జపనీస్ మార్కెట్ కోసం ఇగ్నిస్ వీడియో ను విడుదల చేసిన సుజుకి
మారుతి ఇగ్నిస్ కోసం manish ద్వారా జనవరి 25, 2016 03:45 pm ప్రచురించబడింది
- 29 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జపనీస్ మార్కెట్ లో ప్రవేశపెట్టిన తరువాత సుజుకి సంస్థ, ఇగ్నిస్ మైక్రో ఎస్యువి వాహనం యొక్క నిర్దేశాలను మరియు లక్షణాల వివరాలను వివరించే ఒక వీడియో ను విడుదల చేసింది. ఈ మైక్రో ఎస్యువి, బహుశా భారతదేశం లో ప్రారంభించబడుతుంది మరియు ఈ వాహనం, ఇటీవలే విడుదల అయిన మహీంద్రా కె యు వి 100 వాహనానికి గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది. ఈ వీడియో, ఉప 4 మీటర్ల క్రాస్ఓవర్ ఎస్యువి యొక్క డిజైన్ సమీప సంగ్రహావలోకనం మరియు రైడ్ లక్షణాలను అందిస్తుంది.
జపనీస్ వాహనం అయిన ఇగ్నిస్ యొక్క కొలతలను చూసినట్లైతే, ఈ వాహనం 180 మిల్లీ మీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ను అలాగే 2435 మిల్లీ మీటర్ల బారీ వీల్బేస్ ను కలిగి ఉంది. ఆఫ్- రోడ్ సామర్ధ్యాలు పరంగా ఇగ్నిస్ వాహనం, బారత వాహనాలలో ఒక ప్రత్యేక మైన స్థానాన్ని సాధించడం కోసం, ఉన్నతమైన గ్రౌండ్ క్లియరెన్స్ సౌజన్యంతో అందించబడుతుంది.
ఈ వాహనం యొక్క క్యాబిన్ విషయానికి వస్తే, మహింద్రా కెయువి 100 వాహనం తో పోలిస్తే, ఈ వాహనానికి విశాలమైన అంతర్గత క్యాబిన్ అందించబడుతుంది మరియు స్విఫ్ట్ హాచ్బాక్ లో అందించబడిన అవే సీట్లు ఈ వాహనానికి కూడా అందించబడతాయి అలాగే బారీ వీల్బేస్ కూడా అందించబడతాయి. ఈ వాహనం 3700 మిల్లీ మీటర్ల పొడవు వద్ద నిలుస్తుంది 3675 మిల్లీ మీటర్ల పొడవు కలిగిన మహింద్రా కెయువి 100 వాహనం తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ పొడవును కలిగి ఉంది అని చెప్పవచ్చు.
హుడ్ క్రింది భాగం విషయానికి వస్తే, ఈ మైక్రో ఎస్యువి వాహనానికి ఫియాట్ యొక్క 1.3 లీటర్ మల్టీ జెట్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 75 పి ఎస్ పవర్ ను అదే విధంగా 190 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పవర్ ఉత్పత్తుల విషయంలో, మహింద్రా కెయువి 100 వాహనం తో పోలిస్తే తక్కువ కావచ్చు కానీ, ఈ ఇగ్నిస్ వాహనం ఈ లోపాన్ని సవరించడం కోసం బరువు తగ్గింపు తో ఆకట్టుకునే విధంగా రాబోతుంది. మరోవైపు పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వాహనానికి 1.2 లీటర్ విటివిటి పెట్రోల్ పవర్ ప్లాంట్ ను అందించడం జరిగింది. అదే కెయువి 100 వాహనం లో ఉండే ఇంజన్ తో పోలిస్తే, ఈ ఇంజన్ అధిక పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కెయువి 100 ఆరు సీట్ల వాహనం మరియు పోటీ ను ఎదుర్కోవడానికి ఈ వాహనం ఒక అదనపు సీటు తో వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
సుజుకి ఇగ్నిస్ వీడియో:
ఇది కూడా చదవండి: