సెప్టెంబర్ ప్రారంభం కోసం సిద్ధమవుతున్న ఫోక్స్వ్యాగన్ పోలో GTI

వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం nabeel ద్వారా జనవరి 27, 2016 12:22 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వోక్స్వ్యాగన్ చివరకు భారతదేశానికి పోలో GTI తీసుకుని రావాలని నిర్ణయించింది. అయితే, ఈ హాట్ హ్యాచ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత రోడ్లపైకి దూసుకు రానున్నది మరియు  మొదటి 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపబడనుంది. అయితే, విచారించదగ్గ విషయం ఈ కారు సిబియు మార్గం ద్వారా వస్తుంది మరియు రూ. లక్షల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుందని అంచనా. కొంతకాలంగా పుకార్లలో వస్తున్న వార్తను సంస్థ నిజం చేసింది, చివరికి పోలో GTI 3 డోర్ యూనిట్ తో ఉంటుంది. అవును, ఈ ఒక్క అంశం పనితీరు కోరుకొనే కొనుగోలుదారులను ఆకర్షించేలా చేస్తుంది. కానీ ఇప్పటికీ రూ. 20 లక్షల ధర ట్యాగ్ కొనుగోలుదారులకు కొంచెం ఇబ్బందికరమైన అంశంగా చెప్పవచ్చు.     

ఇఇది మొట్టమొదటి భారతదేశంలో  3 డోర్ హ్యాచ్ అని తెలుస్తుంది. 2003 వ సంవత్సరంలో మారుతి సంస్థ ప్రముఖ జెన్ హాచ్బాక్ యొక్క స్టీల్ మరియు కార్బన్ వెర్షన్లను పరిచయం చేసింది. ఎవి కొంతమంది ప్రశంసలు అందుకున్నాయి మరియు కొంతమందిచే విమర్శింపబడ్డాయి.  ఫలితంగా, ఇవి అంతరించుకుపోయాయి. GTI గురించి మాట్లాడుకుంటే ఇది భారతదేశం లో ఆక్టావియా మరియు ఆడి  A3 లో అమలులో ఉన్న 1.8 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉంటాయి. ఈ 190bhp ఇంజిన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోజతచేయబడి 320Nm టార్క్ ని ఇస్తుంది మరియు ఇది 7 స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి ఉంటే గనుక  250 Nm టార్క్ ని అందిస్తుంది. ఈ హ్యాచ్ 0 నుండి 100kmph 7 సెకెన్లలో చేరుకుంటుంది మరియు గరిష్టంగా  230kph వేగం వెళుతుంది. 

ఈ వాహనం 20లక్షల ధరతో వోక్స్వ్యాగన్ నంబర్స్ ని లక్ష్యంగా తీసుకోవడం లేదు. ఈ విషయం ఆటోకార్ తో మాట్లాడుతున్నప్పుడు VW ప్రయాణీకుల కార్ల డిరెక్టర్  మైఖేల్ మేయర్ స్పష్టం చేసారు. ఆయన మాట్లాడుతూ " ఈ హాట్ హ్యాచ్ పనితీరు, సాంకేతిక మరియు సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ వాహనం ఏ విషయంలో ని రాజీ పడలేదు, కానీ ఇది కొనుగోలుదారులు కొనేందుకు మాత్రం చాలా ఖరీదైన కారు. కన్వెన్షనల్ 4-డోర్ల వేరియంట్ కూడా భవిష్యత్తులో భారతదేశానికి రాబోతుంది. ఫోక్స్వ్యాగన్ పోలో యొక్క GT TSI ని ఎక్కువగా కొనుగోలుదారులు కోరుకుంటున్నారు కనుక సంస్థ GTI అమ్మకాలు గురించి ఆశావహంగా ఉంది.  2015 లో మా పోలో GT TSI మరియు GT TDI వినియోగదారులు మొత్తం సుమారు 15-20 శాతం మధ్య ఉన్నారు. వాహనం ఖరీదుగా ఉన్నప్పటికీ వినియోగదారులు మంచి పనితీరు కలిగిన వాహనం కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని దీని వలన తెలుస్తుంది. మేము ఇప్పటికే ఉన్న పోలో బ్రాండ్ ని ఉపయోగించున్నాము మరియు  దీనిని ఉన్నత స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది తరువాతి పోలో బ్రాండ్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. "  అని  తెలిపారు.  

భారతదేశం లో ఆటోమోటివ్ సంస్కృతి పెరుగుదల ఉంది. ప్రజలు కేవలం ఒక ప్రయాణికుల మనస్తత్వం నుండి నాణ్యత, భద్రత, లగ్జరీ మరియు పనితీరు అందించే వాహనాలపై దృష్టిని సారిస్తున్నారు. ఈ తాజా ధోరణిలో హాట్ హ్యాచులు ఉన్నాయి. అబార్త్ ఒక సరసమైన ధర ట్యాగ్ వద్ద పరిచయం చేయడంతో ఈ సంస్కృతి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. పోలో జిటి ఐ ఖచ్చితంగా భారతీయ హాట్ హాచ్ సెగ్మెంట్ లో ఒక భారీ ఊపు ఊపుతుంది.  

ఇంకా చదవండి వోక్స్వ్యాగన్ యొక్క కాంపాక్ట్ సెడాన్ దాని యొక్క అధికారిక పేరుని ఏమియో అని ఖరారు చేసింది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన వోక్స్వాగన్ పోలో 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience