిమాణం గల అధిక నాణ్యత గల ట్యూబ్ లేని రేడియల్ టైర్లతో కప్పబడి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ మోడల్ కు, నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజం ను అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజం ను అందించడం జరిగింది. ముందుగా, బ్రేకింగ్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహన సిరీస్ యొక్క అన్ని చక్రాలు అధిక దృడత్వం కలిగిన డిస్క్ బ్రేక్లతో బిగించబడి ఉంటాయి. రోడ్లపై ఈ బ్రేకింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్టన్స్, బ్రేక్ డ్రయింగ్ మరియు బ్రేక్ స్టాండ్బై వంటి టెక్నాలజీ లు ఈ వాహన సిరీస్ కు అందించబడ్డాయి. మరోవైపు, ఈ వాహన సిరీస్ యొక్క సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఒక అడాప్టివ్ ఎం సస్పెషన్ అందించబడుతుంది. ఇది, సౌకర్యాల విషయం లో ఎటువంటి రాజీ పడకుండా స్పోర్ట్స్ ట్యూనింగ్ కు అనుమతిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఉన్నతమైన డ్రైవ్ డైనమిక్స్ కోసం, తక్షణ మరియు ఖచ్చితమైన నిర్వహణ అందించే పవర్ స్టీరింగ్ వీల్ ను క్యాబిన్ భాగంలో, పొందుపరచడం జరిగింది. దీనితో పాటు, డ్రైవర్ మరియు ముందు ప్రయాణికుడి కోసం ఎయిర్బాగ్లు, సైడ్ ఎయిర్బాగ్, ముందు మరియు వెనుక వారి కోసం హెడ్ ఎయిర్బాగ్లు, హై బీం అసిస్టన్స్, కనెక్టడ్ డ్రైవ్ సిస్టం, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్టన్స్, సీట్ బెల్ట్స్, సెంట్రల్ లాకింగ్, ఇమ్మోబిలైజర్ మరియు అనేక ఇతర భద్రతా లక్షణాలు ఈ మోడల్ సిరీస్ కు అందించబడ్డాయి.

అనుకూలాలు:


1. ఈ వాహన సిరీస్ యొక్క బాహ్య రూపం చాలా ఆకర్షణీయంగా ఉంది.
2. ఈ మోడల్, అత్యద్భుతమైన సౌకర్య లక్షణాలను కలిగి ఉంది.
3. ఈ మోడల్ కలిగి ఉన్న ఏరోడైనమిక్ నిర్మాణం, పనితీరును జతచేస్తుంది.
4. అగ్ర శ్రేణి భద్రత, ప్రయోజనాన్ని జత చేస్తుంది.
5. ఈ వాహన సిరీస్ యొక్క త్వరణం మరియు పికప్ లు గుర్తింపుని పొందాయి.

ప్రతికూలాలు:


1. ఈ మోడల్ యొక్క వెనుక బాగాన్ని, ఇంకా ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు.
2. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు.
3. సర్వీసు మరియు నిర్వహణ ఖర్చు ఖరీదైనవి.
4. తక్కువ ఇంధన సామర్ధ్యం అనేది ఒక ప్రతికూలతగా ఉంది.
5. ధర పరిధి, ఎక్కువగా ఉంది.