బజాజ్ క్యూట్ ఆర్ ఈ 60 పరీక్ష జరుపుకుంటూ మరొకసారి అనధికారికంగా బహిర్గతం అయింది; దీని ప్రారంభం త్వరలోనే ఉండవచ్చు.
బజాజ్ qute కోసం saad ద్వారా జనవరి 21, 2016 11:10 am ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
బజాజ్ క్యూట్ RE60, స్వదేశ వాహన సంస్థ నుండి, మొదటి ఫోర్-వీలర్ కొంతకాలంగా అభివృద్ధి మరియు పరీక్ష దశలో ఉంది. ఇప్పుడు మరోసారి కొత్త RE60 క్వడ్రి సైకిల్ కనిపించింది.మరియు ఈ సారి ఇది జైపూర్, రాజస్థాన్ లో పరీక్ష జరుపుకుంది. దీనిని బట్టి వాహనం యొక్క ప్రారంభం త్వరలోనే ఉంది అని అర్ధం అవ్తుంది. అయినప్పటికీ, వాహనం సెప్టెంబర్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించారు కానీ భారతదేశంలో దీని ప్రారంభం ఇంకా పెండింగులో ఉంది. ఈ చిత్రాలు పూర్తి బాడీ ని కనిపించేలా చేస్తున్నాయి. ఈ అనధికారిక చిత్రాలని చూసినట్లయితే అది అనేక రంగుల ఎంపిక లో రాబోతుందని అర్ధం అవుతుంది. చిత్రాల ప్రకారం అయితే మనం ఇంకా ఎరుపు మరియు నీలం రంగు వాహనాలని మాత్రమే చూడగలిగాము. ఇంతకు ముందు పసుపు రంగు వాహనం కూడా అనధికారికంగా కనిపించింది.
బజాజ్ క్యూట్ ప్రారంభంలో 16 విదేశీ మార్కెట్లలో టర్కీ మొదటి మార్కెట్లో క్వడ్రి సైకిల్ అందుకోవడానికి అమ్ముడవుతుంది. ఈ వాహనం స్థానికంగా ఉత్పత్తి అవుతుంది మరియు కఠినమైన యూరోపియన్క్వడ్రి సైకిల్ నిబంధనలను లోబడి మొదటి స్వదేశీ నిర్మిత క్వడ్రి సైకిల్ మరియు యూరోపియన్ WVTA (మొత్తం వాహన రకాన్ని ఆమోదం) నుండి ధ్రువీకరణ స్వీకరించారు.
బజాజ్ క్యూట్, 217cc DTSi ఇంజిన్ తో నిర్మితమయి ఉండి 13.5PSశక్థిని మరియు 19.6Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి మరియు బజాజ్ క్యూట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి వస్తాయి. ఇంధన పరంగా, బజాజ్ క్యూట్, అద్భుతమైన 36 kmpl మైలేజ్ ని అందించగలుగుతుంది. అయితే,దీని టాప్ వేగం గంటకు 70 పరిమితమైంది. అంతేకాక దీని క్వడ్రి సైకిల్ పెట్రోలు, సిఎన్జి, ఎల్పీజీ వేరియాంట్ లు కలిగి ఉంటుంది.
భారతదేశం లో దీని ధర ఇంకా సుప్రీం కోర్టు ఉత్తర్వుల కోసం వేచి ఉంది. దీని ధర 2 లక్షల దాకా ఉండవచ్చని అందరూ ఆశిస్తున్నారు.
.ఇది కూడా చదవండి;
0 out of 0 found this helpful