• English
  • Login / Register

డిల్లీ లో కార్ల నిషేదాన్ని వ్యతిరేకించిన వాహన పరిశ్రమలు

డిసెంబర్ 09, 2015 11:12 am sumit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

కేంద్ర పాలిత ప్రాంతమైన డిల్లీ లో కాలుష్యాన్ని పరిశీలించిన  డిల్లీ   హై కోర్ట్  డిల్లీ లో నివసించడాన్ని ఒక కాలుష్యమైన గదిలో బందించి ఉండడం తో పోల్చింది.దీనిని పరిగణలోకి తీసుకొని డిల్లీ ప్రభుత్వం కొన్ని కార్లపై  నిషేదాన్ని విధించింది.కార్ల వల్ల వచ్చే కాలుష్యాన్నితగ్గించడం లో భాగంగా సరి మరియు బేసీ సంఖ్య నంబర్స్ గల కార్లను రోజు విడిచి రోజు రోడ్ల పైకి అనుమతిస్తారు.ఈ నిర్ణయం ఒకే కారు కలిగిన ఉద్యోగుల పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.కారు ల పరిశ్రమలు కూడా డిల్లీ ప్రభుత్వం పై అసహనాన్ని వ్యక్తం చేశాయి.మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సీ. భార్గవమాట్లాడుతూ " డిల్లీ ప్రభుత్వం ఏ లాజిక్ తో ఈ నిర్ణయాన్ని తీసుకుందో కచ్చితంగా తెలీదు. ఆ లాజిక్ వారికి అర్దం ఐతే వారే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే కారు అనేది మనుషుల యొక్క విలాసవంతమైన స్టేటస్ సింబల్ గా మారింది. కారు ఎక్కువమందిని ఆకర్షించడం వలన దీనిపై నిషేదం సులభంగా మారింది." ఈ నిషేదాన్ని విషదీకరుస్తూ కాలుష్యానికి మొదటి కారకులను గుర్తించవలసిందిగా డిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. డిల్లీలో ప్రధాన కాలుష్యం ధూళి పదార్ధం( 2.5 PM) అది కూడా పెట్రోల్ కార్ల వలన ఏర్పడదు.కాలుష్యానికి కారణాలను వివరిస్తూ నిర్మాణం లో ఉన్న భవనాల వల్ల, వ్యర్ధ పదార్ధాల వల్ల, పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో వ్యర్ధాలను మండించడం వల్ల, రాజస్తాన్ నుండి వచ్చే ఇసుక తుఫానుల వల్ల, డిల్లీ లో తిరిగే డీసల్ ట్యాంకర్ల వల్ల కాలుష్యం  పెరిగిపోతోంది అన్నారు.
    
నిజానికి ఈ కాలుష్యానికి అసలు కారణాలు నిర్మాణ కార్యకలాపాలు, దీపావళి క్ర్యాకర్స్, రైతులు పంటలు కాల్చడం మరియు ఎడారి నుండి వచ్చే దుమ్ము. శీతాకాలంలో దిగువ స్ట్రాటో  స్ఫియర్ లో ప్రతికూల వాతావరణం వల్ల ఈ కాలుష్యం అంతా ఒక చోటే నిలిచిపోతుందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సొసైటీ సెక్రటరీ జనరల్ (SIAM) విష్ణు మాథూర్ తెలిపారు. 2011 లో ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ని చూపుతూ వాతావరణ కాలుష్యంలో వాహనాల శాతం 8 మాత్రమే అని, ఇది కూడా స్వల్పంగా పెరిగిందని చెప్పారు. రోడ్ల పై వాహనాలను తగ్గించడం వల్ల గాలి స్వచ్చంగా మారదని,దీనిని ప్రత్యేక పద్దతులలో తగ్గించాలని మాథూర్ తన అభిప్రాయాన్ని తెలియపరిచారు.
    
వాహన పరిశ్రమ ఒక్కటే కాలుష్యానికి కారణం  కాదు.డిల్లీ వంటి నగరం కాలుష్యాన్ని కలిగి ఉండడం భయంకరమైన ప్రమాదం.కానీ ప్రజల అవసరాలని మరియు కారు పరిశ్రమల యొక్క అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పద్దతులతో కాలుష్యాన్ని నివారించాలి. ఇటువంటి నిర్ణయాలను రాత్రికి రాత్రి తీసుకోవడం, మార్చడం చేయలేము. దీనికి ఒక సరియైన రోడ్ మ్యాప్ కావాలి. వాహనదారులు ప్రభుత్వానికి వాహన ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ కట్టేది రోడ్ల పై వాహనాలను నడపడానికి అంతే కానీ ఇంట్లో దాచిపెట్టుకోవడానికి కాదని  IHS ఆటోమోటివ్ లో సీనియర్ విశ్లేషకుడిగా పని చేస్తున్న గౌరవ్ వంగాల్ అన్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్నిఅమలుచేయడం, ప్రజలకు సులభమైన, సౌకర్యవంతమైన , భద్రమైన, ప్రజా రవాణా అందించడం ,రవాణా వ్యవస్థను  వ్యవస్థీకృత పరచడం , ప్రజలను బాగా చైతన్యపరచటంలో  ప్రభుత్వానికిఒక పెద్ద సవాల్ గా మారనుందని  HYUNDAI మోటర్ ఇండియా  సీనియర్ వైస్ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్అండ్ మార్కెటింగ్ రాకేశ్ శ్రీవాస్తవ  తన అసహనాన్ని తెలిపారు.

ఇంకా చదవండి

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience