ఫియాట్ తదుపరి తరం పుంటో ని పరీక్షిస్తోంది
ఫియట్ పుంటో అబార్ట్ కోసం raunak ద్వారా డిసెంబర్ 09, 2015 05:42 pm ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్ :
ఫియాట్ సంస్థ బ్రెజిల్ లో తరువాతి తరం పుంటో పరీక్ష ని ప్రారంభించారు. ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ లలో ఈ ఫియట్ కుడా ఒకటి. ఈ వాహనం X6H అనే కోడ్‌నేం తో ఉంది. ఫియాట్ వచ్చే ఏడాది ప్రపంచ మార్కెట్లో ఏదో పెద్ద ఆటో ఎక్స్పో లో ప్రదర్శింపబడుతుందని ఆశిస్తున్నారు . అదే భారత దేశం లో అయితే గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఫియాట్ యొక్క ఉత్పత్తి ప్రణాళికా అధారంగా 2017 లో ప్రారంభించబడుతుందని అంచనా వేస్తున్నారు. ఫియాట్ భారత దేశంలో ప్రారంభించిన 145bhpఅబార్త్ పుంటో పని తీరుకి ఈ మద్య విశేషమయిన స్పందన వచ్చింది . అంతే కాకుండా భారతదేశం లో తదుపరి రాబోయే పుంటో అబార్త్ వెర్షన్ ని కలిగి ఉండబోతోంది.
పుంటో విభాగం యొక్క నిర్వహణ పరియు మనితీరు ఉత్తమమయినది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ దానియొక్క సమర్ధత మరియు నాణ్యతలో కొన్ని ముఖ్యమయిన లక్షణాలని కోల్పోయింది. రాబోయే తరం వీటిని దాదాపు సరిదిద్దుకుంటుం ది. సమాచార వినోద వ్యవస్థ పరంగా ఫియాట్ UConnect టచ్ స్క్రీన్ ని కలిగి ఉంది. ఇదే లక్షణం కొత్త టిపో వాహనంలో కూడా ఉంది. ఇది భారతదేశంలో లీనియా యొక్క స్థానాన్ని భర్తీ చేస్తుంది.
యాంత్రికంగా పుంటో పుకార్లలో వచ్చిన విధంగా భారత మార్కెట్ లో 1.5లీటర్ మల్టిజెట్ డీజిల్ అధారితంగా పన్నులు తప్పించుకునే విధంగా ఉంటుందని ఊహించారు. దీని ఇంజిన్ 100 bhpశక్తిని మరియు 250Nmకంటే ఎక్కువ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఫియట్ తదుపరితరం పుంటో టర్బోచార్జ్డ్ మరియు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు కలిగి ఉండే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ ఎంపికల పరంగా ఫియాట్ 6-స్పీడ్ మాన్యువల్ ని డీజిల్ విభాగం లో ప్రారంభించింది . దీని ఆటోమెటిక్ విభాగం 6-స్పీడ్ ఆటో , మరియు ఎ ఏం టి ఎంపికను కలిగి ఉంది.
ఇది కూడా చదవండి ;