ఫియట్ అందించిన వివరాల ప్రకారం లీనియా ప్రత్య ామ్నాయం - టిపో
ఫియట్ లీనియా కోసం raunak ద్వారా డిసెంబర్ 02, 2015 05:12 pm ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఈ వాహనం దేశంలో ఏజింగ్ లీనియా స్థానంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది!
ఈ వాహనం ఈ సంవత్సరం ప్రారంభంలో మే లో టర్కీ లో బహిర్గతమైనది మరియు ఏజియా అని పిలబడుతుంది. ఫియాట్ దీనిని టిపో గా పేరు మార్చి మిగిలిన ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ పేరు గతం నుండి పునరుత్థానం చేయబడింది, ఎందుకంటే ఆ వాహనం 1988 నుండి 1995 వరకూ వచ్చిన మోడల్స్ లో బాగా ప్రఖ్యాతి చెందిన మోడల్ మరియు దాదాపు 2 మిలియన్ మోడల్స్ ని తయారు చేశారు. ఇంకా ఇది భారత మార్కెట్ లోనికి ఎప్పుడు వస్తుందో ఇంకా ప్రకటించలేదు. కానీ, ఫియట్ ఇండియా తదుపరి ఒకటి లేదా రెండు సంవత్సరాలలో ఏజింగ్ లీనియా ని దీనితో భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. భారతదేశంలో ఈ వాహనం మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ఇతర వాహనాలతో పాటూ హోండా సిటీ మరియు మారుతి సుజికి సియాజ్ వంటి వాటితో పోటీ పడవచ్చు.
టిపో వాహనం ఫియాట్ 'ప్రత్యేకమైన ఇటాలియన్' అనే క్రొత్త డిజైన్ ని కలిగి ఉంది. నూతన-శకం ఫియట్ గ్రిల్ ట్విన్ బ్యారెల్ స్లీకర్ స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది. అలానే వెనుక భాగం చుట్టుకొని ఉండే వాటిని కలిగి ఉంటుంది. టిపో 4.54 మీటర్లు పొడవు, 1.79 మీటర్లు వెడల్పు మరియు 1.49 మీటర్లు ఎత్తుని కలిగి ఉంటుంది. అదే విధంగా ఈ వాహనం 2.64 మీటర్ల వీల్‌బేస్ ని కలిగి ఉంటుంది. ఈ వాహనం ప్రస్తుత పొడవైన మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ కంటే పొడవైనది. ఇది 520 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది. అలానే అంతర్భాగాలలో ఇది ఫియట్ యొక్క UConnect టచ్స్క్రీన్ 5-అంగుళాల సమాచార వినోద వ్యవస్థను కలిగి ఉంది. ఈ సమాచర వినోద వ్యవస్థ హ్యాండ్స్ ఫ్రీ బ్లూటూత్ వ్యవస్థ, ఆడియో స్ట్రీమింగ్, టెక్స్ట్ రీడర్ మరియు వాయిస్ గుర్తింపు, ఆక్స్ మరియు ఐప్యాడ్ ఇంటిగ్రేషన్ USB పోర్ట్లు, స్టీరింగ్ వీల్ లో నియంత్రణలు, కోరిక మేరకు, ఒక వెనుక పార్కింగ్ కెమెరా మరియు నావిగేషన్ ని కలిగి ఉంది.
యాంత్రికంగా, ఈ వాహనం 1.4 16V ఫైర్ 95 HP మరియు 1.6 1.6v E.torQ 110 HP పెట్రోల్ ఇంజన్లు మరియు 1.3 MultiJet II 95 HP మరియు 1.6 MultiJet II 120 HP టర్బో డీజిల్ -అను నాలుగు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ ఆటోమెటిక్ తో పాటూ ఐదు- లేదా ఆరు స్పీడ్ మాన్యువల్ ఎంపికలు అందించబడుతున్నాయి. భారతదేశ ప్రారంభం గురించి మాట్లాడుకుంటే, ఫియట్ యొక్క కొత్త 1.5 లీటర్ MultiJet డీజిల్ ఇంజిన్ మరియు లీనియా నుండి 1.4 లీటర్ T-జెట్ పెట్రోల్ ని కలిగి ఉంటుంది.
ఇంకా చదవండి
- ఫియట్ అబార్త్ పుంటో ఈవో మరియూ అవ్వెంచురా లు రెండు రూ. 9.95 లక్షల ధరకు విడుదల అయ్యాయి
- 124 స్పైడర్ ని బహిర్గతం చేసిన ఫియాట్ సంస్థ
మరింత చదవండి : ఫియట్ లీనియా